"నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల.." డయలర్ టోన్ వినిపిస్తోంది.. ఫోన్ ని చెవికి మరికొంచెం దగ్గరగా లాక్కుని, ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చాను. కాల్ కట్ చేద్దామా? అనిపించింది ఒక్క క్షణం. కానీ అవతలి గొంతు వినాలన్న కుతూహలం నన్ను ఆ పని చెయ్యనివ్వ లేదు. నెల్లాళ్లుగా నిత్యం వింటున్న గొంతే..కాకపొతే 'గోపి గోపిక గోదావరి' పాటల రూపంలో.. ఇప్పుడు సంభాషణ ఎలా ఉంటుందో?
ఇలా ఆలోచించడానికి సరిగ్గా గంట క్రితం 'ఈనాడు' తిరగేస్తూ సినిమా పేజి దగ్గర ఆగిపోయాను.. గోదారి ఫోటో పెద్దది.. పక్కనే నవ్వుతున్న వంశీ. 'మా గోదారి తల్లి' అని హెడ్డింగ్. గబగబా చదివేశాను. చివరికి వచ్చేసరికి ఒక్కసారిగా ఓ శీతల పవనం నన్ను బలంగా తాకి వెళ్ళిన అనుభూతి. గోదారితో నాకెలాంటి అనుబంధం అని ఒక ఫ్రెండు చాలా రోజుల క్రితం అడిగినప్పుడు "గోదారి నాకు, అమ్మ, సోదరి, స్నేహితురాలు, ప్రేయసి, అన్నీ.." అని చెప్పాను కించిత్ పరవశంగా.. ఇప్పుడు అదే వాక్యం వంశీ అక్షరాలలో.. యెంత యాదృచ్చికం!
ఫోన్ తీసుకుని మిత్రులందరికీ సంక్షిప్త సందేశాలు పంపడం మొదలు పెట్టాను..ఈ ఆర్టికల్ చదవడం మిస్ కావొద్దని.. అరగంట గడిచిందో లేదో ఒక మిత్రుడి నుంచి ఫోన్.. గోదారి మిత్రుడు.. "అంత నచ్చిందా?" అంటూ మొదలు పెట్టి "వంశీ కి స్వయంగా చెబుతావా?" అని ప్రతిపాదించి నన్ను ఆశ్చర్య పరిచాడు. 'ఇది నిజమేనా?' అని నేను సందేహిస్తుండగానే..ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడంతో పాటు "ఇది ఎవరికీ ఇవ్వొద్దు" అన్న కండిషన్ కూడా వినిపించింది అవతలి నుంచి. తను తరచూ ఫోన్ నంబర్లు మార్చేస్తూ ఉంటానని వంశీ అప్పుడెప్పుడో సాక్షి 'డబుల్ ధమాకా' లో చెప్పిన విషయం గుర్తొచ్చింది.. సందేహిస్తూనే డయల్ చేశాను.
"నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల.." పాట కొనసాగుతోంది. "ఇంకా నిద్ర లేవలేదా.. ఏదైనా పనిలో బిజీ గా ఉండి ఉండొచ్చా?" నా ఆలోచనల్లో నేను ఉండగానే "హలో" అని వినిపించింది. ఏం మాట్లాడాలి? బుర్రంతా శూన్యం. "వంశీగారేనా అండి?" నా గుండె గొంతులోకి వచ్చినట్టుగా..నా గొంతులో ఉద్వేగం నాకే వినిపిస్తూ... "అవునండీ.." ఆగొంతులో గోదారి గలగలలు. 'మాట్లాడు..మాట్లాడు' అని నా సెన్స్ ఏదో నన్ను తొందర పెడుతోంది. "నా పేరు మురళీ అండీ.." గోదారి యాస వచ్చేసింది గొంతులోకి. "ఈనాడు లో మీ ఆర్టికల్ చదివానండీ.. మీ సినిమాలన్నీ ఒకేసారి చూసినట్టు అనిపించింది.."
నేను మాటలకోసం వెతుక్కునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ అవతల నాతో మాట్లాడుతున్నది 'మహల్లో కోకిల' ని 'సితార' గా మలచిన స్రష్ట.. 'ఆకుపచ్చని జ్ఞాపకా'లు పూయించిన కథా వనమాలి. ఏం మాట్లాడాలి? అదీ ఫోన్లో? "థాంక్యూ అండీ.." అని వినిపించింది.. ఉన్నట్టుండి నాలో సినిఅభిమాని నిద్రలేచాడు.. "రేపటి సినిమా ఎలా ఉంటుందండీ?" అడిగాను 'గోపి గోపిక గోదావరి' గురించి. తనా కమిటయ్యేది? "చూడాలండీ.." అని సమాధానం. సంభాషణ ఎలా? ఎదురుగా ఉన్న పేపర్ వైపు చూశాను. 'మా గోదారి తల్లి' కనిపించింది.
"కొండూరి రామరాజు గారు మీ రచనలు చాలా వాటిల్లో కనిపిస్తారు.. క్లోజ్ ఫ్రెండా అండి?" అడిగాక కానీ అర్ధం కాలేదు, అదెంత అర్ధం లేని ప్రశ్నో. "అవునండీ...బాగా.." జవాబు వచ్చింది. "మీరిది ఎప్పుడు రాశారు?" అడుగుతున్నానే కానీ మాట్లాడుతున్నది వంశీ తో అన్న భావన నన్ను నిలవనివ్వడం లేదు. "మొన్న రాత్రి రాశానండి.." మొన్నరాత్రి? అంత పాత విషయాలు? "అంటే పాత డైరీ రిఫర్ చేశారా?" పర్లేదు నా బుర్ర పనిచేస్తోంది. "లేదండి..నాకు ఎప్పటి విషయాలైనా గుర్తుంటాయి.. ఎప్పుడు కావాలంటే అప్పుడే గుర్తు తెచ్చుకుని రాసేస్తాను.."
"అంటే మా పసలపూడి కథలు కూడా అలా రాసినవేనా?" నా మనసులో సందేహం గొంతు దాటి వచ్చేసింది.. అటు నుంచి చిన్నగా నవ్విన సవ్వడి. "అవునండీ..అలా రాసినవే.." చిరునవ్వు కొనసాగింది. "అంటే ఆ మనుషులు.. వర్ణనలు..అన్నీ.." తడబాటు తగ్గి కొంచం ఫ్రీ అయ్యాను. "అవునండీ..అన్నీ.." మళ్ళీ అదే నవ్వు. "అందుకే మీరు అక్కడున్నారు.." నా మనసులోమాట నా ప్రమేయం లేకుండానే నోటివెంట వచ్చేసింది. "థాంక్యూ మురళిగారూ.." తన గొంతు నుంచి నా పేరు.. ఆ గొంతులో హడావిడిని గమనించాను.
"రేపటి సినిమా కోసం ఎదురు చూస్తున్నానండి...ఉంటాను.." చెప్పేశాను..మరో "థాంక్యూ.." వినిపించింది అవతలి నుంచి. ఓ ఐదు నిమిషాలు అలాగే కూర్చుని సంభాషణ మొత్తం గుర్తు చేసుకున్నాను.. "వంశీ ఎవరితోనూ సరిగా మాట్లాడడు.." లాంటి కబుర్లన్నీ రూమర్లే అన్నమాట. నాకు నెంబర్ ఇచ్చిన మిత్రుడికి ఫోన్ చేసి సంభాషణ మొత్తం రికార్డు వేశాను. "థాంక్యూ వెరీ మచ్.. ఇవాల్టి రోజును నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను.." చెప్పాను తనకి.
ఓహ్!! వంశీ గారితో మాట్లాడారా!!!! నేను ప్రొద్దున్న పేపర్ లో ఆ ఆర్టికల్ చదివాను.. చాలా బావుంది..
రిప్లయితొలగించండిnice..
రిప్లయితొలగించండిgreat..meeru cheppina vidhanam chala nachindi
thats very great అండీ.వంశిగారి సినిమాల్లో నేను చూడనిది లేదేమో.."గోపి,గోపిక.."లో ఆ ఒక్క పాటే నాకు నచ్చిందండీ.దౌన్లోడ్ చేసి నెలపైనే అవుతోంది..ప్రస్తుతం గత రెండు రోజులుగా "మా పసలపుడి కధలు" రెండవసారి తిరగేస్తున్నాను.
రిప్లయితొలగించండిసినిమాల కంటే వంశీ "పసలపూడి" కధలే నాకు బాగా నచ్చుతాయి. ఐనా సినిమాల్లోనూ అతనిది సెపరేటు బాణీ. ఈనాడులో అతని ఇంటర్వ్యూ నేనూ చదివాను.
రిప్లయితొలగించండిమురళీ లక్కీ గురూ నువ్వు...
రిప్లయితొలగించండి"లాంచీ లోంచి ఎటు చూసినా ఎత్తయిన పాపికొండలే.ఆ కొండల మధ్య సన్నటి గోదారి తల్లి.ధవిళేశ్వరం దగ్గర 3 కిలోమీటర్లుండే గోదారి ఇక్కడ కన్నెపిల్ల జడలాంటి సన్నటి గోదారైంది.ఈ గోదారి నాకు నాకు రకాల మూలల్లో రకరకాలుగా ఒక తల్లిలా,ఒక చెల్లిలా,ఒక ప్రేయసిలా,ఒక సోదరిలా,ఒకే కాలంలో ఒకే బంధంలా అందంగా కనిపిస్తుంది.ఈ గోదాట్లో వరద నీరూ,బురదనీరు,తేటనీరూ,ఊటనీరూ,నిలవనీరూ,పారేనీరూ,అన్నీ...అన్నీ నాకు పవిత్రమే అన్నీ నాకు సచిత్రమే..."
వాహ్ వాటే ఫీలింగ్ గురూ...
"అందుకే నాకనిపిస్తుంది...తల్లి గోదావరి నాకు పరిచయమవ్వడం గత జన్మ సుకృతం.ఈ పరమ పవిత్రమయిన గోదావరి తీరంలో చివరి దాకా ప్రయాణం చేయాలని"
జన్మ ధన్యమయిపోయింది కదా...
మురళీ గారూ ! గోదావరి అంటే నాకూ ఒళ్ళు తెలీదు . వంశీ గారితో మీరు మాట్లాడినా నేనే మాట్లాడిన అనుభూతి ! మీ మధురమైన క్షణాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు .
రిప్లయితొలగించండివంశీ గారి గురించి మీ పొస్ట్ చదివి చాలా సంతోషం కలిగింది. వంశీగారు ఎవరితోను సరిగా మట్లాడరు అనడం నిజంగా అపోహ మాత్రమే.ఇంతకముందు నేను మట్లాడినపుడు సరిగ్గా మీలాగే అనుకున్నాను.
రిప్లయితొలగించండిBEautiful.
రిప్లయితొలగించండిమాటల్లో పట్టుకోలేని, మనసంతా నిండిపోయే ఒక గొప్ప అనుభూతి ఉంది ఈ టపాలో.
thank you for sharing that with us.
మురళి గారు,
రిప్లయితొలగించండిమీ ఆనందం టపా ప్రతీ వాక్యంలో కనిపిస్తుంది. అన్నట్టు పసల పూడి కధలు లోని పాత్రల గురించి ఏమైనా టపా రాయకూడదూ ( ఇది వరకు ఏమైనా రాశారా? )...పుస్తకం మొత్తం చదవలేని నాలాంటి బద్దకస్తుల కోసం...
వంశీ గొప్ప కళాకారుడు.
రిప్లయితొలగించండిఆయనంకుండే లక్షలాది పిచ్చి అభిమానుల్లో నేనొకడిని.
ఆయన యానంలో ఉండే రోజుల్లో (వైఫ్ ఆఫ్ వరప్రసాద్ సినిమాతరువాత వచ్చిన గాప్ లో చాన్నాళ్లు యానంలో గడిపారు) వారిని యానంలో కొద్ది సార్లు కలవటం ఒక అదృష్టం.
ఆయనెంత ముభావో అంతే గలగలా పలికే గోదారి.
he is a dreamer in flesh and blood.
bolloju baba
అన్నాయ్
రిప్లయితొలగించండినువ్వు కేక.
వంశీ అనేకాదు అలాంటి నేటివిటికి దగ్గరగా ఉంటూ క్రియేటివిటి కలిగిన ఎవ్వరితో మాట్లాడినా అంతే ఫీల్ అవుతుందేమో.
నేనూ పేపర్ లో చదివా.. బాగుంది.
రిప్లయితొలగించండిమాట్లాడారా :)
ఎంత చక్కటి అనుభూతండి. వంశీగారితో క్షణాలైనా చాలు గోదారి గల గల ఉన్నంతకాలం పదిలంగా మనసులో భద్రపరుచుకోడానికి. అభినందనలు మురళీగారు.
రిప్లయితొలగించండిఆత్రేయపురం గోదారి గట్టున మేము చిన్నపుడు ఆడుకొన్న రోజులన్నీ గుర్తుకు వచ్చి. . కొంచెం బాధ వేసింది.. ఆనందంతో కూడిన బాధ. ఆర్ద్రతతో నిండిన హృదయం. దాన్ని ప్రతిఫలించే కళ్లు.. ఇప్పుడీ కాంక్రీటు అరణ్యాలలో మాట్లాడే జంతువులులాగా వుంటున్నాము.
రిప్లయితొలగించండిగుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
వంశీ గారూ మీరూ నేనూ ఒకేలాంటి పారవశ్యం లో వున్నాము.నా చిరకాల కోరిక మొన్న నెరవేరింది.తానా సభ లో సిరివెన్నెల గారి కోసం డే పాస్ తీసుకుని వెళ్ళి మరీ కలిసాను.ఆటోగ్రాఫు తీసుకున్నా.ఫొటో గ్రాఫు కూడా.కానీ ఒక్క మాట కూడా మాట్లాడ లేకపోయా.ఆయన్ని కలిస్తే ఏవేవో మాట్లాడాలని ఎన్ననుకున్నానో.ఆయనకి ఒక పెన్ ఇవ్వాలని లేదా ఆయన పెన్ అడిగి తీసుకోవాలని చిన్నప్పటి నుండి అనుకున్నాను.కానీ అనుకోకుండా వెళ్ళినందువల్ల నేను పెన్ కొనలేకపోయా.ఆయన దగ్గర పెన్ లేకపోవడం వల్ల తీసుకోలేకపోయా.
రిప్లయితొలగించండిపసలపూడి కధలు నాకు ప్రాణం.నా ఆల్ టైం ఫేవరెట్.
కనగంటి కనగంటి.......మీ నెమలికంట ఆనందాన్ని కనగంటి!!!
రిప్లయితొలగించండిఅద్భుతం మురళి గారు... నేనూ ఆయన అభిమానినే అని ప్రత్యేకంగా చెప్పటం నేనూ గాలి పీలుస్తాను అని చెప్పడం లాటిదేమో !! ఆయన అభిమాని కానిదెవరు చెప్పండి. మీరు మాట్లాడటం నిజంగా అదృష్టం. ఎప్పటికీ గుర్తుండే రోజు.
రిప్లయితొలగించండిమురళి గారు, మొదటిపేరా చదివి ఏదో షాడో కథ చెప్తున్నాదనుకుంటే, తీరా పసలపూడి వంశీ గారితో మాట్లాడించారేమిటండీ.. అదృష్టం ముందు కాళ్ళకు తగలడమంటే ఇదేనేమో.. బాగుందండీ.
రిప్లయితొలగించండిhmm enta kakataaliyamo chudandi... meeru dipa shika kathala mida rase samayaniki.. nenu illeramma garini kalisa... (avida america TANA sabhalaki vacharu)... miru vamsi gari gurinchi rase samayanaiki nenu vamsy garito phone lo ne unna... nenu GGG gurince matladutunna....
రిప్లయితొలగించండిjivitam chitramainadi sumandi...
మురళీ గారు చాలా అదృష్టవంతులు మీరు.. శేఖర్ పెదగోపు గారు పసలపూడి కధలు చదవాలి తప్ప దాన్ని ఒకరు చెప్తే వింటే అర్ధం కాదు.. అసలా పల్లె వాతావరణం వర్ణణలు చదివితే హ్మ్మ్మ్ ఎందుకులేండి ఊరించడం మీరు నెట్లో మా పసల పూడి కధలు ఒక మారు ప్రయతించాల్సిందే :)
రిప్లయితొలగించండిచాలా జలసీ గా వుంది మురళి మీ మీద .......అది యాద్రుచికమో ఏమో ,నిన్న నా ఆఫీసు పని మీద కాకినాడ వెళ్తూ ...నాకు ఇష్టమైన 'పసలపూడి' మీదుగా వెళ్లాను ....ఊరు మొదలైనపుడు నుండి ప్రతి చెట్టు పుట్టలో వంశి ని చూసాను
రిప్లయితొలగించండిఊపిరి బిగపట్టి మరి. అంతక్రితమే ఈనాడులో చదివి గౌతమీ పాయలో ఇసకే నీరేలేదా అనుకుంటూ .....వంశి మొత్తం ఇసుక చూస్తే ఏమనుకుంటాడో అనుకున్న .దాన్ని కూడా చాల అధ్బుతంగా సమర్దిస్తారని తెలుసు .. చాలా జలసీ గా వుంది మురళి మీ మీద .......అది యాద్రుచికమో ఏమో ,నిన్న నా ఆఫీసు పని మీద కాకినాడ వెళ్తూ ...నాకు ఇష్టమైన 'పసలపూడి' మీదుగా వెళ్లాను ....ఊరు మొదలైనపుడు నుండి ప్రతి చెట్టు పుట్టలో వంశి ని చూసాను
ఊపిరి బిగపట్టి మరి. అంతక్రితమే ఈనాడులో చదివి గౌతమీ పాయలో ఇసకే నీరేలేదా అనుకుంటూ .....వంశి మొత్తం ఇసుక చూస్తే ఏమనుకుంటాడో అనుకున్న .దాన్ని కూడా చాల అధ్బుతంగా సమర్దిస్తారని తెలుసు ..
@మేధ: అవునండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@హరేకృష్ణ: ధన్యవాదాలు.
@తృష్ణ: మొన్ననే పసలపూడి మరో సారి చదవడం పూర్తి చేశానండి.. ధన్యవాదాలు.
@సునీత: నిజమేనండి.. సెపరేటు బాణీ.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: నిజమే.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@పరిమళం: ధన్యవాదాలు.
@రఘు: ధన్యవాదాలు
@కొత్తపాళీ: నా అనుభూతిని పట్టుకున్నారు ..ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: నేస్తం గారు చెప్పినట్టు మీరు చదివితేనే బాగుంటుందండి.. నేనింకా రాయలేదు.. రాసే ఆలోచన ఉంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బొల్లోజు బాబా: చాలా చక్కని అనుభూతులు మీ సొంతం అయి ఉంటాయండి.. ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
@చైతన్య.ఎస్ : అవునండీ..మాట్లాడాను..ధన్యవాదాలు.
@రమణి: నిజమేనండి..నేనిప్పుడు అదే స్థితిలో ఉన్నాను.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మూర్తి.డి.వి.ఎస్: బాల్య మిత్రులన్నమాట! ..ధన్యవాదాలు.
@రాధిక: నిజమేనండి.. ముందు చాలా ప్లాన్ చేసుకుంటాం కానీ.. ఆ టైం కి మాట్లాడలేం.. ధన్యవాదాలు.
@పద్మార్పిత: వ్యాఖ్య కూడా మీ శైలి లో.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నిజమేనండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భాస్కర్ రామిరెడ్డి: అదృష్టం ముందు కాళ్ళకి తగలడం.. భలే చెప్పారండి.. ధన్యవాదాలు.
@శ్రీ అట్లూరి: నిజమేనండి.. చాలా చిత్రమైనది.. నా మాటలు వంశీ అక్షరాలలో కనిన్పించినప్పుడు నేను ఇలాగే అనుకున్నాను. ధన్యవాదాలు.
@నేస్తం: చదవాల్సిందేనండి.. నేనూ అదే చెప్పా శేఖర్ గారికి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: పసలపూడి వెళ్ళారా? ఐతే టపా కోసం ఎదురు చూస్తూ ఉంటాం.. చూశారా ఎందరు ఉన్నారో ఇక్కడ.. ధన్యవాదాలు.
మురళి గారూ!
రిప్లయితొలగించండిమీ టపా లేటుగా చూశాను.‘ఈనాడు’లో వంశీ రాసిన ఆర్టికిల్ ఆ రోజే చూశాను.
వంశీ తో మీ సంభాషణ క్షణాలను చాలా బాగా రాశారు. అభినందనలు!
@వేణు: మీరు ప్రత్యక్షంగానే కలిశారనీ, ఉత్తరాలు రాశారనీ మీ బ్లాగులో చదివానండి.. ఎప్పటికైనా ఆ వివరాలు రాయకపోతారా అని ఎదురు చూస్తున్నా.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండివంశీతో మాట్లాడినప్పటి మీ ఉద్వేగం, సంతోషం మీరు రాసిన ప్రతీ అక్షరంలో కనిపించాయి.
ఒక చక్కని అనుభూతిని మాకు కూడా పంచినందుకు ధన్యవాదాలు.
ఈనాడులో వంశీ ఆర్టికల్ నేను కూడా చదివాను. చాలా బావుంది.
ఎప్పుడోకప్పుడు 'పసలపూడి కథలు' చదవాలని చాలా కోరికగా ఉంది.
అదొక్కటే కాదు లెండి. ఇండియా రాగానే మీ లైబ్రరీ మీద దండయాత్ర చేసి మీ పుస్తకాలన్నీ చదవాలని కూడా అనిపిస్తుంది మీ పోస్టులు చదివినప్పుడల్లా ;)
@మధురవాణి: కథా రచయిత్రి కి స్వాగతం. 'మా పసలపూడి కథలు' తప్పక చదవండి.. కొన్ని కథలు చాలా బాగున్నాయి (అన్నీ కాదు సుమా..) ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమా పసలపూడి కథలు సీరియల్ గా వచ్చినప్పటినుండి చదువుతూనే ఉన్నాను (ఇప్పటికీ అప్పుడప్పుడు :)
రిప్లయితొలగించండినాకు నచ్చుతూనే ఎందుకో కొంత హైరానా పెడతాయి ఆ కథలు. ఆ కథల్లో తెలియని ఏదో పెయిన్.. :(
ఆయన రచనలు హాయిగా చదివిస్తూనే ఏడిపిస్తూ ఉంటాయి..నిజంగా ఈయన శాడిస్టు అనుకుంటా చదువుతూ చదువుతూ...
"కథల్లో తెలియని ఏదో పెయిన్.. :(
రిప్లయితొలగించండిఆయన రచనలు హాయిగా చదివిస్తూనే ఏడిపిస్తూ ఉంటాయి..నిజంగా ఈయన శాడిస్టు అనుకుంటా చదువుతూ చదువుతూ.." 200% agree with u ramya garu
@రమ్య, రాధిక: మీ ఇద్దరితో నేను ఏకీభవిస్తున్నానండి.. ఇద్దరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి