రెండు దశాబ్దాల క్రితం వరకూ ఎవరినైనా 'గీతాంజలి' గురించి చెప్పమంటే మొదట వచ్చే సమాధానం 'రవీంద్రనాథ్ టాగోర్ రచన' అని ఉండేది. తర్వాతి కాలం లో అది కాస్తా 'మణిరత్నం-నాగార్జున' కాంబినేషన్ లో వచ్చిన సినిమా అయ్యింది. తమిళ దర్శకుడు మణిరత్నం 1989 లో తీసిన 'గీతాంజలి' సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఆబాలగోపాలాన్నీ అలరించిన సున్నితమైన ప్రేమకథ.
హీరోకో, హీరోయిన్కో ప్రాణం పోయే జబ్బు ఉండడం, అది కథ క్లైమాక్స్ కి వచ్చాక బయట పడడం అన్నది తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ముఖ్యంగా అప్పటివరకూ ఇద్దరి హీరోయిన్లతో ఆడిపాడిన హీరోని శుభం కార్డు సమయానికి ఏకపత్నీవ్రతుడిని చేసేందుకు, ఇద్దరిలోనూ ఒక హీరోయిన్ కి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు చూపించిన సినిమాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ రొటీన్ ఫార్ములాకి కొంచం భిన్నంగా నాయికా నాయకులిద్దరినీ ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని పేషెంట్లు గా చూపడం 'గీతాంజలి' ప్రత్యేకత.
కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) కులాసాగా కాలం గడిపే కాలేజి విద్యార్ధి. స్నాతకోత్సవం ముగిశాక, స్నేహితులతో ఆడి పాడుతుంటే ప్రమాదం జరిగి ఆస్పత్రి పాలవుతాడు. చికిత్స జరుగుతుండగా తెలుస్తుంది.. అతనికి కేన్సర్ చివరి దశలో ఉందనీ, ఇంకెన్నాళ్లో బతకడనీ. తల్లీతండ్రీ తనకోసం బాధ పడడం చూడలేక వాళ్లకి దూరంగా ఊటీ వెళ్ళిపోతాడు ప్రకాష్. అక్కడ అతనికి డాక్టరుగారమ్మాయి గీతాంజలి (నూతన నటి గిరిజ) పరిచయ మవుతుంది.
ముగ్గురు చెల్లెళ్లకి అక్కైన టీనేజ్ అమ్మాయి గీతాంజలి కి తల్లి లేదు. నానమ్మ పెంపకంలో పెరుగుతూ ఉంటుంది. అల్లరిపిల్ల. తన వెంటపడే అబ్బాయిలని ప్రాక్టికల్ జోకులతో ఏడిపిస్తూ ఉంటుంది. 'ఆమనీ పాడవే హాయిగా' పాడుకుంటూ ప్రకాష్ తనని పట్టించుకోడం లేదని అలిగిన గీతాంజలి, అల్లరి చేసి అతనితో మాట కలుపుతుంది. గీతాంజలి ప్రాణాంతకమైన గుండె జబ్బుతో బాధ పడుతోందనీ, ఎన్నాళ్ళో బతకదనీ తెలిసిన ప్రకాష్ ఆమెతో ప్రేమలో పడతాడు.
ప్రకాష్ కూడా ఇంకెన్నాళ్లో బతకడని గీతాంజలికి తెలుస్తుంది. మొదట అతన్ని తిరస్కరించిన ఆమె ఆపై అతను కావాలని ఆమె కోరుకోడం సినిమాకి ముగింపు. 'ఎన్నాళ్ళు బతుకుతారో తెలీదు..కానీ బతికినన్నాళ్ళూ ఆనందంగా బతుకుతారు' అన్న పాజిటివ్ నోట్ తో సినిమా ముగుస్తుంది. ఇది పూర్తిగా మణిరత్నం సినిమా. సున్నితమైన భావోద్వేగాల మేళవింపు. తనే కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్మించింది.
టైటిల్స్ పడుతుండగానే హీరో పరిచయం, అతనికి ప్రాణాంతక వ్యాధి ఉందన్న విషయమూ తెలిసిపోతాయి. 'జల్లంత తుళ్ళింత' అనే పాటతో గీతాంజలి పరిచయం అవుతుంది. పాట, ఆ తర్వాత వచ్చే దృశ్యాల ద్వారా ఆమె చాలా అల్లరిపిల్ల అనీ, నాయనమ్మ అంటే భయం, తండ్రి అంటే గౌరవం ఉన్నాయని తెలుస్తుంది. తన వెంట పడ్డ ఓ కుర్రాడిని శ్మశానానికి రమ్మని అక్కడినుంచి 'లేచిపోదామ'నీ చెప్పి, చెల్లెళ్ళ సాయంతో అతను భయంతో పారిపోయేలా చేస్తుంది, 'నందికొండ వాగుల్లో' పాట పాడి. ప్రకాష్ నీ భయ పెట్టాలని చూస్తుంది కానీ, అతను తిరిగి వీళ్ళనే భయపెడతాడు. గీతాంజలిని ఏడిపించే క్రమంలో ఆమె జబ్బు గురించి తెలుస్తుంది అతనికి.
అప్పటిదాకా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రకాష్, తను గీతాంజలి ని ప్రేమిస్తున్నానని తెలుసుకున్న క్షణం నుంచీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటాడు. సిగరెట్ వెలిగించి, అంతలోనే ఆలోచనలో పడి, దానిని కింద పడేస్తాడు. తన ఆరోగ్యం విషయం మాత్రం ఆమె దగ్గర దాస్తాడు. ప్రకాష్, గీతాంజలి ప్రేమలో పడ్డాక ఇద్దరూ కలిసి శ్మశానంలో అంత్యక్రియలు చూసే దృశ్యం, అప్పటి వరకూ చావుని సులువుగా తీసుకున్న గీతాంజలి తండ్రిలో 'నాకు బతకాలని ఉంది నాన్నా' అని చెప్పే సన్నివేశం మనసుని మెలిపెడతాయి.
"అందరూ ఎప్పటికైనా చనిపోవాల్సిన వాళ్ళే.. కాకపొతే నేను మిగిలిన వాళ్ళందరికన్నా ముందుగా చనిపోతాను..అంతే" అని చెప్పే గీతాంజలి, అవే మాటలు ప్రకాష్ చెప్పినప్పుడు మాత్రం భరించలేదు. అతనెప్పుడు చనిపోతాడో అనే భయంతో తను గడపలేనని చెప్పి అతన్ని తిరస్కరిస్తుంది. "ఎందుకంటే..నా ప్రాణం కన్నా నువ్వు నాకు ముఖ్యం..." అని గీతాంజలి ఏడుస్తూ చెప్పే సన్నివేశం వెంటాడుతుంది. సంభాషణలు రాజశ్రీ రాశారు.
ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ. సన్నివేశాలకు తగ్గ మూడ్ ని క్రియేట్ చేయడం కోసం లైటింగ్ ని వాడుకున్న తీరు అబ్బుర పరుస్తుంది. క్లోజప్ సన్నివేశాల్లో ఐతే వెలుగునీడలతో ఆడుకున్నారు. వేటూరి-ఇళయరాజా కాంబినేషన్లో పాటలన్నీ ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. నాకిష్టమైన పాట 'ఓం నమః..' ఈ పాట చిత్రీకరణ ఓ ప్రయోగం. పాట చిత్రీకరణ మొత్తం ఒక చుంబన దృశ్యం మాత్రమే. తరువాత చెప్పుకోవాల్సింది చివరి పాట 'ఓ పాపా లాలి.'
రాజస్థాన్ ఎడారిలో తీసిన 'ఓ ప్రియా ప్రియా..' పాట గురించి చిన్న గమ్మత్తు చెప్పాలి. అప్పట్లో దూరదర్శన్ 'చిత్రలహరి' లో ఈ పాట చూసి (అప్పటికింకా సినిమా చూడలేదు) నేను, నా మిత్రులూ ఇది పేద హీరో-డబ్బున్న హీరోయిన్ల ప్రేమ కథ అని తీర్మానించేసుకున్నాం. మొదటి పాట 'జగడ జగడ జగడం..' లో సిల్క్ స్మిత మెరిసి మాయమవుతుంది. ప్రకాష్ గా నాగార్జున బాగా చేశాడు. కొంచం బరువు తగ్గి ఉంటే ఇంకా బాగుండేవాడు అనిపిస్తుంది. కాలేజి స్టూడెంట్, ఆపై పేషెంట్ కదా. పైగా గిరిజ మరీ సన్నగా ఉండడంతో అతనికన్నా చాలా చిన్న పిల్ల అన్న భావన కలుగుతుంది.
గిరిజ నడక, బాడీ లాంగ్వేజి లో ఎక్కడా ఆడపిల్ల తాలూకు సున్నితత్వం కనిపించదు. ఆమె తరహానే అంతో, లేక పాత్ర కోసం అలా చేసిందో తెలీదు. ఆమె ఇతర సినిమాలేవీ చూడలేదు నేను. అల్లరి సీన్లలోనూ, సెంటిమెంట్ దృశ్యాల్లోనూ కూడా చాలా బాగా చేసింది. అంత బరువైన పాత్రకి ఓ కొత్త నటిని ఎంచుకోడం సాహసమనే చెప్పాలి. ఈ సినిమాలో పంటికింద రాయిలా అనిపించేది సుత్తివేలు-డిస్కోశాంతిల కామెడీ ట్రాక్. ఈ తెలుగు సినిమాలో కామెడీ ఒక్కటే కాస్త తమిళంగా ఉంటుంది. మణిరత్నం మార్కు కామెడీ అనాలేమో. ఈ ఒక్కటీ మినహాయిస్తే మళ్ళీ మళ్ళీ చూడదగ్గ సినిమా 'గీతాంజలి.'
నాకెంతో నచ్చిన సినిమా,ఈ సినిమా లో గిరిజ నాగ్ కంటే బాగా చెసింది అని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిone more thing is girija also writing a blog, google with "girija shettar blog" if u r intrested. :-)
http://undercutandflourish.blogspot.com
రిప్లయితొలగించండిఈ సినిమాలో నాకిష్టమైన పాట "ఓ పాపా లాలి" చాలా మార్దవంగా వుంటుంది.
రిప్లయితొలగించండిఈ సినిమా చూశాక మా అన్నయ్య అండ్ స్నేహితులు నాగార్జున లాగా శాలువాలు కప్పేసుకుని (సినిమాల్లో భగ్న ప్రేమికుల్లా) తిరిగే వాళ్ళు.
"గిరిజ నడక, బాడీ లాంగ్వేజి లో ఎక్కడా ఆడపిల్ల తాలూకు సున్నితత్వం కనిపించదు"
రిప్లయితొలగించండినాకయితే ఆ సినిమాలో ఆ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. నాగార్జునే కాస్త పేలవంగా ఉంటాడు. ఓ పాపా లాలి పాట చాలా బాగుంటుంది.
ఓమేఘమా ఉరమకే ఈపూటికీ
రిప్లయితొలగించండిపాడాలనిఉందిలో ఒకతను ఈపాటను పాడితే బాలు మళ్లీ పాడించాడు.
"నీగుండెను ఒకసారి బయటకి తీసి ఇదిగో అనిచూపించి మళ్లీపెట్టెసేపాట ఇది" బాలు అన్నమాటలివి. ఇక్కడ నాఒంటరితనాన్ని పంచుకుంటున్న పాటల్లో ఈసినిమాలోవి రాత్రి 9:30 పైన వస్తాయి.
ఈ చిత్రంలోని ఒక మాట మా పాప అప్పట్లో ముద్దు ముద్దుగా పలికేది..."లేతి పోదామా?(లేచి పోదామా అని).
రిప్లయితొలగించండినాకు చాల బాగా నచ్చిన సినిమా,ఇష్టంగా చాలాసార్లు చూసివుంటాను ....ఇప్పటికి 'ఆమని పాడవే'వస్తుంటే వచ్చి చూస్తాను ,అలాగే ఓం నమః పాటఅంటే ప్రాణం ..నాకు సినిమాలు చాల తక్కువ గుర్తుంటాయి కాని కొన్ని మాత్రం తలుచుకోగానే కళ్ళముందు దృశ్యాల తో సహా గుర్తుకు వస్తాయి .మంచి సినిమా పరిచయం చేసారు ...నాకు ఆ అమ్మాయికన్న "నాగ్'' చాల నచ్చుతాడు ...ఆ సినిమాతోనే అతని సినిమాలు కొంచెం ఇష్టంగా చూస్తాను ..
రిప్లయితొలగించండిఆ డైలాగ్--"ఎందుకంటే..నా ప్రాణం కన్నా నువ్వు నాకు ముఖ్యం .." మీరు "ఎక్కువ" అని రాసారు..
రిప్లయితొలగించండినా జీవితంలో నేను 13,14సార్లు చూసిన (బయట నాలుగు సార్లు,ఇంట్లొ మిగిలినన్ని) ఏకైక సినిమా ఇది!!అప్పట్లొ వీడియోలే ఉండేవి. వి.సి.డి తెచ్చుకున్నప్పుడల్లా "గీతాంజలి"(ఇంట్లొ ఉండేది)చుసేసేదాన్ని.
ఆ వయసులో అది అలా నచ్చేసింది ఎందుకో...!! అప్పట్లో దూరదర్శన్ 'చిత్రలహరి' లో ఈ పాట చూసి
మేము కూడా అలానే అనుకునేవాళ్ళం.
నాక్కుడా "ఓం నమ:" ఇష్టం.తరువాత "ఓ పాపా లాలి,ఓ ప్రియా ప్రియా ".
గిరిజ ఆ తరువాత "హృదయాంజలి" అనే సినిమాలో వేసింది.పాటలు చాలా బాగుంటాయి.సినిమా నేనూ చూడలేదు.పెద్దగా ఆడలేదనుకుంటా!!
ఈ సినిమా గురించి రాసుకుంటు పోతే అది పెద్ద టపా అయిపోతుంది.ఇంక ఆపేస్తాను.
'నాకు బతకాలని ఉంది నాన్నా'
రిప్లయితొలగించండి"ఎందుకంటే..నా ప్రాణం కన్నా నువ్వు నాకు ఎక్కువ.."
ఈ రెండు దృశ్యాల్లోనూ నేను వెక్కి వెక్కి ఏడ్చాను ....ఇప్పటికీ ఎప్పుడైనా టి వి లో వస్తే అదే పరిస్థితి .మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు ...హ్మ్మ్ ......నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో గీతాంజలినీ చేర్చుకోవచ్చు .సినిమా పాజిటివ్ నోట్ తో ముగిసినా భారమైన మనసుతోనే బైటకొస్తాం!
గిరిజ చిన్న చెల్లెలు వాళ్ళ అక్క ఇంకా ఇంటికి తిరిగి రాలేదని నాగార్జునతో చెప్పే సీన్ లో నాగార్జున రూం లో అద్దం దగ్గర నిలబడి ఉంటాడు. ఆ చిన్న పాప తలుపు నెమ్మదిగా తీసి లోనికి అడుగుపెట్టబోతుంది. ఆ పాప కంటే ముందుగా పొగ మంచు ముద్దలు ముద్దలు గా ప్రవహించి నాగార్జునని తాకి ఎవరో వచ్చిన సంకేతాన్ని తెలుపుతుంది. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ షాట్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు మంచునే కమ్యూనికేటింగ్ మీడియాగా చూపించటం భలే అనిపించేది నాకు. హేట్సాఫ్ టు మణిసార్.
రిప్లయితొలగించండిఈ సినిమాని మేం చిన్నప్పుడు చూసినప్పుడు ఒక్క ముక్క అర్ధం కాలేదు. పైగా ఫ్రేములన్నీ చీకటి చీకటిగా ఉంటాయి. ఒక వయసు వచ్చిన తర్వాతగానీ ఆయన సినిమాలు అర్ధం అవ్వటం మొదలుకాలేదు. ఇప్పటికీ మా అక్క మణిసార్ సినిమా వస్తే "ఒరేయ్..టార్చిలైట్ పట్టుకోరా సినిమా చూసేటప్పుడు" అని నన్ను ఏడిపిస్తుంటుంది.
నీ సవ్వడే సన్నగా ఉండాలని..
రిప్లయితొలగించండికోరనా గుండెనే కోరిక...
నేడేరా నీకు నేస్తము.. రేపే లేదు..
నిన్నంటే నిండు సున్నరా.. రానే రాదు..
ఓ బాలా.. మసజసతతగా శార్దూల..
రాచవీటి కన్నెది రంగురంగు స్వప్నము..
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము..
దూరము లేనిదై లోకము తోచగా..
ప్రతీ పాట ఒక ఆణిముత్యము..
మణిరత్నంగారి మణిహారంలో(చిత్రాలో) ఎప్పటికీ మహోజ్వలంగా వెలిగే మణి గీతాంజలి!!!
రిప్లయితొలగించండిమురళిగారు,
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు.ఆ సినిమాలో హీరోయిన్ డ్రస్ అ౦టె చాలా క్రేజ్ అప్పటిలొ..
గీతా౦జలి అద్దల మిడి అనే వాళ్ళ౦..
పాటలు మత్ర౦ సుపర్..మ౦చి సినిమా గుర్తు చెసారు..ఇ౦క ఆ సినిమాలో దెయ్య౦పాట
భలే కదా!న౦దికొ౦డ వాగుల్లో నల్లతుమ్మ నీడల్ల్లో ......
నీతో వస్తున్నా..నా నీడెది..నా తోడేది..
ఢాకిని పిచాచి నా చెలియె...శాఖిని విచుచి నా సఖియె...
సరిగ్గా గుర్తులేదు.
good movie
రిప్లయితొలగించండిఈ సినిమా చూడటానికి ముందు తెలిసిన ఒక అబ్బాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్ జబ్బుతో చనిపోవడానికి ముందు ప్రేమించుకుంటారు అని ఒక్క ముక్కలో స్టోరీ చెప్పేసి దీనిపై విరక్తి వచ్చేలా చెసేసాడు ..కాని తరువాత సినిమా చూసాకా ఒక్కో సీన్ ఎంత ఇంట్రెస్ట్ గా చూసానో ,పైగా ఆ అబ్బాయి చెప్పిన మాటవల్ల సినిమా మీద ఏమాత్రం ఆశలు పెట్టుకోకుండా చూసానేమో ఎంత నచ్చిందంటే సినిమా చూసిన వారం రోజులవరకు ఆ డయిలాగులన్నీ వెంటాడుతూ ఉండేవి..శేకర్ గారికి నచ్చిన సీనె నాకు నచ్చింది ... నిజమే కామెడీ నాకు ఇబ్బంది కలిగించింది .. :)
రిప్లయితొలగించండిbavndi review
రిప్లయితొలగించండిగోపాలా మసజసతతగ శార్ధూలా
రిప్లయితొలగించండితెలుగు వ్యాకరణంలో చందస్సు నేర్పేతప్పుడు ఈపాట గుర్తుతెచ్చుకొని నవ్వుకునేవాళ్లం. తరవాత అదే కొండగుర్తు అయింది
ఈ సినిమాలో ప్రతి పాత్ర అందులో జీవించారనే చెప్పాలి.హీరో హేరోయిన్ మధ్య chemistry కథకనుగుణంగా చాలా బాగ తీశారు.ఆ పిల్లలు నిజానికి గిరిజ చెల్లెళ్ళే కావడం ఇంకాస్త naturalగా ఉంటుంది.. పాటల్లోని సాహిత్యం వర్ణనాతీతం.. !
రిప్లయితొలగించండినేను కొంచం లేట్ గా వచ్చే సరికి నేను చెప్పవలసినవన్నీ అందరు చెప్పేసేరు. :-(
రిప్లయితొలగించండినేను విజయవాడ లో 20 సార్లు చూసేను ఈ సినిమా. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు డివీడీ లో చూస్తూనే వుంటాను. మొత్తం క్రెడిట్ మణిరత్నానిదే ఈ సినిమా లో..
http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_geetanjali_1989.php
రిప్లయితొలగించండిమురళి గారు నేను మాత్రం మీరు మరో కథో, రవీంద్ర గారి గీతాంజలి గురించో చెప్తున్నారు అనుకున్నాను:-) ఈ మధ్య కాలం లో చాలా రోజులవుతుంది ఈ సినిమా చూసి పాటలు వినీ.
రిప్లయితొలగించండిఅత్యవసరం గా డీవీడీ బయటకి తీయించేస్తున్నారు. చాలా మంచి సినిమా. మీ రివ్యూ లోనూ శేఖర్ గారు కామెంట్ తోనూ చాలా చెప్పేశారు.
ఇక హీరోయిన్ లో అమ్మాయ్ లక్షణాలు లేవనే కన్నా అప్పటి వరకూ తెలుగు సినిమాలలో అమ్మాయి లక్షణాలు గా ప్రొజెక్ట్ చేయబడ్డవి లేవని చెప్పడం సబబేమో, ఎంతైనా మణి కదా కొత్తగా సహజంగా ప్రొజెక్ట్ చేశాడు అనిపించింది. అన్నట్లు తెలుసా నా దగ్గర ఉన్న డీవీడీ లో సుత్తి వేలు కామెడీ ట్రాక్ డిలీట్ చేయబడి ఉంది.
@రాఘవ్: ఓహ్.. గిరిజ సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదేమిటా? అనుకున్నా.. జర్నలిస్టుగా స్థిరపడిందన్న మాట.. బాగుందండి తన బ్లాగు. ద్నయవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: అవునండీ అప్పట్లో శాలువాలు ఫ్యాషన్ :-) ధన్యవాదాలు.
@సిరిసిరి మువ్వ: అంటే పేషెంట్ పాత్రలో 'జీవించడం' కోసం అలా ఉండి ఉంటాడండి :-) ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: బాలూ చెప్పింది నిజమేనండి.. మొత్తానికి ఈ సినిమా మీకు తెలుగు వ్యాకరణం నేర్పిందన్న మాట :-) వేటూరికి థాంక్స్ చెప్పాలి మీరు. వ్యాఖ్యలకి ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@సృజన: అవునా... సినిమా చూడని వాళ్ళు హడిలిపోయి ఉంటారేమో కదండీ :-) ..ధన్యవాదాలు
@చిన్ని: ఈ సినిమాతో నాగార్జునకి మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ బాగా పెరిగిందండీ.. మీరూ వాళ్ళలో ఒకరన్న మాట :-) ..ధన్యవాదాలు.
@తృష్ణ: సరిచేశానండీ.. బోల్డన్ని థాంకులు.. ఇదొక్కటి చాలు సినిమా మీకెంత ఇష్టమో తెలియడానికి..
రిప్లయితొలగించండి@పరిమళం: నిజమేనండీ.. చాలా బరువెక్కిపోతుంది మనసు.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: టార్చిలైటు జోకు భలే ఉందండీ.. పిల్లతో పాటు పొగమంచు గదిలోకి వచ్చే సన్నివ్శాలు రెండు ఉంటాయి ఈ సినిమాలో. రెండోసారి క్లైమాక్స్ కి ముందు గిరిజని హాస్పిటల్ లో చేర్చినప్పుడు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@సత్య: అంతా వేటూరి ఘనత.. అదే మనిషి మాస్ మసాలా పాటలు కూడా అంతే బాగా ఒప్పించడం నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పద్మార్పిత; నిజమేనండి..ధన్యవాదాలు
@సుభద్ర: ఒక్క డ్రెస్ లే కాదండి.. చెప్పులు, బొట్టు బిళ్ళలు.. అబ్బో..చాలా ఉన్నాయి.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: Thank you..
రిప్లయితొలగించండి@నేస్తం: అదృష్టవ శాత్తూ నాకు కథ తెలియదండీ.. చాలా బాగా ఎంజాయ్ చేశాను సినిమాని.. హీరో-హీరోయిన్ల మధ్య, హీరోయిన్ ఇంట్లోనూ జరిగే కొన్ని సన్నివేశాలు హాస్యభరితంగా ఉంటాయి.. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు.. ధన్యవాదాలు.
@హరేకృష్ణ: ధన్యవాదాలు.
@రవితేజ: మీ బ్లాగు చదివానండి.. చాలా చక్కగా రాస్తున్నారు. అక్కడ వ్యాఖ్య రాద్దామంటే రెండు బ్లాగుల్లోనూ కామెంట్ బాక్స్ ఓపెన్ కావడం లేదు.. ఒకసారి సరి చేయండి.. ఆ పిల్లలు గిరిజ సొంత చెల్లెళ్ళా? కొత్త విషయం చెప్పారు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన: ఏమీ పర్లేదండీ.. లేటెస్ట్ గా వచ్చారు :-) .. నిజమేనండి క్రెడిట్ మణిరత్నానిదే.. ధన్యవాదాలు.
@శ్రీ: ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: హీరోయిన్ గురించి మీరు చెప్పింది ఆలోచించాల్సిన పాయింటే.. అన్నట్టు కామెడీ ట్రాక్ డిలీట్ అయినందుకు బాధ పడుతున్నారా? :-) ..ధన్యవాదాలు.
మంచి సినిమా గుర్తుచేశారు.
రిప్లయితొలగించండివాళ్ళిద్దరి ప్రేమ సంగతి అలా ఉంచితే హీరోహీరోయిన్ల తల్లిదండ్రులకు చాలా ఓపికెక్కువనిపించింది. అప్పట్లో అనుకునేదాన్ని ఇంకొద్ది రోజుల్లో చనిపోతామంటే ఏమీ అనరన్నమాట అని :).
సంగీతం చాలా బాగుంటుంది. గీత ఇంకొద్ది రోజుల్లో చనిపోతూ కూడా ఆనందంగా ఉండడానికి గల కారణం చెప్పాక నాగార్జున కొంతసేపు ఆలోచిస్తూ సిగరెట్ తాగుతుంటాడు. ఆ తరువాత ఏదో గొప్ప సత్యం తెలుసుకున్నట్లు మొహం పెట్టి ఆనందంగా పరిగెడతాడు. అక్కడ అతని ఎక్స్ప్రెషన్స్తో పాటు సంగీతం కూడా ఆ విషయాన్ని ప్రేక్షకులకు కన్వే చేయటానికి చాలా దోహదపడుతుందనిపించింది.
నాకూ కామెడీ ట్రాక్ చిరాకుగానే అనిపించింది.
మీ బ్లాగు మిస్సయితే చాలా నష్టం.
రిప్లయితొలగించండిగీతంజలి మంచి సినిమా అందులో సందేహం లేదు.
కాని మణిరత్నం మొదలు పెట్టిన హీరోయిన్ల తింగరితనం మన తెలుగు సినిమాలని ఇప్పటికీ వదలటం లేదు.
అప్పుడు రేవతి, గిరిజ, సుహాసిని, తరువాత భూమిక, ఇప్పుడు జెనీలియా.
హిందీలో కరీనా కూడా అంతే. (ఖుషీ, జబ్ వుయ్ మెట్)
@భవాని: పాపం.. హీరోయిన్ కి తల్లి లేదండీ.. తండ్రి డాక్టరు కాబట్టి సహజంగానే ఓపికెక్కువ.. సినిమా విజయం లో సంగీతం, ఫోటోగ్రఫీలది కీలక పాత్ర.. హమ్మయ్యా.. ఈ సినిమాలో కామెడీ నచ్చని వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారని తెలిసింది.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బోనగిరి: 'హీరోయిన్ల తింగరి తనం..' ఇదో పెద్ద టాపిక్ అండీ.. అసలు ఒక రిసెర్చ్ చెయ్యొచ్చేమో.. ధన్యవాదాలు.
గీతాంజలి సినిమాను ఒక్క థియేటర్లోనే అయిదు సార్లు చూసా,కానీ మణిరత్నం మనకు చెప్పని ఈ సినిమా ఒరిజినల్ సినిమా చూసాకా ప్రాణం ఉసూరుమంది ఇన్నాళ్ళు మెచ్చుకుంది ఇలాంటి సినిమానా అని ...
రిప్లయితొలగించండిహ హ మురళి గారు :-) మరే బాధ పడి వారం రోజులు తిండి కూడా మానేశాను :-)
రిప్లయితొలగించండికమ్మనైన వెన్నపూస ముద్ద పప్పు ఆవకాయ కలుపుకుని అన్నం తింటు మధ్య లో పంటి కింద రాయి తగలడం లేదేమిటా అని ఎవరన్నా ఎదురు చూస్తారేవిటండీ.. మీరు మరీ జోకులేయడం కాకపోతే :-)
'హీరోయిన్ల తింగరి తనం..'
రిప్లయితొలగించండిఈ టాపిక్ మీద నేను ఒక టపా వ్రాద్దామనుకున్నాను. కాని నా దగ్గర అంత ఇన్ ఫో లేదు.
మీరే ఒక టపా వ్రాయండి. నేను నాలుగు కామెంట్లతొ సహకరిస్తాను.
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ఆ ఒరిజినల్ చిత్ర రాజం పేరేమిటో చెబితే మేమందరం కూడా నిట్టూర్పులు విడిచే వాళ్ళం కదండీ.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ఏమోనండీ.. మీరేమైనా డిస్కోశాంతి (ఇప్పుడు శ్రీమతి శాంతి శ్రీహరి) అభిమానేమో.. ఆమె కనిపించక కలత పడ్డారేమో అనీ :-) :-)
@బోనగిరి: ఏమీ పర్లేదు.. మీరు మొదలు పెట్టేయండి.. బహుశా ఓ సీరియల్ రాయొచ్చు.. శ్రీదేవి తో మొదలు పెడతారా? అంతకన్నా వెనక్కి వెళ్తారా?
in childhood me 2 felt same as sheker
రిప్లయితొలగించండిnice movie.....just one week back i saw this again.....
songs and photography highlight ....
@Vinay Chakravarthi.Gogineni: Thank you
రిప్లయితొలగించండిThat movie is said to be "Young Die First"
రిప్లయితొలగించండి