ఆమె అతన్ని ప్రేమించింది. అతని కోసం అంతవరకు ఆమెని అన్నీ తానే అయి పెంచిన 'పెంపుడు' తండ్రిని ఎదిరించింది. పుట్టింటితో తన సంబంధాన్ని శాశ్వతంగా తెంచుకోడానికి సిద్ధపడింది. పెళ్ళయ్యాక అతని పట్ల ప్రేమ రెట్టింపయ్యింది ఆమెకి. ఓ కొడుక్కి తల్లయ్యాక, అతనిపట్ల ఆమెకి అనుకోకుండా మొదలైన ఓ అనుమానం పెనుభూతమయ్యింది.. అతన్ని విడిచి వెళ్లడానికి కారణమయ్యింది. ఆమె పేరు సుజాత.
తల్లీతండ్రీ లేని అనాధ పసికూనగా బళ్ళో పని చేసే ప్యూనుకి దొరుకుతుంది సుజాత. ఆ ప్యూను ఆమెని తన సొంత కూతుర్లా పెంచుకుంటూ బడిలో చదివిస్తుండగా, ఒక రోజు ప్రసంగించడానికి బడికి వచ్చిన యాభయ్యేళ్ళ అవివాహితుడు పండిత పరమేశ్వర శాస్త్రి ఆమెని చూసి ముచ్చట పడి, అల్లారు ముద్దుగా ఆమెని పెంచుకుంటాడు. ఇందుకోసం సంఘాన్ని సైతం ఎదిరిస్తాడు ఆ పండితుడు.
పెంపుడు తండ్రిని ఒప్పించి ఇంగ్లిషు చదువు చదివిన సుజాత, ఆధునిక భావాలున్న రచయిత కేశవమూర్తి ని ప్రేమిస్తుంది. సంప్రదాయాన్ని నరనరానా జీర్ణించుకున్న పరమేశ్వర శాస్త్రి వారి కులాంతర వివాహానికి అంగీకరించకపోవడంతో ఇంటినుంచి బయటికి వచ్చేస్తుంది సుజాత. అత్తా, ఆడబిడ్డ తను 'అనాధ' అని హేళన చేసినా ఓరిమితో భరిస్తుంది. భర్త తనని అర్ధం చేసుకున్నందుకు సంతోష పడుతుంది.
కేశవమూర్తి రచనల వెనుక సుజాత కృషి యెంతో ఉంది. అతని శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడడం మొదలు, మానసికంగా ఉల్లాసంగా ఉంచడం, పదే పదే గుర్తు చేసి గ్రంధ రచన పూర్తి చేయించడం.. అతను డిక్టేట్ చేస్తుంటే తాను రాసిపెట్టడం.. ఇలా అన్నీ తానే అవుతుంది. వివాహం తర్వాత సినిమాలకి రచన చేసే అవకాశం దొరుకుతుంది కేశవమూర్తికి. భార్యతో సహా మద్రాసుకి ప్రయాణమవుతాడు.
సుజాత దగ్గర ఎలాంటి రహస్యమూ లేదు కేశవ మూర్తికి. సంపాదన అంతా తెచ్చి ఆమె చేతికే ఇస్తాడు. సినిమాల్లో వేషాల కోసం కేశవమూర్తి సిఫార్సు కోరిన కన్యకామణి, అతని రచనలని అభిమానించే సుభాషిణి.. ఇలా అతని స్నేహితులంతా ఆమెకీ స్నేహితులే. మిత్రులంతా కేశవమూర్తి-సుజాతల దాంపత్యాన్ని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. వారందరినీ మనస్పూర్తిగా ఆదరిస్తుంది సుజాత.
కేశవమూర్తి మిత్రుల పట్ల ఎంత ఆదరంగా ఉంటుందో, అతని శత్రువుల పట్ల అంత కఠినంగానూ ఉంటుంది సుజాత. "ఏమి మనిషి ఈ సుజాత, ఇన్నాళ్ళ నుంచి నేను ఆమెతో కలిసి జీవిస్తున్నా ఇంతవరకు ఆమె హృదయంలోని లోతులు నాకు అంతు పట్టలేదు. ఆమెలో ఎప్పటికప్పుడు క్రొత్త శక్తులు కనిపిస్తూనే ఉంటై. ఈ మహత్యం స్త్రీ సృష్టిలోనే ఉంది కాబోలు.." అనుకుంటాడు కేశవమూర్తి, ఒక సందర్భంలో.
సినిరచయితగా కేశవమూర్తి బిజీగా ఉన్న సమయంలో మగబిడ్డని ప్రసవిస్తుంది సుజాత. పెంపుడు తండ్రి మీద ప్రేమతో కొడుక్కి'పరమేశ్వర్' అని పేరు పెట్టుకుంటుంది. యెంతో సున్నిత మనస్కుడూ, అలౌకికుడూ అయిన కేశవమూర్తికి సుజాత ఒక రక్షణ కవచం. ఆమెకి తెలియకుండా అతను ఏపనీ చేయడని ఆమెకి తెలుసు. కన్యకామణి, సుభాషిణి లతో అతనికి ఉన్న స్నేహం ఎలాంటిదో కూడా ఆమెకి బాగా తెలుసు.
కానీ.. వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు రావడం మొదలు పెడతాయి. వాటి సారాంశం ఒకటే.. సుజాత కన్నుగప్పి కేశవమూర్తి సుభాషిణి, కన్యకామణి లతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని. ఆ ఉత్తరాలని మొదట పట్టించుకోదు సుజాత. నెమ్మదిగా ఆమెలో అనుమానం మొలకెత్తుతుంది. అతి త్వరలోనో అది పెరిగి మహా వృక్షమవుతుంది. పుట్టింటి తలుపులు మూసుకుపోడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఆమెకి.
కేశవ మూర్తి పట్ల మనసు పూర్తిగా విరిగిపోవడంతో ఇంట్లో ఉండడానికి మనస్కరించదు. ఆమె సంసారాన్ని ఛిద్రం చేయడానికి పూనుకున్నది ఎవరు? సుజాత జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమె జన్మ రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన తొలి తెలుగు నవల 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా.' యాభై మూడేళ్ళ క్రితం గోపీచంద్ రాసిన నవలని 'అలకనంద ప్రచురణలు' ఇటీవలే పునర్ముద్రించింది. (వెల: రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
ఈ నవల చదవలేదు అని చెప్పటానికి సంకోచం లేదు. :) చదివినవి తక్కువేను. సుజాత అనురాగం నుండి దిశగా అనుమానం వైపు సాగటానికి కారణం ప్రేమలో కుంచించుకుపోయే ఆలోచనాపరిధి అంటారా? ఈ మనిషి నాకే స్వంతం అన్న గాఢానురాగమా? ప్రయత్నించి చదవాలని మాత్రం వుంది. కేశవమూర్తి వైపు నుండి ఈ పరిణామానానికి, ఆమె వీడిన పిదప అతని సంరక్షణ ఇవి నాకు కుతూహలం, ఆమె గురించి తెలిసినదాన్ని బట్టి సమర్ధురాలనిపిస్తోంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలదనిపిస్తోంది.
రిప్లయితొలగించండిభలే పరిచయం చేస్తారండి ....నేను చదివినట్లు గుర్తే ...మరల చదవాలి
రిప్లయితొలగించండిబలే వుందండి ఒక నవల లా సీరియస్ గా చదివేయటం మొదలు పెట్టేను ఇది వుత్త పరిచయమే అని మర్చి పోయి, చాలా బాగా చెప్పేరు... ఎన్ని పుస్తకాలు పెరిగి పోతున్నాయో నా లిస్ట్ లో... :-( నేను ఈ నవల పేరు కూడా వినలేదు...
రిప్లయితొలగించండిchala adbhtamina novel andi.indulo kadha kante samjam lo vyktula pravarthana ento baaga vivarincharu.chuttu pakkala vunnavlakante kesavamurti edigithe ninatadaka mitrulga vunna varilo ershya devshalu satruvulu ga marina vishyam gurinchi ayna cheppe sandarbahalu nija jeevitam chala sarlu alanti anno anubhavalki edurinattu vuntundi.chala sarlu ayna rasina vakyalu gurtu chesukuni vallanu chusi navvukuna rojulu kuda vunnyai.chakkani novel.kachitnaga manam chadavlisna novel.
రిప్లయితొలగించండిఎప్పుడో బాగా చిన్నప్పుడూ అంటే 8థth క్లాస్లో చదివిన పుస్తకం. ఏమీ గుర్తు లేదు. మరలా చదవాలిసిందే.
రిప్లయితొలగించండిఎప్పటిలానే పరిచయం బాగుంది మురళి గారు. నవల పేరును బట్టి తెలుగు సినిమా పరిఙ్ఞానం ఆధారం గా చేసుకుని ముగింపు కాస్త ఊహించాను :-) అది నిజమో కాదో తెలుసుకోడానికైనా చదవాలి.
రిప్లయితొలగించండినేను కొనుక్కోవాల్సిన పుస్తకాల లిస్టు లోకి ఇంకో పుస్తకాన్ని చేర్చారన్నమాట.
రిప్లయితొలగించండి@ఉష: సుజాతలో అనుమానం మొలకెత్తడానికి కారణం ఆమె చుట్టూ ఉన్న మనుషులు, వాళ్లకి ఉన్న రకరకాల ఉద్దేశాలూనండి.. కథ సుఖాంతమే.. మానవ జీవితాన్ని గురించి ఎన్నో అంశాలని లోతుగా చర్చించిన నవల ఇది.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: చదవండి మరి... ఒక టపా రాస్తే మేమేంతా కూడా చదువుతాం.. ధన్యవాదాలు.
@భావన: పేరు వినలేదా? అదేమిటండి.. గోపీచంద్ ప్రసిద్ధ రచన ఇది.. టీవీ సీరియల్ కూడా వచ్చింది, దూరదర్శన్ లో.. చదవండి మరి.. ధన్యవాదాలు.
@రాం: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@స్వాతి మాధవ్: నిజమేనండి.. ఇందులో చర్చించిన అంశాలు ఇప్పటికీ సమకాలీనం అనిపిస్తాయి.. మంచి పుస్తకం.. వ్యాఖ్యకి ధన్యవాదాలు. అన్నట్టు మీరు ఈ లంకె ఉపయోగించి తెలుగులో రాయొచ్చు.. ప్రయత్నించండి.
http://www.google.co.in/transliterate/indic/telugu
@సునీత: ఆలస్యం ఎందుకు? చదివేయండి.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: మీరు సరిగ్గానే ఊహించి ఉంటారని నాకూ అనిపిస్తోంది.. ఎందుకంటే ముగింపు ఊహాతీతంగా ఏమీ ఉండదు.. పైగా నేనే బోల్డన్ని హింట్స్ ఇచ్చాను కూడా :-) ..ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: అంతేనంటారా? :-) కానివ్వండి మరి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసుజాత అన్నప్పుడే ఇది పరమేశ్వరశాస్త్రి కథ అనుకున్నా. పుస్తకాన్ని చదవలేదుకానీ దూరదర్శన్‌లో చూశాను. సుజాత కారెక్టర్ ప్రేమి (అసలుపేరు గుర్తులేదు.) వేసిందనుకుంటా.
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య: 'ప్రేమి' (నాకూ అసలు పేరు తెలీదు) కి అప్పట్లో ఏదో సీరియల్లో 'ఓ ఓ ఓ..' అనే ఊతపదం ఉండేది.. అందరూ అనుకరించే వాళ్ళు.. నేను ఒక్క ఎపిసోడ్ మాత్రమే చూశానండీ.. లీలగా మాత్రమే గుర్తుంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య ఛైతన్య
రిప్లయితొలగించండిi think her name is renuka
మీరు రాసిన నవలాపరిచయం చదివితే అర్జెంటుగా ఈపుస్తకం చదివెయ్యాలన్నంత ఊపు వచ్చేస్తోంది. ఇప్పుడు వెంటనే పుస్తకం దొరకదు కాబట్టి.. ఎప్పటికైనా చదవాల్సిన లిస్టులో మరో పుస్తకం చేర్చుకుంటున్నా :)
రిప్లయితొలగించండి@మధురవాణి: అలనాటి ఆణిముత్యం.. చదవండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమరో ఆణిముత్యం లాంటి నవలా పరిచయం !బావుందండీ ..
రిప్లయితొలగించండి@పరిమళం: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండినాకు ఈ పుస్తకం కావాలి..ఆన్లైన్ లొ దొరకడం లెదు
రిప్లయితొలగించండిమీదగ్గర స్కాన్ కాపీ ఉంటే నాకు పంపండి.లేకపోతే కథ ఎలాగో తెలిసిపోయింది కనుక కనీసం చివరి వీలునామా స్కాన్ అయినా పంపండి !మీకు కుదిరితే....
@నాగశ్రీనివాస: అలకనంద ప్రచురణలు, విజయవాడ వారి ద్వారా ఈ పుస్తకం మార్కెట్లో ఉందండీ. అశోక్ బుక్ సెంటర్, విజయవాడ తో పాటు, విశాలాంధ్ర శాఖల్లో దొరుకుతోంది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి