శుక్రవారం, జులై 03, 2009

కథల కథ

తెలుగు సాహిత్యం లో మంచి కథల కొరత ఉందనే మాట ఈ మధ్య తరచూ వినిపిస్తోంది. సంఖ్యా పరంగా చాలా కథలే వస్తున్నా నాణ్యత పరంగా నిలబడే కథలు తక్కువే అనేది విమర్శకుల మాట. ఈమాట లోనూ నిజం ఉంది.. ఐదారు పత్రికలు తిరగేస్తే ఎక్కడో ఓ కథ 'పర్లేదు' అనిపిస్తుంది. ఒకప్పుడు నాణ్యమైన కథలకు పేరొందిన వార పత్రికలు, దిన పత్రికల ఆదివారం అనుబంధాలలో వస్తున్న కథలను చూస్తుంటే ఏదో మొక్కుబడిగా ప్రచురిస్తున్నారని అనిపిస్తోంది.

ఓ కథ రాయడానికి రచయితని ప్రేరేపించే అంశాలు ఏమై ఉంటాయి అని ఓ సగటు పాఠకుడిగా ఆలోచించినప్పుడు, నాకు తట్టిన జాబితా ఇది: పేరు, డబ్బు మరియు ఆత్మ సంతృప్తి. రచనా శైలి పదునెక్కాలంటే రచయిత తరచూ రాస్తూ ఉండాలి. చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఇందుకు చాలా సమయం వెచ్చించాలి. మొదటినుంచీ రచయితల నేపధ్యాలని పరిశీలిస్తే ఎక్కువమంది అధ్యాపక, పాత్రికేయ వృత్తుల నుంచి వచ్చిన వారు కనిపిస్తారు. మిగిలిన రంగాల వారు లేరని కాదు కాని, వీరి సంఖ్య ఎక్కువ.

మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా అన్ని రంగాలవారి జీవనాల్లోనూ వేగం పెరిగింది. పరుగు పందెం లో మొదట ఉండడానికే తొలి ప్రాధాన్యత. బ్రతుకు తెరువుకి చేపట్టిన ప్రధాన వృత్తి ఏమైనా సమయం మిగిలిస్తే అప్పుడు ప్రవృత్తి ఐన రచనా వ్యాసంగం గురించి ఆలోచన. కథా/నవలా రచననే పూర్తి స్థాయి వృత్తిగా చేపట్టే పరిస్తితులు ఇప్పుడు లేవు. రాయాలనే తపన ఉన్నప్పటికీ రచయిత కి తగినంత సమయం దొరకాల్సిన అవసరం ఉంది.. అప్పుడు మాత్రమే నాణ్యమైన రచనలు ఆశించడం సాధ్య పడుతుంది.

పత్రిక్కి రచన పంపడం, వాళ్ళు దానిని ప్రచురించడం, అది చదివి పాఠకులు ఉత్తరాలు రాయడం..ఇదంతా చాలా సమయం తీసుకునే వ్యవహారం. అదీ కాక, మీడియా బాగా విస్తరించిన నేపధ్యంలో తమతమ రంగాల్లో కృషి చేసి పేరు తెచ్చుకునే అవకాశం గతంలో కన్నా బాగా పెరిగింది. ఇంటర్నెట్ పత్రికలు, బ్లాగులు లాంటి ప్రత్యామ్నాయాల వైపు కూడా రచయితలు దృష్టి పెడుతున్నారు. గతంలో కొన్ని పత్రికలు మాత్రమే ఉండడం, కథలు కోరుకునే వాళ్ళు వాటిని చదవడం జరిగేది. ఇప్పుడు అలా కాక, మంచి కథ కోసం రకరకాల సోర్సులు వెతుక్కోవలసి వస్తోంది. దీనివల్ల కూడా ఒక్కోసారి మంచి కథ పాఠకులను చేరడంలో జాప్యం జరుగుతోంది.

రచయిత చేత మంచి కథ రాయించడానికి పారితోషికం ఒకప్పుడు స్ఫూర్తి నిచ్చేది.. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పత్రిక నుంచి కథ తాలూకు పారితోషకం తెచ్చే పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసే వాళ్ళట. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఇప్పుడు పత్రికలు ఇస్తున్న పారితోషికాలు కూడా ఏమంత ఆకర్షణీయంగా ఉండడం లేదు (పోటీలకు మినహా) 'వాళ్ళిచ్చే పారితోషికం కాగితాలు, పోస్టల్ ఖర్చులకి చాలదు' అన్నమాట వినిపిస్తోంది. కేవలం డబ్బు కోసమే రాస్తారనను కానీ, డబ్బు కూడా రాయడానికి స్పూర్తినిస్తుందన్నది నిర్వివాదం. ఈ పరిస్థితుల్లో బాగా రాయగలిగే రచయితలు కూడా ఇతరత్రా వ్యాపకాలలో ఆత్మ సంతృప్తి ని వెతుక్కుంటున్నారా? అన్న సందేహం కలుగుతోంది.

13 కామెంట్‌లు:

  1. nissandeham.

    ee koratha kathalalone kadhu, paatalalo kooda kanipisthondhi. okappudu paatalu vinte prasanthatha vachedhi. ippudu paatalu vintunte, dhvanulo horulo sahithyam kottukupoi, avedana miguluthondhi.

    రిప్లయితొలగించండి
  2. పరుగులు పెట్టే కాలంతో పాటూ మనమూ పరుగులు పెట్టే ఈ రోజుల్లో పత్రికలు కొన్నా కూడా,చదివే తీరిక ఎందరికి ఉంటోందండీ?అందుకే రాసేవారికి ఆసక్తి తగ్గిపొయి ఉంటుంది.అదీ కాక మానవతా విలువలు బొత్తిగా కొరవడిన ఇప్పటి సమాజంలో, పూర్వపు నైతిక విలువలతొనూ,ఏ కధకైనా వెనుక కనబడాల్సిన మెసేజ్ తోనూ రాసే రచయితలు చాల తక్కువయిపోయారు అని నాకనిపిస్తూ ఉంటుందండీ.

    రిప్లయితొలగించండి
  3. మంచి విశ్లేషణ. కానీ మీరు మంచుకొండ యొక్క ఉపరితలాన్ని మాత్రమే స్పృశించారు.
    రేగడివిత్తులు నవల వొచ్చినప్పుడు తానా వాళ్ళు లక్ష రూపాయలు బహుమతి ఇస్తే, తెలుగు నవలకి లక్షరూపాయలా అని నోరెళ్ళబెట్టారు జనాలు. అలాంటిది ఇప్పుడు స్వాతి వారపత్రిక సీరియల్ నవలల పోటీకి లక్షరూపాయల మొదటి బహుమతి ప్రకటించింది.
    కానీ మీరన్నట్టు పోటీలు మినహా పత్రికలకి సాధారణ ప్రచురణకి కథ పంపిస్తే ఏం పారితోషికం ఇస్తారో, అసలు ఇస్తారో లేదో అనుమానమే.
    ఏదేమైనా, ఈ విషయమ్మీద మీరు ఇంకొంచెం లోతుగా రాస్తే చదవాలని ఉంది.

    రిప్లయితొలగించండి
  4. నిజమే ! మీ విశ్లేషణ తో నేనూ ఏకీభవిస్తాను ....

    రిప్లయితొలగించండి
  5. @మోహనవంశీ: నిజమేనండి.. పాటలు.. అదో పెద్ద టాపిక్.. ...ధన్యవాదాలు.
    @తృష్ణ: రాయగలిగే వాళ్లకి కథా వస్తువుల కొరత ఉంటుందని నేను అనుకోడం లేదండి.. నా ఉద్దేశ్యం రచయితలకు ప్రోత్సాహం తగ్గడంతో వాళ్ళ ఉత్సాహమూ తగ్గుతోందని.. .. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: ఇది ప్రారంభం అండి.. రాయాలని నాకూ ఉంది.. ధన్యవాదాలు.
    @పరిమళం: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. మురళిగారు,
    నా మొదటి వాక్యం -- ప్రస్తుత పరుగుపందెపు జీవితాల్లో చదవటం తక్కువైపోయినందువల్ల ,రాసేవాళ్ళ ఆసక్తి కూడా తగ్గిపోయి ఉండచ్చు అని రాసాను.
    2)నేను రాసినది "మెసేజ్ తో" అంటే పూర్వంలా "సందేశాత్మకంగా" ఉండే కధలు తక్కువయిపోయాయి అని 'అంతేకాని రచయితలకి కధా వస్తువు కొరత ఉందని కాదండీ.
    కధలు,నవలలు చదివే ఆసక్తి,మారుతున్న కాలంతో వాటిల్లో వస్తున్న మార్పులు గమనించాను కాబట్టి ఈ వ్యాఖ్య రాసాను.(తెలియని విషయాల తాలూకు టపాలు,వాటి వ్యాఖ్యలకి నేను దూరమేనండీ!)

    రిప్లయితొలగించండి
  7. మీరు చెప్పిన్ది నెజమె....

    ఈ మధ్య నెను విప్లొవె అనె మెదిసిన్ స్తుదెన్త్ రసిన నవల చదివను తెలుగు పెఒప్లె లొ ...అద్బుతన్గ ఉన్ది .

    chala rojula taruvatha oka manchi novel chadivina feeling...

    aa author nunchi inka konni works vasthe baguntundi.. kani medical student.. sahityaniki ekkuva time spare cheyyalereanukuntanu....

    Eddanna evaru ayina rayali ante vari kosam vallu koncham time ni ketayinchagalagali... kani ee gaji biji bratukula parugulloo aa time and aaa sensitiveness redu undadam kastame...

    రిప్లయితొలగించండి
  8. @తృష్ణ: ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అండి.. మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమాపణలు.

    రిప్లయితొలగించండి
  9. @హరిప్రియ: ఆ లింక్ ఇవ్వగలరా? నాకూ చదవాలని కుతూహలం కలుగుతోంది. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. no sir dont say sorry.i just wanted to make my point clear.thankyou.

    రిప్లయితొలగించండి
  11. Manasasancharare... annna novel by viplove .. Telugu people site lo chadivanu Novels category lo... Ekkuva expectations tho start cheyyaddu... adi goppa novel kadu... kani naa manasuki nacchindi........

    రిప్లయితొలగించండి
  12. Inko vishayam..Naa lanti vallu books chadavali ante mundu velledi novels kee .. mana telugu lo novels ante mukyam ga gurthu vacche perlu yandamuri ... suryadevara ram mohan rao.. yaddanapudi...

    Na teens lo unnappudu nenu vella works chadivi chala inspire ayyanu.. nenu MBA cheyyadaniki oka vidhana Akshara yagnam ane suryadevararammohan rao novel..chala admiration undedi.. chala gorvavabhavam undedi oka Idol ga..

    Konni rojula taruvatha english novels chaduvutunte mana telugu novels makki translation ani ardam ayyindi .. enthaga badha paddannoo.. mana sahityam mana ingenious ness anukunnavi copy ani telise tappatiki... yandamuri and suryadevara idduru copy kottaru.. and naku yaddanapudi lo Jane austen vasanalu vasthayi..

    andaru ala ani kadu anii copy ani kuda kadu kani it hurt. Meeru evaranna machi authors ni suggest cheyygalara?

    రిప్లయితొలగించండి
  13. @హరిప్రియ: 'అక్షర యజ్ఞం' అప్పట్లో నాకు బాగా నచ్చిందండి..ముఖ్యంగా మౌనిక.. ఇప్పుడు తిరగేస్తుంటే అంత బాగా అనిపించడం లేదు.. ఇప్పుడు నవలలు తగ్గి, కథాసాహిత్యం పెరిగిందండీ.. నాకు నచ్చిన వాటి గురించి బ్లాగులో రాస్తూనే ఉన్నాను కదా.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి