"ఓయమ్మోయ్.. నా వొల్ల కాదొలేయ్.. నేను పల్లేనేయ్.. నీ
తమ్ముడికి నా సేతుల్లో ఉన్నాదేయ్.. ఆడి రగతం కళ్ళ సూత్తానేయ్..." మంగళగౌరి
అరుపులు వీధి వీధంతా వినిపిస్తున్నాయ్.
"ఓరుసుకోయమ్మా.. మా తల్లి గదా..
ఒక్క సిటం ఓరిసేవంటే పండంటి కొడుకునెత్తుతావు.. నా మాటినుకోయమ్మా.." గోరు
వెచ్చని ఆముదాన్ని మంగళగౌరి కాళ్ళకి మర్దన చేస్తూ నచ్చచెబుతోంది మంత్రసాని.
పెరట్లో పొయ్యి మీద వేడి నీళ్ళు కాగుతున్నాయి. సూరమ్మ ఇంట్లోకీ, బయటకీ
కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతోంది.
"ఏడే ఆ సచ్చినోడు.. ఎక్కడ సచ్చేడే.. నా
పేనం పోతన్నాదే ఇక్కడ.. నేను బతూతానో సత్తానో తెలకుండా ఉన్నాదే.. ఆడు కంట
బడితే సంపేసి పోతానే..." మంగళగౌరి కేకలు వెక్కిళ్ళ లోకి దిగుతున్నాయి.
చుట్టుపక్కల నాలుగిళ్ళలో ఆడవాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. మగవాళ్ళు బితుకు బితుకుమంటూ చూస్తున్నారు. ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ, అంతలోనే మూలుగుతూ, చిన్ననాటి నుంచీ నేర్చిన తిట్లన్నీ రంగశాయి మీద ప్రయోగిస్తోంది మంగళగౌరి.
చుట్టుపక్కల నాలుగిళ్ళలో ఆడవాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. మగవాళ్ళు బితుకు బితుకుమంటూ చూస్తున్నారు. ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ, అంతలోనే మూలుగుతూ, చిన్ననాటి నుంచీ నేర్చిన తిట్లన్నీ రంగశాయి మీద ప్రయోగిస్తోంది మంగళగౌరి.
విని విని విసుగెత్తిన మంత్రసాని "పెతి సయితీ పురిటి మంచం ఎక్కుతానే మొగున్నిబూతుల్లంకించుకునేదే.. ఒల్లు పచ్చన్నా ఆరకముందే ఎల్లి ఆడిపక్కన తొంగునేదే," అనేసింది. అంత
బాధలోనూ కస్సున లేచింది మంగళగౌరి.
"ఇయ్యన్నీ నేనొక్కద్దాన్నే ఎందుకు పడాల? ఆడెందుకు సుక పడిపోవాల.. సెప్పుమీ," మంత్రసాని ఏమీ మాట్లాడలేదు.
"నిన్ను
కట్టుకున్నాకా ఆ సన్నాసికింకా సుకం గూడానా," అని గొణుక్కుంది సూరమ్మ.
కబురందుకున్న రంగశాయి సైకిలు దిగేడు. మంగళగౌరి హడావిడి అంతా
వింటున్న మగవాళ్ళు అతన్ని లోపలి వెళ్ళనివ్వలేదు.
"తొలిసూలుగదబ్బాయా.. ఇలాగే ఉంటాది.. గాబరడిపోకు.. పండంటి మొగ పిల్లోడుడతాడు.. నాకు మంచి బగుమతీ
ఇవ్వాల," అని రంగశాయికి చెప్పింది మంత్రసాని.
మంగళగౌరి కేకలు వింటుంటే ఏమీ
తోచడం లేదు రంగశాయికి. తనేదో పెద్ద తప్పు చేసినట్టుగా అనిపిస్తోంది. అందరూ
తనని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించి, ఎవరివైపూ చూడలేక పోతున్నాడు. ఆ
ఇంట్లో ఉండలేడు.. అలా అని వెళ్లిపోనూలేడు.
మంత్రసాని ఒక్కర్తికే అతని అవస్థ అర్ధమయినట్టుంది. మధ్య మధ్యలో వచ్చి ధైర్యం చెప్పి వెళ్తోంది. సూర్యాస్తమయం
అవ్వబోతూ ఉండగా ఉన్నట్టుండి మంగళగౌరి కేకలు ఆగిపోయాయి.ఇంట్లో నుంచి
పసిబిడ్డ ఏడుపు వినిపించింది.
మగవాళ్ళు ఎవ్వరికీ లోపల ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. సూర్యుడు గోదాట్లోకి కుంగాక లోపలి నుంచి కబురొచ్చింది.
మగవాళ్ళు ఎవ్వరికీ లోపల ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. సూర్యుడు గోదాట్లోకి కుంగాక లోపలి నుంచి కబురొచ్చింది.
"మగ
పిల్లాడు.. తల్లీ బిడ్డా క్షేమం"
కబురు వింటే తప్ప రంగశాయి మనుషుల్లో పడలేక
పోయాడు. పక్కింటావిడ టీ పెట్టి పంపింది.
"మాయ్యా..
నీకు కొడుకుట్టేడు మాయ్యా.. నాకు పెద్ద పారిటీ సెయ్యాలి మాయ్యా" అంటూ
గంతులేస్తున్నాడు గణపతి. అప్పుడు అర్ధమయ్యింది రంగశాయికి, తను
తండ్రినయ్యానని.
"ఓ కొడుక్కి తండ్రి" ఈ
ఆలోచన రాగానే పసివాడిని చూడాలని తహతహ మొదలయ్యింది. మరుక్షణం మంగళగౌరి
గుర్తొచ్చి భయమూ కలిగింది. ఏమంటుంది మంగళగౌరి? తనకి పెళ్లాన్నే కాదు,
పిల్లాడిని చూడడమూ చేతకాదంటుంది.. ఇంకా ఎన్నైనా అంటుంది.. ఎన్నాళ్ళైనా
అంటుంది.
"అందరూ ఇలాగే ఉంటున్నారా? నా ఒక్కడికే ఇలా అవుతోందా?"
కొబ్బరిచెట్టు కింద వాల్చిన మడత మంచం మీద కూర్చున్న రంగశాయి ఆలోచనలు ఎక్కడో
ఉన్నాయి. పిల్లాడిని చూడ్డానికి రమ్మని లోపలి నుంచి కబురొచ్చేసరికి
అతనీ ప్రపంచంలో లేడు.
నెమ్మదిగా పురిటి మంచం దగ్గరికి వెళ్ళిన రంగశాయి పొత్తిళ్ళలో ఏదో
కదలడాన్ని చూశాడు మొదట. గాల్లో ఆడుతున్న చిన్ని చిన్ని కాలూ, చెయ్యీ
కనబడ్డాయి. దీపం ఒత్తి పెద్దది చేసి, పసివాడికి దగ్గరగా దీపం ఉంచిన
మంత్రసాని, పిల్లాడిని చూడమనట్టుగా సైగ చేసింది.
రెప్ప వెయ్యడం
మర్చిపోయాడు రంగశాయి. మంగళగౌరి వైపు చూసే ధైర్యం లేకపోయింది అతనికి. ఓ
క్షణం తర్వాత తప్పక చూపు తిప్పితే ఆమె నిద్రపోతూ కనిపించింది. "హమ్మయ్య"
అనుకున్నాడు తనకి తెలియకుండానే.
"బాబా.. నా బగుమతి," గుసగుసలాడింది
మంత్రసాని. జేబులో చెయ్యిపెట్టి చేతికందిన డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు,
కలలో ఉన్నట్టు. నోట్లు చూసుకున్న మంత్రసాని ముఖం చింకి చేటంతయ్యింది.
భోజనం చేశాననిపించి మడతమంచం మీదకి చేరిన రంగశాయికి చాలాసేపు
నిద్రపట్టలేదు. పిల్లవాడి ఏడుపు ఉండుండీ వినిపిస్తూనే ఉంది.
మర్నాడు రిహార్సల్ కి వెళ్లేసరికి అందరూ అతనికోసమే ఎదురు
చూస్తున్నారు.
"నిన్నంతా ఎక్కడికెల్లేవెహే.. సెప్పా పెట్టకుండా
సెక్కేసేవు.." అందరితరపునా అడిగాడు సత్యమూర్తి.
సైకిల్నున్న సంచిలోంచి పెద్ద పొట్లం తీసి అందరికీ మిఠాయుండలు పంచాడు రంగశాయి, "కొడుకుట్టేడు," అని చెబుతూ.
మిఠాయి అందుకుంటూ అతని కళ్ళలోకి ఒక్క క్షణం
సూటిగా చూసింది కృష్ణవేణి. మరుక్షణం చూపు తిప్పేసుకుంది.
"ఉంకో ఉండ తీసుకో
కృష్ణేనీ.. రుసిగా ఉన్నాది బెల్లం మిటాయి" అన్నాడు సత్యమూర్తి.
రిహార్సల్ మొదలయ్యింది.
రంగశాయి పరధ్యానంగా ఉండడం కృష్ణవేణి దృష్టిని దాటిపోలేదు.
"అందరికీ
డైలాగులు నోటికి రావాలి.. ఏదన్నా డైలాగు మర్చిపోతే అలా నోరు తెరుచుకుని
నిలబడి పోకండి.. మామూలుగా నడుస్తూ కర్టెన్ దగ్గరకి వస్తే, వెనక నుంచి
ప్రామ్ప్టింగ్ ఇస్తాం.. మొత్తం నాటకం ప్రామ్ప్టింగ్ మీదే నడవదు.. డైలాగులు
గుర్తుండాలి మీ అందరికీ," ఓపిగ్గా చెప్పారు పంతులుగారు.
"నా బుర్ర పంజెయ్యట్లేదు కృష్ణేనీ.. ఇయ్యాల మాయాడోల్లు పుట్టింటికి ఎల్లేరు.. నిన్ను తీసికెల్లి మంచినీల్లిచ్చి పంపెయ్ మంటావా సెప్పు?" అన్నాడు.
రిహార్సల్ పూర్తవుతూనే, "ఇయ్యాల నువ్వు మా ఇంటికి రాక తప్పదు కృష్ణేనీ," అన్నాడు
సత్యమూర్తి.
అందుకోసమే చూస్తున్న దానిలా, "అయ్యో.. అదెంత బాగ్గెం.. ఇప్పుడు
సరాసరి మీ ఇంటికే" అంది నవ్వుతూ. ఒకటి కాదు, రెండు కాదు.. అరడజను
వెలక్కాయలు అడ్డంగా పడ్డాయి సత్యమూర్తి గొంతులో.
"ఆసికాలడతన్నావు," అన్నాడు
బలహీనంగా.
"బలేటోరే.. మా నాన్నగారికి కూడా సెప్పేసి ఒచ్చేనియ్యాల. పలానీ
సచ్చిమూర్తిగోరు రోజూ ఆల్లింటికి పిలుత్తున్నారు అంజెప్పేనో లేదో, పెద్దోరు
పిలిసినప్పుడు ఎల్లి రావాలి.. ఇయ్యాల తప్పకుండా ఎల్లొచ్చెయ్యి అని మరీ మరీ సెప్పేరు.. నడండి ఎల్దారి,"
అంది కృష్ణవేణి.
"నా బుర్ర పంజెయ్యట్లేదు కృష్ణేనీ.. ఇయ్యాల మాయాడోల్లు పుట్టింటికి ఎల్లేరు.. నిన్ను తీసికెల్లి మంచినీల్లిచ్చి పంపెయ్ మంటావా సెప్పు?" అన్నాడు.
అస్సలు తగ్గ దలచుకోలేదు కృష్ణవేణి. "అసలు కోడి పలావు మీకు
కుదిరినట్టు ఆడోల్లకి కూడా కుదరదంటగదా.. కుర్రోల్లందరూ ఒకిటే సెప్పుకోటం..
కోన్ని కాల్సి బోరు పీకిచ్చెత్తే పలావెంతసేపూ.." కుర్రాళ్ళందరూ పైకి
కనిపించకుండా నవ్వుకుంటున్నారు, సత్యమూర్తి అవస్థ చూసి.
"ఇయ్యాల కాదు
గానీ.. ఉంకోపాలొద్దూగాని కృష్ణేనీ.. అగ్గో మన బండి.. మాయాడోల్లని
తీసుకురానాకెల్తంది.. నిన్ను జాగర్తగా మీ ఇంటికాడ దింపేత్తాడు బండోడు..
ఎల్లొచ్చెయ్ మరి.. సందలడి పోతంది.."
కృష్ణవేణి ని బండెక్కించి, ఊపిరి
పీల్చుకున్నాడు సత్యమూర్తి.
(ఇంకా ఉంది)
కృష్ణవేణి సూటి చూపు. ప్చ్..
రిప్లయితొలగించండికథ చాలా బాగా నడిపిస్తున్నారు. interesting!
@కొత్తావకాయ: విడిచిపెట్టకుండా చదువుతున్నందుకు, అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి