ఒకప్పుడు ఎవరో 'డిటెక్టివ్ నవల' అని చెబితే మనకెందుకు అని పక్కన పెట్టిన పుస్తకం.. తర్వాత కాలంలో ఎందుకో తెలియకుండానే 'చదవాలి' అనిపించి ఎంత వెతికినా దొరకని పుస్తకం.. మొన్నొక రోజు పుస్తక ప్రదర్శనకి వెళ్తే అనుకోకుండా కళ్ళ బడ్డ పుస్తకం.. నాలుగ్గంటల పాటు ఆపకుండా చదివి పూర్తి చేయడమే కాదు, నాలుగు రోజుల తేడాతో రెండుసార్లు చదివిన పుస్తకం.. డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు రాసిన 'హౌస్ సర్జన్.'
ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి డాక్టర్ కావాలన్న కలని నిజం చేసుకున్న ఓ కుర్రాడు, మెడికల్ కాలేజిలో చదువు ముగించి, ప్రభుత్వాసుపత్రిలో హౌస్ సర్జన్ గా పనిచేసిన యేడాది కాలపు అనుభవాలే ఈ నవల. నిజానికి దీనిని ఒక హౌస్ సర్జన్ డైరీ అనొచ్చు. కథానాయకుడు మధుకర రావు కి వైద్య వృత్తి అంతే ప్రాణం. పుస్తకాలు, లేబరేటరీలే లోకం. అతను చదువు పూర్తి చేసి, తను వైద్య విద్యార్ధి గా అనేకసార్లు వచ్చిన ఆస్పత్రికి హౌస్ సర్జన్ గా రావడం తో కథ మొదలవుతుంది.
మధుకి మొదటి రోజు ఎదురైన అనుభవాలు ఎంత వివరంగా రాశారంటే, మొత్తం 216 పేజీల నవలలో మొదటి యాభై ఎనిమిది పేజీలు అతని మొదటి రోజు దినచర్యే. అవుట్ పేషెంట్లని పరీక్షించి మందులు ఇవ్వడం, వార్డులో తిరుగుతూ ఇన్-పేషెంట్ల కి అవసరమైన చికిత్స చేయడం తో పాటు నైట్ డ్యూటీ లో హాస్పిటల్లో ఉన్న వార్డుల మధ్య పరుగులు పెడుతూ ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అవుతాడు మధు. అతనితో పాటు మనమూ పరిగెడతాం.
ఆస్పత్రి వాతావరణం, అక్కడికి వచ్చే రకరకాల పేషెంట్లు, అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది మనస్తత్వాలు, ఇగోలు, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత వైషమ్యాలని పక్కకి పెట్టి కలిసి పనిచేయడం.. ఇలా మనకి అంతగా తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తారు రచయిత. చదవడం మొదలు పెట్టాక మనకి తెలియకుండానే కథలో లీనమైపోతాం. మెడికల్ టెర్మినాలజీ మనల్ని అంతగా ఇబ్బంది పెట్టదు.
ఇదేమీ అత్యంత సీరియస్ నవల కాదు. ఎందుకంటే ఇందులో హాస్యానికీ కొదవ లేదు. తనకి ఇంజెక్షన్ చేస్తే తప్ప రోగం తగ్గదని మనసా వాచా నమ్మిన పేషెంట్ ని కన్విన్స్ చేయడం కోసం డిస్టిల్ వాటర్ ని ఇంజెక్ట్ చేసే డాక్టరు, మధు ని చూడ వచ్చిన అతని పల్లెటూరి బంధువుని మెడికల్ కాలేజి స్టూడెంట్ అనుకుని అతనికి ప్రాక్టికల్ పరిక్ష పెట్టే సీనియర్ డాక్టర్లు, పేషెంట్స్ అనుకుని వాళ్ళ కూడా వచ్చే వాళ్లకి పరిక్షలు చేసేసే హౌస్ సర్జన్లు .. ఇలాంటి సన్నివేశాలు అనేకం.
మధుతో కలిసి మెడిసిన్ చదివి డాక్టర్ అయిన ఒక అమ్మాయి, హౌస్ సర్జెన్సీ లో అతనికి సాయ పడిన ఒక నర్సూ అతనితో ప్రేమలో పడతారు. అలా అని ఇది ముక్కోణపు ప్రేమ కథ కాదు. నిజానికి ఈ సన్నివేశాలను మధు వ్యక్తిత్వాన్ని వివరించడానికి ఉపయోగించు కున్నారు రచయిత. సున్నిత మనస్కుడైన మధు తను వైద్యం చేస్తున్న పేషెంట్ చనిపోతే పడే బాధ వర్ణనాతీతం. కథానాయకుడిని చాలా ఉన్నతంగా నిలిపారు కొమ్మూరి. ఈ నవల్లో మధు రచయితేనేమో అన్న సందేహం కలగక మానదు.
నేను కొన్నది ఎమెస్కో వారి తాజా ప్రచురణ. ఇందులో తొలి ప్రచురణ తేదీ ఇవ్వలేదు. హౌస్ సర్జన్ జీతం నూట యాభై రూపాయలు, నర్సు జీతం తొంభై రూపాయలు అని చదివి దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నవల అయి ఉండొచ్చని ఊహించాను. కొంచం గూగులింగ్ చేస్తే తొలి ప్రచురణ 1967 లో జరిగిందని తెలిసింది. ప్రచురణ కర్తలు రిప్రింట్ చేసేటప్పుడు తొలి ప్రచురణ తేదీ వేస్తే చదువుకునే వాళ్లకి సౌకర్యంగా ఉంటుంది.
ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు వేరే వార్డులో ఉన్న హౌస్ సర్జన్ ని వెతుక్కుంటూ ఆయా పరిగెత్తుకుని వెళ్ళడం లాంటివి చదివినప్పుడు 'మొబైల్ కి ఓ కాల్ చెయ్యొచ్చు కదా' అన్న ఆలోచన రాక మానదు. ఇంటర్ కం కూడా లేని రోజులవి. హాస్పిటల్లో మందుల కొరత ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదని చెబుతుంది ఈ నవల. సర్జరీ లంటే మధుకి ఎంతో ఆసక్తి.. కొన్నాళ్ళకి ఎలా అయిపోతాడంటే చిన్నదో, పెద్దదో సర్జరీ చేయకపోతే నిద్ర పట్టని స్థితికి వచ్చేస్తాడు. "ఇది క్రూరమైన వృత్తి" అంటాడతను.
నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే డాక్టర్లు, నర్సుల్లో రకరకాల వాళ్ళు ఉంటారన్న విషయాన్ని దాచే ప్రయత్నం చేయలేదు రచయిత. మధు తో పాటు డాక్టర్లు కామేశ్వరి, రాజేశ్వరి, చీఫ్ చక్రపాణి, సూపర్నెంట్ దయానంద రాజు పాత్రలు వెంటాడతాయి. వైద్య వృత్తిలో కొత్తకోణాలను చూపే 'హౌస్ సర్జన్ వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది.
ఇదే నవలను కొన్ని నెలల క్రితం "రచన" మాసపత్రికలో ప్రచురించారు.
రిప్లయితొలగించండినేను స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా,టి.విలో,దూరదర్షన్ లో రాత్రి9-9.30 వచ్చే సిరియల్స్ అన్నీ చూసేవాళ్ళం.అన్నీ బాగుండేవి.వాటిల్లో "జీవన్ రేఖ,లైఫ్ లైన్" అనే టైటిల్తో ఒక హిందీ సీరియల్ వచ్చేది.అది డాక్టర్లకి,హౌస్ సర్జన్సి చేస్తున్న యంగ్ డాక్టస్ కి సంబంధించిన కధ.చాలా చాలా బాగుండేది."తన్వి అజ్మీ" ఆ సిరియల్ తోనే నాకు బాగా నచ్చేసింది.
రిప్లయితొలగించండిమీ టపా చూస్తే నాకు ఆ సీరియల్ గుర్తు వచ్చింది.బాగుంది పరిచయం.
Did u read ''Doctors'' ?
రిప్లయితొలగించండిhttp://en.wikipedia.org/wiki/Doctors_(novel)
it was my teenage favorite.
బాగుంది. మీరు కొమ్మూరి గారిదే 'పెంకుటిల్లు ' గురించి కూడా రాయండి. ప్లీజ్.
రిప్లయితొలగించండిఎప్పుడూ మీకు చిన్నప్పుడు జరిగి పోయిన 'అన్యాయాల ' గురించే కాకుండా ఇప్పటి మీ అనుభవాలను కూడ మాకు చెప్పచ్హు కదా!
త్రష్ణ గారు, ఈ జీవన్ రేఖ , స్టార్ వరల్డ్ లో యంగ్ డాక్టర్స్ గా అంతకు ముందు ఒచ్హేది.
ఈ పుస్తకం చాలా బాగుంటుంది. 1967 లో ఎమెస్కో వారు తొలిసారిగా ప్రచురించినప్పుడు కొని చదివాను. ఇప్పటికీ నా దగ్గర ఉంది.
రిప్లయితొలగించండి70లలో చాలా ప్రాచుర్యం పొందిన నవల
రిప్లయితొలగించండిపరిచయం బాగుంది.
రిప్లయితొలగించండిఈ పుస్తకం ఎక్కడో మొన్నీ మధ్య ఆన్లైన్ లో నెల నెలా వచ్చే సీరియల్ గా చదివేను.. ఎక్కడో గుర్తు రావటం లేదు.. కౌముది ఏమో మరి... బానే వుంటుంది కొంచం అక్కడక్కడ సాగ దీసినట్లనిపించినా..
రిప్లయితొలగించండిee post chadivaka naku nenu online lo chadivina Manasasancharare novel gurtuku vachindhi...adhi ippativaraku nenu chadivina vatilo the best book...anta nachindhi naku dani link na blog istunna choodandi murali garu adhi chadivi meeru dani meeda kuda oka post rayandi pls...
రిప్లయితొలగించండికొమ్మూరి గారు రాసిన హౌస్ సర్జన్ , పెంకుటిల్లు , హారతి చాల మంచి నవలలు.. పెంకుటిల్లు కూడా ఎన్ని సార్లు చదివనా మళ్ళా మళ్ళా చదవొచ్చు. హౌస్ సర్జన్ చదివి చాలా మంది ప్రేరణ పొందారు అని చెప్పుకుంటారు. .. మేము స్కూల్ లో ఉన్నప్పుడు ఈయన రాసిన ప్రేమనక్షత్రం సీరియల్ బైండు మా ఇంట్లో ఉండేది .. హౌస్ సర్జన్ రచయితా అని ఇది చదివి చిరాకు పడ్డ.. సోది నవల అది.. ఇయనే రాసారు అంటే నమ్మ బుద్ది కాదు. .. అక్టోబర్ ముప్పై ఒకటికి అయన పోయి అయిదు ఏళ్ళు అనుకుంటా...
రిప్లయితొలగించండినేను చదవాలనుకున్న పాత పుస్తకాల లిస్టులో ఉన్న పుస్తకం ఇది. చాలా చోట్ల ప్రయత్నం చేసాను. దొరక లేదు. అంటే దొరికే చోట ప్రయత్నం చేయలేదన్నట్లే. Any how you gave a briefing about it. Thanks. Your narration is nice.
రిప్లయితొలగించండిNo new post?
రిప్లయితొలగించండి@విజయ వర్ధన్: చదివారన్న మాట.. మీకు నచ్చిందా? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@తృష్ణ: 'జీవన్ రేఖ' కొన్ని భాగాలు చూశానండి.. ధన్యవాదాలు.
@Sujata: లేదండి.. చదువుతాను.. ధన్యవాదాలు.
@జయ: 'పెంకుటిల్లు' గురించి రాయాలని నేనూ అనుకుంటున్నానండి.. చాలా రోజులయ్యింది చదివి.. మళ్ళీ ఓసారి తిరగెయ్యాలి.. ఇప్పటి సంగతులు కూడా నా బ్లాగులో ఉన్నాయి కదండీ? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@హరేఫల: నాకు చాలా ఆలస్యంగా దొరికిందండీ.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: అవునండీ.. చాలా భాషల్లోకి అనువాదం అయ్యిందని రాశారు ప్రకాశకులు. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: పుస్తకం కూడా బాగుంటుందండి.. మిమ్మల్ని నిరాశ పరచదు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన: 'రచన' లో అని పైన విజయ వర్ధన్ గారు అన్నారు.. బహుశా అక్కడే చదివారేమో మీరు.. ధన్యవాదాలు.
@శిరీష: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
@శ్రీ: పెంకుటిల్లు, హౌస్ సర్జన్ పూర్తయ్యాయి.. ఇక హారతి చదవాలన్న మాట.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రీనిక: ఎమెస్కో వాళ్ళు కొత్తగా ప్రింట్ విడుదల చేశారండి.. ఇప్పుడు షాపుకి వెళ్తే దొరుకుతుంది మీకు.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: కొద్దిగా బిజీ.. ఇప్పుడే రాశాను చూడండి..
మాకు తెలియని పుస్తకాలేన్నిటినో పరిచయం చేస్తున్నారు ....కానీ అన్నీ చదవలేకపోతున్నాను మీరెక్కడుండేదీ సీక్రెట్ గా ఉంచండి పొరపాటున ఏ టపాలోనన్నా చెప్పారనుకోండి ....మీ గ్రంధాలయం మీద బ్లాగరులు (ముఖ్యంగా నేను ) దాడి చేసే అవకాశం ఉంది మరి :) :)
రిప్లయితొలగించండి@పరిమళం: :-) :-) :-) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండిమొన్నామధ్య (అంటే మీ టపా కంటే ముందన్నమాట) విశాలాంధ్రకి వెళ్ళాను. అక్కడ ఈ పుస్తకం చూశాను కూడానండి..కానీ కొనలేదు. చూశారా యెంత పొరపాటో మరి..ఈసారి తప్పక కొనుక్కుంటాను.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి