శనివారం, ఏప్రిల్ 25, 2009

రేగడివిత్తులు

మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇప్పటికీ మన రాష్ట్రం లో అధిక శాతం ప్రజలకి వ్యవసాయమే జీవనాధారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు సాహిత్యంలో వ్యవసాయాన్ని ప్రధానాంశంగా చేసుకుని వచ్చిన రచనలు బహు తక్కువ. గడిచిన దశాబ్ద కాలంలో ఐతే, ఈ రంగాన్ని గురించి వచ్చిన పుస్తకాలను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఈ నేపధ్యంలో వ్యవసాయాన్ని, గ్రామీణ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని చంద్రలత రాసిన నవల 'రేగడివిత్తులు.' ఈ నవల గురించి నా వ్యాసం 'పుస్తకం' లో..

4 వ్యాఖ్యలు:

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

అర్థవంతమైన, అవసరమైన సాహిత్యం సృష్టిస్తున్న రచయిత(త్రు)ల్లో ఒకరు చంద్రలత. ముఖ్యంగా “మార్పు” నేపధ్యంలో పల్లెబ్రతుకుల్ని(రేగడివిత్తులు), పట్నవాస సంధి బ్రతుకుల సందిగ్ధతను (‘ఇదం శరీరం’లో కొన్ని కథలు),పునరావాస వ్యతలకు(దృశ్యాదృశ్యం) గొంతుకనిస్తున్న తీరు అభినందనీయం. (మీరు)పుస్తకం డాట్ నెట్ వీరి మిగతా రచనల పరిచయం కూడా చెయ్యాలని ఎదురుచూస్తాను.

పరిమళం చెప్పారు...

మురళి గారూ!వ్యాసం మీ శైలిలో చక్కగా రాశారు .అభినందనలు .

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఓ మంచి పుస్తకం పరిచయం చేసారు. వ్యవసాయ నేపధ్యం కల కుటుంబం నుండి వచ్చిన దాన్ని అవటం మూలానేమో ఈ పుస్తకంలోని కొన్ని సన్నివేశాలు మా జీవితాలలోనుండి వ్రాసినట్లుగా ఉంటాయి. నేనూ ఈ పుస్తకం గురించి వ్రాసి ఉంచాను పుస్తకం వారికి పంపుదామని:).
మీరన్నట్టు కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా వదలకుండా చదివించే పుస్తకం ఇది.

మురళి చెప్పారు...

@కత్తి మహేష్ కుమార్, పరిమళం: ధన్యవాదాలు
@సిరి సిరి మువ్వ: అయ్యో.. నేను తొందర పడ్డానన్న మాట.. 'నవతరంగం' వాళ్ళు ఒక సినిమాపై ఎన్ని సమీక్షలైనా వేస్తారండి. 'పుస్తకం' వాళ్ళ సంగతి నాకింకా తెలియదు.. ఒకవేళ అక్కడ వీలు కాకపొతే, మీ బ్లాగు లోనైనా ప్రచురించండి.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి