శనివారం, జనవరి 01, 2011

మామూలు రోజు...

కొత్త సంవత్సరం వచ్చింది, నావరకు నిశ్శబ్దంగా.. ఈసారి న్యూ ఇయర్ పార్టీల్లాంటివి ఏవీ లేవు.. ఇంకా చెప్పాలంటే కొంచం ఆధ్యాత్మిక వాతావరణం లో ఉండగా కేలండర్ మారిపోయింది. మార్పు సహజమే కదా. భజనానంతరం ప్రసాద వితరణ, అప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం. ఈసారి ఒక్క టీవీ చానల్ కూడా చూడలేదు. అర్ధరాత్రి నుంచే మొబైల్ ఫోన్ పని చేయడం మానేసింది. కాబట్టి నో ఇన్కమింగ్ నో అవుట్ గోయింగ్.

బ్లాగ్మిత్రులు మధురవాణి గారు పంపిన ఈబుక్ తిరగేస్తే ఎందరివి ఎన్ని జ్ఞాపకాలో. అన్నీ నూతన సంవత్సరానికే సంబంధించినవి కావడం ఈ సంకలనం ప్రత్యేకం. కొందరు బ్లాగ్మిత్రుల ఫోటోలని చూసే అవకాశం కూడా కల్పించిందీబుక్. అప్పటివరకూ టపాలు చదివి ఊహల్లో గీసుకున్న బొమ్మలకీ, కొన్ని టపాల చివర్లో ఇచ్చిన బ్లాగరుల ఫోటోలకీ పోలికలు దొరక్కపోవడం ఓ చమత్కారం. పుస్తకం పూర్తి చేశాక మధురవాణి గారికీ, సుజ్జీ గారికీ అభినందనలు చెప్పకుండా ఉండలేం. అన్నట్టు భవదీయుడి టపాకి కూడా ఈ సంకలనంలో చోటిచ్చారు.

న్యూ ఇయర్ రిజల్యూషన్ కాదు కానీ, రోజంతా తీరిక దొరుకుతుంది కాబట్టి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలి అనుకున్నా. న్యూ ఇయర్ రోజున అనుకున్నందుకో ఏమో తెలీదు కానీ, ఒక్కపనీ పూర్తి కాకుండానే రోజు గడిచిపోయింది. తనకున్న పని తినకున్నా తప్పదు కాబట్టి, పైగా రోజూ క్రమం తప్పకుండా బోయినం చేస్తున్నాను కాబట్టీ నాపనులు నేను చేసుకోక తప్పదు.

ఉదయాన్నే తెలిసిన ఓ చిన్న శుభవార్త సంతోషాన్ని కలిగించింది. కొందరు మిత్రులతో పంచుకున్నప్పుడు వాళ్ళు దాన్ని కొత్త సంవత్సరంతో ముడి పెట్టారు. "మంచి కబురు తెలిసిన ప్రతిరోజూ మంచిరోజే" లాంటి వేదాంతాలు చెప్పి వాళ్ళ మూడ్ పాడు చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయా. కొందరు మిత్రులతో పాటు నేను కూడా కొద్ది రోజులుగా ఇలాంటి వార్త కోసం ఎదురుచూస్తున్నా. మాకందరికీ ప్రయోజనం కలిగించే విషయం మరి. దీనినో మంచి శకునంగా అనుకుందాం అని ఏకాభిప్రాయానికి వచ్చాం.

మధ్యాహ్నానికి ఫోన్ సర్విస్ పునరుద్దరింపబడింది. అది మొదలు ఫోన్లు, సందేశాలు. జవాబిచ్చే విషయంలో ఎప్పటిలాగే ప్రాంప్ట్ గా ఉన్నాను. ముఖ్యంగా తర్వాతెప్పుడో కనబడి "...అప్పుడు మీకు మెసేజ్ ఇస్తే కనీసం రిప్లయ్ ఇవ్వలేదు.." అని సాధించే మిత్రులని గుర్తు పెట్టుకుని మరీ, నా జవాబు వారికి చేరిందన్న విషయాన్ని నిర్ధారణ చేసుకున్నా. హమ్మయ్య, ఇప్పుడింక విష్ చేసిన వాళ్ళ చేత మాట పడక్కర్లేదు.

ఫోనుల్లో బోల్డన్ని విషయాలు చర్చకి వచ్చేశాయి. కుటుంబ విషయాలు మొదలు, ఆఫీసులో జరుగుతున్న అన్యాయాల వరకూ అనేకానేక సంగతులు అలవోకగా మాట్లాడేసుకున్నాం. ఎప్పుడూ అలవాటు లేని మధ్యాహ్నం నిద్రకి ప్రయత్నించి భంగపడ్డా. టీవీలో ఏదన్నా సినిమా చూడాలన్న ప్రయత్నమూ అంతగా సాగలేదు. బ్లాగు తెరిస్తే మిత్రుల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు కనిపించాయి. మన బ్లాగు మన డైరీనే కదా, డైరీ రాసినట్టే ఓ టపా రాద్దాం అని మొదలు పెట్టా.. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

20 కామెంట్‌లు:

  1. బాగుందండి.మీకు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. మీకూ మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  3. Wish you a happy and prosperous new year.btw incremenTaa? ramoeshanaa?

    రిప్లయితొలగించండి
  4. బాగుందండి మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  5. మీకు నూతన సంవత్సర శుభాకంక్షలు :) టపా బాగుంది.మీరు చెప్పినట్టే మనకి ఫోన్ చేసినవారికి రిప్లయ్ ఇవ్వకపోతే దోషులని చూసినట్టు చూస్తారు :) ఇదివరకు నేను మెసెజస్...మైయిల్స్ తెగ పెట్టెదాన్ని.ఈసారి ఎందుకో పెట్టాలనిపించలేదు.ఈసారి నాకెంతమంది గుర్తుంచుకుని విష్ చేస్తారో చూద్దామనిపించింది.పర్లేదు.నేను ఎక్స్పెక్ట్ చేసినదానికంటే చాలామంది నన్ను గుర్తుంచుకుని మరీ విషెస్ తెలిపారు :)) హ్మ్! మీకు ఈ కొత్త సంవత్సరం ఆ శుభవార్త లాగే...అంతా సంతోషంగా,ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నా! :)

    రిప్లయితొలగించండి
  6. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు. నూతన సవత్సర శుభాకాంక్షలు మీకు కూడా.

    రిప్లయితొలగించండి
  8. మురళి గారు ఈ నూతన సంవత్సరంలో మీకు మరో శుభవార్త ....మీ సుమన్ గారిది మరో ప్రీమియర్ షో ..ఐ లవ్ యూ డాడీ..త్వరలో. ఈ సంవత్సరం మీకు మంచి శుభకరం..శుభప్రధం అనుకుంటాను ..అన్నీ శుభవార్తలే.

    మీకూ మీ కుటుంబ సభ్యులకూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  9. మురళి గారు,
    నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ కన్నయ్య కొత్త అవతారం ఎత్తినట్టున్నాడు. వివరాలతో టపా రాసుంటారని వచ్చాను. :)

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు మీకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. శుభవార్త ఉత్తుత్తినే చెప్పేయటమేనా..స్వీటేది?

    రిప్లయితొలగించండి
  11. @రాధిక (నాని): ధన్యవాదాలండీ..
    @శ్రీనివాస్ పప్పు: ధన్యవాదాలండీ..
    @సునీత: అలాంటిదేనండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @సుభద్ర: ధన్యవాదాలండీ..

    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    @కొత్తపాళీ: :-) ధన్యవాదాలండీ ..

    రిప్లయితొలగించండి
  13. @ఇందు: నాదీ ఇలాంటి అనుభవమేనండీ :-) ..ధన్యవాదాలు.

    @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    @భావన: ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు?!! ...ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. @సిరిసిరిమువ్వ: అవునండీ, నేనూ చూశాను :-) ..ధన్యవాదాలు.

    @మేధ: thank you :)

    @శిశిర: ఇకనుంచీ క్రమం తప్పకుండా కనిపిస్తాడన్న శుభవార్త కూడా తెలిసిందండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @మాలాకుమార్: ధన్యవాదాలండీ..

    @జయ: ఇంకా స్వీట్స్ వరకూ రాలేదండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి