అమ్మమ్మకి పిల్లిని పెంచే అలవాటు మొదటి నుంచీ ఉంది. ఆవిడ కాపురానికి వచ్చింది మొదలు, చివరి రోజుల వరకూ ఏదో ఒక పిల్లిని పెరుగు అన్నం పెట్టి సాకుతూనే ఉంది. ఆవిడ ఎప్పుడూ తను పెంచే పిల్లికి పేరు పెట్టాలనే విషయం పట్టించుకోలేదు. ఐతే, అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వీళ్ళంతా కలిసి పెంపుడు పిల్లికి 'బిస్సీ' అనే పేరు ఖాయం చేశారు. అది మొదలు పిల్లులు మారాయి కానీ, పేరు మారలేదు.
అమ్మమ్మ వారసత్వంగా అమ్మ పిల్లిని పెంచడాన్నీ, దాన్ని బిస్సీ అనే పేరుతొ పిల్చుకోడాన్నీ కొనసాగిస్తోంది. మా చిన్నప్పడు మేము వీధిలో కుక్కని పెంచితే అమ్మ పెరట్లో పిల్లిని పెంచేది. అమ్మ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ బిస్సీకి ఓ ప్రమాదం జరిగింది..నిజానికి దానిని హత్యాయత్నం అనాలేమో. ఆ ప్రమాదం పూర్వాపరాలు అమ్మ తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
అమ్మ వాళ్ళ ఏడుగురు అక్కచెల్లెళ్ళలో అందరికీ చిన్నదో, పెద్దదో పని ఉండేలా ఒక టైం టేబిల్ ఉండేది. ఈ టైం టేబిల్ ప్రకారం కొందరు వంటకి సాయం చేయడం, మరికొందరు ఇల్లు సర్దడం.. ఇలా పని విభజన ఉండేది. భోజనాలకి కంచాలు పెట్టిది ఒకరైతే, తీసేది ఒకరు. అమ్మమ్మ పిల్లలందరితో పాటు బిస్సీ కి కూడా భోజనం పెట్టేది, ఓ స్పెషల్ కంచంలో. బిస్సీ తన వాటా అన్నం తినేశాక, వీళ్ళని ఒక్కొక్కరినీ మ్యావ్ అని పలకరించి కనీసం పెరుగన్నం ముద్ద ఒకటైనా తన పళ్ళెంలో వేసే వరకూ విసిగించేది.
అమ్మ వాళ్ళ రెండో అక్కకి పిల్లి అంటే చిరాకు. అమ్మమ్మ మాటకి ఎదురు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో బిస్సీ ని భరించేది. ఒకరోజు భోజనాల దగ్గర పెరుగన్నం ముద్ద కోసం ఆవిడని విసిగించడం మొదలు పెట్టింది బిస్సీ. ఆవిడ సహనం కోల్పోయి చేతిలో ఉన్న ఇనుప అట్లకాడ గురిచూసి బిస్సీ మీదకి విసిరింది. అది కాస్తా వెళ్లి బిస్సీ మెడ కింద దిగడం, బిస్సీ రక్తపు మడుగులో కొట్టుకోడం, వీళ్ళ భోజనాలు మధ్యలో ఆగిపోడం క్షణాల్లో జరిగిపోయాయి.
"పిల్లిని చంపిన పాపం గుడి కట్టించినా పోదు" అన్న మాట వింటూ పెరిగిందేమో, ఆవిడ షాక్ తింది. తాతగారు ఆయుర్వేద వైద్యం చేసే వారు కానీ సమయానికి ఆయన ఊళ్ళో లేరు. అమ్మ వాళ్ళ మూడో అక్క బాగా ధైర్యస్తురాలు.. తను తాతగారికి వైద్యంలో అసిస్టెంట్ కూడా.. మిగిలిన పిల్లలందరికీ ధైర్యం చెప్పి, ఆవిడ బిస్సీకి వైద్యం మొదలు పెట్టింది. అట్లకాడ బలంగా లాగి, పసర్లు పోసి కట్టు కట్టింది. అమ్మమ్మ పాలు పట్టుకొచ్చి బిస్సీచేత తాగించే ప్రయత్నం చేసింది.
ఐతే ఈ వైద్యురాలు ఏపని చేసినా "నాకేంటి?..అహా..నాకేమిటీ?" అనే రకం. బిస్సీకి ప్రధమ చికిత్స అవగానే బేరం మొదలు పెట్టేసింది. అసలే షాక్ లో ఉందేమో, రెండో అక్క కండిషన్లన్నీ ఒప్పేసుకుంది. ఆ ప్రకారం, బిస్సీకి నయమయ్యేంత వరకు మూడో అక్క వైద్యం చేసేటట్టు, ఇందుకు ప్రతిగా ఆవిడ వాటా పనంతా ఈవిడే చేసేట్టూ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమ్మమ్మకి తెలియకూడదన్న మాట.
పనన్న మాటేమిటి, తన వంటిమీద బంగారం ఇమ్మన్నా ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉంది రెండో ఆవిడ. "నావల్ల బిస్సీ చనిపోయింది..గుడి కట్టించండి నాన్నగారూ.." అని అడగలేదు కదా. పగలు ఇద్దరు మనుషుల పని, రాత్రి నిద్రపోకుండా బిస్సీ కి కాపలా.. ఇలా పది రోజులు కష్టపడిందిట ఆవిడ. ఆవిడ కష్టం ఫలించి బిస్సీకి నయమయ్యింది. అది మొదలు ఆవిడ ఎవరిమీదా చేయి చేసుకోలేదు.
> అమ్మ వాళ్ళ రెండో అక్కకి
రిప్లయితొలగించండి> అమ్మ వాళ్ళ మూడో అక్క బాగా ధైర్యస్తురాలు.
వాళ్లను మీరు అలానే పిలుస్తారా?
సామాన్యంగా ఆమ్మా/పెద్దమ్మ/దొడ్డమ్మ/అమ్మక్క అని పిలుస్తారు కదా?
చిన్నప్పుడు చరిత్రలో ఒకటో లూయీ, రెండోలూయీ ఇలా మీ ఇంట్లోకూడా బిస్సీలకు క్రమసంఖ్య పెట్టుండాల్సింది. మొత్తానికి కధ సుఖాంతమైంది.
రిప్లయితొలగించండిgood narration.
రిప్లయితొలగించండిబాగుందండి మీ బిస్సీగారి కథ
రిప్లయితొలగించండిమా చిన్న మావయ్య ఇలాగే పిల్లుల్ని పెంచే వారు. కానీ ఒకసారి వాటి ద్వారా సంక్రమించిన చర్మ వ్యాధి నయమయేసరికి జంగారెడ్డి గూడెం ప్రాంతాలనుండి కోయదొరలు దిగిరావాల్సివచ్చింది. దాంతో జడిసి పిల్లులు మాయం. ఈ మధ్య మా వదిన గారి పాప ఓ బుల్లి పిల్లిని పెంచుతుంది. అమెరికా పిల్లి కదా మరీ అపురూపం ఆ "సింబా" గాడు. మా స్నేహకి [ఇది నా బంగారు పాప ;)] ప్రేమ ఎక్కువై వొళ్ళో పెట్టుకునే ప్రయత్నం చేసింది, వాడు కాస్తా ఓ గీరు గీరి దూకి పారిపోయాడు. ఈ దెబ్బతో ఎపుడో రెండేళ్ళకొకసారి తన రక్తం కళ్ళ చూసుకునే నా చిన్నారి బేజారెత్తిపోయి ఇక "పెట్ కావాలి మామీ" అని అడగటం మానేసింది. "అమ్మా! నాకు భయం" అని కొత్త పాట మొదలుపెట్టింది. కనుక పిల్లులందరికీ నా వందనం.
రిప్లయితొలగించండిchaalaa baagundi.
రిప్లయితొలగించండిమురళి గారూ ! మా అమ్మమ్మ కూడా పిల్లుల్ని పెంచేది . పెంచడమంటే మీ అమ్మమ్మ గారిలాగానే పెరుగన్నం ...ఇంకా చేప ముళ్ళు , తల ...లాంటివి పెట్టేది . అందరికీ పెట్టేసి ఆఖర్న తినేది అమ్మమ్మ ...ఎక్కడ పొంచి ఉండేవో అప్పటివరకూ అమ్మమ్మ చుట్టూ తిరిగేవి భోజనం అయ్యి వాటికి పెట్టేంతవరకూ .మీ బిస్సీ కబుర్లతో చాలాఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు.
రిప్లయితొలగించండితాతయ్య అన్నం తినే ముందు ఒక ముద్ద దేవుడికి పెట్టేవారు.అమ్మమ్మ ఏమో నాలుగు ముద్దలు పిల్లి కోసం పక్కకు పెట్టేది.ఆ రెండూ కలిపి పిల్లిగారు స్వాహా చేసేవారు.ఏరోజన్నా అన్నం వండడం లేటయినప్పుడో,తినడం లేటయినప్పుడో మియ్యావ్ మియ్యావ్ మియ్యావ్ మియ్యావ్ అంటూ ఎదవ గోల :) అన్నం పట్టుకు వస్తూవుంటే మీద మీదకి వచ్చేసేవి.అప్పుడు భలే చిరాగ్గా వుండేది.కానీ ఇప్పుడు తలుచుకుంటే భలే వుంది.
రిప్లయితొలగించండిబాగుంది సార్ మీ బిస్సీ కద... పేరు చిత్రం గా భలే ఉంది ఎవరి ఐడియానో కానీ.
రిప్లయితొలగించండి@పానీపురి 123: ఇంట్లో మేము పిల్చుకునే పేర్లు రాస్తే చాలా కన్ఫ్యుసింగ్ గా ఉంటుందని ఇలా రాస్తున్నానండి.. సులభంగా అర్ధం కావడం కోసం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య: మంచి ఆలోచన..మాకెవరికీ రాలేదండి.. ధన్యవాదాలు.
@తృష్ణ: ధన్యవాదాలు.
@నాగ: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఉష: నాకెందుకో అనిపించిన్దండీ.. మీరీ టపా చదివితే మీ అనుభవాన్ని పంచుకుంటారని.. మొత్తానికి పిల్లులందు ఫారిన్ పిల్లులు వేరంటారు :-) ..ధన్యవాదాలు.
@సునీత: ధన్యవాదాలు.
@పరిమళం: మా అమ్మమ్మ పిల్లలతో పాటే పిల్లికీ భోజనం పెట్టేదండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రాధిక: నవ్వించారండీ మీ వ్యాఖ్యతో.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..
There seem to be the 18 puranas to be told about your aunts! Keep them coming!!
రిప్లయితొలగించండి@కొత్త పాళీ: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిహమ్మయ్యా..మొత్తానికి ఎలాగో బిస్సీని బ్రతికించారన్నమాట.!
రిప్లయితొలగించండిబిస్సీ పేరు భలే బాగుందండీ. మా నాన్నమ్మ వాళ్ళింట్లో కూడా ఎప్పుడూ పిల్లులు తిరిగేవి. వీళ్ళు కంచంలో అన్నం పెట్టుకునే సమయానికల్లా ఎక్కడున్నా వచ్చేసి మ్యావ్ మ్యావ్ అని అక్కడక్కడే తిరుగుతుండేవి.
ఆ కాలంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా, అందరూ చక్కగా తలో పనీ అందుకునే వారు మీ అమ్మా వాళ్ళలాగా. ఈ కాలంలో అయితే.. ఇంట్లో పనంటూ చేస్తే అమ్మ.. లేదా పనిమనిషి అంతే.!
@మధురవాణి: బహుశా ఏ 'బుస్సీ దొర' పేరు నుంచో వచ్చి ఉంటుందండీ.. కొంచం పరిశోధన చేయాలి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి