శనివారం, జులై 23, 2011

ముక్కోతి కొమ్మచ్చి

చదివిన పుస్తకమో, చూసిన సినిమానో అంచనాలని అందుకోలేదంటే, ఆలోపం రాసిన/తీసిన వాళ్లదా లేక చదివిన/చూసిన వాళ్ళ అంచనాలదా? ఈ సందేహాన్ని తాజాగా మరోమారు కలిగించిన పుస్తకం ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ సిరీస్ లో మూడోదీ, చివరిదీ అయిన 'ముక్కోతి కొమ్మచ్చి.' అర్ధాంతరంగా ఆగిపోయిన రచన అవడం వల్ల అంతగా సంతృప్తికరంగా అనిపించడం లేదేమో అని సరిపెట్టుకుందామన్నా, రాసిన సంగతుల్లో చాలా వరకూ చర్విత చర్వణాలే.. అంటే 'కోతి కొమ్మచ్చి' '(ఇం)కోతి కొమ్మచ్చి' ల్లో చెప్పేసిన విశేషాలే..

చెప్పిన వాడు రమణ కాబట్టి, చెప్పిన తీరు వైవిధ్యంగా ఉన్నమాట నిజమే అయినప్పటికీ, వస్తు వైవిధ్యం మాత్రం బహు స్వల్పం. మొదటి భాగంలో బాల్యం, ఈదేసిన కష్టాలని గురించి ఎంతో స్పూర్తివంతంగా చెప్పిన రమణ, రెండో భాగానికి వచ్చేసరికి సినిమా అనే పెద్ద కొమ్మ మీదకి దూకి, అక్కడక్కడే ఒక్కో రెమ్మనీ పరామర్శిస్తూ ఆ భాగాన్ని పూర్తి చేశారు. ఈ మూడో భాగంలో అదే కొమ్మకి ఉన్న మరి కొన్ని రెమ్మలపై కొమ్మచ్చులాడడం వల్ల చదివిన పుస్తకాన్నే మళ్ళీ చదువుతున్న భావన కలిగింది చాలాసార్లు.

అక్కినేని తో తీసిన 'అందాల రాముడు' షూటింగ్ విశేషాలతో ప్రారంభమైన 'ముక్కోతి కొమ్మచ్చి' ప్రారంభంలో సందర్భానుసారంగా దువ్వూరి వారి 'స్వీయ చరిత్ర' ని తలచుకున్నారు ముళ్ళపూడి. అత్యంత ఖరీదుగా వేసిన పడవ సెట్టు, అక్కినేని మంచితనం, నట వైదుష్యం మీదుగా సాగిన పేజీలు కొందరు, ఆర్టిస్టులనీ, టెక్నీషియన్లనీ పరిచయం చేస్తూ, 'ముత్యాల ముగ్గు' 'భక్త కన్నప్ప' 'గోరంత దీపం' 'వంశ వృక్షం' 'త్యాగయ్య' తదితర షూటింగుల మీదుగా వెళ్లి, నందమూరి కోరిక మేరకి తీసిన వీడియో పాఠాలు, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ అక్రమాల దగ్గర సడన్ బ్రేక్ తో ఆగిపోయాయి. ఆ కథ మరి ముందుకు కదలదన్న సత్యం కలుక్కుమనిపించిన మాట నిజం.

కొమ్మచ్చిలూ, రెమ్మచ్చిలూ అలవాటే కదా, ఇకపై ఏమన్నా కొత్త విషయాలు వస్తాయేమో అన్న ఆసక్తి చివరికంటా పేజీలని తిప్పించింది. ఆత్మ కథ ప్రారంభంలోనే 'కన్నప్ప' గారిని ఉతికారేసిన రమణ, ఈ మూడో భాగంలోనూ (చివరి అనాలని అనిపించడం లేదు, కానీ చివరిదే) కన్నప్ప కోసం కొన్ని పేజీలని కేటాయించారు. కానైతే, ఆయన కృష్ణంరాజు ని మెచ్చుకున్న సందర్భంలోనూ దీని వెనుక ఏమన్నా వ్యంగ్యం ఉందేమో అని అనుమానించాల్సి వచ్చింది. 'మనవూరి పాండవులు' గురించీ, అది హిందీలో 'హం పాంచ్' గా బాపూ నిర్దేశకత్వంలో రూపొందడం గురించీ కూడా వివరంగానే చెప్పారు.

సంగతులు చర్విత చర్వణాలవుతున్న విషయం గమనించినట్టు ఉన్నారు.. "ఈ కోతి ముసలిది అయిపోయింది" అని రాసుకున్నారు అక్కడక్కడా. రావి కొండలరావు ప్రేమకథ, అక్కినేనికి తప్పిపోయిన 'త్యాగయ్య' వేషం, శ్రీరమణ పేరడీలు, బాపూ రమణల మౌనపోరాటం లాంటి చమక్కులు అక్కడక్కడా మెరిశాయి. సీతాకల్యాణం, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం లాంటి చాలా బోలెడన్ని పునరుక్తులూ ఉన్నాయి. 'ఇల్లు మారిన భరాగో' శీర్షికతో, భమిడిపాటి రామ గోపాలానికి రాసిన నివాళి లో 'ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు' అంటూ రాసిన వాక్యమే ఈ సిరీస్ కి చివరి పేరా కావడం ఎంత యాదృచ్చికం!

ఆత్మకథ రెండో భాగంతోనే నిరాశ పరచడం ప్రారంభించిన ముళ్ళపూడి, ఈ సిరీస్ తో దానిని మరికొంచం ముందుకు తీసుకెళ్ళారు. ఆయన కోరుకున్న రీతిలో ఈ కథని ముగించి ఉంటే బహుశా చాలా ఆకర్షణీయమైన పుస్తకం అయి ఉండేదేమో.. అనుకోకుండా ఆత్మకథా రచనకి విరామం ఇవ్వడం, ఊహించని విధంగా అది శాశ్వత విశ్రాంతి కావడంతో ఈ అసంపూర్ణ రచనలో 'ఏదో మిస్సైన' భావన కలుగుతోందేమో. మొదటి రెండు భాగాలూ చదివిన పాఠకులు తప్పక చదివే రచన ఇది, పైగా ముళ్ళపూడి చివరి రచన కూడా. బాపూ కార్టూనులూ, క్యారికేచర్ల తో పాటుగా అనేక సినిమాల వర్కింగ్స్టిల్స్ , పబ్లిసిటీ స్టిల్స్ తో అలంకరించిన ఈ 131 పేజీల పుస్తకాన్ని 'హాసం' ప్రచురణలు అందుబాటులోకి తెచ్చింది. వెల రూ. 100. విశాలాంధ్ర తో పాటుగా అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తోంది.

25 కామెంట్‌లు:

  1. నాలాగే మీకూ అనిపించిందీ . నామటుకు నాకు ఇంకోతికొమ్మచ్చే నిరాశపరిచిందంటే అర్ధంచేసుకోండి. కోతికొమ్మచ్చి మాత్రం గోప్ఫ ఆత్మకథల పక్కన పీటేసుకుంటుంది. ముఖ్యంగా కోతికొమ్మచ్చి ముగింపు(సశేషమే అనుకోండి) అద్భుతం. రమణ ఉద్యోగం మానేయడం ఆయన ఆత్మాభిమానం అబ్బో అద్భుతం.
    ఇంకోతికొమ్మచ్చి సినిమా విశేషాలు మరీ తారీఖులు దస్తావేజులు రిలీజులు ఫలితాలు టైపులో ఉంటుంది. "అదృష్టవంతుడి ఆత్మకథ", "తీపి గురుతులు చేదు ఙ్ఞాపకాలు" లాంటి కొన్ని తప్ప సినిమా వాళ్ల ఆత్మకథలు చిరాకు బాబూ.(కోతికొమ్మచ్చి రచనా సినిమాకు ముందు కాలం చెప్తోందిగా)

    రిప్లయితొలగించండి
  2. మీ సమీక్ష బాగుంది. పుస్తకం చదవలేదు. ముళ్ళపూడి వీరాభిమానులు కొద్దిగా బాధ పడే అవకాశం లేకపోలేదు. కానీ.. సమీక్ష ఇలాగే ఉండాలి.

    రిప్లయితొలగించండి
  3. రమణ గారి ఆత్మకథగా కాక ఆనాటి సినిమా విశేషాల పుస్తకం చదువుతున్నట్లుగా చదివితే బాగా నచ్చుతుందండీ ఈ పుస్తకం... బహుశా బాల్యం బ్రతుకు పోరాటంలో ఉన్నంత కిక్/ప్రేరణ ఒకసారి స్థిరపడ్డాక వారు చేసే ప్రయాణంలో లేకపోవడం కూడా ఒకకారణమై ఉండచ్చు.

    రిప్లయితొలగించండి
  4. కొంత వరకు వేణు శ్రీకాంత్ తో నేను ఏకీభావిస్తాను. నా మట్టుకు నేను దీనిని ఒక సమయ యంత్రములాగా చూస్తాను. ముఖ్యముగా అందాలరాముడు, ముత్యాలముగ్గు మనఊరి పాండవులు సినిమాల విశేషాలను చదువుతున్నప్పుడు ఆ కాలము లోనికి నేను ప్రయాణిoచగలిగాను. అప్పటి స్నేహితులు, స్కూల్ మరియు కాలేజీ పరిస్థితులు ఆ మధురానుభూతులు అబ్బో ఏమి చెప్పను.

    రిప్లయితొలగించండి
  5. అనుకున్నానండి....అనుకున్నాను. నిన్న షాప్ లో ఈ బుక్ చూడగానే అనుకున్నాను, ఇవాళో రేపో రాసేస్తారని. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్లు రాయటంలో మీరు చాలా నిక్కచ్చి అండి. ఇదే చివరి పుస్తకమంటే మాత్రం కొంచెం మనసులో ముల్లు గుచ్చుకుంటోంది.

    రిప్లయితొలగించండి
  6. @పక్కింటబ్బాయి: షావుకారు జానకి ఆత్మకథ 'మల్లెపూలు-మొగలిరేకులు' కూడా బాగుంటుందండీ... ధన్యవాదాలు.
    @yaramana: ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: అవునండీ..నిజమే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @రాజశేఖర్: చెప్పిన విశేషాలైనా కొత్తవి అయితే బాగుండునండీ.. ఆల్రెడీ చెప్పేసినవే మళ్ళీ.. ధన్యవాదాలు.
    @జయ: చదవడం చాలా తొందరగా అయిపోయిందండీ.. పుస్తకం చిన్నది.. పైగా ఫోటోలూ అవీ పోను, వచనం ఉన్నది బహు తక్కువ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. నా పేరు ఎమ్బీఎస్ ప్రసాద్. ముళ్ళపూడి సాహితీ సర్వస్వం కు సంపాదకుడిని. కోతి కొమ్మచ్చి ప్రచురించిన హాసం ప్రచురణలకు సంచాలకుడిని.
    మీ సమీక్ష చదివాను. ఒక పాఠకుడిగా మీ నిరాశ అర్థం చేసుకో గలను. కానీ కొన్ని విషయాలు మీరు గుర్తించాలి.
    ఆత్మ కథ ఫిక్షన్ కాదు, మరీ మలుపులు తిప్పెయడానికి. కొంత మందిజన రంజకత్వం కోసం,
    అమ్మకాల కోసం ఇతరులపై బురద జల్లుతారు. రమణ గారు ఆ పని చేయ లేదు
    అంతే కాదు రమణ గారికి స్వోత్కర్ష పనికి రాదు. అందుకే ఎంత అడిగినా చాల కాలం ఆత్మకథ రాయ లేదు.
    నా బోటి వాళ్ళు పోనీ మీ గురించి వద్దు . మీరు ఎరిగిన గొప్ప వాళ్ళ గురించి రాయండి అంటే అప్పుడు మొదలు పెట్టారు.
    అందుకే కోతి.. లో కార్ష్ ఆఫ్ అటావా గురించి, ఐసేన్బెర్గ్ గురించి, కేసరి గారి గురించి.. ఎంతో మంది గురించి కనబడుతుంది. తన గురించి రాసుకునే టప్పుడు తన దరిద్రం, తన అహంభావం, తన తప్పులు గురించి రాసుకున్నారు. మొదటి భాగం లో దరిద్రం అందరికి నచ్చింది. మన ఆనందం గురించి రమణ గారు ఎల్ల కాలం దరిద్రంలోనే వుంది పోలేరు కదా. పైకి వచ్చారు. వచ్చిన విధం రెండో భాగంలో రాసారు.
    ఆత్మ విశ్వాసం వుంటే పైకి రావచ్చని చెప్పినందుకు కొంత మంది సంతోషిస్తే వినోదం తగ్గిందని కొందరు బాధ పడ్డారు. ఆ దశలో కూడా ఒక ఔత్సాహిక నిర్మాత గా పడిన కష్టాలు చెప్పారు.
    సినిమా అనగానే నచ్చ్చక పోతే ఎలా?
    ౩౦ ఏళ్ల వయసు నుండి ఏభై ఏళ్ల పాటు ఆ రంగంలోనే వుంది దాని గురించి రాస్తే 'ఆ కొమ్మనే పట్టుకు వేళ్ళాడేరంటే' ఎలా?
    చర్విత చర్వణం గురించి - రమణ గారు ఇన్ని వారాలు రాస్తానని అనుకోలేదు. మహా అయితే ఓ ఏడాది అనుకున్నారు. 10 వారాలు రాయగానే నేను చెప్పా ను - మీ వద్ద 100 వారాల మేటిరియలు వుంది అని. అయ్యా బాబోయి అంత కాలమా? అన్నారు ఆయన. త్వరగా ముగిద్దామని కొన్నిటి గురించి (వీడియో పాఠాలు, అందాల రాముడు నిర్మాణం, జ్యోతి మంత్లీ, సీత కళ్యాణం) క్లుప్తంగా చెప్పారు. కానీ చదువరులు వాటి గురించి సరిగ్గా రాయలేదని ఫిర్యాదు చేయడంతో మళ్ళీ రాయాల్సి వచ్చింది.
    కృష్ణం రాజును నిర్మాత గా, నటుడిగా మెచ్చుకుంటే సమీక్షకుడికి అది వ్యంగ్యంగా తోచడం బాధాకరం. అప్పు పుచ్చుకొని ఎగ్గొట్టడం తర్వాత జరిగింది . ఆ ఘట్టంలో వెక్కిరించారు. దీనిలో మెచ్చుకొన్నారు. తప్పా?
    ఒకటి నిజం - ఇది అసమగ్ర ఆత్మకథ. ఆయనకు ఓపిక తగ్గి మధ్యలో మానేశారు. చెప్పవలసినవి ఎన్నో వున్నాయి. ఇంకా రాయండి అని స్వాతి వారు, మేమూ అడుగుతూనే వున్నాము. మే 2010 లో ఆపేసినా పుస్తక రూపంలో ఇప్పటి వరకు రాకపోడానికి అదే కారణం. మా పోరు భరించ లేక ఉగాది నుండి రాస్తాను అన్నారు. కానీ ఫిబ్రవరి లోనే వెళ్లి పోయారు. ఆ తర్వాత కూడా రకరకాల ఆలోచనలు. ప్రకాశం గారి ఆత్మకథను విశ్వనాథం గారు పూరించి నట్లు మేమంతా కలిసి ఆయినా వదిలేసిన విషయాలు అనుబంధంగా పెట్టి వేద్దామా అని.
    చివరకు అనుకున్నాం - రమణ గారి రచనలో వేరెవ్వరూ వేలు పెట్టవద్దని. ఆత్మకథలో అసమగ్రత తప్పదని. అందుకే ఇది ఇలా వచ్చింది.
    దీనిలో లేనివి 'కొసరు కొమ్మచ్చి ' పేరుతో కొందరు కలిసి రాసి ప్రథమ వర్ధంతి కి తెద్దామని ఆశ. చూడాలి ఏమవుతుందో !
    ఒకటి మాత్రం నిజం - ముక్కోతి.. లో రమణ గారు బ్యురా క్రసీ గురించి రాసిన దానికైనా ఈ పుస్తకం చదవాలి.
    తెలుగు ప్రాచీన భాష గురించ గొంతు చించు కొనే నాయకులు, అధికారులు తెలుగు పాఠాలు కు ఏ గతి పట్టించారో తెలుసుకోవాడనికైనా చదవాలి.
    నమస్కారాలతో
    ఎమ్బీఎస్ ప్రసాద్
    .

    రిప్లయితొలగించండి
  9. @ఎమ్బీఎస్ ప్రసాద్: ముందుగా నేను రాసుకున్న టపాలు చదివి స్పందించినందుకు ధన్యవాదాలు. ఈ పుస్తకాలు బయటికి రాడానికి ఎందరు ఎన్ని రకాలుగా కృషి చేశారన్నది ఒక పాఠకుడిగా నా జీవిత కాలంలో తెలుసుకోలేక పోయేవాడినేమో, మీరు స్పందించి ఉండక పోతే. ఇక, మీరు గుర్తించమన్న కొన్ని విషయాలు: ముప్ఫయ్యేళ్ళ సిని జీవితం.. ఇది నిజమే, తను పనిచేసిన రంగాన్ని గురించి ఎక్కువగా చెప్పడం సజహమే. కానీ నా దృష్టిలో, ఇంకా చాలా మంది దృష్టిలో ముళ్ళపూడి వెంకట రమణ అంటే కేవలం ఒక సినిమా వ్యక్తి మాత్రమే కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, ఎదిగి, ఒదిగిన గొప్ప వ్యక్తి.
    అలాంటి వ్యక్తి ఆత్మకథలో బాల్యం, యవ్వనం తర్వాత కేవలం సినిమా 'మాత్రమే' ఉంటుందని ఊహించలేక పోవడం వల్ల నాకు నిరాశ కలిగింది. చర్విత చర్వణం యెంత నిజమో ఒక సంపాదకుడిగా మీకు తెలుసు. ఎందుకు అలా జరిగిందన్నది ఇప్పుడు మీరు చెబితే నాకు తెలిసింది. ఒక నోట్ ఇచ్చినా బాగుండేది. కృష్ణంరాజు విషయం.. పుస్తకంలో సంఘటనలు ఒక ఆర్డర్లో లేని మాట నిజమే. కానీ, ఆత్మకథా ప్రారంభంలో తను ఎంతగానో విమర్శించిన ఒక వ్యక్తిని, రచయిత తర్వాత మెచ్చుకుంటే, అలా ఎందుకు జరిగిందో తెలియని పాఠకుడు అయోమయానికి గురి కావడం అసహజం అంటారా? ఎందుకలా జరిగిందో తెలియని వాళ్లకి అది వ్యంగ్యమేమో అని సందేహం కలగడం తప్పంటారా? రమణ గారి ఆత్మకథలో వేరెవ్వరూ వేలు పెట్టక పోవడం అభినందనీయం.. 'కొసరు కొమ్మచ్చి' కోసం ఎదురు చూస్తున్నాను.. నమస్సులు..

    రిప్లయితొలగించండి
  10. @Sri Murali
    pl note it was 50 yrs. (not 30 yrs as mentioned in your comment) he spent in filmline. He was a film-writer and a producer. Why call "Bahumukha Prajnasali" etc. Till 1961 he was journalist and later film writer and producer. He did not go into politics, social service, magazine-editing, studio, running workshops, contesting in producers' council elections, organizing cultural tours etc. His life revolved around films and his video lessons, Children academy etc were within that sphere. Natually films dominate his autobiography.

    Secondly reg. Krishnam Raju episode - equations keep changing with times. During "Rakta Sambandham" NTR misunderstood him and demanded his removal from the unit. Later they worked together in "Dagudu muthalu" and other films. When "Sampoorna Ramayanam" was planned he threatened to bomb it with his own Ramayana film. Again in "Ramayanjaneya yuddham" he was impressed with them. Later asked them to do video lessons. And his last film "Srinatha" was with them.
    Similarly with ANR, he has put them on commercial map with "Buddhimantudu" and fought their cause with Navayuga. But during "Tyagayya" he got angry. Years later, he honored them with Swarna Kankanam. This kind of things do happen in everyone's life.
    Ramana mentioned his tiffs with Bapu too. And when he praised him in later pages, can you say, it was sarcasm?
    So relationship with Krishnam Raju too has to be read in that light. It is not proper to jump at conclusions by reading a line. One should have a holistic view.
    Regarding usage of dates etc. pl read the back cover. It proclaimed - 'This is not a chronlogical document". This is life captured in letters using many film techniques like flashback, flash forward, inter-cuts etc. Try to spend some time mulling over a book/song to taste the flavor. No need to rush to express instant views.
    And pl show restraint while commenting.
    Not only in case of this book, behind every work of art, so much groundwork is done and several factors contribute for its success or otherwise.
    regards
    mbs prasad

    రిప్లయితొలగించండి
  11. @Sri Prasad
    "And pl show restraint while commenting."
    మీరీ వ్యాఖ్య పోస్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ వాక్యాన్ని అన్వయించుకుని ఉంటే బాగుండేది..
    Thank You

    రిప్లయితొలగించండి
  12. ఇక్కడ . ప్రతి లైన్ కి వెనకనున్న చరిత్ర తెలుసుకొని చావటం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే పనేనా ? ఒక వ్యక్తి గురించి తెలుసుకొవటానికే ఆత్మ కథలు చదువుతాము అని నా అనుకోలు . అలాగే చదివిన ప్రతి ఒక్కరికి ప్రతి పుస్తకం ఒకే రకమైన అనుభూతి ని కలిస్తుందా?
    ప్రసాద్ గారు క్షమించాలి , మీరు పెద్దవారు మీకు చెప్పే స్తాయి నాకు లేదు అని నాకు తెలుసు . ఒక వేళ ఇక్కడ మురళి గారు రాసినది వారు తప్పు గా అభిప్రాయపడి రాసారు అని మీకు అనిపించినప్పుడు మీరు విషయం ఇది అని చెబితే (మీ మొదటి కామెంట్ లో చెప్పిన విధం గా ) ఇక్కడ అందరూ విషయం తెలుసుకుని సంతోషించే వారే , దానికి నిదర్శనం మురళి గారు స్పందన . మరి రెండవ కామెంట్ లో అంత కష్టం గా మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకు అర్ధం కాలేదు . దయచేసి తప్పు గా భావించకండి,

    రిప్లయితొలగించండి
  13. నా పై వాఖ్య లో "చరిత్ర తెలుసుకొని చదవటం " అది టైపో గమనించగలరు !

    రిప్లయితొలగించండి
  14. dear all
    pl understand - I do not expect everyone to know about the backdrop of each book in making. I do not know about several.
    The issue is about - Sri Murali's comment about 'sarcasm' when Ramana mentioned about Krishnam Raju's contribution in "Kannappa", "Mana voori.." etc. I am arguing that he need not look it that way and gave examples of NTR, ANR, Bapu etc.
    Sri Murali said the events were not dated. and hence the confusion. I said if he spends some time over the book and mulls over what he read, he would find out the sequence himself. Had he spent some time on this exercise, I am sure, he would not have found 'sarcasm' in Ramana there. If Sri Murali still finds Ramana's praise of Krishnam Raju as sarcastic, I take back my advice of 'not to rush to comment' and 'using restraint'
    regards and happy reading
    bye
    mbs prasad

    రిప్లయితొలగించండి
  15. @Prasad Garu
    "కానైతే, ఆయన కృష్ణంరాజు ని మెచ్చుకున్న సందర్భంలోనూ దీని వెనుక ఏమన్నా వ్యంగ్యం ఉందేమో అని అనుమానించాల్సి వచ్చింది."
    ఈ వాక్యం మీకు అభ్యంతరకరం. నేను పుస్తకం సరిగా చదవకుండా ఈ కంక్లూజన్ కి వచ్చేశానని మీరు భావిస్తున్నట్టుగా మీ వ్యాఖ్య వల్ల తెలిసింది. నిజానికి నేను మూడో భాగం చదివాక, మొదటి భాగం మళ్ళీ చదివాను. మీరు రాసిన మిగిలిన ఉదాహరణలకీ (ఎన్టీఆర్, ఏఎన్నార్, బాపు) కృష్ణంరాజు గురించి రాసిన దానికీ తేడా ఉందనే ఒక పాఠకుడిగా నాకు అనిపించింది. మరో చిన్న వివరణ: మూడో భాగంతో సహా, ఏ ఒక్క భాగాన్నీ నేను కేవలం ఒక్కసారి మాత్రమే చదివి టపాలు రాయలేదు.
    "పుస్తకంలో సంఘటనలు ఒక ఆర్డర్లో లేని మాట నిజమే." ఇది మీకిచ్చిన మొదటి జవాబులో వాక్యం, అలా లేవు కాబట్టే ఈ ఆత్మకథ 'కోతి కొమ్మచ్చి' అయ్యింది. "ఒక నోట్ ఇచ్చినా బాగుండేది." నేను రాసిన ఈ వాక్యం కొంత అపార్దానికి దారి తీసినట్టుగా తెలుస్తోంది. ఈ నోట్ అనడంలో నా ఉద్దేశ్యం, ఆర్డర్ గురించి కాదు, చర్విత చర్వణం ఎందుకు అయ్యాయన్న విషయమై.. మీరు చెప్పారు కదా "...కానీ చదువరులు వాటి గురించి సరిగ్గా రాయలేదని ఫిర్యాదు చేయడంతో మళ్ళీ రాయాల్సి వచ్చింది." అని. నావరకూ, మొదటి భాగంలో రమణ గారు అనుభవించిన దరిద్రం కన్నా, దానిని ఆయన ఎదుర్కొన్న తీరు, చూపించిన ఆత్మవిశ్వాసం, రేపు మీద ఆయనకున్న భరోసా స్పూర్తివంతంగా అనిపించింది. ప్రతిస్పందనకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. ఎంబీయస్ ప్రసాద్ గారూ,
    ఇక్కడ చర్చ ఎలా ఉన్నా.. సంపాదకులే వచ్చి కొన్ని వివరణలు ఇవ్వడం నాకు చాలా ఆనందం కలిగింది. వ్యక్తిగతంగా మురళీగారి వ్యాఖ్యలే నాకు ఆమోదయోగ్యంగా అనిపిస్తున్నాయి కానీ ఆ పుస్తక సంపాదకులుగా మీరు బాధ్యతగా వివరించిన తీరు నాకు నచ్చింది. ముళ్లపూడి వారి ఆత్మకథ మాకు దక్కించినందుకు మీకు ఎన్నో ధన్యవాదాలు. కొసరు కొమ్మచ్చి పేరే ఊరిస్తోంది మరి త్వరగా ఆ కొసరేదో పెట్టెయ్యండి.

    రిప్లయితొలగించండి
  17. Prasad gaaru Thanks for the postive response !
    నా వాఖ్య మిమ్మల్ని ఏదన్న కష్టపెట్టి ఉంటె మన్నించండి . సాధారణం గా ఉహు కాదు అసలు వివాదాల జోలికి వెళ్ళని మురళి గారి బ్లాగు లో మీ వాఖ్య చూసి ఆశ్చర్యం లో చేసిన వాఖ్య అది .

    రిప్లయితొలగించండి
  18. మురళిగారు,
    ' నేను కేవలం ఒక పాఠకుడిగా నా అభిప్రాయాలని రాసుకుంటున్నాను ' అని ఒక సందర్భంలో మీరు రాసినట్లు గుర్తు. మీ మీద నా ఆరోపణ.. మరీ సుతి మెత్తగా అయిపోతున్నారని. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదనే భావన మంచిదే. కానీ.. ఆ ప్రాసెస్ లో అభిప్రాయాల్ని నిక్కచ్చిగా రాసే స్వేచ్చ ( హక్కు ) ని పోగొట్టుకునే ప్రమాదం లేకపోలేదు.
    ఇక్కడ దేవుళ్ళెవరూ లేరు. ఒక లబ్దప్రతిష్టుడైన రచయితకి వీరాభిమానులు ఉండటం చాలా సహజం. బ్లాగుల్లో మీపై వెంటనే ప్రతివిమర్శలు వెల్లువెత్తొచ్చు. అది కూడా ఆహ్వానించదగ్గదే ( వ్యక్తిగతస్థాయికి దిగజారనంతమటుకు ). తెలీని విషయాలు కొన్ని బయటపడతయ్.
    తెలంగాణా, సీమాంధ్రుల వాదనల్లా.. ఒక రచయిత గూర్చి, ఒక రచన గూర్చి పచ్చిమిరపకాయ బజ్జీల్లా వాదప్రతివాదనలు ( ఆరోగ్యకరంగా ) జరిగితే భలే ఉంటుంది. మీరు రావిశాస్త్రిని విమర్శించి చూడండి. నా పనులన్నీ పక్కన పెట్టి మీపై ప్రతివిమర్శకి నా పుస్తకాల ( ఆలోచనల ) దుమ్ము దులిపి మీపై యుద్ధానికి దిగిపోతాను ( దీన్నే వీరభక్తి అంటారు ).
    మీ బ్లాగులన్నీ చదువుతున్నాను. చాలా బాగుంటున్నయ్. కీప్ ఇట్ అప్.

    రిప్లయితొలగించండి
  19. @Sri Murali garu,
    thanks for the mail.
    I am glad you read the books well before arriving at a conclusion that the comment was sarcastic in nature. I will not complain about it any more.
    Probably Ramana could not convey it in a better manner to you.

    My only complaint reg bloggers and respondents is - they give instant reactions. That is the reason I advised to read, mull it over, enjoy the flavour, then come to a conclusion..
    If you have gone thru that process, I am at peace with your observation.

    Ramana's life was thrown into turmoil because of Krishnam Raju episode.
    Still, when he was writing about "Bhakta Kannappa" he said the stunts, drum dance were conceived by Krishnam Raju himself. That is his greatness. Bhanumathi claimed that "Manasuna Mallelu" was tuned by her after Rajeswar Rao died. I can show many examples where such false claims took place.
    But Ramana was different.
    Even if he mentioned that it was planned by Bapu, or just ommitted mention of it, Krishnam Raju would not have contested. He is silent all along.
    Still Ramana was such a gentleman to give credit where it was due.
    It is unfortunate that he could not convince an avid reader like you that it was not sarcasm.

    and one more thing -
    I am amused by your line - సంగతులు చర్విత చర్వణాలవుతున్న విషయం గమనించినట్టు ఉన్నారు.. "ఈ కోతి ముసలిది అయిపోయింది" అని రాసుకున్నారు అక్కడక్కడా
    it sounded as if he found this out accidentally and gave a kind of excuse.
    He was always aware what he wrote earlier and what he was writing currently. Senility never touched him. And he used to send me the copy beforehand for preview, comment and supply of photos (their personal albums are under my custody)
    As all of us know that Bapu is the first reader. And that his memory is excellent.
    He would point out if there is any flaw.
    So whatever appeared in print was only after thorough scrutiny; nothing accidental.

    Any way, let us leave this at this point.
    As Ramana used to say often - reader/audience is always right.
    Even if he were alive, he would not have fought with you (like me) for misunderstanding him.

    best regards
    mbs prasad

    రిప్లయితొలగించండి
  20. @శ్రావ్య వట్టికూటి: మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..
    @పక్కింటబ్బాయి: నాది కూడా అదే అభిప్రాయం అండీ.. మనకి ఇష్టమైన రచయిత గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోగలిగాం కదా!! ..ధన్యవాదాలు.
    @ మీ ఆరోపణ అర్ధమయ్యిందండీ! 'విమర్శకుడు' 'సమీక్షకుడు' లాంటి విశేషణాలు వచ్చిన సందర్భంలో, ఆ ఇచ్చిన వారికి నేను చేసే మనవి 'నేను కేవలం పాఠకుడిని మాత్రమే.. ఆరోగ్యకరమైన చర్చకి నేనెప్పుడూ సిద్ధమేనండీ.. అలాగే నా వాదనలో ఏదన్నా తప్పు ఉంటే ఒప్పుకోడానికి కూడా సిద్ధమే. అభిప్రాయాలని నిక్కచ్చిగా రాసే స్వేచ్చ/హక్కు ని పోగొట్టుకునే పరిస్థితి రాదనే అనుకుంటున్నాను.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. @Sri Prasad Garu:
    Small correction, I haven't sent you any personal mail. I have given my views in my blog's comment box, which is the platform for open discussion. Once again, thank you very much for taking part in the discussion..

    రిప్లయితొలగించండి
  22. @yaramana: మీ ఆరోపణ అర్ధమయ్యిందండీ! 'విమర్శకుడు' 'సమీక్షకుడు' లాంటి విశేషణాలు వచ్చిన సందర్భంలో, ఆ ఇచ్చిన వారికి నేను చేసే మనవి 'నేను కేవలం పాఠకుడిని మాత్రమే.. ఆరోగ్యకరమైన చర్చకి నేనెప్పుడూ సిద్ధమేనండీ.. అలాగే నా వాదనలో ఏదన్నా తప్పు ఉంటే ఒప్పుకోడానికి కూడా సిద్ధమే. అభిప్రాయాలని నిక్కచ్చిగా రాసే స్వేచ్చ/హక్కు ని పోగొట్టుకునే పరిస్థితి రాదనే అనుకుంటున్నాను.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. My 2 Cents to Mr. Prasad
    1st cent - Reader's comments are just that. Every reader has a right to express their opinions, especially so if they shelled out hard earned money to purchase the book and spent their precious time to read it. It is surprising that someone like you who has been involved in publication activity for so long does not realize that.

    2nd cent - your complaint about bloggers - well, bloggers are here, and they will continue to give their reactions. Too bad if you don't like them.

    రిప్లయితొలగించండి
  24. బావుందండీ ప్రసాద్ గారు,తెలుగు బ్లాగుల్లో ఈ పుస్తకం గురించి చాలామంది రాసుకున్నారు,ముందుముందురాస్తారు కూడా.నాకు తెలిసి మీరు యే బ్లాగులోనూ స్పందించినట్టులేదు.ఒకాయన ఈ పుస్తకంలో ఫలానా ఫలానా చోట్ల పేజీలు లేవు అన్నారు అక్కడ కూడా సంపాదకుడిగా మీ వివరణ నాకేమీ కనిపించలేదు.ఒక కాలమిస్టుగా,రచయితగా మీ రచనలు అభిమానిస్తాను,కానీ
    ఒక సంపాదకుడి హోదాలో సమీక్షలు ఎలా ఉండాలో చెప్పేందుకు మీప్రయత్నం నాకు విడ్డూరంగా ఉంది అసలు.మీ ఉద్దేశ్యం మంచిదే కావచ్చుకానీ ఆ ‘టోన్’కాస్త ఇబ్బందిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  25. yes, I do not blog and offer comments usually

    if some pages are missing, we (as publishers) will certainly replace the copies. That is why we give our phone number also there. This is the problem with binding.
    I dont know why you are talking of 'tone'. I made my point clear and I was unambiguous in expressing my views. Another gentleman (kotha pali) said I should realize the right of the reader to express his opinion. Where did I not realize? I am a reader myself and told all about my misgivings in bringing out "Mukkothi.." in present form and why it took more than a year even after the publication of serial stopped in Swathi.

    I am not telling how a review should be. In the opening line itself I told the reviewer I can understand his disappointment as a reader. My complaint was that he hastened to comment that - Ramana was sarcastic in praising Krishnam Raju and I have shown instances. When he said he got that impression even after reading the book carefully, I ended the debate saying - 'In that case I am at peace with your comment.' And I concluded that Ramana failed to convince this reader.
    period.

    we have published 50 books so far and (23 of them are written by me) they get all kinds of reviews. I never interfere. In this case I thought Ramana's fans would be interested to know the backdrop of the making of the book since Ramana is no more. And look what kind of comments I am getting, as if I am asking people not to review at all!

    Probably I would have kept quiet. I do not intend to react any more
    thanks and bye
    regards
    prasad mbs

    రిప్లయితొలగించండి