చాలా మంది చిన్నపిల్లలకి పక్క వాళ్ళ దగ్గర ఏముంటే అది తమ దగ్గర కూడా ఉండాలనీ, వాళ్లకి జరిగిన ముచ్చట్లు తమకీ జరగాలనీ అనిపిస్తుంది. ఇందుకు నేనూ మినహాయింపు కాదు, చిన్నప్పుడు. బొమ్మలో ఆటవస్తువులో ఎవరి దగ్గరైనా చూశానంటే వాటిని ఏదోలా కొనిపించుకునేందుకు ప్లాన్లు వేసే వాడిని. పెళ్లి ఊరేగింపులు చూసినప్పుడల్లా నాకూ పెళ్ళైతే బాగుండును అనిపించేది.. కాకపొతే బయటికి చెప్పే వాడిని కాదు. పేక బెత్తం తో నాకెప్పుడూ నిత్య కళ్యాణమే కదా!
మా ఇంట్లో మా బామ్మ (నాయనమ్మ) కీ తేలుకీ అవినాభావ సంబంధం. ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నట్టుండి ఆవిడ 'కెవ్వు' మని అరిచేది. అమ్మ ఇంట్లో ఏమూల ఉన్నా వెంటనే పరుగున వచ్చేది. బామ్మ తనకి తేలు కుట్టింది అని చెప్పడం ఆలస్యం, అమ్మ ఓ పాత చెప్పునో ఒంటరి పాంకోడునో వెతికి తెచ్చేది. మా ముత్తాత వాళ్ళ నాన్నగారి పాంకోళ్ళ జతలో తాతయ్యకి మిగిలిన ఆస్తి ఈ వంటరి పాంకోడు. పాత చెప్పు దొరకని సందర్భాలలో ఈ పాంకోడు దొరకబుచ్చుకునేది మా అమ్మ.
బామ్మని అలా దీర్ఘాలు తీయనిస్తూనే, చెప్పు చేత్తో పట్టుకుని 'కోడు..కోడు..కోడు..' అని కూతపెడుతూ తేలుని వెతికి చంపేసేది అమ్మ. 'కోడు..కోడు' అంటే పరిగెడుతున్న తేలు కూడా ఆగిపోతుందిట. చచ్చిన తేలుని అవతల పారెయ్యడానికి లేదు. దానిని ఓ పాత సిల్వర్ ప్లేట్ లోపెట్టి ముందు గదిలో పెట్టేది. అంతేనా, అక్కడ బామ్మకో మడత మంచం వాల్చేది. నేనీలోగా మా పెరట్లో కొబ్బరి తోట సరిహద్దులో ఉన్న శాయమ్మ గారింటికి పరిగెత్తే వాడిని.
శాయమ్మ గారు బామ్మకి ఇష్టసఖి. రెండు రోజులకోసారైనా వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఆవిడకి తేలు మంత్రం వచ్చు. మంత్రం వేయడానికి రమ్మని ఆవిడకి కబురు చెప్పి ఇంటికి వచ్చేసరికి, ఆసరికే బామ్మ ఏడుపు విన్న ఒకరిద్దరు పరామర్శకి వచ్చేసేవాళ్ళు. వాళ్లకి ఆ చచ్చిన తేలుని చూపించి ఎంత గట్టిగా కుట్టిందో వర్ణించి చెప్పి బాధ పడేది బామ్మ.
ఇంట్లో అమ్మది మరో రకం బాధ.. తేలు కుట్టింది కాబట్టి బామ్మ ఇంకా ఆ పూటకి ఇంట్లో పని చేయలేదు. పైగా పరామర్శ కి వచ్చిన వాళ్లకి కాఫీలో, టిఫిన్లో (వాళ్ళతో ఆవిడకి ఉన్న స్నేహాన్ని బట్టి) పట్టుకురమ్మని అంత బాధలోనూ పురమాయించేది బామ్మ. పరామర్శకి వచ్చిన వాళ్ళ చేత, రాని వాళ్లకి కబురు పంపేది. ఈ వచ్చిన వాళ్ళలో కొందరు "సందలడిపోయింది..వొంటకి ఆలీసం అయిపొయింది.. పిల్లలు ఏడుత్తా ఉంటారు..కూరో పచ్చడో ఎట్టండి.." అని అమ్మని అడిగి తీసుకెళ్ళే వాళ్ళు.
బామ్మని కనీసం నెలకోసారైనా తేలు కుడుతూనే ఉండేది. తేలు కుట్టిన ప్రతిసారీ మా ఇంట్లో ఇంచుఉమించు ఇదే దృశ్యం. ఆవిడని తేలు కుట్టడం ఎంత సహజం అంటే.. చాలా రోజులపాటు ఆవిడకి కనిపించని వాళ్ళు ఎవరైనా ఆవిడని కలిసినప్పుడు ఏమీ తడుముకోకుండా "మొన్న తవర్ని తేలు కుట్నాదని తెలిసిందండి.. వొద్దారనుకున్నాను కానీ కుదర్లేదండి.." అని చాలా నమ్మకంగా చెప్పేసేవాళ్ళు. "దీపం పట్టికెళ్ళకుండా చీకటి గదుల్లో తిరిగితే తేళ్ళు కుట్టవేమిటీ?" అని అమ్మ రహస్యంగా విసుక్కునేది.
ఎప్పటిలాగే ఓ సారి బామ్మని తేలు కుట్టింది.. అమ్మ తేలుని చంపేసింది. మంత్రం వేయడానికి వచ్చిన శాయమ్మ గారు "ఇది తేలు కాదండి, మండ్రగబ్బ..మంత్రం పని చెయ్యదు.." అని చెప్పేశారు, పళ్ళెంలో ఉన్న తేలు శవాన్ని చూసి. అక్కడికీ ఆవిడ జిల్లేడు పాలూ అవీ రాసి వైద్యం చేస్తూనే ఉంది.. బామ్మ ఎప్పటికీ ఏడుపు ఆపదే. మంత్రం లేదనేసరికి ఈవిడకి భయం పెరిగిపోయింది. ఈ హడావిడి చూసి ఆవిడని పాము కరిచిందని అపార్ధం చేసుకుని ఎప్పుడూ కన్నా ఎక్కువమందే వచ్చేశారు పరామర్శకి.
ఆవేళ ఎందుకో నాక్కూడా ఆవిడని పలకరించాలనిపించింది. కానీ ఏం మాట్లాడాలో సరిగ్గా తెలియదు. "బాగా నొప్పిగా ఉందా బామ్మా.. అదేంటో తేలు ఎప్పుడూ నిన్నే కుడుతుంది..నన్ను ఒక్కసారీ కుట్టదు..ఎలా ఉంటుంది తేలు కుడితే..?" అని అడిగాను, ముద్దుగా. ఆవిడ ఇంక బాధని మర్చిపోయి.. "వొద్దు నాయనా.. వొద్దు.. ఈ బాధ పగవాడికి కూడా వొద్దు" (అప్పటికే నేను పగవాడి జాబితాలో ఉన్నాను) అని నాకు చెప్పి, పరామర్శ కి వచ్చిన వాళ్ళందరికీ "మా మనవడికి తేలు చేత కుట్టించుకోడం మనుసూ.." అని మర్చిపోకుండా చెప్పింది.
పెళ్లి ఊరేగింపు చూసినప్పుడల్లా మీకు ఊరేగాలన్పించేదా...నవ్వి నవ్వి అలుపు వచ్చిందండీ.....మీ భామ్మ భలే విచిత్రంగా వున్నారు:) పాపం ఆవిడనే తేళ్ళు ఎందుకు కుట్టాయో ...ఎవరో మీ లాంటి పగ వారు వాటిని పట్టుకొచ్చి ఆవిడ దగ్గర వదిలేవారని అనుమానం :):)
రిప్లయితొలగించండిహా హా హా ! పెళ్ళి చేసుకోవాలన్న కోరిక - సూపర్ ! అది బైటికి చెప్పుంటే ?
రిప్లయితొలగించండిసర్లే, ఇంతకీ పెళ్ళి ఊరేగింపు కోరిక తీరిందా లేదా మురళీ మీకు? పల్లకీ ఎక్కారా లేదా?
రిప్లయితొలగించండిబామ్మ పగవాళ్ళ జాబితాలో ఉన్నారంటే మీరేం చేశారోలెండి! చెప్పలేం!
సరే పెళ్ళి ఊరేగింపు సంగతలా ఉంచి మీరు మనుసు పడ్డ తేలైనా కుట్టిందా లేదా, గొలుసుల బొమ్మ వడ్డించినపుడు ఎంత హాయిగా ఉందీ ఏమిటీ ఆ కథా కమామీషూ ఏం చెప్పకుండానే టపా ముగిస్తే ఎల్లాగ? ఎలా వుంటుంది?
తొడుపెళ్లికొడుకుగా కూర్చున్నారా ఎప్పుడైనా. నేను అలానే ఆకోరిక తీర్చుకొన్నా. ఇక తేలు విషయానికివస్తే నాకు ఓటపాకు సరిపడా సామాగ్రి దొరికింది.
రిప్లయితొలగించండిపెళ్లి ఊరేగింపులు చూసినప్పుడల్లా నాకూ పెళ్ళైతే బాగుండును అనిపించేది.. super!!!!
రిప్లయితొలగించండిమీ బామ్మగారిని అన్నిసార్లు తేలు కుట్టడం చదివిన తర్వాత ఈ సారి నేను బామ్మని పరమర్శించడానికి తప్పకుండా వెళ్ళాలి అని అనిపించింది. నాకు కూడా మీరే ఆ తేలు బామ్మ చీకటి రూంలోకి వెళ్ళినప్పుడు వదిలుంటారని అవమానం :). అసలే పగవారి లిస్ట్ లో మీరూ ఉన్నారాయే.
రిప్లయితొలగించండి"పేక బెత్తం తో నాకెప్పుడూ నిత్య కళ్యాణమే కదా!" అవునా అచ్చికచ్చిక నా కచ్చితీరింది.
రిప్లయితొలగించండిఅయితే అప్పట్లో మీరు నిత్యపెళ్ళికొడుకన్నమాట!(బెత్తంతో):)
రిప్లయితొలగించండిbeautifully narrated.
రిప్లయితొలగించండిచిన్నప్పుడు మా మమ్మయ్య(నయినమ్మ) వాళ్ళ ఇంట్లో కూదా బోలేడు తేళ్ళు ఉండేవి.అప్పుడు బయట పెరటిలో బాత్ రూం ఉండేది.దాంట్లొకి వెళ్లాలంటె భయం ఎక్కద తేలు కుట్టెస్తుందొ అని...నన్నెప్పుడు కుట్టలేదు కానీ మా తాతమ్మని (నాన్నగారి అమ్మమ్మగారు) ఓ సారి కుట్టిందో టేలు..పాపం చాలా బాధ పడిందావిడ.
రిప్లయితొలగించండిహ హ భలే ఉందండీ మురళి గారు.
రిప్లయితొలగించండిachamga ma baamma lagenannamata aite..aaaaascharyam!!
రిప్లయితొలగించండిasalu ma baamma lanti baamma inkekkada vundadanukunevallam nenu ma annayya..!!
ippudu meeru kuda maato nestam kattesaravute!!
>>"మా మనవడికి తేలు చేత కుట్టించుకోడం మనుసూ.." అని మర్చిపోకుండా చెప్పింది
రిప్లయితొలగించండి:))
పెళ్ళి కంటే ఇదే బెటరేమో కదా!!!
@చిన్ని: నాలాంటి వాళ్లా? యెంత మాట అన్నారండి? బామ్మ మీద అలా పగ తీర్చుకోవచ్చని ఇప్పుడు మీరు పరోక్షంగా సూచించేంత వరకు నాకు తెలియనే తెలియదండీ.. పెళ్లి ఊరేగింపు చూసిన ప్రతిసారీ నిజ్జంగానే అనుకున్నానండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Sujata: ఏముందండీ..సింపుల్..పేక బెత్తంతో మరోసారి పెళ్లి చేసి ఉండేవాళ్ళు.. ధన్యవాదాలు.
@సుజాత: నగరాల్లో మనుషులకే చోటు లేదు..ఇంక గోడమీద బొమ్మలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఆ కోరిక తీరనేలేదండీ.. మిగిలిన విశేషాలు ఒక్కొక్కటీ చెబుతానండి.. చదువుతూనే ఉండండి :-) ...ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: తోడు పెళ్ళికొడుకు... ఓ అట్టడుగు జ్ఞాపకాన్ని వెలికి తీశారు.. కాసుకోండి.. మీ తేలు టపా కోసం చూస్తూ ఉంటాం.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@Sunita: నిజమేనండీ.. మీకేవరికీ అలా అనిపించలేదా? లేక ఇలా చెప్పెయ్య కూడదా? కొంచం చెప్పండి.. ...ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: అలా పగ సాధించ వచ్చని నాకు తెలియదండీ.. లేకపొతే ప్రయత్నించే వాడినేమో :-) ..ధన్యవాదాలు.
@రఘు: ఎందుకండీ అంత ఆనందం? నేను మీకేం ద్రోహం చేశాను? :-) :-) ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పద్మార్పిత: అవునండీ..రాస్తూనే ఉన్నాను కదా... ధన్యవాదాలు.
@తృష్ణ: మా బామ్మ బాధపడడం మాకు బాగా అలవాటైపోయింది లెండి.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.
@ప్రణీత: నేను కూడా మా బామ్మ లాంటి బామ్మ ఇంకెక్కడా ఉండదనుకుంటున్నాను.. సో..ఇంకా ఉన్నారన్న మాట.. ధన్యవాదాలు.
@మేధ: నిజమేనండీ, కొంచం ఆలస్యంగా తెలిసింది :-) ..ధన్యవాదాలు.
"పేక బెత్తం తో నాకెప్పుడూ నిత్య కళ్యాణమే" :) :)
రిప్లయితొలగించండి'కోడు..కోడు' అంటే పరిగెడుతున్న తేలు కూడా ఆగిపోతుందిట!
చదివాక నాకూ ఓ విషయం గుర్తొచ్చింది . మా ఇంటిముందు ముచ్చట కొద్దీ పూలమోక్కలూ , కూరగాయ మొక్కలూ వేసుకోనేవాళ్ళం .తోటలోకి వానకట్లు వచ్చేసేవి నాకేమో పామంటే భయం ! అది ఏపామైనా ...మా మామ్మ గారు కర్రతో దాని వెనక పడేవారు మా ఇంట్లో పురుడు , మా ఇంట్లో పురుడు ...అంటూ ...అలా అంటే అవి ఇంట్లోకి రావట ! వాటిని చంపితే వర్షాలు పడవని చంపకుండా తరిమేసేవారు .
@పరిమళం: కొత్తవిషయం చెప్పారు.. ...ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిఈ టపా వాళ్ళ నాకు తెలు కుట్టడం గురించి చాలా కొత్త విషయాలు తెలిసాయి. తేలు కుడితే ఏదో మంత్రం వేస్తారని తెలుసు గానీ, అలా చంపిన తేలుని పక్కన బెట్టి చేస్తారని తెలీదు. అలాగే కోడు కోడు..ఇది కూడా కొత్త సంగతే నాకు.
రిప్లయితొలగించండిచాలా చాలా నవ్వొచ్చింది ఈ టపా చదువుతుంటే. మీ బామ్మని పరామర్శించడానికి వచ్చి కూరలు, పచ్చళ్లు పట్టుకెళ్ళేవాళ్లా.. పాపం మీ అమ్మగారికి మళ్ళీ ఎదురు పని అన్నమాట :(
పెళ్లి ఊరేగింపు చూస్తే మీక్కూడా అలా ఊరేగాలనిపించేదా :))) ఇంతకీ కోరిక తీరినట్టా లేదా.? మీ చిరకాల కోరికని తీర్చమని మీ ఇంట్లోవాళ్ళతో పట్టు పట్టలేదా మరి మీరు.?
@మధురవాణి: మంత్రం వేసే ఆవిడ తేలు శవాన్ని చూసి దాన్ని బట్టి మంత్రం వేసేవారు. అదీకాక, చూడ్డానికి వచ్చిన వాళ్ళు తేలుని చూసి "అమ్మో యెంత పెద్ద తేలో" అనకపోతే బామ్మ హృదయం గాయపడేదండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఇంతకీ మీ బామ్మగారి పగవాళ్ళ లిష్టులో మీరు ఎందుకున్నారో చెప్పలేదు.
రిప్లయితొలగించండిఅదో పెద్ద కధా????
మీ బామ్మగారిని తెళ్ళుకుడితే మా అమ్మమ్మ వేళ్ళని ఎప్పుడూ బొద్దింకలు కొరికేసేవి.నేనెప్పుడూ అమ్మమ్మ పక్కనే పడుకునేదానిని.కానీ నన్నెప్పుడూ కొరకలేదు.పాపం రోజూ పొద్దన్నే నా వేళ్ళు పరిశీలించేది ఏమన్నాముక్కలూడిపోయాయేమో అని.మీరు భలే భలే విషయాలు రాస్తున్నారు.
రిప్లయితొలగించండి@బోనగిరి: కథ కాదండీ..సీరియల్.. చదువుతూనే ఉండండి :-) ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@రాధిక: మా ఇంట్లో చాలా బొద్దింకలు ఉండేవి కానీ అవి మమ్మల్ని ఏమీ చేసేవి కాదండి.. ఒక్క మాటలో మా ఇంట్లో సమస్త జీవరాశీ ఉండేదని చెప్పవచ్చేమో :-) ధన్యవాదాలు.