సోమవారం, ఆగస్టు 03, 2009

శిల

ఒక అందమైన, తెలివైన అమ్మాయి, ఒక ప్రతిభావంతుడైన అబ్బాయిని మనస్పూర్తిగా ప్రేమిస్తే.. ఆమె ప్రేమని పొందిన ఆ కుర్రాడు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. అలాకాక, ఆ అమ్మాయి అతని ప్రతిభపై ఈర్ష్య పెంచుకుని, అతనిపై ప్రేమ నటిస్తే.. ఆ అబ్బాయి ఏమవుతాడు? ఆమెతో ప్రేమలో పూర్తిగా మునిగిన వాడైతే సర్వనాశనం అవుతాడు. అలాగే అయ్యాడు దాసు, 'శిల' కథలో నాయకుడు.

గోదావరి తీరం తరువాత, తాను అత్యంత ఇష్టపడే గాలికొండ పురాన్ని కథాస్థలంగానూ, వేణు గానాన్ని నేపధ్యం గానూ తీసుకుని పదమూడేళ్ళ క్రితం వంశీ రాసిన కథ 'శిల.' కథ ఎంత సాఫీగా సాగుతుందో, ముగింపు అంత బీభత్స రస ప్రధానంగా ఉంటుంది. కథా నాయిక లీల వేణుగానంలో దిట్ట. ఆమెకీ విద్య తల్లి ప్రభావతి నుంచి వచ్చింది. లీల తన గర్భంలో ఉండగానే భర్తను పోగొట్టుకున్న ప్రభావతి గాలికొండపురం వచ్చి ఓ సంగీత పాఠశాల ప్రారంభిస్తుంది.

తల్లి దగ్గర శిష్యరికం చేసి వేణుగానం నేర్చుకున్న లీల ఆశయం ఒక్కటే.. ఆ మారుమూల పల్లెలో కఠోర సాధన చేసి, బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రదర్శన ఇచ్చి హరిప్రసాద్ చౌరాసియా, మహాలింగం వంటి వేణు గాన విద్వాంసులని ఒక్కసారిగా అధిగమించాలని. లీల తన ప్రయత్నాలలో తానుండగా ఆమెకి పరిచయమవుతాడు దాసు. అతనిదో విచిత్రమైన మనస్తత్వం, అంతకన్నా విచిత్రమైన కథ.

అన్నవరం దేవస్థానం ఆస్థాన క్షురకుడి కొడుకు దాసు. తండ్రంటే పడదు. తండ్రి మరణించగానే, ఆయన తాలూకు సిగరెట్ పెట్టెలోనుంచి సిగరెట్ తీసి వెలిగించుకుని, స్వతంత్రం ప్రకటించుకున్న తత్త్వం అతనిది. గురు ముఖతా నేర్చుకోకపోయినా, ఏమాత్రం సాధన లేకపోయినా వేణుగానం అవలీలగా అతని వశమయ్యింది. అతను వేణువు ఊదుతుంటే ఎంతటి వారైనా తన్మయులై వినాల్సిందే.. విచిత్రం ఏమిటంటే అతను ఎన్నో రాగాలు తన వేణువుపై పలికించ గలిగినా, వాటి పేర్లు లక్షణాలు ఏమాత్రం తెలియవు.

అలాంటి దాసు గాలికొండపురం వచ్చాడు.. ప్రభావతి దగ్గర ఆశ్రయం సంపాదించాడు. అతని ప్రతిభ నలుమూలలకీ పాకడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వేణుగానంలో అతని ప్రతిభ చూసి మతిపోయినంత పనవుతుంది లీలకి. తను ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమ చేసి నేర్చిన విద్యని, అతను ఏ ప్రయత్నమూ లేకుండానే ప్రదర్శించడం చూసిన లీలకు అతని పట్ల అసూయ ప్రారంభమయ్యింది. అతన్ని నాశనం చేయడం కోసం ప్రేమ నాటకం మొదలు పెడుతుంది.

స్వతహాగా అందమైనదీ, అంతకు మించి తెలివైనదీ అయిన లీలకి దాసుని తన దాసుడిగా చేసుకోడానికి యెంతో సమయం పట్టదు. ఇప్పుడు దాసుకు లీల ఎంత చెబితే అంత. సంగీతమైనా, మరేదైనా లీల తర్వాతే. సరిగ్గా అప్పుడే అతని ప్రతిభ అమెరికాలో మ్యూజిక్ కాంపాక్ట్ డిస్కులు తయారుచేసే పార్ధసారథి గారి దృష్టిలో పడుతుంది. ఓ మిత్రుడితో కలిసి గాలికొండపురం వచ్చిన ఆయన, దాసుని తనతో తీసుకెడతానంటాడు.

లీల ని వదిలి ఎక్కడికీ వెళ్ళనంటాడు దాసు. అంత గొప్ప అవకాశం వదులుకోవద్దంటుంది లీల. తమ మ్యూజిక్ స్కూల్ వార్షికోత్సవంలో ప్రదర్శన ఇచ్చి వెళ్ళమని కోరుతుంది.. ఆ ప్రదర్శనకి పార్ధసారథి గారిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తుంది. దాసు ఆవేశం, అతని బలహీనతలను తెలిసిన లీల అతన్ని నాశనం చేయడానికి ఆ ప్రదర్శనని వేదికగానూ, వేణువుని ఆయుధంగానూ వాడుకుంటుంది. 'స్వాతి' వారపత్రికలో తొలి ప్రచురణ పొందిన ఈ కథ, వంశీ 'ఆనాటి వానచినుకులు' కథా సంకలనం లోనూ చోటు సంపాదించుకుంది.

17 కామెంట్‌లు:

  1. ''aanati vana chinukulu''
    nakentho istamyna pustakam..
    yenni sarlu chadivano..
    yedo trans lo vunna danila kanipinchina prati vallaki aa pustakaanni chadavamani recommend chesanu..
    avatali variki chadavalanna korika vunda leda anna vishayame pattaledu naku..
    indrakanti sreekantha sarmagaru rasina mundu mata yentha bagundo mee tapa kuda anthe bagundi..!!

    రిప్లయితొలగించండి
  2. ఆ కధా సంపుటి నేను చదవలేదండి..కానీ మీరు రాసిన కధ చదువుతూంటే మాత్రం అటువంటి కధానేపధ్యం ఉన్న కొన్ని సినిమాలు గుర్తు వచ్చాయి..
    "అసూయ,పగ,ప్రతీకారం" లాంటి భావాల వల్ల కొందరు మనుషులు తమలో తాము దహించుకుపొయి ఎదుటివారి జీవితాలనే కాక,తమ జీవితాన్ని,భవిష్యత్తుని కూడా నాశనం చేసుకుంటారు..

    రిప్లయితొలగించండి
  3. "ముగింపు అంత బీభత్స రస ప్రధానంగా ఉంటుంది"
    నేనలిగానంతే ! ఎంత ఊరించి తాయిలం దాచేసినట్టుంది .... :) :)

    రిప్లయితొలగించండి
  4. అద్బుతమైన కథను పరిచయం చేసారు...

    రిప్లయితొలగించండి
  5. బాగుందండీ కథ.. మరి చివరకు ఏమవుతుంది చెప్పనే లేదు.. మేము ఇప్పుడు "ఆనాటి వానచినుకులు" కోసం వెతుక్కోవాలన్నమాట.. హ్మ్మ్ ...

    రిప్లయితొలగించండి
  6. బాగు౦ది.
    టే౦ప్లేట్ మార్చారా....నెమలికన్ను ఉ౦డేది కదా!

    రిప్లయితొలగించండి
  7. ఈ కథ నేను చదివానండి ఆ నాటి వానచినుకులు పుస్తకం లో ....అమూల్యమైన కథలు ఒక్కొక్కటి పరిచయం చేస్తూ మల్లి చదివించేలా చేస్తున్నారు ,మీకు నా అబినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఇది మరీ అన్యాయం.ముగింపు చెప్పకుండా సస్పెన్స్ లొ పెట్టడం. ప్లీజ్ ప్లీజ్ చెప్పెయరూ.ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందో,అప్పటి వరకు వెయిట్ చెయ్యడం నా వల్ల కాదు

    రిప్లయితొలగించండి
  9. @ప్రణీత: నేను కూడా చాలా రోజులు అలాగే చేశానండి.. నాకు నచ్చిన పుస్తకాలు మిత్రులు చదివే వరకూ వెంట బడే వాడిని.. వాళ్ళ అభిరుచి వేరే ఉంటుందని బాగా ఆలస్యంగా తెలుసుకున్నాను :-) ..ధన్యవాదాలు.
    @Sujata: ఎమెస్కో ప్రచురించిన 'ఆనాటి వానచినుకులు' విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇంకా అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. వెల రూ. 150. చాలా కథలు బాగుంటాయి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: వీలయితే చదవండి.. మంచి కథలు ఉన్నాయి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @పరిమళం: ఎలాగండీ? కరిస్తే ఒకరికి, విడిస్తే ఒకరికీ కోపం వస్తుంటే :-) ముగింపు రాస్తేనేమో రాయొద్దు, చదవాలనిపించదు అంటారు.. రాయకపోతే ఇలా.. చదవాల్సిన పుస్తకం అండీ.. మొన్ననే కొత్త ప్రింట్ వచ్చింది.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.
    @సృజన: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @భావన: మీరు ఇండియాలోనే ఉంటే వెళ్ళేటప్పుడు కొని తీసుకెళ్ళండి.. దొరికే చోటు పైన రాశాను చూడండి.. ధన్యవాదాలు.
    @సుభద్ర: రాతల్లో ఎలాగూ మార్పు లేదు కదా, కనీసం టెంప్లేట్ లోనైనా మార్పు చూపిద్దామనే ప్రయత్నం
    అండీ :-) నెమలికన్ను లేదన్నది చాలామంది మిత్రుల ఫిర్యాదు.. ధన్యవాదాలు.
    @చిన్ని: నేను చాలా సార్లు చదివిన పుస్తకాలలో ఇదీ ఒకతండీ.. ధన్యవాదాలు.
    @Advaita: అడ్రస్, వెల పైన రాశాను చూడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. అద్బుతమైన కథను పరిచయం చేసారు..అక్షరాలా నిజం..
    తషాన్ సినిమా ఇంచుమించు ఇలాగే వుంటుంది ..
    క కూ (కరీనా ) చెడగొట్టింది సినిమాని

    రిప్లయితొలగించండి
  13. @హరేకృష్ణ: ఆ సినిమా నేను చూడలేదండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఇటీవల నాన్నగారి దగ్గర తెచ్చుకున్న పుస్తకాల్లో ఈ "...వానచినుకులు" పుస్తకం ఒకటి. ఇవాళే చదివాను...దాంట్లో కధలు చదువుతూంటే మీరు రాసినట్లు గుర్తొచ్చి ఇలా వచ్చానండీ...పుస్తకం చదివాకా రివ్యూ చదివితే మీరెలా రాసారో తెలుస్తుంది కదా...:):)

    రిప్లయితొలగించండి