మంగళవారం, జనవరి 24, 2012

ముచ్చటగా మూడేళ్ళు...

బ్లాగుల్లోకి వచ్చిన తొలి సంవత్సరంలాగే మూడో సంవత్సరం కూడా తెలియకుండా గడిచిపోయింది. అవును, 'నెమలికన్ను' కి మూడేళ్ళు నిండి నాలుగో వసంతంలోకి అడుగుపెడుతోందివాళ. అప్పుడే మరో ఏడాది గడిచిపోయిందా అనిపిస్తోంది. గడిస్తే మరీ బిజీగానూ, లేకపొతే బహు తీరికగానూ గడిచింది జీవితం. గడిచిన ఏడాది బ్లాగింగ్ దానిని ప్రతిఫలించింది. అన్నట్టు, గడిచిన సంవత్సరం నా బ్లాగు నాకు తెచ్చిపెట్టిన కొత్త మిత్రుల సంఖ్య కొంచం ఎక్కువే!

తొలిసంవత్సరం లో నా టపాల జోరు చూసిన బ్లాగ్మిత్రులు కొందరు, మొదట్లో అందరూ ఇలాగే రాస్తారు కానీ, పోను పోను ఈ వేగం ఉండదు అన్నారు. వారి మాటలని నిజం చేసింది రెండో సంవత్సరం. రాయాలని ఉన్నా రాయలేని పరిస్థితులు. కానైతే, మూడో సంవత్సరానికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒడిదుడుకులు లేకపోలేదు. ఫలితమే, వస్తే రోజుల తరబడి విరామం, లేకుంటే వందరోజుల పాటు నిర్విరామంగా టపాల ప్రచురణ.

తొలి రెండేళ్ళలోనూ కాసిన్ని కథలు ప్రయత్నించిన నేను, మూడో సంవత్సరంలో వాటి జోలికి వెళ్ళలేకపోయాను. కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నా వాటిని కాగితం మీద పెట్టేంత స్పష్టత లేకపోవడం ఒక కారణం. కథలు రాయాలంటే మరికొంచం చదువు అవసరమేమో బహుశా. ఇక చదువు విషయానికి వస్తే, మునుపటితో పోలిస్తే పుస్తకాలు కొంచం బాగానే చదవగలిగాను. వీటిలో కొన్ని పుస్తకాలని గురించి మాత్రమే చెప్పడం అంటే కష్టమే అయినా, 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' పుస్తకం చదవగలగడం మిక్కిలి సంతోషాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు.


ఏడాది కాలంలో నేను రాసుకున్న వాటిలో నాకు కొత్తవిగా అనిపించిన అంశాలు రెండు. మొదటిది అనువాద వ్యాసాలు కాగా, రెండోది యాత్రా కథనం. వంశీ, పాలగుమ్మి విశ్వనాథం గురించి ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసాలని తెనిగించే ప్రయత్నం చేశాను. అలాగే, కుటుంబంతో కలిసి చేసిన ఉత్తరాంధ్ర యాత్ర ని నాకు తోచ్చినట్టుగా టపాయించాను. మొదటిది యాదృచ్చికంగా జరిగింది కాగా, రెండోది ఓ మిత్రులిచ్చిన సలహా మేరకి కొంచం ముందుగానే ప్లాన్ చేసుకున్నది. వారికి కేవలం థాంకులతో సరిపెట్టలేను.

ఏ సంతాన లక్ష్మినైనా నీ పిల్లల్లో ఎవరంటే ఇష్టం అని అడిగి జవాబు రప్పించడం కష్టం. అసలు ఆ ప్రశ్నే వృధా. బ్లాగరు-టపాలకీ ఇదే సామ్యం వర్తిస్తుందని నా అనుకోలు. రాసిన అన్ని టపాలమీద ఒకేలాంటి ప్రేమ ఉన్నా, యాదృచ్చికంగా రాసిన 'భామిని విభునకు వ్రాసిన' పత్రికనూ, మా ఊరు పలికించిన 'పదనిస'లనూ మళ్ళీ మళ్ళీ చదువుకున్నప్పుడు 'నేనే రాశానా ఇవి?' అన్న ఆశ్చర్యం కలిగింది చాలాసార్లు. అలాగే నాకు చాలా ఇష్టమైన 'సాగర సంగమం' గురించి గత పుట్టిన రోజుకి కొంచం ముందర రాసుకున్న టపా కూడా.

ఆన్లైన్లో మెయిలూ, బ్లాగూ మాత్రమే ప్రపంచంగా ఉన్న నేను గడిచిన ఏడాది కాలంలో బజ్జులో ప్రవేశించి, దాని అంతం చూసి, ప్రస్తుతం ప్లస్సులో నేనున్నా అంటున్నాను. బ్లాగ్మిత్రులు సన్నిహితం కావడంతో పాటు, కొత్త మిత్రులు పరిచయం అవుతున్నారక్కడ. మంచి పరిణామమే కదా. మెచ్చుకోళ్ళు, సద్విమర్శలతో పాటుగా వ్యక్తిగత దూషణలూ విన్నానీ సంవత్సరం. వేటిని ఎక్కడవరకూ తీసుకెళ్ళాలో, అక్కడివరకూ మాత్రమే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయాణాలని ఆస్వాదించే నేను, ఈ బ్లాగు ప్రయాణాన్నీ ఆస్వాదిస్తున్నాను. అందుకు కారకులైన మీ అందరికీ పేరుపేరునా మనః పూర్వక కృతజ్ఞతలు. ఊహించని బహుమతితో నన్ను ఆశ్చర్య పరిచిన బ్లాగ్లోకపు పక్కింటబ్బాయి సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

42 వ్యాఖ్యలు:

కొత్తావకాయ చెప్పారు...

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు "నెమలికన్ను" మురళి గారూ! :)

ఇందు చెప్పారు...

Wow!!! Congrats and Happy Birthday to ur blog :)

.శ్రీ. చెప్పారు...

నెమలికన్నుకు బ్లాగ్వార్షికోత్సవ శుభాకాంక్షలునెమలికన్నుకు బ్లాగ్వార్షికోత్సవ శుభాకాంక్షలు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాల్గవ వసంతం లోకి అడుగిడుతున్న మీ బ్లాగుకీ, మీకూ శుభాకాంక్షలు, అభినందనలు.
గత ఏడాది నుంచి నేను మీ బ్లాగు రెగ్యులర్ గానే చదువుతున్నాను. పాతవాటిలో కూడా కొన్ని చదివాను. క్లుప్తం గా, సూటిగా మీ అభిప్రాయం చెప్పే విధానం బాగుంటుంది. నా ఉద్దేశ్యం లో మొదటి 10 తెలుగు బ్లాగుల్లో మీది మొదట్లోనే ఉంటుంది.
మీ బ్లాగు ప్రయాణం ఇలాగే ఆహ్లాదంగా సాగాలని కోరుకుంటున్నాను.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

Congrats Murali gArU. Keep writing.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

శుభాకాంక్షలు మురళి గారూ. మీరిలానే మరిన్ని టపాలను రాయాలను కోరుకుంటూ...మీ బ్లాగ్ అభిమాని,

సునీల్.

Sravya Vattikuti చెప్పారు...

హృదయ పూర్వక అభినందనలు మురళి గారూ!
మీరు మరన్ని జ్ఞాపకాలు , విశేషాలు మాతో పంచుకొంటూ ఇలాగే మీ బ్లాగు ప్రయాణం నిరంతరాయం గా సాగిపోవాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అభినందనలు మురళి గారు :-)

శ్రీలలిత చెప్పారు...

హృదయ పూర్వక అభినందనలు...

మధురవాణి చెప్పారు...

Congratulations.. Happy birthday to 'నెమలికన్ను' :)

ఆ.సౌమ్య చెప్పారు...

Hearty congratulations Murali garu!

'Padmarpita' చెప్పారు...

హృదయ పూర్వక అభినందనలు!!

నైమిష్ చెప్పారు...

హ్రుదయపుర్వక అభినందనలు మురళి గారు..

జయ చెప్పారు...

మురళి గారు అభినందనలండి. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ!!! మీకు బోలెడు బోలెడు తీరిక దొరకాలి అని కోరుకుంటున్నానండి.

జ్యోతిర్మయి చెప్పారు...

అభిననదనలు మురళిగారూ..మాలాంటి ఎంతో మందికి మీరు మార్గదర్శకులు.

సవ్వడి చెప్పారు...

హృదయ పూర్వక అభినందనలు,శుభాకాంక్షలు....

అజ్ఞాత చెప్పారు...

congratulations murali garu :)

నిషిగంధ చెప్పారు...

అభినందనలు, మురళీ.. ఈ నాలుగవ సంవత్సరంలో జ్ఞాపకాల జల్లుల్ని కాస్త పెంచాలని నా విన్నపం :-)

Chandu S చెప్పారు...

మురళి గారూ
congratulations

chakravarti చెప్పారు...

Congratulations Muraligaru... Happy Birthday to Nemalikannu

Swathi చెప్పారు...

మీ బ్లాగు కి జన్మదిన శుభాకాంక్షలు మురళి గారూ. గూగుల్ లో ఏదో వెదుకుతూ మీ బ్లాగ్ లోకి వచ్చాను. నేను తెలుగు బ్లాగ్స్ ముందు చూడలేదు. మీ బ్లాగ్ తోనే మొదలు పెట్టాను. ఇపుడు కొన్ని పదుల్లో బ్లాగులు రొజూ చూస్తూ ఉంటాను. అయినా మీ బ్లాగ్ నాకు ఫేవరెట్. మీ ఉత్తరాంధ్ర యాత్ర చాల బాగుందండి. ఈసారి ఇండియా వస్తే మీ బ్లాగ్ ప్రింట్ అవుట్ తీస్కుని వెళ్లి మరీ ఆ ప్రదేశాలన్నీ చూడాలని అనుకుంటున్నా. ఇలా మమ్మల్ని అలరిస్తున్నందుకు ధన్యవాదములు. మీరు ఇలా మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుతూ,
స్వాతి

అజ్ఞాత చెప్పారు...

అబ్భా మురళీ గారూ ధన్యవాదాలు. నా గురించి మీ టపాలో ధన్యవాదాలు రాశారా. గిల్లిచూసుకున్నానంటే నమ్మండి. మీ బ్లాగ్ప్రస్థానం ఇలాగే సాగాలని అభిలషిస్తూ..
సంతోష్.

రాజి చెప్పారు...

నెమలికన్నుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మురళి గారూ!

Godavari చెప్పారు...

Muraligaru,

congratulations mastaru. keep writing and writing and writing.I wish you all the best.

Vasu చెప్పారు...

అభినందనలు.రాస్తూనే ఉండండి.

మీ బ్లాగ్ చూడడం నా దినచర్య లో భాగం అయిపోయింది.

నేను కొన్న పుస్తకాలలో సగం మీ ద్వారా పరిచయం అయినవే.

Karuna చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు మురళి గారు . చాల రోజుల తరవాత కొంచెం తీరిక దొరికి ఒక్కసారి మీ బ్లాగ్ చదువుదామని వచాను . కరెక్ట్ గా ఈరోజే రావటం లక్ అనుకుంట. చాల మంచి మంచి టపాలనే మిస్ ఐనట్టున్నాను. మల్లి చదవటం మొదలు పెట్టాలి .
I wish you all the best. keep writing.

మాలా కుమార్ చెప్పారు...

ముచ్చటగా మూడు సంవత్సరాలు దిగ్విజయం గా పూర్తి చేసుకున్నందుకు అభినందనలు .

bhavaraju చెప్పారు...

మీ బ్లాగ్ నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశిస్తున్నాను .

చాతకం చెప్పారు...

Best wishes.

vasantha చెప్పారు...

Murali garu ,
mee blog ippude choosanu baagundi. Sahavasi gari ukkupaadam ''baagundi . inka samagra ukkupaadam '' parthasarathy garidi chadavandi choodandi .
vasantha kumari .

మురళి చెప్పారు...

@కొత్తావకాయ: ధన్యవాదాలండీ..

@ఇందు: థాంక్ యూ వెరీ మచ్..

@శ్రీ: ధన్యవాదాలు శ్రీ గారూ..

మురళి చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం: చాలా సంతోషం అండీ.. ధన్యవాదాలు.

@సునీల్ : ధన్యవాదాలండీ..

@శ్రావ్య వట్టికూటి: తప్పక ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

@శ్రీలలిత: ధన్యవాదాలండీ..

@మధురవాణి: థాంక్యూ థాంక్యూ..

మురళి చెప్పారు...

@ఆ. సౌమ్య: రొంబ నండ్రి :-)

@పద్మార్పిత: థాంక్యూ అండీ..

@నైమిష్: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@జయ: ప్చ్.. దొరకడం లేదండీ.. కొంచం గట్టిగా కోరుకోవాలేమో మీరు :-) ..ధన్యవాదాలు.

@జ్యోతిర్మయి: అయ్యబాబోయ్.. చాలా పెద్ద మాట వాడేశారండీ..... ధన్యవాదాలు.

@సవ్వడి: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@శ్రావ్య: ధన్యవాదాలండీ..

@నిషిగంధ: తప్పకుండానండీ.. సమయం చిక్కాలంతే :)) ధన్యవాదాలు..

@చందు ఎస్: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@చక్రవర్తి: థాంక్స్ అండీ.. థాంక్యూ వెరీ మచ్..

@స్వాతి: ధన్యవాదాలండీ..

@పక్కింటబ్బాయి: మీరిచ్చిన సర్ప్రైజ్ కి నేనూ అంతేనండీ :-) ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@రాజి: ధన్యవాదాలండీ..

@గోదావరి: థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్..

@వాసు: చాలా సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు..

మురళి చెప్పారు...

@కరుణ: ధన్యవాదాలండీ..

@మాలాకుమార్: ధన్యవాదాలండీ..

@భావరాజు: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@చాతకం: థాంక్యూ

@వసంత: పార్థసారథి గారి రచనకోసం ప్రయత్నిస్తానండీ.. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

వార్షికోత్సవ శుభాకాంక్షలు.

Welcom back after some gap.

మురళి చెప్పారు...

@బోనగిరి: ధన్యవాదాలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి