'నేనెందుకు రచనలు చేయకూడదు?' అన్న ఆలోచన నేను మూడో తరగతి లో ఉండగా వచ్చింది. అప్పటికి వార పత్రికల్లో జోకులు చదవడం మొదలుపెట్టాను. రచనల దిశగా నన్ను ప్రేరేపించింది మాత్రం రేడియో. ఇప్పటి పోర్టబుల్ టీవీల సైజులో మా ఇంట్లో ఓ రేడియో ఉండేది. ఒక రకంగా అది స్టేటస్ సింబల్ కూడా.. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఖాళీ వేళల్లో రేడియో వినడానికి మా ఇంటికి వచ్చే వాళ్ళు. ఫలితంగా 'గూ' అని సౌండ్ వచ్చేటప్పుడు తప్ప మిగిలిన సమయం అంతా మా ఇంట్లో రేడియో మోగుతూ ఉండేది.
ఒక సారి రేడియోలో విన్న ఒక నాటిక నాకు బాగా నచ్చింది. పిల్లలు వాళ్ళ అమ్మానాన్నల్లో మార్పు తేవడం అన్నది కథాంశం. సరిగ్గా అప్పుడే మా మేష్టార్లు మమ్మల్ని ఎక్స్ కర్షన్ కి తీసుకు వెళతామన్నారు. అక్కడ మాచేత నాటికలూ అవీ వేయిస్తామన్నారు. ఆ ఎక్స్ కర్షన్ కోసం నేను నాటిక రాయడం మొదలుపెట్టా.. ఓ చిన్న పిల్లాడు వాళ్ళ నాన్న చేత సిగరెట్లు మాన్పించడం అన్నది ఇతివృత్తం. మా నాన్న సిగరెట్లు కాల్చేవాళ్ళని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.
మూడు పాత్రలతో ఓ నాటిక రాశాను. ఇక అక్కడినుంచి నేను కలలు కనడం మొదలుపెట్టా.. మేము నాటకం వేయడం, అది చూసి మా నాన్న నన్ను మెచ్చుకుని సిగరెట్లు మానేయడం, అమ్మ బోల్డంత సంతోషపడడం ఇలా సినిమాటిక్ గా సాగేవి. రెండు కాగితాల మీద నేను రాసిన నా మొదటి రచనని నా మిత్రులు మేష్టారికి చూపించారు. అది చూసి ఆయన ఏమి మాట్లాడ లేదు. కారణాలు తెలియదు కానీ మా ఎక్స్ కర్షన్ కేన్సిల్ అయ్యింది. అన్నట్టు మా మేష్టారు కూడా సిగరెట్లు కాల్చేవాళ్ళు.
హైస్కూలికి వచ్చేసరికి పద్యాల మీద మోజు మొదలైంది. అందుకు కారణం మా తెలుగు మేష్టారు. ఆయన శ్రావ్యమైన గొంతుతో పద్యాలు చదివే వాళ్ళు. దానికి తోడు రవీంద్రనాథ్ టాగూర్ తన పదో ఏటే కవిత్వం రాయడం మొదలు పెట్టారని చెప్పారాయన. ఇక అది మొదలు నేను పద్యాలు అనుకుని ఏవేవో రాసి ఆయనకి చూపించడం.. ఆయనేమో కవిత్వం బాగా చదివితే బాగా రాయగలుగుతావు అని చెప్పడం. ఇది పని కాదని నేను జానపద గేయాల వైపు మళ్ళాను. ఇందుకు కూడా రేడియో స్ఫూర్తి. పల్లవి, ఒక చరణం చొప్పున నాలుగైదు పాటలు రాశాను.
అప్పుడే కథలు, సీరియల్స్ చదవడం మొదలుపెట్టడం తో పద్యం కన్నా గద్యం బెటరన్న భావన బలపడింది. ఓసారి సెలవుల్లో మా వీధిలో కూర్చుని ఉంటే పందుల్ని మేపే వాళ్ళు ఓ పెద్ద పందుల గుంపుతో వచ్చారు. వాటిని చూడగానే 'పంది' గురించి ఓ సీరియల్ ఎందుకు రాయకూడదు అన్న ఆలోచన వచ్చింది. పంది మీద నాకంత అభిమానం కలగడానికి ఓ కారణం ఉంది. 'పంది వెధవ' అన్న తిట్టు నా చిన్నప్పుడు చాలా కామన్. అది వినీ, వినీ పంది కూడా మనలాంటిదే కదా అనుకోవడం మొదలుపెట్టాను.
పందులు, పందుల్ని కాసే వాళ్ళ జీవన విధానం గురించి నేను రాసిన సీరియల్ సగం కూడా పూర్తవ్వక ముందే మా సెలవులు ఐపోయాయి. పేరాల మధ్యలో మూడు చుక్కలు పెట్టడం తో సహా ప్రముఖ రచయితల శైలిని అనుకరిస్తూ చేసిన రచన అది. చాలా రోజులు దాచాను కాని, పూర్తి చేయలేక పోయాను. 'నన్నయ భట్టు అంతటి వాడే మహా భారతం పూర్తి చేయలేక పోయాడు' అని సరిపెట్టుకున్నా.. ఈలోగా ఇతర కళల మీదకు దృష్టి మళ్ళడంతో రచన మూలన పడింది.
ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. మీరు ప్రస్తుతం బ్లాగురచయిత. అభినందనలు.
రిప్లయితొలగించండిమీరు చిన్నప్పటి నుండే రచయిత అన్నమాట. మీ శైలి నాకు నచ్చుతుంది. మీరు రాసే పాత విషయాలు చదువుతున్నప్పుడు జాడీ లోని పాత అవకాయ తింటున్నట్టు ఉంటుంది నాకు. మీకు చిన్నప్పటి విషయాలు పూసగుచ్చినట్టు గుర్తున్నాయే...
రిప్లయితొలగించండిఅబ్దుల్ కలాం గారి నినాదం నిజమయే వేళ ఆసన్నమయింధన్నమాట!
రిప్లయితొలగించండినిజం చెపితే నవ్వుతారేమో కాని నాకు బుజ్జిపందిపిల్లలంటే ఎంతో ముద్దు .అవి బుజ్జిగా వాళ్ళమ్మ వెనుక బెదిరే కళ్ళు వేసుకుని బుల్లిమూతి తో ఎంత బాఉంటాయో.మేము చిత్తూర్ లో వున్నప్పుడు ఎక్కువగా చూసేదాన్ని ,,మా ఇంటి అవతల గోడ ప్రక్క ఖాళి స్థలాల్లో చేరి ఆడేవి. వాటిని పట్టుకోవడానికి వాడే పద్ధతి హృదయం ద్రవించిపోతది .అలానే వీధి కుక్కపిల్లలన్న , బుల్లి పిల్లులన్న చాల ఇష్టం .మొత్తానికి మీ "రచన" నా బోలెడన్ని ఇష్టాల్ని గుర్తు చేసింది . పందిపిల్లల మీద కథ రాయరు ....ప్లీజ్ ..
బాగుందండి మీ రచనా పాటవం. ఇంకా నయం ఆ "పందుల కత" పూర్తి అయితే పేద్ద రచయత ఐపోయే వారు, అప్పుడు ఈ బ్లాగ్ లోకం లోకి రావటానికి కుదరక ఈ ప్రపంచం ఒక మంచి బ్లాగ్రచయత ను కోల్పోయేది.. ఏది జరిగినా మన మంచికే అంటే ఇదేనన్న మాట... (మీ మంచికి కాదు మా మంచి కి)
రిప్లయితొలగించండిమురళీ భాయ్ ఒక లుక్కేయ్యండి ఇక్కడ
రిప్లయితొలగించండిhttp://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html
బావున్నాయండీ
రిప్లయితొలగించండిఅప్పటి మీ రచనలు ఏవైనా ఉంటే మాతో పంచుకోండి. :)
ippuDu chakkagaanae raastunnaaru.
రిప్లయితొలగించండిపందులు, పందుల్ని కాసే వాళ్ళ జీవన విధానం గురించి నేను రాసిన సీరియల్ సగం కూడా పూర్తవ్వక ముందే ....అదేదో ఇప్పుడు పూర్తి చేసి బ్లాగులో పెట్టండి. మేము కూడా ఎంజాయ్ చేస్తాము కదా.
రిప్లయితొలగించండిమూడవతరగతి నుండా!!!!
రిప్లయితొలగించండిఅదన్నమాట అక్కడ మొదలైంది
మీ రచనాపటిమకు పునాది!!!!
మీకు ఇంక తిరుగేముందండీ!!!
వ్యాఖ్య రాసిన బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆ రాతప్రతి ఇప్పుడు దొరికే అవకాశం చాలా తక్కువ. దొరికితే ఒకటి రెండు భాగాలైనా బ్లాగులో ఉంచుతాను :)
రిప్లయితొలగించండి:) :)
రిప్లయితొలగించండి:))
రిప్లయితొలగించండిhttp://nalonenu.blogspot.com/2007/10/blog-post_05.html