గురువారం, ఏప్రిల్ 01, 2010

ముచ్చటగా మూడో కథ

ఓ సరదా కథ రాయాలన్న ఆలోచనకి అక్షర రూపమే 'మంచుతెర.' ఆలుమగల సంసార జలధిని ఇతివృత్తంగా తీసుకుని రాసిన ఈకథను ఏప్రిల్ సంచికలో ప్రచురించిన 'కౌముది' వారికి కృతజ్ఞతలు. ఇందలి పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలని మనవి. అన్నట్టు ఈ కథలో కూసింత రొమాన్సు కూడా ఉంది. చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ..

28 కామెంట్‌లు:

  1. చాలా చక్కటి ఆహ్లాదకరమైన కథ అండీ...నేను మీరు ఎక్కుపెట్టిన పాఠక జనుల పరిమితిలో ఉన్నా కాబట్టి ఇంకా ఆనందాన్నిచ్చింది. ఏంటో... పెళ్ళి కాకముందే మీ లాంటి వాళ్ళ కథల వల్ల చాలా నేర్చేసుకుంటున్నాం. :-)

    రిప్లయితొలగించండి
  2. వావ్,నేనె ఫస్ట్ కామెంట్ ఇస్తున్నానోచ్.నిన్ననే మీ బ్లాగు చూసానండీ.అంతే,దాదాపు సగం పైన చదివేసా అన్నీ ఇప్పటివరకు.టూ గుడ్ బ్లాగ్,మీ రచనలు సూపర్ సుమా.నేను ఈ కామెంట్ పోస్టు చేసేలోపు ఎవరయినా కామెంటేసెస్తారేమో అని తెగ ఇదయిపోతన్నానండీ బాబూ.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది .ఇంకా వివరించాలని ఉంది కానీ ..................ఇంకా కథ లొనే ఉన్నా. అంటే, అనుభూతిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. మీరిచ్చిన లింక్ ఫస్ట్ పేజ్ లో తెలుగు ఫాంట్ సపోర్టుచెయ్యటం లేదండి. వేరే లింక్ ఏదైనా ఉందా.............

    రిప్లయితొలగించండి
  5. 'మంచుతెర' చాలా చాలా బాగుంది మురళీ గారు. మొత్తానికి మీరు ప్రతీ కథకీ వైవిధ్యమైన అంశాల్ని ఎంచుకుంటున్నారు. కూసింత రొమాన్సు కాదు....మొత్తం కథే రొమాంటిగ్గా ఉంది ;-) మీ భావుకత ప్రతీ లైన్లో కనిపిస్తోంది. అన్నట్టు.. అమ్మాయి మనసుని చిత్రీకరించడంలో మీకు ఫుల్లు మార్కులు వేసేస్తున్నా నేనయితే :-) ఇలాగే విజయవంతంగా ముందుకి సాగిపోవాలనీ, మంచి మంచి కథలో బోలెడు రాసి మమ్మల్ని అలరించాలనీ కోరుకుంటున్నా!

    రిప్లయితొలగించండి
  6. మ౦చి అనుభూతినిచ్చిన కధ...మీ కథన౦ ఎప్పటిలాగే excellent...

    రిప్లయితొలగించండి
  7. బోల్డంత బావుందండీ! మూడు కధలూ పూర్తిగా వైవిధ్యంగా ఉండి మీలో ఉన్న రచయిత సామర్ధ్యాన్ని చూపిస్తున్నాయి.. ఇందులో కధ కన్నా పాత్రల నెరేషన్ చాలా బావుంది :-)

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగుంది మురళి గారు :-):)congrats.

    రిప్లయితొలగించండి
  9. మరల రెండోసారి మూడోసారి మంచుతెర తీసి చదివాను ,వర్ణనలు కథ చెప్పే విధం బాగుంది ....కాని ఏవిటో ఈ ఆడవాళ్ళు చిన్న పలకరింపు కే చిన్నపిల్లల్లా అన్నీ మరచిపోతారు ప్చ్..అంత మొండిగా వున్నా 'జానకి 'ఓ చిన్న కేక్ కట్ చేయించేసరికే అన్నీ మరచిపోయి నిశ్చింతంగా అంతటి సంఘర్షణకి తెర దించేసింది-:):) .

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు..చాలా బాగుందండి కధ..మీవన్నీ ఫీల్ గుడ్ కలిగించే కధలు...మీ టపాల్లానే...

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు,
    ముందుగా మీకు హార్దిక శుభాకాంక్షలు.
    ఒక చక్కటి కథను అందించారు....ధన్యవాదాలు.
    ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగిన ఫీలింగ్!
    మొత్తానికి ఎండలు మొదలవుతున్న సమయంలో మంచు వాన కురిపించేసారు.
    --హను

    రిప్లయితొలగించండి
  12. కథ బాగుందండి .
    మొదటి పేజ్ లో అక్షరాలు సరిగ్గాలేవండి .

    రిప్లయితొలగించండి
  13. @ఇనగంటి రవిచంద్ర: అంతే అంటారా :-) :-) ధన్యవాదాలు..
    @రిషి: నా బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ.. బ్లాగులో కామెంట్ మోడరేషన్ ఉండడం వల్ల, వ్యాఖ్య వెంటనే ప్రచురితం అవ్వదండీ.. ధన్యవాదాలు.
    @బూన్: మీ సలహాలు, సూచనలకి ఆహ్వానం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @3g: వేరే లంకె ఏదీ లేదండీ.. మీ మెయిల్ ఐడీ ఇస్తే నే రాసిన కాపీ పంపుతాను.. ధన్యవాదాలు.
    @మధురవాణి: మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ.. రాయాలనే ఉంది నాకైతే.. ధన్యవాదాలు.
    @రాజ్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  15. @కృష్ణ రాజేష్: ధన్యవాదాలండీ..
    @సునీత: ధన్యవాదాలండీ..
    @నిషిగంధ: మీ సూచనని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నానండీ :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @చిన్ని: మళ్ళీ మళ్ళీ చదివినందుకు ధన్యవాదాలండీ.. కేవలం కేక్ కట్ చేయించినందుకే అంటారా??
    @శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  17. @హను: "ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగిన ఫీలింగ్!" ..యెంత అందంగా చెప్పారండీ!! ..ధన్యవాదాలు.
    @మాలాకుమార్: మొదటిసారి చూసినప్పుడు నాకూ అదే సమస్య వచ్చిందండీ, మళ్ళీ ఓపెన్ చేస్తే మామూలుగానే వచ్చింది.. అయినా ఓపెన్ కానట్టయితే నేను చేయ గలిగేది మెయిల్ చేయడమేనండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. అభినందనలు మురళి గారు
    పెద్ద కధ కదా అని కాస్త లేట్ అయ్యింది
    Robin Sarma దగ్గరికి వచ్చేసరికి అర్ధమయింది
    మీ కధే అని :)

    రిప్లయితొలగించండి
  19. 'మంచుతెర' చాలా చాలా బాగుంది మురళీ గారు.

    రిప్లయితొలగించండి
  20. @హరే కృష్ణ: అలా అపార్థాలు చేసేసుకుంటారనే ముందస్తు సూచన పెట్టానండీ :-) ధన్యవాదాలు.
    @సృజన: ధన్యవాదాలండీ..
    @ప్రణీత స్వాతి; ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. మంచు తెర మొదటి పేజి కంటెంట్ తెలుగులో లేదు మురళీ గారూ..ఏదో కోడ్ లో వుంది. ఆ కధ నాకు మళ్ళీ చదవాలని వుంది.. ఎలా మరి చదవడం?

    రిప్లయితొలగించండి
  22. మంచుతెర టైటిల్ ఎంతబాగా అమరిందో కధకి ...భార్యాభర్తల మధ్య అపార్ధాలు కూడా మంచుతెర లాగే ఉండాలని అందమైన కధ ద్వారా చక్కటి మెసేజ్ కూడా ఇచ్చినట్టుందండీ ...కౌముదిలో చదవటం మరీ ఆనందం అభినందనలు మురళి గారూ !

    రిప్లయితొలగించండి
  23. మురళి గారూ కథ చాలా చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  24. enta bagundo ee kadha...eppudu chaduvutanu...my all time favourite.... kani guddidanni ivvale choosa rasindi meeru ani... naku unna knowledge tho naku ee kadha enta istamo meeku explain cheyyalenu.... dull ga unapppudalla ee kadha chaduvukunta...

    రిప్లయితొలగించండి