మంగళవారం, మే 24, 2011

ఇంగ్లిష్ సుజాతగారి కబుర్లు

ఇంగ్లిష్ సుజాత గారికి చాలా విషయాలు తెలుసు. కానీ అలా తెలుసన్న విషయం బహుశా ఆవిడ ఒప్పుకోరు. ఈ ఒప్పుకోకపోవడంతో మనకేమీ పేచీ లేదనుకోండి. తనకి తెలిసిన విషయాలని ఆవిడ అప్పుడప్పుడూ, కొంచం పొదుపుగా, పంచుకుంటూ ఉంటారు. వినేసి గంభీరంగా తలాడించొచ్చు లేదా మనం ఏమనుకుంటున్నామో నిరభ్యంతరంగా మరియు గాట్టిగా చెప్పేయొచ్చు. ఆవిడ ఏమీ అనుకోరు. మీకిప్పుడు ఇంగ్లిష్ సుజాతగారిని కలవాలని ఉంది కదా.. ఈ బుల్లెమ్మని చూసి దిష్టి కొట్టకుండా, హలో చెప్పండి. వీళ్ళమ్మ గారే మన ఇంగ్లిష్ సుజాత గారు.

'కొన్ని పరిచయాలు చాలా చిత్రంగా మొదలవుతాయి' అని నేనే అప్పుడెప్పుడో బ్లాగు గుద్ది చెప్పాను గుర్తుందా? ఇంగ్లిష్ సుజాతగారితో నా పరిచయం కూడా అంతే. అప్పట్లో అంటే దాదాపు ఓ మూడేళ్ళ క్రితానికి కుంచం అటూ ఇటూగా, బ్లాగులు కొత్తగా పరిచయమై దొరికిన బ్లాగు దొరికినట్టుగా చదివేస్తూ ఉండగా అనుకోకుండా జరిగింది పరిచయం. అప్పట్లో (ఆమాటకొస్తే ఇప్పటికీ) సుజాత పేరుతో ఇద్దరు బ్లాగర్లు ఫేమస్. ఈవిడ తన పేరుని ఇంగ్లిష్ లో రాసుకుంటారు. అందుకని నేను గుర్తు కోసం 'ఇంగ్లిష్ సుజాతగారు' అనుకోవడం మొదలు పెట్టాను.

ఊరూరికే అలా అలా ఆవిడ కబుర్లు వింటూ వింటూ (అంటే టపాలు చదువుతూ చదువుతూ అన్నమాట) ఇక్కడ ఒక్కసారి ఆగిపోయాను. 'గాడ్...' మొదటి సారి నాకు మాటల్లేవు. మళ్ళీ మళ్ళీ చదివాను. ఆవిడకి చెప్పనంటే ఓ నిజం చెబుతాను. ఈ వీరగాధ సిరీస్ ని మార్క్ చేసి పెట్టుకుని, అప్పుడప్పుడూ నేను 'డౌన్' అని ఫీలైనప్పుడల్లా నిశ్శబ్దంగా వెళ్లి మరోసారి చదివేసి వచ్చేస్తూ ఉంటాను. చెప్పొద్దని ఎందుకన్నానంటే, ఆ టపాల ఉద్దేశ్యం 'అలాంటి' సమస్య ఉన్నవారికి ఉపయోగపడడం మాత్రమే అని ఆవిడ గట్టిగా చెప్పేశారు మరి.

నాకు కొందరు మంత్రులు, నాయకులూ అంటే భలే చిరాకు. హాశ్చర్యంగా, మన ఇంగ్లిష్ సుజాతగారికి కూడా అంతే. మచ్చుకి కావాలంటే, ఆవిడకి జైరాం రమేశ్ అంటే అషియం. ఇదొక్కటేనా? పుస్తకాలు, సినిమాలు, జాతీయ, అంతర్జాతీయ విషయాలు... ఇలా చాలా బోల్డన్ని విషయాల్లో ఈవిడ అభిప్రాయాలు నా అబ్బిప్పిరాయాలకి దగ్గరగా అనిపిస్తాయి. అందుకని నేనీవిడ కబుర్లని వీలైనంత వరకూ మిస్సవ్వను. మీడియా, వార్తల వ్యాపారం గురించైతే ఈవిడ చెప్పిన వాటికి నేను డిట్టో కొట్టేస్తే చాలన్నమాట.

సుజాత గారి కబుర్లు వింటూ వింటూ ఉండగా నాకు వాళ్ళింటికి టీకి వెళ్ళాలన్న కోరిక మొలకెత్తింది. అసలు ఎన్నిరకాల టీలు? జన్మ ధన్యమన్న మాట కదా? మెట్రో మాన్ ని పరిచయం చేసినా, టీవీ భక్తి గురించి సెటైర్లు వేసినా, బాసు లీలల్ని వర్ణించినా, మానవ మనస్తత్వాలని ముసుగు తీసి చూపించినా ఆ కబుర్లు అలా అలా వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది. బోల్డన్ని సీరియస్ విషయాలు చెప్పేసి, వాటిని 'సిల్లీ కబుర్లు' అని అనగలగడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.

నాలుగేళ్ల క్రితం తనకిష్టమైన ఇండియన్ ఆర్మీ కమర్షియల్ గురించి చెబుతూ కబుర్లకి శ్రీకారం చుట్టిన ఇంగ్లిష్ సుజాతగారు తొలి సంవత్సరం నూట పందొమ్మిది టపాలు రికార్డు చేశారు. రెండో సంవత్సరానికి ఆ సంఖ్య ముప్ఫై ఐదుకి పడిపోగా, మూడో సంవత్సరంలో ముప్ఫై రెండు దాటనంది. అయితే, ఈ విషయాలేవీ అస్సలు ప్రస్తావించకుండా చాలా గడుసుగా 'నో కామెంట్ల బ్లాగర్ల సంఘం' మొదలుపెట్టి దానిని సైలెంట్ గా సూపర్ హిట్ చేసేశారు. కబుర్లు మాత్రమేనా? పుటోలు, పోయెట్రీ, వీడియోలు, పాటలు.. అబ్బో.. చాలా విషయాలే ఉన్నాయ్. తన గురించి Confused, irritating and impulsive అని మూడు ముక్కల్లో తేల్చేశారు.. ఏమంటాం?

గడ్డిపూలని మర్చిపోకుండా అప్పుడప్పుడూ నీళ్ళు చిలకరిస్తూ ఉండడంతో పాటు, తన కబుర్లలో తనకి నచ్చిన వాటిని గుది గుచ్చి అందించారు కూడా. రెగ్యులర్గా కబుర్లు చెప్పరేం? అని గట్టిగా నిలదీద్దామంటే, మనకా అవకాశం ఇవ్వకుండా ఆదివారం కూడా తనెంత బిజీనో ముందే చెప్పి మన నోటికి తాళం వేసేశారు. ఈమధ్యనే సూపర్ ఉమన్ సిండ్రోం నుంచి బయట పడ్డ ఇంగ్లిష్ సుజాతగారు, ఏదోలా కొంచం చెయ్యి ఖాళీ చేసుకుని అడపాదడపా అయినా కాసిన్ని కబుర్లు చెబితే వినాలన్నది నా కోరిక.. మీరేమంటారు?

18 కామెంట్‌లు:

  1. Yes, she is unique. It's a shame that, she doesn't write more often.

    రిప్లయితొలగించండి
  2. మీలాగే నేనూ సుజాతక్క ఫాన్ ని,
    ఇంక బుజ్జమ్మ కి కూడా...
    సేమ్ పించేస్కోన్డి !!

    రిప్లయితొలగించండి
  3. బావుందండీ. పుస్తకాలూ, సినిమాలే కాకుండా తోటి బ్లాగర్ల గురించి రివ్యూ రాయటం. మొత్తానికి ఈ రోజు సుజాతగారి బ్లాగులన్నీ చదివించేసారు.

    శ్రీరాగ

    రిప్లయితొలగించండి
  4. ఇంగ్లీష్ సుజాతగారు తెలుగులో మరింత తరుచుగా రాయాలని డిమాండ్ చేస్తున్నామధ్యక్షా.
    మురళిగారు, మీదైన శైలిలో ముచ్చటైన బ్లాగ్ పరామర్శ. బాగుబాగు

    రిప్లయితొలగించండి
  5. చాలా మంచి బ్లాగ్ పరిచయం చేసారండి. ఇప్పుడే చాలా మటుకు చదువుతూ వచ్చాను. ఇవి గడ్డిపూలు కావండి. God's flowers.

    రిప్లయితొలగించండి
  6. నేను కూడా.. ఆవిడ బ్లాగ్ లో పోస్ట్ వస్తే తప్పక చదువుతాను.. చాలా బాగా పరిచయం చేసారు.. నైస్..

    రిప్లయితొలగించండి
  7. Have a look to this blog. Just, by a four year old girl. Ofcourse, not in telugu. But you too can enjoy.

    http://www.pakhi.akshita.blogspot.com/

    రిప్లయితొలగించండి
  8. ఆవిడ వీరగాధ టపాలు చాలా స్ఫూర్తిదాయకాలు.

    రిప్లయితొలగించండి
  9. @KumarN: ధన్యవాదాలండీ..
    @ఆత్రేయ: ష్యూర్.. ష్యూర్.. ధన్యవాదాలండీ..
    @సిరి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  10. @కొత్తపాళీ: "తెలుగులో మరింత తరచుగా రాయాలని.." :)) ..ధన్యవాదాలండీ..
    @Mauli: ధన్యవాదాలండీ..
    @జయ: వావ్.. భలేగా చెప్పారండీ.. అన్నట్టు ఆ పాప బ్లాగ్ గురించి పేపర్లో కూడా వచ్చింది కదూ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @ కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..
    @శిశిర; నిజమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. మంచి పరిచయం మురళి గారు. బాగా రాశారు.. నాకు కూడా చాలా ఇష్టమైన బ్లాగ్ ఇది. నేను కూడా ఇంగ్లీష్ సుజాత గారనే రిఫర్ చేసే వాడ్ని మొదట్లో :-) ఆ సిరీస్ నేను కూడా మార్క్ చేసి పెట్టుకున్నాను :-)

    రిప్లయితొలగించండి
  13. @వేణూ శ్రీకాంత్: అవునా.. అయితే నేనొక్కడినీ కాదన్న మాట!! ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. అయి బాబోయ్ ! చాలా థాంకులండీ. ఈ రోజే ఈ టపా విష్యం సౌమ్య గారు నా బ్లాగు లో చెప్తే తెలిసిందండీ. దాదాపు నెలయింది రాసి. ఇప్పుడే చదివాను. హిందూ లో రాసేసినంత ఆనందం కలిగింది. మీ పెళ్ళి కి బుల్లెమ్మ సమేతంగా వస్తాననని ఇందు మూలంగా ప్రమాణం చేసేస్తున్నాను. నా గురించి పేపర్లో మొదట సుజాత గారు (ఈనాడు) లో పరిచయం చేసారు. ఇప్పుడు మీరు బ్లాగ్ లో ! చాలా థాంకులు.

    I feel very happy with the readers who commented positively abt me. Thanks to all of them too.

    రిప్లయితొలగించండి
  15. @Sujata: మీరు చూసి ఉండరని నాకు తోచలేదండీ.. సౌమ్య గారికి నా థాంకులు. "హిందూ లో రాసేసినంత ఆనందం కలిగింది." Really?!! మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.. "మీ పెళ్ళి కి బుల్లెమ్మ సమేతంగా వస్తాననని ఇందు మూలంగా ప్రమాణం చేసేస్తున్నాను. " ..ఈ విషయం ఇల్లాలికి చెప్పాను, కించిత్ కుతూహలంగా.. సమాధానం ఒకే ఒక్క మాట "షష్టి పూర్తికి వస్తారు లెండి" !!! ...ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  16. Ooops.. Sorry. I thought U are still a bachelor. But how come u are watching Suman's Movies ? Ur wife is so understanding. U are lucky.

    రిప్లయితొలగించండి
  17. @Sujata: హ..హ.. మీ కంక్లూజన్ సూపరండీ అసలు...

    రిప్లయితొలగించండి