ఆదివారం, ఆగస్టు 02, 2009

స్నేహం

ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడుతుందో తెలియని బంధం 'ప్రేమ' అంటారు చాలామంది.. కానీ అది సరి కాదు.. అలా ఏర్పడే బంధం 'స్నేహం.' నిజానికి ప్రేమకి తొలిమెట్టు స్నేహమే. ఇప్పటి మన ప్రాణ స్నేహితులతో మనకి స్నేహం ఎప్పుడు ఎలా కుదిరిందో తల్చుకుంటే చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. చిరుపరిచయాలే కాదు, మాట పట్టింపులూ, అభిప్రాయ భేదాలు కూడా మనకి స్నేహితులని తెచ్చిపెడతాయి.

అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగి, ఒక్కసారిగా పలక బలపం పట్టుకుని బడికి వెళ్ళిన తొలిరోజును గుర్తు చేసుకుంటే, క్లాసులో మనల్ని చూసి పలకరింపుగా నవ్వి తన పక్కన చోటు చూపించిన వాళ్ళు తప్పకుండా మన బెస్ట్ ఫ్రెండ్స్ జాబితాలో ఉంటారు. హైస్కూలు స్నేహాలు కూడా ఇంచుమించు ఇలాగే ప్రారంభమవుతాయి. చదువు లోనూ, ఆటల్లోనూ మనతో పోటీ పడేవాళ్ళు మనకి స్నేహితులవ్వగానే మనపై వాళ్ళ గెలుపుని మనం స్పోర్టివ్ గా తీసుకోగలుగుతాం.

స్కూలు స్నేహాలకి పూర్తిగా భిన్నమైనవి కాలేజి స్నేహాలు. మనకి తెలియకుండానే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ పనిచేయడం ప్రారంభిస్తాయి. అందుకే కాబోలు, స్కూలు స్నేహితులతో ఫీలైనంత దగ్గరతనం, కాలేజీ స్నేహితులతో అనుభవించ లేము. స్కూలు స్నేహాలు దొంగతనంగా మామిడికాయలు కోసుకు తినడానికి ప్రోత్సహిస్తే, కాలేజీ స్నేహాలు అమ్మాయిలని రహస్యంగా ఆరాధించడానికి కారణమవుతాయి, చాలామంది అబ్బాయిలకి.

ఉద్యోగం చేసే చోట ఏర్పడే స్నేహాలు చాలా వరకు 'అవసరార్ధపు' స్నేహాలే. ఆ చోటునుంచి ఉద్యోగం మారగానే వాళ్ళలో చాలామందిని సులువుగా మర్చిపోతాం. వాళ్ళతో మళ్ళీ కలిసి పని చేయాల్సొచ్చి నప్పుడు పాత స్నేహాన్ని గుర్తు చేసేసుకోగలుగుతాం. కొంచం ఇంచుమించు ఇరుగుపొరుగులతో స్నేహాలూ ఇలాంటివే. ఐతే ఈ టైపు స్నేహాల్లో చిరకాలం ఉండేవీ ఉంటాయి.

జీవితంలో కొత్త స్నేహితులు ఏర్పడే మరో సందర్భం పెళ్లి. అతని ప్రాణస్నేహితులతో ఆమెకి, ఆమె స్నేహితులతో అతనికీ (ఇష్టం లేకపోయినా) తప్పదు. ఇలాంటి స్నేహాలలో 'అన్నయ్యా..' 'చెల్లెమ్మా..' లాంటి పిలుపులు వినిపించేస్తూ ఉంటాయి. పిల్లల్ని స్కూల్లో వేశాక ఏర్పడేవి మరో రకం స్నేహాలు. వాళ్ళ టీచర్లతోనూ, స్నేహితుల తల్లిదండ్రులతోనూ వద్దన్నా ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతుంది. ఈ స్నేహాల్లోనుంచి బోల్డన్ని అపార్ధాలూ, కొండొకచో బోల్డంత హాస్యమూ పుట్టే అవకాశం మెండుగా ఉంది.

స్నేహం మీద బోల్డంత అపనమ్మకం ఏర్పడేది ఎప్పుడంటే పిల్లల్ని కాలేజిలో చేర్చినప్పుడు. 'మనవాడు మంచాడే, కానీ స్నేహాల వల్ల పాడైపోతాడేమో' అని అనుమానించని తలిదండ్రులు బహుశా ఉండరు. మన బంగారం మీద మనకి బోల్డంత నమ్మకం మరి. మన కులదీపకుడు/దీపిక కి మార్కులు తగ్గినా, వాళ్ళు మన చెప్పిన మాట వినక పోయినా అందుకు కారకులు (మన దృష్టిలో) స్నేహితులే..

ముఖపరిచయం లేకుండా, కేవలం అభిప్రాయాలు, అభిరుచులు నచ్చడం వల్ల ఏర్పడే స్నేహం ఒకటి ఉంది. పత్రికలు, తపాలా శాఖ వాళ్ళూ మహారాజ భోగం అనుభవించిన రోజుల్లో దానిని 'కలం స్నేహం' అనేవాళ్ళు.. ఇప్పుడీ ఎలక్ట్రానిక్ యుగంలో దానిని మనం 'ఇ' స్నేహం అంటున్నాం. అలా స్నేహాన్ని ఏర్పరుస్తున్న వేదికలు మన బ్లాగులు. బ్లాగ్మిత్రులందరికీ 'ఫ్రెండ్షిప్ డే' శుభాకాంక్షలు.

24 వ్యాఖ్యలు:

 1. ఏ పోస్టునైనా ఊపిరి పీల్చకుండా ఏకబిగిన చదివించగల "నెమలికన్ను"కు 'ఫ్రెండ్షిప్ డే' శుభాకాంక్షలు.
  బాల్య స్నేహాలనుంచి ..పిల్లల స్నేహాల వరకూ ..ఆసక్తి కరమైన విశ్లేషణ !
  "స్నేహం మీద బోల్డంత అపనమ్మకం ఏర్పడేది ఎప్పుడంటే పిల్లల్ని కాలేజిలో చేర్చినప్పుడు" :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా ఆసక్తికరమైన విశ్లేషణ మురళి గారు, అన్నీ తెలిసిన విషయాలే కానీ చక్కగా కూర్చి సందోర్బోచితంగా చెప్పారు. చాలా బాగుంది టపా..

  మీకూ, ఇతర బ్లాగ్ మిత్రులకి స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. , "మాట పట్టింపులూ, అభిప్రాయ భేదాలు కూడా మనకి స్నేహితులని తెచ్చిపెడతాయి"
  నిజమండి.కానీ ఇవి నిజమైన స్నేహితులని మనకు చూపెడతాయి కూడా.మనం తిట్టినా అది మన అభిమానంగా భావించి అర్ధం చెసుకునే వాళ్ళే నిజమైన మిత్రులు.
  చిన్నప్పుడు "కలం స్నేహం" అని పత్రికల్లొ చూసి ముక్కూమొహం తెలియని వాళ్ళతొ స్నేహం ఏమిటో అనుకునేదాన్ని..మీరు రాసినట్లు ఇప్పుడీ బ్లాగుల్లొ ఉన్న "ఈ-స్నేహం" మరి అప్పటి "కలం స్నేహానికి" మరో రూపమే కదా..!
  స్నేహం గురించి నా టపాలో ఎంతో రాయాలనుకున్ననాండి..కాని కొన్ని స్నేహాలవల్ల నేను పొందిన ఆనందం కన్నా అనుభవించిన వేదనే ఎక్కువ...అందుకే అందుకే ఏమి రాయలేక ఊరుకున్నాను ..but no doubt,సృష్టిలో తియనిది,వీడనిదీ,వాడనిదీ స్నేహమే..!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. 'హ్యాపీ ఫ్రెండ్ షిప్ప్ డే ' నండీ మీకు . దీని మీద టపా ఎవరైనా రాస్తారేమోనని చూసాను .మీరు రాసేసారు :) చక్కగా రాసారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. స్నేహితుల దినోత్సవశుభాకాంక్షలు నేస్తమా!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. 'ఫ్రెండ్షిప్ డే' శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. స్నేహాలు అన్ని దశల్లోనూ ఏర్పడుతున్నాయి. కొన్ని చిన్ననాటి వాటి మాదిరే శాస్వత బంధంవేస్తూ.., కొన్ని కలయిలోనే విడిపోయే దిశగా సాగుతూ...అంతుబట్టని పోకడ మనసుది. తనవారిని తానే వెదుకుతుందేమో.. మీ స్నేహం వ్రాయాలన్న స్ఫూర్తిని పెంచుతుంది. మీ వేగం, వివరణ, విశ్లేషణ మీ దైన బాణీ అన్నీ ఓ ప్రత్యేకత.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అమూల్యమైన ప్రేమ ను మూల్యం లేకుండా మన మీద వంపే తోడే నేస్తమని చాలా బాగా చెప్పేరు మురళి. మీకు ప్రపంచ స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Snehani kanna minna .........
  Lokana ledura.........
  Kadadhaka nedalaga ........
  ninu vediponura......
  Chala bagarasaru kada ....... morokka song
  maruvakuma nesthama.........,nanu maruvakuma ooo priyatama.......
  ila elanti patalu vinapudu elanipisthundho.. me e letter chaduvuthunnapudu alla anipinchindandi........... thanks

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @పరిమళం: అపనమ్మకం కలగదంటారా చెప్పండి? ..ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ధన్యవాదాలు
  @హను: ధన్యవాదాలు
  @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @తృష్ణ: కొన్ని స్నేహాల వల్ల వేదన బహుశా అందరికీ తప్పదేమోనండీ, ఏదో ఒక దశలో.. ధన్యవాదాలు
  @చిన్ని: బ్లాగ్మిత్రులు కవితలు కూడా రాశారండి.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ధన్యవాదాలు.
  @MURALI: ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @ఉష: ధన్యవాదాలు
  @భావన: ధన్యవాదాలు
  @మహీపాల్; చాలా చక్కని పాటలు జ్ఞాపకం చేశారు.. ధన్యవాదాలు.
  @ప్రణీత: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. కొద్దిగా ఆలస్యమైంది.
  Happy Friendshiop Day!!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీరు చెప్పిన ప్రతీ పదంతో నేనూ ఏకీభవిస్తున్నాను. సరైన సమయంలో సరైన పోస్టు రాశారు.
  అన్నట్టు.. ఒక చిన్న మాటండీ.. మీ పోస్టులు చదువుతుంటే మనకి చాలా ఇష్టమైన ఒక మంచి పుస్తకం చదువుతున్నట్టుగా ఉంటుంది తెలుసా..! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 15. "ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడుతుందో తెలియని బంధం 'ప్రేమ' అంటారు చాలామంది.. కానీ అది సరి కాదు.. అలా ఏర్పడే బంధం 'స్నేహం.'"
  నేను తరచు నాస్నేహితులతో చెప్పేమాత ఇది. మీటపాలొ దీన్ని చూసినవెంటనే చాలా సంతోషమేసింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @సుబ్రహ్మణ్య చైతన్య: మీ వ్యాఖ్య చూసి నాక్కూడా సంతోషం కలిగిందండి.. నాలాగే మరొకరు కూడా ఆలోచిస్తున్నందుకు.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 17. "sneham" gurinchi inta chakkati blog ee electronic and mechanical yugamloo enta baagaa raasaru antey matalloo cheppaleanidi. Meeku chaalaa chaalaa dhanyavadamulu. Inkaa nizamaina sneham migili vundi antey mee blog chadivina taruvaata tappakundaa vundi anipistundi.

  ramu.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. @రాము: ధన్యవాదాలు.. మీరు తెలుగులో రాయడానికి ఈ లింక్ ఉపయోగించ వచ్చు.. ఇప్పుడు మీరు రాసిన వ్యాఖ్యనే ఇక్కడ రాస్తే తెలుగులోకి మారిపోతుంది.. http://www.google.co.in/transliterate/indic/telugu

  ప్రత్యుత్తరంతొలగించు