శనివారం, జులై 18, 2009

వార్తల వెనుక కథ

"మీరీ పుస్తకం చదవాల్సిందే.." పుస్తకాల షాపులో నాకు కావలసినవి వెతుక్కుంటూ ఉండగా సేల్స్ అసిస్టెంట్ ఓ పుస్తకం పట్టుకుని వచ్చాడు. పరాగ్గా చూశానేమో సైజులో 'వేయి పడగలు' కి కసిన్ లా అనిపించింది. (నిజానికి మరీ అంత పెద్దదేమీ కాదు). కవర్ పేజి చూస్తే 'వార్తల వెనుక కథ' అని ఉంది. "ఇదేదో జర్నలిస్టుల వ్యవహారంలా ఉంది" అన్నాను, తప్పించుకు తిరిగి ధన్యుడిని అయ్యే ఉద్దేశంతో. కానీ అతను వదల్లేదు. "మీకు నచ్చుతుంది.. నచ్చక పొతే తిరిగి ఇచ్చేయండి, పేరు రాయొద్దు" అని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. లోగడ అతను సూచించిన చాలా పుస్తకాలు నచ్చాయి నాకు. అలా ఆ పుస్తకం కొన్నాను రెండేళ్ళ కిందట. చాలా సార్లు చదివాను. ఇప్పుడు కథల ప్రస్తావన వస్తే నాకు ఆ వార్తల వెనుక కథలు గుర్తొచ్చాయి. వాటి పరిచయం 'పుస్తకం' లో...

3 వ్యాఖ్యలు:

 1. ఈ రివ్యూ చదవగానే మధుర్ భండర్కర్ తీసిన "పేజ్ 3" సినిమా గుర్తు వచ్చింది.పత్రికా విలేఖరులు ఎదుర్కునే సమస్యలను ఒక సరికొత్త కోణంలో చూపిస్తాడు దర్శకుడు ఆ చిత్రంలో.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాల మంచి పుస్తకం ....చదవడం మొదలెడితే వదలకుండా చదివేస్తాం ....ముఖ్యంగా వెంటాడిన వార్త ,రాజీవ్ గాంధి హత్య ,ఇలా దేనికదే ...ఇది నా జర్నలిస్టు స్నేహితులు ఇవ్వడం వలన చదవగలిగాను ...అయిష్టంగా మొదలెట్టి ఎంతో ఇష్టంగా పూర్తి చేసాను ...వేయిపడగాలకి దీనికి పోలికా ! అదేదో గొప్ప గ్రంధం అని మొదలెట్టి కష్టంగా ముగించాను ,మీరు కనుక ఆ పుస్తకం చదివి వుంటే దయచేసి దాని మీద రివ్యూ రాయగలరు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @తృష్ణ: ధన్యవాదాలు.
  @చిన్ని: పోలిక పుస్తకం సైజు విషయంలోనేనండి.. ఆ విషయం రాశాను కదా.. 'వేయిపడగలు' నేనుకూడా కొంచం కష్టపడి పూర్తి చేశానండి.. రాయాలంటే మళ్ళీ ఓసారి చదవాలి.. ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు