నా చిన్నప్పుడు 'యువ' లో అనుకుంటా ఓ కథ చదివాను. ఒకావిడకి వాళ్ళాయన పట్టు చీరకొంటానంటాడు. ఆ పట్టుచీర ఆయన ఎంపిక చేస్తే బాగుంటుందని ఆవిడ కోరిక. ఆయన ఎంపిక తనకి నచ్చుతుందో లేదో అని దిగులు. చుట్టుపక్కల వాళ్ళతో చర్చిస్తుంది. బడ్జెట్ ఒక్క చీరకే ఉంది. అప్పుడు పక్కింటి పిన్నిగారు ఓ సలహా ఇస్తుంది. "అమ్మాయీ, షాపుకి వెళ్లి ముందు నువ్వో నాలుగు చీరలు ఎంపిక చేసుకో. వాటిలో మీ ఆయనకీ ఏ చీర నచ్చిందో కనుక్కుని ఆ చీర కొనుక్కో" అని. సమస్య పరిష్కారం అయిపోయింది.
ఒకప్పుడు గొప్ప సినిమాలు తీసి, ఇప్పుడు అప్పుడప్పుడూ హిట్ సినిమాలు తీస్తున్న ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి వచ్చిన తాజా చిత్రం 'బెట్టింగ్ బంగార్రాజు.' 'అల్లరి' నరేష్ కథానాయకుడు, ఇ.సత్తిబాబు దర్శకుడు. ఇద్దరికీ హాస్య చిత్రాల్లో చేసిన, తీసిన అనుభవం ఉంది. ఆ అనుభవం, పెద్దగా కథంటూ లేని ఈ హాస్య చిత్రం కథనం నల్లేరు మీద బండిలా నడవడానికి బాగానే సాయపడింది.
ఆకుపచ్చని కోనసీమలో ఆడుతూ పాడుతూ కులాసా జీవితం గడిపేసే బంగార్రాజుకి ఉన్నట్టుండి ఒకమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక మొదలవుతుంది. ఊళ్ళో అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అతన్ని ప్రేమించరనీ, అదే అతను హైదరాబాద్ వెళ్తే అక్కడ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించేయెచ్చనీ సలహా ఇస్తారు అతని మిత్రులు. అందరితోనూ అన్ని విషయాల మీదా పందాలు కాసి అవతలి వాళ్ళని ఓడించే బంగార్రాజు ఉన్నట్టుండి ఊళ్ళో నుంచి మాయమై హైదరాబాద్ లో తేలతాడు.
హీరో తలచుకుంటే కానిది ఏమీ ఉండదన్న తెలుగు సినిమా సూత్రం ప్రకారం దివ్య (నూతన నటి నిధి) తో ప్రేమలో పడి ఆమె పెట్టే పరిక్షకి సరే అని ఆమెతో పాటు మళ్ళీ కోనసీమకి వస్తాడు బంగార్రాజు. ఇంతకీ బంగార్రాజుని పరిక్షించేది దివ్య కాదు, ఆమె కుటుంబ సభ్యులు. సగటు తెలుగు ప్రేక్షకుడు ఊహించ గలిగే ముగింపే. ఇప్పటికే బాగా నలిగిన కథలి కొన్ని ట్విస్టులు అద్ది, హాస్యాన్ని జత చేసి రెండున్నర గంటల సినిమాగా మలిచాడు సత్తిబాబు. పూర్తిగా ఆరోగ్య కరమైన హాస్యాన్నే దర్శకుడు అందించడం మెచ్చుకోవాల్సిన విషయం.
స్క్రిప్టుని, ముఖ్యంగా స్క్రీన్ ప్లే ని మరికొంచం జాగ్రత్తగా రాసుకుంటే ఓ గొప్ప హాస్య చిత్రమై ఉండేది ఈ సినిమా. కొన్ని సన్నివేశాల్లో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించినప్పటికీ చాలా చోట్ల రొటీన్ ఫార్ములానే అనుసరించేశాడు. ఫలితంగా ఆయా సన్నివేశాల్లో తాజాదనం లోపించింది. ఉన్నంతలో హైదరాబాద్ లో రూమ్మేట్ల కామెడీ, ముఖ్యంగా 'శవం' కామెడీ బాగా పండింది. గోదావరి జిల్లా రాజుల లోగిళ్ళ మర్యాదల నుంచి మరికొంచం కామెడీ సృష్టించే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేదు. వారి మర్యాదలని అపహాస్యం చేయక పోడాన్ని కూడా మెచ్చుకోవాల్సిందే.
నిజానికి ఒక సినిమా కాక మూడు ఎపిసోడ్లు చూస్తున్న భావన కలిగింది. బంగార్రాజు పల్లెటూరి జీవితాన్ని, హైదరాబాద్ జీవితాన్నీ, అలాగే హీరొయిన్ ఇంట్లో జీవితాన్నీ కలిపే విధంగా సన్నివేశాలు అల్లుకుంటే మరింత హాస్యం దొరికి ఉండేది ప్రేక్షకులకి. నూతన నటి నిధి కి పెద్ద కళ్ళున్నా ఆ కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లేవు. సిటీ లో చదివే అమ్మాయిగా పర్లేదు కానీ, రెండో సగంలో పల్లెటూరు రాగానే, చుట్టూ ఉన్న తెలుగు కేరక్టర్ ఆర్టిస్టుల మధ్య ఆమె 'పరాయితనం' బాగా తెలిసి పోయింది, ఆమెచేత లంగావోణీ ధరింపజేసినప్పటికీ.
నటీనటుల్లో హీరొయిన్ ఇంటి పెద్దగా తాతయ్య పాత్రలో 'కోట' నటనకి మంచి మార్కులు పడతాయి. 'ఆత్రం' పాత్రలో రఘుబాబు హాస్యం బాగుంది, అక్కడక్కడా కొంచం విసిగించినా. చాలా రోజుల తర్వాత ఎల్బీ శ్రీరామ్ కి కొంచం మంచి పాత్ర దొరికింది. అప్పుడెప్పుడో యండమూరి సృష్టించిన అంతర్జాతీయ చెస్ ప్లేయర్ రేవంత్ పాత్రని కథానుగుణంగా వాడుకోవడం బాగుంది. గంధం నాగరాజు సంభాషణలు, శేఖర్ చంద్ర సంగీతం సొసో. ప్రారంభంలోనూ, రెండో సగంలోనూ మెరిసే కోనసీమ, గోదారి ఎప్పటిలాగే అందంగా ఉన్నాయి.
ఉషాకిరణ్ మూవీస్ నుంచి హాస్య చిత్రం అనగానే 'శ్రీవారికి ప్రేమలేఖ' ని గుర్తు చేసుకోవడం సహజమే అయినా, అంతటి భారీ అంచనాలతో వెళ్ళడం మంచిది కాదు. మొత్తం మీద ఒక ఆరోగ్యకరమైన ప్రయత్నంగా చెప్పవచ్చీ సినిమాని. "మొదటి పేరాలో కథ ఎందుకు రాసినట్టు?" అనే కదా సందేహం? సమాధానం 'బెట్టింగ్ బంగార్రాజు' లో దొరుకుతుంది.
నటీనటుల్లో హీరొయిన్ ఇంటి పెద్దగా తాతయ్య పాత్రలో 'కోట' నటనకి మంచి మార్కులు పడతాయి. 'ఆత్రం' పాత్రలో రఘుబాబు హాస్యం బాగుంది, అక్కడక్కడా కొంచం విసిగించినా. చాలా రోజుల తర్వాత ఎల్బీ శ్రీరామ్ కి కొంచం మంచి పాత్ర దొరికింది. అప్పుడెప్పుడో యండమూరి సృష్టించిన అంతర్జాతీయ చెస్ ప్లేయర్ రేవంత్ పాత్రని కథానుగుణంగా వాడుకోవడం బాగుంది. గంధం నాగరాజు సంభాషణలు, శేఖర్ చంద్ర సంగీతం సొసో. ప్రారంభంలోనూ, రెండో సగంలోనూ మెరిసే కోనసీమ, గోదారి ఎప్పటిలాగే అందంగా ఉన్నాయి.
ఉషాకిరణ్ మూవీస్ నుంచి హాస్య చిత్రం అనగానే 'శ్రీవారికి ప్రేమలేఖ' ని గుర్తు చేసుకోవడం సహజమే అయినా, అంతటి భారీ అంచనాలతో వెళ్ళడం మంచిది కాదు. మొత్తం మీద ఒక ఆరోగ్యకరమైన ప్రయత్నంగా చెప్పవచ్చీ సినిమాని. "మొదటి పేరాలో కథ ఎందుకు రాసినట్టు?" అనే కదా సందేహం? సమాధానం 'బెట్టింగ్ బంగార్రాజు' లో దొరుకుతుంది.
అయితే ఒకసారి చూడొచ్చన్న మాట.
రిప్లయితొలగించండిఎన్నాళ్ళ కెన్నాళ్ళకు...అల్లరి నరేష్ సినిమాలో ఆరోగ్యవంతమైన కామెడీనా...అస్సలు నమ్మబుద్దికావటం లేదు మురళి గారు...మీరు చెప్పారు కాబట్టి నమ్మేస్తున్నామరి...అతని సినిమాల్లో ఉండే పావలాన్నర కామెడీ అంటే నాకు చిర్రెత్తుకొస్తుంది.... సో ఈ సారి గోదారి, కోనసీమ అందాల్ని చూడటానికి చెత్త కామెడీని భరించాల్సిన అవసరం లేదన్నమాట...ఎలాగు కామెడీ కూడా బాగుందంటున్నారు కదా....
రిప్లయితొలగించండిమాంచి కామెడీగా ఉందని నేనూ విన్నాను. ఓసారి చూసేస్తా
రిప్లయితొలగించండిఇది దారుణమైన అన్యాయం మురళి గారూ
రిప్లయితొలగించండినేను రాద్దాము అనుకున్నది మీరు రాసేసారు :(
మీ విశ్లేషణ మాత్రం సూపర్
అంతేలెండి మురళిగారు. హైద్రాబాద్ నుంచి కోనసీమకి వెళ్ళారుగా. బహుశా, మూడొంతులు కథ మిమ్మల్ని ఇక్కడే ఆకర్షించి ఉంటుంది. అవునా:) పోన్లెండి, ఈ సారి కోనసీమ నుంచి హైద్రాబాద్ వొచ్చే సినిమా ఇంకోటి రాకపోదు. ఇంతకీ ఈ సినిమాలో గోదారి నిండుగా ఉందా? లేదా:) హీరోయిన్ హైద్రాబాద్ అమ్మాయా? కోనసీమ అమ్మాయా?
రిప్లయితొలగించండిఆహా చెప్పీ చెప్పకుండా భలే చెప్పారు గా కథ :-) సినిమానే చూడక్కర్లేదండీ సినిమా సైట్లకెళ్ళి రివ్యూలు చదివినా చాలు తెలిసిపోతుంది :D నాదాబాపతే కాబట్టి చెప్తున్నా.
రిప్లయితొలగించండిశేఖర్ గారు అల్లరి నరేష్ సినిమాలు కొన్ని బాగానే ఉంటాయండీ మరీ అన్నీ వెకిలి హాస్యమే కాదు. కేవలం లాజిక్కులు, మనబుర్ర పక్కన పెట్టేసి చూస్తే చాలు ఎంజాయ్ చేయచ్చు.
@బోనగిరి: పర్లేదండీ, ధైర్యం చేయొచ్చు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: చెత్తగా అయితే లేదండీ.. అలా అని మరీ భారీగానూ లేదు కామెడీ.. చూసి చెప్పండి :-) ధన్యవాదాలు.
@కృష్ణాతీరం: ఓ పనైపోతుంది అంటారా? :-) కానివ్వండి మరి.. ధన్యవాదాలు.
@హరే కృష్ణ: మీరు కూడా రాయండి మేమంతా చదువుతాం.. స్ట్రైట్ గా రాయడం ఎందుకు అనుకుంటే ఓ పేరడీ రాసేయండి, మీకది వెన్నతో పెట్టిన విద్య అనిపిస్తోందీమధ్య.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: గోదారి కళకళ్ళాడుతోందండీ.. హీరోయిన్ కోనసీమ అమ్మాయి.. చదువు కోసం హైదరాబాద్ వెళ్లి, పూర్తయ్యాక మళ్ళీ ఇంటికి వస్తుందండీ.. మీరు మొత్తం కథ చెప్పించేసేలా ఉన్నారు :-) ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: మరీ రివ్యూలతో సరిపెట్టుకోకుండా ఓసారి చూడొచ్చని నా భావన అండీ.. ఇంకా బాగా తీయొచ్చు అని కూడా.. ధన్యవాదాలు.
ఏమని రాయనండీ వ్యాఖ్య? సినిమా ఎలాగూ చూడలేను కాబట్టి చూస్తానని అబద్ధం చెప్పను.
రిప్లయితొలగించండిఇంకేం చెప్పనబ్బా..? ఆ...మీ రివ్యు చాలా బాగుందండీ. ఈ స్టేట్మెంట్ మీ టపాలన్నింటికీ పర్మనెంట్ అనుకోండీ అయినా మళ్ళీ చెప్తున్నా..
నిన్ననే సినిమా చూసానండి,నరేష్ కి నిజంగానే సుడి ఉందనిపిస్తుంది.సినిమాలో సంక్రాంతి పాట బాగా నచ్చిందండి.
రిప్లయితొలగించండి"మెరిసే కోనసీమ, గోదారి ఎప్పటిలాగే అందంగా ఉన్నాయి".
రిప్లయితొలగించండిఈ ఒక్క ముక్క చాలదూ సినిమా ఆనందంగా చూసెయ్యచ్చని చెప్పడానికి.
@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@స్రవంతి: 'సంక్రాంతి' సినిమాలో 'ముద్దబంతులు..' పాట గుర్తొచ్చిందండీ నాకైతే.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: నిజమండీ.. ధన్యవాదాలు.
ఈ సినిమా నేనూ చూశానోచ్ ...అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు అంటే హీరో డ్రైవింగ్ రాకపోయినా రేస్ గెలిచేయడం వంటివి మినహాయిస్తే సినిమా ఒకసారి చూడొచ్చు !
రిప్లయితొలగించండి