అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని 'కాంగ్రెస్ మనిషి' గా గుర్తించారు! పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీవీ శతజయంతి కార్యక్రమానికి పంపిన సందేశంలో సోనియా పీవీని 'నిజమైన కాంగ్రెస్ మనిషి' గా అభివర్ణించారు. బాగా ఆలస్యంగానే అయినా, సోనియా ఓ నిజాన్ని గుర్తించి, అంగీకరించారు. ప్రధానిగా పీవీ చేసిందంతా దేశం కోసమూ, కాంగ్రెస్ పార్టీ కోసమే తప్ప తాను, తన కుటుంబం బాగుపడేందుకోసం ఏమీ చేయలేదనీ, చేసిన దానికి ఫలితంగా అనేక కేసుల్నీ, బోలెడంత అపకీర్తినీ మాత్రమే మూటకట్టుకున్నారనీ దేశం యావత్తూ గుర్తించిన చాలా ఏళ్ళకి సోనియాకి ఈ గమనింపు కలిగింది. ఓ పదహారేళ్ళ క్రితం ఆమెకీ ఎరుక కలిగి ఉంటే కనీసం పీవీ పార్థివ దేహానికి ఓ గౌరవం దొరికి ఉండేది.
ఇన్నాళ్లూ పీవీ ప్రస్తావనని కూడా ఇష్టపడని సోనియా ఇంతకీ ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక కారణం ఏమిటి? ఆ కారణం రెండు కాంగ్రెసేతర పార్టీలు కావడం - ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి బద్ధ విరోధులు కావడం - ఇక్కడ విశేషం. గత నెల 24 న పీవీ తొంభై తొమ్మిదో జయంతిని హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్), ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. అప్పుడప్పుడూ లీలగా, పీలగా వినిపిస్తూ వచ్చిన 'పీవీకి భారత రత్న' డిమాండ్ ఈసారి కొంచం గట్టిగా వినిపించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పీవీకి 'భారత రత్న' ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటు ఢిల్లీ లోనూ, ఇటు పీవీ స్వరాష్ట్రంలోనూ ఏడాది పాటు పీవీ శతజయంతి జరిపేందుకు అధికార పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకరోజు ఫోటోకి దండేసే కార్యక్రమం మాత్రమే అయితే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకుని ఉండేది కాదేమో, కానీ ఏడాది పాటు తెలియనట్టుగా ఉండడం అంటే కష్టం కదా.
కేంద్ర ప్రభుత్వం పీవీకి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణం ఊహించగలిగేదే. ఆయన నెహ్రు-గాంధీ కుటుంబేతరుడు కావడం. సోనియా-రాహుల్ పీవీ ప్రస్తావనని వీలైనంత దూరం పెట్టడమూను. శత్రువుకి శత్రువు మిత్రుడే అవుతాడు కదా. పీవీ కృషిని ప్రశంసించడాన్ని, నెహ్రు-గాంధీ వారసుల అసమర్ధతని ఎత్తిచూపడంగా భావించుకునే పరిస్థితులున్నాయిప్పుడు. ('అప్పుడు మా వంశీకులు ప్రధాని పదవిలో ఉండి ఉంటె బాబరీ మసీదు కూలేదే కాదు' అని రాహుల్ గాంధీ కొన్నేళ్ల క్రితం చేసిన ప్రకటనని ఎవరు మర్చిపోయినా బీజేపీ మర్చిపోతుందని అనుకోలేం). దేశంలోని సకల అనర్ధాలకీ నెహ్రుని, కాంగ్రెస్ ని కారణాలుగా చూపే బీజేపీ నాయకులు పీవీ శతజయంతి జరపడం అంటే ఒకరకంగా కాంగ్రెస్ ని కవ్వించడమే. కాంగ్రెస్ పార్టీకి కూడా పీవీని తల్చుకోక తప్పని పరిస్థితిని కల్పించడమే.
(Google Image) |
'పీవీ తెలంగాణ ఠీవి' అని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్త్రి కె. చంద్రశేఖర్ రావు. ఆయనకి కూడా కాంగ్రెస్ ని విమర్శించని రోజు ఉండదు. కానీ, పీవీ విషయంలో మినహాయింపు. ప్రధాన కారణం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని ఇరుకున పెట్టే అవకాశం దొరకడం. వాళ్ళు పీవీని ఓన్ చేసుకోలేరు, వదిలేయనూ లేరు. ఈ శతజయంతి సంవత్సరంలో చేసే కార్యక్రమాల్లో భాగంగా పీవీ కుటుంబం నుంచి ఒకరిని (కుమార్తె సురభి వాణీదేవి పేరు వినిపిస్తోంది) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. సభలు, సమావేశాలు జరుగుతాయి. 'పీవీకి భారత రత్న' అనే ఖర్చు లేని డిమాండ్ ఉండనే ఉంది. ఈ డిమాండ్ విషయంలో ఢిల్లీ కూడా ఆసక్తి చూపిస్తోందంటూ వార్తలు రావడం కొంచం ఆలోచించాల్సిన విషయం.
వివాదాస్పదులు, కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారి పేర్లని 'పద్మ' పురస్కారాలకి పరిశీలించరు అన్నది అందరూ అనుకునే మాట. 'పద్మశ్రీ' మొదలు 'పద్మవిభూషణ్' వరకూ ఇప్పటికే ఆచరణలో మినహాయింపులు వచ్చేశాయి. ఇక మిగిలింది 'భారత రత్న.' పీవీ ద్వారా మార్గం సుగమం చేసుకునే ఆలోచనగా దీనిని భావించాలా? ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత పీవీ చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల ఫీజుల కోసం సొంత ఇంటిని అమ్ముకోవడం లాంటివన్నీ జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పీవీ ఎవరో తెలియనట్టు ప్రవర్తించింది. తర్వాతి కాలంలో మరో అడుగు ముందుకేసి ఆర్ధిక సంస్కరణలన్నీ మన్మోహన్ సింగ్ ఖాతాలో మాత్రమే వేసే ప్రయత్నమూ చేసింది. (అయితే, మన్మోహన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు). చివరికి పీవీ మరణించినప్పుడు ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేందుకే కాదు, పార్టీ కార్యాలయంలో పీవీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు కూడా అధినేత్రి సోనియా అంగీకరించలేదు.
ఇన్నేళ్ల తర్వాత అదే సోనియా అదే పీవీ శతజయంతి జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకి అనుమతి ఇచ్చారు. తన సందేశంలో పీవీని 'కాంగ్రెస్ మనిషి' గా అంగీకరించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని ప్రశంసించారు. వార్తలు చూస్తుంటే ఒక్కటే అనిపించింది. 2004 డిసెంబర్ 23న దేశంలోనూ, రాష్ట్రం లోనూ (సమైక్య ఆంధ్ర ప్రదేశ్) కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకుండా ఉండి ఉంటే, మాజీ ప్రధానులు అందరి అంత్య క్రియలూ జరిగిన దేశ రాజధానిలోనే పీవీ అంత్యక్రియలు కూడా జరిగి ఉండేవేమో కదా. క్లిష్ట సమయంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టి, ఆర్ధికంగా దేశాన్ని ఒడ్డున పడేసి, ఆ పడేసే క్రమంలో జరిగిన చెడుకి తాను మాత్రమే జీవితాంతం బాధ్యత వహించిన పీవీకి కనీసం మరణానంతర గౌరవమైనా దక్కేదేమో. పీవీ పదవుల్లో ఉన్నప్పుడు మొదలు ఇప్పటి శతజయంతి వరకు ఆయన వల్ల చుట్టూ ఉన్నవాళ్లు మాత్రమే ఏదో ఒక రీతిలో ప్రయోజనం పొందుతూ ఉండడాన్ని విధి వైచిత్రి అనే అనాలేమో...
రిప్లయితొలగించండిఅద్భుతః
జిలేబి
ధన్యవాదాలండీ
తొలగించండిWith due respect to PV Narasimharao garu, సోనియాకు పీవీమీద కోపం ఉన్నదన్నమాట నిజమే. కానీ గాంధి కుటుంబం మళ్ళీ రాజకీయాలలోకి రాకుండా చేయటానికి, వాళ్ళను అణగదొక్కటానికి పీవీ చేసిన పనులను మర్చిపోవటానికి ఆమె ఏమీ ఋషిపుంగవురాలు కాదుగదా! అప్పటికీ తన భర్తను చంపిన నళినిని తదనంతరకాలంలో క్షమించింది. అట్లానే తన కుటుంబాన్ని అణగదొక్కటానికి ప్రయత్నించిన పీవీని క్షమించిఉండొచ్చు.
రిప్లయితొలగించండిగాంధీ కుటుంబాన్ని ఆ..ణ..గ..దొ..క్కా..లనుకున్నారా?!
తొలగించండిహార్డ్ కొర్ కాంగ్రెస్ అభిమానుల నుంచి కూడా వినని వాదన ఇది!!
ఆ పని చేయడం ఎవరికైనా సాధ్యమేనా? తన పరిధులు, పరిమితులు బాగా తెలిసిన పీవీ అలాంటి తలకి మించిన పనులు పెట్టుకున్నారని నేను అనుకోవడం లేదండీ..
ఓ కొత్త ఆలోచనని పంచుకున్నందుకు ధన్యవాదాలు..
అభిమానంవలన మీకు బాగా ఆశ్చర్యం కలిగించిఉండొచ్చుగానీ, this is a fact, not discussed much in media, but open secret known to every one in Delhi political circles. Still, if you google about it, you can find the details of cold rivalry between Sonia and PV.
తొలగించండిఅణగద్రొక్కటం అన్నది ఒక విధానంగా సోకాల్డ్ నెహ్రూ-గాంధీ కుటుంబం పాటించిందని అందరికీ తెలుసు. ఇప్పుడు స్వర్గీయ పీవీ గారే వారి కుటుంబం గురించి అలా ఆలోచించారనటం ఎలాగో అలా పీవీని తప్పుబట్టేందుకు తాపత్రయపడటంగానే అనిపిస్తోంది. పీవీ నిర్యాణం చెందిన సందర్భంలో ఆయన పట్లా ఆయన పార్ధివదేహం పట్లా ఆ కుటుంబం ఎంత అమానవీయంగా ప్రవర్తించిందో తలచుకుంటేనే ఆకుటుంబం పట్ల అసహ్యం కలుగుతుంది అందరికీ. ఇప్పుడు చూడండి పీవీ శతజయంతిని ఘనంగా నిర్వహించాలి అని తెలంగాణా ప్రభుత్వం మొదలుపెట్టగానే పీవీకి ఉన్న ఔన్నత్యాన్ని తమ గొప్పదనంగా చెప్పుకోవటానికీ ఆయనకు వచ్చిన కీర్తిలో తమవాటా వందశాతం అని గోల చేయటానికి ఆకుటుంబం, ఆ కాంగ్రెసుపార్టీ పడుతున్న ఆరాటం చూస్తే మరింతగా జనానికి వాళ్ళంటే మండుకు వస్తున్నది.
తొలగించండి@Sravan: "this is a fact, not discussed much in media, but open secret known to every one in Delhi political circles." ఇది అన్నింటికన్నా ఆశ్చర్యం!! ఇంత మసాలా వార్తని ఇన్నేళ్ల పాటు మీడియా వదిలేసిందా? పీవీని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పటివరకూ ఎక్కడా (వ్యాసాల్లోనూ, పుస్తకాల్లోనూ కూడా) ప్రస్తావించని సంగతి ఇది.. సోనియా-పీవీల మధ్య వైరం ఉందనడానికి వేరే సాక్ష్యం ఎందుకు చెప్పండి? పీవీ అంత్యక్రియల ఎపిసోడ్ ఒక్కటి చాలు కదా..
తొలగించండి@శ్యామలీయం: ధన్యవాదాలండీ..
కాసు బ్రహ్మానంద రెడ్డి గారు దిగిపోగానే 1971 September 30 మొదలు 1973 January 10 వరకు పాములపర్తి వెంకట నరసింహా రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు.అప్పుడు రగిలిన జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాష్ట్రపతి పాలన విధించాక శ్రీమతి ఇందిరా గాంధీ ఈయన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి తన సలహాదారును చేసుకున్నారు.అప్పటి నుంచి శ్రీమతి ఇందిరా గాంధీ ఆజీవపర్యంతం తీసుకున్న అనేకమైన కీలక నిర్ణయాల వెనక నరసింహా రావు గారి ముద్ర కనబడుతూనే ఉంటుంది.నరసింహారావు గార్ని నిర్ణయాల్ని కాపీ పేస్టు చేసేటంత అసమర్ధురాలు కాదు శ్రీమతి ఇందిరాగాంధీ, కానీ నరసింహారావు గారి సూచనల్ని అర్ధం చేసుకుని ఆచరణలోకి తీసుకురావడం వల్లనే శ్రీమతి ఇందిరా గాంధీ ఇంటా బయటా ఎన్నో సంచలన విజయాలను నమోదు చెయ్యగలిగారనేది వాస్తవం.
తొలగించండిఅంటే, కేంద్రానికి వెళ్ళి షాడో ప్రైమ్మినిష్టర్ అనిపించుకోగలిగిన నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఫెయిలయ్యాడో అర్ధం కావడం లేదూ!నరసింహా రావు గారు వ్రాసిన Insider అనే పేర్లు మార్చిన ఆత్మకధలోని Mahendranath అనే పాత్ర నీలం సంజీవరెడ్డి గారిదీ అతని శత్రువైన Chaudhury అనే పాత్ర కాసు బ్రహ్మానంద రెడ్డి గారిదీ అని జరిగిన చరిత్రనీ కధలోని సంఘటనల్నీ పోల్చి చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిపోతూనే ఉంటుంది.
నవలలో ప్రత్యేకించి ప్రస్తావించనప్పటికీ ఆయన్ని పదవినించి తప్పించడానికి ఉపయోగపడిన ఆనాటి జై ఆంధ్ర ఉద్యమానికి ఈ ఇద్దరు రెడ్ల ఆధిపత్య రాజకీయాలు కారణం అయి ఉంటాయని అనుకుంటున్నాను నేను.
I respectfully disagree with Sravan. All the info about this (Shri PV trying to finish off the Gandhi family politically is the creation of the anti PV camp, Arjun Singh and the likes). PV garu knew his limits very well- he did not have his own lobby and very weak in playing lobby politics. This was always the case since the beginning of his career in Congress. Posts came to him because: a) He did not belong to any lobby so would never play the politics and b) because of his scholarship and knowledge, as some of the posts like External affairs need such knowledge. Let us also not forget, every important policy had to be vetted by him, as there were very few in Congress with such depth of knowledge.
రిప్లయితొలగించండిAlso he was very ripe in age and was in fact contemplating retirement. Hence he had nothing to gain by playing politics against the big family.
పీవీ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరైనా బలమైన నాయకులు వచ్చినా లేదా పీవీకి ఓ వర్గం ఉండి అది కాంగ్రెస్ లో పవర్ సెంటర్ పాత్ర పోషించినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడానికి అవకాశం ఉండేదండీ.. నెహ్రు కుటుంబం మీద పీవీ అంత కుట్ర చేస్తే ఇన్నాళ్లూ ఎవరూ మాట్లాడకపోవడం అన్నది ఒక్కటే ఏమాత్రం అర్ధంకాని విషయం. పోనీ పీవీ 'గౌరవార్ధం' దాచిపెట్టారా అనుకుందాం అన్నా (ఇది అసాధ్యమే కానీ, అనుకోలు కోసం) కాంగ్రెస్ పార్టీ పీవీ గౌరవాన్ని ఏమాత్రం నిలబెట్టిందో అందరం చూశాం కదా.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు..
తొలగించండిమురళి గారు, పీవీ గౌరవార్ధం అన్నమాటే తలెత్తదండీ. అయన్ను ఆ కాంగ్రెసు పార్టీ యాజమాన్య కుటుంబం ఎప్పుడూ ఆటలో అరటిపండుగానే లెక్కెవేసింది. అయన ఆంధ్రారాజకీయాల్లో ఉన్నప్పుడూ జాతీయరాజకీయాల్లో ఉన్నప్పుడూ కూడా. ఈరోజున హఠాత్తుగా సదరు పార్టీకి/కుటుంబానికి పీవీపై పుట్టుకొచ్చిన గౌరవప్రేమాదరాలు వగైరాలను కేవలం డామేజీ కంట్లోల్ కోసం వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ క్రిందే జనం లెక్కవేస్తారు. దీన్ని వల్ల వాళ్ళు మరింత అభాసుపాలు అవుతున్నారు.
తొలగించండిశ్యామలీయం గారు,
రిప్లయితొలగించండిరాముడి తర్వాత లవకుశులనే రాజుగా ఎందుకు చేయాలి? ఓ.. కుటుంబపాలన అని తెగ గింజుకుంటున్నారే ? మీ రాముడు చేస్తేనే శృంగారమా ?
మురళి గారు,
రిప్లయితొలగించండికాంగ్రెస్ పార్టీలో సోనియా గెలిచిన తర్వాత కూడా ప్రధానిని చేయనివ్వలేదు. కేసీఆర్ తన కొడుకుని కాదని దళితేరుడిని ముఖ్యమంత్రిని చేస్తారా ? వైఎసార్ చేసి ఉండేవాడా ? మీకందరికీ ఆడిపోసుకుంటానికి కాంగ్రెస్ దొరుకుతుంది. పీవీ, అద్వానీలు చేసింది ఘోరమైన తప్పు, దానికి వారు అనుభవించారు...అంతే !
ముందుగా ఒక విషయం.. నాకు కాంగ్రెస్ మీద (ఆ మాటకొస్తే ఏ పార్టీ మీదా) అభిమానం, వ్యతిరేకత కూడా లేవు.. కాబట్టి నేను ఆడిపోసుకోవడం లేదు.
తొలగించండికాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా, సోనియా ప్రధాని కాకుండా పీవీ అడ్డుకున్నారా?!! నాకు తెలిసినంత వరకు, ఆ ఎన్నికల ఫలితం తర్వాత సోనియా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తో చర్చలు జరిపిన తర్వాత మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా ప్రకటించారు. ఆ చర్చల్లో ఏం జరిగింది అన్నది ఇప్పటికీ మిస్టరీనే. కలాం మన మధ్య లేరు, ఎప్పటికైనా సోనియా ద్వారానే తెలియాలి.. (అప్పట్లో మీడియాలో వచ్చిన ఊహాగానాల ప్రకారం, సోనియా విదేశీయత రాజ్యాంగపరంగా ఇబ్బంది అవుతుందని కలాం సలహా ఇచ్చారనీ, సోనియా ఆ సలహాని గౌరవించారనీను.. నిజం సోనియాకి మాత్రమే తెలుసు)
వైఎస్ బతికి ఉంటె ఏం చేసేవారన్నది ఇపుడు కేవలం ఊహాజనితం. ఇక కేసీఆర్ అయితే తెలంగాణ రాగానే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. (దళితేతరుణ్ణి కాదు). ఆ పార్టీ నాయకులూ, రాష్ట్ర ప్రజలు, ప్రసార సాధనాలూ ప్రశ్నించాలి.. ఇప్పటివరకూ ఎక్కడా ఆ ప్రశ్న గట్టిగా వినిపించినట్టు లేదు..
ఇక, శ్యామలీయంగారికి మీరు సంధించిన ప్రశ్నకి నాకు తోచిన జవాబు: రాముడున్నది రాజరికంలో.. కాబట్టి రాజు కొడుకు యువరాజు అవ్వడమే రాజరికంలో రివాజు.. ఢిల్లీ నవాబుల శకం వరకూ ఇదే పధ్ధతి కొనసాగిందన్నది మీకు తెలియంది కాదు.
>>నాకు కాంగ్రెస్ మీద (ఆ మాటకొస్తే ఏ పార్టీ మీదా) అభిమానం, వ్యతిరేకత కూడా లేవు..>>
తొలగించండిఅబద్దం...మీ గత పోస్టులో జగన్ మీద విపరీత ప్రేమ కురిపించారు. కాంగ్రెస్ ని తిడతారు,జగన్ మీద ప్రేమ కురిపిస్తారెందుకో అర్ధం కాదు. అందరూ ఆ తానులో ముక్కలే కదా ? పోనీ జగన్ ఏమైనా నీతివంతుడా అని అడిగితే రాజకీయ నాయకుల్లో అవినీతి చేయనిదెవరని సమర్ధన ఒకటి.
>>>కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా, సోనియా ప్రధాని కాకుండా పీవీ అడ్డుకున్నారా?!! >>>
తొలగించండిపీవి అడ్డుకున్నారని నేను వ్రాయలేదు.మొగుడు చావకుండానే ముండమోస్తానని బెదిరించి ఇపుడు ఆవిడే చచ్చి పీవీ గారితో ముచ్చట్లు పెడుతుంది పైన.
మీరు శ్రవణ్ గారికి ఇచ్చిన సమాధానంలో కూడా వెటకారంగా సమాధానం ఇచ్చారు.గోదారోళ్ళకి వెటకారం ఎక్కువని (వాళ్ళే) ఒప్పుకున్నాక ఏమీ చేయలేమనుకోకండి.
>>>కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా, సోనియా ప్రధాని కాకుండా పీవీ అడ్డుకున్నారా?!
తొలగించండిఇక కేసీఆర్ అయితే తెలంగాణ రాగానే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. (దళితేతరుణ్ణి కాదు).
మళ్ళీ వెటకారం...దళితేతరుడు అని ఆలోచించే వ్రాసాను. దళితుడు అని ఆయన అన్నా కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం అనేది చాలా అసాధ్యమైన విషయం.దళితేతరుడిని కూడా చేయరు అని నా ప్రగాడ విశ్వాసం. ఆయనేమన్నా ఇందిరాగాంధీ లాంటి వాడా ?
>>>రాముడున్నది రాజరికంలో.. కాబట్టి రాజు కొడుకు యువరాజు అవ్వడమే రాజరికంలో రివాజు.. ఢిల్లీ నవాబుల శకం వరకూ ఇదే పధ్ధతి కొనసాగిందన్నది మీకు తెలియంది కాదు.>>>
తొలగించండిరాచరికంలో రాముడికే దిక్కూ దివాణం లేకుండా 14 ఏళ్ళు వనవాసం చేసాడు.నేను చెప్పింది అదే ప్రజలు కోరుకుంటేనే రాజులవుతారు. ఊరికే కాంగ్రెస్ ని ఆడిపోసుకోకండి.రాముడికి అన్యాయం జరిగింది అని ఇపుడు ఎవరిమీదపడి ఏడుస్తారు? పీవీ చేసుకున్న ఖర్మ పీవీ అనుభవించాడు.
రాముడికి "ఆదర్శదాంపత్యం" లాగానే పీవీకి "భారత రత్న" కూడా ఇచ్చుకోండి ఎవరొద్దన్నారు ? పీవీ కి భారతరత్న రాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోంది అని మాత్రం అనకండి.
// “ దళితేతరుడిని కూడా చేయరు “ //
తొలగించండికె.సి.ఆర్ తాను దళితేతరుడేగా 🙂?
వినరా వారు,
తొలగించండిమీరు కూడా వెటకారం మొదలెట్టేసారా? ఆయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అన్నారు. తనే ముఖ్యమంత్రి అని అనలేదు. ఆయన దళితుడిని కాదు కదా దళితేతరుడిని కూడా ముఖ్యమంత్రిని చేయరు.
మీకు అర్ధం అవుతుందా ?
కాంగ్రెస్ పార్టీ ఎపుడు గెలిచినా విధేయులుగా ఉండేవాళ్ళనే ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా నియమించింది. మన్మోహన్ సింగ్ గారు, పీ వీ గారు, రోశయ్య గారు, అంజయ్య గారు మొదలైన వారు.
రిప్లయితొలగించండివిధేయుడుగా ఉండమంటే స్వంత నిర్ణయం తీసుకుంటే కుట్ర కాదా ? పీవీ మీద ప్రేమ ఒలకబోసేవారందరూ బాబ్రీ విషయంలో నోరెత్తరు కనీసం ప్రస్థావించే ధైర్యం కూడా ఉండదు.
విధేయులని నియమించుకోవడం కాంగ్రెస్ సంస్కృతి కదండీ.. మొదటి నుంచీ ఆ పార్టీ పధ్ధతి అదే.. పీవీ తీసుకున్న సొంత నిర్ణయాలేమిటో, వాటి వెనుక ఉన్న కుట్రలేమిటో మీరే చెప్పాలి. పీవీ రాసిన పుస్తకాలూ, మిగిలిన వాళ్ళు రాసిన వాటిలో కూడా ప్రధానిగా పని చేసినంత కాలం పీవీ క్రమం తప్పకుండా సోనియా దర్శనానికి వెళ్లి, రెగ్యులర్ అప్డేట్లు ఇచ్చే వాళ్ళనీ, 'ఇది అవసరమా?' అని అడిగినవాళ్ళకి ఆయన మౌనమే సమాధానమనీను. బాబరీ విషయంలో ఏం మాట్లాడాలని మీరు భావిస్తున్నారో అర్ధం కాలేదు. కూల్చివేతని అన్ డూ చేయడం అన్నది జరగని పని కదా. కూల్చివేత ఎలా జరిగిందో పీవీనే స్వయంగా రాశారు, బాధ్యత వహించారు తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కూల్చివేతకు పీవీకి బాధ్యత లేదని నాకు తెలిసి పీవీతో సహా ఎవరూ అనలేదు మరి.
తొలగించండి>>>పీవీ తీసుకున్న సొంత నిర్ణయాలేమిటో, వాటి వెనుక ఉన్న కుట్రలేమిటో మీరే చెప్పాలి>>>
తొలగించండికూల్చివేత ఎలా జరిగిందో పీవీనే స్వయంగా రాశారు, బాధ్యత వహించారు తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కూల్చివేతకు పీవీకి బాధ్యత లేదని నాకు తెలిసి పీవీతో సహా ఎవరూ అనలేదు మరి.
మీరే ప్రశ్న వేసి మీరే సమాధానం చెప్పేస్తారా ? బాబ్రీ కూల్చి వేతలో ప్రతిపక్షానికి సహకరించడం కుట్ర కాదా ?
చంద్రస్వామి & లక్ష్మీకాంతమ్మ కూడా కాలం చేసారు కనుక ఇప్పుడు అప్పటి ముచ్చట్లు బహర్గతం చేసే వ్యక్తులు ఎవరూ మిగల్లేదు. శరద్ పవార్ ఆత్మకథ రాస్తే తప్ప అన్నీ ఊహాగానాలే చెలామణి అవుతాయి.
తొలగించండిThere was little Shri PV could do, to save Babri. The Liberian commission looked into this thoroughly.
తొలగించండిBJP played very clever game. Their CM Shri Kalyan Singh gave written affidavit in the Supreme Court that the state govt would ensure its safety. The center did send the forces, but it was up to the state govt to use them. The center could not deploy them on its own as law and order was the state subject. Also if center forced its way it would have invited contempt of the court proceedings because of the affidavit given to SC (by the CM).
The other option people talk about was dismissing UP govt using article356. This article became highly debatable as the it was absused a lot in the past. Also, the then President Dr.SD Sharma would not have given his approval. DR. Dharma himself was a scholar, constitutional expert, would not have yielded into sign it. Let us not forget, he was sent to APas the governor, to undo the damage done by the governor before him (dismissing NTR). Thus De.Sharma knew 356 only too well, and was very critical of the same, averse to using it. UP CM itself is a constitutional position, and when it gave assurance to Supreme Court which has been accepted by the court, how can the assurance be distrusted and govt dismissed?
తరాలు మారడంతో ఇందిరా రాజీవ్ ల పేర్లు జనాలు చాలావరకూ మరిచిపోయారు. ప్రస్తుతం నడివయసులో ఉన్నవారికి గుర్తుంది పీవీనే. కాబట్టి ప్రతిఒక్కరూ atm లా వాడేసుకుంటున్నారు.
రిప్లయితొలగించండిఇక కాంగ్రెస్ అధినాయకులకు కావలసింది విధేయత. అది చూపించేవారికే పదవులన్నీ. ఆ విధేయత లేనినాడు ఎవరినైనా తీసి పారేస్తారు. వైఎస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిర జలప్రభ అంటూ ఎంత విధేయత చూపించినా, తమకు ఎదురు తిరిగేసరికి జగన్ ని ఎన్ని కేసుల్లో ఇరికించారో తెలుసుగా.
వారికున్న తిక్క లక్షణమే కాంగ్రెస్ ని సరైన నాయకులు లేని పార్టీగా మార్చేసింది. ఆంధ్రా తెలంగాణాలలో ఆ పార్టీకి పట్టిన గతే ఉదాహరణ!
రాముడి వంశం ఇపుడు అంతరించిపోలేదా ? కాంగ్రెస్ పార్టీ అంతే...ఎల్లకాలమూ ఒకే వంశం పరిపాలించలేదు.
తొలగించండిమురళిగారూ, మొన్న మీరు వ్యక్తం చేసిన సందేహాలు, ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇక్కడ లభించవచ్చు - https://trendingtelugunews.com/top-stories/features/sonia-versus-pv-narasimharao-background-story/
రిప్లయితొలగించండి"దానికి కారణం ఆయన మనసులో వేరే కాంత ఉందని వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన పీవీఆర్కే ప్రసాదే స్వయంగా తన రచనలలో పేర్కొన్న విషయం తెలిసిందే"
తొలగించండిఆ కాంతమ్మ ఎవరో ప్రసాదు గారు చెప్పారా లేదాండీ?
@Sravan: మీ మరో వ్యాఖ్యని నేను ప్రచురించడం లేదు. తేళ్ల లక్ష్మీ కాంతమ్మతో పీవీ సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. అనేక పుస్తకాల్లో ప్రచురింపబడిన విషయమే. ఆ కారణానికి ఆమె కుటుంబాన్ని ఈ చర్చలోకి లాగనవసరం లేదని, అందుకు ఇది వేదిక కానవసరం లేదనీ నా అభిప్రాయం. ఇక, అదే వ్యాఖ్యలో పీవీ గురించి మీ వాక్యాలు యధాతధంగా: "లక్ష్మీకాంతమ్మ ఒక్కతే కాదు, ఏపీలోని మూడు ప్రాంతాలలో ఒక్కొక్కరి చొప్పున మెయింటెయిన్ చేశారట. పైగా భార్యను కొట్టేవాడట."
తొలగించండిHe maintained one mistress each in the three regions? Used to beat his wife? Even his worst detractors too couldn’t make such allegations. I too never heard about them.
తొలగించండిNone of these allegations justify the ill treatment meted out to him. None of them can take away the credit he deserves for his stellar performance as the PM.
Congis never talk much about the fact that when he implemented land reforms, he walked his talk, surrendered hundreds of acres of lands.
నాగేశ్వరరావుగారూ, మీకు తెలియనంతమాత్రాన వాస్తవం వాస్తవం కాకుండా పోదు. ప్రధానిగా ఆయన performance ను ఎవరూ కాదనలేరు. వ్యక్తిగతంగా corruption లేదు. వందల ఎకరాలు ఇచ్చేశారు. దేనికదే విడిగా చూడాలి. కాకపోతే, మీలాంటి అభిమాన వర్గం వారు రాజర్షిత్వం కట్టబెట్టేటంత వ్యక్తిత్వం ఆయనది కాదని గమనించాలి. మనుషులందరిలాగానే ఆయనకూ బలహీనతలు ఉన్నాయి. సిక్కుల ఊచకోత సమయంలో హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యా తీసుకోకుండా కావాలని మౌనంగా కూర్చున్నాడు. ఇది ఎలాంటి రాజధర్మం? చంద్రస్వామి ఒక typical conman అని, క్షుద్ర స్వామీజీ అని, వెధవ అని అందరికీ తెలుసు. వాడికి రాజీవ్ హత్యలో ప్రమేయం ఉందని తెలుసు. వాడిని వెంటబెట్టుకుని తిరిగాడంటే ఏమిటి అర్థం?
తొలగించండిమురళిగారూ, Its okay. కుటుంబసభ్యుల విషయాన్ని నేనూ బహిరంగంగా చర్చించదలుచుకోలేదు. ఇక్కడ చర్చలో ఉన్నది small group of people కదా అని ఇక్కడ రాశాను. అయితే వారి కుటుంబసభ్యులకుకూడా ఇవన్నీ తెలుసు. బహిరంగ రహస్యమే. వారు తమ ఫేస్ బుక్ వాల్స్ పైన ఆమె గురించి గొప్పగా రాసుకుంటూఉంటారు. అది నేనుచూడటంకూడా జరిగింది.
తొలగించండిSravan garu, I believe he did not have the free hand or power (as HM) during the riots. About Chandraswami - agree, he should not have entertained him.
తొలగించండి"I believe he did not have the free hand or power (as HM) during the riots"
తొలగించండినాగేశ్వరరావు గారి వ్యాఖ్య సబబుగానే తోస్తుంది. కాకపొతే ఇదే మాట నరసింహారావు చేసిన అన్ని అధికారిక విషయాలకు వర్తిస్తుందేమోనని అనుమానం.
If he blindly obeyed high command orders in *this* matter, he *also* did so in *all* other matters. His supporters can't claim credit for *some* points, just because these are seen as "good".
మంచి జరిగినప్పుడు సొంత ఖాతా, చెడు మాత్రం అధిష్టానం ఒత్తిడి అంటే ఎట్లాగ?
"About Chandraswami - agree, he should not have entertained him"
ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి: ఇద్దరిలో ఎవరెక్కువ ప్రమాదకరం? చెప్పగలిగిన "ఆ నలుగురు" ఇప్పుడు లేరు.
Jai garu, he did not obey high command blindly. He argued, differed and convinced too, many a time, because MrsGandhi trusted him and respected his wisdom.
తొలగించండిComing to the riots, Rajiv had just taken over as the PM. It is known inside the Congress circles, he thought all the old guard are outdated and hence did not trust them much. Only few (young) folks like ARUN Singh/ARUN Nehru had his eyes and ears. Hence Shri PV could not do much.
To be fair to Shri Rajiv Gandhi, he was still in the shock (of his mother’s death). Had he known before the killings would be so brutal, he would dine everything including deploying army. He tried to control things, but it was too late.
@Nageswara Rao:
తొలగించండిSir, my main point is that different yardsticks are being applied to success & failures. A fair assessment requires acknowledging both positives & negatives.
@Jai garu, rightly pointed out. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి లబ్దికలిగేలా ప్రవర్తించటమంటే కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేయటం కాదా. మసీదు కూలటంవలన కాంగ్రెస్ పార్టీ కూడా హిందూఅనుకూల పార్టీ అనే ముద్ర పడుతుందని పీవీకి తెలియదా. పార్టీ అనుసరిస్తున్న సెక్యులర్ విధానానికి ఇది వ్యతిరేకమని తెలియదా. అది ఒక్కటే కాదు. ఏపీలో పార్టీని ఎలా నాశనం చేశారో తెలిసిందే. ఏమాత్రం నాయకత్వ లక్షణాలు లేని మజ్జి తులసీదాస్ ను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. అభ్యర్థుల ఎంపిక worst గా చేశారు. ఇవన్నీ పార్టీకి damage చేసేవని అతనికి తెలుసు. పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేయటం ఎంతవరకు సబబు? భారతంలో భీష్ముడికి కౌరవులది తప్పని తెలిసినా స్వధర్మం పాటించి వారి తరపునే పోరాడాడుగానీ కౌరవులతోనే ఉంటూ పాండవులకు లబ్ది చేకూర్చేలా చేయలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక సామాజికవర్గంవారికి ఒక ఐకానిక్ ఫిగర్ కావాలి. They need some iconic figure to look up to. వారిదే ఈ బాధంతా.
తొలగించండిLiberhan commission delved deeply into the Babri issue. I posted the details above. There was not much PV could do.
తొలగించండిPl. don’t confine PV to one group of people.
@Nageswara Rao: Today I have seen posters on the social media highlighting film actor Sonu Sood's caste by some people. It's their perspective, after all.
తొలగించండిలింకులో మీరు చర్చించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి, శ్రవణ్ బాబు గారు.
రిప్లయితొలగించండిస్టెనోలు, పియేలు సైంధవుడి పాత్ర పోషించ గల ఘనులే అనుకోండి, అది లోకవిదితమే. కానీ తనను రాజ్యసభ మెంబరు చెయ్యలేదనే అక్కసుతో ఇద్దరు పెద్దనాయకుల మధ్య తంపులు పెట్టగలిగాడంటే అతని మాటలకు అంత విలువనిచ్చిన వారిననాలి. నిర్ణయాన్ని ఎదుటి వ్యక్తి ఇష్టానికి వదిలేసి, ఆ తరువాత తనకు అనుకూలంగా జరగలేదని మనసులో పెట్టుకోవడం సరికాదు. అయినా అంత చాణక్యుడి లాంటి పీవి గారు ఈ విషయంలో కాస్త లౌక్యం చూపించి ఆ జార్జికే సీటు ఇస్తే పోయేదేమో అసలు?
ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఒకసారి పొరపొచ్చాలు చోటు చేసుకుంటే ఇక దాన్ని ఎగదోస్తూ తాము దగ్గరయ్యి, లాభ పడదామనుకునే ప్రయత్నం చేసేవారు బోలెడంత మంది ఉంటారు. అది ఇతర రాజకీయ నాయకులు కావచ్చు, ఆ కాలంలో బాగానే వెలిగిన స్వామీజీలు కావచ్చు. Politics makes strange bedfellows అనే సామెతే ఉంది.
మీ విశ్లేషణా వ్యాసం ఆఖరి పేరాలో మీరు చేసిన ప్రస్తావన అక్కడ సందర్భేచితంగా లేదు అని నా అభిప్రాయం. పివి గారు తన భార్య పోయినప్పుడు అంత్యక్రియలకు వెళ్ళక పోవడానికీ, ఆయన మరణించినప్పుడు ఆయన పార్థివదేహానికి సోనియా తగిన గౌరవం ఇవ్వకపోవడానికీ .... సంబంధం ఏమిటో నాకయితే బోధపడడం లేదు.
నా ఉద్దేశ్యం పీవీ భౌతికకాయానికి అవమానం చేసిందని ఆయన అభిమానులు సోనియాను ఆడిపోసుకుంటున్నారు. బాగానే ఉంది. అసలు ఆయనే తన భార్య final ritesకు హాజరు కాలేదు. మరి దానికి ఆయన అభిమానులు ఏమంటారోనన్నది నా ప్రశ్న.
తొలగించండిసపోజ్ మీకు కరోనా వచ్చిందనుకోండి. డాక్టర్లు పట్టించుకోవట్లేదు.
తొలగించండిఅపుడు మీ ఫ్రెండ్ వాట్సాప్ కాల్ చేసి "పోయినసారి నాకు జ్వరం వస్తే నువ్వు పరామర్శించలేదు, నీకిలా అవ్వాల్సిందే" అని చెప్తే నోరు మూసుకుని ఇంటికెళ్లిపోతారా లేక డాక్టర్లని ట్రీట్మెంట్ డిమాండ్ చేస్తారా?!
మీలాంటి అభిమాన వర్గంవారి ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను.
తొలగించండిబొడిగుండుకీ మోకాలికి మీరు http లింకు పెట్టడాన్ని సూటిగా ప్రశ్నిస్తే అభిమాన వర్గం, ఆవకాయ అంటారేమిటి?
తొలగించండినేను ఆగ్రహిస్తే ఆ కామెంట్ ఇక్కడ ప్రచురించబడదు.