శనివారం, ఫిబ్రవరి 07, 2009

మనసులో వాన

పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న ఓ ముప్ఫయ్యారేళ్ళ స్త్రీ, యవ్వనారంభదశలో తాను ప్రేమించిన వాడిని మరచిపోలేక, పెళ్లి చేసుకున్నవాడితో సంతోషంగా ఉండలేక పడే ఇబ్బందిని కథా వస్తువుగా చేసుకుని అజయ్ శాంతి రాసిన కథ 'మనసులో వాన.' ఆసాంతం భావుకత తో నిండి ఉండే ఈ కథ లో ప్రధాన పాత్ర పేరు మహతి. సాహిత్యాన్ని విపరీతంగా ఆరాధించే ఓ మధ్యతరగతి తండ్రికి పెద్ద కూతురు. ఆ తండ్రి నండూరి వారు, కొనకళ్ళ వారు కలం పట్టిన ఊళ్ళో పుట్టడమే అదృష్టమని భావించుకునే వ్యక్తి. 'వేయి పడగలు' పుస్తకం అట్ట చించాడనే కోపంతో కొడుకుని కొట్టి ఆ రోజంతా భోజనం మానేసే సున్నిత స్వభావుడు. కూతురికి సాహిత్యాన్ని పరిచయం చేయడమే కాదు, తన వెంట సాహిత్య సభలకు తీసుకెళ్తూ ఉంటారాయన.

కాలేజి రోజుల్లో ఎన్నో జతల కళ్లు తనని స్పార్క్లింగ్ గా చూస్తున్నా వాటిని పట్టించుకోని మహతి 'రమణ' ని తొలిచూపులో ఇష్టపడుతుంది. బి.ఏ. చదివే రమణ కి కవిత్వం అంటే ప్రాణం. అతనో ఔత్సాహిక కవి. ఓ చిన్న పరిచయం లోనే మహతి తండ్రికి మంచి మిత్రుడైపోతాడు. సరిగ్గా రమణ తన ప్రేమను మహతికి వ్యక్తపరుస్తుండగా, మహతి తండ్రి అనారోగ్యం తో మరణిస్తాడు. ఆపరేషన్ చేసి ఉంటే బ్రతికి ఉండేవాడు..కాని డబ్బు లేదు. రమణ ప్రేమకి మహతి అవుననీ, కాదనీ చెప్పకముందే బంధువులంతా ఆమె పెళ్లి చుట్టాలబ్బాయి కాశ్యప్ తో నిర్ణయిస్తారు. పెళ్లి చేసుకుని కెనడా వెళ్ళిన మహతి అక్కడ ఇద్దరు కొడుకులకి తల్లి అవుతుంది. ఓ యునివర్సిటీ లో ఉద్యోగి అవుతుంది. భర్త లీడింగ్ ఆడియాలజిస్ట్ కావడం తో అందమైన ఇల్లు, కార్లు, విమాన ప్రయాణాలు.. ఇలా కలలో కూడా ఊహించని జీవితం.

ఐతే 'చాలా మంది మగ వాళ్ళకన్నాఎంతో మంచివాడైన' కాశ్యప్ లో భావుకత్వం అస్సలు లేదు. అందరి వినికిడి సమస్యలనీ పరిష్కరించే అతను ఆమె చెప్పేది వినిపించుకోడు. 'నక్షత్రాలు పాడే మార్నింగ్ సాంగ్ విందాం' అని మహతి అంటే 'సైనస్ పెరిగి పిల్లలు అమ్మా అని పిలిచినా వినలేవు' అంటాడు కాశ్యప్. 'నీ కవిత్వం నాకు అర్ధం కాదు మహతీ.. నేను పిన్నా, ఇయర్ డ్రం అంటూ టెక్నికల్ విషయాలు మాట్లాడితే నీకెలా ఉంటుందో, నువ్వు మాట్లాడే పిల్లగాలి, వెన్నెల వాన నాకు అలా ఉంటుంది' అంటాడు అతను. చాలా ఏళ్ళ తర్వాత ఉగాది పండక్కి పుట్టింటికి వచ్చిన మహతి రమణ ని తలచుకోవడంతో కథ ప్రారంభం అవుతుంది. పిన్ని పెట్టిన ఉగాది పచ్చడి తిని, కాశ్యప్ తన స్నేహితుడి ద్వారా ఏర్పాటు చేసిన బెంజ్ కార్లో రమణని చూడడానికి బయలుదేరుతుంది.

రమణ భార్య శారద ని చూసి అసూయ పడుతుంది మహతి..'రమణ ప్రేమకి నేను అవునని చెప్తే ఆమె స్థానం లో నేను ఉండాల్సింది' అనుకుంటుంది. ఆమె అభిప్రాయం ఎంతో సేపు ఉండదు..'కూలిపోబోతున్న' ఆ ఇంట్లో ఉండలేక 'చేదుగా ఉన్న' కాఫీ తాగలేక అక్కడినుంచి ఇంచుమించు పారిపోతుంది. రమణ బయటికి వెళ్ళిన తన కూతురు ఇంటికి వచ్చేవరకు ఆగమన్నా ఆగకుండా. ఇంటికి వచ్చి తన పిన్నితో జరిగిందంతా వివరంగా చెబుతుంది. తనని తాను దూషించుకుంటుంది. 'అక్కడ ఉన్నప్పుడు రమణ గురించి ఆలోచించా..ఇక్కడికి వచ్చాక అతని ఇంట్లో ఉండలేకపోయా.. నాన్నని తీసుకెళ్ళి పోయిన ఆ డబ్బులేని తనంలో నేను, నా పిల్లలు అనే ఊహనే భరించలేక పోయాను పిన్నీ..' అంటుంది మహతి.

అంతా విన్న ఆమె పిన్ని మహతిదేమీ అబ్ నార్మాలిటీ కాదంటుంది. 'కార్తీకం లో మనం చలిని ఎంజాయ్ చేయం..ఎండ కోసం ఎదురు చూస్తాం. అదే చైత్రం లో ఎండను భరించలేం..చలిగా ఉంటే బాగుంతుందనుకుంటాం. నీకు రమణ మీద ప్రేమ లేదు, కాశ్యప్ మీద ద్వేషమూ లేదు. నీకున్నది భావుకత్వం మీద ఇష్టం, బీదరికం మీద అయిష్టం.' అంటుంది. కాశ్యప్ లో భావుకత్వం లేదనుకోడం సరి కాదనీ ఎన్నో వేల మైళ్ళ దూరం లో ఉన్న భార్య ఇబ్బంది పడకూడదని కారు ఏర్పాటు చేయడం అనేది ఒక మనిషి గురించి ఎంతగానో ఆలోచించే వాళ్లు తప్ప చేయలేరనీ చెబుతుంది. 'శారద కూడా అదృష్టవంతురాలే మహతీ.. ఆమె పడిపోబోతుంటే రమణ ఆమెని పట్టుకున్నడన్నావ్ చూడు.. నిధి కన్నా అలాంటి భర్త సన్నిధి గొప్పది..' అంటుంది. తేలికపడ్డ మనసుతో కెనడా ప్రయాణమైన మహతిని 'రమణ కూతురి పేరు తెలుసా?' అని అడిగి తెలియదనడంతో 'ఆ పిల్ల పేరు మహతి' అంటుంది. ఈ జ్ఞాపకాన్ని కాశ్యప్ తో పంచుకోవాలని నిర్ణయించుకున్న మహతి కార్ ఎక్కడం తో కథ ముగుస్తుంది. కథతో పాటు, కవితాత్మకంగా రాసిన విధానమూ ఆకట్టుకుంటుంది.

20 కామెంట్‌లు:

  1. నాకు గుర్తుండి, ఈనాడు ఆదివారం లో అనుకుంటా చదివాను ఈకధ. మంచి కధ.

    రిప్లయితొలగించండి
  2. @ఉమాశంకర్: అవునండి..దాచి ఉంచా.. అప్పుడప్పుడూ చదువుతూ ఉంటా. చదివే అలవాటు ఉన్నవాళ్ళకి కాపి ఇస్తూ ఉంటా.. మన బ్లాగు మిత్రులకి పరిచయం చేద్దామని.. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నేను కూడా ఈ కథ చదివానోచ్..!!
    మంచి కథ. ఎక్కడ చదివానో గుర్తు లేదు. కానీ.. ఉమాశంకర్ గారు చెప్పారుగా.. ఈనాడు ఆదివారంలో అని. నేను ప్రతీ వారం చదువుతాను ఆ కథలు. సాధారణంగా మంచి మంచి కథలు వేస్తారు కదా అందులో..!

    రిప్లయితొలగించండి
  4. @మధురవాణి: ఈ మధ్య వాళ్లు కొంచం నిరాశ పరుస్తున్నారండి. నా దగ్గర స్కాన్ చేసిన కాపీ ఉంది.. చదువుతానంటే పంపుతా.

    రిప్లయితొలగించండి
  5. Murali gaaru,

    This is Naresh from Munich, Germany... for the past many days i am looking a way to get MANASULO VAANA story by ajay shanthi........ i think i have read it in 2004. i liked it so much that when i read it for the first time i couldnt come out of that feel for few days.. Since i have no way here to get that story i request you to lemme know if it is available.........

    రిప్లయితొలగించండి
  6. మురళీ గారూ,
    ఆ కథ నాకు కావాలండీ. మీకు వీలున్నప్పుడు pavansanthosh57@gmail.com కి పంపించండి . నేను ఒకసారే చదివాను కానీ కథంతా గుర్తుంది నాకు. మళ్లీ చదవాలని ఉంది. అలాగే మీ దగ్గర గోదావరి పుష్కరాలప్పుడు ఈనాడులో వచ్చిన "వెండి పట్టీలు" కథ ఉందా?
    ---సూరంపూడి పవన్ సంతోష్

    రిప్లయితొలగించండి
  7. Nenu manasulo vaanalo enthaga thadichi mudhai poyanante, na mail address mahathi_ramana. Aa mata ekkadaina vinte ventane ekkado alajadi modalavuthundi.. irresistible talking about it...

    రిప్లయితొలగించండి
  8. Ramesh kumar rasina pralaya kaveri kathalu ekkada dorukuthayo evaraina chepthara plz...

    రిప్లయితొలగించండి
  9. @శాంతి యాదవ్: "మనసు తలుపు తట్టే మూడక్షరాల పేరు - రమణ" "గులాబీ రంగు వోణీ - నా వేలి చుట్టూ" ఇలాంటి వాక్యాలు తరచూ వెంటాడుతూ ఉంటాయండీ నన్ను.. నాలాగే ఇంకొందరు ఉన్నారని తెలిసింది ఈ పోస్టు వల్ల :)) 'ప్రళయ కావేరి కథలు' కొత్త ప్రింట్ రావాలేమోనండీ.. డిస్ప్లే లో ఎక్కడా కనిపించడంలేదు మరి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  10. oh.... u replied me.. thank u...

    Ramana kaadandi, ra-ma-na... :-). Ipudarthamayuntundi nenentha manasulo vaana pichi daanno...

    'Kanunreppalni dosilluga marchanu... kurusthunna vennelani odisi pattukuni thaganu... ayina yi gunde gonthuka daham theeradem priyathama...'

    Elagandi baabu... emaipovali manushulu...inthati bhavukathvaniki :-)

    రిప్లయితొలగించండి
  11. Actually am very new to blogs.. actually first blog am visting... yi blog ethics emaina unte naku theleedu..

    but i hav a question.... can i post na sontha raarraathalemaina unte..?

    Murali garu... correct me.. if any... thank u...

    రిప్లయితొలగించండి

  12. @Santhi Yadav: హహహా.. నేను కూడా ర-మ-ణ అనే రాయబోయి ఆగానండీ :) మొత్తానికి కథంతా నోటికి వచ్చన్న మాట!! మీకు జిమెయిల్ అకౌంట్ ఉంది కదా, దాని సాయంతో బ్లాగు మొదలు పెట్టేయండి www.blogger.com కి వెళ్లి, మీకు నచ్చిన యూఆరెల్ సెలెక్ట్ చేసుకుని బ్లాగు క్రియేట్ చేసేసుకుని, మీకు నచ్చినవన్నీ రాసుకోవచ్చు. www.koodali.org కి వెళ్లి చూడండి.. తెలుగు బ్లాగులు చాలా కనిపిస్తాయి. నాలుగైదు బ్లాగులు చదివితే మీకో ఐడియా వచ్చేస్తుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే nemalikannumurali@gmail.com కి మెయిల్ రాయండి. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  13. Meeru cheppindi follow ayi created blog... veelaithe o sari chudandi..

    manasulovaanamahathi.blogspot.com

    రిప్లయితొలగించండి
  14. @mahathi ramana: భలేగా ఉందండీ బ్లాగు పేరు.. తెలుగు లిపిలో రాయొచ్చు టైటిల్.. లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి.. లేదూ జిమెయిల్ డ్రాఫ్ట్ లో తెలుగులో రాసి కాపీ పేస్ట్ చేయండి.. టపా ఏదీ కనిపించలేదు నాకు. 'క్షమించండి' అని మెసేజ్ వచ్చింది.. పోస్ట్ రాయండి మరి :)

    రిప్లయితొలగించండి
  15. Murali garu

    I also read this story in eenadu and liked it so much. Recently i have started reading telugu blogs and i was so excited by your post on this story. Enno yella kritham vachhina ee katha gurinchi post raasinanduku thanks.
    Can u please share this scanned copy with me when you have some time.

    రిప్లయితొలగించండి
  16. @పున్నాగపూలు: తప్పకుండానండీ.. nemalikannumurali@gmail.com కి మెయిల్ చేయండి..

    రిప్లయితొలగించండి
  17. Na daggara e story print aina book inka vundi. 2004 march lo publish aindi. Cover story is about 350th anniversary of taj mahal. Ippatiki this my favorite story. I'm really surprised n excited to see it in this blog

    రిప్లయితొలగించండి
  18. @దామోదర్ రెడ్డి, సిరి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి