మంగళవారం, జనవరి 19, 2010

ఆంధ్రలేఖ వారికి...

ఆంధ్రలేఖ వారికి,

నమస్తే. నా పేరు మురళి. గత ఏడాది కాలంగా 'నెమలికన్ను' (http://nemalikannu.blogspot.com/) పేరుతో తెలుగు బ్లాగు రాస్తున్నాను. మీరు ప్రకటించిన బ్లాగుల పోటీకి నా బ్లాగు ఎంట్రీ గా వచ్చిందని, టాప్ టెన్ కి ఎంపికయ్యిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే నా బ్లాగును ఎంట్రీ గా నేను పంపలేదు. పోటీలో పాల్గొనడం నా అభిమతం కాదు కాబట్టి మీరు ప్రకటించిన పోటీకి నేను దూరంగా ఉన్నాను.

'చైతన్య యామినేని' పేరుతో మీకు ఎంట్రీ రావడం నన్ను షాక్ కి గురిచేసింది. ఇది ఎలా జరిగిందో అర్ధం కావడం లేదు. ఏమైనప్పటికీ, ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న పోటీ నుంచి 'నెమలికన్ను' ఎంట్రీ ని తొలగించాల్సిందిగా కోరుతున్నాను. మీకు పంపుతున్న ఈ ఉత్తరాన్ని నా బ్లాగులో కూడా ప్రచురిస్తున్నాను.

ధన్యవాదాలతో..
--
మురళి

21 కామెంట్‌లు:

  1. ఆ చైతన్య యామినేని నేనైతే కాదండి :ఓ

    ఒకవేళ కొంత స్పెల్లింగ్ మార్పుతో ఆ చైతన్య గారికి కూడా నెమలికన్ను అనే బ్లాగు ఉందేమో!

    రిప్లయితొలగించండి
  2. ఏమిటీ ఐడెంటిటీ తెఫ్ట్. దారుణం.

    రిప్లయితొలగించండి
  3. చైతన్య యామినేని మీ అసలు పేరనుకున్నాను . మీరు కాదా ? పోటీ కి ఎవరో మీ అభిమానులే పంపి వుంటారు . వుండనీయాల్సింది .

    రిప్లయితొలగించండి
  4. hello murali garu ,
    i too saw it. i want to tell you but later thought may be its your name only.anyblogger can identify whose blog it it?then how come they published without verifying the name?

    రిప్లయితొలగించండి
  5. మాలాకుమార్ గారి మాటే నాదీనూ..

    రిప్లయితొలగించండి
  6. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయమే! బ్లాగు సొంతదారు అభిప్రాయం తీసుకోకుండా ఇలా పోటీకి పంపించటం తప్పే. ఆ పంపింది మీ బ్లాగు మీద అభిమానంతో పంపినా కనీసం మీకు మాటమాత్రం చెప్పకుండా పంపటం ఏమాత్రం బాగోలేదు.. ఆ పంపింది ఎవరో ఇప్పటికైనా మీ బ్లాగు ముఖంగా వివరణ ఇస్తే బాగుంటుంది!
    @చైతన్య గారు, లేదండి..అక్కడ ఇచ్చిన URL కి వెళ్ళి చూసాను..అది మురళి గారి నెమలికన్నే..ఇంకొకరి నెమలికన్ను కాదు.

    ఆ సైటు నిర్వాహకులు కూడా ఇలాంటి విషయాలల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.

    రిప్లయితొలగించండి
  7. మీకు తెలీకుండా మీ బ్లాగుని వేరెవరో పోటీకి పంపడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఆంధ్రలేఖ వారు కూడా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఇది. మన సొంత మెయిలు ఐడి, వివరాలతో, వేరొకరి బ్లాగు లింకును పోటీకి పంపడం అభిమానంతో చేసే పని అంటే.. నేనయితే సమాధానపడలేకపోతున్నాను. వరూధిని గారన్నట్టు ఆ చైతన్య ఎవరో మీ బ్లాగ్ముఖంగా స్పందిస్తారేమో చూద్దాం.

    రిప్లయితొలగించండి
  8. మురళి ,మీ ప్రైజే వాళ్ళు కొట్టేయలనేమో -:) ఎంత అభిమానం వుంటే మాత్రం ఒక ముక్క చెప్పాల్సింది మీకు .

    రిప్లయితొలగించండి
  9. ఇది నేను గమనించనే లేదు ....మీమీద ఎంతో అభిమానముంటే తప్ప అలా చేయరు .ఎవరైనా మీకు సన్నిహితులై ఉంటారు ...అయినా మీ అనుమతి తీసుకోవాల్సింది .ప్చ్ .........

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. @Chaitanya Yemineni: ముందుగా మీకు ధన్యవాదాలు. ఏం జరిగిందో అర్ధం కాని కన్ఫ్యూజన్ లో ఉన్న నాకు, జరిగింది ఏమిటో చెప్పారు. నాకు ఆ పోటీలో పాల్గోవడం ఇష్టం లేదండీ.. కారణాలు పూర్తిగా వ్యక్తిగతం. అందుకే నామినేషన్ పంపలేదు. బ్లాగ్మిత్రుల ద్వారా నా బ్లాగు మరొకరి పేరుతొ నామినేట్ అయిందన్న విషయం తెలిసింది. మొదటగా 'ఆంధ్రలేఖ' వారికి జాబు రాసి, జరిగిందేమిటో అందరికీ చెప్పడం కోసం ఆ కాపీని బ్లాగులో ఉంచాను. వారు జవాబు కోసం ఎదురు చూస్తుండగానే మీ స్పందన వచ్చింది. విషయం ఏమిటో తెలియకుండా ఎవరినీ అనుమానించ దల్చుకోలేదండీ.. అదిప్పుడు నన్ను 'గిల్ట్' నుంచి రక్షించింది. మీరు నామినేషన్ ప్రతిపాదిస్తున్నట్టుగా నాకు ఒక వ్యాఖ్య రూపంలో అయినా చెప్పి ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదేమో.. చెప్పాను కదండీ, పోటీలో పాల్గొనడం ఇష్టం లేదని, అందుకే ఎంట్రీ తొలగించమని కోరాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు. మీరు అభిమానంతో నా బ్లాగుని నామినేట్ చేసినందుకూ, ఇప్పుడు కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసినందుకూ చాలా చాలా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @చైతన్య: 'ఎవరై ఉంటారు?' 'ఎందుకు చేశారు?' అనే విషయాల్లో ఊహాగానాలేవీ చేయలేదండీ.. స్పందనకి ధన్యవాదాలు.
    @Vasu: చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతేనండీ.. ధన్యవాదాలు.
    @మాలా కుమార్: పోటీలో పాల్గొనడం నాకు ఇష్టం లేదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @స్వాతి మాధవ్: 'ఆంధ్ర లేఖ' వారి నుంచి జవాబు రావాల్సి ఉందండీ.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: వారికి నా మాట చెప్పాను కదండీ.. అదే మీకూను.. ధన్యవాదాలు.
    @సిరిసిరి మువ్వ: కమ్యూనికేషన్ గ్యాప్ అండీ.. ఇప్పుడు క్లియర్ అయింది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @మధురవాణి: నేను కూడా 'ఆంధ్ర లేఖ' వారి స్పందన కోసం చూస్తున్నానండీ.. ధన్యవాదాలు.
    @చిన్ని: నిజమేనండీ.. అప్పుడీ కన్ఫ్యూజన్ ఉండేది కాదు.. ధన్యవాదాలు.
    @పరిమళం: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @Chaitanya Yemineni
    సారి అండీ ,...సరదాగా మురళి తో జోక్ చేసాను .

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. చైతన్య గారు అభిమానంతో చేసి భలే ఇరుక్కు పోయారే! నేనయితే ముందు అది మురళిగారి అసలు పేరేమో అనుకున్నా! చైతన్య గారూ, భలే తికమక పెట్టేసారండి మమ్ముల్నందర్ని. అయినా ఆంద్రలేఖ వారు ఇప్పటివరకు చైతన్య గారు కోరినట్లు అక్కడ పేరు మార్చటం కాని....మురళి గారు కోరినట్లు ఆయన బ్లాగుని పోటీనుండి తొలగించటం కాని చెయ్యలేదు..ఇలాంటి తప్పులు జరిగినప్పుడు వెంటనే సరిదిద్దుకుంటే అపోహలకు తావుండదు.

    రిప్లయితొలగించండి
  18. వరూధిని గారన్నట్లు మీకు ఇష్టం లేనప్పుడు తొందర గ తొలగస్తే బాగుండేది ఆంధ్ర లేఖ నిర్వాహకులు.

    రిప్లయితొలగించండి
  19. అయ్యయ్యో.. చైతన్య గారు చెప్పాక కూడా ఆంధ్రలేఖ వారు సకాలంలో స్పందించి క్లియర్ చేయకపోవడం వల్ల అది చివరికి ఇంత అయోమయానికి దారి తీసిందన్న మాట.!
    పోన్లెండి...విషయం ఏంటో తెలిసిపోయిందిగా :)

    రిప్లయితొలగించండి
  20. @సిరిసిరిమువ్వ: వారి నుంచి ఇప్పటికీ స్పందన లేదండీ..ప్చ్..
    @భావన: నేనూ అదే కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
    @మధురవాణి: అవునండీ.. అదొక్కటే ఊరట.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి