బుధవారం, ఏప్రిల్ 21, 2010

దూరపు కొండలు...

మధ్యాహ్నం బళ్ళో అవుట్ బెల్ అయిపోయాక పాఠాలు ఉండవు. ఎండా, వానా లేకపొతే డ్రిల్లు చేయించడమో లేకపొతే పాటలో, పద్యాలో చెప్పడమో ఉంటుంది. మేమేమో దృష్టి బడి గంట మీద పెట్టి మేష్టారు చెప్పేవి వల్లెవేస్తామన్న మాట. ఆవేళ మాకు సూక్తులు, సామెతలు పాఠం. మేష్టారు బోర్డు మీద కొన్ని సూక్తులు, సామెతలు రాసి, లీడర్ని చదవమంటారు. లీడరు ఒక్కోటీ చదువుతుంటే, మిగిలిన పిల్లలు వంత పలుకుతారన్న మాట. లీడర్ని నేనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.

మేష్టారు బోర్డు మీద 'పరుల సొమ్ము పాము వంటిది' 'ఐకమత్యమే మహాబలము' 'దూరపు కొండలు నునుపు' ఇలాంటివి రాసి, ఓసారి తను చెప్పి తర్వాత పని నాకు అప్పగించి, పక్క క్లాసు మేష్టారితో మాట్లాడడానికి వెళ్ళిపోయారు. నాకు 'దూరపు కొండలు..' అర్ధం కాలేదు. మేష్టారు మన క్లాసులో ఉంటే అడగాలి కానీ, అలా పక్క క్లాసుకి వెళ్లి అడక్కూడదు. అలా అడిగితే మేష్టర్లిద్దరికీ కోపం వస్తుంది. తర్వాత అడగొచ్చులే అనుకుని, నేను బోర్డు మీదవి ఒక్కోటీ చదువుతున్నా. మిగిలిన వాళ్ళందరూ నేను పలికినవి పలికినట్టు పలుకుతున్నారు.

నేను ఓ కన్ను మేష్టారి మీద వేసి ఉంచాను. ఎందుకంటే ఆయన ఉన్నట్టుండి వాచీ చూసుకుని, నాగరాజునో, శ్రీనునో పిలిచి బెల్లు కొట్టేయమంటారు. వాళ్ళిద్దరూ మా స్కూల్లో పొడుగు పిల్లలు. అందుకని బెల్లు కొట్టే డ్యూటీ వాళ్ళదే. వాళ్ళంత పొడుగైతే కానీ మనకా చాన్స్ రాదు, అప్పటివరకూ ఇలా పాఠాలు చెప్పడమే. బోర్డు మీదవి చదువుతూనే, అమ్మ జంతికల్లాంటివి ఏమన్నా చేసి ఉంటుందా, తాతయ్య నిన్న తెచ్చిన పొట్లం నిజంగానే పూర్తిగా అయిపోయిందా? లేకపొతే అమ్మ నాకోసం ఏమన్నా దాచి ఉంటుందా? లాంటి ముఖ్యమైన విషయాలు కూడా ఆలోచించుకుంటున్నా లోపల్లోపల.

మేమంతా పెద్ద పెద్ద గొంతులేసుకుని బోర్డు మీద ఉన్నవి చదువుకుంటూ ఉండగానే బెల్లు కొట్టించేశారు మేష్టారు. ఇంటికి ఒక్క పరుగు పెట్టి, సంచీ ఓ మూలకి విసిరి కొట్టి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయా. "ముందు కాళ్ళూ చేతులూ కడుక్కురా" అని పెరట్లోకి పంపేసింది అమ్మ. అక్కడ పెరట్లో బామ్మ తన మిత్రబృందంతో నిండుసభలో ఉంది. వాళ్ళంతా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు.

"పండగ వారం రోజులు ఉందనగా పుల్లేటికుర్రు షావుకారు పెద్ద బట్టల మూటతో వచ్చేసే వాడు. చీరలు, పరికిణీ గుడ్డలూ అన్నీ జరీవే. చీరలంటే ఇప్పట్లా మొగ్గలచీరలు కాదు. దోసెడు వెడల్పున జరీ ఉండేది. మేమందరం ఎవరికి నచ్చినవి వాళ్ళం తీసుకునే వాళ్ళం.." అంటూ బామ్మ అనర్గళంగా చెబుతూ ఉంటే, అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి వింటున్నారు. నాకెందుకో బళ్ళో పాఠం గుర్తొచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడి "దూరపు కొండలు నునుపు" అన్నాను. అంతే.. బామ్మకి ఎంత కోపం వచ్చిందంటే కళ్ళే కాదు ఒళ్ళు కూడా ఎర్రగా అయిపోయింది.

"ఎవరు నేర్పుతున్నారు నీకు ఇలాంటి మాటలు? చెప్పు?" అని గద్దించింది, వంటింటి వైపు అనుమానంగా చూస్తూ. అక్కడ అమ్మ నాకోసం పాలు కాస్తోంది. "మా బళ్ళో మేష్టారు చెప్పారు. ఇవాళ పాఠం ఇదే" అన్నాన్నేను జంకూ గొంకూ లేకుండా. బామ్మ ఫ్రెండ్సేమో "పనేల అయిపోయిందండీ .. మళ్ళీ వస్తాం" అని చెప్పి వెళ్ళిపోయారు. "చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇంటికొచ్చిన వాళ్ళ ముందు ఏది పడితే అది మాట్లాడెయ్యడమేనా? పైగా మేష్టారు చెప్పారుట మేష్టారు.." బామ్మ కొనసాగిస్తోంది.

నేను అన్నదాంట్లో తప్పేమిటో నాకస్సలు అర్ధం కాలేదు. తప్పైతే మేష్టారు బళ్ళో చెప్పరు కదా.. పైగా పిల్లలందరి చేతా చెప్పించారు కూడాను. ఏవిటో ఈ బామ్మకేమీ అర్ధం కాదు. ఓ నాలుగు రోజులు బళ్లోకి తీసుకెళ్ళాలి, తాతకి చెప్పి అని నేను ఆలోచించుకుంటూ ఉండగా అమ్మ నాకు పాలగ్లాసిచ్చి, తల దువ్వడం మొదలు పెట్టేసింది. "క అంటే క, కి అంటే కి సాగిస్తోంటే ఇలాగే ఉంటుంది. పిల్లలకి భయం చెప్పుకోవాలి. రానీ మీ నాన్నని. ఇవాళ సంగతేమిటో తేల్చేస్తాను.." బామ్మ శపధాలు వినిపిస్తున్నాయి.

"ఎందుకురా తెలిసీ తెలియకా వాగి తిట్లు తింటావ్?" అని కోప్పడింది అమ్మ. అమ్మకూడా నన్నే అనేసరికి భలే కోపం వచ్చింది. "బళ్ళో చెప్పారమ్మా..కావాలంటే గణేష్ ని అడుగు, లేకపొతే ఇంకెవర్నైనా పిలిచి అడుగు.. ఇంతకీ దూరపు కొండలు నునుపు అంటే ఏమిటమ్మా?" అని అడిగేశాను. "ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి. బొత్తిగా భయం భక్తీ లేకుండా పోతున్నాయ్. మీ నాన్నని రానీయ్.. ఏం నాయనా నేనీ ఇంట్లో ఉండాలా వద్దా? అని అడిగేస్తాను" బామ్మ ఆపడం లేదు.

"నీకు తర్వాత చెబుతాను కానీ, నువ్వు ఆటలకి వేళ్ళు. తాతగారు వచ్చాకే ఇంటికి రా" అని నాకు చెప్పి, "వెంకన్నబాబూ తండ్రీ పిల్లాడికి దెబ్బలు పడక పోతే నీకు కొబ్బరికాయ కొట్టుకుంటాను" అని దేవుడికి మొక్కేసింది అమ్మ. మామూలుగా అయితే నాకు జొరం వచ్చి తగ్గకపోతే కొబ్బరికాయ మొక్కుకుంటుంది అమ్మ. అలాంటిది ఇప్పుడు మొక్కేసుకుందంటే ఏదో పెద్ద గొడవే అవుతుందేమో అనిపించింది నాకు. ఎందుకైనా మంచిదని ఆటలకి వెళ్తూ వెళ్తూ శివుడి గుడి బయట ఆగి "నాన్న కన్నా ముందర తాతయ్య ఇంటికి వచ్చేలా చూడు దేవుడా" అని దండం పెట్టేసుకున్నాను.

ఆటల్లో పడ్డాను కానీ ఇంటి మీద ఓ కన్నేసే ఉంచాను. వెంకన్నబాబు మా అమ్మ మొక్కు విన్నాడో లేక శివుడు నా భక్తికి మెచ్చాడో తెలీదు కానీ ఏడు పెంకులాట సగంలో ఉండగానే తాతయ్య ఇంటికెళ్తూ కనిపించారు. నేను కూడా ఒక్క పరుగందుకున్నా. "విన్నారా మీ ముద్దుల మనవడేం చేశాడో.." తాతయ్యని వీధిలో నిలబెట్టే చెప్పడం మొదలు పెట్టేసింది బామ్మ. నేను గబగబా వెళ్లి తాతయ్యకి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చేశాను. "గుమ్మంలో అడుగెట్టానో లేదో పసి వెధవ మీద పితూరీలు మొదలు. వాడు చూడు నీళ్ళు తెచ్చిచ్చాడు రాగానే," అన్నారు తాతయ్య.

బామ్మ అదేమీ అస్సలు పట్టించుకోకుండా నేనేం చేశానో చెప్పేసింది. వాళ్ళందరి ముందూ నేనలా అనేసరికి తనకి తల కొట్టేసినట్టు అనిపించిందిట. నాకు ఈ తల కొట్టేయడం అంటే ఏమిటో కూడా అర్ధం కాలేదు. కానీ అలాంటప్పుడు అడక్కూడదు కదా. "ఇప్పుడు వాడన్న దాంట్లో తప్పేముందీ.. తెలియక చెప్పినా నిజమే చెప్పాడు. మీ పుట్టింటి వాళ్ళ సంగతి నాకు తెలీదా?" అని తాతయ్య అనేసరికి బామ్మ కోపం ఆయన మీదకి తిరిగింది. "మీ అలుసు చూసుకునే అందరూ నా నెత్తెక్కుతున్నారు.." అంటూ ఇంకా ఏంటేంటో అంది.

"ఇదిగో నా మొహాన కాఫీ నీళ్ళు పోసేదుందా? నువ్వివ్వకపోయినా నాకేమీ లోటు జరగదులే.. ఏ ఇంటికెళ్ళి ఇవాళ మా ఇంట్లో కాఫీ ఇవ్వలేదు అని చెప్పినా లోపలికి పిల్చి కాఫీ ఇచ్చి పంపుతారు" అన్నారు తాతయ్య. నేను గబుక్కున వెళ్లి తాతయ్య చెప్పులు తెచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెట్టేశాను. "సరి సరి.. ఆ పని గాని చేస్తిరా నేనెవరికీ మొహం చూపించక్కర్లా.. పట్టుకొస్తున్నాను కాఫీ, తాగేసే బయల్దేరండి పెత్తనాలకి" అంటూ వంటింట్లోకి వెళ్ళింది బామ్మ. ఈ గొడవలో పడి నేను 'దూరపు కొండలు నునుపు' అనే మాటకి అర్ధం తెలుసుకోవడం మర్చిపోయాను.

44 కామెంట్‌లు:

  1. ఇలాంటి జ్ఞాపకాలు.. ఇలా రాస్తే.. ఒక వెయ్యిపేజీలున్నా.. ఏకబికిన చదివెయ్యగలను.. అంత బావుంటాయ్..

    రిప్లయితొలగించండి
  2. :-):-)

    మీ చిన్నప్పటి విషయాలు క్యూట్ నెరేషన్ తో భలే చెప్తారండీ మీరు...

    రిప్లయితొలగించండి
  3. బాగుందండీ మీ జ్ఞాపకాలు ....నానమ్మ కి ఇవ్విధంబుగా శత్రువు అయ్యరన్నమాటా :-)

    రిప్లయితొలగించండి
  4. Hahahaaa..Hillariou.nenu mee baamma maastaarini kadigeasivuntaaru anukunna.Intakee meeku ardham eppudu ye sandharbham lO telisindi?adi inkoka tapaa lonaa? :)

    రిప్లయితొలగించండి
  5. Hillarious..Nenu mee baamma kadigesi vuntaaru maastaarini anukunnaa.ibtakee meeku ardham yeppudu telisindi?

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు, మీకు దూరపుకొండల అర్ధం అప్పుడే తెలియకుండా...ఇంకొంత కాలం మీ బామ్మగారితో మీ టగ్ ఆఫ్ వార్ కొనసాగి, ఇంకొన్ని సంఘటనలు జరిగిఉండి...అవన్నీ మాకు చెప్పాలని నా కోరిక. ఇంతకీ ఏడు పెంకులాట ఏంటండి. మీ స్కూల్ నాకు చా...లా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  7. @జయ గారూ,
    ఏడు పెంకులాట ఏంటి అని అడుగుతున్నారా..? ప్చ్..లాభం లేదు..నేను అజ్జెంటుగా పది సార్లు 'మేన్ ఆఫ్ ది ఏడు పెంకులాట' అయిన విధం, ఓ రెండు సార్లు 'బ్లైండ్ ఫోల్డ్ ఏడు పెంకులాట' లో ట్రోఫీ గెల్చిన విధం వీలుకుదిరినపుడు టపా ద్వారా మీకు చెప్పి తీరాల్సిందే..మీరు చదివి తీరాల్సిందే..

    రిప్లయితొలగించండి
  8. మంచుపల్లకీ గారిదీ శేఖర్ గారిదీ రెండు వ్యాఖ్యలు కలిపి నా వ్యాఖ్యగా మరోసారి చదివేసుకోండి :-) చాలా బాగా రాశారు మురళి. మీ బాల్య ఙ్ఞాపకాలన్నీ ఒక పుస్తకం వేసేయొచ్చని నా ఘాట్టి నమ్మకం అర్జంట్ గా మీరా పని మీదుండండి ముందు.

    రిప్లయితొలగించండి
  9. ఎప్పట్లాగే అందమైన జ్ఞాపకాలు :-)
    మీ బామ్మ గారికి మీరెలా శత్రువయ్యారో ఇప్పుడు మరింత బాగా తెలుస్తోంది ;-)
    వేణూ శ్రీకాంత్ గారిదే నా మాట కూడా! 'నెమలికన్ను' లో ఉన్న మీ బాల్య జ్ఞాపకాలన్నీ తప్పకుండా పుస్తకం అచ్చు వేయించాల్సిందే! నేను ఆ పుస్తకం తెచ్చుకోడానికి ఇప్పటి నుంచే వెయిటింగ్. మీరా పనిలో ఉండండి ముందు! :-)

    రిప్లయితొలగించండి
  10. చాలా ఆహ్లాదం గా భలే రాసారు
    సీక్వెల్ ఉందా ఈ టపా కి :)

    రిప్లయితొలగించండి
  11. @ శేఖర్ పెదగోపు: శభాష్ టిన్‌టిన్. మీకోసంగతి చెప్పాలి మేము తిరుచిరాపల్లిలో ఎం.టెక్ హాస్టల్ బయట రెండుసెమిస్టర్లు ఐపీఎల్ స్థాయిలో పోటీలు జరిపాం.

    ఇలాటి సంగతొకటి బ్లాగులో రాయలేనిది ప్చ్

    రిప్లయితొలగించండి
  12. జయగారు,
    చ౦పేశారు..మీకు ఏడుపె౦కులాట తెలియదా!!సుపర్ గేమ్ తెలుసా!!!

    మ౦చుపల్లకి గారిత్యోపాటు నేను చదువుతా !!భలే బాగు౦టాయి చిన్ననాటి ముచ్చట్లు.. మేము ఎక్కువే ఆడుకునే వాళ్ళ౦..ఎవరి మీదైనా కోప౦ ఉ౦టే మరి బాగా పనికి వస్తు౦ది..నేను పెద్దగా దెబ్బలు తినలేదు కాని అ౦దర్ని బాగా కొట్టేదాన్ని..అసలే పురచెయ్యి వాటమేమొ...పె౦కుల్ని మిస్స్ కాకు౦డా కొట్టేదాన్ని..మా సాబ్ తో మాటలలో చెపితే ఆడపిల్లలు కూడా ఆడతారా ఈ ఆట అన్నారు..మా జట్టు లో మూడువ౦తులు ఆడపిల్లమే ఆడేవాళ్ళ్ల౦..మురళిగారు మీరు చెప్ప౦డి మీ ఊరిలో ఆడపిల్లలు ఆడేవారా లేదా ఏదుపె౦కులాట..
    మధురవాణిగారి అలోచబాగు౦ది..మీరు ఆ పనిలో ఉ౦డ౦డి..నాకు మీ పుస్తక౦ మీ స౦తక౦ తో పాటు కావాలి..అది చదివి నేను నా బ్లాగ్ లో రాయాలి మీ పుస్తక౦ గురి౦చి....

    రిప్లయితొలగించండి
  13. మురళి గారు,
    బాల్యాన్ని మధురంగా అందించడం లో మీకు మీరే సాటి.....
    మీ టపాలు చదువుతున్నప్పుడల్లా అన్ని సీన్లు కళ్ళముందే జరుగుతున్నట్లనిపిస్తాయి.....అంత అద్భుతంగా ఉంటుంది మీ వివరణ...
    "వాళ్ళందరి ముందూ నేనలా అనేసరికి తనకి తల కొట్టేసినట్టు అనిపించిందిట. నాకు ఈ తల కొట్టేయడం అంటే ఏమిటో కూడా అర్ధం కాలేదు".......ఈ లైను కేక... :-)
    పైన అందరు చెప్పినట్లుగా మీ బాల్య జ్ఞాపకాల పుస్తకం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను....

    రిప్లయితొలగించండి
  14. .. అట్లు తాతతో సంభాషించు బామ్మ కోపంబు "ప్రదాత ఇగినూటి అర్ధ పరంపరా వామనంబై, వామన చరణ రేఖను బలి వంశ వ్యపనంబై" వంటింటి లో చేయు కాఫీ పై బడి అవాజ్మాగోచరంబై ప్రవహించె

    (పోతన గారికి సవా లక్ష క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి
  15. @శేఖర్ గారు
    వావ్...నిఝ్ఝంఘానా!!! అయితే, మీరు తప్పకుండా రాయాల్సిందే. ఇంకో చిన్న డౌట్ అండీ. మురళి గారు ఏమంటారో అనడగలేదు. స్కూల్ బెల్ పిల్లలు కొడతారా. ఎన్ని డౌట్లో అనకండీ...ప్లీజ్...ఈ విషయంలో కూడా మీకు ఇంతో అంతో ఎంతో కొంత క్రెడిట్ ఉండి ఉండే ఉంటుందని నా అనుమానం. కనుక పన్లో పనిగా ఇది కూడా రాసేస్తే, చదివిపెట్తాం. ఈ 'ఠపా' మాత్రం నాకే...:)

    రిప్లయితొలగించండి
  16. me gnapakalu kallaki kattinattu rastharu .me chilipi chesttallo
    sisters,brothers pathra kudaa undeuntundi, valla gurinchikudaa cheppandi.

    రిప్లయితొలగించండి
  17. మురళి గారు నేను మీ బ్లాగుని మూడు నెలల క్రితమే చూశాను. "పుస్తక పరిచయాలు", "బ్లాగర్ల పరిచయాలు" పూర్తిగా చదివేసాను. "కథానాయికుల పరిచయాలు" అలా టచ్ చేసి వదిలేసాను. ఇలాగే అన్నీ రాసేస్తుండండి. మీరు అడిగినవాటికి నా సమాధానం నా బ్లాగులో ఉంది చూడండి.

    రిప్లయితొలగించండి
  18. మురళి గారు భలే బాగున్నాయి మీ ఙ్ఞాపకాలు ... శేఖర్ అబ్బో అబ్బో..

    రిప్లయితొలగించండి
  19. @మంచు పల్లకీ: చాలా చాలా ధన్యవాదాలండీ..
    @శేఖర్ పెద్దగోపు: ఇప్పుడింక మీ వంతు.. ఏడు పెంకులాట టపా కోసం నేను కూడా బోల్డంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నానండీ.. తొందరగా రాసేయండి.. ధన్యవాదాలు.
    @రిషి: అబ్బే.. బామ్మ మేష్టారితో మాట్లాడేది కాదండీ.. ఆమాటకొస్తే బయటి మగవాళ్లెవరితోనూ మాట్లాడేది కాదు.. ధన్యవాదాలు. అన్నట్టు మీ బ్లాగులో కామెంటడం కుదరడం లేదండీ.. వ్యాఖ్యల పెట్టె ఓపెన్ కావడం లేదు, కొంచం చూడండి.

    రిప్లయితొలగించండి
  20. @చిన్ని: అవునండీ.. నాకు తెలియకుండానే అలా అయిపోయాను..ప్చ్.. ధన్యవాదాలు.
    @జయ: శేఖర్ గారు వివరంగా రాస్తారండీ.. ఇక బెల్లు మేమే ఎందుకు కొట్టాలంటే మాది పదహారణాల దుంపల బడి. అటెండర్లు ఎవరూ ఉండరు. అన్నీ మేమే.. పోటీలు పది చేసేవాళ్ళం పనులన్నీ.. అంటే క్లాసు తుడవడం, మేష్టారికి మంచి నీళ్ళు తేవడం, బెల్లు కొట్టడం ఇలాంటివన్నీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్; రాయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండీ :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @మధురవాణి: నాదీ అదే మాట, రాయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండీ :-) ..ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: సీక్వెల్ ఏమీ గుర్తు రావడం లేదండీ ప్రస్తుతానికి.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.. రాయడానికి ప్రయత్నించండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకూ,
    "ఏడుపెంకులాట" గుర్తొచ్చే మా కళ్ళకూ,
    అహా హోయ్ అహా హోయ్.
    (కళ్ళకు గుర్తొస్తాయా అని అడక్కండి,అడవిరాముడు లో పాట గుర్తొచ్చి రాసేసాను అంతే)
    మా ఇంటి కప్పు నేసేప్పుడు విరిగిన పెంకులన్నీ జాగ్రత్తగా దాచేవాళ్ళం,నీళ్ళతో తడిపి బాగా అరగదీసి చక్కగా పెంకులు చేసి స్టాక్ పెట్టేవాళ్ళం.

    ఇంతకు ముందెప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు,మీ పోస్టులు చదువుతుంటే నా మొహం అద్దంలో చూసుకున్నట్టుంటుందని.ఇకపోతే మీ మామ్మ మీకు "శత్రువు" అయితే మా నానమ్మ నాకు "మిత్రాతి మిత్రువు".నా ఒంటి మీద గాలి కూడా సున్నితంగా వీచాలనేది (అంటే అంత అభిమానమన్నమాట)

    మీ స్కూల్ బెల్లు నాగరాజు కొడితే మా స్కూల్ బెల్లు "యెర్రమిల్లి" వాడు కొట్టేవాడు(ఎందుకంటే వాడే మా స్కూల్లో "పొడుగెస్ట్" స్తూడెంట్ కాబట్టి).

    అద్దరకొట్టారు మురళీ పోస్ట్.అదీ సంగతి.

    రిప్లయితొలగించండి
  23. @సుభద్ర: మా ఊళ్లోనూ ఆడపిల్లలు ఏడుపెంకులాట ఆడేవాళ్ళండీ.. కాకపొతే వాళ్లకి 'రౌడీ రంగమ్మ' లాంటి బిరుదులు ఉండేవి. ఉన్నమాట చెప్పేశాను, తప్పట్టుకోకండేం :-) :-) ..ధన్యవాదాలు.
    @హను: ధన్యవాదాలండీ..
    @DG: మొత్తం టపాని మీరిలా రాస్తే చదవాలని ఉందండీ.. నాకు పూర్తిగా అర్ధం కాకపోయినా సరే!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @శిశిర: :-) :-) ..ధన్యవాదాలండీ..
    @అనఘ: :-) :-) ..ధన్యవాదాలండీ..
    @సవ్వడి: ధన్యవాదాలండీ..
    @నేస్తం: మరి ఏమనుకున్నారు శేఖర్ గారి గురించి? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @శ్రీనివాస్ పప్పు: "ఇకపోతే మీ మామ్మ మీకు "శత్రువు" అయితే మా నానమ్మ నాకు "మిత్రాతి మిత్రువు".నా ఒంటి మీద గాలి కూడా సున్నితంగా వీచాలనేది (అంటే అంత అభిమానమన్నమాట) " ఈ విషయం చిన్నప్పుడే తెలిస్తే మీతో నాలుగు మంచి మాటలాడి 'బామ్మల మార్పిడి' కి ఒప్పించేసి ఉండే వాడిని :-) :-) అయితే మీ బళ్ళో కూడా గంట కొట్టేది పొడుగెస్టేనా?? ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  26. 'మొగ్గల చీర' టపా లింక్ ఇచ్చారు.., పేరు ఏదో గుర్తులేదు కానీ 'గణేష్' టపాకు కూడా లింక్ ఇవ్వాల్సింది కదండీ. మీ చిన్ననాటి ఫ్రెండ్ అంటూ మీరు మొదట్లో రాసిన టపా చదివిన గుర్తు..

    రిప్లయితొలగించండి
  27. @DG: మొత్తం టపాని మీరిలా రాస్తే చదవాలని ఉందండీ.. నాకు పూర్తిగా అర్ధం కాకపోయినా సరే!! ..ధన్యవాదాలు.

    చంపేశారండి. ఏదో "బుడి బుడి నడకలతో" కొంచెం పోతన గార్ని కాపీ చెయ్యగల్ను గానీ మొత్తం పోస్టంతా చెయ్యాలంటే ముందు తెలుగు ఎమ్మే, తర్వాత తెలుగు పీహెచ్చిడి ఏ ప్రాచార్య ఎస్వీ జోగారావు గారి దగ్గిరో చెయ్యాలి. అప్పటికి నాకు ఎనభై ఏళ్ళొస్తాయి :-( ఈ సారికొగ్గెయ్యండి మరి.

    (మొదట నేను రాసినడి 'గంగావతరణం' అనే దాంట్లోది. వీలున్నప్పుడు గూగుల్ చేసి చూడండి).

    రిప్లయితొలగించండి
  28. ముళ్ళపూడి రవణ మీ ఇంట్లోకి తొంగి చూశారన్న మాట, బుడుగు పుస్తకం రాసేముందు!

    రిప్లయితొలగించండి
  29. మురళి గారు, ఇది చా...లా అన్యాయం. మీ అందరికీ తెలుసని...నా లాంటి అగ్నానురాలికి, ఏడుపెంకులాట అంటే ఏమిటో తెలియకుండా చేస్తారా!!! రోజూ చూస్తున్నాను తెల్సా అదేంటో తెల్సుకోవాలని ....చూస్తూ ఉండండి ఎక్కడో అక్కడ తెల్సుకొని ఒస్తాను....మా పిల్లలకి నేను కూడా ఐ పి ఎల్ లెవెల్ లో కాంప్టీషన్ పెట్టేస్తాను.

    రిప్లయితొలగించండి
  30. హ హ హ మురళి.. మీరు అసాధ్యులే సుమా. ఏంటీ మీ వూళ్ళో ఆడపిల్లలు ఏడూ పెంకులాట ఆడీతే రౌడి రంగమ్మ అంటారా, హన్నా ఏమి వూరండి అది.. నేను ఎప్పుడూ చిన్నప్పుడు ఏడు పెంకులాట, ముద్ర బాల్, కోతి కొమ్మచ్చి వైగారాలు ఆడే దానిని.

    రిప్లయితొలగించండి
  31. @జయగారోయ్...
    ఏడుపె౦కులాట అ౦టే...
    చిన్నపె౦కులు(ఇ౦టిపైకప్పుకి పూర్వవాడేవారు అవి..) ఉ౦టాయి కదా!వాటి ముక్కలు ఏడు ఒకదాని పైన ఒకటి పేర్చుతారు..
    రె౦డు టీమ్స్ ఉ౦టాయి...
    టాస్ వేసుకుని ఏవరు ము౦దు పె౦కుల్ని కొట్టాలొ తెల్చుకుని..
    ఒక టీమ్ పె౦కులు కొడాతారు..అప్పుడు రె౦డవ టీమ్ బాల్ ని పె౦కులు కొడుతున్నపుడు క్రి౦ద పడకు౦డా కెచ్ పట్టాడితే వాడు అవుట్,వాళ్ళ టీమ్ మరొకరు వస్తారు పె౦కులు పడగొట్టాడానికి...పె౦కులు పడగొట్టి పరిగెత్తాలి..
    అప్పుడు రె౦డవ టీమ్ బాల్ తో మొదటి టీమ్ లో ఎవర్ని కొట్టిన అవుట్..అప్పుడు రె౦డవ టీమ్ వాళ్ళ బాల్ బెబ్బ కి దొరకకు౦డా మళ్ళి ఒక్కోక్క పె౦కు పేర్చిఏడు పె౦కు పేర్చి(భెర్ప్) అ౦టారు..వాళ్ళకి అప్పుడు ఒక పాయి౦ట్ వస్తు౦ది..అలా పె౦కులు కొట్ట్టిన వాళ్ళు అవుట్ అత్తేదాక వాళ్ళే పె౦కుల్ని కొడతారు..వాడు అవుట్ అయితే వాళ్ళ టీమ్ లో మరోకరు వస్తారు పె౦కుల్ని కొట్టడానికి...
    పె౦కులు పడి కెచ్ పడితే ఆ టీమ్ మొత్తా౦ అవుట్..రె౦డవా టీమ్ వారికి పె౦కులు కోట్టే చాన్స్ వస్తు౦ది...
    ఆడి చూస్తేనే అసలు మజా తెలుసా!!

    @మురళిగారు,
    ఇ౦తా అన్యాయమా??మీరు ఆడితే ఆట!!ఆడపిల్లలు ఆడితే రౌడిర౦గమ్మలా>>>మా ఊళ్ళో అలా లేదు తెలుసా ఎ౦దుక౦టే మా న౦బరే ఎక్కువ>>>>మేము లేకపోతే అబ్బాయిల న౦బర్ సరిపోయేది కాదు మాతో వాళ్ళు తోక్కుడుబిళ్ళా ,వామనగు౦టలు,చి౦తపిక్కలు ఆడితే మేము జోరీబాల్,ఏడుపె౦కులాట,క్రికెట్ అన్ని ఆడేవాళ్ళ౦..
    అయినా మా సాబ్ ఇ౦చుమి౦చు ఇలా౦టి పీలి౦గే ఇచ్చారు(నాకు వీలుఅయిన౦త మూతి ముప్పయి మూడుసార్లు తిప్పి)..ఈ పురుషా౦కార౦ నశి౦చాలి..అబ్బాయిలతో పాటు ఏడుపె౦కులాటలో అమ్మాయిలకి తగు ప్రతినిధ్య౦ కల్పి౦చాలని భావనగారితో నేను కలిసి ఉద్యమిస్తాను....

    @భవనాగారు,
    మీకు ఓకేనా!!ఆవేశ౦ అనేశా>>>మీరు తోడువస్తారు కదా!!!!

    రిప్లయితొలగించండి
  32. మరే..ఇలాంటి మనవడున్నాక మీ బామ్మకి వేరే శతృవులు కావాలా :-) జై బామ్మలూ...జైజై తాతలూ..
    మీ జ్ఞాపకాలూ ఎప్పటిలాగే చ..హ..క్కగా ఉన్నాయి. .

    రిప్లయితొలగించండి
  33. హ్మ్.. మా వూళ్ళొనూ ఇంచుమించు రౌడి రంగమ్మలనే అంటారు..:-)) ముఖ్యంగా పెంకులు కొట్టాక..మళ్ళి పెట్టేలోపు వాళ్ళు బాల్ తొ నా వీపు చట్నీ చేసిన ప్రతీసారీ ఇలానే తిట్టుకునే వాడిని ...

    రిప్లయితొలగించండి
  34. @తృష్ణ: నిజమేనండీ.. 'శ్రీ గణనాధం' లంకె కూడా ఇచ్చి ఇచ్చి ఉండాల్సింది.. హడావిడి అయిపొయింది.. ధన్యవాదాలు.
    @DG: 'గంగావతరణం' అనగానే బాపూ గారి గంగావతరణం దృశ్యాలు కళ్ళముందు మెదులుతున్నాయండీ.. తప్పక గూగులిస్తాను.. మీ కృషి కొనసాగిస్తే బాగుంటుంది... ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: :-) :-) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  35. @జయ: అబ్బే..మన శేఖర్ గారు పెంకులు సిద్ధం చేసేస్తున్నారండీ.. అతి త్వరలోనే రాసేస్తారు చూడండి.. అయినా సుభద్ర గారు శాంపిల్ ఇచ్చేశారు కదా!!
    @భావన: అప్పట్లో మాఊరి వాళ్ళు అదో టైపు లెండి.. మేము మరీ చిన్న పిల్లలం కదా మరి :-) ..ధన్యవాదాలు.
    @సుభద్ర: ముందుగా జయ గారి తరపునా, నా తరపునా కూడా థాంకులండీ.. పల్లెటూరు కదండీ మనసులో ఏమీ దాచుకోకుండా అనేస్తూ ఉంటారు, పట్టించుకోకండి
    :-) :-) ఖండనకి మేమూ గొంతు కలుపుతాం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  36. @budugu: "ఇలాంటి మనవడున్నాక మీ బామ్మకి వేరే శతృవులు కావాలా :-) " నేను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నానండీ :-) :-) ఇంత మంచి మనవడు ఎవరికైనా దొరుకుతాడా అసలు?? :-) :-) ...ధన్యవాదాలు.
    @మంచు పల్లకీ: మా ఊరి వాళ్ళు ఒక్కరే అనుకున్నానండీ.. మీ ఊళ్లోనూ అంతే అన్న మాట.. !!!

    రిప్లయితొలగించండి
  37. స్త్రీజనుల నినాదాలు బాగున్నాయి. ఇటీవల అమెరికా విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలకి ఆటల్లో తగు ప్రాతినిధ్యం ఉండట్లేదని గ్రహించిన ఫెడరల్ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోమని తత్సంబంధ అధికారులకి ఆజ్ఞలిచ్చారు. పనిలో పనిగా తాడాటని విశ్వవిద్యాలయాలలో కాంపిటీషనుగా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనలు జరుగుతున్ణాయిట.

    రిప్లయితొలగించండి
  38. చిన్నతనం లో నేనూ అంతేనండీ..బళ్ళో కాదు కానీ ఇంట్లో బామ్మో, అమ్మమ్మో యేవో సామెతలు చెప్తూ వుంటారు ఆ సందర్భాల్ని బట్టి..అవన్నీ వినడం..పెద్ద ఆరిందా లాగా అత్తల దగ్గర, అమ్మ దగ్గర అనడం చచ్చేట్టు చీవాట్లు తినడం..

    రిప్లయితొలగించండి
  39. murali garu mee gnapakalu chala bagunnayi andi. emyndho ani edo RGV cinema range lo feel avvuthu chadiva :P

    రిప్లయితొలగించండి
  40. @కొత్తపాళీ: బాగుందండీ కొత్త విషయం.. ఎంతైనా తెల్లోళ్ళ తెలివితేటలే వేరు :):)
    @ప్రణీత స్వాతి: ఐతే సేం పించ్ అన్నమాట :-) ..ధన్యవాదాలండీ..
    @బాలు: ధన్యవాదాలండీ...

    రిప్లయితొలగించండి
  41. ఏవండీ మురళీ గారూ !మీకు బామ్మగారిని ఉడికించడం తప్ప వేరే ఆటలెం లేనట్టుందే...తాతగారి గారాబం మిమ్మల్ని మరీ చిన్నంతరం పెద్దంతరం తెలీకుండా చేసేసింది ఆఅయ్!పైగా బామ్మగారికి ఫాన్స్ ఉన్నారన్న భయమూ లేకుండా టపాలు రాసేస్తారా :) :)

    @ సుభద్ర గారూ ! ఈ ఆట నాకూ తెలీదండీ వివరంగా చెప్పినందుకు థాంక్స్ !

    రిప్లయితొలగించండి
  42. @పరిమళం: :-) :-) ..ధన్యవాదాలండీ..
    @హర్ష: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి