"ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే.." మా చిన్న పిన్నిని అంటే అమ్మ ఆఖరి చెల్లెలిని మేమంతా చాలారోజులు ఏడిపించాం, ఈ పాటపాడి. అంతేనా తన పిల్లలకి వాళ్ళమ్మ చేసిన పనిని వర్ణించి వర్ణించి చెప్పాం.. పిన్ని తిడుతున్నా లెక్క చేయకుండా. గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన మా పిన్ని శ్రీకాకుళం యాసలో పాట పాడడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.. మా చిన్నప్పుడు అమ్మ చాలా సార్లు నెమరేసుకున్న జ్ఞాపకం. మేము పదేపదే అడిగి మరీ చెప్పించుకున్న కబురు.
ఇంట్లో పిల్లలు తొమ్మిది మంది, వచ్చి పోయే బంధువుల పిల్లలు మరో అయిదారుగురితో వీధి బడిలా కళకళలాడే ఇంట్లో క్రమశిక్షణ ఉండాలంటే ఇంటి యజమాని హిట్లర్ కాక తప్పదు. తాతగారు ఓ రెండాకులు ఎక్కువ చదవడం వల్ల హిట్లర్ కి పెద్దన్న అయిపోయారు. ఆ తరువాయి మా పెద్ద మామయ్య.. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య. ఈయనంటే మాక్కూడా ఎంత భయమంటే మేము పెద్దయ్యాక కూడా ఒక్కసారికూడా తనకి ఎదురు పడలేదు. ఇంట్లో ఉండే క్రమశిక్షణ కారణంగా పిల్లలకి బడికి తప్ప ఎక్కడికీ వెళ్లడానికి వీలుండేది కాదు.
పల్లెటూరంటే పండగలకి పబ్బాలకి బోల్డన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో గుళ్ళకి లెక్కలేదు. ఏడాదిలో చాలారోజులు ఏవో కార్యక్రమాలు ఉంటూనే ఉండేవి. ఇలా ఓసారి గుళ్ళో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 'జముకుల కథ' కూడా ఉంది. శ్రీకాకుళం నుంచి ఆటగాళ్ళు వస్తారనీ, చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడా జరగని కార్యక్రమమనీ మూడు రోజుల ముందు నుంచీ బోల్డంత ప్రచారం చేసేశారు. సహజంగానే అమ్మ వాళ్ళకీ ఆ కార్యక్రమం చూడాలనిపించింది.. అంతే సహజంగా తాతగారు వీల్లేదనేశారు.
కార్యక్రమం జరిగే రోజు రానే వచ్చింది. అమ్మవాళ్ళంతా కూడబలుక్కుని ఇద్దరు పిల్లలు రహస్యంగా వెళ్లి జముకుల కథ చూసి వచ్చేట్టూ, వాళ్ళని మిగిలిన వాళ్ళు రక్షించేట్టూ, ఆ ఇద్దరూ మర్నాడు మిగిలిన వాళ్లకి కథ చెప్పేట్టూ ఒప్పందం చేసుకున్నారు. అందరి కన్నా చిన్న వాళ్ళు, అంతకు ముందు ఏ ప్రోగ్రాముకీ వెళ్ళని వాళ్ళూ అయిన పిన్నిని, చిన్న మామయ్యని ఎంపిక చేశారు జముకుల కథ చూసి వచ్చేందుకు. రాత్రి కొంచం పొద్దుపోయాక వాళ్ళిద్దరూ బయటికి జారుకోవడం, అమ్మ వాళ్ళు తలగడలకి దుప్పట్లు కప్పి అమ్మమ్మ కన్నుగప్పడం జరిగిపోయాయి.
ఒప్పందం ప్రకారం మర్నాడు వాళ్ళిద్దరూ మిగిలిన వాళ్లకి వాళ్ళు చూసిన విశేషాలు చెప్పాలి. మధ్యాహ్నం భోజనాలయ్యాక పిల్లలంతా ఓ చోట కూడారు. ముందుగా జముకుల కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఎలాంటి మేకప్ చేసుకున్నారో, మోకాళ్ళ వరకూ వరుసలువరుసలుగా గజ్జెలు ఎలా కట్టుకున్నారో చెప్పారు. ప్రదర్శన గురించి చెబుతూ చెబుతూ ఒక హాస్య సన్నివేశం దగ్గర మా పిన్ని ఉత్సాహంగా లేచి నిలబడి "ఒలప్పో బెండకాయి కూరొండీసినావంటే.." అని పాడుతుండగా, గజ్జెల చప్పుడుని ఇమిటేట్ చేస్తూ మా చిన్న మామయ్య 'జుముకు జుమా..జుముకు జుమా..' అని దరువేస్తున్న వేళ.. గది గుమ్మం దగ్గర అలికిడయ్యింది.. అక్కడ పెద్ద మామయ్య.
అందరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. తప్పించుకునే మార్గం లేదు. నాట్య భంగిమలో పిన్ని అలాగే నిలబడిపోయింది, ఫ్రీజ్ చేసిన టీవీ దృశ్యంలా.. విచారణ, వెనువెంటనే శిక్ష. ఆడపిల్ల అని పిన్నిని పెద్దగా కొట్టలేదుట కానీ, చిన్న మామయ్యకి బాగా పడ్డాయిట. అయితే అంత టెన్షన్ లోనూ మిగిలిన వాళ్ళ సాయంతోనే బయటికి వెళ్లామన్న రహస్యాన్ని వాళ్ళిద్దరూ బయట పెట్టలేదుట. "మాకు జాలేసింది.. కానీ చెబితే మాకందరికీ కూడా పడతాయి.. పైగా ఇంకెప్పుడూ అలా బయటికి వెళ్లడానికి ఉండదు..అందుకే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయాం.. " అని చెప్పింది అమ్మ.
:):) పాపం పిన్ని గారు!!
రిప్లయితొలగించండిచాలా బాగు౦ది,ఓలప్పా అని తు"గో" జిల్లా లో కుడా అ౦టారు.ఎవరికి చెప్పక౦డి నన్ను మా చెల్లెమ్మ అలానే పిలుస్తు౦ది...
రిప్లయితొలగించండిబాగుందండి.. మీ పిన్నిగారు పాపం ఇలా బలైపోయారన్నమాట మీ అల్లరికి..!!
రిప్లయితొలగించండిఓలమ్మోలమ్మ మీ యమ్మగోరు అసుంటొరన్నమాట, సొయానా చెల్లిని సిక్కుల్లో బెట్టీసినారే... ;) ఇగ నితొని జర మంచిగుండాల, లేకపోతే చిక్కే సుమా! ...
రిప్లయితొలగించండిచాలా బాగుంది మురళి గారు
రిప్లయితొలగించండిబాగుంది మురళి గారు !
రిప్లయితొలగించండికొన్ని స్టేజీ కార్యక్రమాల్లొ వీటిని చూసిన జ్ఞాపకం...మీ వర్ణన బాగుందండి..!!
రిప్లయితొలగించండిచిన్నప్పుడు మా పెద్ద చెల్లి కూడా ఇలాగే అమ్మమ్మగారి ఊర్లో తను చూసిన "భాగవతుల " చిందులు
రిప్లయితొలగించండిఅందులో క్రిష్ణుడు సత్య భామ గురించి ఇలానే నటించి చూపెట్టేది. చూసి నవ్వుకునే వాళ్ళం.
ఓసె..యేటోస్..లోన్నుండి నవ్వు ఎలుపొచ్చేసినాది నాకు టపా సదివేసిసాక. ఆపుకోలేక సచ్చినాననుకో..అజ్జెంటుగా ఈ టపా మా ఎనకింటి గుంటడికి సూపించాలా. ఆ గుంటడికి ఇలాంటివి సానా ఇట్టం. సెబితే ఆడితో పాటు ఆడి బాప్పని ఒట్టుకొని వత్తాడు. మల్లీ మీ కొత్త టపా ఏసినేంటనే పారొస్తాను. నానెవరనుకున్నారు? సికాకులం సిన్నోడిని.
రిప్లయితొలగించండిమీ narration చాలా బావుంది ..
రిప్లయితొలగించండిhappy vinayaka chavithi
@భాస్కర్ రామరాజు; :-) :-) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@సుభద్ర: ఎవరికీ చెప్పనండి :-) ..ధన్యవాదాలు
@ప్రణీత స్వాతి: అవునండీ.. ధన్యవాదాలు.
@ఉష; నిజమే..మంచిగుండాల.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పావని: ధన్యవాదాలు
@శ్రావ్య: ధన్యవాదాలు
@తృష్ణ: ధన్యవాదాలు
@సునీత: ఒక టపా రాస్తే మేమూ నవ్వుకుంటాం కదండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: సికాకులం!! "ఏం పిల్లడో యెల్దమొస్తవా?" :-) :-) ...ధన్యవాదాలండీ..
@హరే కృష్ణ: ధన్యవాదాలు.. మీక్కూదాపండుగా శుభాకాంక్షలు.
మాదీ సీక్కులమే. తూర్పు రామాయణం ఇప్పటికీ ఒక వందసార్లైనా వినుంటాను. నాకు మీ అమ్మమ్మగారి పిల్లల బాధ బాగా అర్ధమయ్యింది. సరిగ్గా ఇలాంటి ఆంక్షలే నాకు కూడా.
రిప్లయితొలగించండిఈ జముకుల కధ ఏంటో తెలీదండీ ...ఎప్పుడూ వినలేదు ...కానీ పాపం పిన్నిగారు , మావయ్య గారు !
రిప్లయితొలగించండి@భవాని: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: ధన్యవాదాలు.
మురళీ మీ ఇతర టపాలన్నీ ఒకెత్తూ, మీ తాతగారింటి (మీ అమ్మగారి చిన్నప్పటి) కబుర్లు ఒక్కటీ ఒకెత్తు.
రిప్లయితొలగించండిBrilliant
@కొత్తపాళీ: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి'జముకుల కథ' అంటే ఏంటో తెలీకపోయినా, మీరు చెప్పిందంతా సినిమాలాగా ఊహించేసుకున్నా :)
రిప్లయితొలగించండిమీ పిన్ని, మామయ్య నటనని ఫ్రీజ్ చేసిన దృశ్యం ఊహించుకుని తెగ నవ్వొచ్చిందండీ.. కానీ, చివరికి పాపం వాళ్ళ వీపు విమానం మోత మోగిందని చెప్పాక కొంచెం బాధేసింది. పాపం.. చిన్నపిల్లలకి ఎన్ని కష్టాలండీ ఈ పెద్దోళ్ళ క్రమశిక్షణ వల్ల :(
అవునండీ.. ఇప్పుడు మనమూ పెద్దాళ్ళమే కదా..ప్చ్.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఇంట్లో పిల్లలు తొమ్మిది మంది, వచ్చి పోయే బంధువుల పిల్లలు మరో అయిదారుగురితో వీధి బడిలా కళకళలాడే ఇంట్లో క్రమశిక్షణ ఉండాలంటే ఇంటి యజమాని హిట్లర్ కాక తప్పదు.
రిప్లయితొలగించండినిజమే...మీ చిన్నప్పటి ముచ్చట్లు ఎంతో బావున్నాయి.
@కల్లూరి శైలబాల: ఈ జ్ఞాపకం నాది కాదండీ.. అమ్మది, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి