మట్టి వాసనని, పూల పరిమళాలని, చిటపట చినుకుల సౌందర్యాన్ని ఆస్వాదించే భావుకత ఉన్న రచయిత్రి కుప్పిలి పద్మ. ఆ భావుకతనంతా కథలుగా మలచడం తో పాటు, ప్రతి కథలోనూ ఏదో ఒక సమస్యని తీసుకుని, దానికి తనదైన పరిష్కారాన్నీ సూచిస్తారామె. టీనేజ్ అమ్మాయిలూ, వాళ్ళ తల్లిదండ్రులకి ఎదురయ్యే సమస్యల మొదలు, ఓ మురికివాడలో ఎన్నో ఏళ్ళుగా జీవిస్తున్నా వాళ్లకి ఆ పక్కనే కొత్తగా వెలిసిన అపార్ట్మెంట్ వాసుల నుంచి ఎదురైనా సమస్యల వరకు ప్రతి సమస్యనీ తనదైన దృష్టి కోణం నుంచి నిశితంగా పరిశీలించి కథలుగా మలిచారు పద్మ. కుప్పిలి పద్మ కథాసంకలనం 'మంచుపూల వాన' పరిచయం 'పుస్తకం' లో..
***
నగరాల్లో పుట్టి పెరిగిన ఈ తరం అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటాయి? జీవితాన్ని గురించి వాళ్ళ దృక్పధం ఏమిటి? తరాల మధ్య అంతరాలు, పాశ్చాత్య సంస్కృతి మానవ సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? ఈ ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు రచయిత్రి కుప్పిలి పద్మ తన కథల తాజా సంపుటి ‘మంచుపూల వాన’ లో.. శీర్షికలో కనిపించే సున్నితత్వం పుస్తకం లోని దాదాపు ప్రతి పేజీలోనూ తొంగి చూస్తూ ఉంటుంది.
ఊదా మబ్బుల ఆకాశం, మెత్తని గాలి, వెచ్చని నెగళ్లు లాంటి ప్రకృతి వర్ణనలు, రంగు రంగుల పూలనీ, అందమైన సాయంకాలాలనీ ఇష్టపడే అమ్మాయిలూ, వాళ్ళ భయాలూ, బెంగలూ, ఇంకా సమాజం పట్ల వాళ్ళ బాధ్యతా, చుట్టూ ఉన్నవాళ్ళ కోసం వాళ్ళు పడే తపనా కథా వస్తువులుగా పద్మ రాసిన పన్నెండు కథలు ఈ సంకలనం లో చోటు చేసుకున్నాయి. ఈ కథలన్నీ గడిచిన ఐదారేళ్ళ కాలంలో వివిధ పత్రికలలో అచ్చయ్యాయి.
మొదటి కథ ‘వర్షపు జల్లులలో..’ లో నాయిక మహి. ఈ మధ్య తరగతి టీనేజ్ అమ్మాయికి ఓ స్నేహితుడి ద్వారా ఖరీదైన జీవితం పరిచయం అవుతుంది. ఫలితం..అప్పటివరకు ర్యాంకర్ గా ఉన్న ఆ అమ్మాయి బొటాబొటి మార్కులతో ఇంటర్ పాస్ అవుతుంది. విషయం తల్లికి తెలుస్తుంది. “కొన్నిసార్లు గాయపడడం అనివార్యం. అవసరం. ఒక కొత్త జీవితం అందులోంచే చిగురిస్తుంది..” అంటుంది అమ్మ.
‘మంచుపూల వాన’ కథలో నాయిక మేఘ..డబ్బున్న అమ్మాయి. నరేంద్ర ని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళయ్యాక నరేంద్రలో డబ్బు పట్ల పెరిగిన ఆకర్షణ. మేఘ కి, అతనికి మధ్య పెరిగిన దూరం. తనకి నచ్చిన పద్ధతిలో జీవించడం కోసం మేఘ తీసుకున్న నిర్ణయమే కథ ముగింపు. మిళింద్-మాళవిక ల ప్రేమకి మ్యాన్ హోల్స్ ఎలా అడ్డొచ్చాయన్నదే ‘చలేగా చలేగా ఏ ఇష్క్ కా జమానా’ కథ. సివిక్ సెన్స్ ఉన్న మాళవిక, అదే సెన్స్ ని తన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఆశించడం, దీనివల్ల మిళింద్ పడే ఇబ్బందులూ కథాంశం.
పున్నాగ పూలని ముద్దు పెట్టుకున్న ఓ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి కథ ‘మంత్ర నగరి సరిహద్దులలో..’ ప్రపంచీకరణ నేపధ్యంలో కెరీర్ లో పెరిగిన పోటీ, అవకాశాల కోసం వెతుకులాట, తమనితాము నిరూపించుకునే ప్రయత్నాల చుట్టూ సాగే ప్రేమ కథ ఇది. పెరటి తోటని ఇష్టపడే అమ్మకి ఓ ఇండిపెండెంట్ ఇల్లు కట్టించి ఇవ్వాలని తపన పడే కూతురి కథ ‘అమ్మకో ఇల్లు.’ ప్రేమంటే ఏమిటో సరిగ్గా తెలియని వశిష్ట ని తనకి కావల్సిందేమితో స్పష్టంగా తెలుసుకునేలా చేసిన ఉత్కళ కథ ‘కొన్ని రంగు రంగుల సాయంకాలాలలో..’
చిన్నప్పుడే తన వాళ్లకి దూరంగా ఓ బ్యూటీ పార్లర్లో పనికి కుదిరిన పేదింటి అమ్మాయి దక్ష కథ ‘చెమ్మగిల్లిన వసంతం.’ బహుళజాతి కాస్మటిక్ కంపెనీల వ్యాపార వ్యూహాలని వివరించారీ కథలో. కాల్ సెంటర్ సంస్కృతిని, అక్కడి ఉద్యోగుల మానసిక స్థితినీ చర్చించిన కథ ‘మాయ.’ పెళ్ళయిన పదిహేనేళ్ళ తర్వాత భర్త మరో అమ్మాయి వెంట పడితే ఆ భార్య ఏం చేసిందన్నది Ms. మయూర కథ. అపార్ట్మెంట్ సంస్కృతికి ఫలితంగా చెట్లు, ఆ చెట్ల కింద జీవించే వాళ్ళ జీవితాలు ఎలా కళ తప్పుతున్నాయో చిత్రించిన కథ ‘చింత చెట్టు నీడలో వచ్చని పరిమళపు పాట.’
ప్రేమ కన్నా కెరీర్ ముఖ్యమనుకునే కవి శిరీష్ నుంచి అతన్ని ప్రేమించిన జర్నలిస్ట్ నిత్యకల్యాణి నేర్చుకున్న పాఠమే ‘వసంత స్వప్నం’ కథ. ఒకప్పుడు వర్షాన్ని ప్రేమించిన వాళ్ళంతా ఇప్పుడు వర్షం అంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పే కథ ‘వాన కురిసిన ఓ మద్యాహ్నం.’ హైదరాబాద్ మహా నగరం లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వాళ్ళ వర్షాకాలం లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలని వివరిస్తూనే పరిష్కారాన్నీ సూచిస్తుందీ కథ.
సున్నితమైన భావోద్వేగాలతో సాగిపోయే ఈ కథలు పుస్తకం మూసి పక్కన పెట్టాక కూడా మనల్ని వెంటాడతాయి. మనకున్న ‘సివిక్ సెన్స్’ ని ప్రశ్నిస్తాయి. ఆధునిక తరం అమ్మాయిల అంతరంగాలని ఆవిష్కరిస్తాయి. అధిక శాతం కథలు ఆశావహ దృక్పథం తోనే ముగుస్తాయి. ముక్తా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం వెల రూ. 95. లభించే స్థలాలు: ‘విశాలాంధ్ర’ ‘ప్రజాశక్తి’ అన్ని బ్రాంచీలు, ‘నవోదయ’ కాచిగూడ, హైదరాబాద్, ఏలూరు రోడ్, విజయవాడ, దిశ పుస్తక కేంద్రం, చిక్కడపల్లి, హైదరాబాద్, ప్రభవ బుక్ షాప్, పొగతోట, నెల్లూరు. ఎన్ని పుస్తకాల మధ్య ఉన్నా తనవైపు దృష్టిని మరల్చుకోగలిగే అందమైన కవర్ పేజి ఈ పుస్తకం ప్రత్యేకత.

meeelanti vyakthi na frnd ani cheppukune avakasam ivvandi murali garu..mimmalni ela contact cheyyali
రిప్లయితొలగించండి@శిరీష
రిప్లయితొలగించండిముందు నాతో స్నేహం చేయండి మీకు దగ్గరి దారి చెబుతాను .మురళి కి ఎన్నో వేల మంది స్నేహితులో ....కష్టమేమో మీతో స్నేహం -:)
@శిరీష: మీకో మెయిల్ రాశానండి.. పంపుదామంటే మీ మెయిల్ ఐడీ లేదు.. కొద్దిగా ఆ ఏర్పాటు చూడండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చిన్ని: స్నేహితులు పెరగడానికి ఈనాడు, మీరు కారణం.. ఇప్పుడిలా అనడం అన్యాయం.. ఖండిస్తున్నాను.. వ్యాఖ్యకి ధన్యవాదాలు..
మీరింత అన్యాయంగా మాట్లాడటాన్ని నేను ఖండిస్తున్నాను ...నాతో ఆవిడ స్నేహం చేస్తే మీకెందుకు ప్రాబ్లం ..ఆవిడకి ....దగ్గర దారి చేబుతనన్నగా...ఓకే మీతో స్నేహానికి పచ్చి .
రిప్లయితొలగించండి@చిన్ని, మొత్తానికి ప్రభుత్వాధికారిని అనిపించారుగా! :)
రిప్లయితొలగించండిఅరేయ్ పిల్లలూ, కాస్త ఇంట్లోకి వచ్చి కొట్టుకోండిరా, చిన్ని తప్పురా, పచ్చీ అనేస్తే ఎలా పిచ్చితల్లీ నిన్నేగా పూల గుత్తి పంపావ్. దోస్తీలో ఈ కుస్తీలేందబ్బా? మురళీ చుక్కల్లో చంద్రుడైపోతున్నారా? హ హ హ్హా [jk] ;)
రిప్లయితొలగించండి@కొత్తపాళీ
రిప్లయితొలగించండిగవర్నమెంట్ వాళ్ళు ఇట్లానే తగాదాలు పడతారా ! అబ్బే అలాటిదేమీ లేదు మనకసలే సహనం ఎక్కువ .-:)
@ఉష
చూడండి .. నాది తప్పేంటి ...ఒక్కసారే ఖండిస్తున్నాను అన్నారు ...నాతో స్నేహం వద్దనే కదా చూసారా పూలు పంపానని మీరు గుర్తుచేశారు ..... ప్చ్ ...మురళికి అవేమి గుర్తులేవు ..నేనొప్పుకోను తను చుక్కల్లో చంద్రుడంటే ..తను కూడా ఒక చుక్కే . సరే మీ మీద గౌరవం తో నా మాట వెనక్కి తీసుకుంటున్నాను .
చిన్ని గారు, మీ మొదటి వ్యాఖ్యని సరదాగా తీసుకుని 'ఖండిస్తున్నాను' అని నేను సరదాగా అన్నాను.. అది సీరియస్ వ్యాఖ్య కాదు.. మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షంతవ్యుడిని..
రిప్లయితొలగించండి