నేను మొట్ట మొదట హైదరాబాద్ చూసింది నా ఐదో ఏట.. మా తాతయ్య, బామ్మతో కలిసి. దాదాపు ఇరవై రోజులు అమ్మని, నాన్నని వదిలి వాళ్ళతో కలిసి ఊళ్ళు తిరిగొచ్చాను. నా అక్షరాభ్యాసం అయ్యాక తాతయ్య మూడు నెలల్లో చిన్న బాలశిక్ష పూర్తి చేస్తే హైదరాబాద్ తీసుకెళ్తానని నాకు మాటిచ్చి, దానిని నిలబెట్టుకునే క్రమంలో చేయించిన ప్రయాణం. బామ్మకి, మిగిలిన కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇష్టం లేకపోయినా పైకి ఏమీ మాట్లాడలేదు వాళ్ళు.. బహుశా మాట్లాడినా ఉపయోగం ఉండదని కావొచ్చు.
నాకు హైదరాబాద్ ప్రయాణం విషయాలు అంత బాగా గుర్తుండక పోయేవి.. కానీ యాత్ర ముగిశాక అక్కడ జరిగిన ప్రతి విషయాన్నీ బామ్మ వందల సార్లు తల్చుకోడం వల్ల మర్చిపోదామన్నా మర్చిపోలేనంతగా గుర్తుండి పోయాయి. ప్రయాణం కోసమని తాత నాకు కొత్త బట్టలు కుట్టించడం తో సన్నాహాలు మొదలయ్యాయి. ముందుగా మేము ముగ్గురం బస్సులో రాజమండ్రి వెళ్ళాం. అక్కడ బాబాయి ఇంట్లో రెండు రోజులు ఉన్నాం.
నిజానికి అది నన్ను పరిక్షించడం అన్నమాట.. అమ్మనీ నాన్ననీ వదిలి నేను ఉండగలనా అని? ఆ పరీక్షలో నేను పాస్ కావడం తో అక్కడినుంచి రైల్లో హైదరాబాద్ బయలుదేరాం. తాతయ్య పాపం నాకు అర టిక్కెట్టు కొందామనుకున్నారు కానీ, బామ్మ పడనివ్వ లేదు. 'ఎందుకు దండగ' అని. రైలెక్కే ముందు తాతయ్య నాకో నల్ల కళ్ళజోడు కొనిచ్చారు. రైలు బొగ్గు కళ్ళలో పడకుండా అన్నమాట. ఆ కళ్ళజోడు చాలా రోజులు దాచుకున్నా.. తర్వాత ఎక్కడో పోయింది.
రైలెక్కగానే నన్ను ఎవరితోనూ మాట్లాడొద్దని బామ్మ ఆర్డరేసింది. మూడేళ్ళ లోపు పిల్లలకి సరిగా మాటలు రావు కదా మరి. నాకేమో మనుషులు కనిపిస్తే నోరూరుకోదు. దానికి తోడు జ్ఞానం కొంచం ఎక్కువ అవడం వల్ల ఎవరైనా ఒకటి అడిగితే పది జవాబులు చెప్పడం మాటలు వచ్చిన నాటి నుంచీ అలవాటు. అలా రైల్లో నన్ను పలకరించిన వాళ్ళందరికీ నేను ఠపీ ఠపీ సమాధానాలు చెబుతుంటే బామ్మ గొడవ చేసేది, టీసీ వచ్చి నాకు ఫైన్ కట్టమంటాడని.
మొత్తానికి హైదరాబాద్ చేరాం. మా అత్తయ్యలు, ఇంకా తాతయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఇలా చాలా మంది బంధువులు ఉన్నారు. వాళ్ళ ముందు నా విద్యా ప్రదర్శనలు. నేను గుణింతాలు పాటలా పాడుతుంటే మా అత్తయ్యల పిల్లలు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని నవ్వుకునే వాళ్ళు. తాతయ్యకి మాత్రం భలే గర్వంగా ఉండేది. నేనెక్కడ ఏ అర్ధరాత్రో లేచి అమ్మ కావాలి అంతానో అని టెన్షన్ వాళ్లకి. అందుకని ఎప్పుడూ స్వీట్లు ఇంట్లో ఉండేలా జాగ్రత్త పడే వాళ్ళు. అడక్కపోయినా స్వీట్లు తినిపించేస్తూ ఉండేవాళ్ళు, ప్రేమగా.
నేను ఏ విషయానికి ఏడుపు మొదలు పెట్టినా స్వీటు చూసేసరికి టక్కున ఆపేసేవాడిని.. ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచదార నంజుకోడం నా అలవాటు. ఈ విషయం తాతయ్యకి బాగా తెలుసు. తాతయ్య తో కలిసి చీకటి గుహలా ఉన్న చార్మినార్ స్థంభం లోనుంచి పైకి ఎక్కడ, గోల్కొండ కోట దగ్గర చప్పట్లు కొట్టడం లీలగా గుర్తుంది. అక్కడే మొదటిసారి ఫోన్ చూశాను. కానీ మాట్లాడడానికి భయ పడ్డాను.
నాకు బోల్డు దిష్టి తగిలేస్తుందని తాతయ్యకి నా చిన్నపటినుంచీ బెంగ. కొంచం బొద్దుగానూ, ఆయనకి ముద్దుగానూ ఉండేవాడిని. అందుకని రోజూ రాత్రి నేను పడుకునే ముందు ఉప్పు తో దిష్టి తీయించే వాడు. ఇంట్లో ఐతే అది అమ్మ డ్యూటీ.. ఈ యాత్రలో మాత్రం అది బామ్మ డ్యూటీ. ఒకరోజు నన్ను హైదరాబాద్ నుంచి మంత్రాలయం తీసుకెళ్ళారు. అక్కడ రాత్రి ఉండాల్సి వచ్చింది. దిష్టి తీయడానికి ఉప్పెక్కడ దొరుకుతుంది? హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాం కదా.. అక్కడ బామ్మ కూరల్లో ఉప్పు సరి పోలదని వంకలు పెట్టి సర్వరు చేత ఉప్పు తెప్పించి వేరే పళ్ళెంలో వేయించుకుంది. ఆ సర్వర్ చాలా వింతగా చూశాడని బామ్మ తర్వాత చాలాసార్లు తల్చుకుంది.
అత్తయ్యలు మావయ్యలు కొత్త బట్టలు, బొమ్మలు, పుస్తకాలు కొనిచ్చారు. మరి ఇంటికొచ్చాక ఇంక బళ్లోకి వెళ్ళాలి కదా. వచ్చేటప్పుడు కూడా రాజమండ్రి లో ఆగి ఒక రోజు ఉండి మా ఊరొచ్చాం. బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు. రోజూ ముప్పొద్దులా స్వీట్లు తిన్న పిల్లాడు అలా కాక ఇంకెలా ఉంటాడు మరి?
మీ భాగ్యనగర ప్రయాణ విశేషాలు బాగున్నాయి. ఒక సారి Nostalgic గా ఫీల్ అయ్యాను. చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసారు. మీరు చాలా ధైర్యవంతులే :) నేను చిన్నప్పుడు అమ్మను వదిలి ఉండలేకపోయేవాడిని. ఒక సారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి రాత్రి లేచి బాగా గొడవ చేసాను.
రిప్లయితొలగించండి:))
రిప్లయితొలగించండిమీ అనుభవాలు చదువుతుంటే చిన్నప్పుడు దూరదర్శన్ లో పొద్దున్న పది గంటలకు "టెలిస్కూల్" అనే కార్యక్రమంలో, అప్పుడప్పుడు ఓ పదినిమిషాల నిడివున్న కధలు ఇచ్చేవాడు. ఆ కధలు మళ్ళీ గుర్తుకువచ్చాయి.
baagundi........
రిప్లయితొలగించండిమురళీ మీ ప్రయాణం అదిరింది. మచ్చుకు నాకు నచ్చినవి.
రిప్లయితొలగించండిబామ్మకి, మిగిలిన కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇష్టం లేకపోయినా పైకి ఏమీ మాట్లాడలేదు వాళ్ళు.. బహుశా మాట్లాడినా ఉపయోగం ఉండదని కావొచ్చు
కానీ యాత్ర ముగిశాక అక్కడ జరిగిన ప్రతి విషయాన్నీ బామ్మ వందల సార్లు తల్చుకోడం వల్ల మర్చిపోదామన్నా మర్చిపోలేనంటగా గుర్తుండి పోయాయి
తాతయ్య పాపం నాకు అర టిక్కెట్టు కొందామనుకున్నారు కానీ, బామ్మ పడనివ్వ లేదు. 'ఎందుకు దండగ' అని ( ఇక్కడ కూడా మీ బామ్మ గారిని వదల లేదన్నమాట)
నేను ఏ విషయానికి ఏడుపు మొదలు పెట్టినా స్వీటు చూసేసరికి టక్కున ఆపేసేవాడిని.. ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచదార నంజుకోడం నా అలవాటు
బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు.
Overall super...
>>బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు. రోజూ ముప్పొద్దులా స్వీట్లు తిన్న పిల్లాడు అలా కాక ఇంకెలా ఉంటాడు మరి
రిప్లయితొలగించండి:)
Nice post..
తాతయ్యలందరికీ మనవళ్ళ విద్య ప్రదర్సించుకోవటము సరదా ! బరోడా లో మా యింటికి ఓ తాతా మనవడు ,అమ్మా నాన్నా వచ్చేవారు. వాళ్ళు రాగానే మా చెల్లెలు, పిల్లలు బయటికి పారిపోయే వారు. వీలు కాక పోతే హోం వర్క్ అని వంక చెప్పి వెళ్ళిపోయేవారు. ఇక నేను ,మా వారు రాని నవ్వులు తెప్పించుకుంటూ కనీసం 2 గంటలు బలి అయిపోయేవారము. పైగా ఆయన మా మామగారి దోస్త్ ! అబ్బో భలే గుర్తుచేసారు.
రిప్లయితొలగించండిలడ్డు , జిలేబీ , మైసూర్ పాక్ , గులాబ్ జాం , బొబ్బట్టు , సున్నుండలు , కోటయ్య కాజా ,పూతరేకులు ....ఇంకా బెల్లం గారెలు , పూర్ణం బూరెలు ...మురళిగారూ ! చాలా ? :)
రిప్లయితొలగించండిబుల్లి నిక్కరు వేసుకొని , నల్లకళ్ళద్దాలు పెట్టుకొని ....వెనక్కెళ్ళి పోతున్న చెట్లను అబ్బురంగా కిటికీ లోంచి చూస్తూ హైదరాబాద్ ని ఊహించుకొంటున్న ఓ బుల్లి మురళి :) ....నా ఊహల్లోకొచ్చేశాడు . మీకొద్దంటే చెప్పండి స్వీట్స్ అన్నీ తనకిచ్చేస్తాను ..అన్నట్టు మళ్ళీ దిష్టి తీయించుకోండి ! మీ నెమలికన్నుతో సహా ...
అన్నట్టు టిక్కట్టు లేని ప్రయాణం నేరం ! ఫైన్ ఇన్నేళ్ళ వడ్డీతో కలిపి కట్టాల్సిందే !
రిప్లయితొలగించండిఆయ్ ...రైల్వే నే మోసం చేస్తారా ?నేనసలే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళమ్మాయిని ...అస్సలూరుకోను .
మీరెంత ముద్దుగా ,బొద్దుగా ఉన్నా సరే :)
:D
రిప్లయితొలగించండిnalla kalladdaalu :)
మీ తీపిగుర్తులను మాతో పంచుకున్నందుకు నోట్లో ఇడ్లీ అంత పంచదార పోసుకోండి....లేకపోతే దిష్టి తగిలేను!:)
రిప్లయితొలగించండిchubby cheeks
రిప్లయితొలగించండిdimpl cheeks
rosy lips
very fair ...chinni's pet
isthat u......murali
పిచ్చిపిచ్చిగా నచ్చేసాడు 'నల్ల కళ్ళద్దాల ' బుల్లి మురళి .మా ఇంతో నేతి మైసూరు పాక్ వుంది ...ఒంగోలు నుండి తాజాగా తెప్పించాను ....తిన్తానికి రామ్మా .....:):)
గుమ్మటంలా హ్హహ్హహ్హ...ఇడ్లీలో ఇడ్లీ అంత పంచదార కేక మురళీ...ఇడ్డెన్ను లో అంటే ఇంకా అద్దిరేది కదా...
రిప్లయితొలగించండిcho chweet.
రిప్లయితొలగించండి"దానికి తోడు జ్ఞానం కొంచం ఎక్కువ అవడం వల్ల ఎవరైనా ఒకటి అడిగితే పడి జవాబులు చెప్పడం మాటలు వచ్చిన నాటి నుంచీ అలవాటు."
Me too ..
కాకపోతే హైదరాబాదు వెళ్ళినప్పటికి నాకు ఆరేళ్ళు. మా అమ్మ, హైదరాబాదులో ఉండే మా పిన్ని ఆ కబుర్లని చాలాకాలం తల్చుకున్నారు.
ఎప్పటిలానే అదిరింది.
రిప్లయితొలగించండి@వెంకట గణేష్: నిజమేనండీ ధైర్యస్తుడినే :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: దూరదర్శన్ ఇప్పుడు ట్యూన్ చేసినా మీరు అవే కార్యక్రమాలు చూడొచ్చు :-) ..ధన్యవాదాలు.
@వినయ్ చక్రవర్తి: ధన్యవాదాలు.
@భాస్కర రామిరెడ్డి: బామ్మని వదలక పోవడం కాదండి.. నాకు టిక్కెట్ కొనకపోవడం ఏదో అన్యాయం అనిపించింది అప్పుడు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మేధ: :-) :-) ధన్యవాదాలు
@మాలాకుమార్: మేము మరీ అంతగా ఎవరినీ హింస పెట్టలేదండీ :-) :-) బాగున్నాయి మీ అనుభవాలు. ధన్యవాదాలు.
@పరిమళం: హమ్మో..ఎన్ని స్వీట్లో.. ఈ మధ్య స్వీట్లు బాగా తగ్గించానండీ.. తగ్గించాల్సి వచ్చింది..ప్చ్.. ఫైన్ నేనెందుకు కట్టాలి చెప్పండి? మా తాతా, బామ్మా కట్టాలి.. రైల్వే వాళ్ళని వసూలు చేఉసుకోమని చెప్పండి :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@లక్ష్మి: :-) :-) ధన్యవాదాలు
@పద్మార్పిత: అంటే అంటారా? :-) ధన్యవాదాలు.
@చిన్ని: వాడు ఇప్పటి మురళి కాదండీ.. మీ స్వీట్లు మాత్రం వాడికే చెందాలి మరి.. నేను తినడం న్యాయం కాదు కదా? ఏమంటారు :) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: "ఇడ్డెన్ను" ఎన్నాళ్ళయ్యిందో ఈ మాట విని .. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: హమ్మయ్య.. నాకు తోడు దొరికారు. :) ధన్యవాదాలు.
@భవాని: ధన్యవాదాలు.
ఇప్పుడే చుసానండి ఈ టపాని...నా కంప్యూటర్ లో ఒక తెలుగు ఎడ్రస్ బార్ ఉండేది."కూడలి,జల్లెడ,లేఖిని"కలిపి ఉన్నది.అది మొన్నొకరోజు మాయమైంది....మరి మా పాప నొక్కేసిందో ఏమో..మళ్ళీ ఎలా దాన్ని సంపాదించాలో తెలీట్లేదు..అది లేక కూడలికి రావటం కష్టంగానే ఉంది.రోజూ మీ వ్యాఖ్య వచ్చాకా కొత్త టపా ఏమైన ఉందేమో చుడటం అలవాటు..ఇవాళ మీ వ్యాక్య లేదు కాబట్టి టపా రాయలేదేమో అనుకున్నానండి..
రిప్లయితొలగించండిఎవరైనా ఆ ఎడ్రస్ బార్ మళ్ళీ ఎలా సంపాదించాలో తెలిస్తే చెప్పండి..
పరిమళంగారి వ్యాఖ్య అదుర్స్!!నేనూ డిటొ..డిటో..బాగుంది యాత్ర !!
మురళి, చాలా బాగుందండీ మీ భాగ్య నగర ప్రయాణ విశేషాలు.. అసలు మీ బామ్మ గారు వున్నారే... సూపరండి. ఐతే మీ అమ్మ వాళ్ళకు ఏం తేలేదా స్వీట్ లు గిఫ్ట్ లు? మీరే బొక్కేసి మీరే గిఫ్ట్ లన్ని తీసేసుకుని వచ్చారా? హన్నా... !!!!!
రిప్లయితొలగించండిమీరు ఐదేళ్లకే హైదరాబాదు చూసేశారా? :(
రిప్లయితొలగించండినాకుమీలాగే బందువుల ఇంటికి వెళ్తే ఇంటిపై పెద్దగా బెంగ ఉండేదికాదు.
@మాలాకుమార్: ఇలాంటీ విషయంపై బాపుగారి కార్టూన్ ఒకటుందండి.
పరిమళం గారికే నా ఓటు..
రిప్లయితొలగించండినిజంగానే మళ్ళీ ఒకసారి కాదు కాదు..
ప్రతీరోజూ ఒకసారి నెమలికన్ను తో సహా కలిపి దిష్టి తీయించుకోండి.
@ తృష్ణ .. perhaps this is the toolbar you want
రిప్లయితొలగించండిhttp://teluguweb.googlepages.com/telugutoolbar
హ!హ!హ!
రిప్లయితొలగించండి>>ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచదార నంజుకోడం నా అలవాటు.
>>బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు.
మీరు రాసిన ఇన్ని టపాల్లోకి ఇదే మాస్టర్ పీస్. మరీ ముఖ్యంగా నల్ల కళ్ళద్దాలు.
@తృష్ణ: మీ సమస్యకి పరిష్కారం కొత్తపాళీ గారు చెప్పారు చూడండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన; ఎవరైనా ఇచ్చినవి పుచ్చుకోడం తప్ప, ఇంట్లో వాళ్లకి ఏమైనా తేవాలని తెలియని వయసండీ అది.. ప్చ్.. అప్పుడుమ ావాళ్ళు ఏమీ అనలేదు కానీ ఇప్పుడు మీరు కోప్పడేస్తున్నారు :-) ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: మనం కొంచం డిఫరెంట్ అన్నమాట :-) తాతయ్య పుణ్యమా అని ఆ అవకాశం వచ్చిందండీ.. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: అంతే అంటారా? :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సునీత: చాలా చాలా నచ్చేసినట్టుంది మీకు.. మీ అందరి వ్యాఖ్యలు చూస్తుంటే ఆ కళ్ళజోడు పోగొట్టుకున్నందుకు బాధ అనిపిస్తోంది.. ధన్యవాదాలు.
@kottapaaLi:Thankyou verymuch sir.
రిప్లయితొలగించండిi forgot how i installed it earlier..so is this chaos..now i got it back!!