నెల్లాళ్ళ నుంచీ ఎదురు చూస్తూ ఉండగా ఇదిగో ఇవాళ కాస్త చెప్పుకోగలిగే విధంగా నాలుగు చుక్కలు విదిల్చింది ఆకాశం. చిన్న చిన్న జల్లులు వాతావరణాన్ని చల్లబరిచి, మనసు తేలిక పరిచాయి. హమ్మయ్య.. వర్షాలకి మనఃశ్శరీరాలని సిద్ధం చేసేసుకోవచ్చు అన్న నమ్మకం కుదిరింది. ఓ ఎనిమిది నెల్ల వరకూ ఈ ఎండల బాధ ఉండదింక. నావరకూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే ఇది. ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా.
పొద్దుపొద్దున్నే వర్షాన్ని ఆస్వాదిస్తూ, కాఫీ తాగుతూ, పేపర్లు చదువుకుంటున్నానా? నా ఆనందాన్ని భగ్నం చేస్తూ ఓ ఫోన్ కాల్. ఒక చోటకి వెళ్లి తలనొప్పి తెచ్చుకోవాలి. తలనొప్పి అని తెలిసీ వెళ్ళడం తప్పించుకోలేం. అదీ సమస్య.. 'అవస్యమైన దానిని ఆస్వాదించ'మని అర్ధం వచ్చే ఇంగ్లిష్ సామెతని గుర్తు చేసుకున్నాను అక్కడికీ. ప్చ్.. మొత్తానికి వెళ్ళడం, తన నిండుగా నొప్పిని తెచ్చుకోవడం జరిగిపోయింది. జీవితం అంటే అంతే కదా.
భాగ్య నగరంలో నివాసం ఉంటున్న బంధుమిత్రులతో కొన్ని కాల్స్ మాట్లాడాను. ఏమిటో, అందరూ బంద్ మూడ్ లో ఉన్నారు. బంద్ వల్ల ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకొక్కరూ వివరంగా చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళంతా బొత్తిగా సామాన్య జనం అవ్వడం వల్ల కేవలం వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఎవరైనా అంతే.. ముందర ఇల్లు చక్కబెట్టుకుని ఆతర్వాత ఇతర విషయాలు ఆలోచించాలి మరి.
జల్లుల పుణ్యమాని కాఫీటీల సంఖ్య రోజూ కన్నా పెరిగింది. వర్షాకాలంలో వీటిని కొంచం అదుపులో పెట్టాలి, ఏదో ఒకటి చేసి. సరే నా చికాకు చికాకులాగే ఉండిపోయింది కదా.. దానిని పారదోలే ఉపాయం ఒక్కటే. అదే అమలుచేశాను. పుస్తకాల షాపు ప్రేమగా స్వాగతం పలికింది. వెళ్ళగానే డిస్ప్లే లో వంశీ 'మా దిగువ గోదారి కథలు' అందంగా పలకరించింది. గోదారి గాలిపీల్చిన అనుభూతి. చికాకంతా హుష్ కాకి. ఎంత ముద్దుగా ఉందో పుస్తకం.
ముళ్ళపూడి 'ముక్కోతి కొమ్మచ్చి' అడిగాను. ఇంకా రాలేదుట. ఒక కాపీ దాచి ఉంచుతానన్న హామీ నేను అడక్కుండానే వచ్చేసింది. షాపతను షెల్ఫ్ సర్దుతూ బయట పెడుతున్న పుస్తకాలని ఒక్కొక్కటిగా చూస్తుంటే కళా ప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి 'స్వీయ చరిత్రము' ఓకే ఒక్క కాపీ కనిపించింది. ఈ పుస్తకం విడుదలైనప్పుడు నేను తీసుకోలేదు. తర్వాత నేను అడిగినప్పుడు స్టాక్ అయిపోయిందని జవాబు. ఇదిగో, ఇవాళ యాదృచ్చికంగా కంట పడింది.
రెండు బ్రహ్మాండమైన పుస్తకాలు. ఆకలిగొన్నవాడి ముందు పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టినట్టుగా. అయితేనేం.. ఇవాల్టికి ఈ పుస్తకాలని ఓరకంట చూడడానికి కూడా లేదు. మూడు రోజులుగా ఓ పుస్తకాన్ని తదేక దీక్షగా చదువుతున్నాను. అస్సలు విడిచిపెట్టాలని అనిపించడం లేదు కానీ, తప్పడం లేదు. పరిస్థితులు అనుకూలించడం లేదు కానీ, నైటౌటైనా చేసి పుస్తకాన్ని పూర్తి చేసేయాలని ఉంది. అంతలోనే 'పుస్తకం అపుడే అయిపోతుందా' అన్న బెంగ లాంటిది కూడా. అక్కడ కథ మాంచి సస్పెన్స్ లో ఉంది.. ఈ కబుర్లు ఇంతటితో సమాప్తం.
మొత్తానికి ఫుల్ ఎంజాయ్ అన్నమాట:-)
రిప్లయితొలగించండిదువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారి 'స్వీయ చరిత్రము' గురించే అనుకుంటా త.భరణి గారు సాక్షిలో పరిచయం చేసారు నిన్నో మొన్నో. ఆ పరిచయం చూసాక ఈ పుస్తకం కొని చదువుకోవాలనుకున్నా.
రిప్లయితొలగించండికబుర్లు బాగున్నాయండి :-)
రిప్లయితొలగించండి"కళాప్రపూర్ణ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి జీవితచరిత్ర" చాలా బావుంటుందండీ. చాలా సార్లు చదివా. కానీ నా బద్ధకం వల్ల టపా కొట్టలేకపోయాను.
రిప్లయితొలగించండిమాకూ అంతేనండి నిన్నటి నుంచే కాసిని జల్లులు పడుతున్నాయి . మొక్కలు కాస్త తేరుకున్నాయి .
రిప్లయితొలగించండిమీ కబుర్లు బాగున్నాయండి :)
బాగున్నాయండి మీ కబుర్లు. ఇంకేం, వర్షపు జల్లులులతో పాటు మీ ప్రియమైన బుక్స్ అన్నీ ఆస్వాదించేయండి. Have a nice time.
రిప్లయితొలగించండి@పద్మార్పిత: అవునండీ :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఆ.సౌమ్య: అవునండీ.. సాక్షిలో వచ్చింది కథనం.. అన్నట్టు చదివినంత వరకూ పుస్తకం చాలా బాగుంది.. పూర్తయ్యాక మళ్ళీ చెబుతాను.. మొత్తానికి చదవాల్సిన పుస్తకమే.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: :)) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@పక్కింటబ్బాయి: త్వరగా రాసేయండి.. ఈలోగా నేనూ ప్రయత్నిస్తాను.. పుస్తకం సగానికొచ్చింది.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: ఎండల తర్వాత వచ్చే వర్షాలు భలేగా ఉంటాయండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: థాంక్యూ థాంక్యూ..