సోమవారం, జనవరి 24, 2011

రెండేళ్ళ తర్వాత...

బ్లాగు ప్రయాణంలో రెండో మైలురాయిని దాటుతున్న క్షణాలివి. వెనక్కి తిరిగి చూసుకుంటే నడిచి వచ్చిన దారి పొడవునా పరచిన గులాబీలూ, వాటి అడుగున ఉన్న ముళ్ళూ కూడా కనిపిస్తున్న సమయమిది. నాకు సంబంధించి పుట్టినరోజు అన్నది గడిచిన జీవితాన్ని సమీక్షించుకోవాల్సిన సందర్భం. నా బ్లాగు 'నెమలికన్ను' కి రెండో పుట్టిన రోజు ఇది.

అనుకోకుండా మొదలుపెట్టిన బ్లాగు ఆడుతూ పాడుతూ తొలివసంతం జరుపుకున్న క్షణాలని నేనింకా మర్చిపోకముందే కేలండర్లో మరో పన్నెండు పేజీలు మారిపోయి, కొత్త కేలండర్ వచ్చేసింది. మొదటి సంవత్సరపు బ్లాగింగ్ అనుభవం నాకు ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ మిగిలిస్తే రెండో సంవత్సరం కొన్నివిలువైన పాఠాలని నేర్పించింది. రెండూ మనుగడకి ఉపయోగపడేవే.

నిజానికి రెండో సంవత్సరంలో నా బ్లాగు మనుగడ ప్రశ్నార్ధకంగా అనిపించిన సందర్భాలు ఒకటికి మించే ఉన్నాయి. బ్లాగింగ్ కొనసాగించడం అవసరమా? అన్న ప్రశ్న ఎదురైన ప్రతిసారీ, నేను చేసిన పని ఒక్కటే. వెనుకటి టపాలని ఓసారి చదువుకోవడం. బ్లాగింగుని ఎందుకు కొనసాగించాలో అవి చెప్పకనే చెప్పాయి నాకు. కాలం ఎవరికోసమూ ఆగదు కదా.

మొదటి సంవత్సరంతో పోల్చినప్పుడు, రెండో సంవత్సరంలో టపాల సంఖ్య తగ్గిందన్నది కనిపిస్తున్న సత్యమే. "కేవలం సంఖ్య మాత్రమేనా? లేక టపాలలో నాణ్యత కూడానా?" అన్నది ఈమధ్యనే నన్ను తొలచిన ప్రశ్న. కొన్ని ఇటీవలి టపాలని మళ్ళీ ఓసారి చదువుకున్నప్పుడు నాకే సంతృప్తికరంగా అనిపించలేదు. అదే సమయంలో కొందరు మిత్రులు కూడా నేరుగానూ, పరోక్షంగానూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇది నేను పట్టించుకోవాల్సిన విషయమే.. అలెర్ట్ చేసిన మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు.

వ్యక్తిగత జీవితం ప్రభావం బ్లాగింగ్ మీద పడడం అన్నది మొదటి సంవత్సరం కన్నా, రెండో సంవత్సరంలో ఎక్కువగా జరిగింది. కొన్ని మార్పుల కారణంగా బ్లాగింగుకి కొన్నాళ్ళ పాటు విరామం ఇవ్వడం, మరి కొన్నాళ్ళు తరచుగా టపాలు రాయలేకపోవడం జరిగింది. 'ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది కాదు, ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితమూ కాదు' అన్న వాక్యం చాలాసార్లు గుర్తొచ్చింది.

నన్ను నేను సమీక్షించుకున్నప్పుడు గతంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరంలో చదివిన పుస్తకాల, చూసిన సినిమాల సంఖ్య కూడా తక్కువేనన్న సత్యం బోధ పడింది. ఏడాది క్రితం మొదలుపెట్టిన బ్లాగ్మిత్రులతో లేఖాయణాన్ని ఈ సంవత్సర కాలంలో నేను బాగా ఆస్వాదించిన అంశంగా చెప్పాలి. ఉత్తరాల కారణంగా ఎందరో కొత్త మిత్రులైనారు. వ్యాఖ్యలని మించి వివరంగా స్పందనను తెలపాలనుకున్న మిత్రులు లేఖలు రాశారు. అచ్చుతప్పులు కనిపించిన ప్రతిసారీ ఎత్తిచూపారు. ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించినవే.

కొంచం తరచుగా రాయమన్నది ఎక్కువమంది మిత్రులు చేసిన సూచన. తప్పక దృష్టిలో ఉంచుకుంటాను. నిజానికి నాకు చదవడం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో, రాయడమూ అంతే ఆనందాన్నిస్తుంది. నా రాతలని చదువుతూ, తమ తమ అభిప్రాయాలని సూటిగానూ, స్పష్టంగానూ నాతో పంచుకుంటున్న మిత్రులందరికీ మరో మరు కృతజ్ఞతలు.

29 కామెంట్‌లు:

  1. 'ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది కాదు,ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితమూ కాదు'
    నిజమే మరి.

    మీరిలాగే నాలుగుకాలాలపాటూ రాస్తూ మమ్మలందర్ని అలరించాలని కోరుకుంటూ,మీ బ్లాగు రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ,ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నా.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, ముందుగా రెండు సంవత్సరాల మైలు రాయిని దాటినందుకు అభినందనలు.. మీ ఆలోచనలు, అనుభవాలు అన్నిటినీ మాల గుచ్చి మాకు అందించారు:) ధన్యవాదాలు. మీ నుండి మరెన్నో మంచి మంచి టపాలు ఆశిస్తూ...
    అపర్ణ

    రిప్లయితొలగించండి
  3. Murali Garu ...

    నాకు రోజూ తెలుగు బ్లాగులు చదవడం హబీ .. ఆఫీస్ కి వచ్చి చేసే మొదటి పని బ్లాగులు చదవడం .. ఆ తరువాతే మిగిలిన పనులు ... first చదివే బ్లాగ్ మీదే .. మీ భావాలు అన్నీ చాలా బాగుంటాయి .. తెలుగుదనం ఉట్టిపడుతుంది ... రోజూ చాలా బ్లాగులు చదువుతా కానీ ఎప్పుడు ఎవరి బ్లాగులోను comment రాయలేదు .. ఇప్పుడు office నుండి room కి వెళుతూ మీ బ్లాగులో ఏమైనా update ఉందేమో అని చూసా (ఇది కూడా ఒక అలవాటు లెండి) .. మీ 2 వసంతాల post కనపడింది ... రోజూ మనసును సేదతీర్చే మీ posts కి అభినందనలు తెలియచేసుకుందాం అని comment రాస్తున్నా .... మాది కూడా గోదావరేనండి ... వంశీ గారి పసలపూడి కధలలో రాసే చెల్లూరు మా ఊరు ...

    నెమలికన్ను' కి రెండో పుట్టిన రోజు శూభాకాంక్షలు
    ---- Suresh Mohan

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు.
    మీరు రాసే విధానం నాకు చాలా నచ్చుతుంది.ఎప్పటిలా మీరు మంచి మంచి పోస్టులు రాయాలండి.

    రిప్లయితొలగించండి
  5. మురళి గారు, మీకు హృదయపూర్వక అభినందనలండి. అంతేనండి, మనం ఎంతో ఇష్టంగా, జాగ్రత్తగా పెంచుకుంటున్న పసిబిడ్డలాంటి మన బ్లాగుల మీది అభిమానమే ఈ మధనానికి కారణం. మీరే చెప్పారుగా కొన్ని సమస్యల మూలంగా వీలు కావటంలేదని. ఏం ఫర్వాలేదు,ఎంతో మంచి మంచి పోస్టులన్నీ రాసేస్తారు, చూస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  6. నెమలికన్ను' కి రెండో పుట్టిన రోజు శూభాకాంక్షలు!!

    రిప్లయితొలగించండి
  7. మురళి గారూ మీ బ్లాగ్ కి రెండవ జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారూ
    రెండు వసంతాలు, నాలుగు వందల టపాలు. అందుకోండి అభినందనలు.
    నాకు బ్లాగ్ లోకంలో దాదాపు రెండేళ్ళక్రితం, కొన్ని ఫుడ్ బ్లాగ్స్ తో పాటు,మొదటగా పరిచయమయినవి. మరియు రేగులర్గా చదివేవి, తెలుగు బ్లాగుల్లో మనసులోమాట, నెమలి కన్ను, వేణు శ్రీకాంత్ గారి బ్లాగు, తృష్ణ గారి బ్లాగు, కొత్త పాళీ గారి బ్లాగ్. మీ అందరి బ్లాగ్స్ నుంచి సంగీత సాహిత్యాల గురించి నాకు తెలియనివి ఎన్నో తెలుసుకున్నాను. నాకు తెలిసిన అతి కొన్నిటి గురించి ఇంకా ఎంతో ఎక్కువగానూ, కొత్త కోణంలోనూ కూడా తెలుసుకున్నాను.
    మీ అందరికీ నాలాంటి అజ్ఞాత / అనామక అభిమానులెందరో ఇంకా ఉండే ఉంటారు.

    మీ నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి టపాలు రావాలని ఆశిస్తూ, మీకు అలా రాసే సమయం దొరకాలని కోరుకుంటూ...
    పద్మవల్లి

    రిప్లయితొలగించండి
  9. Happy Birthday to You
    Happy Birthday to You
    Happy Birthday Dear Blog
    Happy Birthday to You.

    From good friends and true,
    From old friends and new,
    May good posts go with you,
    And happiness too.

    మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు :-)

    రిప్లయితొలగించండి
  10. బాగుందండీ మీ సింహావలోకనం! నదీ జీవితం మాట చాలా నచ్చింది. :) నెమలికన్నుకి జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  11. శుభాకాంక్షలు మురళి గారు.
    మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మీరు మూడోనెమలికన్నుతో త్రినేత్రులవుతున్నారు.
    ఎక్కువమంది పాఠకులు రెగ్యులర్ గా చదివే కొద్ది బ్లాగుల్లో మీది కూడా ఒకటి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. చాలా బాగా రాశారు మురళి గారు. నది గురించి రాసిన వాక్యం చాలా బాగుంది. నెమలికన్ను కు రెండో పుట్టిన రోజు శూభాకాంక్షలు, మీకు అభినందనలు..

    రిప్లయితొలగించండి
  13. మొదటగా మీకు అభినందనలు .

    ఈనాడు ద్వారా మొట్టమొదట పరిచయమినది మీ బ్లాగ్ , ఎప్పుడు చూస్తున్న వ్యాఖ్య మాత్రం ఒకటి రెండు సార్లు తప్ప ఎప్పుడు పెట్టలేదు, sorry for that..
    మీ బ్లాగ్ ద్వారానే నెమ్మదిగా మిగిలిన బ్లాగ్ లు, ఇంకా బ్లాగ్ లోకం నాకు పరిచయమయింది,and thanks for this....
    మీ బ్లాగ్ ఇంకా ఎన్నో వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటూ; నేను వ్యాఖ్య పెట్టకపోయినా, ఎప్పుడూ నాది ఒకటి కలుపుకోండి :]

    రిప్లయితొలగించండి
  14. అందమైన నెమలి కన్ను పాపయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  15. "ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది కాదు, ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితమూ కాదు"
    బాగుందండి. శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  16. అభినందనలు.
    బ్లాగు అన్నది ఓ రకంగా మన మనస్సుకి దర్పణం కనుక మన వ్యక్తిగత జీవిత ప్రభావం ఎంతో కొంత దాని మీద ఉండక తప్పదు.

    టపాల నాణ్యత....దీనికి కొలమానం ఏమిటి? మనకి నచ్చినవే మన బ్లాగులో వ్రాసుకుంటాం...ఇష్టంగా వ్రాసుకుంటాం కాబట్టి నా బ్లాగులో అన్ని టపాలు నా దృష్టిలో నాణ్యమయినవే. అలా అనుకుంటేనే మనకి సంతృప్తి :)

    రిప్లయితొలగించండి
  17. నెమలికన్నుకు పుట్టినరోజు జేజేలు !
    మీ పూలదారి అనంతంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండీ :)

    రిప్లయితొలగించండి
  18. Congrats sir.. I have a learnt a lot through your blog..Keep Writing sir.

    రిప్లయితొలగించండి
  19. @శ్రీనివాస్ పప్పు: ధన్యవాదాలండీ..
    @రిషి: ధన్యవాదాలండీ..
    @మనసుపలికే: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  20. @సురేష్ మోహన్: 'చెల్లూరు' అనగానే, షుగర్ ఫాక్టరీ, ఆ వర్ణనలూ, అక్కడ జరిగిన కథలూ అన్నీ గుర్తొచ్చేశాయండీ.. ధన్యవాదాలు.
    @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @జయ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. @సునీత: ధన్యవాదాలండీ..
    @భాను: ధన్యవాదాలండీ..
    @పద్మవల్లి: మూడొందల టపాలేనండీ, నాలుగొందలు కాదు.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @చైతన్య: ధన్యవాదాలండీ..
    @మధురవాణి: ధన్యవాదాలండీ..
    @బోనగిరి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. @వేణూ శ్రీకాంత్: మీరు త్వరగా బ్లాగింగ్ లోకి వచ్చేయాలని నా కోరిక అండీ.. ధన్యవాదాలు.
    @కవిత: అయ్యో, సారీ ఎందుకండీ.. నేనెప్పుడూ వ్యాఖ్యలు లెక్క పెట్టుకోలేదు, విషయాన్ని పట్టించుకున్నాను. టపా మీద మీ అభిప్రాయాలని వెలిబుచ్చేందుకే ఈ వేదికండీ.. ధన్యవాదాలు.
    @Ennela: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  24. @శిశిర: ఎక్కడో చదివిన వాక్యం అండీ.. రాస్తుండగా గుర్తొచ్చింది.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: మీరు చెప్పింది కొంత వరకూ నిజమేనండీ.. అయితే పుస్తకాలు, సినిమాల గురించి ఇటీవల రాసిన కొన్ని టపాలు నన్ను ఆలోచనలో పడేశాయ్. మళ్ళీ చదువుకున్నప్పుడు బాగా రాయలేదేమో అనిపించింది.. ఆ ఆలోచనల ఫలితం అండీ.. :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @పరిమళం: ధన్యవాదాలండీ..

    @స్వాతి: Thank you very much...

    రిప్లయితొలగించండి
  26. లాస్ట్ బట్ నాట్ లీస్ట్..రెండో పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవనదీ లాగా..నెమలికన్ను కూడా నిరంతరం టపాలందిస్తూనే వుండాలి.

    రిప్లయితొలగించండి
  27. నెమలికన్ను కి రెండో పుట్టినరోజు శుభాకాంక్షలండి .
    సారీ కొంచం ఆలశ్యం అయ్యింది .

    రిప్లయితొలగించండి
  28. @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి