దీపావళి బాణాసంచా అంతా ఆనందంగా కాల్చేసి భోజనం కానిచ్చి ముసుగుతన్ని పడుకున్నానా.. అసలే చలికాలం అవడం వల్ల వెంటనే నిద్ర పట్టేసిందా.. బుగ్గ మీద చల్లటి చెయ్యి తగలడం తో మెలకువ వచ్చేసింది. అప్పుడు నాకు ఏడేళ్ళు. ఆ చెయ్యి అమ్మది. అమ్మేమీ మాట్లాడకుండానే నాకు విషయం అర్ధమయిపోయింది. కప్పుకున్న దుప్పటినే నెత్తి మీదనుంచీ ముసుగులా వేసుకుని, ఓ చేత్తో చివర్లో ఇత్తడి తొడుగు తొడిగిన పేద్ద కర్రా, మరో చేత్తో లంతరూ పట్టుకుని బయలుదేరాను. నా వెనుక పూజ సామాన్ల బుట్టతో అమ్మ.
చప్పుడవకుండా తలుపు దగ్గరగా వేసి, ఇంటి ముందు రోడ్డు దాటగానే చెరువు. చెరువు గట్టు మీద మెట్లలా పరచిన రాళ్ళ మీద కర్ర చప్పుడు చేసుకుంటూ నేను.. లాంతరు వెలుగులో నా వెనుక జాగ్రత్తగా నడుస్తూ అమ్మ. అమ్మని ఒక నిమిషం ఆగమని సైగ చేసి, నేను చివరి మెట్టు వరకూ దిగి, కర్రతో రాళ్ళు తట్టి, నీళ్ళని రెండు మూడు సార్లు కదిపి, గట్టు మీదకి వచ్చి కూర్చున్నాను. మెట్ల మీద పాములేవైనా నిద్ర పోతూ ఉంటే ఆ చప్పుళ్ళకి చెర్లోకి వెళ్లిపోతాయన్న మాట.
నేనేమో చలికి పళ్ళు కొరుక్కుంటూ గట్టు మీద కూర్చున్నానా, అమ్మ 'కార్తీక దామోదరుడా.. మోక్షగుండ దామోదరుడా.. ' అనుకుంటూ నీళ్ళలోకి దిగి, మూడు మునకలు వేసి, తడి చీరతో గట్టు మీదకి వచ్చి లాంతరు వెలుగులో పూజ మొదలు పెట్టేస్తుంది. నేను కునికి పాట్లు పడుతూనే అమ్మ 'నైవేద్యంబిదిగో..' పాడేస్తుందేమో అని ఒక చెవి అటు వేసి ఉంచడం. ముందు రోజు సాయంత్రమే సంపాదించి పెట్టుకున్న అరటి దొప్పలో దీపం వెలిగించి అమ్మ ఆ పాట పాడుతూ గంట వాయించేస్తుందన్న మాట.
మరి నాకేంటి లాభం? అంటే.. ఉంది కదా.. ఇంట్లోనుంచి జాగ్రత్తగా తెచ్చిన చిన్న బెల్లం ముక్కని తమలపాకులో నైవేద్యం పెట్టేది దేవుడికే అయినా, 'ప్రసాదం' ఆరగించేది నేనే కదా.. నల్లటి చెరువు మీద తెల్లటి మంచు కురుస్తూ ఉంటుందా.. అరటి దొప్పలో వెలిగించిన దీపం మెరుస్తూ నీళ్ళలోకి వెళ్తుంటే ప్రసాదం చప్పరిస్తూ చూడడం భలేగా ఉంటుంది.. చెరువులో చేపలు దీపాన్ని ఎక్కువ దూరం వెళ్ళనివ్వవు.. దీపాన్ని తినడానికి ప్రయత్నించి ఆర్పేస్తాయి.. తప్పు తప్పు.. దీపం కొండెక్కిపోయింది అనాలి. దీపం కొండెక్కే వరకూ ఉండి, అప్పుడు ఇంటికి వెళ్ళాలి మేము. అది మొదలు కార్తీక మాసం నెల్లాళ్ళూ దిన చర్య ఇలాగే ఉండేది చిన్నప్పుడు.. అంటే నా ఐదో ఏటి నుంచి దాదాపు పదేళ్ళు.
ప్రసాదం ఒక్కటేనా? తెల్లవారు జామునే అమ్మకి సాయం వెళ్లాను కాబట్టి మరో అరగంటో, గంటో ఆలస్యంగా లేవొచ్చు. ప్రసాదం తో పాటు క్షీరాబ్ది ద్వాదశి కి, పున్నమికి, పోలిస్వర్గానికి ఐదేసి పైసల చొప్పున దక్షిణ కూడా దొరికేది. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించేది అమ్మ. పున్నమికి అయితే ఇంటి పక్కనే జ్వాలా తోరణం జరిగేది. అంటే ఒక పేద్ద వెంటిని (ఎండుగడ్డి తో పేనిన లావుపాటి తాడు) తోరణంలా కట్టి వెలిగించి, మంటల్లోనుంచి దేవుడి పల్లకితో పాటు మూడు సార్లు 'హర హర మాహాదేవ' అంటూ తిరగాలన్న మాట. ఈ కార్యక్రమం రాత్రి పూట చంద్ర దర్శనం అయ్యాక జరుగుతుంది.
పున్నమి స్పెషల్ చలివిడి. అమ్మ ఉపవాసం ఉండి పిండి కొట్టి చలివిడి చేసుకునేది.. సారెల్లో పంచి పెట్టే చలివిడి కన్నా ఈ చలివిడి చాలా రుచిగా ఉండేది. కొంచం పెద్ద క్లాసుల్లోకి వచ్చాక కార్తీక మాసం నుంచి మరిన్ని లాభాలు పొందొచ్చని తెలిసింది. మామూలుగానే నాకు చిన్నప్పుడు సోమవారం బడికి వెళ్ళాలంటే భలే చిరాగ్గా ఉండేది.. ఆదివారం అంతా ఆటల్లో గడపడం వల్ల సోమవారం కూడా ఇంట్లో ఉండి పోవాలనిపించేది. కార్తీక మాసం ఐతే 'అమ్మా నేను కూడా ఉపవాసం ఉంటానమ్మా..' అంటే చాలు అమ్మ నా భక్తికి బోల్డంత మురిసిపోయి అయితే ఇవాళ బడి మానేయ్ అని అడక్కుండానే పర్మిషన్ ఇచ్చేసేది. హైస్కూలుకి వచ్చాక అమ్మకి కొంచం మస్కా కొట్టి దక్షిణ రోజూ ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నాను. అంటే రోజూ ఐదు పైసలన్నమాట.
మొదటి వారంలో ఉదయాన్నే లేవడం కొంచం ఇబ్బందిగా ఉండేది కానీ, త్వరలోనే అలవాటైపోయేది. ముఖ్యంగా అమ్మ చెర్లోకి వదిలిన కార్తీక దీపాన్ని ఎంతసేపైనా చూడాలనిపించేది. కార్తీక మాసానికి అలవాటు పడేలోగానే 'పోలిస్వర్గం' వచ్చేసేది.. అంటే మరేమిటో కాదు కార్తీక అమావాస్య. ఆరోజు తెల్లవారు జామున మా వీధి మహిళలంతా పిల్లలని తోడు తీసుకుని స్నానానికి వచ్చే వాళ్ళు, చెరువుకి. వాళ్ళంతా స్నానం, పూజ లో ఉంటే మేమంతా చలిమంటలు వేసుకునే వాళ్ళం. ఓ పక్క పూజలు అవుతుండగానే ఎవరి ప్రసాదం ఏమిటో ఎంక్వయిరీలు చేసుకునే వాళ్ళం.
పోలిస్వర్గం రోజున ఒక్కొక్కరూ రెండు మూడు రకాల ప్రసాదాలు పెట్టేవాళ్ళు. అరటిపండు ముక్కలు, జాంపండు ముక్కలు ఇలా అన్నమాట.. ఇక చలివిడి, వడపప్పు సరేసరి. పిల్లలందరం రాజ్యంగారి ప్రసాదం కోసం ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళు కొంచం గొప్పవాళ్ళన్న విషయం ఆవిడ ఎప్పుడూ గుర్తు పెట్టుకునేవారు. అందుకే ప్రసాదాలు కూడా అందర్లా కాకుండా యాపిల్ ముక్కలు, కమలా ఫలం తొనలు ఇలా కొంచం ఘనంగా ఉండేవి. అంతేనా.. ఆవిడ దక్షిణ పది పైసలు మొదలు పావలా వరకూ ఉండేది, తీసుకునే పిల్లల వయసును బట్టి.
మిగిలిన రోజుల్లా కాకుండా, పోలిస్వర్గం రోజున ఒక్కొక్కరూ ముప్పై కి తక్కువ కాకుండా దీపాలు వదిలేవాళ్ళు. చెరువంతా భలే మెరిసిపోయేది దీపాలతో. పూజ అయ్యాక ఒక కథ చెప్పుకుని అప్పుడు దీపాలు వదిలేవాళ్ళు. ఆ కథ ఏమిటంటే ఒక ఊళ్ళో ఓ మడేలమ్మ ఉంటుంది. ఆవిడకి బోల్డంత భక్తి. కార్తీక మాసం నెల్లాళ్ళూ తెల్లవారు జామునే దగ్గర్లో ఉన్న నదికి వెళ్లి స్నానం చేసి, దీపం వదిలి ఇంటికి వచ్చేది. అయితే ఆవిడ చాలా గయ్యాళి. తన కోడలు 'పోలి' కి కూడా యెంతో భక్తి ఉన్నా, ఆ అమ్మాయిని స్నానానికి తీసుకెళ్ళేది కాదు. అత్తగారికి ఎదురు చెప్పలేక పోలి బోల్డంత బాధ పడేది.
అమావాస్య రోజున అత్తగారు స్నానానికి వెళ్ళాకా, ఒక్క రోజు కూడా దీపం వదల్లేక పోయానే అని పోలి బోల్డంత బాధ పడి, ఇంట్లోనే స్నానం చేసి, వంటింట్లో కవ్వం చివర ఉన్న వెన్నతో దీపం వెలిగించి ఊరందరి బట్టలూ ఉతికే మట్టి బాన లో నీళ్ళు నింపి అందులో దీపం వదులుతుంది. వెంటనే దేవుడు విమానంలో వచ్చి 'పోలీ నీ భక్తి కి మెచ్చాను.. స్వర్గానికి తీసుకెళ్తాను' అంటాడు. అప్పుడే నది నుంచి వచ్చిన అత్తగారు అడ్డుపడి 'మరి నేను రోజూ దీపం వదిలాను కదా' అని వాదిస్తుంది. అప్పుడు దేవుడు 'నాకు భక్తి ప్రధానం.. పోలి భక్తితో వదిలిన దీపమే గొప్పది..' అని చెబుతాడు. అప్పుడు పోలి 'మా అత్తగారిని కూడా తీసుకొస్తేనే నేను స్వర్గానికి వస్తాను' అంటుంది. దేవుడు వాళ్ళిద్దరినీ స్వర్గానికి తీసుకెళ్తాడన్న మాట.
ఈ కథ చెప్పి అమ్మ, అమ్మ ఫ్రెండ్సు అత్తగార్లు ఎన్ని బాధలు పెట్టినా కోడళ్ళు వాళ్ళ మంచే కోరతారు అని జోకులు వేస్తే, రాజ్యం గారిలాంటి వాళ్ళు తిరిగి ఏదో సమాధానం చెప్పేవాళ్ళు. మేమేమో 'మన గుర్రమ్మని వాళ్ళ కోడలే స్వర్గానికి తీసుకెళ్లాలన్న మాట' అనుకునే వాళ్ళం. 'అంబ నీకిదిగో హారతీ..' 'క్షీరాబ్ది కన్యకకు..' లాంటి పాటలు పాడి అప్పుడు దీపాలు వదిలేవాళ్ళు.
ఆవేళ బళ్ళో మేము ఎవరికి ఎవరు ఎన్ని డబ్బులిచ్చారో లెక్కలేసుకునే వాళ్ళం. నాకోసారి పోలిస్వర్గం కథ విన్నాక ఓ డౌటు వచ్చింది. ఆడ వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్ళారు సరే.. మరి వాళ్ళింట్లో మగవాళ్ళకి స్వర్గం వద్దా? అని. ఇంటికొచ్చాక అమ్మని ఈ డౌట్ అడిగితే, నాన్న విని 'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగాళ్ళకి ఇంక ఇల్లే స్వర్గం..' అన్నారు. ఆ జోకు అర్ధం కావడానికి మరి కొన్నేళ్ళు పట్టింది నాకు.
ఓహ్! కార్తీక అమావాస్యని పోలిస్వర్గం అంటారా!! ఆ సంగతి తెలియదు...
రిప్లయితొలగించండిమిగితా విషయాలు, కార్తీక మాసంలో ఇంచుమించు మా ఇంట్లో కూడా ఇంతే...
>>'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగాళ్ళకి ఇంక ఇల్లే స్వర్గం..' అన్నారు
:))
నేను ఇంకా సొమవారం పోలి స్వర్గం కధతో టపా రాద్దామనుకుంటూంటేనూ...
రిప్లయితొలగించండిమొత్తం కార్తీకాన్నీ...బుల్లి మురళిగారిని మా కళ్ళ ముందు ఉంచారు...అందుకే అన్నారండీ చిన్ననాటి జ్ఞాపకాలూ విరబూసిన మందారాలూ..అని..
భలే ఉంది పోలి స్వర్గం కథ :)
రిప్లయితొలగించండిమీ కార్తీక మాస అనుభవాలు చాలా బాగున్నాయి మురళి గారు. దయచేసి ఒక్కసారి మీ ఊరి పేరు చెప్పండి, ప్లీజ్.
రిప్లయితొలగించండిపోలిస్వర్గం వెనకనున్న కధ నాకు ఇప్పటివరకూ తెలీదు!
రిప్లయితొలగించండి"నల్లటి చెరువు మీద తెల్లటి మంచు కురుస్తూ ఉంటుందా.. అరటి దొప్పలో వెలిగించిన దీపం మెరుస్తూ నీళ్ళలోకి వెళ్తుంటే ప్రసాదం చప్పరిస్తూ చూడడం భలేగా ఉంటుంది.. "
ఎంత బాగా వర్ణించారండీ! నగరం నడిబొడ్డున పెరగడంవల్ల ఇలాంటి అనుభవాలు ఎన్ని మిస్ అయ్యానో :((
Beautiful.
రిప్లయితొలగించండివీలుంటే, ఈ కథ చూడండి.
http://tethulika.files.wordpress.com/2009/03/maamestritvam.pdf
నిషిగంధ గారు చెప్పినట్టు నగరంలో పుట్టిన మా లాంటి వాళ్లకి ఈ సరదాలన్నీ ఎండమావులే..!
రిప్లయితొలగించండిమీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది మురళి గారూ..కాకపోతే మీ సందేహం చిన్నప్పుడే తీరింది..నాది ఇదిగో ఇప్పుడు తీరింది.
బాగున్నాయ్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు.
అబ్బ..ఎంత మధురమైన జ్ఞాపకాలూ,అనుభూతులు..అంతే చక్కగా చెప్పారు/వర్ణించారు కూడా...మీరు చెప్పే చిన్నప్పటి సంగతులు చదువుతుంటే నాకు ఆర్.కే.నారాయణ్ 'మాల్గుడి కధలు' గుర్తొస్తాయి. మీరు అందులో స్వామీ పాత్రలాగ కనిపిస్తారు నాకు.
రిప్లయితొలగించండి@జయ గారు, మన మురళి గారు తూ.గో జిల్లా వాస్యవ్యులు..
భల్లే మీరుకూడా నాకులాగే ప్రసాదానికి ప్రాముఖ్యత ఇచ్చేవారన్న మాట.
రిప్లయితొలగించండినాకోడౌటు- అత్తాకోడల్లిద్దరూ వెళ్తే ఇక అక్కడ 'స్వర్గం' ఎలా ఉంటుంది?
>>'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగాళ్ళకి ఇంక ఇల్లే స్వర్గం..' అన్నారు
రిప్లయితొలగించండిఇది సూపర్...
కార్తీక మాసం అంటే రోజుకొక జామపండు తినటం, పౌర్ణమికి బూరెలు తినటం, ఆ మాసంలో చేసే వ్రత కధలు చదవటం గుర్తుకువస్తుంది నాకు. మీరు ఇన్ని చేసేవారన్నమాట. ఎప్పటిలానే మీ టపా బాగుంది. చల్లగా ఒక చెయ్యి తగిలింది అనగానే మీరు కూడా ఉమాశంకర్‌గారిలా హారర్ కధ చెప్పాలనుకుంటున్నారేమోననుకున్నాను.:)
రిప్లయితొలగించండిపోలిస్వర్గం గురిన్చి విన్నాను కానీ,ఇంత వివరంగా తెలియదని.మంచి విషయాన్ని తెలియచేసారు.thank you
రిప్లయితొలగించండిచాల బాగుంది ...అమ్మకి చీకట్లో దారి చూపుతున్న మురళిని ఆవిష్కరించారు ...కర్రతో నీళ్ళలో చప్పుడు చేయడం మరింత ముద్దుగా వుంది .
రిప్లయితొలగించండిమురళిగారు ! సిటీకి వచ్చాక నాకు దూరమైన నా జీవితాన్ని కళ్ళ ముందుంచారు మీరు! ఉద్వేగంతో మాటలు రావట్లేదు .ఒక్కొక్కటిగా అన్నీ కళ్ళముందు కదలాడాయ్! తడిపిండిలో బెల్లం ,కొబ్బరి , వెన్న వేసితొక్కిన చలివిడి రుచి , జ్వాలా తోరణం పల్లకీ వెళ్ళాకా పాలేర్లంతా పశుసమృద్ధి కోసం గడ్డి లాక్కొచ్చి పశువులకు వేయటం ! చిల్కు ద్వాదశినాడు తులసికోట చుట్టూ అలికి ముగ్గులువేసి , కొబ్బరాకు పందిరివేసి అరటి దొప్పల్లో పువ్వొత్తులతొ దీపాలు వెలిగించి దీపదానం చేసుకున్న వైనం , ఏకాదశి ఉపవాసం చేసి వేణుగోపాలస్వామి గుడిలో సాలిగ్రామ దానం చేసుకున్న రోజులూ ...అన్నీ కళ్ళముందు మెదిలి గుండె చెమర్చి ..అంతటితో ఆగనంటూ ఆ చెమ్మను కళ్ళలోంచి తోసేసిందండీ ....ధన్యవాదాలు మురళిగారు !కార్తీకాన్ని మీ టపాతో ...మాకు మరపురాని అనుభూతిగా మిగిల్చారు మీరు !
రిప్లయితొలగించండివాహ్ ఎంత అందమైన ఙ్ఞాపకాలు మురళి గారు, నాకు మీ మీద బోలెడంత కుళ్ళుగా ఉంది. నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. పోలిస్వర్గం అన్నమాట మొదటి సారి వింటున్నాను, టపా చాలా బాగుంది. ముగింపు మాత్రం అదరగొట్టేశారు, మీనాన్నగారి చమత్కారానికి జోహార్లు :-) మొత్తానికి విషయం అర్ధమైందంటారు.
రిప్లయితొలగించండిపోలి గురించి నాకు తెలియదు కాని నేను కూడా కార్తీకమాసం నెల్లాళ్ళూ, మా అమ్మగారితో తెల్లవారుఝామునే గోదావరికి వెళ్ళేవాడిని.
రిప్లయితొలగించండిఆడవాళ్ళు పూజలు చేస్తుంటే నాలాంటి పిల్లలంతా ప్రసాదం పెట్టేదాకా గోదావరిలో స్నానాలు చేస్తుండేవాళ్ళం.
@సుబ్రహ్మణ్య ఛైతన్య, మీ డౌటు కెవ్వు కేక..:):):)
రిప్లయితొలగించండికధ గురించి తెలియకుండా అందరూ చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తున్నాను,అమావాస్య వెళ్ళి పోయాక పాడ్యమి రోజు బకెట్ లో అరటి దొప్పలో దీపాన్ని వదులుతాను,అయితే నాకు స్వర్గం book అయిపోయినట్లేనన్నమాట!!!!మా అత్తగారెలాగు అక్కడే నా కోసం waiting.
రిప్లయితొలగించండిhyderabad లో ఎక్కడ వదులుతాం?
కధ తెలియపరిచినందుకు ధన్యవాదాలు.
నా చిన్నతనం లోకి తీసుకువెళ్ళారు
రిప్లయితొలగించండిశేఖర్ గారు మరీ అంత కెవ్వు కేక లొద్దు లెండి. అందరు అత్తా, కోడళ్ళు ఒకలాగే ఉండరుగా. కాబట్టి స్వర్గానికేం ప్రమాదం లేదు. కింద మొగవాళ్ళ స్వర్గం అయితే పక్కా గ్యారంటీ నే కదా! మురళి గారు, తూర్పు గోదావరి అన్నది అర్ధమైతూనే ఉంది. ఏ వూరో చెప్తే ఏంటట. ఆ ఊరు ఎంత బాగుందో అనుకుంటాను అంతేకదా!
రిప్లయితొలగించండినీహారిక గారు, హైద్రాబాద్లో మనమేం చెయ్యాలయ్యా అంటే, ఉందిగా, అన్నింటికీ టాంక్ బండే శరణ్యం. కాకపోతే, అందులో మనం పడిపోకుండా ఎవరినన్నా మనల్ని పట్టుకోమనాలి. ప్రసాదం మాత్రం ముందే 'ఈట్ స్ట్రీట్' దగ్గర దాచి పెట్టుకోవాలి. అంతే! వెరీ సింపుల్ కదా!
@మేధ: అవునండీ.. ఆ పేరు ఎందుకొచ్చిందో కూడా రాశాను కదా, వివరంగా.. అన్నట్టు 'విశాలాంధ్ర' కి ఎప్పుడు తీసుకెళతారు?? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: మీరూ రాయండి, మీదైన శైలిలో.. మీ అనుభవాలు రాసినా సరే... ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
@జయ: నేను కోనసీమ లో పుట్టి పెరిగానండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నిషిగంధ: టపా రాశాక దాదాపు ఒకరోజంతా ఆ మూడ్ లోనే ఉన్నానండి.. నేను చాలా ఎంజాయ్ చేశాను, టపా రాయడాన్ని కూడా.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: లంకె పని చేయడం లేదండీ.. ఒక్కసారి చూడరూ.. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: మరి నగరంలో బాల్యం ఎలా ఉంటుందో మేము కూడా మిస్సయ్యాము కదండీ.. మనకి కొన్ని మాత్రమే దొరుకుతాయి.. అన్నీ దొరకవు.. ఏమంటారు? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: 'స్వామి' మనందర్లోనూ ఉన్నాడండీ... మీ బాల్యం చదివినప్పుడు నాకూ అదే ఫీలింగ్ ..ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: అవునండీ నేను 'కలకండ' భక్తుడిని :):) స్వర్గం సంగతి చూసుకోడానికి ఇంద్రుడు ఉన్నాడు కదండీ.. ధన్యవాదాలు.
@వైద్యభూషణ్: :):) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@భవాని: రోజుకో జామపండు, పౌర్ణమికి బూరెలు.. నేనివన్నీ మిస్సయ్యానండీ.. పౌర్ణమికి చలివిడి మాత్రమే చేసేవాళ్ళు. ముఖం కడుక్కున్నాక చెయ్యి తుడుచుకోకుండా నా బుగ్గమీద ఉంచేది అమ్మ, నన్ను లేపడానికి.. మా ఇద్దరి మధ్య కోడ్ అది:) ..ధన్యవాదాలు.
@స్వాతి మాధవ్: ధన్యవాదాలండీ..
@చిన్ని: మరి 'మగపిల్లాడు' అన్నాక ఆమాత్రం చెయ్యాలి కదండీ :):) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: మా ఊళ్ళో పల్లకీ వెళ్ళాక ముందే గడ్డి లాగేసే వాల్లండీ.. పెద్దవాళ్ళు వాళ్ళని కేకలేస్తూ ఉండేవాళ్ళు, పల్లకీ మీద నిప్పు పడితే తప్పని.. ఓ సారి పెద్ద ప్రమాదం తప్పింది కూడా.. 'ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది కాదు.. ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితం కాదు..' ఏదో నవల్లో చదివానండి.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: చెప్పాను కదండీ..కొన్ని అనుభావించడమంటే మరి కొన్ని కోల్పోవడమే అని.. మరి నేను మిస్సయిన వాటి సంగతి?? :):) ..ధన్యవాదాలు.
@బోనగిరి: అంత చలిలో గోదారి స్నానం.. గ్రేట్ అండీ మీరు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: మీ కేక నాకు వినబడింది :):)
@నీహారిక: జయ గారు పరిష్కారం చెప్పారు చూడండి.. ధన్యవాదాలు.
@హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@జయ: స్వర్గం సంగతి దేవేంద్రుడు చూసుకుంటాడు కదండీ.. ఆయనకీ ఇలాంటివి టాకిల్ చేయడం అమృతం తో పెట్టిన విద్య కదా.. సుబ్రహ్మణ్య చైతన్య గారికి అదే చెప్పాను..
wonderful narration
రిప్లయితొలగించండిwonderful narration
పోలి స్వర్గమని విన్నా కాని కధ తెలియదు నాకు. అటు నిషి లా నగరం కాక ఇటు మీకు లా పల్లెటూరైన పర్లేదు అనుభవాలు మూట కట్టుకోవటం అటు ఇటు కాని టౌన్ ల లో వున్న మా పరిస్తితేమిటీ.. వుభయ బ్రష్టత్వమా? :-(
రిప్లయితొలగించండిబాగున్నాయ్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు.
పోలి స్వర్గం నోము గురించి వినటమే కా ని వివరం గా తెలీదు . బాగాచెప్పారు .
రిప్లయితొలగించండిమీ చిన్నప్పటి సంగతులు భలేగా చెపుతున్నారు .
@బొల్లోజు బాబా: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@భావన: టౌన్ జీవితనికేమండీ.. బోల్డన్ని ఆనందాలు.. పల్లె నుంచి వచ్చి, పైపు లో నీళ్ళు రావడంతో సహా అన్నీ నోరు తెరుచుకుని చూసే బంధువులు, ఒకే టిక్కట్టుకి రెండు సినిమాలు.. ఇటు పల్లెనీ, అటు నగరాన్నీ కలిపి ఆస్వాదించ వచ్చు.. ఏమంటారు?? ..ధన్యవాదాలు.
@కమల: ధన్యవాదాలు.
>> దీపం కొండెక్కిపోయింది
రిప్లయితొలగించండిఇదిక్కటే నాకు తెలిసిన సంగతి.
@మరువం ఉష: చాలా కొత్త విషయాలు చెప్పానన్న మాట :):) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిmeeru batiki poyinru saar,
రిప్లయితొలగించండిporagaallu gattu meena kookuntey saalu. porilayithey amma thoni neelalla digaaley... salla neelalla moodu munakaleyyaneeki paanam poyyina sarey.... thappadannatu... ... amma guda gee poli katha septundey..gundam kaadiki ki poyyettappudu parva ley thadi battala thoni thirigi intiki vachetappudu manchiga kanipistudey sorgam....alwal gudi kada dupki punnami mast yadkochchindi...sukuriya