గురువారం, ఏప్రిల్ 30, 2009

అంటరాని వసంతం

'అంటరానితనం నేరం' ఇది గడిచిన ఐదారు దశాబ్దాలుగా మనం గోడల మీద చూస్తున్న ఓ వాక్యం. స్వాతంత్రానికి ముందు కొన్ని వందల ఏళ్ళపాటు మన దేశంలో అమలైన అంటరానితనం కొన్ని కులాలని కనీస హక్కులకి, ఆత్మవిశ్వాసానికీ దూరం చేసింది. వారి కళలకి, సంస్కృతికీ చరిత్రలో దొరికిన స్థానం స్వల్పమే.. తమ కనీస అవసరాలు తీర్చుకోడానికి సైతం ఎన్నో పోరాటాలు చేశారు వారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదంటారు జి. కళ్యాణ రావు. కొన్ని తరాల వెతలనీ, పోరాటాలనీ అక్షరబద్ధం చేసి ఆయన విడుదల చేసిన నవల 'అంటరాని వసంతం'.. ఈ నవల పరిచయం 'పుస్తకం' లో...

12 వ్యాఖ్యలు:

 1. ఒకప్పుడు గతిలేక మనవాళ్ళూ పరాయిమతాలకెగ బడుతుంటే .....ప్చ్ ...ఇప్పుడు స్వప్రయోజనాల కోసం స్వార్ధం తో ....
  మీ పరిచయం బావుందండీ ! అభినందనలు మురళి గారు !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి
  ఎంతమంచి పుస్తకం పరిచయం చేసారు ....మీ రివ్యూ చదివితేనే చదివేయాలనే కోరిక కలిగింది ......మొదలుపెట్టాను ఎనిమిదవ చాప్టర్ లో వున్నాను ...గుండె పిండి (మండి)నట్లున్దండి .నాకు తెలీని నిజాలెన్నో ........చాల చాల ధన్యవాదములు .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ ఫుస్తకం చదివిన కొత్తలో అందరికీ రికమెండ్ చేసేశాను. భలే కోఇన్‌సిడెంస్‌, మీర్యు చాలా వరకూ నేను చదివిన పుస్తకాలే పరిచయిస్తున్నారు! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళి గారు, నేను మీ రివ్యూలు చదవడం మానేశాను. రివ్యూ చదివి, చదవడానికి పుస్తకం లేక మనసు క్షోభపెట్టడం ఎందుకు. :(

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఆలోచిస్తే గుండెల్ని పిండిచేసే వాస్తవం.

  ఎన్నెన్నో విషాద గాధలు..కారణాలేవైనా తరాలకి తరాలే నలిగిపోయాయి.

  పుస్తకం లో మీ సమీక్ష చాలా బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @పరిమళం : కేవలం మత మార్పిడులని మాత్రమే కాదండి, చాలా సాంఘిక సమస్యలని చర్చించింది ఈ పుస్తకం. ధన్యవాదాలు.
  @చిన్ని: పుస్తకం చదవడం పూర్తి చేశాక మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటారని ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు.
  @తెరెసా: మీ బ్లాగు చిరునామా ఇవ్వగలరా?ప్రొఫైల్ ద్వారా ప్రయత్నించి విఫలమయ్యాను. పుస్తకాల గురించి మీరు రాస్తున్నవి చదవాలన్ని కుతూహలం కలుగుతోంది.. ధన్యవాదాలు.
  @భాస్కర్ రామిరెడ్డి: మీ వ్యాఖ్య చదివాక రాయడం మానేద్దామా అన్న ఆలోచన వచ్చింది ఒక్క క్షణం. ఈ పుస్తక పరిచయాల ఆధారంగా మీరో జాబితా తయారు చేసుకుని వీలుకుదిరినప్పుడు ఆయా పుస్తకాలు కొనుక్కోవచ్చునేమో కదండీ..? వ్యాఖ్యకి ధన్యవాదాలు.
  @ ఉమాశంకర్: నిజమేనండి.. ఆరోజుల్లో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఇస్తున్నాయి ఇలాంటి పుస్తకాలు. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నాకు బ్లాగు లేదండీ! నేనొట్టి చదువరినే :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @తెరెసా: ఆలస్యం ఎందుకు? ఓ బ్లాగు మొదలు పెట్టేయండి మరి..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. సార్ మురళి గారు మనిషిలో మనందరం మనుషులం అని బావన కలిగిన రోజు ఈ అంటరాని తనం పోతుంది .
  ఈ స్వార్ధ రాజకీయ నాయకులు, స్వార్ధ కులనాయకులు నశించిన రోజు ప్రజలలో మార్పు వస్తుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ee vasantam appudoo nishedhame,ippudoo nishedhame anna modati vaakhyaalatone vaari jevana sailini pratibimbinche navala "ANTARAANI VASANTAM". idi yadaardamo kaado naaku teleedu kaani vaari swaatamtryam kosam jeevitaanne arpinchina naarayya, naaganna, ellanna gurinchi chadivi vaarini abhinandinchakapote deenini chadavatam lo artham ledanukuntunnaanu .....ANTARAANI VASANTAM teliyani vaariki parichayam chesinanduku dhanyavaadaalu.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @సంఘమిత్ర: కొన్ని యదార్ధ సంఘటనలకు, మరి కొంత కథను జోడించి చేసిన రచన అనిపించిందండి నాకు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు