ఆదివారం, ఏప్రిల్ 17, 2011

సుమన్ పలికిన 'శుభం'

ఇదేమిటీ 'అల్లుడు పట్టిన భరతం' లాగా? అని కదా సందేహం. మరి ఏం చేయాలి? ఉత్తినే 'శుభం' అని టైటిల్ పెట్టేస్తే నేనేదో నా బ్లాగుకి శుభం పలికేస్తున్నానని కొందరైనా అనుకునే ప్రమాదాన్ని శంకించిన వాడినై ఇలా మొదలు పెట్టాల్సి వచ్చింది. సూటిగా చెప్పకుండా ఈ సుత్తేమిటీ అన్న సందేహానికి నా సమాధానం ఏమిటంటే, మూడు గంటల పాటు సుమన్ బాబు ప్రీమియర్ షో ని శ్రద్ధగా చూసి, ఆ వెంటనే టపా రాయడం అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

సినిమా నటీనటులెవరికీ సుమన్ బాబు-ఇంద్రనాగ్ ల ద్వయం తమ ప్రీమియర్ షో లలో అవకాశాలు ఇవ్వడం లేదన్న అపప్రదకి శుభం పలుకుతూ, సీనియర్మోస్ట్ కేరక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణని ఓ ముఖ్య పాత్రగా పెట్టి తీసిన తాజా ప్రీమియర్ షో నే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 'శుభం.' సుమన్ ప్రొడక్షన్స్ సంస్థ సగర్వంగా సమర్పిస్తున్న ప్రీమియర్ షోల పరంపరలో ముచ్చటగా మూడోది. ఎప్పటిలాగే ప్రధాన పాత్రని సుమన్ బాబు యధాశక్తి పోషించగా అతని బామ్మ అన్నపూర్ణమ్మగా అదోమాదిరి పాత్రని అన్నపూర్ణ కొంచం ఎక్కువగానే భరించింది.

టైటిల్స్ పూర్తవ్వగానే అనగనగా ఓ ఆఫీసు. అక్కడ పనిచేసే ఓ అరడజను మంది ఆడా మగా ఉద్యోగుల పరిచయం తో కథ ప్రారంభం. తోలుబొమ్మలాటలో కేతిగాడు బంగారక్కల్లా కనిపించిన ఆ ఉద్యోగులని చూడగానే 'ఇంటిని చూసి ఇల్లాలిని, స్టాఫుని చూసి బాసునీ' చూడాలన్న సామెత గుర్తొచ్చేసి, వీళ్ళే ఇలా ఉంటే సదరు బాసు ఇంకెలా ఉంటాడోనన్న కుతూహలం కలిగింది. సరిగ్గా అప్పుడే స్పోర్ట్స్ షూ లతో బిగింప బడ్డ పాదాలు, జీన్స్ ఫేంట్ కవర్ చేసిన కాళ్ళు, ఆపై ఓ ఎర్ర చారల టీషర్ట్ నుంచి ఉబికి వస్తున్న బొజ్జా..వీటన్నింటినీ ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ఆ పై బాస్ ముఖాన్ని క్లోజప్పుల్లో చూపించారు.

అస్సలు ఆశ్చర్యం కలగలేదు. ఆ బిల్డప్ చూడగానే అర్ధమైపోయింది, వచ్చెడు వాడు సుమన్ బాబు అని. అచ్చం నేనూహించినట్టుగానే జరిగింది. కొత్త విగ్గులో బాబుని అభిమానులు గుర్తుపట్టరేమో అని కాబోలు, పక్కనే పేరు కూడా రాశారు. బాస్ వసంత్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేత వసంత్. అదేమిటో కానీ, ఆయన తన చాంబర్ లో కూర్చున్నది మొదలు రకరకాల అమ్మాయిలు రావడం, స్వయంవరం కోసం వచ్చామని చెప్పడం. ఆయనేమో 'మురారి' సినిమాలో మహేష్ బాబులా వాళ్ళని ముద్దు ముద్దుగా విసుక్కోవడం. 'ఇద్దరు పిల్లల తండ్రిలా కనిపిస్తున్నాడు, ఇతగాడికి ఇంకా పెళ్లి కాలేదా?' అని సందేహం నాకు.

ఆఫీసు నుంచి నిప్పులు కక్కుతూ ఇంటికొచ్చి, తనకున్న ఏకైక పెద్ద దిక్కు బామ్మ అన్నపూర్ణమ్మ మీద నిప్పులు చెరుగుతాడు వసంత్. ఆ బామ్మేమో హాస్య భరిత పాత్రలో తెలంగాణా శకుంతలలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, పెళ్లి చేసుకోమని మనవణ్ణి ముద్దుగా విసుక్కుని, గోరుముద్దలు తినిపిస్తుంది. నెక్స్ట్ సీన్ హీరోయిన్ ఎంట్రీ.. ఇంట్లో కాదు, ఆఫీసులో. బోల్డన్ని క్లోజప్పుల్లో ఓ అమ్మాయిని చూపించేసరికి ఆవిడే హీరోయిన్ అని అర్ధమయ్యింది. ఆ అమ్మాయి హారిక (అంజు అస్రాని). ఆఫీస్ స్టాఫెవరూ పనిచేయడంలేదు కదా.. అందుకని పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయించడం కోసం బాస్ వైజాగ్ ఆఫీస్ నుంచి పిలిపించిన అకౌంటెంట్.

స్టాఫందరూ ఆమెని స్వయంవరంలో సెలెక్టయిన పెళ్లికూతురుగా అపార్ధం చేసుకోవడంతో, ఇదే అదనుగా భావించి ఆవిడ వసంత్ ని ప్రేమించేస్తుంది. (అతికష్టం మీద ఇచ్చిన సిగ్గెక్స్ప్రెషన్ పుణ్యమా అని ప్రేక్షకులు ఈ ప్రేమని అర్ధం చేసుకోగలుగుతారు.) నెక్స్ట్ సీన్ లో ఆవిడ వసంత్ ఇంటికి వెళ్తే, అక్కడ బామ్మ హారిక ని చూసి మనసు పారేసుకుని, మనవడంటే ఆ పిల్లకీ ఇష్టమేనని తెలుసుకుని, అతగాడిని పెళ్ళికి ఒప్పించాల్సిన బాధ్యతని ఆ పిల్ల మీద పెట్టేసి చేతులు దులిపేసుకుంటుంది.

వసంత్ తో కలిసి హోటల్ కి వెళ్లి కూల్ డ్రింక్ తనమీద పోసుకునీ, అతనితో షాపింగ్ కి వెళ్ళీ అతణ్ణి ప్రేమింపజేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది హారిక. ఇందులో భాగంగా అతణ్ణి తనకో చీర సెలక్ట్ చేసి పెట్టమంటుంది. నాలుగైదు మంచి చీరలు పక్కన పడేసి, అతను ఆరెంజ్ అని చెప్పిన ఎర్ర చీరనే కొనుక్కుని మర్నాడు ఆ చీర కట్టుకునే ఆఫీస్ కి వచ్చేస్తుంది హారిక. (ఇక్కడ రెండు విషయాలు.. అంత అర్జెంటుగా శారీ విత్ బ్లౌజ్ స్టిచింగ్ చేసిచ్చే టైలర్ ఎవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పండి ప్లీజ్. రెండో విషయం.. ఆ చీరలో లాంగ్ షాట్లలోనూ, క్లోజప్పుల్లోనూ హారికని జమిలిగా చూడగానే వసంత్ తప్పకుండా 'ఇందువదన కుందరదన' అని పాటేసుకునేవాడు, చిరంజీవి తొందరపడి ఉండకపోతే)

మొత్తానికి హారిక కృషి వల్ల కన్నా, కాశీ వెళ్లిపోతానన్నబామ్మ బెదిరింపులకి లొంగి హారిక తో పెళ్ళికి ఒప్పుకుంటాడు వసంత్. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళిలో కూల్డ్రింక్స్ అందించిన ఓ బీద అమ్మాయిని చూసి పద్దెనిమిది క్లోజప్ షాట్లలో స్టన్నయి పోతాడు పెళ్ళికొడుకు. అప్పుడొచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలిసేదేమిటంటే, ఈ బీదమ్మాయి రాధ ('అందం' ఫేం భావన) గతంలో వసంత్ బీదవాడుగా ఉన్నప్పుడు అతను పెళ్లి చేసుకున్న గొప్పింటి అమ్మాయి అనీ, ఇతని బీదరికం భరించలేక విడిచి పెట్టి వెళ్లిపోయిందనీ, మనవడిని ఏకాకిగా చూడలేక రాధ చనిపోయిందని అబద్ధం చెప్పి బామ్మ అతణ్ణి రెండో పెళ్ళికి ఒప్పించిందనీను. కాస్త ఊరట ఏమిటంటే రాధ 'చనిపోయిందన్న' విషయం హారికకి తెలుసు.

పాపం, మనవడు రాధా రాధా అని కలవరిస్తున్నా, 'రాధ బతికున్నా చచ్చినట్టే, హారికే నీ భార్య' అని తేల్చి చెప్పి కాశీ యాత్రకి వెళ్ళిపోతుంది బామ్మ. (కాల్షీట్లు లేకపోవడం వల్ల అనుకుంటా, తర్వాత మళ్ళీ కనిపించలేదు..) "ముళ్ళ దారిలో మూడు ముళ్ళ బంధం.." అంటూ ఓ నేపధ్య గీతం. గాయకుడెవరో జేసుదాస్ లా ఫీలవుతూ పాడాడు. మన 'నాన్ స్టాప్ కామెడీ' ఫేం భోలేషా వలీ మ్యూజిక్. ఏమాటకామాట, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. రాధని వెతుక్కుంటూ వెళ్ళిన వసంత్ కి తన తండ్రి మరణం, ఆస్తి దివాలా తదితర ఫ్లాష్ బ్యాక్ అంతా వివరంగా చెప్పేసి "మీ లాంటి ఉత్తముడికి నేను భార్యగా తగను, హారికే మీ భార్య" అనేస్తుంది రాధ.

అసలు రాధ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోతానంటుంది కానీ మంచివాడు మరియు సున్నిత మనస్కుడైన వసంత్ ఒప్పుకోడు. ఆమె ఊళ్ళో ఉంటేనే తను హారికతో కాపురం చేస్తానని మారాం చేసి, మాట నెగ్గించుకుంటాడు. కట్ చేస్తే, పండు వెన్నెల, మల్లెపూలతో అలంకరించిన మంచం, మంచానికి ఓ చివర బితుకు బితుకుమంటూ వసంత్. పాలగ్లాసుతో హారిక ఆగమనం. (ఇక్కడ 'అయిగిరినందిని..' స్తోత్రం ఉంటే అద్దిరిపోయేది.. ప్చ్.. ఈసారి తొందరపడ్డది కళాతపస్వి, ఏమీ అనలేం..) హారిక మాత్రం బోల్డంత విశాల హృదయం కలదై, వసంత్ తనని పూర్తిగా ప్రేమించేందుకు టైం ఇస్తుంది.

రాధ విషయం హారిక తండ్రికీ, ఆ తర్వాత హారికకీ తెలిసిపోతుంది. హారిక తండ్రి -- సగటు తెలుగు సినిమా హీరోయిన్ తండ్రిలా -- రాధని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపొమ్మని బెదిరిస్తాడు. హారికేమో ఎన్నో పాత సినిమాల్లోలాగా కొంగు చాపి "నాకు పతి భిక్ష పెట్టవా అక్కా" అని రాధని బతిమాలుకుంటుంది. ఎట్టకేలకి హారిక తను త్యాగం చేసేయాలని నిర్ణయించుకుంటుంది. అది చూసి తట్టుకోలేక రాధ ప్రాణాపాయం లోకి వెళ్ళిపోతుంది. (ఈ దశలో నేను వసంత్ చివరికి 'శ్రీవారి ముచ్చట్లు' లో అక్కినేనిలా మిగిలిపోతాడేమో అని అనుమానించాను). 'అంకితం' 'ఐలవ్యూ డాడీ' ల్లో లాగే కథ హాస్పిటల్ కి చేరుతుంది.

డాక్టర్ ఇద్దరు పేషెంట్లనీ బతికించేస్తాడు. వసంత్ ఇద్దరు భార్యల సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అన్న అయోమయంలో ఉండగా, దర్శకుడు ఇంద్రనాగ్ స్వయంగా వచ్చి, తనని తాను పరిచయం చేసుకుని, కథకి భరతవాక్యం పలికించేస్తాడు. ఎప్పటిలాగే, ఎండ్ టైటిల్స్ రోలవుతుండగా పూజాదికాలు మొదలు షూటింగ్ విశేషాలు చూపించేశారు. గత రెండు షోలలా కాకుండా, ఈసారి ఇంద్రనాగ్ సుమన్ బాబు పాదాలకి నమస్కరించలేదు. సుమన్ బాబు పక్కనే రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు. నెక్స్ట్ షో కి దర్శకుడు మారతాడో ఏమిటో.

ఎప్పటిలాగే సుమన్ బాబు చొక్కాలు, టీ షర్ట్లు చాలా బాగున్నాయి. ఎప్పటిలాగే మిగిలిన పాత్రలన్నీ వసంత్ మంచితనాన్ని శక్తి వంచన లేకుండా పొగిడాయి. ఎప్పటిలాగే కథానాయకుడు జరుగుతున్న వాటితో తనకి సంబంధం లేనట్టుగా నిర్వికారంగా చూస్తూ ఉండగా, అలా అలా సన్నివేశాలు వచ్చి కథని నడిపించేశాయి. బాబు వాడిన కొత్త విగ్గు బాగుంది. అది పాడవ్వనివిధంగా నటించడమూ బాగుంది. ఈసారైనా ఇలా ప్రీమియర్ షో కాకుండా భారీ జానపద చిత్రం తీస్తే బాగుండును.

57 వ్యాఖ్యలు:

 1. paapam pasibidda suman ante endukandi meeku antha kopam?
  mee visleshna baavundi

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అరే మిస్సయ్యానే అనుకుంటే మీరే గుర్తొచ్చారు. అనుకున్నట్టుగానే చక్కగా ఒక్క దృశ్యము (సుమన్ ఏ రంగు టీ-షర్ట్ ఏ సీనులో వేసుకున్నాడుతో సహా) వదలకుండ రాసి ఆనందం కలిగించారు. మీకు నిజంగానే చాలా ఓపికండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చమత్కార భరితమైన మీ రివ్యూతో మమ్మల్ని నవ్వుల్లో ముంచారు:):):)ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అబ్బబ్బా.. మురళీ గారూ.. తెగ నవ్వించేసారండీ! చెణుకులన్నీ అదిరిపోయాయి.. :D ఈ సినిమా చూసి ఎవరన్నా రివ్యూ రాస్తారో లేదో అనుకున్నానండీ.. పోయినసారి 'ఐ లవ్యూ డాడీ' సినిమా రివ్యూ బులుసు గారూ, రాజ్ కుమార్ గారూ రాస్తే, ఈసారికి ఆ పుణ్యం మీరు కట్టుకున్నారు. :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Loka kalyanam kosam meeru moodu gantala premiere show ni arasecanu kuda miss vakunda chusi ilanti tapa rasinanduku meeku na abhinandanalu.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హ్హహ్హ.. నేను సినిమా చూడలేకపోయానే అని తెగ బాధపడిపోయా(!).. మీ "శుభ" రివ్యూ వల్ల ఆ లోటు తీరిపోయింది..
  చిన్న కొరతేంటంటే, బాబు వాడిన క్రొత్త విగ్గు చూడలేకపోవడం.. :P
  ఎవరైనా యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే నాకో మెయిల్ కొట్టండి.. చూసి తరిస్తా.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Awesome review !
  అసలు సుమన్ బాబు మీద మీకున్న అభిమానం వామ్మో మురళి గారు చెప్పతరం కాదు ;)
  ఈసారి ఇంద్రనాగ్ సుమన్ బాబు పాదాలకి నమస్కరించలేదు. సుమన్ బాబు పక్కనే రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు
  --------------------
  LOL ఇది చదివి నాకు అసలు నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది బాబోయ్ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఛ, నా పాపానికి నిష్కృతి లేదు. ఇంత మహత్తర కుటుంబ కధా చిత్రాన్ని చూడటం ఎలా మర్చిపోయానో అర్ధం కావటం లేదు. పోనీ మళ్ళీ టెలికాస్ట్ అయినప్పుడు చూద్దాం లే అనుకుందామా అంటే ఇది జీవితం లో ఓకే సారి వచ్చే అరుదైన, అపురూపమైన, అద్భుతమైన అవకాశం. రెండు వారాల ముందు నించీ ఈ సినిమా చూడాలని ఈ సినిమా చూడాలి అనుకుని అనుకుని కరెక్ట్ గా ఆ శుభ ఘడియలు వచ్చేసరికి ఆ సంగతే మర్చిపోయా.

  ఎంతైనా మీరు అదృష్టవంతులు మాస్టారూ...మీరు అదృష్టవంతులు. సుమనోహరమైన నటనా పటిమను చూసి తరించారు. నాకా అదృష్టం ఎప్పుడో? ఏమిటో?

  నెక్ట్స్ మీ కోరిక మేరకు సుమన్ బాబు గులేబకావళి కధ ని రీమేక్ చేసి జిలేబీ "కావలి" కధ అని తీస్తే బాగుంటుంది. లేదా వీర పౌరాణికం "కౌరవ వనవాసం" (ఇది కేవలం సుమన్ మాత్రమే తీయగల, చేయగల అద్భుత పౌరాణిక కళా "ఖండం".

  ప్రత్యుత్తరంతొలగించు
 9. LOL..సుమన్‌బాబు గారి సినేమాలన్ని వదలకుండా వరసబెట్టి చూస్తున్నారంటే మీ సహనం పతాక స్థాయికి చేరిందన్నమాటే

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీకు ఎంత ఓపిక సార్! ఇటువంటి షో చూసాక కూడా ఎటువంటి మతిభ్రమణానికి లోను కాకుండా ఇంత చక్కని రివ్యూ రాసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. సరిగ్గా అప్పుడే స్పోర్ట్స్ షూ లతో బిగింప బడ్డ పాదాలు, జీన్స్ ఫేంట్ కవర్ చేసిన కాళ్ళు, ఆపై ఓ ఎర్ర చారల టీషర్ట్ నుంచి ఉబికి వస్తున్న బొజ్జా..వీటన్నింటినీ ముక్కలు ముక్కలుగా చూపిస్తూ ఆ పై బాస్ ముఖాన్ని క్లోజప్పుల్లో చూపించారు>>>>

  మళ్ళీ ఇలాగే ఎంటర్ అయ్యాడా?(ఐ లవ్ యు డాడీ లో కూడా సేమ్ కదా?) సూపరు...
  (ఇక్కడ 'అయిగిరినందిని..' స్తోత్రం ఉంటే అద్దిరిపోయేది.. ప్చ్... >>>
  కేక.. కేక..

  ప్చ్.. ఈ సారి మిస్సయిపోయానండీ... మళ్ళే ఎప్పుడూ రిలీజ్ చేస్తారో గానీ??


  మీ రివ్యు అద్ద్రిరి పోయిందండీ... మూడు గంటలు ఎలా భరించారు?? :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. వ్రాసేసారా?

  ఏదో లాగా టి.వి లో సుమన్ బాబు ప్రీమియర్ షోలని తప్పించుకోగలుగుతున్నాం కానీ మీ రివ్యూలని మాత్రం తప్పించుకోలేకపోతున్నామండి్:)) మీరు ఎంత సుమన్ బాబు వీరాభిమానులయినా..మీకు ఎంత తెలుగు బ్లాగర్ల మీద కోపం..ద్వేషం ఉన్నా మరీ ఇలానా తీర్చుకోవటం!!

  ఇది కూడా చదవకుండా ఉండొచ్చుగా అంటారా..అది మాత్రం చెయ్యలేం మరి!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. అవునూ, అసలు ఇంతటి మహానటుడిని, "ఓంకార్" ని కలిపి వీళ్ళిద్దరి స్వీయ దర్శకత్వం లో ఒక అపూర్వ హాస్య, సంగీత, కరుణ రస హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆ సినిమా పేరు రక్తాక్షరాలతో లిఖించబడదూ? ఓ సారి ఆలోచించి చూడండి. ఆ ఆలోచనకే మీ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోకపోతే నన్నడగండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఈసారైనా ఇలా ప్రీమియర్ షో కాకుండా భారీ జానపద చిత్రం తీస్తే బాగుండును.

  మేమేం పాపం చేసామండీ ... ఇది మీకు తగునా .. ఇలాంటి వింత కోరికలు కోరుకుంటార .. తధాస్తు దేవతలు వింటే .. : (

  నా ఫ్రెండ్ రాజ కుమారు .. పాపం సినిమా చూడకుండా రివ్యు రాస్తే మీరు ప్రాణాలకి తెగించి సినిమా చూసి రాసార .. మీరు భగవంతుడు అండి

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఐ లవ్ యూ డాడీ చూసి మళ్ళీ ధైర్యం చేయలేక శుభం చూడలేదు. మీ శౌర్య ధైర్యాలను మెచ్చుకుంటున్నాను. మీ రివ్యూ చదువుతుంటే సుమనుడి దివ్యమంగళ స్వరూపం నా ఎదుట సాక్షాత్కరించింది. సినిమా కళ్ళకు కట్టినట్టు కనిపించేసింది.

  సుమన్ కి జై. మురళి గార్కి జై జై జై

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మీ ధైర్యానికి,ఓపికకి,సహనానికి నా జోహార్లు!! అయినా ఎందుకండీ మీకు సుమన్ బాబు అంటే అంత ఇష్టం! :))) అబ్బ హీరో ఇంట్రడక్షన్ ఏం వర్ణించారని!! కెవ్వ్!! నిజ్జం చెప్పాలంటే రాజ్కుమార్ అనే బజ్జ్ ఫ్రెండ్ అల్రెడీ ఈ అద్భుత చిత్రరాజం గురించి ముందస్తుగా చెప్పినా దీన్ని చూద్దమని ఎంత ప్రయత్నించినా....నా అద్రుష్టమో,దురద్రుష్టమో చూడలెకపోయా!! :( మీ రివ్యూ మాత్రం సూపర్! ఈ రివ్యూ సుమన్ చూస్తే మిమ్మల్ని తన నెక్స్ట్ మూవీ కి కథ,మాటలు అందించమంటే.......ఇక మీ పంట పండినట్టే ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. హిహ్హిహ్హి.. ఇంద్రనాగ్ భరత వాక్యం ఏమో కానీ మీ టాపాకి రాసిన భరత వాక్యం మాత్రం అదుర్స్.. ఎప్పటిలాగానే నేను కూడా బాగా ఎంజాయ్ చేసాను మీ టపాని:)

  శంకర్ గారి వ్యాఖ్య చూసి ఎంతగా నవ్వుకున్నానో నాకే తెలీదు.. అయ్యబాబోయ్..
  >>గులేబకావళి కధ ని రీమేక్ చేసి జిలేబీ "కావలి" కధ
  >>వీర పౌరాణికం "కౌరవ వనవాసం"
  >>అసలు ఇంతటి మహానటుడిని, "ఓంకార్" ని కలిపి వీళ్ళిద్దరి స్వీయ దర్శకత్వం లో ఒక అపూర్వ హాస్య, సంగీత, కరుణ రస హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది?
  >>తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆ సినిమా పేరు రక్తాక్షరాలతో లిఖించబడదూ
  మాటల్లేవ్... కెవ్వు అయిడియాలు.. బాబోయ్.. నా గుండె నిజంగా ఆగిపోయింది. ఎప్పుడు కొట్టుకోడం మొదలెట్టిందో తెలీలేదు..;)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. "గత రెండు షోలలా కాకుండా, ఈసారి ఇంద్రనాగ్ సుమన్ బాబు పాదాలకి నమస్కరించలేదు. సుమన్ బాబు పక్కనే రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు. నెక్స్ట్ షో కి దర్శకుడు మారతాడో ఏమిటో. "
  :))))

  ప్రత్యుత్తరంతొలగించు
 19. wow !! hilarious review . I missed it again.

  Konchem video theesi Youtube lo petttachu kadandi.

  And suman ki comedy roles best anukunta..endukante pratyekam ga comedy cheyyakkarledu..athani maata,navvu,nadak,wig ivi chalu janam navvadaniki.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. మన బ్లాగర్ల రివ్యూలు చదివి చదివీ, నవ్వి నవ్వీ, నేను నిఝంగా సుమన్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నాను! (అంటే ఇంత దూరం ఎలాగూ నేను చూడనుగా-హి హి హీ...)
  మురళి గారూ, రివ్యూ ఇంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుందో!
  ఓపిగ్గా సినిమా చూసి మమ్మల్ని నవ్వించినందుకు ధన్యవాదాలు.
  ఇంకా ఎవరెవరండీ ఈ సినిమాకి రివ్యూ రాసింది?
  శారద

  ప్రత్యుత్తరంతొలగించు
 21. మీకెంత గుండే నిబ్బరమండీ...అసలు మీరు సుమన్ బాబుకి ఇంత పెద్ద ఫేన్ అని నాకిప్పుడే తెలిసింది. చెణుకులు అదిరాయి...బాగా నవ్వించారు. ఈ ప్రీమియర్ షో లు కాకుండా భారీ జానపద చిత్రం కావాలా....మీ స్టామినా మాములుది కాదు బాబోయ్...లాభం లేదు మీకు వీరతాళ్ళు వెయ్యాల్సిందే!

  ప్రత్యుత్తరంతొలగించు
 22. క్షమించండి మురళి గారూ, ఈ అంశం మీద మీ టపా చదివేంత ఓపిక కూడా నాకు లేదు. చదవకుండానే కామెంట్ వ్రాస్తున్నాను.
  మీరు ఈ టి వి లో పని చేస్తున్నారా??????
  నిజమే అయ్యుంటుంది. లేకపోతే మీరెందుకు చూస్తారు?
  నాకు శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో పొట్టి ప్రసాద్ గుర్తొస్తున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. సారీ, శ్రీవారికి ప్రేమలేఖ కాదు చంటబ్బాయి అనుకుంటా, అందులో శ్రీలక్ష్మి వ్రాసినవన్నీ చచ్చినట్టు ప్రచురిస్తాడు పొట్టి ప్రసాద్.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. ఇదా కథ. నేను ఆది, అంతం చూడలేదు. మధ్యలో చూశాను. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూడగలిగే మీలాంటి అభిమాని దొరకడం శ్రీ సుమన్ బాబు గారి అదృష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. chala baga rasaru...migata post lu kuda nemmadiga chaduvutanu...

  http://kallurisailabala.blogspot.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 26. సుమన్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుల వారు వర్ధిల్లాలి..:)...ఈ సారీ మిస్సయ్యానండి:(షో ని చూసే సుభ ఘడియల కోసం ఎదురు చూడ్డం..ఏ వో కొన్ని పనుల వల్ల చూళ్ళేక పోవడం...ఇంతలో మీ రివ్యూ చదివా....అహా..ఎంత బాగా చెప్పారు అండి...మీ కళ్ళతో మాకు ప్రీమియర్ షోని చూపించారు...జన్మ ధన్యమైంది... మీ రివ్యూ షో కన్నా సూపర్ హిట్ అండీ...మరొక్క సారి అధ్యక్షా మీకు జోహార్లు...

  ప్రత్యుత్తరంతొలగించు
 27. నేనూ సుమన్ బాబు వీరాభిమానినేనండీ. ఇదివరకే నా మాజీ బ్లాగులో ఆ మహానటుడి గురించి రాసుకున్నాను.
  http://santosh-surampudi.blogspot.com/2008/05/blog-post_12.html

  @ మురళీ గారు... మనం ఈసారి సుమన్ బాబుకి కటౌట్ కట్టి దండేసి దణ్ణం పెట్టేద్దామండీ
  -సంతోష్ సూరంపూడి

  ప్రత్యుత్తరంతొలగించు
 28. ఈ సినేమా చూడటమే కాకుండా, దానిని తిరిగి రెండవసారి గుర్తుకు తెచ్చుకొని, అందులోను సుమన్ గారి దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళ ముందు ఊహించుకొంట్టూ ఇంత పెద్ద టపా రాయటాన్ని చూస్తుంటే. మీరు మాములు వారు కాదు మహప్రభో! మీకు నెమలి కన్నే కాదు మీదగ్గర "ఇనుపగుండె" ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. నేను ఆఫీసు లో కూర్చొని చదవటం వళ్ళ తృప్తిగా నవ్వుకో లేకపోయాను కానీ నవ్వు అపుకోవటానికి ఎంత కష్టపడవలసి వచ్చిందో తెలుసా మురళి గారు. వీలయితే ఇంటికెళ్ళాక మళ్లీ ఒకసారి చదవాలని డిసైడ్ అయ్యాను. నిజంగా మీకు ఎంత ఓపిక అండి బాబు. మేమే ఇంతలా నవ్వితే బహుశ రాసేటప్పుడు మీరు ఇంకా బాగా నవ్వుకొని వుంటారు కదా. ఏదేమైనా ఈ టపా చూసాక కామెంట్స్ రాయకుండా వుండటం నా వాళ్ళ కాలేదు. నిజం చెప్పాలంటే అందరి కామెంట్స్ చూసాక మీ రెస్పొన్సెస్ కూడా చూడాలని వుంది నాకు. మీకు డబల్ హాట్స్ ఆఫ్ ఒకటి ఓపికగా చూసి నందుకు రెండోది బాగా రాసినందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. హ హ్హ.. నిద్రపోయే ముందు చదువుతూ గట్టిగా నవ్వుతుంటే మా రూం మేట్ భయపడి తుమ్ హస్నా బంద్ కరో అని రెండు సార్లు గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేసేది లేక హాల్ లోకి వెళ్ళిపోయాడు

  బాబోయ్ కేక పోలికలు అసలు.. పోస్ట్ పొలికేక :)
  Good one!

  ప్రత్యుత్తరంతొలగించు
 31. @రిషి: పసిబిడ్డ :)) ..నాకు కోపమేమీ లేదండీ, అభిమానం అంతే... ధన్యవాదాలు..
  @జేబీ: మరో రెండు నెలల్లో మరో సినిమా రావొచ్చు.. అప్పుడు మిస్సవ్వకండి మరి.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 32. @cenima: ధన్యవాదాలండీ..
  @మధురవాణి: యెంత రాసినా చూసినదానికన్నా తక్కువేనండీ.. ధన్యవాదాలు.
  @sravs: అబ్బే.. లోక కల్యాణం కోసమేమీ కాదండీ, కేవలం నా ఆనందం కోసమే చూశాను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. @మేధ: మీరు చూడలేక పోవడం ఏమిటండీ?? మీరే చూడక పొతే ఇంకెవరు చూస్తారసలు?? ఇంకోసారి ఇలా చేస్తే ఒప్పుకోనంతే :)) ..ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: నిజమండీ.. గత రెండుమార్లూ స్క్రిప్ట్ సుమన్ బాబు చేతికిచ్చి, కాళ్ళకి నమస్కరించాడు.. ఈసారలా చేయలేదు మరి.. ధన్యవాదాలు.
  @SHANKAR.S: నా వోటు జిలేబీ కావలి కథకేనండీ.. ఎందుకో తెలుసా?? "కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..." :)))) ...మీ ఓంకారోలోచన బాగుంది కానీ, ప్రాక్టికల్ గా కష్టమండీ.. బాబు మల్టి స్టారర్లకి ఒప్పుకోక పోవచ్చు :)) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: మరేం చేయమంటారు చెప్పండి.. కామెడీకి పెద్ద దిక్కెవరూ లేకుండా పోయారు :(( ..ధన్యవాదాలు.
  @Venhu: హాయిగా నవ్వుకుంటూ చూశానండీ.. ధన్యవాదాలు.
  @వేణూరాం: కాకపొతే అక్కడ ఫుల్ స్లీవ్స్ షర్ట్ అండీ.. చుట్టూ ఓ అరడజను మంది ఉండగా, అందరికీ నమస్కరించుకుంటూ వచ్చాడా.. ఈసారి మాత్రం ఒంటరిగా vachchi, నమస్కారం చేసిన వాళ్లకి మాత్రమే ప్రతి నమస్కారం చేశాడు.. మళ్ళీ రిలీజ్ ఉండదండీ :((.. మరో ప్రీమియర్ షో చూడాల్సిందే..

  ప్రత్యుత్తరంతొలగించు
 35. @సిరిసిరిమువ్వ: నేను గతసారి 'ఐలవ్యూ డాడీ' పూర్తిగా చూడలేక పోవడం వల్ల టపా రాయలేక పోయానండీ.. ఈసారి చూడగలిగాను, రాయగలిగాను.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ధన్యవాదాలండీ.
  @కావ్య: భారీ సెట్టింగులతో ఓ క్లాసికల్ జానపద సినిమాని స్వీయ దర్శకత్వంలో తీయాలన్నది బాబు కోరికండీ.. అప్పుడెప్పుడో ఓ ఇంటర్యూ లో చెప్పారు.. కాబట్టి ఇదేమీ వింత కోరిక కాదని గమనింప ప్రార్ధన :) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. @బులుసు సుబ్రహ్మణ్యం: మీరు కూడా చూసి ఉంటే బాగుండేదండీ :)) ..ధన్యవాదాలు.
  @ఇందు: దురదృష్టమేనండీ.. దురదృష్టమే :)) కాసేపైనా చూసి ఉండాల్సింది మీరు.. ధన్యవాదాలు.
  @మనసు పలికే: చూసారా, సుమన్ బాబుని తలచుకోగానే అందరికీ ఎలాంటి ఐడియాలు వచ్చేస్తున్నాయో... :)) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. @S: పాయింటే కదండీ :)) ..ధన్యవాదాలు.
  @స్వాతి: నిజమేనండీ. తను పలికించాలని ప్రయత్నించే ఏ ఎమోషన్ అయిన చివరికి కామెడీగా రూపాంతరం చెందుతుంది.. ధన్యవాదాలు.
  @శారద: నిజమేనండీ.. చాలా హాస్య భరితంగా ఉంది.. 'శుభం' కి ఇంకా ఎవరూ రాసినట్టు లేరండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. @ఆ.సౌమ్య; 'జానపద చిత్రం' నా కోరిక కాదండీ, సుమన్ బాబు ఫ్యూచర్ ప్లాన్.. రిలీజై తీరుతుంది :)) ..ధన్యవాదాలు.
  @బోనగిరి: లేదండీ, ఈటీవీతో నాది కేవలం ప్రేక్షక సంబంధం మాత్రమే.. బహుశా అక్కడ పనిచేసే వాళ్ళలో చాలామంది చూసి ఉండకపోవచ్చు కూడా.. సుమన్ కామెడీ కోసం అతని ప్రోగ్రాములు చూస్తాను నేను.. ఆ కామెడీని ఇష్టపడే వారు మరికొందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారితో పంచుకోవడం కోసం టపా.. కాబట్టి మీరన్న పొట్టి ప్రసాద్ పోలిక వర్తించదు నాకు.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 39. @శిశిర: ఆయన పంచే హాస్యం ముందు నాదెంత చెప్పండి?? :)) ..ధన్యవాదాలు.
  @కల్లూరి శైలబాల: 'వార్త' లో మీ కథనాలు చదివానండీ.. మీ టపాలు కూడా చదువుతాను.. అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
  @స్నిగ్ధ: అబ్బే.. ఈ పదవులూ అవీ ఎందుకండీ.. బాబు అప్పుడప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనక్కొంచం రిలీఫ్.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. @life is beautuful: ధన్యవాదాలండీ..
  @పక్కింటబ్బాయి: "నా మాజీ బ్లాగులో ఆ మహానటుడి గురించి రాసుకున్నాను.." :)) చదివానండీ.. అసలు పేర్లతోనే రాసి ఉండాల్సింది.. మొత్తానికి 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' చూసి తరించారన్న మాట!! కటౌట్లూ అవీ బాబుకి ఇష్టం ఉండవనుకుంటానండీ.. ..ధన్యవాదాలు.
  @శ్రీకర్: నాది మామూలు గుండేనండీ, మీరు అనవసరంగా భయపడుతున్నారు!! ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. @కరుణ: నిజమేనండీ, చూస్తూ యెంత ఎంజాయ్ చేశానో, రాస్తూ కూడా అంతగానూ ఎంజాయ్ చేశాను.. ధన్యవాదాలు.
  @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 42. మురళి గారు, మీలాంటి అరుదైన అభిమాని దొరకడం సుమన్ బాబు, తెలుగు ప్రేక్షకులు చేసుకున్న జన్మ జన్మల పుణ్యం. ఈ సంధర్భంగా భీభత్స అభిమానులైన మీరు, రాజ్ కుమార్, శిశిర గారు, బులుసు గారు మొదలైన ఉద్దండులనుండి సుమన్ అభిమాన సంఘానికి అధ్యక్షులను ఎన్నుకోవాలని నిశ్చయించాము......శిశిర గారి సలహా మేర మిమ్మల్ని అధ్యక్ష పదవిని అలంకరించమని, బాబు గారి తదుపరి చిత్రరాజములకు సమీక్షలు రచించవలెనని సవినీయ మనవి.... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 43. మురళీ గారు జీవితం ఎంతో విలువైనదండీ .ఎక్సెట్రా ఎక్సెట్రా ........మీరిలా మాటి మాటికీ సుమన్ బాబు సినిమాలు చూస్తూ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటే మీమీద కె.పి.సి 145236 సెక్షన్ కింద కేసు పెట్టేస్తారు జాగ్రత్త.

  ప్రత్యుత్తరంతొలగించు
 44. ఇక్కడేవిటేవిటో...చాలా....చా ఆ ఆ లా ఆ ఆ....చాలానే జరిగిపోయిందే... నేను సుమన్ బాబు ని కలుద్దామనుకుంటున్నానండి:)

  ప్రత్యుత్తరంతొలగించు
 45. * ఉత్తినే 'శుభం' అని టైటిల్ పెట్టేస్తే నేనేదో నా బ్లాగుకి శుభం పలికేస్తున్నానని కొందరైనా అనుకునే ప్రమాదాన్ని శంకించి...
  * ఎర్ర చారల టీషర్ట్ నుంచి ఉబికి వస్తున్న బొజ్జా.
  * కొత్త విగ్గులో బాబుని అభిమానులు గుర్తుపట్టరేమో అని కాబోలు, పక్కనే పేరు కూడా రాశారు.
  * అతను ఆరెంజ్ అని చెప్పిన ఎర్ర చీరనే కొనుక్కుని...
  * కాల్షీట్లు లేకపోవడం వల్ల అనుకుంటా, తర్వాత మళ్ళీ కనిపించలేదు..
  * నెక్స్ట్ షో కి దర్శకుడు మారతాడో ఏమిటో.
  * ఎప్పటిలాగే కథానాయకుడు జరుగుతున్న వాటితో తనకి సంబంధం లేనట్టుగా నిర్వికారంగా చూస్తూ ఉండగా

  హ హ - చాలా బాగుందండి మీ రివ్యూ. ఆ మధ్యన విజయేంద్ర వరం కి, ఒక్క మగాడు కి చదివాను ఇంత సరదా రివ్యూలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 46. @నాగార్జున: అబ్బే.. ఈ పదవులూ అవీ ఎందుకండీ.. బాబు అప్పుడప్పుడూ ఇలా సినిమాలో ప్రీమియర్ షోలో చేస్తూ ఉంటే చాలు :)) ..ధన్యవాదాలు.
  @లలిత: మీరందరూ కలిసి బాబుకి వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు కూడా చేస్తున్నారా?!! అన్యామండీ అన్యాయం...:)) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 47. @జయ: తప్పకుండా కలవండి.. జానపద సినిమా విషయం అడగడం మర్చిపోకండీ :)) ..ధన్యవాదాలు.
  @సందీప్: అబ్బే.. ఎవరితోనూ పోల్చడానికి లేదండీ.. నటనలో బాబుదో విలక్షణ శైలి.. ఇనిమిటబుల్ అన్నమాట!! ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 48. ha ha ...

  chaalaaa rojula taruvata blogs chustunna ..bhale undi..
  chedarani viggu,maare director abbo bhramdham.

  ప్రత్యుత్తరంతొలగించు
 49. Please anyone tell me where can I get the DVDs are at least youtube links of Suman premiere show movies.

  ప్రత్యుత్తరంతొలగించు
 50. @సుభద్ర: అవునండీ.. బాబు ప్రోగ్రాం అంటే కామెడీకి లోటుండదు.. ధన్యవాదాలు.
  @కేవికే: అబ్బే.. డీవీడీలూ అవీ దొరకవండీ.. టీవీలో వచ్చినప్పుడు ఎన్ని పనులున్నా మానుకుని చూడాల్సిందే.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 51. నాకో డౌటండీ, చదువుతుంటేనే ఇంత కామెడీ గా ఉంది, ఆయన సహ నటీనటులు అంత దగ్గరగా ఆయన నట విశ్వరూపం చూసీ నవ్వకుండా అలా లీనమై ఎలా నటిస్తారు?

  ఆయన నటించడం మొదలయ్యాక ఈటీవి చూడటం బంద్ చేసేసాం.

  మీ రివ్యూ మాత్రం సూపర్.

  శ్రీరాగ

  ప్రత్యుత్తరంతొలగించు
 52. మన తప్పులకు దేవుడు ఏదో ఒక రూపం లో శిక్షిస్తాడు .. పాపం రామోజీ

  ప్రత్యుత్తరంతొలగించు
 53. @పక్కింటబ్బాయి
  >>@ మురళీ గారు... మనం ఈసారి సుమన్ బాబుకి కటౌట్ కట్టి దండేసి దణ్ణం పెట్టేద్దామండీ

  మీరు కటౌట్ పెట్టాక, మా పశ్చిమగోదావరి కళాపోషకుల తరుపున ఒక గజమాల. నిర్వాహకులు ఒప్పుకుంటే రవీంద్రభారతిలో సన్మానం. నవయుగ నటనా చక్రవర్తి బిరుదు ప్రధానం.

  ప్రత్యుత్తరంతొలగించు
 54. @శ్రీరాగ: నాకూ అదే డౌట్ వస్తుందండీ.. :)) ధన్యవాదాలు.
  @బుద్దా మురళి: వీటివల్ల ఆర్ధిక నష్టం అయితే ఏమీ ఉన్నట్టు అనిపించడం లేదండీ.. కాబట్టి శిక్ష అనుకోలేమేమో! ..ధన్యవాదాలు.
  @శ్రీ: ఆగండాగండి.. 'మమత' చూసి అప్పుడు డిసైడ్ చేద్దురు గాని :)) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు