గురువారం, జూన్ 11, 2009

అతడి భార్య

"పెళ్ళికి పునాది నమ్మకం, గౌరవం.." ముళ్ళపూడి వెంకట రమణ 'పెళ్ళిపుస్తకం' సినిమా కోసం రాసిన డైలాగు ఇది. భార్యా భర్తలిద్దరికీ ఒకరిమీద ఒకరికి నమ్మకం, గౌరవం ఉన్నప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వివరిస్తారు ముళ్ళపూడి. మరి.. అతను తన చేతల ద్వారా ఆమె నమ్మకాన్నీ, ఆమెకి తనమీద గల గౌరవాన్నీ కోల్పోతే? ఇదే అంశాన్ని వస్తువుగా తీసుకుని ఎన్. శ్రీలలిత రాసిన కథ 'అతడి భార్య.'

'ఒక కొత్త రచయిత్రి రాసిన తొలి కథ ఇది' అనే ప్రకటనతో ఆదివారం ఆంధ్రజ్యోతి ఐదేళ్ళ క్రితం ప్రచురించిన ఈ కథకి నేపధ్యం హెచ్.ఐ.వీ. అతనూ, ఆమె ఇద్దరూ చదువుకున్న వాళ్ళు. అతను మంచి ఉద్యోగం లో ఉన్నాడు. తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళయ్యింది. పెళ్ళయిన రెండేళ్ళకి బాలింత గా ఉన్న ఆమెకి భర్త నుంచి సుఖవ్యాధి సంక్రమిస్తుంది. ఆమె సూటిగా అడగడాన్ని అతను భరించలేక పోతాడు.

భర్త తో గడవ పొడిగిస్తే ఏం జరుగుతుందో ఆమెకి తెలుసు కాబట్టి మౌనం వహిస్తుంది. ఇద్దరిమధ్యా దూరం మొదలవుతుంది. అతని వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. అతన్ని మార్చడానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. "అసలందరూ వయసు రాగానే, అర్హత రాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఈ సెక్స్ వర్కర్లు ఎందుకున్నారు?" ఆమె ఆలోచన, ఆవేదన. మరో ఆరేళ్ల తర్వాత అతను హెచ్.ఐ.వీ. పాజిటివ్ అని చెబుతారు డాక్టర్లు.

ఈ షాక్ నుంచి తేరుకోడానికి మూడు నెలలు పడుతుందామెకి. తనకంటూ ఉన్న పెద్ద దిక్కు పెద్దక్క దగ్గరికి వెళ్లి విషయం చెబుతూనే భోరుమంటుందామె. "లెటజ్ కంపేర్ విత్ ద లీస్ట్. ఇన్నాళ్ళూ నీకూ, పిల్లలకూ ఆయనేం లోటు చేయలేదు కదా. ఇప్పుడెలాగూ ఆరోగ్య పరంగా నువ్వూ, పిల్లలూ సేఫ్. అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు నీ పీజీ డిగ్రీ నీకెలాగూ ఉంది. నీకు మేమంతా ఉన్నాం. ఇక అతని ఖర్మకి అతన్నొదిలేయ్," అని ఊరడిస్తుంది అక్క.

ఇంట్లో అత్తగారిదీ అదే మాట.. "వాడి ఖర్మదీ.. ఎవరు చేసుకున్న దానికి వారనుభవించక తప్పదనీ.. మనం చూస్తూ ఉండడమే.." అతనికి బుద్ది చెప్పడం కోసం ఇంట్లో వాళ్ళ చేత సహాయ నిరాకరణ చేయించే ప్రయత్నం చేస్తుందామె. అత్తగారు పార్టీ ఫిరాయిస్తుంది. "నీకు శరీరాన్ని కాపాడుకోవడం రాదు. ఇంట్లో లేకపోయాక బయటకెళ్ళక తప్పదు. అయినా నా జీవితం నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి?" అతని జవాబు. కనీసం అతనితో తిరిగే ఆడవాళ్ళకి అతను హెచ్.ఐ.వీ అని చెప్పాలనుకుంటుంది. "మీరు చాలా కనస్ట్రక్టివ్ గా అబద్ధాలు చెబుతారనుకుంటా.." అంటూ వస్తుంది స్పందన.

ఉన్నట్టుండి అతనికి సీరియస్ అవ్వడంతో హాస్పిటల్ లో చేర్పిస్తుందామె. "కుటుంబ మనుగడ కోసం కాలంతో సమానంగా పరుగులు తీస్తూ విశ్రాంతి ఎరుగని శరీరంలో సంవత్సరంగా చిక్కి శల్యమైనట్టుగా మార్పులు జరుగుతున్నా భార్యనైన నాకే తెలియలేదు. అమ్మని పూర్తిగా మరచి ఏ ఒడిలో నిద్రపోయానో, ఎవరికి ఒక్క రోజు జ్వరం వచ్చినా కాళ్ళు పడుతూ, కంగారు పడుతూ రోజంతా సేవలు చేసి కాపాడుకున్నానో ఆ వ్యక్తి ఇవాళ నాకు 'అతను' గా మారిపోయాడు. ఏదైనా మిరకిల్ జరిగి కాలం వెనక్కి జరిగిపోతే యెంత బాగుంటుంది..జస్ట్ నైన్ ఇయర్స్..ఏవీ ఆ ప్రేమ, భద్రతా, ఆలంబన..నిశ్చింతా?"

హాస్పిటల్లో అతని 'చివరి బిల్' చెల్లించి బయట పడుతుందామె. ఇక ఎప్పటికీ ఎక్కడా బిల్ కట్టక్కరలేదు. "అతను భౌతికంగా, మానసికంగా నానుంచి చెరిగిపోయాడు..." హెచ్.ఐ.వీ. సోకిన వారికోసం పనిచేస్తున్న ఓ స్వచ్చంద సంస్థలో సభ్యురాలిగా చేరుతుందామె. "ఈ పని బాగుంది. ఓదార్పు.. ఈ భార్యకు, ఆ భార్యకు, ఎందరున్నారో తెలియని ఎందరో అతనుల భార్యలకు..."

13 వ్యాఖ్యలు:

 1. చాలా రోజుల తరువాత చక్కని కధను చదివేలా చేసారు అది కూడా మీదైన శైలిలో...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ కథ నేనూ మరచిపోలేదు ...చదువుతూనే ఏడ్చేసాను అతన్ని చూసి ...చిక్కి శల్యమైన అతన్ని గురించి ..అందరు నవ్వించగలరు కాని ఎడ్పించడమే కష్టం అనుకుంటా.రచయిత్రి చాల బాగా రాసారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. MEE BLOG GURINCHI EENADU LO CHADIVANU, MEERU CHESTHUNNA TELUGU SAHITYA SEVA KI SATAKOTI VANDANALU

  USHAKIRAN
  09892033629

  ప్రత్యుత్తరంతొలగించు
 4. MEERU CHESTHUNNA TALUGU SAHITYA SEVAKI SATAKOTI VANDANALU. MEE BOLG GURINCHI EENADU LO CHADIVANU

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బావుంది మురళి..ప్రతిరోజూ రాస్తున్నావ్ కదా.. ఇలాగే రాస్తుండు బావున్నాయి ..@ నవ్వించడం కూడా చాలా కష్టం,నవ్వడం ఈజీ

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ముఖ్యంగా ఇలాంటి కథ రాసిన శ్రీ లలిత గారికి..మరియు ఈ కథ ను పరిచయం చేసిన మీకు నా ధన్యవాదాలు.. మంచి పోస్ట్.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. hello murali garu and hare krishna gariki meru chepinattu telugu type cheyataniki try chesanu naperu lo sha ni, me peru lo li.rayataniki anni keys try chesi chesi inka ee rojuki na prayatham viramichukunna.may be nenu edo thapu chesi untanu so malli repu try chesthanu with ur help......:-(

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @srujana: ధన్యవాదాలు.
  @చిన్ని: ధన్యవాదాలు.
  @USHAKIRAN: ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: ధన్యవాదాలు.
  @కథాసాగర్: ధన్యవాదాలు.
  @సునీత: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @అనూష: ఒక పదం టైపు చేసిన తర్వాత దాని మీద కర్సర్ ఉంచి క్లిక్ చేయండి.. రెండుమూడు పదాలు వస్తాయి.. సరైనది ఎంచుకోండి. ఇంగ్లీష్ పదాలు తెలుగులో రాసేటప్పుడు ఎలా పలుకుతామో ఆ స్పెల్లింగు రాయండి.. చాలా సులువుగా నేర్చుకోవచ్చు.. మీకు సూచన ఇచ్చింది భాస్కర్ రామరాజు గారు. ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ధన్యవాదాలు భాస్కర్ రామరాజు గారు...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. >> ఆమె సూటిగా అడగడాన్ని అతను భరించలేక పోతాడు.
  ఏ వ్యసనం విషయంలోనైనా ఇంతే, స్త్రీ ప్రశ్నించటాన్ని మగాడు వక్రకోణంలోంచే చూస్తాడు.
  >> అతని వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు
  ఎన్ని తరాల స్త్రీల జీవితాలు ఈ వైఖరిలో తెల్లారిపోలేదూ?
  చివరి రెండు పేరాలు స్త్రీలోని అంతర్గత మాతృప్రేమకి, సహజసిద్దమైన క్షమ కి ఈ పాత్ర మానసిక పరిణితికి ఋజువులు. అంతా ఇలావుండకపోవచ్చు, కానీ జీవితంలో జరిగిన అనుభవాలనుండి స్త్రీ తేరుకుని, కోలుకుని ముందుకు సాగినంతగా మగాడు చేయలేడు. దాన్ని సర్దుబాటో, రాజీగానో సమాజం చిత్రికరించినా అది ఆమె ఔన్నత్యానికి చిహ్నం. ఇదే "ఆమె భర్త" గా మార్చి వ్రాసే ప్రయత్నం చేయండి, ముగింపు రెండో పేరాలో విడాకులు, అతని రెండో పెళ్ళి వద్ద మలుపు తిరిగేది. ఈ కథలో ఇది రచయిత్రి నిర్ణయమో, ఆ పాత్రకి తన చివరి నిర్ణయానికి ముందు ఇతర మార్గాలు తరిచి చూసుకునే సమయం వుందా, తాత్కాలిక వైరాగ్యంలో అటువెళ్ళిందా? తన జీవితాన్ని అతని వ్యసనానికి పణంగా పెట్టటం మన సాంప్రదాయం స్త్రీ మనసులో చెక్కిన దౌర్బాగ్యమా? నాకు ఇంకా వ్రాయాలనివుంది. నా స్పందనకి నేనే న్యాయం చేయలేకపోతున్నాను. పుంఖానుపుంఖాలుగా ఇంకా ఆలోచనలు సుళ్ళుతిరిగుతూనేవున్నాయి. అయినా ఇక్కడితో ఆపుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @ఉష: మల్లాది 'మందాకిని' గురించి ఇలాంటి చర్చే జరిగిందండి ఒక ఫ్రెండుతో.. భానుమూర్తి సద్గుణవంతుడు, మందాకిని చెడ్డ గుణాలు ఉన్నది ఐతే భానుమూర్తి ఓర్పుతో, నేర్పుతో ఆమెని మార్చుకుని ఉండేవాడా? అని ప్రశ్న. నా సమాధానం 'కాదు' అనే.. ఎందుకంటే మన వ్యవస్థ అలా ఉంది.. మగవాడికి రెండో భార్య దొరకడం చాలా సులువు, స్త్రీతో పోలిస్తే..ఇదొక్కటే కాదు, ఇంకా చాలా కారణాలే ఉన్నాయి.. 'అతడి భార్య' కథ నన్ను ఎంతగా ఆలోచింపజేసిందో, మీ వ్యాఖ్య కూడా అంతగానూ ఆలోచింప జేసిందండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు