మంగళవారం, నవంబర్ 24, 2009

చెయ్యి విరిగినట్టుంది..

భాస్కర్ రామరాజు గారు 'నాన్న' బ్లాగులో దేశీ పాకశాస్త్ర నిపుణుడు మెహతా వంటల పోటీల్లో పాల్గోబోతున్నాడని రాసినప్పుడు మెహతా కి అభినందనలు చెప్పాను. తర్వాత మెహతా ఓడినా గెలిచినట్టే అని మరో టపా రాస్తే 'నిజమే' అని నా అభిప్రాయం ప్రకటించాను. 'సాహితి' మాలాకుమార్ గారు ఉసిరికాయ గురించీ, ఊర్వశి గురించీ రాసినవి చదివి 'ఉసిరికాయ తో చవన్ప్రాస్ చేసుకోవచ్చు కదండీ?' అనే సందేహాన్ని వెలిబుచ్చి, 'ఇన్నాళ్ళ తర్వాత కూడా ఊర్వశి ని గుర్తు పెట్టుకోడం నిజంగా గ్రేట్' అని అభిప్రాయం చెప్పాను.

నిషిగంధ గారు మీటిన 'మానసవీణా' నాదాన్ని విని, 'మరువం' ఉష గారు బ్లాగుకి సెలవులు ప్రకటిస్తే 'సెలవుల్ని ఎంజాయ్ చేసొచ్చి ఆ కబుర్లన్నీ చెప్పండి' అని అడిగి, అటునుంచి అటే 'పరిమళం' గారి కవిత మీద, 'జ్యోతి' గారి నవలానాయకుడి మీదా నా అబ్బిప్పిరాయాన్ని ప్రకటించి వచ్చాను. అంతేనా? కూడలి లో టపాలు చదివి నచ్చిన టపాలకి వ్యాఖ్యలు రాశాను. "ఇవన్నీఅందరూ రోజూ చేసే పనులే కదా.. జైల్లో రామదాసు 'సీతమ్మకి చేయిస్తీ..' అన్నట్టు ఈ జాబితా అంతా ఎందుకు?" అంటే... అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే.. నా వ్యాఖ్యలేవీ ప్రచురింప బడలేదు.

గత వారం నా కంప్యూటర్ కి వైరల్ ఫీవర్ వచ్చింది.. సాంకేతిక పరిభాషలో వైరస్ అన్నమాట. వైద్యం జరిగింది.. అక్కడే కథ అడ్డం తిరిగింది. 'ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్నట్టుగా అయ్యింది పరిస్థితి. అప్పటి నుంచీ కొన్ని బ్లాగుల్లో కామెంటడం వీలవ్వడం లేదు. అసలు ఇప్పటికే వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయడం సహన పరీక్షగా మారడం తో, చాలాసార్లు కామెంటాలనిపించినా వీలు కాక మౌనంగా వచ్చేస్తున్నా.. ఇప్పుడు కొన్ని బ్లాగ్ స్పాట్ బ్లాగుల్లో వ్యాఖ్య రాసినా అది ప్రచురింప బడడం లేదు.

మొదటి రెండు రోజులూ ఈ సమస్యని పట్టించుకోలేదు.. అదే సెట్ అవుతుందిలే అని ఒకలాంటి ధీమా. 'నాతో నేను నాగురించి' వేణూ శ్రీకాంత్ గారి 'పొగబండి' టపా చదివి, ముచ్చట పడి, కామెంట్ రాసే వీల్లేక పోవడం తో ఆయనకి మెయిల్ ద్వారా వ్యాఖ్యని పంపాను. పనిలో పనిగా, సమస్య నుంచి బయట పడ్డానికి తగు సలహాలు, సూచనలు ఇమ్మని మిత్రులని అడిగాను. సమస్య లోకి కొంచం పరిశోధన చేస్తే అర్ధం అయిన సంగతి ఏమిటంటే, వ్యాఖ్యలు ఫుల్ పేజి లోనూ, పాప్-అప్ విండో లోనూ ఉన్న బ్లాగులతో ఎలాంటి సమస్యా లేదు. టపా కింద 'ఎంబెడెడ్' గా ఉన్న బ్లాగుల్లోనే వస్తోంది చిక్కు.

నా మిషిన్ లో వాడుతున్నది ఐయీ (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్).. కారణాంతరాల వల్ల మంటనక్క (ఫైర్ ఫాక్స్) కి మారలేను. అందువల్ల ఐయీ లోనే సమస్య పరిష్కరించుకునే మార్గాలు కావాలి. మిత్రులు చెప్పిన ఒకటి రెండు చిట్కాలు పని చేయలేదు. గతం లో నా బ్లాగులోనూ కామెంట్లు ఎంబెడెడ్ పద్ధతిలో ఉండేవి.. బ్లాగ్మిత్రుల సూచనల మేరకు ఫుల్ పేజీలోకి మార్చాను. ఇప్పుడు నో కంప్లైంట్స్. ఇప్పుడు బ్లాగ్మిత్రులని నేను కోరేది ఏమిటంటే.. మిత్రులారా మీలో చాలామంది కంప్యూటర్ కార్మికులు (సాఫ్ట్ వేర్ నేపధ్యంగా ఆర్. నారాయణ మూర్తి సినిమా తీస్తే టైటిల్ ఏం పెడతాడా? అన్న ఆలోచన ఫలితం), ఈ సమస్య గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు.. ఈ సమస్య నుంచి బయట పడే చిట్టి చిట్కాలు ఉంటే చెప్పండి.

టపా చదివాక వ్యాఖ్య రాయాలనిపించక పోతే అది వేరే విషయం. అలా కాక, అబ్బిప్పిరాయం ప్రకటించాలని అనిపించినా పూర్తి 'సాంకేతిక' కారణాల వల్ల ఇలా మౌనంగా ఉండాల్సి రావడం భలే ఇబ్బందిగా ఉంది. దీనికి మిషిన్ మార్చడం అనే శాశ్విత పరిష్కారం ఉంది కానీ, దానికి కొంచం టైం పట్టేలా ఉంది. బ్లాగ్ కమ్యూనికేషన్స్ లో కామెంట్ బాక్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో కదా అనిపిస్తోందిప్పుడు.

24 కామెంట్‌లు:

  1. మురళి ఈరోజు నాకు ఇదే ప్రోబ్లం వచ్చింది తృష్ణ బ్లాగ్ లో కామెంట్ రాయడానికి కష్టపడ్డాను మద్యాహ్నం అన్నట్లు నా లాప్ టాప్ లో ఫుల్ స్టాప్ ,షిఫ్ట్ పనిచేయడం లేదు మనది వేరేవాళ్ళు వాడి పాడుచేసేసారు ,అన్నిటికి కామాలే పెట్టుకుపోవాలి మరీ బొత్తిగా నెట్ వాడకంలో పరిజ్ఞానమే సున్నా సో మా లాంటివాళ్ళం రోలు మద్దెల సామెత -:) మురళి ఈరోజు నాకు ఇదే ప్రోబ్లం వచ్చింది తృష్ణ బ్లాగ్ లో కామెంట్ రాయడానికి కష్టపడ్డాను మద్యాహ్నం అన్నట్లు నా లాప్ టాప్ లో ఫుల్ స్టాప్ ,షిఫ్ట్ పనిచేయడం లేదు మనది వేరేవాళ్ళు వాడి పాడుచేసేసారు ,అన్నిటికి కామాలే పెట్టుకుపోవాలి మరీ బొత్తిగా నెట్ వాడకంలో పరిజ్ఞానమే సున్నా సో మా లాంటివాళ్ళం రోలు మద్దెల సామెత -:)

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు, ఇంతటి సమస్య మీకు రావటమేమిటండి. మీ కామెంట్స్ లేకపోతే ఎలాగా? మీకు నేనెటువంటి సహాయం చేయలేకపోయినా, ఎందుకో మీకు రాయకుండా కూడా ఉండలేకపొతున్నాను. రెండు రోజులు నేను ఊరికి వెళ్ళి వచ్చేటప్పటికి, కూడలి కూడా రావటం లేదు. మన ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారులెండి. పొద్దుటికల్లా మీ సమస్య తీరిపోతుంది. అలాగే, కూడలి కూడా మళ్ళీ పెట్టించరూ!
    All the best.

    రిప్లయితొలగించండి
  3. అందరిని పాప్అప్ విండో పెట్టుకోమనండి... నిజమే పెద్ద సమస్యే సుమా. నా చిట్కా ఐతే అందరిని పాప్ అప్ విండో పెట్టుకోమనండి. అవునండి మీ కామెంట్ రాక పోతే అనుకుంటాము అవును మురళి గారు చదవలేదా అని ఖచ్చితం గా..

    రిప్లయితొలగించండి
  4. అయ్యో ! మీ కామెంట్స్ నాకు రాలేదండి . అయితే చాలా మిస్ అయ్యానన్నమాట . మీరు తొందరగా మీ సమస్య నుండి బయటపడాలని మనస్పూర్తిగా కోరుకోవటము తప్ప నేనేమీ చేయలేని అసహాయరాలుని .
    థాంక్యు .

    రిప్లయితొలగించండి
  5. వ్యాఖ్యలేవీ రాలేదు నిజమే !ఇది ఇబ్బంది కలిగించే విషయం ...."కంప్యూటర్ కార్మికులు" :) స్పందించి త్వరగా ఈ సమస్య నుంచి బయట పడే చిట్టి చిట్కాలు ఉంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  6. నిజమే మురళి గారు కామెంట్ రాయాలనిపించినపుడు రాయలేకపోడం కష్టమనిపిస్తుంది. మీ లేఖ చూసిన మరుక్షణం నా కామెంట్స్ ను ఫుల్ పేజ్ కి మార్చాను. నేను ఐఈ వాడటం మానేసి చాలా రోజులు అయింది, అందుకే సాంకేతిక పరమైన సలహా ఇవ్వలేకపోయాను. ఫైర్ ఫాక్స్ కాకుంటే గూగుల్ క్రోమ్, యాపిల్ సఫారీ లాటి బ్రౌజర్‍లకు మారే వీలుంటే అవి ప్రయత్నించగలరు. అయినా ఈ పాటికే మన టెకీ బ్లాగర్ల నుండి మీకు కావలసిన సాయం అందిఉంటుంది అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. ఇదేమిటి మీరు టపాలకు "అబ్బిప్పిరాయాన్ని ప్రకటించి"....వెళ్పోయి...మళ్ళీ తిరిగి వచ్చి చూస్తారు కూడానా? ఇదేదో ఎనిమిదవ వింతలా ఉందే..:) :)

    రిప్లయితొలగించండి
  8. మీ పోస్ట్ చదివి నిన్న నెట్ లో దీనిగురించి సెర్చ్ చేశాను...వాటిలో కోడ్ లో మార్చుకోవాలి అన్నట్టు సలహా ఇచ్చారు..ఎలా మార్చాలో కూడా చెప్పారు...అయితే అవి ఖచ్చితంగా ప్రాబ్లంని రెక్టిఫై చేస్తాయని గ్యారెంటీ ఏమీలేదు(గత అనుభవంతో చెబుతున్నా)...పైగా కోడ్ మార్చుకోవటం అనేది కాస్తంత తికమక పెట్టే వ్యవహారం కూడానూ...ఇతర బ్లాగర్లు తమ కమెంట్ బాక్స్ ని వేరేపేజీలో ఓపెన్ చేసుకుంటే తప్ప దీనికి పర్మినెంట్ సొల్యుషన్ ఉండదని నా ఫీలింగ్...

    రిప్లయితొలగించండి
  9. ఈ సమస్య నాకూ వచ్చింది నా కంప్యూటర్ కి ఏ రోగమూ రాకుండానే! అప్పుడు నేను బ్లాగు మిత్రులందరినీ "మీరు ఫుల్ పేజీ కి మార్చండి మీ కామెంట్ ఫోరం ని" అని అడిగి మరీ మార్పించి రాస్తున్నా! తృష్ణ గారినడగండి కావాలంటే!

    రిప్లయితొలగించండి
  10. @తృష్ణ: ఎంతమాట?! అయినా ఇక్కడ విషయం అది కాదండీ.. నేను రాసిన వ్యాఖ్య కామెంట్ బాక్స్ నుంచి మాయం అవ్వడం లేదు.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: చూశానండీ మీ బ్లాగు.. భలే సంతోషంగా అనిపించింది.. వెంటనే స్పందించినందుకు.. క్రోం ప్రయత్నిస్తానండి.. చూడాలి.. ఎవరో ఒకరు..ఇపుడో ఎపుడో .. సలహా ఇస్తారేమో.. ధన్యవాదాలు.
    @పరిమళం: చెబుతారండీ.. నాకు నమ్మకమే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @మాలాకుమార్: రెండో వ్యాఖ్య రాసేటప్పుడు అర్ధంయ్యిందండీ.. కామెంట్స్ పబ్లిష్ కావడం లేదని.. ధన్యవాదాలు.
    @భావన: ఎవరి బ్లాగుకి వాళ్ళే 'సుమన్ బాబు' కదండీ.. వాళ్ళ సెట్టింగ్స్ మార్చుకోమని నేనెలా అడగడం?? అయినా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో చిన్న విషయం.. పాప్-అప్ విండో కన్నా ఫుల్ పేజి సౌకర్యంగా ఉంటోంది.. వ్యాఖ్యలు రాయడానికీ, చదవడానికీ కూడా.. ధన్యవాదాలు.
    @జయ: అబ్బే.. మీ బ్లాగులో కామెంట్స్ ఫుల్ పేజి లోనే ఉంటాయి కదండీ.. ఇబ్బంది లేదు.. అలా కాకుండా టపా కింద మాత్రమే వ్యాఖ్యలని పోస్ట్ చేయాల్సిన బ్లాగులతోనే ప్రస్తుతానికి ఇబ్బంది.. పరిష్కారానికి ప్రయత్నిస్తానండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @చిన్ని: మీ వ్యాఖ్య చూస్తే చాలండీ, మీ సమస్య కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది :):) కీ బోర్డ్ ప్రాబ్లం సులువుగానే సాల్వ్ అవుతుందండీ.. నా సమస్య సాఫ్ట్వేర్ తో.. ధన్యవాదాలు.
    @సుజాత: అవునా.. నేను ఇది రోగం వల్ల వచ్చిన సమస్య అనుకుంటున్నానండీ.. వైరస్ లేకపోయినా ఇబ్బంది వస్తోందన్న మాట అయితే.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: మీ టైం స్పెండ్ చేసి పరిష్కారం కోసం వెతికినందుకు ముందుగా బోల్డన్ని థాంకులు.. బ్రౌజర్ మార్చే ప్రయత్నం చేస్తానండీ.. కుదరకపోతే ఇక అప్పుడు ఆలోచించాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. మీ బాధ నేనర్ధం చేసుకోగలను మురళి గారు.ఎంచేతంటే నాదీ అదే పరిస్థితి కనుక.
    చక్కగా ఇలా అచ్చ తెలుగులో నా "అబ్బిప్పిరాయాన్ని" వెలిబుచ్చాలనుకుంటే కొన్ని తెలుగు బ్లాగులలోవీలవటం లేదు.కారణం, కాపీ పేస్ట్ సౌకర్యం లేకపొవడమే.

    అది లేనప్పుడు లేఖిని మార్గాన కాకుండా మరి ఏవిధంగా తెలుగు లో కామెంటాలో తెలిసేంత సాంకేతిక పరిజ్ఞానం నాకు లేకపోవటంతో నా పరిస్థితి 'సిరి వెన్నెల ' సినిమాలో సుహాసిని పరిస్థితి లా వుంది.
    మరీ మనసూరుకోనప్పుడు యెంగిలిపీచు లో కామెంటి...హీరో పాట రేడియో లొ వింటూ గొంతు కలిపే ప్రయత్నం చేసిన సుహాసిని లా ఫీలయి పోతూంటాను.
    అదేమిటో ctrl+v మంత్రం కూడా అక్కడ పని చేయదు.దీనికి మీరేమయినా సలహా చెప్పగలరా? ప్లీజ్.

    రిప్లయితొలగించండి
  14. హుర్రే...మురళి గారు..మీ ప్రాబ్లంకి సొల్యుషన్ దొరికింది...
    మీరు IE వాడుతున్నారు గనుక ఈ క్రింది స్టేప్స్ ఫాలో అవ్వండి.
    1) మీ బ్రౌజర్లో Tools --> Internet Options కి వెళ్ళండి.
    2) Privacy అని ఉన్న Tab లోకి వెళ్ళండి.
    ---మీరు వాడుతున్నది IE6 అయితే---
    3) అక్కడ మీటర్ లాగ ఉంది కదా...దాన్ని క్రిందకు దించి Accept All Cookies దగ్గర మీటర్ ని సెట్ చెయ్యండి.
    ---మీరు వాడుతున్నది IE7 అయితే---
    3) Third Party Cookies అన్నదాని క్రింద మూడు Radio buttons ఉంటాయి. Accept అని ఉన్న ఆప్షన్ ని సెలక్ట్ చెయ్యండి.

    4)OK click చేయండీ.

    ---Fire Fox వాడేవాళ్ళు---
    Follow 1 and 2 steps...

    Privacy Tab లో Accept third-party cookies అనే చెక్ బాక్స్ ని చెక్ చేసి సెట్ట్టింగ్స్ సేవ్ చెయ్యండి

    PROBLEM IS SOLVED...

    ఇంత సోది మాకొద్దురా బాబు...సింపుల్ గా చెప్పు అంటారా..? అయితే మీ బ్రౌజర్లో(ఏదైనా సరే) Third-Party Cookies ని Enable చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. :-):-)

    రిప్లయితొలగించండి
  15. మురళిగారు,
    మీరు ఏయే బ్లాగులతో ఈ సమస్య వచ్చింది. నాకు ఒక చిన్న పరిష్కారం దొరికింది. అదీ ఆ బ్లాగర్లు చేస్తే ఈ సమస్య తీరుతుందేమో చూద్దాం.

    dashboard>Layout>edit html.. ఇక్కడ html కోడ్ ఉండే బాక్స్ క్రింద ఎడమవైపు Revert widget templates to default లింకు క్లిక్ చేయాలి. దానివలన ఎంబెడ్ ఫార్మ్ అలాగే ఉంటుంది. ఇది పనిచేస్తే బ్లాగ్ గురువులో టపా పెడతాను. లేదంటే html కోడ్ లో మార్పులు చేయాలి.అది అందరికి సాధ్యం కాదు మరి. లేదా నాకు మెయిల్ చేయగలరా??

    రిప్లయితొలగించండి
  16. ఇక IE తో ఎప్పుడూ ప్రాబ్లమే. మంటనక్కకి మారిపోండి..

    రిప్లయితొలగించండి
  17. ఇప్పుడు సమస్య తీరిందనుకుంటాను.. సుఖాంతమేగా.. ;)

    రిప్లయితొలగించండి
  18. నాకేదో తోచక చేతికొచ్చింది రాసుకుంటుంటే దానికి సమయాన్ని కేటాయించి, నాకన్నా బద్దకస్తులైనా నాకోసం వ్యాఖ్యరాసేవాళ్లకి వర్డ్ వెరిఫికేషన్, మొక్కజొన్న కిటికీలు పెట్టి విసిగించకూడదని ఇప్పటిదాకా ఇరికించిన కిటికీలోనే వ్యాఖ్యను రాయమన్నా. ఈటపా చదివాకే ఇందులో ఇబ్బందులు తెలిశాయి. అందుకే వెంటనే మార్చేశా.

    రిప్లయితొలగించండి
  19. @జ్యోతి: మీరు చెప్పిన పరిష్కారం వర్కౌట్ కాలేదండీ.. కామెంట్స్ 'ఎంబెడెడ్' ఫాం లో ఉన్న బ్లాగుల్లోనే సమస్య వస్తోంది (మీ బ్లాగుతో సహా).. బ్లాగు గురువులో కామెంట్స్ ని ఫుల్ పేజి ఫాం లోకి మార్చుకోడం గురించి రాస్తే బాగుంటుందేమో.. నాకైతే ఇదే పరిష్కారం అనిపిస్తోంది.. ధన్యవాదాలు.
    @సత్య: 'సిరి వెన్నెల' సుహాసిని తో భలేగా పోల్చారు.. నిజంగా నాదీ అలాంటి పరిస్థితే.. పరిష్కారం వ్యాఖ్యలు రాసేవారి చేతిలో లేదండీ.. బ్లాగర్ల చేతిలో ఉంది.. వాళ్ళ సెట్టింగులలో మార్పులు చేసుకోవాలి. కామెంట్స్ ఆప్షన్ 'ఫుల్ పేజి' కి మారితే ఎలాంటి కంప్యూటర్ లో నుంచైనా వ్యాఖ్యలు రాయొచ్చు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @శేఖర్ పెద్దగోపు: ప్చ్.. లాభం లేదండీ. నాది IE-6.. కానీ మీ ఉపాయం పని చేయలేదు.. మీరు ముందుగా చెప్పినట్టుగా బ్లాగర్లు 'ఫుల్ పేజి' ఆప్షన్ లోకి మారడమే పరిష్కారమేమో.. మీకు చాలా బోల్డన్ని థాంకులు..
    @శివ చెరువు: అబ్బే లేదండీ.. అలాగే ఉంది.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: వావ్.. చాలా మంచి పని చేశారండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. మురళి గారు,
    నాకు కూడా ఆఫీస్ మొజిల్లా బ్రౌజర్లో కమెంట్ పెట్టినప్పుడు మీ ప్రాబ్లమే వచ్చేది. నిన్న నేను చెప్పిన పద్దతి ఫాలో అయిన తర్వాత అది రెక్టిఫై అయ్యింది. అందుకే ఉత్సాహంగా చెప్పాను.
    మీరు ఇంకోసారి ఈ స్టెప్ ఫాలో కండి...
    Tools-->Options-->Privacy Tab...
    ఇక్కడ వరకు మీకు తెలిసిందే..నిన్న చెప్పిన(IE6) స్టెప్ ఫాలో అవుతూ అక్కడ Advance అనే బటన్ ఉంది చూశారా? అది క్లిక్ చేయండి...ఇంకో విండో ఓపెన్ అవుతుంది..అక్కడ Override Cookie Handling అనే checkbox చెక్ అయ్యిందేమో చూడండి...ఒకవేళ చెక్ అయివుంటే దాని దిగువున Third Party Cookies క్రింద ఏ Radio button check అయ్యిందో చూడండి...బహుశా అక్కడ block అనే Radio button చెక్ అయ్యుంటుంది...అందుకే సాల్వ్ కాలేదేమో...మీరు అక్కడ Accept Radio buton చెక్ చెయ్యండి...

    మీకు ie6 కి చెప్పిన స్టేప్ లో నిన్న ఈ క్లారిటీ మిస్ అయ్యింది..ఒక్కసారి ప్రయత్నించండి మళ్ళీ...

    రిప్లయితొలగించండి
  22. @శేఖర్ పెద్దగోపు: ఫస్ట్ పార్టీ కుకీస్,థర్డ్ పార్టీ కుకీస్ రెండూ యాక్సెప్ట్ చేశానండి.. రాలేదు.. ఫస్ట్ పార్టీ కుకీస్ బ్లాక్ చేసి థర్డ్ పార్టీ కుకీస్ మాత్రమె యాక్సెప్ట్ చేశానండీ అయినా రాలేదు.. సమస్య ఇంకెక్కడైనా ఉందేమో మరి.. కేవలం 'ఎంబెడెడ్' బ్లాగుల్లో మాత్రమే సమస్య వస్తోంది.. మీకు చాలా చాలా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @బ్లాగ్ మిత్రులు: మీ బ్లాగులో కామెంట్స్ 'ఎంబెడెడ్' ఫాం లో ఉంటే (అంటే కామెంట్ బాక్స్ టపా కింద ఉండి, అక్కడ మాత్రమే కామెంట్ పేస్ట్ చేసేలా ఉంటే) ఫుల్ పేజి ఆప్షన్ లోకి మార్చుకోడం సులువే. డాష్ బోర్డ్ లో సెట్టింగ్స్ క్లిక్ చేసి అక్కడి నుంచి కామెంట్స్ లోకి వెళ్ళండి. 'కామెంట్ ఫాంస్' అని ఉన్న చోట 'ఫుల్ పేజి' ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ చేయండి..

    రిప్లయితొలగించండి
  24. మురళి,

    ఈ రెండు పరిష్కారాలు పనిచేయకుంటే కామెంట్ పార్మ్ మార్చుకోవడమే మేలు అనుకుంటాను. ఇన్నిరోజులు బానే ఉన్న ఈ ఆప్షన్ ఇప్పుడెందుకు ఇలా జరుగుతుందో చూడాలి.నేను కామెంట్ ఫుల్ పేజ్ చేసాను..

    రిప్లయితొలగించండి