బుధవారం, జులై 29, 2009

సూర్యోదయం-నా రేడియో రచన

అప్పుడే జాగింగ్ పూర్తి చేసి వచ్చి బాల్కనీ లో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాను. జాగింగ్ తాలూకు అలసట నుంచి విశ్రాంతి పొందుతూ దూరంగా కనిపిస్తున్న ఆకాశం వైపు చూశాను. నీలాకాశం అరుణిమను దాల్చుతోంది. కాలచక్రంలో మరో రోజుకు తెర తీస్తున్నాననే సంకేతం ఇస్తూ బాల భానుడు ఉదయించేందుకు ఆయత్తమవుతున్నాడు.

సూర్యోదయం..అది నాకెంతో ఇష్టమైన దృశ్యం.. ప్రతిరోజూ చూస్తున్నదే అయినా ప్రతిసారీ ఓ కొత్తదనం. మనసును ఉత్తేజ పరిచే ఆ దృశ్యాన్ని చూసేందుకు నేను సిద్ధపడుతుండగానే శరీరానికి ఉత్తేజాన్నిచ్చే వేడి పానీయంతో శ్రీమతి నా దగ్గరకు వచ్చింది "డాక్టరు గారేదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు.." అంటూ.. నేను ఆలోచనల్లోకి వెళ్ళిపోతే నన్ను నా వృత్తితో సంబోధించడం తన అలవాటు.

తన పలకరింపుకి బదులుగా నేను ఓ చిరునవ్వు నవ్వాను. ట్రేలోంచి ఓ కప్పు నాకిచ్చి మరో కప్పు తను అందుకుంది. కాసేపయ్యాక.. అప్పుడే వచ్చిన న్యూస్ పేపర్ తెచ్చిన వార్తలతో మా సంభాషణ ప్రారంభమయ్యింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర విశేషాలన్నీ ఐపోయాక కాసేపు ఇంటి సంగతులు మాట్లాడి "ఇవాళ హాస్పిటల్ కి వెళ్ళరా?" అంటూ గుర్తు చేసింది. నిజానికి రోజంతా బిజీ గా ఉండే నేను ఆమెతో గడిపేది ఆ కొద్ది సమయమే.

నేను ప్రారంభించిన 'రఘు నర్సింగ్ హోం' కి ఇప్పుడిప్పుడే పేరొస్తోంది. రోగులకి నా హస్తవాసి మీద నమ్మకం కుదరడంతో ఆస్పత్రిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో నాకు ఎంత టైమూ సరిపోవడం లేదు. ఈ విషయం ఆమెకూ తెలుసు. అయినా ఆమెతో గడిపే సమయంలోనూ నా బాధ్యతను గుర్తు చేస్తోంది. 'ఈమె భార్యగా దొరకడం నా అదృష్టం' ఇప్పటికీమాట ఎన్నిసార్లు అనుకున్నానో లెక్క లేదు.

"అడుగుతున్నది మిమ్మల్నే సర్" ..ఆమె గొంతు విని ఆలోచనల నుంచి బయట పడ్డాను. ఓ పక్క హాస్పిటల్ కి వెళ్లేందుకు రెడీ అవుతూనే ఆరోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచించుకుంటున్నాను. టిఫిన్ తింటుండగానే హాస్పిటల్ నుంచి ఫోన్. నా అసిస్టెంట్ చేశాడు. తను కాస్త త్వరగా ఇంటికి వెళ్లాలట. నన్ను ముందుగా రమ్మని అభ్యర్ధన. శ్రీమతికి విషయం చెప్పి కారుతాళాలు తీసుకుని బయలుదేరాను. నాకిష్టమైన సంగీతం వింటూ కారు డ్రైవ్ చేస్తున్నాను.

మెడిసిన్ లో ర్యాంకు సాధించడం మొదలు మంచి డాక్టరుగా పేరు తెచ్చుకోడం వరకు నా జీవితంలో నేను వేసిన ప్రతి అడుగు వెనుక ఓ స్ఫూర్తి ఉంది. నా వ్యక్తిగత జీవితాన్నీ, వృత్తిపరమైన ఎదుగుదలనూ పరిశీలిస్తున్న వారంతా 'డాక్టర్ ప్రశాంత్ చాలా అదృష్టవంతుడు' అంటున్నప్పుడు నాకు యెంతో గర్వంగా అనిపిస్తుంది. అదే సమయంలో జీవితంలోని ఓ ముఖ్యమైన మలుపులో నేను వెయ్యబోయిన ఓ తప్పటడుగూ గుర్తొస్తుంది. నేనా తప్పు చేయకుండా అడ్డుకున్న ఆ మహనీయుడు నా స్మృతిపధం లో ఎన్నడూ చిరస్మరణీయుడే..

కారు హాస్పిటల్ దగ్గరికి రావడంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది. విశాలమైన ఆవరణలో కనువిందు చేసే గార్డెన్. మధ్యలో తెల్లని బిల్డింగ్. నల్లని గేట్ పైన మెరిసే అక్షరాలతో 'రఘు నర్సింగ్ హోం' అనే బోర్డు. నిత్యం చూసేదే అయినా మరోసారి తనివితీరా చూసుకున్నాను. ఒక్కో పేషెంట్ దగ్గరకీ వెళ్లి వారి బాగోగులు కనుక్కోవడం, జాగ్రత్తలు చెప్పడం, వాళ్ళడిగే ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలివ్వడం.. ఇలా నాకు తెలియకుండానే సమయం గడిచిపోయింది. ఇన్-పేషెంట్స్ కి సంబంధిచి రౌండ్స్ పూర్తవ్వగానే అవుట్-పేషెంట్స్ ని చూడడం ప్రారంబించాను.

నా దగ్గరకు వచ్చే రోగుల్లో రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. చిన్నపాటి సమస్యకే కంగారు పడుతూ వచ్చేవారు కొందరైతే, ఎంత పెద్ద అనారోగ్యమైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాళ్ళు మరికొందరు. నాకు తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యంతో పాటు మనస్తత్వాలనూ పరిశీలించడం అలవాటైపోయింది. నా ఈ సైకాలజీ అబ్సర్వేషన్ ఎప్పుడు ప్రారంభమైందన్నది నాకే సరిగా గుర్తు లేదు. పేషెంట్స్ ని చూడడం పూర్తవ్వడంతో కాస్త తీరిక చిక్కింది. శ్రీమతితో మాట్లాడాలనిపించింది. ఫోన్ తీశాను. ఇంటి నెంబరు డయల్ చేసేలోగా బయటేదో కలకలం వినిపించింది. ఫోన్ పెట్టేశాను.

నేను పిలిచేలోగా నర్స్ తనే వచ్చింది. "సూసైడ్ అటెంప్ట్ కేస్ సర్..కండిషన్ సీరియస్ గానే ఉంది.." ఆమె స్వరంలో కాస్త సందేహం. "అడ్మిట్ చేసుకోండి" అని చెప్పి పేషెంట్ దగ్గరకు నడిచాను. పాతికేళ్ళ లోపే ఉంటాయి ఆ కుర్రాడికి. అపస్మారక స్థితిలో ఉన్నాడు. అక్కడున్న స్త్రీలలో ఒకామె, అతడి తల్లి కావచ్చు, "పురుగు మందు తాగేశాడు బాబూ.." అని వెక్కిళ్ళ మధ్య చెప్పింది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ ప్రారంభించాను. కేసు క్రిటికల్ గానే ఉంది. చాలా మందు తగేశాడతాను. స్టమక్ వాష్ మొదలు పెట్టాను.

మృత్యువుతో పోరాటం.. ఒక్కమాటలో చెప్పాలంటే జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడు. అమాయకమైన అతడి ముఖం చూస్తే ఏదో తెలియని అభిమానం పుడుతోంది. ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడో? ..తాగిన విషం కొద్ది కొద్దిగా బయటకు వస్తోంది. నరకం అనుభవిస్తున్నాడతను.. తప్పదు.. అతడి ముఖంలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. కానీ పర్వాలేదు అనుకోడానికి లేదు. ట్రీట్మెంట్ చేస్తున్నానన్న మాటే కానీ ప్రతిక్షణం టెన్షన్ అనుభవిస్తున్నాను.

పాపం..ఇతని తలిదండ్రులు ఇతని మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు? ఎందుకిలాంటి తొందరపాటు పని చేశాడు? ఓ క్షణం తరువాత నా ఆలోచనకు నాకే సిగ్గేసింది. అందుకు కారణం లేకపోలేదు. ట్రీట్మెంట్ కొనసాగుతోంది. చాలా వరకు విషం బయటకు వచ్చేసింది. అతని ముఖంలో తేటదనం వచ్చింది. మనిషి నిస్త్రాణగా సోలిపోయాడు. నర్సుకు చేయాల్సింది వివరించి బయటకు వచ్చాను. అతని కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆందోళన. సాయంత్రానికి స్పృహ రావచ్చునని చెప్పి నా రూం లోకి నడిచాను.

ఈ సంఘటనతో నా మూడ్ మొత్తం మారిపోయింది. నా గతం ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆలోచనల ధాటికి తలపోటు ప్రారంభమైంది. మధ్యాహ్నం లంచ్ చేయలేదన్న విషయం గుర్తొచ్చింది. నర్స్ ని పిలిచి ఆ పేషెంట్ కండిషన్ అడిగాను. ఇంటికి వెడుతున్నానని, అవసరమైతే ఫోన్ చేయమనీ చెప్పి బయలుదేరాను. డాక్టరుగా రోగులు నాకు కొత్త కాదు. కానీ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు నేను నేనుగా ఉండలేదు. అన్యమస్కంగానే ఇంటికి చేరాను.

సీరియస్ గా ఉన్న నా ముఖం చూసి శ్రీమతి నన్ను పలకరించే ప్రయత్నం చేయలేదు. నేను 'అలా' ఎందుకు ఉన్నానో ఆమె ఊహించగలదు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నా అన్నం పైకి దృష్టి పోలేదు. ఆమె తృప్తి కోసం తిన్నాననిపించి లేచాను. ఈజీ చైర్లో కూర్చున్నానన్న మాటే కానీ నా ఆలోచనలు నన్ను స్థిరంగా ఉండనివ్వడం లేదు. సుళ్ళు తిరిగే జ్ఞాపకాల్లోంచి రఘు రూపం నన్ను పలకరించింది. నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

ఫోన్ మోతతో నిద్ర నుంచి మెలకువ వచ్చింది. మెడిసిన్ లో నా క్లాస్మేట్. మెడికల్ జర్నల్ లో నే రాసిన వ్యాసం చదివాట్ట.. అబినందించడానికి ఫోన్ చేశాడు. ఆ సంభాషణ ఐపోయాక నాకు మధ్యాహ్నం పేషెంట్ గుర్తొచ్చాడు. హాస్పిటల్ కి ఫోన్ చేశాను. మధ్యలో ఓసారి స్పృహ వచ్చిందని, ఏడ్చి పడుకున్నాడని నర్స్ చెప్పింది. స్నానం చేసి హాస్పిటల్ కి బయలుదేరాను. పేషెంట్స్ అందర్నీ చూశాక ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లాను. అమాయకంగా నిద్రపోతున్నాడు. అతని తాలూకు బంధువులు కృతజ్ఞతలతో నా కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు. డిశ్చార్జి చేస్తారా? ఇంటికి తీసుకెళ్ళి పోవచ్చా? అని అడిగారు. కుర్రాడు చాలా నీరసంగా ఉన్నాడని, రాత్రికి గ్లూకోజ్ ఇస్తానని చెప్పాను.

"డిగ్రీ చదివేడు బాబూ.. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు.. వాడి అదృష్టమేమిటో.. ఒక్కటీ దొరకలేదు.. వాళ్ళ నాన్న బయటి కోపమంతా వాడిమీద చూపించారు.. ఇంకా ఎన్నాళ్ళు పోషించాలి? సిగ్గనిపించడం లేదా అని అడిగేసరికి.. బిడ్డ తట్టుకోలేక ఈ అగాయిత్యానికి పూనుకున్నాడు.." అతని తల్లి దాదాపు ఏడుస్తూ చెప్పింది. నేనూహించింది నిజమేనన్న మాట. రేపోసారి అతనితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. మర్నాడు ఉదయం హాస్పిటల్ కి వెళ్ళగానే అతని ఆరోగ్యం గురించి కనుక్కున్నాను. నార్మల్ కి వచ్చాడని, ఎవరితోనూ మాట్లాడ్డం లేదనీ చెప్పారు.

పేషెంట్స్ ని చూడ్డం పూర్తయ్యాక అతన్ని నా రూం కి పిలిపించాను. కోల ముఖం, ఉంగరాల జుట్టు, కొద్దిగా మాసిన గెడ్డం.. ఆ వయసు వాళ్ళలో ఉండాల్సిన ఉత్సాహానికి బదులు అతడి ముఖంలో నిరాశా నిస్పృహలు. కూర్చోమని కుర్చీ చూపించాను. రెండు నిమిషాలు నేనేమీ మాట్లాడలేదు. అతను తల దించుకుని కూర్చున్నాడు. నిశ్శబ్దాన్ని చేదిస్తూ నేనే అడిగాను.. "మీ పేరు?" .. "రవి సర్" తలదించుకునే సమాధానం చెప్పాడు. "ఇటు చూడండి.." అతను తలెత్తాడు. లోకాభిరామాయణం మాట్లాడుతూనే అతన్ని గురించి వివరాలు రాబట్టాను.

డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ఇతర క్వాలిఫికేషన్లు బాగున్నాయి. ప్రయత్న లోపం లేకపోయినా ఉద్యోగం దొరకలేదు. సున్నితమైన మనస్తత్వం. తండ్రి మాటలు భరించలేక పోయాడు. అతను కుర్చీలో అసహనంగా కదలడంతో సబ్జక్ట్ లోకి వచ్చాను. "రవీ చనిపోవాలని ఎందుకు అనుకున్నావ్?" అనునయంగా అడిగాను. "నాలాంటి వాడు ఎందుకు బతకాలి సార్..ఎవరికోసం బతకాలి?" అతని స్వరంలో ఆవేదన. "ఎందుకూ పనికి రాని వాణ్ణి సార్ నేను.. అసలు మీరు నన్నెందుకు బతికించారు?" ఉన్నట్టుండి హిస్టీరిగ్గా ఏడవడం మొదలు పెట్టాడు.

అతి కష్టం మీద అతన్ని ఊరుకోబెట్టాను. "ఎందుకు రవీ అంత ఆవేశం? నీ వయసెంతనీ.. నిండా పాతికేళ్ళు లేవు.. అప్పుడే ఎందుకింత నిరాశ? ఈ రోజు బాగుండక పోవచ్చు. కానీ రేపటి రోజు నీదే కావచ్చు.. రేపు నువ్వో గొప్ప స్థితికి వెళ్తే ఫలానా వాడు నా కొడుకని మీ నాన్నే పదిమందికీ గర్వంగా చెప్పుకుంటారు.." ..నా మాటలింకా పూర్తి కాలేదు. "ఎందుకు సార్ లేనిపోని ఆశలు కల్పిస్తారు?" అంటూ అడ్డుకున్నాడు. "విజయాలు సాధించేవాళ్ళు వేరే పుడతారు సార్.. నా లాంటివాళ్ళు ఎప్పటికీ ఇంతే.. ఎన్నేళ్ళు గడిచినా ఏమీ సాధించలేరు... కష్టాలూ కన్నీళ్ళూ తప్ప.." చాలా ఆవేశంగా అన్నాడు.

"రవీ ఎందుకంత నిరాశా వాదం? గొప్ప వాళ్ళంతా ఒకప్పుడు కష్టాలూ కన్నీళ్ళూ అనుభవించిన వాళ్ళే తెలుసా?" చాలా శాంతంగా అన్నాను. "మీకేం సార్..గోల్డ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు. మా సమస్యలు మీకేం తెలుస్తాయి? అందుకే..ఎన్ని మాటలైనా చెబుతారు" ఒకింత నిరసనగా అన్నాడు. "రవీ.. నువ్వు వింటానంటే నా గతం నీకు చెబుతాను. చాలామందికి సాఫీగా సాగిపోయే డాక్టర్ ప్రశాంత్ జీవితం గురించే తెలుసు తప్ప అంతకు ముందు అతడనుభవించిన అశాంతి తెలీదు. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెప్పాలనిపించింది.. చెప్పమంటావా?"

అతడు అంగీకార సూచకంగా తలూపాడు. ఒక్క క్షణం ఆగి చెప్పడం పారంభించాను.. "అవి నేను ఇంటర్మేడియట్ చదివే రోజులు. డాక్టర్ ని కావాలని నాకు బలమైన కోరిక. బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాణ్ణి. లెక్చరర్లందరికీ నా మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కాలేజీకి మంచి పేరు తెస్తానని ప్రిన్సిపాల్ కూడా అంటుండేవారు. నాన్నగారైతే మా వాడు కాబోయే డాక్టర్ అని అందరికీ చెప్పేవారు. ఈ పరిస్థితుల్లో మెడికల్ ఎంట్రన్స్ రాశాను. ర్యాంకు వస్తుందని అందరికీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఈ నేపధ్యంలో రిజల్ట్స్ వచ్చాయి.

ర్యాంకు కాదు కదా.. కనీసం ఎంట్రన్స్ పాసవ్వలేదు. భయంకరమైన అవమానం.. అమ్మానాన్నలకి ఎలా ముఖం చూపించను? విపరీతమైన బాధ, జీవితం మీద విరక్తి నన్నేమీ ఆలోచించనివ్వలేదు. ఆసాయంత్రం సముద్ర గర్భంలో నా జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. ఎవరూ లేని చోటు చూసి సముద్రంలోకి దిగడం ప్రారంభించాను. ఓ బలమైన కెరటం నన్ను సముద్రం లోపలి లాక్కుంది. నాకు స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేసరికి ఓ గదిలో ఉన్నాను. చుట్టూ చీకటి. చిన్న దీపం వెలుగుతోంది.

దీపం వెలుగులో పుస్తకం చదువుకుంటున్న వ్యక్తి నేను కదలడం గమనించాడు. వెంటనే నా దగ్గరకు వచ్చి పాలు వేడిచేసిచ్చాడు. నేను మౌనంగా తాగాను. తరువాత నానుంచి జరిగిందంతా విన్నాడు. పూర్తిగా విన్నాక అతడు చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. ఒక్క అక్షరం కూడా మర్చిపోలేదు. ఏమన్నాడో తెలుసా? 'ప్రచండంగా వెలిగే సూర్యుణ్ణి మబ్బులు కమ్మేస్తాయి. అంత మాత్రాన సూర్యుడికి ప్రతాపం లేనట్టేనా? సాయంత్రం అయ్యేసరికి అదే సూర్యుడు సముద్రంలోకి కుంగిపోతాడు. అంతమాత్రాన సూర్యోదయం అవ్వదా?

చూడూ..అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సహజమో, జీవితంలో ఓ విషాదం తరువాత మరో సంతోషం..ఓటమి తరువాత విజయం అంటే సహజం. సూర్యాస్తమయాన్ని చూసి కుంగిపోవడం కాదు, సూర్యోదయం కోసం ఎదురు చూడాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. . ఈ ప్రపంచంలో ఓడిపోయిన వాళ్ళని విమర్శించేవాళ్ళకి కొదవ లేదు. కానీ విజయం సాధించినప్పుడు వాళ్ళే ఆకాశానికెత్తుతారనీ గుర్తుంచుకో. రేపటి సూర్యోదయం నీదేనన్న నమ్మకంతో జీవితం గడుపు. విజయాన్ని సాధించు'

అతని మాటల ప్రభావంతో ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రే కాదు, నేను కోరుకున్న విజయాన్ని సాధించేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. మరెన్నో అవమానాలూ భరించాను. అప్పుడు నా బాధల్లో ఎవరూ పాలు పంచుకోలేదు. కానీ, నేను కోరుకున్న లక్ష్యాన్ని సాధించిన నాడు లోకమంతా నాకు బ్రహ్మరధం పట్టింది.." ఊపిరి తీసుకోడానికి ఒక్క క్షణం ఆగాను. "ఓ దురదృష్టకరమైన విషయం చెప్పనా రవీ.. నా విజయాన్ని, దాని తాలూకు ఆనందాన్ని నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తితో పంచుకోలేక పోయాను. ఆ రాత్రి తర్వాత అతను నాకు మళ్ళీ కనిపించలేదు. తన పేరు రఘు అని మాత్రం తెలుసు..అంతే.." ఓ నిమిషం మౌనం.

రవి తలెత్తాడు అతని పెదాలు వణుకుతున్నాయి. "క్షమించండి సార్..ఆవేశంలో ఏదో మాట్లాడాను. బాధలు నాకొక్కడికే అనుకున్నాను. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారని ఊహించలేకపోయాను. సార్.. మీరు నా శరీరానికి చేసిన చికిత్స కన్నా, మనసుకు చేసిన చికిత్స గొప్పది. నా మనసుకు మీరు పునర్జన్మ ఇచ్చారు సార్. ..సార్..నాకు నమ్మకం ఉంది.. రేపటి సూర్యోదయం నాదే" నాకు నమస్కరించి రవి వెనుదిరిగాడు. నేను తృప్తిగా నిట్టూర్చాను. రఘు నాకందించిన స్ఫూర్తిని నేను మరొకరికి అందించగలిగినందుకే ఈ తృప్తి.

(ఓ దశాబ్దం క్రితం ఆకాశవాణి 'జీవితం పట్ల ఆశావహ దృక్పధం' అన్న అంశం మీద కథానికలను ఆహ్వానించినప్పుడు, రాసి పంపానిది. సెలెక్టయ్యింది, నేనే చదివాను. పుస్తకాలు సర్దుతుంటే స్క్రిప్ట్ కనిపించింది. 'ఇ'లా కంప్యూటరీకరించాను. అప్పుడు రాయడానికి, ఇప్పుడు బ్లాగులో ఉంచడానికి ప్రోత్సహించిన మిత్రులకి కృతఙ్ఞతలు.)

37 కామెంట్‌లు:

  1. "అప్పుడే జాగింగ్ పూర్తి చేసి వచ్చి బాల్కనీ లో ఉన్న ఉయ్యాల్లో కూర్చున్నాను. "
    I knew it was fiction right away :)

    good show!
    You should write full length stories.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది మురళి... నిజమే కదా జీవితమంటే గెలుపు ఓటముల వుయ్యాల. రెండిటిని సమానం గా తీసుకుంటే మనం దృతరాష్ట్రుడి స్తితి నుంచి బయటకు వస్తాము కదా..

    రిప్లయితొలగించండి
  3. "ప్రచండమైన సూర్యుడిని మబ్బులు కమ్మేస్తాయి ,అంత మాత్రాన సూర్యుడికి ప్రతాపం లేనట్లేనా " చాల చక్కటి ఉదాహరణ ...నాకు నిరంతర స్ఫూర్తి ఈ ప్రచండ భానుడే .చాల బాగుంది .

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుంది అండి మీ రచన

    రిప్లయితొలగించండి
  5. వావ్..చాలా చాలా బాగుంది మురళి గారూ.!
    దశాబ్దం క్రితమే ఇంత బాగా రాశారంటే..ఇప్పుడు ఇంకా బాగా రాయగలరనిపిస్తుంది.
    కొత్తపాళీ గారు చెప్పినట్టుగా మీరు అర్జెంటుగా కథలు రాయడం మొదలెట్టేయండి :)

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు,
    ఎక్స్ లెంట్ గా ఉంది మీ రచన. చదివినంత సేపు మీ అనుభవమే అని అనుకున్నాను. చివరిలో తెలిసింది ఇది రచన అని. కధ పూర్తయిన వెంటనే మిమ్మల్ని అభినందనలతో ముంచెత్తాలనిపించింది. కధనం..వ్యక్తీకరణ..సూపర్బ్.

    రిప్లయితొలగించండి
  7. chaalaa baabundi,tappakundaa inka rayandi. dr.prasanth ani vachchevaraku nenu leenamayi mee gurinche anukunna.inka rayalante no words muraligaaru.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారికి నమస్కారం,
    మీ రచన బాగుంది. ఎక్కాడ కూడా నాకు అనుమానం రాలెదు ..ఇది fiction అని. స్పూర్తి వంతమైన రచన.

    రిప్లయితొలగించండి
  9. బావుందండీ..

    పన్లోపనిగా మీరు మీ చిన్నప్పుడెప్పుడో రాసిన ఆ సీరియల్ (నా 'రచనా' చమత్కృతి) కూడా మాతో పంచుకుంటే బావుంటుంది, తవ్వండి,,దొరక్కపోదు ..:)

    రిప్లయితొలగించండి
  10. హమ్మో మీకు చాలా ఓపిక యింత టైపు చెయ్యడానికి ఎంత టైం పట్టి ఉంటుందో .... కథ బాగుంది

    రిప్లయితొలగించండి
  11. చాలా చాలా బాగుంది మురళి గారూ...

    రిప్లయితొలగించండి
  12. మంచి చేయి తిరిగిన రచయితలా వ్రాసారు.
    మురళి గారూ, మీ ఖజానాలో ఇంకెన్ని కథలు ఉన్నాయో, మా కోసం బయటికి తీయండి.

    రిప్లయితొలగించండి
  13. చీకటిని తరిమేసే వెలుగును ఆహ్వానించడం...
    గ్రీష్మం వెంటే తరలి వచ్చే వర్షాన్ని ఆస్వాదించడం...
    ముళ్ళను దాటి గర్వంగా విరిసే గులాబీని ఆఘ్రాణించడం!
    మీ రేడియో రచన కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉంది
    మురళిగారూ !

    రిప్లయితొలగించండి
  14. ఓలమ్మో ! శ్రీమతి అని చదివి మొదట జా డ్రాప్ అయింది (ఠంగుమంది నెత్తిమీద). హీ. హీ. బాగా రాశారు. [ఆటపట్టించకూడదింక మిమ్మల్ని]

    రిప్లయితొలగించండి
  15. మీ కథ చాల బాగుంది. మొదలు పెట్టాక మొత్తం పూర్తి అయ్యేవరకు వదలకుండా చదివించింది. ఇలాంటి పాజిటివ్ దృక్పధం గల రచనలు ఎన్ని చదివినా కూడా మరల కొత్తది చదివినప్పుడు స్ఫూర్తి పొందుతూనే ఉంటాము. మీ రచనా శైలి చాలా బాగుంది. ఇంతకూ ముందు ఎన్నో టపాలు మీ బ్లాగ్లో చదివి, కామెంట్ ఇద్దామనుకుని ఇవ్వలేకపోయాను, కాని ఇది చదివాక మిమ్మల్ని అభినందించకుండా ఉండలేక పోతున్నాను.

    రిప్లయితొలగించండి
  16. ఒకలైను చదవగానే అనుమానమ్ వచ్చి ముందర చివరికి వెళ్ళి చూసా...నా అనుమానం నిజమే అయ్యింది...:)
    :) బాగున్ది రచన.ఇంతకీ అది ఏ రేడియోస్టేషనో చెప్పలేదు...

    రిప్లయితొలగించండి
  17. చాలా బాగుంది మురళి గారు. కధను బాగా నడిపించారు.
    ప్రశాంత్ ఇంటర్మీడియట్ మొత్తం, బాగా చదువుతూ , ఎంతో కాంఫిడెంట్ గా రాంక్ వస్తుందనుకున్నాగానీ , ఎంట్రన్స్ కూడా పాస్ అవ్వలేకపోయాడే అనిపించింది.
    అయినా ఈ కధను మలిచిన తీరుతో పోలిస్తే అదేమంత పెద్ద విషయం కాదు.

    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. Namskaram,
    Chala bagundhi ani chepidhe chinna prasamsha avuthundhemo,,,,,alagani abhinadimante emo mari matalaku tadumukovalanipisthundhi.......

    please makosam oka navala rayakudadu

    రిప్లయితొలగించండి
  19. "ప్రచండమైన సూర్యుడిని మబ్బులు కమ్మేస్తాయి ,అంత మాత్రాన సూర్యుడికి ప్రతాపం లేనట్లేనా?"
    బాగా చెప్పారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  20. కధ చాలా బాగుంది మురళి గారు. అందరి మాటే నాది కూడా, మీరు మళ్ళీ కధలు రాయడం మొదలెట్టేయాలి.

    రిప్లయితొలగించండి
  21. అమ్మో! అప్పట్లోనే అదరగొట్టేసారన్నమాట! చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి
  22. హమ్మా మురళీ, ఎంత చాతుర్యం... భలే నడిపించారు కథానికను.

    రిప్లయితొలగించండి
  23. అద్దిరింది మురళీ కధ.నిజంగానే నేనూ నువ్వు డాకుటేరువనుకున్నాలే,రైటేరువన్నమాట సంతోషం.
    ఎదురుచూపులు మరికొన్నిటికోసం...

    రిప్లయితొలగించండి
  24. నెమలికన్ను డాక్టరు గారికి, నమస్కారములు

    నేను తెలుగు వికీపీడియాలో పని చేస్తుంటాను. http://te.wikipedia.org
    ఒకమారు చూడగలరు.

    మీ బ్లాగులోను, "పుస్తకం"లోను, "నవతరంగం"లోను వగైరా ప్రచురింపబడుతున్న మీ సమీక్షలు (సినిమాలు, పుస్తకాల, నాటకాలు), వ్యాసాలు వంటివాటిని కొద్ది మార్పులతో వికీపీడియాలో వ్యాసాలుగా కూర్చే అవకాశం ఉన్నది. (అభిప్రాయాలను వదిలేసి, సమాచారానికి పరిమితం చేస్తూ)

    మీరే వికీపీడియాలో రచనలు చేసేయవచ్చును. లేదా మీరు అనుమతిస్తే మీ రచనా భాగాలను నేను వికీపీడియాలోకి కాపీ చేస్తాను. ఇందుకు మీ అనుమతి కోరుతున్నాను. అవి ఫలాని వెబ్‌సైటు నుండి తీసుకోబడినవని తప్పక వ్రాస్తాము.

    అయితే తెలుగు వికీలో ప్రచురించిన సమాచారం GFDL లైసెన్సుకు లోబడి ఉంటుందని, కనుక దానిని ఇతరులు వినియోగించుకొనే అవకాశం మెండుగా ఉన్నదని తప్పక గమనించగలరు.


    మీ జవాబును ఇక్కడ కానీ లేదా
    teluguwiki@yahoo.co.in లో గానీ వ్రాయగలరు.

    వందనములతో
    కాజ సుధాకరబాబు

    రిప్లయితొలగించండి
  25. @కొత్తపాళీ: డాక్టరు జాగింగ్ చేయడం పాత్రోచితంగా ఉంటుందని అనిపించింది అప్పట్లో :-) ..ధన్యవాదాలు.
    @భావన: అలా తీసుకోగలగడానికి ఎన్నో అనుభవాలు సహకరిస్తాయి.. కాదంటారా? ..ధన్యవాదాలు.
    @చిన్ని: నిజమేనండి.. సూర్యుడు యెంతో స్పూర్తినిస్తాడు. ..ధన్యవాదాలు.
    @Chaitanya: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @లక్ష్మి: ధన్యవాదాలు.
    @మధురవాణి: యాదృచ్చికంగా రాశానండి.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలు.
    @సుభద్ర: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. @Krishna Rajesh: నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాశానండి.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: ఎప్పుడో వెతికానండీ.. చెదలు పొట్టన పెట్టుకున్నాయి.. అయినా ఇన్నాళ్ళు ఉంటాయనుకోడం అత్యాశ లెండి.. ధన్యవాదాలు.
    @శ్రీ: టైపు చేయడానికన్నా, తప్పులు దిద్దడానికి ఎక్కువ టైం పట్టిందండి.. ధన్యవాదాలు.
    @పానీపూరీ123: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @సిరిసిరిమువ్వ: ఖజానా లేదు, ఏమీ లేదండి.. నేను పాఠకుడినే. ..ధన్యవాదాలు.
    @సునీత: ధన్యవాదాలు.
    @పరిమళం: ప్రశంస, మీ శైలిలో.. ..ధన్యవాదాలు.
    @Sujata: "శ్రీమతి అని చదివి మొదట జా డ్రాప్ అయింది" ..అసలు మీరు నా గురించి ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉందండీ.. (ఇలా అనిపించడం అంత మంచిది కాదని తెలుసనుకోండి :-)) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. @భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ చింతకింది: ధన్యవాదాలు.
    @తృష్ణ: శీర్షిక లోనే రేడియో రచన అని చెప్పాను కదండీ.. మళ్ళీ అనుమానం ఎందుకొచ్చింది? ..ధన్యవాదాలు.
    @వెంకటరమణ: యెంతో బాగా పరీక్ష రాసి, హాల్ టికెట్ నెంబర్ రాయడం మర్చిపోవడం వల్ల పరిక్ష పోగొట్టుకున్న వాళ్ళు నా సర్కిల్ లో ఉన్నారండి.. ఇది నేను రాసిన దాన్ని సమర్ధించుకోడం కాదు సుమా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  30. @మహిపాల్: ధన్యవాదాలు.
    @విజయ వర్ధన్: ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: టపాలు రాస్తున్నాను కదండీ.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. @భాస్కర్ రామిరెడ్డి: ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: ధన్యవాదాలు.
    @సుధాకర బాబు: మీకు మెయిల్ రాస్తానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. ఎందుకంటే నేను శీర్షిక చదవకుండా మీ టపాలూ చదువుతాను కాబట్టి :)

    రిప్లయితొలగించండి
  33. @తృష్ణ: కొత్త విషయం అండీ.. అన్నట్టు ఇది ప్రసారమైంది హైదరాబాద్ కేంద్రం నుంచి.. ధన్యవాదాలు.
    @లక్ష్మి: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి