"జీవన వేణువులలో మోహన పాడగా..."
ఇంకెంతో కాలం బతకమని తెలిసిన ఓ అబ్బాయీ, అమ్మాయీ ప్రేమలో పడ్డప్పుడు పాడుకునే యుగళగీతంలో "ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో" లాంటి మాటల్ని పొదగగలిగే సినీ కవి వేటూరి ఒక్కరేనేమో బహుశా! మణిరత్నం తెలుగులో తీసిన ఏకైక సినిమా 'గీతాంజలి' (1989) కి సింగిల్ కార్డు గేయ రచయిత వేటూరి. కథకి తగ్గట్టుగానే పాటల్లోనూ భావుకత, ఆర్ద్రత వినిపిస్తాయి. మిగిలిన అన్ని పాటలూ ఒక ఎత్తైతే, రౌండ్ ట్రాలీ వేసి కేవలం చుంబన దృశ్యంతో పాట మొత్తం చిత్రీకరించేసిన 'ఓం నమః' పాట ఒక్కటీ ఓ ఎత్తు - చూడడానికే కాదు, వినడానికి కూడా.
ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో..
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిధై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగా
ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి...
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిథులై జననమందిన ప్రేమ జంటకు...
ఇప్పుడంటే ఏబీసీడీ లతో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి కానీ ఒకప్పుడు మొదటిసారిగా పలకమీద 'ఓం నమః శివాయః' రాసి దిద్దించి, ఆ తర్వాత అఆలు మొదలుపెట్టేవారు. ఈ ఓం నమఃలు క్రమేణా 'ఓనమాలు' అయ్యాయి. ఈ పాటలో జంట ప్రేమకి ఓనమాలు దిద్దుకుంటోంది. నయన శృతులకి, హృదయ లయలకి, ఆధర జతులకి, మధుర స్మృతులకీ ఓం నమఃలు. అలతి అలతి పదాలకి భావుకత అద్ది రాసిన రెండే చరణాలు. గుండె చప్పుడుతో మొదలయ్యే నేపధ్య సంగీతం, జానకి-బాలూల పోటాపోటీ గానం. వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన మూడు దశాబ్దాలలోనూ ఇలాంటి పాట ఇంకోటి రాలేదేమో అనిపిస్తోంది. ఇకపై వచ్చే అవకాశమూ పెద్దగా కనిపించడం లేదు.
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ-- beautiful thought.👌
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ..
తొలగించండి1990's ఆ రోజుల్లో ఇంత ధైర్యంగా ముద్దు మీద ఏకంగా మొత్తం పాట తీసి దాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ చేసిన ఘనత మణిరత్నానికే దక్కింది. ఇక ఇళయరాజా వేటూరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
రిప్లయితొలగించండినిజమండీ, ధన్యవాదాలు..
తొలగించండికదిలిస్తే చాలా మందికి చాలా కథలు గుర్తొస్తాయి.. :)
రిప్లయితొలగించండిఇంతకీ మీకు? ..ధన్యవాదాలు
తొలగించండిఈ పాటకి తాళం ఏమిటి మాస్టారూ?
రిప్లయితొలగించండిడబ్ డబ్..
మెట్రోనిమ్ పై నాలుగు టిక్ ల తరువాయి
తొలగించండిక్షమించాలి అది మెట్రోనిమ్ కాదు మెట్రోనోమ్..
తొలగించండిమెట్రోనోమ్ అంటే ఇదీ
ధన్యవాదాలండీ..
తొలగించండి