మాధవి.. పేరుకి తగ్గట్టే అందమైన అమ్మాయి. అంతకు మించిన సున్నితమైన హృదయం. లలిత కళలంటే, ముఖ్యంగా నాట్యం అంటే ప్రాణం ఆమెకి. ఆమె ఇష్టాలకి అభ్యంతరం చెప్పని తండ్రి. పుట్టింది కలిగినింటే కావడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల చింత లేదు. తనకి నచ్చినట్టుగా జీవిస్తూ అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్న మాధవి నీలి కళ్ళలో కనీకనిపించని ఓ నీలి తెర. గతం చేసిన గాయం తాలూకు జ్ఞాపకం కావొచ్చు.
భారతీయ నృత్య రీతులమీద సాధికారికంగా మాట్లాడగల మాధవి వాటిని గురించి ఓ ఆంగ్ల పత్రికకి వ్యాసాలు రాస్తూ ఉంటుంది. అదిగో, ఆ పనిలో ఉండగానే మాధవికి బాలూ పరిచయ మవుతాడు. నాట్యం అంటే ప్రాణం బాలూకి. భారతీయ నాట్య రీతులన్నీ ఔపోసన పట్టి ఓ కొత్త రీతిని తయారు చేయాలన్నది బాలూ కల. అయితే, మాధవి లాగా అతను డబ్బున్నవాడు కాదు. వంటలు చేసి పొట్ట పోషించుకునే తల్లి, కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునే మిత్రుడు రఘు.. ఇవీ బాలూ ఆస్థిపాస్తులు.
బాలూ ఎంతటి అభిమానధనుడంటే, మాధవి తీసిన తన ఫోటోలలో ఒకదానిని తన తల్లికోసం అడిగి తీసుకోడానికి కూడా మొహమాట పడేటంత. అప్పటికే బాలూ నేర్చుకున్న నాట్య రీతుల మీద అతనికున్న పట్టు, అంతకు మించి నాట్యం పట్ల అతడికున్న అవ్యాజమైన ప్రేమని అతితక్కువ కాలంలోనే అర్ధం చేసుకుంది మాధవి. తన పరపతి ఉపయోగించి, ఆలిండియా డాన్స్ ఫెస్టివల్ లో నృత్య ప్రదర్శన చేయగలిగే అరుదైన అవకాశాన్ని బాలూకి ఇప్పించగలిగింది. మాధవి సాంగత్యంలో అప్పుడప్పుడే ఎదుటివారిని అర్ధం చేసుకోడం మొదలు పెట్టిన బాలూ, ఇన్విటేషన్లో తన ఫోటో చూసుకుని చేష్టలుడిగి పోతాడు. ఆక్షణంలో అతడు తన భావోద్వేగాలని నిస్సంకోచంగా పంచుకున్నది మాధవితోనే.
తనతోపాటు తల్లినీ ఫెస్టివల్ కి తీసుకెళ్ళి, ప్రేక్షకుల్లో ముందువరుసలో ఆమెని కూర్చోబెట్టి, ఆ మహాజనం ముందు తను నాట్యం చేస్తుండగా ఆమె కళ్ళలో కనిపించే సంతోషాన్ని చూడాలన్న బాలూ కోరిక మాధవికి తెలియనిది కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే విధినీ, దేవుడినీ తలచుకునే వాళ్ళెవరు? ప్రయాణం రెండు రోజులుందనగా తీవ్ర అనారోగ్యంతో కన్ను మూస్తుంది బాలూ తల్లి. పోతూపోతూ తన అంత్యక్రియల కోసం దాచుకున్న డబ్బు కొడుక్కి అందేలా చేస్తుంది. ఆ మహా విషాదాన్ని బాలూ పంచుకున్నది కూడా మాధవితోనే.
బాలూని మామూలు మనిషిని చేయాలన్నది మాధవి సంకల్పం. అందుకే అతడిని తనున్నాననీ, ఎప్పటికీ అతడితోనే ఉంటాననీ చెబుతుంది మాధవి. తల్లి మరణంతో కుంగిపోయిన బాలూలో ఓ కదలిక ఉవ్వెత్తున ఎగసింది. మాధవిని తను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాననీ ఆమెకి చెబుతాడు బాలూ. మాధవిలో సంకోచం, సందిగ్ధత. అతనికి ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని అయోమయం. అతడు సున్నితంగా అందించిన గులాబీని సంకోచంగా అందుకుని తన జడలో తురుముకుంటుంది. ఆమె నీలి కళ్ళలో మాటలకందని భావాలు.
గతాన్నితుడిచేయగలమా? వెంటాడే జ్ఞాపకాలని కడిగేయగలమా? తనకో తోడు దొరికిందన్న ఆనందం బాలూని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్షణాల్లోనే, గత జ్ఞాపకాలని వదిలించుకుని కొత్తజీవితం మొదలుపెట్టే ప్రయత్నం ఆరంభించింది మాధవి. స్వతహాగా ఆవేశ పరుడు బాలూ. అందుకే కావొచ్చు, తన ప్రతిపాదనకి మాధవి నోటినుంచి ఎలాంటి జవాబూ రాకముందే, మాధవిని పెళ్లి చేసుకోవాలన్న తన ఆలోచనని ఆమె తండ్రితో పంచుకున్నాడు. మాధవి వివాహిత అనీ, ఆస్తి తగాదాల కారణంగా పెళ్ళైన మూడో రోజే పుట్టింటికి తిరిగి వచ్చేసిందనీ చెబుతాడు ఆమె తండ్రి.
సున్నిత మనస్కుడైన ఆ కళాకారుడు తన సంతోషాన్నైనా, విషాదాన్నైనా ప్రకటించ గలిగే
మాధ్యమం ఒక్కటే.. నృత్యం. ఎగిసి పడుతున్న సముద్ర కెరటాలతో పోటీ పడి, బీచ్ లో నృత్యం
చేస్తున్న బాలూని చూస్తుంది మాధవి. గతాన్ని పూర్తిగా తుడిచేసి అతడి చేయందుకోవాలన్న
నిర్ణయానికి వచ్చి, తేలికపడ్డ మనసుతో అతడివైపు పరుగు తీస్తున్న మాధవి కాళ్ళు
ఒక్కసారిగా ఆగిపోయాయి, బాలూకి ఏడడుగుల ముందు ఓ పడవ మీద కూర్చున్న గోపాలరావుని
చూడగానే. అతడితోనే ఆమె వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచింది.
మాధవి అదృష్టవంతురాలు. ఆమెని పెళ్ళిచేసుకున్న గోపాలరావు, ప్రేమించిన బాలూ ఇద్దరూ మంచివాళ్ళే. మాధవి-బాలూల పెళ్లి చేయాలని గోపాలరావు నిర్ణయించుకుంటే, మాధవిని గోపాలరావుతో కాపురానికి పంపాలని అనుకుంటాడు బాలూ. దేవుడిమీద భక్తి, బాలూమీద నమ్మకం ఉన్న మాధవి బాలూ మాటని గౌరవించింది. సకోచంగా జడతో తురుముకున్న గులాబీని తీసి తన పెళ్లి ఆల్బం మీద ఉంచింది, స్థిరంగా. ఆమె పక్కన తనకి చోటులేదన్న వాస్తవాన్ని అంగీకరించిన బాలూ, శాశ్వితంగా కెనడా వెళ్ళిపోతున్న గోపాలరావు, మాధవిల ఫోటో తీసుకున్నాడు. తర్వాత అతను ఏడాదంతా బతికింది తను వాళ్ళిద్దరినీ కలిపిన రోజు కోసమే..ఆ రోజున వాళ్ళ క్షేమం కోరుతూ అన్ని గుళ్ళూ తిరగడానికే.
కాలానికి కనికరం లేదు. అందుకే అది ఎవ్వరికోసమూ ఆగదు. నాట్యం అంటే తనకున్న మక్కువని తన కూతురు శైలజని నర్తకిగా తీర్చి దిద్దడం ద్వారా తీర్చుకుంది మాధవి. గోపాలరావు మరణం తర్వాత, కూతురితో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలూని చూసిన మాధవి అతడి స్థితికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. కళలో ఏకోన్ముఖుడు కాలేకపోయిన ఆ సున్నిత హృదయుడు మద్యానికి బానిసై, మరణానికి చేరువగా ఉన్నాడు. మరోపక్క శైలజ మిడిమిడిజ్ఞానంతో తానో గొప్ప నాట్యకత్తెనని మిడిసిపడుతోంది. నేర్చుకోవాల్సింది ఏదీ లేదన్న అహంకారం కమ్మేసిందామెని.
బాలూలోని కళాకారుడు బహిర్గతం కాకుండా ఉండిపోయిన సంగతి తెలుసు మాధవికి. అందుకు కారణాలనీ అర్ధం చేసుకుంది. అతడి ఆరోగ్యాన్ని బాగు చేయడం అసాధ్యం అని అర్ధమయ్యాక, శైలజని బాలూ శిష్యురాలిగా చేసి, బాలూ కళని బతికించే ప్రయత్నం చేయాలన్న ఆలోచన వచ్చింది మాధవికి. అటు బాలూ స్నేహితురాలిగానూ, ఇటు శైలజ తల్లిగానూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. చివరిరోజుల్లో ఉన్న బాలూని బాధ పెట్టడం ఇష్టం లేక తను వితంతువన్న నిజాన్ని దాస్తుంది మాధవి. ఇందుకుగాను కన్న కూతురి నుంచి ఏతల్లీ పొందకూడని అవమానాన్ని పొందుతుంది.
తన కళని బతికించుకోవడం కోసం, అంతకు మించి మాధవికిచ్చిన మాట కోసం, మరణంతో పోరాడి మరీ నాట్య కళలో మెళకువలన్నీ శైలజకి నేర్పాడు బాలూ. తన నాట్యం చూడకుండా మరణించిన తల్లిలా మాధవి కాకూడదని అనుకున్నాడు. తన కళకి గుర్తింపు, గౌరవం తేవడం కోసం కృషి చేసిన 'మహాతల్లి' మాధవికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. పరివర్తన వచ్చిన శైలజలో పరిపూర్ణమైన తన కళని చూసుకుని కన్నుమూశాడు. స్నేహితుడి పార్ధివ దేహం వర్షంలో తడవకుండా రఘు తన శరీరాన్నే గొడుగుగా చేస్తే, గొడుగుతో పరుగున వచ్చిన మాధవి తను తడుస్తూ బాలూ శరీరానికి గొడుగు పట్టింది.
నది సముద్రంలో కలిసినట్టుగా కళ, కళతోనే కలుస్తుంది. అది కళా సాగర సంగమం. స్త్రీ జీవితాన్ని నదితో పోల్చడానికి మాధవిని మించిన ఉదాహరణ ఎవరు. ఎన్నో ఎత్తుపల్లాలని దాటుకుని గంభీరంగా ప్రవహించే నది, సాగర సంగమ వేళ పిల్ల కాలువగా మారిపోతుంది. అలాగని ఆ నదిని శాంత స్వరూపిణి అనుకోగలమా? తరచి చూస్తే ఎన్ని సుడిగుండాలో... మాధవిని కేవలం ఓ కల్పిత పాత్రగా మర్చిపోలేం. 'సాగర సంగమం' చూసిన ప్రతిసారీ తను విడవకుండా వెంటాడుతుంది మనల్ని.
.....రాస్తుండగానే మూడొందల టపాలు పూర్తయ్యాయి.....
మూడుసెంచురీల మురళి గారికి మూడు వందల అభినందనలు. ఎవర్ గ్రీన్, నా అభిమాన సాగర సంగమం...జయప్రద ని మళ్ళీ నా కళ్ళ చూపిన మీకు ముక్కోటి థాంక్సులు.
రిప్లయితొలగించండిచాలా చాలా బాగుందండి .
రిప్లయితొలగించండిఈ సినిమా పై మీ టపా చదువుతుంటే సినిమా చుస్తున్నట్టే అనిపించింది.
నాకు చాలా చాలా...........ఇష్టమైన సినిమా.
మాధవిని కేవలం ఓ కల్పిత పాత్రగా మర్చిపోలేం. 'సాగర సంగమం' చూసిన ప్రతిసారీ తను విడవకుండా వెంటాడుతుంది మనల్ని...
అవునండి ఈ పాత్రలో మనం జయప్రదను చుడము. మాదవిపాత్రలో అంతలా ఆమె లీనమై నటించారు.
చాలా బాగారాసారు మీరు..
త్రిశత టపోత్సవ శుభవేళ అభినందనలు మురళిగారు :)
రిప్లయితొలగించండిసాగర సంగమం...ఓ యాభై సార్లకి తక్కువ కాకుండా చూసి ఉంటాను నా ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ లో ఒకటి...అన్ని సన్నివేశాలు హృదయానికి హత్తుకోనేవే ఐనా ...మాధవి ఇన్విటేషన్ తెచ్చినప్పుడు దానిలో తన ఫోటో చూసుకున్నప్పుడు కమల్ హాసన్ హావభావాలు ఎప్పటికీ మర్చిపోలేను...అలాగే తకిట తధిమి పాట తర్వాత మాధవి కుంకుమ కరిగిపోతున్నప్పుడు చేయి అడ్డుపెట్టి నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధననీ మర్చిపోలేం..అలాగే కామెడీ ఏమీ తక్కువ ఉండదు.ఇంత మంచి సినిమా గుర్తుచేసినందుకు థాంక్స్ !
చాల బాగా రాశారు. ఏడెనిమిది సార్లు చూసుంటా ఆ రోజుల్లో. ఎన్ని సార్లు అప్పుడే చూస్తున్నట్టుండేది
రిప్లయితొలగించండిచాలా గొప్ప సినిమా అండీ ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.ముఖ్యంగా ఆఖరి గొడుగు పట్టే సన్నివేశం ఎంత గొప్పగా ఉంటుందో.
రిప్లయితొలగించండిమంచి సినిమాని మరోసారి చూపించారు,థాంక్స్
300 టపాలకు మీకు అభినందనలు
త్రిశత టపోత్సవ శుభాకాంక్షలు. ఈ సినిమా పాటల వీడియోలు కూడా ఇస్తే బావుండేది.
రిప్లయితొలగించండిచాలా వివరంగా రాసారు.
రిప్లయితొలగించండికె.విశ్వనాథ్ గారి సినెమాల్లో కథానాయికలో ఎంతో పరిణితి ఉంటుంది. అది చాలా సినెమాల్లో లాగా కథానాయకుడి కోసమే పుట్టించినట్టు ఉండదు. సినెమా చూసిన ప్రేక్షకుడుని తరవాత వెంటాడుతుంది, ఒక బలమైన ముద్ర వేస్తుంది. నిజానికి అది ఒక్క కథానాయిక అనే కాదు, ఆయన ఎంచుకున్న ముఖ్య పాత్రలన్నీ అలానే ఉంటాయి. సహజంగానే మన అంతరాల్లో జరిగే ఎన్నో సంఘర్షణలకి ఒక స్పష్టత వచ్చినట్టు, ఆ స్పష్టతకి రూపం ఆయా పాత్రలే అన్నట్టు అనిపిస్తుంది.
సిరివెన్నెల సినెమా చిన్నప్పుడు చూసాను.. అందులో మున్ మున్ సేన్ పాత్ర అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎప్పుడు గుర్తు వచ్చినా సంఘర్షణలోకి నెట్టేస్తుంది..
చదువుతుండగానే మూడు నిమిషాలు పూర్తయిపోయాయి
రిప్లయితొలగించండిచాలా చాలా బాగా రాశారు.
రిప్లయితొలగించండిఈ సినిమాలో కమల హాసన్ చేసింది భరతనాట్యం కాకపోయినా, ప్రేక్షకులకి అసలు ఆ అనుమానం రాకుండా వుండేట్టు కోరియోగ్రాఫ్ చేశారు. మిగతా అంశాలన్నీ కూడా చాలా పొందిగ్గా అమరినాయి. జయప్రద బహుచక్కగా ఉంటుందీ సినిమాలో.
మూడొందలో టపాకి అభినందనలు.
".....రాస్తుండగానే మూడొందల టపాలు పూర్తయ్యాయి....."
రిప్లయితొలగించండిశుభోజ్జయం కలగాలి మారాజులకి.అయ్యగారికి దణ్ణం పెట్టు అయ్యగారికి కలానికి(కంప్యూటర్ కి)దణ్ణంపెట్టు.కలకాలం వర్ధిల్లాలి బ్లాగులో పోష్టులతో,శుభోజ్జయం కలగాలి మారాజులకి.
సాగరసంగమం-రాయడానికేమీ లేదిక్కడ ఆ చిత్రాన్ని చూసి మళ్ళీ ఇక్కడ చదివి ఆనందించెయ్యడమే.
వాగర్ధా వివసంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయేత్,
జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ,
జగతత్పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ.
nice film.ihv seen 15 times.
రిప్లయితొలగించండిభలేవారండి మీరు.పొద్దున్నవ్వగానే సూర్యుడొస్తాడన్నమాట..అని చెప్పినట్లుంది.మీకు మీరే మూడొందలని రాసుకుంటే ఇక మేమున్నదెందుకిక్కడ...:)
రిప్లయితొలగించండిఅభిమానులకు అవమానం...:) (రెండందలవటపా సంగతి మరచిపోయారా?)
అభినందనలు..
my all time favourite movie, congratulations for reaching 300 posts
రిప్లయితొలగించండిCongrats!Keep writing!
రిప్లయితొలగించండిమురళి గారూ, అసంకల్పితంగా కళ్లలో నుండి నీరు. బాధ కాదు. ఏదో ఉద్వేగం. నాకు చాలా చాలా ఇష్టమైన చిత్రం "సాగర సంగమం". ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం. నా మొబైల్ ఫోన్‌లో వీడియో సాంగ్స్ పెట్టుకుని వీలున్నప్పుడల్లా చూస్తూ ఉంటాను ఆ పాటల్ని. ముఖ్యంగా వేదం అణువణువున నాదం, ఇంకా శైలజ కి భరత నాట్యం, కథక్, కథకళి నృత్యాల్ని చూపించే సన్నివేశం.. లిస్ట్ ఇక్కడితో ఆగదు. ఆ చిత్రం మొత్తం అద్భుతంగా తీర్చబడిన అందమైన కావ్యం. ఇంత మంచి చిత్రం గురించి ఇంత బాగా వ్యాఖ్యానిస్తూ ఒక మంచి టపాని ఇచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసాగర సంగమం --ఓ అద్భుతమయిన సినిమా.నేను ఈ సినిమాతో కమల్‍కి వీరాభిమానిని అయ్యాను..ఇప్పటికీ. జయప్రద ఎంత చక్కగా ఉంటుందో! జయప్రద అంటే సాగరసంగమం గుర్తు రాని ప్రేక్షకుడు ఉండడు. అన్నట్టు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకి మా టీవీ లో జయప్రద నిర్వహించే జయప్రదంలో గెస్టు కమల్ హాసన్...నిన్నే అనుకున్నా..సాగరసంగమంలో ఈ జంట ఎంత బాగుంటారో అని..అంతలో మీ టపా ప్రత్యక్షం.
రిప్లయితొలగించండిమీ మూడు శతకాలకి అభినందనలు. ఈ మధ్య బ్లాగు మీద కాస్త శీతకన్నేశారు లేకపోతే ఎప్పుడో త్రిశతకాలు పూర్తవ్వాల్సింది. మీ ప్రతి టపాకి వ్యాఖ్య వ్రాయకపోయినా నేను తప్పక చదివే బ్లాగుల్లో మీదీ ఒకటి. మరిన్ని శతకాలు మీ నుండి ఆశిస్తూ!!
మురళి గారుమొదటగా అభినందనలు...
రిప్లయితొలగించండిసాగరసంగమం అనే ద్రుశ్యకావ్యాన్ని అసలు మరచిపోగలమా...మీ విశ్లేషణ చాలా బాగుంది..
మూడొందల టపాలు పూర్తయిన సందర్భంగా మీకు శుభాభినందనలండి .
రిప్లయితొలగించండి'ఓ వైద్యభరితమైన కథ(December 2009 ' మీ 200 వ టపా. అప్పుడు మొదటగా మిమ్మల్ని విష్ చేసింది నేనే. ఇప్పుడు 300 అవంగానే చేద్దామంటే మీరే ఆ విషయం రాసేసుకున్నారు. అయినా ఇప్పుడు కూడా మొదటగా విష్ చేసింది నేనే. Trishna, 400 వ టపాకి కూడా నేనే ఫస్ట్ విష్ చేస్తాను:) (నా టపాలు కనీసం 100 అన్నా అవ్వాలని విష్ చేయండి ప్లీజ్)
రిప్లయితొలగించండిwow !! wonderfully written sir..
రిప్లయితొలగించండిJayaPrada looks stunning in this movie.Her eyes are really expressive.I always feel Kamal,Jayaprada,K.Viswanath were brought to earth by god to make this movie. My all time favourite movie.
ఎంత కళా హృదయులండీ . మాకోసం సాగర సంగమం సినిమా ను అక్షరాల్లోకి మార్చి మాకందించారు నెనర్లు
రిప్లయితొలగించండిఅద్భుతమైన సినిమాకి అద్భుతమైన పరిచయం. మీ 300వ టపానా! అభినందనలండి.
రిప్లయితొలగించండిచాలా బాగారాశారు మురళి. మూడొందల టపాల మైలు రాయి చేరుకున్నందుకు అభినందనలు.
రిప్లయితొలగించండిత్రిశతటపాలు...అత్భుతం సోదరా.
రిప్లయితొలగించండిశుభాభినందనలు.
ఇలానే రాస్తూ ఉండాలి మీరు అని అభిలాష.
-భాస్కర్ రామరాజు
మురళీ గారూ,
రిప్లయితొలగించండిఈ సినిమాలోని పాటలూ, ముఖ్యమైన సన్నివేశాలు చాలాసార్లే టీవీలో చూసినా గానీ సినిమా మాత్రం ఇప్పటి దాకా చూడలేదు నేను. ఈ మధ్యనే అంటే ఒక నెలయిందనుకుంటాను.. ఈ సినిమా చూశాను. మీ పోస్ట్ చదువుతూనే కలిగిన ఫీలింగ్ సినిమా చూసినప్పటిలాగే అనిపించింది. :)
రాత్రి శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా చూసాను. చూసినంత సేపూ ఈ సినిమా గురించి మీరెప్పుడో రాశారు అని జ్ఞాపకం వస్తూనే ఉంది. ఇదిగో ఇప్పుడే మీ బ్లాగంతా వెతికి పట్టుకుని మరోసారి ఆ సమీక్ష చదివేసి వస్తున్నా! ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మీరు రాసే సమీక్షలు చదివే వాళ్ళపైన ఎంత బలమైన ముద్ర వేస్తున్నాయో తెలియచేయాలని.
మూడొందల టపాలు మూడు వేలు, లక్షలు అవ్వాలని మనస్పూర్తిగా ఆశిస్తూ.. :)
అభినందనలు. సాగరసంగమం సినిమాకు స్క్రిప్టు బావుంది.
రిప్లయితొలగించండినాకు మటుకు ఈ సినిమా నచ్చలేదు. ఇదివరకెప్పుడో ఓ చిన్న పోట్లాట జరిగింది ఈ సినిమా మీద మరో బ్లాగులో.
ఇప్పటికీ బాలు తాగుబోతు ఎందుకయ్యాడో నాకు సరైన కారణం కనిపించట్లేదు.
నాకు చాలా ఇష్టమయినా సినిమా. ఇందులో ఒక సన్నివేశం గురించి రాయాలని చాలా సార్లు అనుకున్న కుదరనే లేదు.
రిప్లయితొలగించండిచాలా సార్లు చూసినా ఒక చిన్న అనుమానం ఉంది. చివర్లో శైలజ లో పరివర్తన అమాంతం ఎలా వచ్చేసింది. ఆమెకి అప్పటి వరకూ తెలియని విషయం అప్పుడు కొత్తగా ఏం తెలిసింది. బాలు స్పీచ్ కాకుండా ఇంకేమన్నా కారణం ఉందా ??
ముందుగా 300వ టపాకు అభినందనలు.
రిప్లయితొలగించండిఉత్తమ తెలుగు సినిమాల జాబితాలో ఉండే సినిమా "సాగర సంగమం".
విశ్వనాథ్, జంధ్యాల, వేటూరి, ఇళయరాజా, కమలహాసన్, జయప్రదల అద్భుత ప్రతిభా సమ్మేళనం "సాగరసంగమం".
ఈ సినిమా ఆడియో సి డి (పాటలే కాదు మాటలతో కూడా)నా కారులో ఎప్పుడూ ఉంటుంది.
మూడు వందల టపాలే! అబ్బ, దృష్టి తగులుతుందండీ మీకు ( నా దృష్టి)..
రిప్లయితొలగించండిపది కూడా రాయకుండానే..అబ్బే, ఇంకేమీ లేవు వ్రాయడానికి అని డిసయిడు అయిపోయా...మరి ఇంట్లొ పెద్ద వాళ్ళతో...స్వీట్లు గట్రా బ్లాగు చుట్టూ తిప్పించి..పార్సెల్ చేసి ..ఇటు పంపేయండి...
శుభాభినందనలు...ఇంకా చాలా వందల టపాలు వ్రాయాలి మీరు...
@జయ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రాధిక (నాని): నిజమేనండీ, యెంత చెప్పినా తక్కువే అవుతుంది.. ధన్యవాదాలు.
@పరిమళం: కుంకుమ సీన్ నాక్కూడా చాలా ఇష్టమండీ.. ఫ్రీజ్ చేసి చూసిన సందర్భాలు ఉన్నాయి.. ధన్యవాదాలు.
@భాను: నాకైతే ఇప్పటికీ ఇదే మొదటిసారి అన్నట్టుగా ఉంటుందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@లత: క్లైమాక్స్ సీన్ కళ్ళు చెమర్చేలా ఉంటుందండీ.. "నువ్వు చాలా అదృష్టవంతుడివి బాలూ.." అనుకుంటాను నేను, సినిమా చూసిన ప్రతిసారీ.. ధన్యవాదాలు.
@జ్యోతి: అక్షరాల్లో చూపించే ప్రయత్నం అండీ.. ధన్యవాదాలు.
@ఏకాంతపు దిలీప్: స్పష్టత ఏర్పరచడం మాత్రమే కాదండీ, ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తాయి కూడా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మిరియాల శ్రీసత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్: ఈ టపాని గురించి కాదండీ, టపాలు రాస్తుండగానే అని... ధన్యవాదాలు.
@కొత్తపాళీ: రెండు 'చాలా' లు.. చాలా చాలా సంతోషం అండీ.. నిజమే, జయప్రద మరే సినిమాలోనూ లేదిలా.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: నన్నెక్కడికో తీసుకెళ్ళిపోయారు మీరు.. (ఇంకెక్కడికీ, మన గోదారొడ్డుకే...) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@ONVITHA: ధన్యవాదాలండీ..
@తృష్ణ: అంతా మీ అభిమానం అండీ.. ధన్యవాదాలు.
@Heart Strings: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@సునీత: ధన్యవాదాలండీ..
@మనసు పలికే:అర్ధమయ్యిందండీ...ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: 'శీతకన్ను..' కాదుకానండీ, పరిస్థితులు అలా వచ్చాయి.. అన్నట్టు 'జయప్రదం' చూస్తున్నారా? ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రాజ్: ధన్యవాదాలండీ..
@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
@జయ: గుర్తుందండీ.. మీరు తల్చుకోవాలే కానీ, సెంచరీ ఎంతసేపు చెప్పండి? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@స్వాతి: నిజమేనండీ.. ఒక్కోసారి నాకూ అలాగే అనిపిస్తుంది.. అన్నీ బాగా కుదిరాయి ఈ సినిమాకి.. ధన్యవాదాలు.
@tnswamy: ధన్యవాదాలండీ...
@శిశిర: అవునండీ, మూడొందలు!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@భాస్కర్ రామరాజు: ధన్యవాదాలండీ..
@మధురవాణి: మొన్నీమద్యే నేనూ నా 'కనకమాలక్ష్మి' టపా చదువుకున్నానండీ.. సినిమాలని, పాటలని అంతగా ఇష్టపడే మీరు ఇన్నాళ్ళు 'సాగర సంగమం' చూడలేదంటే ఆశ్చర్యమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రవి: నిజమేనండీ.. సహజంగా కళాకారులు తమకి ఎలాంటి కష్టం వచ్చినా కళా సాధన ద్వారా దానిని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. తమ కల లో ఏకోన్ముఖులు అవుతారు.. బాలూ అలా కాకపోడానికి మరికొంచం వివరణ ఇస్తే బాగుండేది.. ధన్యవాదాలు.
@వాసు: బాలూ స్పీచ్ లో మాధవిని 'మహాతల్లి' అనడంతో శైలజలో పరివర్తన వచ్చినట్టు చూపారండీ.. నాకూ ఆ సీన్ కొంచం మారిస్తే బాగుండు అనిపించింది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బోనగిరి: ధన్యవాదాలండీ..
@ఎన్నెల: రెండేళ్ళు అవుతోందండీ బ్లాగు మొదలుపెట్టి.. కాబట్టి పెద్ద సంఖ్యా ఏమీ కాదేమో.. ధన్యవాదాలు.
మురళీ గారూ,
రిప్లయితొలగించండిచిన్న క్లారిఫికేషన్.. పాటలంటే చిన్నప్పటి నుంచే ఇష్టమూ.. వినే అవకాశమూ రెండూ ఉండేవి. సినిమాలు మాత్రం ఎప్పుడో టీవీలో కొంచెం కొంచెం (కరంటు వల్ల) చూడడం తప్పించి హాలుకెళ్ళి చూసేవాళ్ళం కాదు. ఇంటర్ అయిపోయేదాకా నేను హాల్లో చూసిన సినిమాలు మొత్తం ఐదుకి మించవు. అంచేత, అప్పుడు చూడలేకపోయిన వాటన్నీటినీ ఇప్పుడు చూస్తున్నాను. ;) సాగరసంగమం డీవీడీ నా దగ్గర ఉన్నా కానీ, చూడాలి అనుకుంటూనే ఎందుకో చూడలేదు. మొత్తానికి నేను చూసేశాను.. మీరు టపా రాసేశారు. :)
అన్నట్టు, కనకమాలక్ష్మి సినిమాలో ఫస్ట్ సీన్లో ఉంది వంశీనా? మళ్ళీ ఓసారి చూడాలి వంశీని గుర్తు పట్టగలనేమో! మాటీవీలో పసలపూడి కథలు చూసి మీరెప్పుడు పోస్ట్ రాస్తారా అని వెయిటింగ్ ఇక్కడ! :)
@మధురవాణి: అవునండీ.. 'కనకమాలక్ష్మి' ఫస్ట్ సీన్ లో సన్యాసి వేషం వేసింది వంశీనే.. ఇప్పటివరకూ తను నటించిన ఏకైక సినిమా.. ఇప్పుడు పాటలు పాడుతున్నాడు కాబట్టి, గొంతుని సులభంగా గుర్తు పట్టగలరు.. 'పసలపూడి...' కొంచం టైం ఇవ్వండి :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిhttp://navatarangam.com/2011/01/rasasiddhi_sagarasangamam/
రిప్లయితొలగించండి@చక్రి: 'రససిద్ధి' కలిగిందండీ.. ధన్యవాదాలు...
రిప్లయితొలగించండిఈ సినిమా నాకు చాలా నచ్చిన సినెమాల్లో ఒకటండీ...ఎన్ని సార్లు చూసానో గుర్తు లేదు కానీ చాలా సార్లే చూసాను...కానీ నేనెప్పుడూ బాలూ పాత్ర చుట్టూ తిరుగుతూ నే చూసాను. మాధవి ని ముఖ్య పాత్రగా చేసి రాసిన మీ review చాలా బావుంది. ఈ సారి చూసినప్పుడు మీ review బాగా ప్రభావం చూపిస్తుంది.
రిప్లయితొలగించండి@స్ఫురిత: మాధవి చాలా బలమైన పాత్ర అనిపిస్తుందండీ నాకు.. అలాగే ఈ పాత్రలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి కూడా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి