శుక్రవారం, జులై 10, 2009

గోపి గోపిక గోదావరి

"వరుస పరాజయాలు వచ్చిన ప్రతిసారీ ఓ గొప్ప విజయం నన్ను వరిస్తోంది..." నాలుగేళ్ల క్రితం ఆదివారం ఆంధ్రజ్యోతి కి తన ఫెయిల్యూర్ స్టోరీ చెబుతూ దర్శకుడు వంశీ అన్న మాటలు గుర్తొచ్చాయి థియేటర్ లోకి వెళ్ళగానే. మూడు వరుస పరాజయాల తర్వాత వస్తున్న సినిమా.. అది కూడా గోదారి మీద గోదారంత అభిమానాన్ని చూపే వంశీ ఆ గోదావరిని ఓ ముఖ్య పాత్రగా సినిమా తీశాడంటే రిలీజ్ షో చూడకుండా ఎలా? సినిమా టైటిల్ లో ఉన్న మూడు 'జి' లకి తోడూ నా సీట్ వచ్చింది 'జి' రో లో. తెల్లటి తెరని కూడా రెప్ప వెయ్యకుండా చూడడం మొదలు పెట్టాను.

ప్రారంభ దృశ్యం సింగన్నపల్లి గోదారి రేవు.. 'ఎర్ర నూకరాజు గారి కాఫీ హోటల్' నన్ను పసలపూడి కి తీసుకెళ్ళి పోయింది. ఇంతలో 'శ్రీ సీతారామ లాంచీ సర్వీస్' వారి లాంచీ వచ్చింది. సైడు పాత్రలన్నీ వచ్చి కోలాహలం మొదలు పెట్టాయి. డాక్టర్ గోపిక (కమలిని ముఖర్జీ) ఆ గోదారిలో ఓ లాంచీలో మొబైల్ హాస్పిటల్ నడుపుతోంది.. కార్పోరేట్ హాస్పిటల్స్ కి దీటుగా తీర ప్రాంత వాసులకి వైద్య సేవలందిస్తోంది. ఆ సేవలు చూడ్డానికొచ్చిన ఓ కుర్ర డాక్టరు చెట్టు కొమ్మ మీద కూర్చుని మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నా గోపికని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు.

డాక్టరమ్మ గారి అమ్మగారు (జయలలిత) వయసులో ఉండగా ఎవరి చేతిలోనో మోసపోయారు..అందువల్ల వారికి ప్రేమలు గిట్టవు. ఐతే కుర్ర డాక్టరు తన ప్రేమని గురించి తన బంధువు (జీవా) ద్వారా కబురు పెట్టడం తో, కుర్రాడు మంచాడని ఒప్పేసుకోడంతో పాటు, గోపిక్కి కూడా అతనంటే ఇష్టం అన్న భ్రమలో ఉంటూ ఉంటారు. గోపిక మాత్రం తను చేయాల్సిన సేవలు చాలా ఉన్నాయని పెళ్లి గురించి ఆలోచిస్తే మొదట కుర్ర డాక్టరు పేరునే పరిశీలిస్తానని అతనికి చెప్పేస్తుంది. తల్లేమో గోపిక అడిగినప్పుడే పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటుంది. డాక్టరమ్మ ఫోన్లు మాట్లాడుకుంటూ బిజీ గా ఉంటే, కాంపౌండరు, నర్సు పంచి డైలాగులు విసురుకుంటూ ఉంటారు.

వీళ్ళ గొడవ ఇలా ఉండగా.. హైదరాబాద్ లో స్వాతి ఆర్కెష్ట్రా.. దానికి మేనేజరు రమణ బాబు (కృష్ణ భగవాన్). ఓ లాయర్ (కొండవలస) వచ్చి ముగ్గురు మగ పిల్లల తండ్రైన రమణ బాబు అర్జెంటుగా ఓ ఆడపిల్లని కంటే దూరపుబంధువు ఆస్తి కలిసొస్తుందని చెబుతాడు. అబద్దాలాడితే ఆడపిల్ల పుడుతుందని అబద్ధాల వ్రతం మొదలు పెడతారు రమణ బాబు, అతని భార్య. రమణ బాబు కి కథతో సంబంధం ఏమిటంటే ఇతని ఆర్కెష్ట్రా లో ప్రధాన గాయకుడు గోపి (వేణు తొట్టెంపూడి) ఈ సినిమాకి హీరో. సింగన్నపల్లి డాక్టరమ్మ ఫోనుల్లో తెగ మాట్లాడేది తన హైదరాబాద్ స్నేహితురాలితో.. ఆ స్నేహితురాలు ఫోన్ పోగొట్టుకోడం, అది గోపి కి దొరకడం తో నాయికా నాయకుల తొలి సంభాషణ జరుగుతుంది, సినిమా మొదలై అరగంటకి పైగా గడిచాక.

ఇంతలోపు సదరు స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోడం, గోపి, గోపికని ఓదార్చడం లాంటి సన్నివేశాలతో కథ సాగుతూ ఉంటుంది. నాయికా నాయకులిద్దరూ కలుసుకుందాం అనుకుంటారు కానీ విధి దర్శకుడి రూపంలో అడ్డు పడుతుంది. కొరియర్లో కానుకల రవాణా జరగడంతో పాటు, ఫోన్లోనే 'నువ్వక్కడుంటే..' పాట కూడా పాడేసుకుంటారు. తన అబద్ధాల వ్రతంలో భాగంగా రమణ బాబు గోపికకి చెప్పిన ఓ అబద్ధం వల్ల గోపి, గోపికల మధ్య అపార్ధం పొడసూపడం, తన కూతురు ఫోన్లలో మాట్లాడుతున్నది కుర్ర డాక్టరుతో కాదనీ, ఓ ఆర్కెష్ట్రా గాయకుడితోననీ గోపిక అమ్మగారికి తెలియడం ఒక్కసారే జరుగుతాయి. ప్రేమ వివాహాలు కూడదు అంటుంది తల్లి, గోపి అందరిలాంటి వాడు కాదు అంటుంది కూతురు.

తొలిసారి ముఖాముఖి చూసుకోవాలనీ, అప్పటివరకు ఫోటోలు కూడా చూసుకో కూడదనీ అనుకుంటారు గోపి, గోపిక. వీళ్ళిద్దరి మధ్య పొడసూపిన అపార్ధాన్ని గోపి తల్లి (గీతాంజలి) సరిదిద్దుతుంది. ఇంతలో ఆవిడకి కళ్ళ సమస్య రావడం, త్వరలో చూపు పోతుందని డాక్టరు చెప్పడం జరుగుతాయి. గోపిక దగ్గరికి బయలు దేరిన గోపి, మసక చీకట్లో దుండగులు కొట్టిన దెబ్బలకి వొళ్ళంతా గాయాలతో గోదారి ఒడ్డున స్పృహ తప్పి పడిపోతాడు. అతని, ఫోన్, బ్యాగ్ ఓ దొంగ ఎత్తుకుపోతాడు. గోపి ఏమైపోయాడో అన్న అయోమయంలో గోపిక, సినిమా ఎటు పోతోందో అన్న అయోమయంలో ప్రేక్షకులు ఉండగా మొదలైన గంటన్నరకి విశ్రాంతి వచ్చింది.

సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడి ఊహకి అందే విధంగా, అప్పటి వరకు పెద్దగా పని లేకుండా ఉన్న మొబైల్ హాస్పిటల్ గోపిని రక్షిస్తుంది. అచ్చం సినిమాల్లో లాగే అతను గతం మర్చిపోతాడు. ఓ క్రైస్తవ మత బోధకుడు అతనికి ప్రభు అని పేరు పెడతాడు. ప్రభుగా కొత్త జీవితం మొదలు పెడతాడు గోపి. మరో పక్క గోపి ఏమయ్యాడో తెలియని గోపిక స్విచ్ ఆఫ్ అని వస్తున్నఅతని ఫోన్ కి రోజూ ఫోన్లు చేస్తూనే ఉంటుంది. కంటి చూపు కోల్పోయిన గోపి తల్లి గోపిక దగ్గరికి వచ్చి వెళ్తుంది. గోపి ఒంటి నిండా కట్లతో పడుకుని ఉంటాడు కాని ఆ తల్లి కి చూపు లేకపోవడం వల్ల గుర్తు పట్టలేదు. ప్రభుకి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళిన గోపిక, కుర్ర డాక్టర్లకి గోపి చనిపోయాడని తెలుస్తుంది. శవం గుర్తు పట్టలేని విధంగా ఉన్నప్పటికీ, వస్తువులు చూసి మృతుడిని గోపిగా గుర్తు పడతారు పోలీసులు.

గోపి చనిపోయాడని తెలిశాక కుర్ర డాక్టరుకి గోపిక పట్ల ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఈసారి పెళ్లి బాధ్యత తన భుజాల మీద వేసుకుంటాడు ప్రభు. తాళిబొట్టు తేడానికి వెళ్ళిన గోపి మీద దుండగులు మళ్ళీ దాడి చేయడంతో అతనికి గతం గుర్తు వచ్చేస్తుంది. తర్వాత ఏమైందన్నది ముగింపు. మామూలుగా ఐతే ఇది వంశీ సినిమానేనా అన్న సందేహం వచ్చేది కానీ 'దొంగరాముడు అండ్ పార్టీ' 'కొంచం టచ్లో ఉంటే చెబుతాను' సినిమాలు చేసిన గాయాల పచ్చి ఇంకా ఆరకపోడం వల్ల అలాంటి డౌట్ రాలేదు. 'అసలు దర్శకుడు ఏం చెబుదాం అనుకుంటున్నాడు?' అన్న డౌట్ సినిమా మొదలైన పావుగంటకి మొదలై ముగింపు వరకూ కొనసాగుతూనే ఉంది.

హీరోయిన్ డాక్టరు..కానీ హీరో కి తప్ప ఎవరికీ వైద్యం చెయ్యదు..ఆ మాటకొస్తే ఆవిడకి ఫోన్ తోనే సరిపోయింది. హీరో ఆర్కెష్ట్రా లో సింగర్.. కానీ ఒక్కసారి కూడా పాట పాడిన పాపాన పోలేదు. అసలు మొదటి సగం అంతా నాయికా నాయకులవి అతిధి పాత్రలే. సైడు పాత్రలే హంగు చేశాయి. ఆ హంగు శృతి మించడం వల్ల సినిమా నిడివి విపరీతంగా పెరిగిపోయింది.. మొత్తం రెండు గంటల నలభై నిమిషాలు. పాటల ప్లేస్మెంట్ అస్సలు కుదరలేదు. ఆడియోలో వినసొంపుగా ఉన్న 'బాలగోదారి' పాటకి సినిమాలో చోటు దక్కలేదు. ఎండ్ టైటిల్స్ రోల్ అవుతుంటే వినిపించారు. 'నువ్వక్కడుంటే..' చిత్రీకరణ ఒక్కటీ పర్లేదు. రెండో సగంలో కథ ఉందికదా చూద్దామనుకుంటే కథనం అష్ట వంకర్లు తిరిగింది.

కమలిని గ్లామర్ కి కృష్ణ పక్షం ప్రారంభం అయినట్టు ఉంది. కాటన్ చీరలు సొగసుగా కట్టినా ముఖంలో కళ తగ్గింది. వేణు గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. తన తొలి సినిమా 'సితార' లోనే స్క్రీన్ ప్లే మెరుపులు మెరిపించిన వంశీ కథను ఇంత నీరసంగా చెబుతాడని అస్సలు అనుకోలేదు. చాలా సీన్లు తినేసిన రమణ బాబు అబద్ధాల వ్రతం చివరికి ఏ ముగింపుకి చేరుకుందో చెప్పడం మర్చిపోయాడు దర్శకుడు. దీనితో కామెడీ కాస్తా 'కొంచం టచ్లో ఉంటే చెబుతాను' ని గుర్తు చేసింది. ద్వితీయార్ధం లో కథ ఉన్నా అది చాలా సార్లు 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' ని పోలి ఉన్నట్టు అనిపించింది. కామెడీ నవ్వించడానికి బదులు విసిగించింది. ప్రధమార్దంలో మందు పార్టీ 'సుందరి' పాట లేకపోయినా కథకి నష్టమేమీ లేదు. గోదారిని కథలో భాగం చేశామన్నారు కానీ ఈ కథకి గోదారే అవసరం లేదు..ఎక్కడైనా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం బెటర్ లక్ వంశీ..

చిన్నప్పుడు ఎప్పుడైనా బడికి ఎగ్గొట్టాలనిపిస్తే కడుపు నొప్పనో, కాలునొప్పనొ వంక పెట్టే వాడిని. అమ్మకి విషయం తెలిసి కోప్పడేది.. 'అలా చెడు కోరుకోకూడదు..పైన తధాస్తు దేవతలు ఉంటారు..' అంటూ. రిలీజ్ షో చూడడం కోసం ఉదయం ఆఫీస్ కి ఫోన్ చేసి 'తలనొప్పిగా ఉంది..ఈ పూట రాలేను' అని చెప్పాను..

34 కామెంట్‌లు:

  1. ayyo ademiti andii cinema baguntundemo anukunna oho any how chala thanks andii meru maku cinema mottamu chupincharuu.
    na blog kuda visit cheyandi chesi mee amulyamina coments ivvandi untanu andi namaskaramu
    http://mirchyvarma.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు,
    నిన్నే మీరు వంశీతో మాటలాడి, ఆ అనుభూతుల తడి ఇంకా ఆరి ఉండకముందే ఆయన సినిమా చూసి చాలా నిష్పక్షపాతంగా రాసి, సినిమా వాళ్ళ మీద అభిమానం ఉంటే ఇలా ఉండాలి అని చెప్పిన మీ తీరు నాకు ఎంతగానో నచ్చింది. అభిమానులు అని చెప్పుకునే ఎంతో మంది తమ అభిమాన నటులు ఏమి చేసినా ఆహో..ఒహో..అనే వారంటే నాకు చెడ్డ చిరాకు వస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు,
    మీ బ్లాగుకు నేనో నిశ్శబ్ద పాఠకుడిని. చక్కగా రాస్తున్నారు. అభినందనలు.
    గో.గో.గో కథ మొత్తం రాసేసి మీరు పాఠకులకు, సినిమావాళ్ళకూ ఇద్దరికీ నష్టం కలిగిస్తున్నారు. సమీక్షకైనా, పరిచయానికైనా కాస్త కథ ప్లాటు గురించి రాసి, పాఠకులకు కాస్త వదిలేయాలి. ఇంత చిన్న విషయం మరిచారేమిటి?

    -బుడుగ్గాయ్.

    రిప్లయితొలగించండి
  4. పక్షపాతం లేకుండా మీ దర్శకుడి చిత్రం పైన వ్రాసిన సమీక్ష బాగుంది. చాలా బాగా ముగించారు కూడా :)

    రిప్లయితొలగించండి
  5. @మిర్చివర్మ: చూస్తానండి మీ బ్లాగు.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: సినిమా బాగా నిరాశ పరిచిందండి.. నచ్చని దాన్ని నచ్చిందని ఎలా చెప్పడం? ...ధన్యవాదాలు.
    @బుడుగు: నష్టం అంటారా? థియేటర్లో నాతోపాటు చూసిన ప్రేక్షకులంతా బయటకి రాగానే చేసిన మొదటి పని ఎస్సెమ్మెస్లు పంపడం.. ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా పెరిగిందండీ.. ఇక వివరంగా రాయడం అంటారా? వంశీ లాంటి దర్శకుడు కూడా సినిమాని యెంత అపసవ్యంగా తీశాడో కొంచం వివరంగా చెప్పాలన్న ప్రయత్నం అండి. మీ సూచనని తప్పక దృష్టిలో ఉంచుకుంటాను. ధన్యవాదాలు.
    @విజయవర్ధన్: 'మీ దర్శకుడు' ..సంతోషంగా అనిపించిందండి.. తనో హిట్ ఇస్తే చూడాలని ఉంది. ఇవ్వ గలడన్న నమ్మకం ఇప్పటికీ ఉంది. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. బ్లాగ్మిత్రులకు,
    గత నాలుగు రోజులుగా నా బ్లాగుని అజ్ఞాతంగా ఉంచాను. 'గోపి గోపిక గోదావరి' గురించి నేను రాసిన టపా కొందరు పాఠకులను నొప్పించడమే ఇందుకు కారణం. నా టపా వల్ల సినిమాకి నష్టం జరుగుతుందన్నారు. ఓ సినిమా జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలోల నా బ్లాగు ఉందన్న భ్రమలేవీ నాకు లేవు. టపా చదవడం వల్ల సినిమా చూడడాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామన్న వ్యాఖ్య నన్ను ఆలోచనలో పడేసింది.
    ఈ టపాని ఎడిట్/డిలీట్ చేయమన్న 'సూచన' మాత్రం నన్ను చాలా చాలా బాధ పెట్టింది. నా రాతల వల్ల సాధ్యమైనంత వరకు ఎవరికీ ఇబ్బంది కలగకూదదన్నది నా ఉద్దేశ్యం. టపా తొలగించడం ఇష్టం లేక బ్లాగుని అజ్ఞాతంలో ఉంచాను. మీకు ముందుగా తెలిపే వీలు లేకపోయింది. నా బ్లాగు కనిపించకపోవడం పట్ల టపా రూపంలో స్పందించిన 'స్వర్ణముఖి' బ్లాగరు సుబ్రహ్మణ్య చైతన్య గారికి, నన్ను పలకరించిన బ్లాగు మిత్రులు అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు. మీకు కలిగించిన అసౌకర్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  7. మురళిగారు , నేను ఈ సినిమా చూసాను ,నన్ను చాల చాల నిరాశపరిచింది .ఏవిటో వంశీ కి ఏమైందో అర్ధం కావడం లేదు

    రిప్లయితొలగించండి
  8. హమ్మయ్య!! మనశ్శాంతిగా ఉంది...
    సినిమా మీద సమీక్ష చూసికాదండి.
    మీ టపా చూసినందుకు...

    రిప్లయితొలగించండి
  9. ఓహ్! కావాలనేడిసేబుల్ చేసారా... నేను రోజూ చూస్తున్నాను, కానీ బ్లాగ్ ఓపెన్ అవడం లేదు..

    రిప్లయితొలగించండి
  10. "acham cinemallolage atanu gatham marchi potadu..alage cinemallolagane malli debba tagalagane normal aipotadu.."
    vamsi cinema ante yentho expectations to yeduru choose nalanti vallaki chala nirase migilindannamata..
    cinema mata yelagunna mee tapaa modati vakyam ninchi chivari varaku chala chala chala bagundi murali garu..
    nishpakshapathamga rasinanduku abhinandanalu..

    రిప్లయితొలగించండి
  11. Brother
    Welcome back. Take it easy brother. You have every right to express yourself.

    రిప్లయితొలగించండి
  12. మురళిగారు మీ బ్లాగ్ ని అజ్ఞాతంలో పెట్టడానికి కారణం చూస్తే మీరెంత సున్నిత మనస్కులో తెలుస్తోంది .
    ఇక సినిమా ...గోదావరి పేరు వినపడితే మనసాగుతుందా ?రిలీజైన మర్నాడే పరిగెత్తుకెళ్ళా.......ప్చ్ ....మీరు రాసిన విమర్శ వంశీ గారు చదివితే బావుండును తర్వాతి సినిమా అయినా నిరుత్సాహపరచకుండా తీస్తారు .

    రిప్లయితొలగించండి
  13. Murali garu,
    Metho chala vishayalupanchukovalni anipinchindhi, kanu fingers keypad medhi ki vachevaraku emi type cheyyalo ardham kaledu!acham meru vamshi garitho matldetappudu laga!
    emina,
    meru vamshi gari gurinchi cheepi anthalone ela clear ga cinema gurinchi cheppadam nijanga great meru.

    రిప్లయితొలగించండి
  14. హమ్మయ్య.. నెమైలికన్ను మళ్ళీ రిలీజ్ అయ్యాక, ఎన్టీ వోడి సినిమా చూసినట్టుంది.

    రిప్లయితొలగించండి
  15. @చిన్ని, పద్మార్పిత, మేధ: ధన్యవాదాలు
    @సుజాత: అర్ధమైందండీ.. ధన్యవాదాలు.
    @ప్రణీత, తృష్ణ, భాస్కర రామరాజు: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  16. @పరిమళం: నా రాతలవల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం అండి.. ధన్యవాదాలు.
    @మహిపాల్: మాట్లాడండి..నాకూ తెలుసుకోవాలని ఉంది మీరేం చెబుతారో.. ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. మురళి గారు,
    'నెమలికన్ను' తాత్కాలికంగా అయినా కనిపించకపోవడం వల్ల చాలా మంది బెంగపడిపోయాము :(
    కానీ, మళ్లీ వెంటనే మాకు దర్శన భాగ్యం కల్పించారు. ధన్యవాదాలు.
    కారణం తెలియకపోయినా ఎందుకో మళ్లీ వచ్చేస్తారనే నాకు నమ్మకంగా ఉండింది :)
    ఇకపోతే సినిమా గురించి..
    పాటలు విని, గోదావరిని టైటిల్లో చూసి, నేతచీరల్లో కమలిని ఫొటోస్ చూసి.. సినిమా బావుంటుందని ఊహించాను.
    హమ్మ్..మళ్లీ నిరాశేనన్నమాట :(
    మీరు మీ అభిప్రాయం హుందాగా రాశారు. ఇది ఎవరికైనా ఇబ్బందిని కలిగిస్తుందని నేనుకోను. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే అనుకోండి..అయినా అంతే మరి :)

    రిప్లయితొలగించండి
  18. chala bhagha rasaru "G.G.G" gurinchii.

    Eenadhu lo chadhivinapudhu nundhi serious gha nenu mee blog fan ni.
    Last 2 days nundhi choostthunna nemalikannu emi ayyipoyindhi ani.

    Thank u for coming back.

    Nenu Visakha vasini meeku veelu ayitey maa Sagara nagarani kee koodha mee blog lo place estey chala happy.

    రిప్లయితొలగించండి
  19. @లావణ్యాదిత్య: గత నెలలో ఒక ఫ్రెండ్ ని కలవడానికి మీ ఊరు రావాల్సింది, చివరి నిమిషంలో అనుకోని పని రావడంతో రాలేకపోయానండి.. మీ సముద్రం అంటే నాకు చాలా ఇష్టం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. మురళి గారు, నేను ఈ సినిమా పాటలు విని పబ్లిసిటీ చూసి బోలెడు అంచనాలు పెంచేసుకున్నాను. రివ్యూ ల ప్రభావం పడకుండా, క్లీన్ స్లేట్ లా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అని నేను మొన్న ఆదివారమే సినిమా చూసి చాలా నిరాశ చెందాను.

    సినిమా కి తోడు నేను వెళ్ళిన థియేటర్ కూడా చాలా దారుణం గా ఉండటం తో నా పాట్లు వర్ణనాతీతం. ఇంటర్వెల్ లో ఇంటికెళ్దాం అనుకుని కూడా ద్వితీయార్ధం ఏమన్నా బాగుంటుందేమో అని ఉండి పోయా... కాస్త మార్చి వెకిలి హాస్స్యాన్ని జోడించి మళ్ళీ తీసిన అవును వాళ్ళిద్దరు ఇష్ట పడ్డారు సినిమా ఇది. అప్పటికీ సంచార వైద్యశాల ఫోన్ ప్రేమ గోదావరి అందాలు అక్కడక్కడా కాస్తైనా నవ్వించిన హాస్యం అంటూ నన్ను నేను సమాధాన పరచుకోడానికి విశ్వప్రయత్నం చేశా.. కానీ చివరికి సినిమా చూసి ఇంటికి వెళ్తూ "ప్రాణం విల విలా..." అని పాడుకొన్నా...

    ఈ సారి వంశీ సినిమా అయినా సరే రివ్యూ చదవకుండా వెళ్ళే ప్రసక్తే లేదు.

    రిప్లయితొలగించండి
  21. Murali gaaru ..ee blog ni lock chesi manchi pani chesarandeee....

    release ayina roje motha cinima story rasarenti ani confuse ayyanu ....cinaimallo jariginatle kadandi cinimallo choopistaru ...(lighter side) ...inka idi love story so herion rogulanu ela choostunnadi, hero programms ela chestunnadi assalu avasaram ledemo ...you couldn't enjoy ...but movie has many good points ...mee direction lo chooste happy days , aanand kooda chetha cinimale avuthayi ....

    meeekem kavali annadi ee movie lo ledu ...songs bagunnayi ani velli choosaru anthe kadaa...adi business anukondeeee.....

    రిప్లయితొలగించండి
  22. @రాధిక: ధన్యవాదాలు
    @వేణూ శ్రీకాంత్: నాకూ అలాగే అనిపించిందండి..కనీసం తాక విని అప్పుడు వెళ్తే బెటర్ అని.. ధన్యవాదాలు.
    @TestingWheel: హీరోయిన్ మరీ అలా మొబైల్ ఫోన్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ లా ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటే చూడ్డానికి విసుగ్గా అనిపించిందండి.. ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్..కానీ ఉపయోగించుకోలేదు. సినిమాకి పాటలు అవసరం.. హీరో ఆర్కెస్ట్రా సింగర్ అంటే మంచి పాటలు ఒకటో రెండో ఇవ్వొచ్చు కదండీ? 'ఫలానా ఉద్యోగం చేస్తాడు' అని చెప్పినప్పుడు కనీసం ఒకటి రెండు సీన్లలో అయినా ఆ పని చేస్తున్నట్టు చూపాలి కదా? ఇక మీరు చెప్పిన రెండు సినిమాల గురించి..'ఆనంద్' నాకు నచ్చిన సినిమాల్లో ఒకటి. 'హ్యాపీ డేస్' చాలా కారణాల వల్ల నచ్చలేదు. టపా చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. Murali garu

    Thanks andi samadhanam vrasinanduku ...inka naaa abhiprayalu matrame sumaa ivi ..telugu lo vrayadam alavatu raledu inka



    హీరోయిన్ మరీ అలా మొబైల్ ఫోన్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ లా ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటే చూడ్డానికి విసుగ్గా అనిపించిందండి..

    and yedO oka mAtalu matladinchaledu phone lo ayina ..gamaninchara...


    ha ha ippudu entha mandi mobile phones lo matladukoni ( gantalu gantalu,vallu serious jobs lo unna kooda ) pelli chesikovatam ledu...naku antha yekkuva sepu matladinatlu anipinchalaaa...nizam gaa.....vallandariki avathalli vallu work/office enti ela untundi telikundane cheskontaru ga..inka avanni manaku enduku cheppandi


    mondi vAdam chestunnatlu anipiste yemo but i expressed my view ...



    ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్..కానీ ఉపయోగించుకోలేదు.

    sure ga manchi artist kani, phalana combinations lo aame talents anni suit avvaka povachu .....ayina konni vargala vaarini impress cheyyadu ,kani that is what the story is annamata.....but aa ammayi chetha cheppinchina maatalu chala , bagunnayi ... akkadakkada dramatigga anipistayi manam choodalem.. targetted audience manam matramE kAdu kada ani saripettukunna..oorullo unde un educated ppl kooda..so ala undi anukonta...
    ...naaku nachaka pothe nenu target audience ni kaadu anthe ...yemantaru .....

    రిప్లయితొలగించండి
  24. సినిమాకి పాటలు అవసరం.. హీరో ఆర్కెస్ట్రా సింగర్ అంటే మంచి పాటలు ఒకటో రెండో ఇవ్వొచ్చు కదండీ? 'ఫలానా ఉద్యోగం చేస్తాడు' అని చెప్పినప్పుడు కనీసం ఒకటి రెండు సీన్లలో అయినా ఆ పని చేస్తున్నట్టు చూపాలి కదా?

    telugu cinima ilane undali ani meeru anukontunnaraaa..leka manalni alaaa cinimalu marchayaaa...aalochinchandi

    Vamsi kontha realistic ga poyadu ...hero programs chestunnatlu ..avi baga vachinatlu manaku ardham ayyayi (avasaramaina chota matrame cheppadu)....asalu kadha phone lo okarinokaru ardham chesikoni prema .......adikaka Venu attire chala normal ga untundi ..archestra lo alane unte bagodu ...ante click avvadu venu ki (super paata unte avuthundi antaru ..aa super paata undalante akkada herion tappa kunda undali ...kani valliddaru choosukokudadu kadaa...enti maniki burra loki ilante doubts vastunnayi) ...

    meeru gamaniste ...herion kooda movie lo ela untundo songs lo kooda alane untundi ..i mean same costumes ...meeru jagratha ga chooste konni konni problems kooda charchincharu movie lo ...metro's lo telidu kani ...kontha varaku kontha mandi ni aalochimpa chestundi ...movie ...problem enti ante antha oorpu ga chooda galara ..ani ...

    asalu vamsi pasalapoodi kadhalu naaku baaga bore kottevi ....swathi lo migatha serials laa levu anukoneedanni ....:) ...hmmm chadive koddi ivi different bagunnayi ani kadaaa...alage konni ilanti movies ..vamsi ardham avvali movie chooda galagutaku ...anukuntaa....anthe ...

    రిప్లయితొలగించండి
  25. @Testing Wheel: మీ point of view లో సినిమా ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. సినిమా సక్సెస్ అంటే , పెట్టిన డబ్బులు రావటమే కదా ....దీనికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది మహా అయితే ...వంశి సినిమా కాబటి ఓపెనింగ్స్ కొద్దో గొప్పో ఉంటాయి ...ఇంకా కిక్ లాంటి మూవీస్ నచని వాళ్ళు చూస్తారేమో ...పెట్టిన డబ్బులు వస్తే సక్సెస్ అనే కదా అంది ...ఇప్పటివరకు వంశి తీసిన సినిమాలు ఇలానే తక్కువ వనరులు (ఆర్టిస్ట్ లు కూడా తక్కువ ఖర్చు తో వచ్చే వాళ్ళు) తో చేసి ఉంటారు అని పిస్తుంది ....

    ఇంకా కామెడి ఇంకొక మూవీ ల అనిపించింది అంటే ..ఆయన గోదావరి జిల్లా లో ఉండే కామెడీ ఏ వాడారు ఇక్కడ.. ఇంకో పాయింట్ , అవును వల్లిద్దరోఒ లో కూడా హీరో , హీరోయిన్ వర్క్ లోకేషన్స్ పై పెద్దగ ద్రుష్టి పెట్టలేదు చూడండి ..ఆ అమ్మాయి ఆఫీసు లో విషయాలు ఒక్కటి కూడా ఉండవ్....ఉన్న తలనొప్పి వచ్చి ఇంటికి వచేయ్యడానికి ఒకసారి ఉందేమో అంతే ...


    మొత్తానికి సినిమా నాకూ నచలేదు ...ప్రభు సడన్ గ వస్తాడు సీన్ లోకి ...ఎలా వచాడు ఆ పేరు ఏంటి , అంత లాస్ట్ లో చూపించాడు ...ఒక వేల అప్పటి వరకు వాడు వేరు వీడు వేరు అని భ్రమిస్తం అనుకున్నాదేమో .... మనం అనుకోలేదు కాబట్టి సస్పెన్స్ లేదు (మీరు .... అన్నారు కదా అంత డబల్ ముందే ఆక్ష తెల్సిపోయి ఆసక్తి పోయింది అని ) డబల్ ఆక్షన్ అని ప్రచారము చేసికోవల్సింది హ హ ....వంశి తన చేసిన సినిమాలు ఒక్కోసారి కమర్షియల్ హిట్స్ అవుతాయి ...కానీ ఆయన తీసిన సినిమాలు అన్ని ఒకలాంటివే (sontha story ayithe ...sithara own story kaadu gaa) ..GGG లో చాల గాప్ లు ఉన్నాయి ..సో ఫెయిల్ ..అంతే

    రిప్లయితొలగించండి
  27. mee review inkosari chooste prabhu ela start ayyadu telsindi ...cam rip lo naku ardham kaalaaa...adi kaka cinima aasakthi ga ledu kada ..

    inka ee cinima lo inko last scene naaku nachindi ...sadharanam ga hero ottu veyinchu konnaka...a nizam inkola bayatiki ravali kadaaa...

    kani valla amme chebuthundi simple ga...ottu ante ooo hype ni taggincharu ...so naku baga nachindi ee point .......mee blog space yekkuva vadesaaaa....kshminchaali :)

    రిప్లయితొలగించండి
  28. @TestingWheel: అయ్యో క్షమాపణ ఎందుకండీ..మీ అభిప్రాయాలు చెబుతున్నారు.. చెప్పండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. సరదాగా కాసేపు కి కామెంటాక గో.గో.గో గురించి మీ రివ్యూ చదవాలని వెతికి మరీ చదివా ఈ టపా.

    >>>గోపి ఏమైపోయాడో అన్న అయోమయంలో గోపిక, సినిమా ఎటు పోతోందో అన్న అయోమయంలో ప్రేక్షకులు ఉండగా
    :)))

    >>>'అసలు దర్శకుడు ఏం చెబుదాం అనుకుంటున్నాడు?' అన్న డౌట్ సినిమా మొదలైన పావుగంటకి మొదలై ముగింపు వరకూ కొనసాగుతూనే ఉంది.
    నాకీ డౌటు ఇప్పటికీ కొనసాగుతూందండి. :)))

    చాలా నిష్పక్షపాతంగా ఉందండి మీ రివ్యూ. అభినందనలు.

    రిప్లయితొలగించండి