ఈమధ్య మెయిల్ లోకి లాగిన్ అవుతుంటే అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంటోంది. రోజూ ఒకటి రెండు మెయిళ్ళకి తక్కువ కాకుండా అభినందనలు చెబుతూ వస్తున్నాయి. ఎక్కడో నాకు పేరు కూడా తెలియని దేశంలో జరిగిన లక్కీ డ్రా లో నా మెయిల్ ఐడీ మిలియన్ల కొద్దీ డాలర్లు గెలుచుకుందనో, అలాంటిదే మరో దేశంలో ఎప్పుడూ పేరు వినని స్వచ్చంద సంస్థ మెయిల్ ఐడీలకి నిర్వహించిన డ్రాలో నాకు ప్రధమ బహుమతి వచ్చిందనో, టిక్కట్టే కొనక్కర్లేని లాటరీలో నాకు యూరోలో, పౌండ్లో వచ్చి పడ్డాయనీ.. ఈ తరహాగా ఉంటున్నాయి సందేశాలు.
అంతంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక పోవడంచేత మెయిల్ ఓపెన్ చేయాలంటే కూడా భయంగా ఉంటోంది. అభినందనల సందేశంతో పాటు, నా పూర్తి వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్ తో సహా, పంపితే సొమ్ముని నేరుగా బ్యాంకులో వేసేస్తామని హామీలు వచ్చేస్తున్నాయి. అంతలేసి పెద్ద మొత్తాలని వద్దు వద్దని ప్రతిరోజూ చెప్పాలంటే ఎంత కష్టమో కదా. కోట్లు వచ్చి పడుతున్నా వద్దని చెప్పగల స్థిత ప్రజ్ఞత అలవరుచుకోవడం కూసింత కష్టంగానే ఉంది మరి.
నాకు విదేశీ స్నేహితులెవరూ లేరు. ఇంకో మాట చెప్పాలంటే నా స్నేహితులంతా భారతీయులే. మొన్నామధ్య ఓ విదేశీయుడు రాసిన మెయిల్ ఆసాంతం చదివితే నాకు ఆనందభాష్పాలు జలజలా రాలాయి. ఆయన మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించాడట. వారసులెవరూ లేరుట. ఏదో అలా జీవితాన్ని గడిపేస్తూ ఉండగా, ఉన్నట్టుండి అనారోగ్యం చేసిందిట. హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్లు తనకి ప్రాణాంతకమైన జబ్బు చేసిందనీ, ఆ జబ్బుకి ప్రపంచంలో ఏ దేశంలోనూ చికిత్స లేదనీ, మరణం కోసం ఎదురు చూడమనీ చెప్పేశారుట.
"నేను పోయాక నేను సంపాదించిన ఆస్తినంతా ఏం చెయ్యను దేవుడా?" అని దేవుడిని అడిగితే, ఆయన కల్లో కనిపించి నమ్మకస్తుడు ఎవరికైనా రాసిచ్చేయమన్నాట్ట. అతను పాపం ఇంటర్నెట్లో వెతికితే, గూగులమ్మ ఈ ప్రపంచంలో నా అంత నమ్మకస్తుడెవడూ లేడని చెప్పిందిట. (చచ్చి నీ కడుపున పుట్టాలని ఉంది గూగులమ్మా). ఆస్తి తీసేసుకోమనీ, ఓ పాతిక శాతాన్ని చారిటీ కోసం ఉపయోగించమనీ, మిగిలింది నన్ను అనుభవించమనీ బతిమాలుతూ మరణ శయ్య మీద నుంచి మెయిల్ రాశాడాయన.
నేను కఠినమైన హృదయం కలవాడినీ, సిరిదా మోకాలడ్డే వాడినీ కావడం వల్ల, ఆ మెయిల్ ని 'స్పాం' అని మార్క్ చేసేశాను. బొత్తిగా ముక్కూ మోహం తెలియని అతని నుంచి అంత ఆస్తి అయాచితంగా తీసుకోబుద్ధి కాలేదు. లాటరీలో వచ్చిన బహుమతి మొత్తాలు తీసుకోమని మొహమాట పెడుతూ వస్తున్న ఉత్తరాలని కూడా 'స్పాం' లోకే తోసేస్తున్నాను. వారానికోసారి 'స్పాం' ని ఖాళీ చేసేటప్పుడు ఈ ఉత్తరాలన్నీ ఓసారి చదువుకుని నిట్టూర్చడం ఓ అలవాటుగా మారిపోయిందీ మధ్య.
కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే, నా స్నేహితురాలొకావిడకి ఆన్ లైన్ లాటరీలో మొదటి బహుమతి వచ్చిందంటూ ఓ ఉత్తరం వచ్చింది. ఓ రిఫరెన్స్ నెంబరు ఇచ్చి, జవాబులో ఆవిడ వివరాలతో పాటు ఆ నెంబరు కూడా ప్రస్తావించామని సూచించారు ఉత్తరం రాసిన వాళ్ళు. "అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉంది..ఇదేదో బానే ఉంది" అనుకుంటూ ఆవిడ సమాధానం ఇవ్వబోతూనే, ఎందుకో సందేహం వచ్చి నాకు చూపించారా మెయిల్ ని. నాకూ డౌట్ వచ్చింది. ఆ నెంబరు కోట్ చేస్తూ నేనో మెయిల్ పంపాను వాళ్లకి. నాక్కూడా అభినందనలు వచ్చేయడంతో అనుమానం బలపడింది.
తెలిసిన విషయాలు ఏమిటంటే, ప్రపంచంలో ఏ లాటరీ సంస్థా కూడా టిక్కెట్ కొనకుండా బహుమతి ఇవ్వదు. ఆన్లైన్ లాటరీల పేరుతో జరుగుతున్న మోసాలు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు తీసుకుని వాటి ఆధారంగా చేసే మోసాల గురించి తెలుసుకుని అవాక్కయ్యాం ఇద్దరం. అప్పటి నుంచీ మాకు తెలిసిన వాళ్ళలో ఎవరు ఆన్లైన్ లాటరీలో బహుమతి వచ్చిందని చెప్పినా, ఈ అనుభవాన్ని ఉదహరించడం మొదలు పెట్టాం. అప్పట్లో బాగా తక్కువగానే ఉండేవి కానీ, రాన్రాను ఈ తరహా మెయిల్స్ బాగా పెరిగిపోయాయి. తెలిసిన వాళ్ళే ప్రాణం పోతున్నా పది రూపాయలు ఇవ్వని ఈ రోజుల్లో, ముక్కూ మోహం తెలియని వాళ్ళు వేల డాలర్లు అయాచితంగా ఇచ్చేస్తామంటే నమ్మేయడమే??
నాకు ఆ మధ్యలో ఇంకో రకం మెయిల్స్ వచ్చేవి.. అవి ఏమనగా:
రిప్లయితొలగించండి"సర్ నేనొక 20 ఏళ్ళ అమ్మాయిని మా బాబూ బాగా సంపాదించాడు.. కానీ మొన్న జరిగిన యాక్సిడెంటులో కోమాలోకి పోయాడు.. ఇప్పుడు మా డబ్బును, నన్ను చూసుకునేందుకు ఒక మంచి వ్యక్తి కోసం చూస్తున్నాము.. మీరు మీ వివరాలు పంపండి" అని..
-కార్తీక్
బాగా చెప్పారు. ఈ మధ్యన ఇలాంటి మైల్సే కాదు ఎస్.ఎం.ఎస్ లు కూడా మొదలయ్యాయి. ఒక్క డబ్బేనా, బీ.ఎం.డబ్ల్యూ కార్లూ అవీ కూడా మన ప్రయత్నమేమీ లేకుండానే గెలిచేస్తూ ఉంటాం వీరి దయవల్ల. ఉద్యోగాలిచ్చేసే మెయిల్స్ మరికొన్ని. అసలు వెబ్సైట్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా వెబ్సైటులూ.. వీటన్నింటినించీ తప్పించుకుంటూ ఉండడం నిజంగా స్థిత ప్రజ్ఞతే :)
రిప్లయితొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండిమిమ్మల్లి (గోదావరి, కృష్ణా తీరప్రాంతలు) చూస్తోంటే నాకు చాలా ఈర్ష్య గా వుంటోంది, మీరే ఇంత బాగా ఎలా వ్రాయగలరాని. ఏవిషయం ఐనా గాని వ్యంగ్యంగా, హాస్యంగా, నవ్వుతూ చదువుకొనేలా, చదువుతూ నవ్వుకొనేలా వ్రాయడం బహుసా గోదావరి, కృష్ణా తీరప్రాంతల వారికే సాధ్యం కాబోలు!. కృష్ణా,గోదారి గంగలా మహత్యమేమో. ఎప్పట్టిలా చాలా బాగా వ్రాసారు, ఇలాంటి వాటి నుండి చాలా జాగ్రత్తగా కూడా వుండాలి.
రఘురామ్
మీకు బొత్తిగా నమ్మకం తక్కువైపోయింది సార్! :)
రిప్లయితొలగించండిguruvu gaaru
రిప్లయితొలగించండిhow that works is an open secret. once you reply they will ask you to mail a check first for a few thousand dollars - say $2K and then they will mail you a check for $200K. Yes they sometimes do mail it. They will cash your 2K and when you deposit their check it will bounce. So you lose 2K plus bank bouncing fee. Not unusually, with your bank account number from the check they can clean up your entire bank account as well.
Be happy you did not get to that step and were able to cut it before it escalated further. BTW even if you pay $10 you won't win any lottery these days. If we are ever that lucky, we won't be here writing/reading blogs :-)
డబ్బుతో అవసరం అందరికీ ఉంటుంది .
రిప్లయితొలగించండినాకూ కావాలి - ఇస్తారా ఎవరైనా ;)
following is a recent comment which
I posted elsewhere on a wordpress blog
_________
money doesn’t grow on trees. none
gives it away. [ NOT talking about
charity DONATIONS ] there is always
some strategy behind offering of
money. please do a research before
accepting such money offers
హహ్హహ్హా.. పాపం మురళి గారు, అంత డబ్బుని ఎంత విశాల హృదయం లేకపోతే అంత ఈజీగా వదులుకుంటారు..;)
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు..
>>మీకు బొత్తిగా నమ్మకం తక్కువైపోయింది సార్! :)
హహ్హహ్హ..
ఓరోజు మధుభాయ్ వచ్చి చెవిలో గుసగుసగా పిచ్చ ఎగ్జైట్మెంట్లో ఏదో చెప్పాలనుకుంటూన్నాడు. కానీ చెప్పలేడు. అన్నం కూడా తినలేకపోయాడు. తీరిగ్గా రాత్రి ఒకటిన్నరకి తలుపుకొట్టి ఒక్కసారి కంప్యూటర్ సెంటర్‌కి వెళ్దాం పద అని తీసుకెళ్తుంటే ఏదైనా ప్రాజెక్ట్ విషయమేమో అనుకున్నా. తీరావెళ్ళాక పసుపురంగు మెయిలు (మీకూ ఇదేరంగా!)
రిప్లయితొలగించండిమంఛుగారి పల్లకిలో లంకెబిందెలు http://manchupallakee.blogspot.com/2010/01/to.html
అంతలేసి పెద్ద మొత్తాలని వద్దు వద్దని ప్రతిరోజూ చెప్పాలంటే ఎంత కష్టమో కదా. కోట్లు వచ్చి పడుతున్నా వద్దని చెప్పగల స్థిత ప్రజ్ఞత అలవరుచుకోవడం కూసింత కష్టంగానే ఉంది మరి....:))బాగుందండి.ఏవిషయం గురించైనా బలే రాస్తారు మీరు...
రిప్లయితొలగించండినిజమే ఇలాంటి మెయిల్స్ నాకూ వచ్చాయి. ఎన్ని సార్లు ఆశపడ్డానో. కాని నాకే తెలీదు మరి ఎందుకు ట్రై చేయలేదో. అంతేకాదు ఎవరో మన ఫ్రెండ్స్ మెయిల్ ఐ.డి తో తామేదో దేశానికి వెళ్ళామని పాస్ పోర్ట్ పోయిందని ఇంకేవో సమస్యలు వచ్చాయని, డబ్బు పంపమని మెయిల్స్ వచ్చేవి. ఇటువంటి వాటికి మాత్రం ఆ ఫ్రెండ్ ని కనుక్కునేదాన్ని. అది ఫేక్ అని తెలిసేది. ఊహకందని భలే విషయం రాసారు మురళిగారు. రోజూ చూస్తున్నా దీనిగురించి రాయచ్చు అని ఎప్పుడూ తట్టలేదు:) హాట్స్ ఆఫ్ టు యూ.
రిప్లయితొలగించండిహహ్హహ్హా.. అంటే మీకు కూడా బోలెడన్ని డబ్బులొచ్చాయన్న మాట. నాకైతే ఒక వారంలో ఏకంగా యాభై ఆరు కోట్లు వచ్చాయ్..
రిప్లయితొలగించండివారం రోజుల్లో నా సంపాదన దాదాపుగా "యాభై ఆరు కోట్లు" ..!!
ఊరుకోండి సార్ మీకు అంతా అనుమానమే..మనిషన్నాకా కాసింత నమ్మకం కూసింత ధైర్యం ఉండాలి.. :)ఇక్కడ మాకు మొదట్లో తెగ ఉత్తరాలు వచ్చేవి ఇంటికి... మీకు పది లక్షల డాలర్లు లాటరీ తగిలింది పలానా నెంబర్ కి కాల్ చేయండి అని..నేనంటే కాసింత బద్దకం చూపించేసి వాటిని ఎక్కడో పడేసేదాన్నా.. .. మా ఫ్రెండ్ మాత్రం వెంటనే కాల్ చేసింది ..మీరు ముందు ఖర్చులకు 1000$ పంపండి నెక్స్ట్ మంత్ పంపేస్తాం అని పాపం వాళ్ళు ఎంతో ఇదిగా చెప్పినా పిల్ల నమ్మదే ... హేమిటో..
రిప్లయితొలగించండి:D :D
రిప్లయితొలగించండిహ హ భలే సరదాగా రాశారు :)
రిప్లయితొలగించండిమీ పోస్టు చదువుతుంటే నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడంటే ఈ-మెయిళ్ళు కావచ్చేమో, ఒక పన్నెండేళ్ళ క్రితం నాకు ఒక పోస్టల్ మెయిల్ వచ్చింది. ఒక బాండ్ పేపర్ సైజు దళసరి పేపర్ మీద, ఊరూ పేరూ తెలీని లాటరీలో నాకు కొన్ని వందల కోట్లు వచ్చినట్టు, ఆలసించిన ఆశాభంగం అంటూ. అందులో ఉన్నది మొత్తం గుర్తు లేదు గాని ఆ పేపర్ చాలా ఆర్భాటంగా ఉంది. గోల్డ్ కలర్ ఎంబ్లం , వాటర్ మార్కులూ, ఎర్ర రంగు స్టాంప్ ముద్రలూ, దానికింద సంతకాలూ ( నాకు ఆ డబ్బులు ఇవ్వవచ్చు అని ఎవరో ఆధరైజ్ చేసినట్టు అన్నమాట ). మోసం అని ఖరా ఖండిగా తెలిసినా ఆ హంగూ ఆర్భాటం చూసి నాకా పేపర్ పారేయ బుద్ది కాలేదు. అలా చాలా నెలలు నాకది అప్పుడప్పుడూ కనపడుతూ ఉండేది. తరువాతెటు పోయిందో తెలీదు. అప్పటికే ఇలాంటి మోసాల గురించి ఎంతోకొంత విన్న నాకే అలా అనిపించిందంటే (దాన్ని చింపి పారేయ బుద్ది కాకపోవటం) , రిటైరైన ముసలి వాళ్ళూ, అంతగా ఇలాంటి మోసాల గురించి అవగాహ లేని వాళ్ళూ ఇంకాస్త ముందుకెళ్లటం లో ఆశ్చర్యం లేదు.
రిప్లయితొలగించండివద్దంటే డబ్బు సినిమా గురించి రాసారనుకున్నాను .
రిప్లయితొలగించండిఅబ్బో రోజూ ఎన్ని కోట్లకు అధికారిణి ని ఐపోతుంటానో ! వాటిని కాసేపు మురిపెం గా చూసుకొని పారేస్తూవుంటాను :)
బాగా రాసారు .
@కార్తీక్; మీరు "మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్" అని వాళ్లకి తెలిసిపోయి ఉంటుందండీ :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ప్రసీద: నాకు ఎస్సెమ్మెస్‌ల బెడద కొంచం తక్కువేలెండి.. ధన్యవాదాలు.
@రఘురాం: గోదావరి ప్రభావం అంటారా? అవునో కాదో చెప్పలేనండీ మరి.. మిమ్మల్ని మెప్పించడం సంతోషాన్ని కలిగిస్తోంది నాకు.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ప్చ్.. ఏం చేద్దాం చెప్పండి.. యెంత ప్రయత్నించినా నమ్మలేక పోతున్నా :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@DG: నిజమేనండీ.. ట్రాప్ లో పడలేదు.. కొంచం ఆచి తూచి వ్యవహరించడం మంచిదే అయ్యింది.. ధన్యవాదాలు.
@మనవాణి: అవునండీ. జాగ్రత్తగా ఉండాలి.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ప్చ్.. ఏం చేద్దాం చెప్పండి.. యెంత ప్రయత్నించినా నమ్మలేక పోతున్నా :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@DG: నిజమేనండీ.. ట్రాప్ లో పడలేదు.. కొంచం ఆచి తూచి వ్యవహరించడం మంచిదే అయ్యింది.. ధన్యవాదాలు.
@మనవాణి: అవునండీ. జాగ్రత్తగా ఉండాలి.. ధన్యవాదాలు.
@మనసు పలికే: తప్పడం లేదండీ :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య; మంచు గారి టపా అప్పట్లోనే చదివానండీ నేను.. ధన్యవాదాలు.
@రాధిక(నాని): ధన్యవాదాలండీ..
@మనసు పలికే: తప్పడం లేదండీ :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సుబ్రహ్మణ్య చైతన్య; మంచు గారి టపా అప్పట్లోనే చదివానండీ నేను.. ధన్యవాదాలు.
@రాధిక(నాని): ధన్యవాదాలండీ..
@జయ: ఈ మధ్యన మరీ ఎక్కువయ్యేసరికి నాగోడు మీకు చెప్పుకోవాలని అనిపించిందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఆకాశ రామన్న: అభినందనలండీ!!! ...ధన్యవాదాలు.
@నేస్తం: మీ ఫ్రెండ్ మీద మీ ప్రభావం బాగా ఉన్నట్టుందండీ :-) ధన్యవాదాలు.
@హరే కృష్ణ; :-) :-) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@ఉమాశంకర్: వీలు చూసుకుని 'అనంతం' లో ఒక్కసారి కనిపించండి సార్.. చాలామంది వెయిటింగ్ ఇక్కడ.. నేను మెయిల్ చూసి ముందుకు వెళ్ళలేదండీ, స్పాం అని మార్క్ చేశా!! ..ధన్యవాదాలు.
@మాలాకుమార్: అందుకే 'వద్దు వద్దంటే..' అని రాశానండీ.. ధన్యవాదాలు.