గురువారం, జనవరి 24, 2013

నాలుగడుగులు...

చూస్తుండగానే మరో పుట్టినరోజు వచ్చేసింది. మనం ఏం చేసినా,చెయ్యకపోయినా 'నేనున్నా' అంటూ వచ్చేసే వాటిలో ఇదిగో ఈ పుట్టినరోజు కూడా ఒకటి. అలా వచ్చేసినందుకైనా మనం మన పనులు కాసేపు పక్కన పెట్టి, గడిచిన ఏడాది కాలాన్ని ఓసారి సింహావలోకనం చేసుకోవాలి. తప్పులూ, ఒప్పులూ, లెక్ఖలూ, పత్రాలూ ఓసారి తిరగేసేయాలి. అప్పుడు, ఆ జరిగిపోయిన వాటినుంచి రేపటి కోసం పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయేమో వెతుక్కోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే, 'నెమలికన్ను' కి నాలుగేళ్ళు నిండి ఐదో ఏడు వచ్చేసింది.

మొదటి మూడు సంవత్సరాలతో పోల్చినప్పుడు, అతి తక్కువ బ్లాగు పోస్టుల ద్వారా రికార్డు సృష్టించడం జరిగింది ఈ నాలుగో సంవత్సరంలో. సగటున వారానికి ఒక్క పోస్టు కన్నా తక్కువే. ఏ నెలలోనూ కూడా డబల్ డిజిట్ పోస్టులు రికార్డు అవ్వలేదు. ఒకప్పుడు ఉద్ధృతంగా వచ్చి పడిన టపాలు, ఇప్పుడు ఎందుకిలా మందగించాయీ అంటే గబుక్కున జవాబు చెప్పడం కష్టం. 'ఇన్ని టపాలు ఎందుకు రాశావు?' అన్న ప్రశ్నకి ఇదమిద్దమైన సమాధానం ఉండనట్టే, 'ఎందుకు రాయలేదు?' అన్న ప్రశ్నకీ ఉండదు మరి.

మొదటినుంచీ 'నెమలికన్ను' ని వెన్నంటి ఉన్న అదృష్టం ఒకటి ఉంది. పాఠకుల ఆదరణ. బ్లాగులో వచ్చిన టపాలు చదివి నిర్మొహమాటంగా అభిప్రాయాలు పంచుకోవడమే కాదు, తప్పులని సున్నితంగా ఎత్తి చూపడం, ఎప్పుడన్నా కొంతకాలం పాటు విరామం వచ్చేస్తే ఏమైందంటూ ఆదరంగా ఆరా తీయడం...ఇవన్నీ బ్లాగు పాఠకుల నుంచి అందుతున్న కానుకలు. కొత్తగా ఈ బ్లాగుని కనుగొన్న వాళ్ళు ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చెబుతున్నారు. అలాగే, చదవదగ్గ పుస్తకాలని గురించీ సమాచారం వస్తోంది.


ఈ బ్లాగుకి సంబంధించి గడిచిన సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. వారి వారి పుస్తకాలని గురించి బ్లాగులో వచ్చిన టపాలు చదివిన కొందరు రచయితలు ఉత్తరాల ద్వారా అభినందనలు అందజేశారు. వారి సంస్కారానికి ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడే రచయిత నుంచి వచ్చిన ఉత్తరమూ వాటిలో ఉంది. కొంచం తరచుగా బ్లాగు రాయాలని మరీ మరీ అనిపించిన సందర్భం అది. పుట్టినరోజుని పురస్కరించుకుని, బ్లాగు మిత్రులతో పంచుకోవాలనిపించిన కబురు ఇది. అలాగే, క్రమం తప్పకుండా బ్లాగు చదివే కొందరు పాఠకులతో కామెంట్ బాక్స్ లో మొదలైన పరిచయం మెయిల్ బాక్స్ కి విస్తరించింది. 'శర్కరి' బ్లాగులో ఎంపిక చేసిన వంద టపాల్లో, 'నెమలికన్ను' కీ చోటిచ్చారు. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ.

చదువు దగ్గరికి వస్తే, గడిచిన సంవత్సరాల కన్నా ఈ ఏడాది పుస్తక పఠనం తక్కువే. కొని, చదవకుండా ఉంచేసిన పుస్తకాలే ఇందుకు సాక్ష్యం. చదివిన కొన్నింటిలో బాగా నచ్చేసినవి ఆత్మకథలు. కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆత్మకథ లాగా అనిపించే నవల 'లోపలి మనిషి' బాగా ఆలోచింపజేసిన పుస్తకం. ఆత్మకథలని చదవడంలో ఉండే రుచిని పెంచిన పుస్తకాలే ఈ రెండూ కూడా. సినిమా రంగం మీద ఆసక్తి వల్ల కాబోలు, రావూరి భరద్వాజ 'పాకుడు రాళ్ళు' ఆపకుండా చదివాను. అయితే, చూసిన సినిమాలు మాత్రం బహు తక్కువ. చూసిన వాటిలో 'మిథునం' పర్వాలేదు అనిపించింది.

గతాన్ని నెమరు వేసుకోవడం అయ్యాక, నిజానికి చేయాల్సిన మరోపని భవిష్యత్తు ప్రణాళిక రచించడం. కానీ, బ్లాగింగ్ అన్నదే ప్లానింగ్ లేకుండా చేసే పని. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం ఇక్కడ వీలుకాదు కూడా. గడిచిన నాలుగేళ్ల లోనూ రాయడం అన్నది నాకు మరింత ఇష్టమైన వ్యాపకం అయిపోయింది. అలాగే, చదవడం మీద ఆసక్తి తగ్గిపోకుండా ఉండడంలో బ్లాగు పాత్ర ఉందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఇందుకు కారకులు ఈ బ్లాగు చదువుతున్న మీరందరూను. 'కృతజ్ఞతలు' అన్నది చిన్న మాటే కానీ, అంతకన్నా ఏం చెప్పగలను నేను?

42 కామెంట్‌లు:

  1. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు "నెమలికన్ను" మురళి గారూ! :)

    రిప్లయితొలగించండి
  2. నెమలికన్నుకి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు!

    మీ బ్లాగు ద్వారానే నాకు ఎన్నో మంచి పుస్తకాల గురించి తెల్సిందండీ.. ఎప్పుడు బుక్స్ లిస్ట్ చేసుకున్నా మీ పోస్ట్స్ ఒకసారి చూసి, వాటిల్లోంచి ఒక నాలుగైదు పుస్తకాలు ఏరుకుంటాను :)

    Happy blogging :-)

    రిప్లయితొలగించండి
  3. wishing nemalikannu happy bday.hope to see more nice posts this year.

    రిప్లయితొలగించండి
  4. best wishes to nemalikannu for completing 4 years. waiting for more good posts

    రిప్లయితొలగించండి
  5. జీవశ్చ శరదాం శతం.

    రిప్లయితొలగించండి
  6. "నెమలికన్ను"కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  7. మా గోదారబ్బాయ్ నెమలికన్నుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీరిలాగే రాస్తూ మాకు విందు భోజనాలు పెడుతూ ఉండాలి మేమ షడ్రుచులూ ఆస్వాదిస్తూ చదువుతూనే ఉండాలి శతమానంభవతి.

    రిప్లయితొలగించండి
  8. "నెమలికన్ను"కి పుట్టినరోజు శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  9. జన్మదిన శుభాకాంక్షలు మురళి గారు..:))

    రిప్లయితొలగించండి
  10. మురళి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  11. "నెమలికన్ను"కి జన్మదిన శుభాకాంక్షలు... :)

    రిప్లయితొలగించండి
  12. అందమైన 'నెమలికన్ను'కి
    అయిదో వసంతంలోకి
    హృదయపూర్వక స్వాగతాలండీ..

    ఇప్పటివరకూ అవరోహణలో సాగిన పోస్టుల సంఖ్య
    ఇకనుంచీ ఆరోహణలో కొనసాగాలని కోరుకుంటూ..

    గీతిక

    రిప్లయితొలగించండి
  13. 'నెమలికన్ను' కు పుట్టినరోజు శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  14. మిధునం బానేవుందా?? ఎట్టెట్టా...!!
    మిధునం సినిమా గురించి మీరేం చెప్పారో తెలుసుకోవాలని పరిగెత్తుకొస్తే మీరు చెప్పేమాట ఇదా మురళిగారు . రివ్యూ ఏదండీ ?

    రిప్లయితొలగించండి
  15. మరిన్ని మంచి పుస్తకాలు చదివి... మాకు పరిచయం చేయాలి. అంతేకాదు... మీ సొంతంగానూ రాయాలి. అవి అభిప్రాయాలైనా, రచనలైనా కానీయండి...

    రిప్లయితొలగించండి
  16. నెమలికన్నుకి జన్మదిన శుభాకాంక్షలండి

    రిప్లయితొలగించండి
  17. సక్సెస్‌ఫుల్ బ్లాగర్‌గా నాలుగేళ్లు పూర్తిచేసుకున్నందుకు అభినందనలు!

    రిప్లయితొలగించండి
  18. నెమలికన్నుకి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు!


    Happy blogging :)

    రిప్లయితొలగించండి
  19. శుభాకాంక్షలు మురళి గారు!

    రిప్లయితొలగించండి
  20. మురళి గారూ వంద టపాల ఎన్నికలో ప్రధమంగా ఉండాల్సినవే మీవండీ. మీరు దానికి ధన్యవాదాలు తెలియజేయనక్కరలేదు. అంత మంచి టపాలను అందించినందుకు మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీ పుస్తకపరిచయాల వల్ల నేనెన్నో మంచి పుస్తకాల గురించి తెలుసుకున్నాను. కొన్నింటిని చదవడం సాధ్యపడింది. కొన్ని కొనవలసిన జాబితాలో చేరిపోయాయి.

    "నెమలికన్ను" ఇలా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  21. అయిదేళ్ళుగా ఎదిగి పోతున్న నెమలికన్ను కి హృదయపూర్వక అభినందనలు మురళి గారు.

    రిప్లయితొలగించండి
  22. మీ(మా)నెమలికన్ను కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    "గడిచిన నాలుగేళ్ల లోనూ రాయడం అన్నది నాకు మరింత ఇష్టమైన వ్యాపకం అయిపోయింది"...అంటే అంతకు ముందు కూడా వ్రాసేవారన్నమాట:)

    రిప్లయితొలగించండి
  23. పోయిన వారం, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ "ఆనందోబ్రహ్మ" మొదటి లైన్ నుంచీ చివరి లైన్ వరకూ, మీరప్పుడెప్పుడో చెప్పిన పోజులో:) రాత్రంతా చదివి, మీ బ్లాగు కొసం వెదుక్కొని వచ్చి, మీర్రాసిన రివ్యూ మళ్ళీ చదివాను మురళీ గారూ.
    నాలుగు సంవత్సరాలు వరసగా రాయటమంటే ఎంతో అభిరుచి ఉంటే కాని సాధ్యపడదు. అభినందనలు. Keep going please.

    రిప్లయితొలగించండి
  24. ఓ హై ఫైవ్ అండీ:))'నెమలికన్ను' కు పుట్టినరోజు శుభాకాంక్షలు....ముందుకు చూస్తూ:))

    రిప్లయితొలగించండి
  25. నెమలికన్నుకి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  26. @కొత్తావకాయ: ధన్యవాదాలు కొత్తావకాయ గారూ...

    @నిషిగంధ: ఓహ్... ఇంతకన్నా సతోషం ఏముంటుంది నాకు! ధన్యవాదాలండీ..

    @Truely: Thank you very much

    రిప్లయితొలగించండి
  27. @స్వాతి: ధన్యవాదాలండీ..

    @కష్టేఫలే : ధన్యవాదాలండీ...

    @శ్రీ. దు.: ధన్యవాదాలు శ్రీధర్ గారూ, ప్లస్ లో షేర్ చేసినందుకు కూడా...

    రిప్లయితొలగించండి
  28. @శ్రీనివాస్ పప్పు: మీ అందరి అభిమానమూనండీ... ధన్యవాదాలు

    @ఉషశ్రీ: ధన్యవాదాలండీ...
    @Unknown: Thank you

    రిప్లయితొలగించండి
  29. @రాజి: ధన్యవాదాలండీ...

    @ధాత్రి: ధన్యవాదాలండీ...

    @నవజీవన్: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  30. @శోభ: ధన్యవాదాలండీ...

    @గీతిక: నేనూ అదే కోరుకుంటున్నానండీ... చూడాలి, ఏం జరుగుతుందో... ధన్యవాదాలు

    @లలిత: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  31. @పురాణపండ ఫణి: తప్పకుండానండీ... ధన్యవాదాలు

    @రాధిక (నాని): ధన్యవాదాలండీ...

    @చాణక్య: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  32. @సవ్వడి: ధన్యవాదాలండీ..

    @కృష్ణ: ధన్యవాదాలండీ..

    @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  33. @జ్యోతిర్మయి: భలే వారే.. గుర్తు పెట్టుకుని, పోస్టులు వెతికి మరీ జాబితాలో వేశారు మీరు!! ధన్యవాదాలు

    @జయ : ధన్యవాదాలండీ...

    @చాతకం: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  34. @సిరిసిరిమువ్వ: భలే పట్టుకుంటారు మీరు!! డైరీ అని చెప్పలేను కానీ, అప్పుడప్పుడూ తెల్ల కాగితాలు నలుపు చేస్తూ ఉండే వాడినండీ :-) ధన్యవాదాలు

    @కుమార్ యెన్: అబ్బా.. ఆ పోజ్ భలే గుర్తు పెట్టుకున్నారు మీరు!! సీరియస్ పుస్తకాలు చదివిన తర్వాత ఓసారి మందాకిని నో, జయంతినో పలకరించడం బాగుంటుంది లెండి :-) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  35. @సునీత: హహ్హ... ధన్యవాదాలండీ...

    @జ్యోతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  36. హర్రే ఈ టపా ఎలా మిస్సయ్యాను !!.. నెమలికన్నుకు కాస్త ఆలశ్యంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీకు అభినందనలు మురళి గారు. Wishing you many more years of successful blogging :-)

    రిప్లయితొలగించండి
  37. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి