పొద్దున్న పది కొట్టేతలికి ఒక్కసారిగా కాలీ అయిపోతాను.
పిల్లలిద్దరూ సదువులికీ, ఈయనగోరు ఉజ్జోగానికీ బయలెల్లేక సందలడే వొరుకూ
పెద్దగా పనేటీ వుండదు. కుంచేపు పేపరు సూసేసి, టీవీ ఎట్టుకోటవే. పేపర్లో మా
డిపాటుమెంటు వోర్తోటి సిన్నదేసేరు. పొటో ఎయ్యిలేదు.
కూడబొలుక్కుని సదివి, సినిమా బొమ్మలు సూసేసి, పేపరు దాని సోట్లో ఎట్టేసి, అప్పుట్టీవీ ఎట్టేను. ఇల్లన్నాక గాలీ, ఎల్తురూ ఉండాలనేసి, ఎక్కడొస్తువులక్కడ ఎట్టుకోవాలనేసి సిన్నప్పన్నించీ మా సెడ్డ కోరిక నాకు.
సిన్నప్పుడంతా పోలీసు కోటర్సులోనే ఉండేవోల్లం. నానది కానిస్టీబులుజ్జోగం. కోటర్సు పక్కల్ని మురుగ్గుంట్లున్నాయో, మురుగ్గుంట్ల మజ్జిలో కోటర్సున్నాయో మాకే తెలిసీది కాదు. అక్కడికీ, మిగిలిన కోటర్సోల్లు లోపల బాగానే సదురుకునీవోల్లు. మాయమ్మ మాత్తరం ఇంట్లోపల కూడా మురుగ్గుంట్లాగే ఉండిచ్చేది.
నేనెప్పుడన్నా సదరడం మొదలెడితే "నీకుప్పుడు పెల్లోరొత్తన్నారంటే?" అంటా ఈపు సితక్కొట్టేది. అమ్మోరమ్మ దయిలేక ఎన్ని దెబ్బలు కాసేనో లెక్కేలేదు.
మాయమ్మకే అద్దుమాలిన కోప్మనుకుంటే, నానకి అంతకొందరెట్లు కోపం. యే రోజూ తాగి రాటవే. ఆ మడిసి రాటంతోనే మాయమ్మ గుమ్మంలోనే తగువేసుకునీది. సితక్కొట్టీసీవోడు మానాన. అయినా గానీ మాయమ్మ ఏమాత్తరం తగ్గేది కాదు. ఉన్నదున్నట్టు సెప్పుకోవాల, ఏనాడూ మా నాన నామీస్సెయ్యెత్తింది లేదు.
అయితే మాత్తరం, ఆ తగూల్సూసి నా గుండి జారిపోతా ఉండేది. అదుగో, అప్పుడు సెప్పేరు పక్కోటర్సు ఆంటీగారోల్లు.. "అమ్మోరమ్మని కొలుసుకోయే బాగ్గెవా.. ఆయమ్మ నిన్ను సల్లగా సూత్తాదీ" అని.
ఏమూర్తానా తల్లిని కొల్డం మొదలెట్టేనో, ఆరోజు మొదలుకుని సల్లగానే సూత్తన్నాది తల్లి. ఒక్కోపాలేటవుద్దో గానీ పరిచ్చింతా ఉంటాది. ఇదుగో ఉప్పుడు నా పాపిస్టి జెనమం సేతా తల్లికేం లోటు సేసేనో, పరిచ్చింతన్నాది నన్ను.
టీవీ ఎట్టేను కానీ పట్టుమని పది నిమిసాలు ఏ సేనలూ సూళ్ళేకపోతన్నాను. అసల్దీన్ని టీవీ అనగూడదంట. దీనిపేరు ఓమ్ దియేటరో ఏదోనంట. బాబిగాడు పద్దాకలా సెబుతానే ఉంటాడు. ఆడికి నేనంటే పేనం. పొద్దుగూకులా అమ్మా అమ్మా అంటా నా ఎనకే ఉంటాడు. బంగార్తల్లియయితే అచ్చుగుద్దేసినట్టు దాని బాబ్బుద్దులే. నోరు తెరిత్తే నోట్లో దాసిన బంగారం బయటడిపోతాదని బయివేమో దానికి. నేనల్లాగుండ్లేనుమరి.
మొన్నామజ్జిన దాని ప్రెండొచ్చింది. అల్లిద్దరూ పిల్లల గెదిలో కబుర్లు సెప్పుకుంటన్నారు. పిల్లల ప్రెండ్సులొచ్చినప్పుడల్లా నేన్దూరంగా ఉండి ఆల్లక్కావొల్సినయి సూత్తాను గానీ, పోలీస్జవాన్లాగా అక్కడే పాతుకుపోను. మాయమ్మతల్లితో నేను పడ్డ బాదలు ఈ జెన్మకి మర్సిపోతానా. నాకోసవనేసి ఇంటికి రావాలంటే బయపడి సచ్చేవోల్లు నా సావాసగత్తిలు.
సరే, ఆయేల బంగార్తల్లి, దాని ప్రెండు కబుర్లు సెప్పుకుంటంటే ఏడేడిగా పకోడీలేసి అట్టుకెల్లిచ్చేనిద్దరికీని. ఆయమ్మి ఓ పకోడీ నోట్లో ఏసుకుని ఏదో అన్నాది.. స్పీటన్న మాట మాత్తరం ఇనబడ్డాది. పకోడీ కారవెడతన్నాది కామాల, స్పీటడుగుతున్నాదీ పిల్ల అనుకున్నాను. అమ్మోరమ్మ దయివల్ల ప్రిజ్జిలో గులాజ్జావున్నాదన్న సంగతి టయానికి గురుతొచ్చి అట్టుకెల్లిచ్చేను. ఆలిద్దరూ ఒకల్లమొకాలొకల్లు సూసుకుని ఒకిటే నవ్వుకోటం.
ఆ పిల్లెల్లిపోయేక బంగార్తల్లినడిగేసేను. ఆయమ్మి స్పీటడగలేదంట. నన్నే స్పీటన్నాదంట. ఈ ముక్క ముందే సెప్పొచ్చు గదా. ఉంకో రెండేల్లు పోతే సదువైపోయి ఇంజినీరుజ్జోగంలో జేరతాది బంగార్తల్లి. అక్కడా ఇలాగే సేత్తాదో ఏటోమరి.
బాబిగాడి సదువవ్వటాకింకా నాలుగైదేల్లడతాది. ఆడేమో పోలీసవుతానంటన్నాడు. ఎక్కడికి పోతాది రగతం. ఆడు పోలీసయినా నాకేటీ పేసీ లేదు గానీ, జెవానుజ్జోగం గాదు, దొరుజ్జోగం జెయ్యాల. జెవానుజ్జోగాల కతలు సిన్నప్పన్నించీ సూత్తానే ఉన్నానుగదా.
మొదన్నించీ నాకు సదువు అంతంతమాత్తరవే. ఏనాడూ నాన నా సదువు సంగజ్జూల్లేదు. పైట పేరంటకం అవుతానే సదివింది సాలన్నాది మాయమ్మ. ఆ యింట్లో గాలాడక, బయిటికెల్లేక ఎన్నెన్ని బాదలడ్డానో నాకు తెలుసు, నేను కొలిసిన అమ్మోరమ్మకి తెలుసు.
ఆ టయంలోనే ఆంటీగారోల్ల ద్వారాగా ఈయినగోరి సంమందం వొచ్చింది. ఆంటీగారు మాయమ్మకేం సెప్పేరో తెల్దు కానీ, నా పెల్లి సెయ్యాల్సిందేనని మా నానకాడ పట్టట్టి సాదించింది. కుర్రోడిది కానిస్టీబులుజ్జోగం అన్తెలగానే పేణం ఉసూరుమన్నాది.
"నిన్ను కొలిసినందుకు మల్లీ కోటర్సు కూపానికే అంపుతున్నావా అమ్మోరమ్మా" అనుకున్నాను. అంతకన్నా నేనేం సెయ్యిగల్దును? మూర్తవెట్టేసుకున్నాక ఆంటీగారోల్లు నన్నాలింటికి పిలిసి సేనా సేప్మాటాడేరు. ఈయనగోరు కానిస్టీబులే గానీ పోర్సు గాదంట. కోటర్సు ఉండవంట.
"జెవాను బతుకంటే దొరగార్ల దయా దాచ్చిన్యవే బాగ్గెవా.. దొరక్కోపవొచ్చినా బూతులు జెవానుకే. దొర్ల మద్దిన మాట తేడా వొత్తే ఆ పెతాపవూ జెవానోడి మీదే.. దొరగోరి బంగలాలో ఆడర్లీ డూటీ గానీ పడ్డాదంటే ఆల్ల పెల్లాం పిల్లలకి సాకిరీ సెయ్యాలి.. ఆల్ల తిట్లూ కాయాలి" అంటా శానా ఇవరంగా చెప్పుకొచ్చేరు.
"ఇయ్యన్నీ పడ్డ జెవానోడు మరాడి కోపం ఎవడి మీస్సూపించాలి? ఎవున్నంటే ఎవుడూరుకుంటాడు? అన్నిటికీ లోకూగా దొరికీదింట్లో పెల్లవే గదే. అయినా గీనీ, అందరు మొగోల్లొక్కలాగుండ్రనుకో.. రోడ్నడకండా కాపరం సేసుకోయే.." అంటా సెప్పి పంపేరు. నిజంజెప్పాల, మాయమ్మిందులో ఒక్క మాటా సెప్పలేదునాకు. ఆవిడిగోరికి తెలిత్తే నాకు సెప్పకుండా ఉంటాదా?
సేనల్సు మారుత్తా మొగుడూ
పెల్లాల పంచాయితీ కాడాగేను. ఒకల్లమీదొకల్లు సినిమా ఏక్టరికి
నేరాల్జెప్పుకుంటన్నారు. కొత్తసీర కట్టుకుని, ఏసుకున్న కొత్త మోడలు గొలుసు
సేత్తో తిప్పుకుంటా ఇద్దరి మాట్లూ ఇంటన్నాదాయమ్మి.కూడబొలుక్కుని సదివి, సినిమా బొమ్మలు సూసేసి, పేపరు దాని సోట్లో ఎట్టేసి, అప్పుట్టీవీ ఎట్టేను. ఇల్లన్నాక గాలీ, ఎల్తురూ ఉండాలనేసి, ఎక్కడొస్తువులక్కడ ఎట్టుకోవాలనేసి సిన్నప్పన్నించీ మా సెడ్డ కోరిక నాకు.
సిన్నప్పుడంతా పోలీసు కోటర్సులోనే ఉండేవోల్లం. నానది కానిస్టీబులుజ్జోగం. కోటర్సు పక్కల్ని మురుగ్గుంట్లున్నాయో, మురుగ్గుంట్ల మజ్జిలో కోటర్సున్నాయో మాకే తెలిసీది కాదు. అక్కడికీ, మిగిలిన కోటర్సోల్లు లోపల బాగానే సదురుకునీవోల్లు. మాయమ్మ మాత్తరం ఇంట్లోపల కూడా మురుగ్గుంట్లాగే ఉండిచ్చేది.
నేనెప్పుడన్నా సదరడం మొదలెడితే "నీకుప్పుడు పెల్లోరొత్తన్నారంటే?" అంటా ఈపు సితక్కొట్టేది. అమ్మోరమ్మ దయిలేక ఎన్ని దెబ్బలు కాసేనో లెక్కేలేదు.
మాయమ్మకే అద్దుమాలిన కోప్మనుకుంటే, నానకి అంతకొందరెట్లు కోపం. యే రోజూ తాగి రాటవే. ఆ మడిసి రాటంతోనే మాయమ్మ గుమ్మంలోనే తగువేసుకునీది. సితక్కొట్టీసీవోడు మానాన. అయినా గానీ మాయమ్మ ఏమాత్తరం తగ్గేది కాదు. ఉన్నదున్నట్టు సెప్పుకోవాల, ఏనాడూ మా నాన నామీస్సెయ్యెత్తింది లేదు.
అయితే మాత్తరం, ఆ తగూల్సూసి నా గుండి జారిపోతా ఉండేది. అదుగో, అప్పుడు సెప్పేరు పక్కోటర్సు ఆంటీగారోల్లు.. "అమ్మోరమ్మని కొలుసుకోయే బాగ్గెవా.. ఆయమ్మ నిన్ను సల్లగా సూత్తాదీ" అని.
ఏమూర్తానా తల్లిని కొల్డం మొదలెట్టేనో, ఆరోజు మొదలుకుని సల్లగానే సూత్తన్నాది తల్లి. ఒక్కోపాలేటవుద్దో గానీ పరిచ్చింతా ఉంటాది. ఇదుగో ఉప్పుడు నా పాపిస్టి జెనమం సేతా తల్లికేం లోటు సేసేనో, పరిచ్చింతన్నాది నన్ను.
టీవీ ఎట్టేను కానీ పట్టుమని పది నిమిసాలు ఏ సేనలూ సూళ్ళేకపోతన్నాను. అసల్దీన్ని టీవీ అనగూడదంట. దీనిపేరు ఓమ్ దియేటరో ఏదోనంట. బాబిగాడు పద్దాకలా సెబుతానే ఉంటాడు. ఆడికి నేనంటే పేనం. పొద్దుగూకులా అమ్మా అమ్మా అంటా నా ఎనకే ఉంటాడు. బంగార్తల్లియయితే అచ్చుగుద్దేసినట్టు దాని బాబ్బుద్దులే. నోరు తెరిత్తే నోట్లో దాసిన బంగారం బయటడిపోతాదని బయివేమో దానికి. నేనల్లాగుండ్లేనుమరి.
మొన్నామజ్జిన దాని ప్రెండొచ్చింది. అల్లిద్దరూ పిల్లల గెదిలో కబుర్లు సెప్పుకుంటన్నారు. పిల్లల ప్రెండ్సులొచ్చినప్పుడల్లా నేన్దూరంగా ఉండి ఆల్లక్కావొల్సినయి సూత్తాను గానీ, పోలీస్జవాన్లాగా అక్కడే పాతుకుపోను. మాయమ్మతల్లితో నేను పడ్డ బాదలు ఈ జెన్మకి మర్సిపోతానా. నాకోసవనేసి ఇంటికి రావాలంటే బయపడి సచ్చేవోల్లు నా సావాసగత్తిలు.
సరే, ఆయేల బంగార్తల్లి, దాని ప్రెండు కబుర్లు సెప్పుకుంటంటే ఏడేడిగా పకోడీలేసి అట్టుకెల్లిచ్చేనిద్దరికీని. ఆయమ్మి ఓ పకోడీ నోట్లో ఏసుకుని ఏదో అన్నాది.. స్పీటన్న మాట మాత్తరం ఇనబడ్డాది. పకోడీ కారవెడతన్నాది కామాల, స్పీటడుగుతున్నాదీ పిల్ల అనుకున్నాను. అమ్మోరమ్మ దయివల్ల ప్రిజ్జిలో గులాజ్జావున్నాదన్న సంగతి టయానికి గురుతొచ్చి అట్టుకెల్లిచ్చేను. ఆలిద్దరూ ఒకల్లమొకాలొకల్లు సూసుకుని ఒకిటే నవ్వుకోటం.
ఆ పిల్లెల్లిపోయేక బంగార్తల్లినడిగేసేను. ఆయమ్మి స్పీటడగలేదంట. నన్నే స్పీటన్నాదంట. ఈ ముక్క ముందే సెప్పొచ్చు గదా. ఉంకో రెండేల్లు పోతే సదువైపోయి ఇంజినీరుజ్జోగంలో జేరతాది బంగార్తల్లి. అక్కడా ఇలాగే సేత్తాదో ఏటోమరి.
బాబిగాడి సదువవ్వటాకింకా నాలుగైదేల్లడతాది. ఆడేమో పోలీసవుతానంటన్నాడు. ఎక్కడికి పోతాది రగతం. ఆడు పోలీసయినా నాకేటీ పేసీ లేదు గానీ, జెవానుజ్జోగం గాదు, దొరుజ్జోగం జెయ్యాల. జెవానుజ్జోగాల కతలు సిన్నప్పన్నించీ సూత్తానే ఉన్నానుగదా.
మొదన్నించీ నాకు సదువు అంతంతమాత్తరవే. ఏనాడూ నాన నా సదువు సంగజ్జూల్లేదు. పైట పేరంటకం అవుతానే సదివింది సాలన్నాది మాయమ్మ. ఆ యింట్లో గాలాడక, బయిటికెల్లేక ఎన్నెన్ని బాదలడ్డానో నాకు తెలుసు, నేను కొలిసిన అమ్మోరమ్మకి తెలుసు.
ఆ టయంలోనే ఆంటీగారోల్ల ద్వారాగా ఈయినగోరి సంమందం వొచ్చింది. ఆంటీగారు మాయమ్మకేం సెప్పేరో తెల్దు కానీ, నా పెల్లి సెయ్యాల్సిందేనని మా నానకాడ పట్టట్టి సాదించింది. కుర్రోడిది కానిస్టీబులుజ్జోగం అన్తెలగానే పేణం ఉసూరుమన్నాది.
"నిన్ను కొలిసినందుకు మల్లీ కోటర్సు కూపానికే అంపుతున్నావా అమ్మోరమ్మా" అనుకున్నాను. అంతకన్నా నేనేం సెయ్యిగల్దును? మూర్తవెట్టేసుకున్నాక ఆంటీగారోల్లు నన్నాలింటికి పిలిసి సేనా సేప్మాటాడేరు. ఈయనగోరు కానిస్టీబులే గానీ పోర్సు గాదంట. కోటర్సు ఉండవంట.
"జెవాను బతుకంటే దొరగార్ల దయా దాచ్చిన్యవే బాగ్గెవా.. దొరక్కోపవొచ్చినా బూతులు జెవానుకే. దొర్ల మద్దిన మాట తేడా వొత్తే ఆ పెతాపవూ జెవానోడి మీదే.. దొరగోరి బంగలాలో ఆడర్లీ డూటీ గానీ పడ్డాదంటే ఆల్ల పెల్లాం పిల్లలకి సాకిరీ సెయ్యాలి.. ఆల్ల తిట్లూ కాయాలి" అంటా శానా ఇవరంగా చెప్పుకొచ్చేరు.
"ఇయ్యన్నీ పడ్డ జెవానోడు మరాడి కోపం ఎవడి మీస్సూపించాలి? ఎవున్నంటే ఎవుడూరుకుంటాడు? అన్నిటికీ లోకూగా దొరికీదింట్లో పెల్లవే గదే. అయినా గీనీ, అందరు మొగోల్లొక్కలాగుండ్రనుకో.. రోడ్నడకండా కాపరం సేసుకోయే.." అంటా సెప్పి పంపేరు. నిజంజెప్పాల, మాయమ్మిందులో ఒక్క మాటా సెప్పలేదునాకు. ఆవిడిగోరికి తెలిత్తే నాకు సెప్పకుండా ఉంటాదా?
అసుల్నన్నడీతే మొగుడూ పెల్లాలకి ఈదినడేంత గొడవలే రాకోడదు. ఒకేలొచ్చినా పెద్దల్లో ఎట్టుకుని పరిస్కారం సేసుకోవాల్తప్ప పోలీసోల్ల కాడికీ, టీవీలోల్ల కాడికీ ఎల్లకూడదు. పోలీసోల్లు డబ్బుల్తినేత్తారు, టీవీలోల్లు పరువుల్దీసేత్తారు. నా పెనివిటితో ఏటీ పడకండానే ఇన్నాలు కాపరం జేసేనా?
నేను కాపరానికొచ్చేతలికి రొండు గెదులిల్లు. మాయమ్మేదో కాంత సామానం ఇచ్చంపింది. ఈ మడిసి తెల్లార్లేత్తానే డూటీకెల్లిపోయేవోడు. మల్లీ ఏ అద్దరేతిరో తలుపు కొట్టేవోడు. నిజంగానే అంచేపు డూటీ సేత్తన్నాడో ఎక్కడన్నా తిరిగొత్తన్నాడో తెలిసీదికాదు. సెప్పుకోటాక్కూడా ఎవురూ ఉండేవోల్లుగాదు. మాయమ్మకి సెపితే గొడవల్దప్ప ప్రెయోజనం లేదుగదా. అమ్మోరమ్మ మీద బారవేసేను. అంతకన్నా సెయ్యగెలిగింది మాత్తరం ఏవున్నాది?
ఆ టయ్యంలో రావుడన్నయ్య, వొరమ్మొదినా ఎంత కాసేరో సెప్పలేను. ఆల్లేవీ నాకన్నదమ్ములోల్లుగాదు. ఆ మాటకొత్తే మా కులపోల్లే గాదు. అన్నయ్య మాయాయింతోబాటు పంజేత్తాడు. "ఎదవ డూటీల్సెల్లెమ్మా.. సంపేత్తన్నారనుకో.. ఆనాకొడుకులు ఏసీ గెదుల్లోనుంచి కదల్రు.. శాకిరంతా మాకూను, వోటాలేమో ఆల్లకీను.." అంటా చెప్పుకొచ్చేడు.
తాగుడలాటు మాయాయినకీ ఉన్నాది. నానలాగా రోజూ కాదుగానీ, వోరానికోరోజో రెండ్రొలో తాగేసొత్తా ఉంటాడు. పిచ్చి కాపోతే, మిటాయి కొట్లో వుండే వోడు రుస్సూడకండా ఉంటాడా? తాగుడు గురించనే కాదు, అసలే ఇసయంలోనూ మాయాయింతో నేను గొంతెత్తి తగువాల్లేదు. తగువాట్టాకి, సాదించుకోనాకి ఏరే పద్దతులుంటాయని నెమ్మది మీద తెలకుండా ఉంటాదా?
తాగొచ్చిన్నాడు మాయాయిన గొంతిప్పనాకి లేదు. ఆడిట్టవయినంత తాగనీ.. తాగుడు సంగతి మా ఇద్దరికీ తప్ప మూడో మడిసికి తెలకూడదు. ఇదీ ఒప్పందం. ఇయ్యాల్టికీ ఇదే జరూతున్నాది. ఏమాటకామాట, ఆడు తాగొచ్చిన్రోజున నాకెంత బాదగా ఉంటాదో అమ్మోరమ్మక్కూడా తెల్దు. పుట్టింట్లో పడ్డయ్యన్నీ వొద్దన్నా గుర్తొస్తానే ఉంటాయి. ఈ మడిసి గొంతెక్కడ లెగుత్తాదో, నేనడ్డ బాదలన్నీ నా పిల్లలెక్కడ అనుబించాలో అని బయివేసేత్తా ఉంటాది. ఆడకూతుర్ని, ఏటి సెయ్యగల్ను? కానైతే, ఈ ఒక్కిసయం తప్పించి, మిగిల్నియ్యి నేను సెయ్యిగల్ను, దైర్నంగా.
అసలేనాడైతే నాకాడ డబ్బు జేగర్తున్నాదాని మాయాయినకి నమ్మకం సిక్కిందో, ఆనాడే డబ్బు పెత్తనం నాసేతికిచ్చేసేడు. వొచ్చిందాంట్లో తన కరుసులకుంచుకుని, మిగిలింది నా సేతుల్లో ఎట్టేత్తావుంటాడు. ఇల్లు సుబ్బరంగా ఉండాల.. సొమ్ములు కరుసైనా పిల్లలికి మంచి సదూల్జెప్పించాల.. ఆడపిల్లకనీసి అప్పుడో కాంతా ఇప్పుడో కాంతా బంగారం జేగర్త సెయ్యాల. మొగ నలుసుకీ ఎంతోకొంత ముట్టజెప్పాల. ఇదీ నా పద్దతి.
అమ్మోరమ్మ దయవొల్ల ఈనాటి వొరకూ అంతా బాగానే వున్నాది. అంతా సరింగా ఉంటే ఆయమ్మిని తల్టం మానెత్తాననుకున్నాదో ఏమో, మెలికెట్టేసింది మాతల్లి.
ఇదేటిదీ,
టీవీలో మా పక్కీది కనిపింతన్నాది? గుడెనకాలీది. టీవీ కుర్రోడు
సేతుల్తిప్పుకుంటా, గొట్టం మైకు సేతులు మార్సుకుంటా ఏటో సెప్పేత్తన్నాడు.
ఆడంగులు గుంపుగా జేరి కేకలెడతన్నారు. ఓయమ్మో మాయాయిన. పక్కనే బిత్తిరిగోడు
కూడా వున్నాడు. ఆడు పులుకూ పులుకూ సూత్తన్నాడుగానీ, మావోడు మాత్తరం
సెక్కుసెదర్లేదు.
ఏమాటకామాట, మిన్నిరిగి మీదడ్డా సెలించడు మా మొగ పురుసుడు.
సౌండెడితే తప్ప ఇసియవేటో తెల్దు. అమ్మోరమ్మ తల్లే.. ఏ ఉపద్దరవం
తెత్తన్నావమ్మా.. సీ.. ఈ టీవీలోల్లకి ఏలా పాలా లేదు.. సౌండెట్టీలోగా
వోర్తలాపేసి ఎడ్వడింగులు మొదలెట్టేసేరు.. కాంచేపాగాలా ఉప్పుడు?
(చిన్న
బ్రేక్...)
ఇదన్యాయమండీ.... నేనొప్పుకోను
రిప్లయితొలగించండినడిమద్దేలో ఆపేసినారే, అన్నాయం గదో! ఎంచేపాగాలో ఎటో..
రిప్లయితొలగించండిAvunu...nenoo oppukonandee murali garoo
రిప్లయితొలగించండిBhasker.k
బాగుందండీ.. కొత్త యాసలో మొదలు పెట్టారు అక్షరమక్షరం చూసుకుని చదవాలి కాబోలు అనుకుంటూ మొదలెట్టానా... ఎప్పుడు చివరకొచ్చేశానో తెలీలేదు అంత సులువుగా చదివించేశారు :-)
రిప్లయితొలగించండిఅన్నట్లు టీవీలో ఆడ్స్ బ్రేక్ ని మీ పోస్టులో బ్రేక్ కి కలపడం బాగుంది :-)
రిప్లయితొలగించండిఏటి మద్దెలో ఆపేస్తే ఏటి సేయ్యాల ?గుడెనక సామి సంగతి తెల్పవా? మురళి గారూ అతికష్టం మీద వ్రాసాను .బాగా వ్రాసారు. ఇలావ్రాయటం చాలా శ్రమ ! అయినా మీరు గెలిచారు .
రిప్లయితొలగించండి@లక్ష్మి: తప్పలేదండీ :( ఇప్పుడు పూర్తి కథ సిద్ధం మరి.. ..ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి: పెద్దంచేపేటీ కాదండే బాబా.. మా బాగ్గెం వొచ్చేసిందిగదేటీ.. :) ..ధన్యవాదాలు..
@భాస్కర్: ధన్యవాదాలండీ..
@వేణూ శ్రీకాంత్: రాసేప్పుడు నాకూ అదే ఆలోచన వచ్చిందండీ.. ఆసాంతం యాస అంటే చదివే వాళ్లకి ఇబ్బంది అవుతుందేమో అని.. కానీ తప్పలేదు.. సినిమా భాషలో చెప్పాలంటే "ఖత డిమాండ్ చేసింది" మరి :) ..మీ అబ్జర్వేషన్ కి జేజేలు.. ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రాజ్యలక్ష్మి: ఆయ్.. మరేట్నేదండి.. రాత్తా ఉంటే అలాటైపోతాది.. థాంక్స్ అండీ..