మంగళవారం, జూన్ 09, 2009

కావ్యా's డైరి

"కావ్యాస్ డైరీ బాగుందిట.. ముఖ్యంగా సెకండాఫ్.." ఫోన్ పెట్టేసే ముందు మిత్రుడు చెప్పిన మాట ఇది. మహేశ్ బాబు కూడా ఇదే మాట చెప్పాడు టీవీల్లోనూ, పేపర్లలోనూ.. అసలేముందీ సెకండాఫ్ లో.. తెలుసుకోవాలంటే మొదటి సగం కూడా చూడాల్సిందే కదా.. నాకు మహేశ్ బాబు మాట మీద కన్నా, నా మిత్రుడి మాటమీదే గురెక్కువ..ఫలితం.. చలో 'కావ్యా's డైరి'

నాకేంటో సినిమా మొదలవ్వక ముందే వెళ్లి థియేటర్లో కూర్చుంటే తప్ప సినిమా చూసినట్టుండదు. ముందు వేసే ప్రకటనలు కూడా మిస్సవ్వకుండా చూస్తాను. అలాంటిది నేను వెళ్ళేసరికే పట్టుచీరల షాపు వాళ్ళ ప్రకటన అయిపోయింది. ఇందిరా ప్రొడక్షన్స్ లోగో చూపించి వెంటనే ఓ నల్ల చొక్కా వేసుకున్న వాడిని వెనుకనుంచి చూపించారు.. సినిమా వాళ్లకి బోల్డన్ని సెంటిమెంట్లు కదా ఈ నల్ల చొక్కా ఏమిటీ, మొదటిదే బ్యాక్ షాట్ ఏమిటీ అని ఆలోచిస్తున్నానో లేదో కారు గుద్దేసి ఆ నల్ల చొక్కా వాడు చనిపోయాడు.. టైటిల్స్ మొదలయ్యాయి.

పూజ (మంజుల) ది 'రాగాలా సరాగాలా' టైపు సంసారం. భర్త రాజ్ సైంటిస్ట్. స్కూలుకెళ్ళే కూతురు, ఓ పదినెలల చంటోడు. వాళ్ళో విల్లా లోకి మారడం, కుక్కపిల్లని పెంచుకోవడం, పాట పాడుకోవడం...ఇలా సినిమాల్లో వాళ్లకి మాత్రమే సాధ్యమైన విధంగా ఆనందంగా జీవిస్తూ ఉండగా (అలాగే జీవిస్తే కథేముంది?సినిమా ఏముంది?) వాళ్ళ జీవితాల్లోకి కావ్య (చార్మి) ప్రవేశిస్తుంది, చంటోడికి ఆయాగా. కావ్య కనీస వివరాలైనా తెలుసుకోకుండా ఆమెకి ఇల్లప్పగించేసే అమాయకురాలు పూజ, ఆమెకి తగ్గవాడు రాజ్.

అన్నని చూడ్డానికొచ్చిన రాజ్ తమ్ముడు (శశాంక్ -- పేషెంట్ లా అయిపోయాడు) కావ్యతో ప్రేమలో పడతాడు. ఆమె డైరీ చదవడానికి ప్రయత్నించి భంగ పడతాడు. తన దారికి అడ్డొస్తే చంపేస్తానని బెదిరించి, అన్నంత పనీ చేస్తుంది ఇంటర్వల్కి.. యాభై నిమిషాలలో మొదటి సగం ఐపోయింది. సినిమా మొదలైన అరగంట తర్వాత మా కాళ్ళు తొక్కుకుంటూ వచ్చి నా పక్క సీట్లో కూర్చుని, తనకి వచ్చిన రెండు కాల్స్ ని డీటీఎస్ లో ఆన్సర్ చేసినాయన ముఖం చూడాలన్న కోరికని బలవంతంగా నిగ్రహించుకున్నా.. సినిమా లో కామెడీ తక్కువగా ఉందన్న కొరతని ఈ సంఘటన తీర్చేసింది..

సెకండాఫ్ లో కావ్య, పూజ పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటుంది. చంటాడికి తన స్తన్యం కూడా ఇస్తుంది. రాజ్ ని తనవాడిగా చేసుకోవాలనుకుంటుంది. ఇందుకు పూజని అడ్డు తొలగించు కోవాలనుకుంటుంది. మరోపక్క పూజ మాత్రం కావ్యని గుడ్డిగా నమ్ముతూనే ఉంటుంది, ఆమె ముఖం లో క్షణ క్షణం మారే రంగుల్ని గమనించకుండా. భార్యాభర్తల గొడవలు పెట్టడం కోసం రాజ్ కి సంబంధించిన ఓ ముఖ్యమైన డాక్యుమెంట్ దాచేస్తుంది కావ్య. ఎప్పుడూ లాప్టాప్ మీద పనిచేసుకునే రాజ్ దగ్గర సాఫ్ట్ కాపీ ఉండదో ఏమిటో, పూజతో గొడవ పడతాడు.

కావ్యలో ఉన్న రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించడానికి దర్శకుడు కరుణ ప్రకాష్ 'అపరిచితుడి' మీదే ఆధార పడ్డాడు. ఎమోషన్ మారేటప్పుడు కావ్య పొడవాటి జుట్టు ఆమె ముఖం మీద పడడం తో సహా. సెట్లో రోజూ చార్మి 'అపరిచితుడు' వీడియోలు చూసి ఉంటుంది, సెకండ్ హాఫ్ షూటింగ్ జరిగినన్నాళ్ళూ.. ఇలాంటి సినిమాలకి సంగీతం, రి-రికార్డింగ్ ప్రాణం పోయాలి.. ఈ సినిమా విషయంలో అది జరగలేదు. ఒక్క పాటా గుర్తు పెట్టుకునేలా లేదు.

సినిమా ప్రారంభంలో మరణించిన నల్ల చొక్కా వాడికీ, కావ్యకీ సంబంధం, కావ్య పగ పట్టడానికి కారణం, అది కూడా కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలనుకోకుండా, పూజని తప్పించి ఆ స్థానాన్నితను ఆక్రమించాలనుకోడానికి కారణం ఏమిటన్నదే కథ. తన ప్లాన్ అమలులో విఫలమైనపుడు కావ్య పడే బాధని ఛార్మి బాగా అభినయించింది. అలాగే భర్తతో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు పూజ గా మంజుల నటన బాగుంది.. మొత్తం మీద 'షో' లో కన్నా పర్వాలేదు. నటనలోనే కాదు, నిర్మాతగానూ మంజుల మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది..

22 వ్యాఖ్యలు:

 1. మీకు ఈ నెలలో మూడో దెబ్బ..ఒక మంచి తెలుగు సినిమా రావాలని కోరుకుంటున్నా..సమీక్ష బావుంది మురళి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. తనకి వచ్చిన రెండు కాల్స్ ని డీటీఎస్ లో ఆన్సర్ చేసినాయన ముఖం చూడాలన్న కోరికని బలవంతంగా నిగ్రహించుకున్నా.. సినిమా లో కామెడీ తక్కువగా ఉందన్న కొరతని ఈ సంఘటన తీర్చేసింది....
  మీరూ బాగానే పండిస్తున్నారు కామెడీ!

  ఇంతకీ ఏమిటి, సినిమా చూడాలా వద్దా? రివ్యూ చదివాక కూడా అర్థం కాలేదు. దర్శకుడి ప్రభావం బాగానే పడిందన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బాగుంది మీ రివ్యూ... సినిమా కథ ఇంత కామెడీ గా వుంటే కష్టమే వెళ్ళటం..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. the hand that rokcs the cradle ani oka english cinema danni sambhanalato saha anuvadinchasaaru ... camera bagundi .. kali unte aa original chitram chudandi ...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. follwers ni anuchurlu ani telugu anuvadam chetta laga undi .. meeru snehitlu ani marchavacchu kada .. ( i am talking about blog followers box) .. anucharulu enti sodi ..raju vedale ravitejamu annatu ...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కధెలా ఉన్నా మీరు చెప్పిన విధానం బాగుంది. నాకు కూడా ప్రకటనలతో సహా చూడకపోతే అస్సలు తృప్తిగా ఉండదు. ఎంత పిచ్చివైనా అంత స్క్రీన్ పైన చూడటం బాగా అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. sameeksha bagundi.
  muraligaru..chinna request!!
  nenu kuda mee nemalikannu to sneham cheyyavachuna with your permission!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీ రివ్యూ చదివేసానుగా.... వేరొక సినిమా చూడమంటారా మరి?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నా దురదృష్టావశాత్తూ ...మీ రివ్యు కాస్త ఆలస్యంగా చదవటం జరిగింది ...ప్చ్ ...అప్పటికే చేతులు కాలిన చందమైంది ..ఇక ఆకులు పట్టుకొని ఏం లాభం ?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. "... ఎప్పుడూ లాప్టాప్ మీద పనిచేసుకునే రాజ్ దగ్గర హార్డ్ కాపీ ఉండదో ఏమిటో, పూజతో గొడవ పడతాడు...."

  సాఫ్ట్ కాపీ అనిరాయబోయి..హార్డ్ కాపీ అని రాశారా లేదా నేనే తప్పుగా అర్దం చేసుకున్నానా ???

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @హరే కృష్ణ: నేనూ వస్తుందన్న ఆశతోనే ఉన్నానండి.. ధన్యవాదాలు.
  @సుజాత: సీట్లో కూర్చున్న పావుగంటకి ఇంటర్వెల్ వస్తే టికెట్ కొనుక్కుని సినిమా కి వచ్చిన వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో ఊహించగలం కదండీ.. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. కంచు కంఠం.. ఆయన ఫోన్స్ అయ్యేంతవరకూ నాకు ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు.. సెలక్టివ్ గా సినిమాలు చూసే వాళ్ళు చూడక్కర్లేదనిపించిందండి నాకు. ధన్యవాదాలు.
  @భావన: తీసిన విధానం కూడా కామెడీ గానే ఉండండి.. ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @sriatluri: ఫస్టాఫ్ అవుతుండగానే డౌట్ వచ్చిందండీ.. ఏదో ఇంగ్లీష్ సినిమా ఇన్స్పిరేషన్ అయి ఉంటుందని.. చూస్తాను, మీరు చెప్పిన సినిమా.. అన్నట్టు.. జావా స్క్రిప్ట్ ఎడిట్ చేయడం ఎలాగూ చెబుతారా, 'అనుచరులు' తీసేయడానికి. ...ధన్యవాదాలు.
  @భవాని: ఎలాగూ చూడాలనుకున్నప్పుడు మొదటి నుంచీ చూడడమే మంచిది కదండీ, మనకీ థియేటర్లో మిగిలిన వాళ్ళకీ కూడా... ...ధన్యవాదాలు.
  @praneeta: తప్పకుండానండి.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @పద్మార్పిత: అన్ని సినిమాలు రివ్యూ చదివే చూస్తారా అండి మీరు? (సరదాగా) ...కనీసం 'షో' లా అయినా ఉంటుందనుకున్నా.. నిరాశ పరిచిందండి.. ...ధన్యవాదాలు.
  @పరిమళం: మీరు కూడా ఓ టపా రాయండి.. ధన్యవాదాలు.
  @krishna: సరిచేశానండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. (యి-మెయిల్ ద్వారా చక్రి ఇలా అన్నారు)
  మురళి... కావ్యాస్ డైరీ రివ్యూ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఆర్ట్ ఫిలిం మాదిరి సా...గుతుంది. ఒక విషయం చెప్పనా మంజుల క్యారెక్టర్ కోసం భూమికని అడిగారు.. ఏమైందో మంజుల నటించేసింది. ఆమె కాకుండా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చేసి వుంటే బెటర్. మీ ఓపికకి జోహార్లు.. ఈ వారం మరో సినిమాకి సిద్దంగా వుండండి.. రాజశేఖర్ నా స్టైల్ వేరు. చూసి చెప్పండి... మీ ఫ్రెండ్స్ క్షేమం కోసం
  చక్రి

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @చక్రి: అబ్బే.. నేను స్టార్లు, వాళ్ళ వారసుల సినిమాలు అరుదుగా చూస్తానండి (తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఆ టైటిల్ ని పేపరులో చూసినప్పటినుంచీ ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నను.రివ్యూ రాసి టికెట్ డబ్బులు మిగిల్చినందుకు థాంక్స్.నాకు కూడా సినిమా తెర తేసినప్పటినుంచీ ఆఖరులో మళ్ళీ తెర పడే దాకా చూస్తేకానీ సినిమా చూసినట్టుండదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. Murali garu nenu emadyane me nemalikannu ni vembadinchadam(follow avvadam)modalu pettanandi.....kani mee lanti pedda valla daggara naa vyakya ni post cheyadaniki saahasinchaledu..telugu lo type cheyadaniki viswa prayatnam chesanandi kani kudaraledu...murali garu nenu kuda chusanandi kavya's dairy.....naaku mee review lo okati ardam kaaledu..hard copy raj system lo unde untundandi...kani athanu aaroju last date tappakunda submit chestava ani puja ni adigi mari ichi velthadu kadandi....time daataka hard copy unna em upayogam cheppandi......nannu mee anucharulalo cherchukuntara??meeku istam aythene.......

  ప్రత్యుత్తరంతొలగించు
 18. KONEY PRADEEP: చాలా సంతోషంగా ఉండండి, మీరు బ్లాగు చదువుతున్నందుకు. వ్యాఖ్యలు ఎవరైనా రాయొచ్చు, పెద్ద చిన్న ఏమి లేదు. తెలుగు లో రాయడానికి ఈ లింక్ సాయపడుతుంది. https://www.google.co.in/transliterate/indic/telugu
  ఇక మీ సందేహం గురించి. కొరియర్ ఆఫీసు నుంచే పూజ కవర్ మిస్సైన విషయం రాజ్ కి చెబుతుంది కదా. మరో ప్రింటౌట్ తీసి కొరియర్ చేసే ఏర్పాటు చేయొచ్చు కదండీ? దానికోసం భార్యతో మాట్లాడడం మానేయడం మరీ అసహజంగా అనిపించడం లేదూ? అక్కడ ఇంకొంచం క్లారిటీ ఉంటే బాగుండుననిపించింది. ఫాలోయర్ గా చేరడానికి నా అనుమతి అవసరం లేదండి. 'సైన్ ఇన్' అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేసి చేరండి.. మీ అభిప్రాయాలు చెబుతూ ఉండండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మురళి గారు మీరు ఇచ్చిన లింక్ పనిచేసింది అండి....హా మీ ఫాలోయర్ ని అవుతున్నాను అండి......చాలా సంతోషం గా ఉంది అండి........

  ప్రత్యుత్తరంతొలగించు
 20. muralu garu
  i typed in the google trans and then tried to pasted here .. it does not work...

  another thing.. was just reading ur kanakamahalaxmi ... madhuri acted in couple of films .. she did a film with arjun and also with some other movie.. second movie not as herione though...

  best wishes
  sri

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @KONEY.PRADEEP: ధన్యవాదాలు
  @sriatluri: గూగుల్ క్రోం లో ప్రయత్నించి చూడండి వీలయితే.. బహుశా IE సమస్య అయి ఉండొచ్చు. ఇక 'కనకమాలక్ష్మి..' విషయం లో నేను పొరబడ్డానండి .. ఆ విషయం 'నవతరంగం' లో రాజేంద్రకుమార్ గారు సరిచేశారు, వ్యాఖ్యల్లో చూడండి ఒక సారి. నిశితంగా చదువుతున్నందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు