ఉన్నట్టుండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. స్వర్గంలో ఇంద్రుడు అప్పుడే నిద్రలేచి కాఫీ తాగుతూ గబగబా పెళ్ళిళ్ళు నిర్ణయించేసినట్టు ఉన్నాడు. భూమ్మీద ఒక్క లెక్కన జరిగిపోతున్నాయిప్పుడు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయట కదా మరి. నిన్నమొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కళ్యాణ మండపాలన్నీ ఇప్పుడు సన్నాయి మేళాలతో కోలాహలంగా ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళ మొదలు, ఆర్కెష్ట్రా వాళ్ళ వరకూ అందరూ బిజీ బిజీ.
పెళ్ళిళ్ళ వల్ల కొంచం సమస్యలు కూడా ఉన్నాయి. అబ్బే, సొంత పెళ్లి అయితే చాలానే ఉంటాయి కానీ, నేను చెప్ప బోతున్నది "ఊళ్ళో పెళ్లి" గురించి. పని వాళ్ళ మొదలు పాలూ, నీళ్ళ వరకూ అన్నింటికీ రేషన్ వచ్చేస్తుందా.. ఇది చాలదన్నట్టు కూరలు, పళ్ళు, పూలు ఒక్కసారిగా 'చక్కనమ్మలు' అయి పోతాయి. వాటి రేట్లు చుక్కల్లోకి ఎక్కేస్తాయి కదా మరి. కుంచం గొప్ప పెళ్ళిళ్ళకి మంత్రులూ, సినిమా స్టార్లూ తదితర వీఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ మరికొంచం జామవుతుంది.
పాపం ఈ మంత్రులూ, పెద్దాఫీసర్లూ కేవలం పెళ్లి కోసమే బోల్డంత దూరాలు వెళ్ళలేరు కదా. అందుకని ఇన్స్పెక్షన్ల పని కూడా కలిపేసుకుంటారు. అలా ఆఫీసులన్నీ కూడా సందడి సందడిగా ఉంటాయన్న మాట. మన ఇంటి దగ్గరలో ఏదన్నా కళ్యాణ మండపం గానీ ఉందంటే వద్దన్నా బోల్డంత కాలక్షేపం. ఆర్కెష్ట్రాలు, బ్యాండు మేళాలు, లౌడ్ స్పీకర్లలో వినిపించే పెళ్లి మంత్రాలు, వీటితో పాటు పెళ్ళిలో ఎవన్నా గొడవలు జరిగితే అవీ అన్నీ వద్దనుకున్నా వినాల్సిందే. పెళ్లివాళ్ళతో పాటు జాగారం చేయాల్సిందే.
ఒకేసారిగా ఇన్ని పెళ్ళిళ్ళు జరగడం వల్ల కనిపించని సమస్యలూ ఉన్నాయి. మచ్చుకి ఒకటి.. గత వారం ఒక స్నేహితుడి తండ్రి చనిపోయారు. అంత్య క్రియలు జరిగాయి కానీ తర్వాత జరగాల్సిన కర్మకాండలు కేవలం అయ్యవారు దొరకని కారణంగా వాయిదా పడ్డాయి. వచ్చిన బంధువులు ఉండలేరు, వెళ్ళ లేరు. ఇదివరకైతే శుభ కార్యాలు చేయించే వాళ్ళూ, అశుభ కార్యాలు చేయించే వాళ్ళూ వేర్వేరుగా ఉండే వాళ్ళు. ఇప్పుడా పరిస్థితి మారిందని అర్ధమైంది. అన్నిరంగాలలోనూ 'ఆల్ ఇన్ వన్' లకే కదా డిమాండ్.
వరుసగా పెళ్లి భోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం పాడయ్యిందని మిత్రుడొకతను వాపోయాడు. పెళ్లి పిలుపు వచ్చాక వెళ్ళాక తప్పదు, వెళ్ళాక తినక తప్పదు. ఎదురుగా అన్నిరకాల వంటకాలు కనిపిస్తుండగా ఏ సాంబారన్నమో తిని వచ్చేయడానికి మనమేమీ మునులమో రుషులమో కాదు కదా అన్నది తన వాదన. "ఏదో అనుకుంటాం కానీ రోజూ పెళ్లి భోజనం చేయాలన్నా చిరాకే" అని తన విలువైన అభిప్రాయం చెప్పాడు. 'తినగా తినగా గారెలు చేదు' అని ఊరికే అన్నారా మరి?
ఈ పెళ్ళిళ్ళు పుట్టించే కాలుష్యం మరో సమస్య. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇప్పుడంతా ప్లాస్టిక్ కదా. భోజనం పెట్టే పళ్ళెం మొదలు ఐస్ క్రీం అందించే కప్పు వరకూ సర్వం యూజ్ అండ్ త్రో సరుకే. చిత్రం ఏమిటంటే ఇందులో యూజ్ వరకే మన బాధ్యత. వాడాక చక్కగా ఏ రోడ్డు మీదకో త్రో చేసేయడమే. కష్టం ఏదన్నా ఉంటే అది ఊళ్ళో వాళ్ళకే. ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా.. పెళ్లి కష్టాలు కేవలం చేసుకునే వాళ్ళకీ, చూసే వాళ్ళకీ మాత్రమే కాదు వీళ్ళతో ఏ మాత్రం సంబంధం లేనివాళ్ళకీ ఉంటాయి అని.
రోడ్ల మీదే కాదు, గత వారం రోజులుగా ఇంటికొచ్చి టీవీ పెట్టినా పెళ్లి కబుర్లే. భయం లేదు.. ఆ పెళ్లి గురించి నేనిప్పుడేమీ మాట్లాడబోవడం లేదు.
పోనీలెండి పాపం. ఏదో మంచి ముహూర్తాలు ఉన్నాయని ఎక్కువమంది ఒకేసారి చేసుకున్నారు. రెండ్రోజులకే ఇబ్బంది పడితే ఎట్టా. :-)).
రిప్లయితొలగించండియుస్ అ౦డ్ త్రో వల్లన చాలా చాలా కష్ట౦ అ౦డి..వాటీ బదులు అరటిఆకులు విస్తర్లు వెయ్యాలన్న,ఆనక తియ్యాలన్న కష్టమే!!హ్య౦డ్ మేడ్ పేపర్ తో విస్తర్లు వస్తున్నాయి..అవి కొ౦చ౦ రేటు ఎక్కువ...ము౦దు ము౦దు మారితే బాగుణ్ణు..అ౦తా కొ౦చ౦ శ్రద్ద వహిస్తే ఇదేమ౦త కష్ట౦ కాదు..హోప్ ఫర్ ది బెస్ట్..
రిప్లయితొలగించండిబతికించారు ఆ పెళ్ళి గురించి ఏమీ మాట్లాడకుండా :-)
రిప్లయితొలగించండినిజమే పెళ్ళిళ్ళ హడావిడి ఊర్లో వాళ్ల ఇబ్బందులు గురించి ఆలోచించాల్సిన పాయింట్లే చెప్పారు.
మరే ఒకప్పుడు సివిల్ వేరూ క్రిమినల్ వేరూ ఉండేవారు ఇపుడు అన్నిట్లో ప్రతిభ ఉంటేనే పోటీలో ఉంటారు,లేకపోతే "మేత" కి తప్ప "కూతకి" పనికిరారు.
రిప్లయితొలగించండిచూసారా నన్నన్నారు మీరూ గార్లు గుర్తుచేస్తున్నారు మరి.అవునూ మీరు చెప్పాలనుకున్న(?)పెళ్ళిలో అవి పెడతారా ఇంతకీ లేదా? ఇంకా రాతకోతలు సరిగ్గా పూర్తయినట్టులేదు అసలే తారీఖు దగ్గరపడిపోయింది కూడానూ.
jeevitham lo okka sari vachhedi marriage. pellillu chesukoni enjoy cheyanivvandi.
రిప్లయితొలగించండిఆ ఏముందండీ, ఇప్పుడు కళ్యాణమంటపాలు బిజీ.
రిప్లయితొలగించండిఏడాది తర్వాత ఆసుపత్రులు బిజీ.
ద్వని కాలుష్యం మాట రాయనేలేదేమండీ..? సన్నాయి వాయించే వాద్యకారులు శృతి తప్పి వాయిస్తే నిత్యం వినేవారి బాధ....పెళ్ళిలో సినిమా పాటలు పాడటానికి వచ్చే కొందరు కళాకారుల అపశృతులు పాట అందాన్నే పాడు చేస్తూంటే వినటానికి ఎంత బాధాకరంగా ఉంటుందో...రాత్రి పగలు నిద్రాకూ,చదువుకూ భంగం కలిగేలా పెద్ద మైకు సౌండ్ల్ తో కలిగే ఇబ్బందీ.... నాకన్నా బాగా ఎవరూ చెప్పలేరండీ..ఎందుకంటే మేము 6,7 ఏళ్ళు ఒక కల్యాణ మండపం పక్కనే ఉన్నాము... అందుకని స్వానుభవం ఎక్కువ..:)
రిప్లయితొలగించండిఇక వర్తమానంలోకొస్తే మూడు రోజుల నుంచీ పక్కింట్లో పెళ్ళి..!!కల్యాణ మండపం దొరకనట్లుంది..పెళ్ళంతా ఇంట్లోనే చేస్తున్నారు...అపశృతుల సన్నాయి మేళంతో మాకు నిద్రలేని మూడు రాత్రులు..!!
:) :)
రిప్లయితొలగించండిచాలా బావుంది
ఈ సారి హడావుడి కేవలం ముహూర్తాలు ఒక్క సారి రావడం వల్లనే కాదు. గత మూడూ నాలుగు నెలలుగా మూఢం అనీ ఇంకేదో అనీ పెళ్ళి ముహూర్తాలకి నిషిద్ధమైనది. అందుకని అలా పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నీ ఒక్క పెట్టున తోసుకొచ్చేశాయన్న మాట.
రిప్లయితొలగించండిఈ యూజండ్ త్రో చాలా బాధ కలిగిస్తోంది. పెళ్ళిళ్ళలోనే కాక ఏ ఫంక్షన్లోనూ, కొన్ని మెస్సులు హోటళ్లలో కూడా ఇదే వాడుతున్నారు. కనీసం ఆ కేటరింగు వాడు కస్టమర్ల్కి ఓ నాలుగు ఛాయిస్‌లు ఇచ్చినా బాగుణ్ణు, ఇంకో పదిరూపాయ లెక్కువ తీసుకుని.
ఈ సీజన్లో లో పెళ్లికి నేను కూడా వెళ్లి వచ్చానండి ,ఇంతలో మీరు పెళ్ళిళ్ళ మీద మంచి టపా అందించారు.
రిప్లయితొలగించండిబాగుంది మీ గోడు. ఓ రెండు రోజులు సర్ధుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా వినబడవు బాజాలు. అరటి ఆకులు, విస్తరాకుల వాడకం మొదలుపెడితే మంచిది. తర్వాత అవి పశువులు తినడానికి కూడా బాగుంటుంది.
రిప్లయితొలగించండిశ్రీవాసుకి
:-)..భలే వారే మీరు...
రిప్లయితొలగించండి@సుభద్ర: నిజమేనండీ.. హ్యాండ్ మేడ్ మంచి ఆలోచన.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@నాగప్రసాద్: అంతేనంటారా? సరేనండీ అయితే సర్దుకుపోదాం :-) ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ఆ పెళ్లి గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది కదండీ:-) .. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: సివిలూ, క్రిమినలూ :-) :-) ..అసలు గారెలు గుర్తు చేసింది మీరే.. నేనస్సలు ఆ పెళ్లి గురించి మాట్లాడ దలచుకోలేదు కాబట్టి నో కామెంట్ అండీ.. :-) ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@స్వప్న: ధన్యవాదాలండీ..
@బోనగిరి: నర్సాపురం లో 'బాపు' గారి పక్కిల్లా మీది? మీ వ్యాఖ్య ఆయన కార్టూనులా అనిపిస్తే అడిగాను లెండి :-) ధన్యవాదాలు.
@తృష్ణ: అదో పెద్ద టాపిక్ అండీ.. మేమూ బాధితులమే.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@హరే కృష్ణ: :-) ధన్యవాదాలండీ..
@కొత్తపాళీ: నిజమేనండీ ముహూర్తాల గురించి అందరూ అదే మాట.. కేటరింగ్ వాడు ఐటమ్స్ విషయం లో తప్ప మిగిలిన విషయాల్లో అస్సలు చాయిస్ ఇవ్వడండీ.. ధన్యవాదాలు.
@స్రవంతి: కేవలం ఒక్క పెళ్ళికి మాత్రమేనా? అదేమిటండీ అన్ని పెళ్ళిళ్ళు జరుగుతుంటే?? :-) ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@వాసుకి: తినడానికి పశువులెక్కడివండీ?? నిజమేనండీ.. నాలుగు రోజులు మనమే ఓపిక పట్టాలి.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: ఎందువల్లనండీ?? :-) ..ధన్యవాదాలు.
హలో మురళిగారు.. టపా చదివాకా, నా పెళ్ళీ గుర్తొచ్చింది. ఎంత త్వరగా అయిపోతుందా అనిపించడం (ఆత్రం/ఆరాటం లాంటివి కాదు- విసుగు, అలసట వగైరాల వల్ల), నాకు ఈ పెళ్ళి ఎందుకు అని వైరాగ్యం, పెళ్ళికొడుకు మొహం చూసి - నన్ను భరించగలడా ఈ భర్త అనీ, వైస్ వెర్సా అనీ, భయాలూ.. అమ్మా నాన్నాల ఫీలింగ్సూ - అక్క వాళ్ళ హడావిడీ, ఎన్ని రకాలుగా అనిపించిందో ! ముఖ్యంగా కేమెరా ఫోకస్ నా వైపు చేసినపుడల్లా - ఎందుకో భూ, పాతాళలోకాల కన్నా కిందికెక్కడికో వెళిపోవాలనిపించేది. అదేదో త్వరగా అయిపోతే బావుణ్ణు అనిపించింది. సన్నాయి మాత్రం ఎవరో ఒకావిడ చక్కగా వాయించారు. నా పెళ్ళి లో నా పార్టిసిపేషన్ అస్సలు లేదు. అందుకేనేమో - ఎక్కువ సంగతులు తెలీలేదు. అసలు భోజనాలేం పెట్టేరో కూడా తెలీలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇంక నేను ఆగను.. ...."£$%%%$&*&... కాబట్టి ఆగాలి.
రిప్లయితొలగించండి@Sujata: "ఈ పెళ్లి ఎప్పుడు అయిపోతుందిరా దేవుడా.." అన్నట్టుగా పీటల మీద కూర్చున్న జంటలని నేనూ చూశానండీ.. చుట్టూ ఉన్న వాళ్ళ ఎంజాయ్మెంట్లో సగం కూడా కనిపించదు వాళ్ళ ముఖాల్లో.. మీరు ఆగొద్దు.. మీ బ్లాగులో రాసేయండి, మిగిలిన కబుర్లు :-) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమా దగ్గరైతే వీధుల్లోనే చేసేస్తారు పెళ్ళిళ్ళు. పక్క రోజు ఆ రోడ్డంతా వెళ్ళే వాళ్ళ కాళ్ళకి విందు.
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి: "పక్క రోజు ఆ రోడ్డంతా వెళ్ళే వాళ్ళ కాళ్ళకి విందు." :-) :-) ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిమీరూ రాసేవి చదువుతుంటే ఏదో తెలియని ఆనందం సుమండీ!!
రిప్లయితొలగించండిఒకప్పుడు పెళ్ళంటే పందిళ్ళూ ..సందళ్ళూ ....బంధువులందర్నీ ఒకేచోటకు చేర్చే అందమైన వేదిక ! ఇప్పుడు అంతా హడావుడి ...సెలవు దొరికిందా ...హాజరు వేయించుకున్నామా ...తిన్నామా ...బయల్దేరామా అప్పటికింకా పెళ్ళికొడుకు తాళి కట్టకపోయినా సరే ...ఇక తెల్లవారుజ్హాము ముహూర్తమైతే వధూవరులూ వారి తల్లితండ్రులూ....బాండువాళ్ళూ ,పురోహితులూ తప్ప మండపమంతా ఖాళీ ...ప్చ్ మీరన్నట్టు ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కాలుష్యమొకటి !ఇక చేసుకొనేవాళ్ళకి మాత్రం ఏమి ఆసక్తి ఉంటుంది...
రిప్లయితొలగించండి