'పదమూడు' అని వినగానే చాలా మంది కంగారు పడతారు. ఎందుకో ఈ సంఖ్య అంత శుభసూచకం కాదని చాలామంది నమ్మకం. ఈ సంగతి నాకు తెలియడానికి చాలా రోజుల ముందే, అంటే నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడే 'పదమూడు' నాతో ఆడుకుంది. చాలా తిప్పలు పెట్టించింది..ఎన్నో దెబ్బలు కొట్టించింది. ఇది మరీ పెద్ద కథ ఏమీ కాదు. ఎక్కాల పుస్తకం అంత చిన్నదే..
చిన్నప్పుడు నాకు బళ్ళో చదువు కన్నా ఇంట్లో చదువు ఎక్కువగా ఉండేది. తాతయ్య చిన్న బాలశిక్ష నేర్పించి, బళ్ళో చేర్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక నా చదువు బాధ్యత నాన్న చేతికి వచ్చింది. మామూలుగానే నాన్నకి సహనం కొంచం తక్కువ. తను చెప్పింది చెప్పినట్టు చెయ్యకపోతే విపరీతమైన కోపం వచ్చేది. అలా చేస్తే ఇంక నా గొప్పదనం ఏముంది?
తాతయ్య వేసిన పునాది పుణ్యమా అని ఒకటి, రెండు తరగతులు ఆడుతూ పాడుతూ గడిచి పోయాయి. మూడో తరగతి కి వచ్చేసరికి ఎక్కాల బాధ మొదలయ్యింది. ఓ రోజు సాయంత్రం నాన్న ఎక్కాల పుస్తకం తెచ్చి, దానికో అట్ట వేసి నా చేతికిచ్చారు. తెలుగు వాచకం కన్నా చాలా చాలా చిన్నది.. దీనిని చదవడం పెద్ద పనా? అనుకున్నాను. దిగితేనే కదా లోతు తెలిసేది!
ఒక రెండు రెండు.. రెండ్రెళ్ళు నాలుగు.. మూడ్రెళ్ళు ఆరు... మొదటి ఎక్కం కదా..సరదాగానే ఉంది. పన్నెండు రెళ్ళు ఇరవైనాలుగు వరకు అప్పచెబితే చాలు. ఇది కూడా రోజుకో ఎక్కం లెక్క కాదు. ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే నాన్నకి నా చదువు గురించి గుర్తొస్తుంది. 'ఎక్కాల పుస్తకం తియ్యరా' అంటారు. ఎక్కడివరకు వచ్చిందో అడిగి, ఏదో ఒక ప్రశ్న అడుగుతారు.. అంటే ఏ ఏడు రెళ్ళు యెంత అనో అన్నమాట.
సరిగ్గా సమాధానం చెబితే తర్వాతి ఎక్కం చదవమని ఆర్డరేసి బయటికి వెళ్తారు. తను బయటినుంచి రాగానే ముందుగా ఎక్కం అప్పచెప్పించుకుని కానీ మంచి నీళ్ళు కూడా తాగేవాళ్లు కాదు. పన్నెండైదులు అరవై వరకు నల్లేరు మీద బండిలా సాగిపోయింది. నేను చాలా సులువుగా చదివేస్తున్నాన్న విషయం నాన్నకి అర్ధమై ఇంకో కొత్త పని అప్పచెప్పారు.
అప్పట్లో ఎక్కాల పుస్తకాలు ఎలా ఉండేవంటే, ఒక పేజి లో రెండు ఎక్కాలు, వాటికింద సుమతి, వేమన శతకాల నుంచి ఒక్కొక్క పద్యం ప్రచురించేవారు. ఎక్కం తో పాటు ఒక పద్యం కూడా చదవమని ఆర్డరు. చేసేదేముంది.. 'ఉప్పు కప్పురంబు..' 'కూరిమి గల దినములలో..' కూడా బట్టీ కొట్టడం, అప్పజెప్పడం. ఆరో ఎక్కం నుంచి సమస్యలు మొదలయ్యాయి. అప్పజెప్పడం లో తడబాట్లు రావడంతో..
నాన్న ఇంటికి రాగానే మంచి నీళ్ళ గ్లాసు, ఎక్కాల పుస్తకం, ఒక చీపురు పుల్ల పట్టికెళ్ళి ఇవ్వాలి. నీళ్ళు తాగగానే ఎక్కం అప్పచెప్పాలి (ఆయన మూడ్ ని బట్టి, ఒక్కోసారి తాగక ముందే). ఎక్కడైనా నట్టు పడిందంటే చీపురు పుల్ల కాలి మీద చురుక్కు మంటుంది. తప్పులు ఎక్కువయ్యాయంటే రెండోరోజూ అదే ఎక్కం చదవాలి. రెండోసారి కూడా తప్పులోస్తే చీపురు పుల్ల బదులు వెదురు పుల్ల అందుకునే వాళ్ళు. ఇది కొంచం గట్టిగా తగులుతుంది. దద్దురు కూడా బాగా తేలుతుంది.
రానురాను ఈ పద్యాలు నాకు తలనొప్పిగా తయారయ్యాయి. ఎక్కం తప్పుల్లేకుండా అప్పచెప్పానన్న ఆనందాన్ని పద్యం మింగేసేది. పన్నెండు పన్నెండ్లు నూట నలభై నాలుగు తో మూడో తరగతి పూర్తయ్యింది. నాలుగో తరగతిలో పదమూడో ఎక్కం. పైగా ఇరవై పదమూళ్ళు వరకు.. చీపురు పుల్ల, వెదురు బెత్తం అయిపోయాయి.. నిద్రగన్నేరు కొమ్మ వంతూ వచ్చింది. ఊదా రంగు అందమైన పూలు పూసే ఈ చెట్టులో నాకు నచ్చనిది కొమ్మే.
దెబ్బ కొంచం గట్టిగానే తగులుతుంది, పైగా దెబ్బ పడగానే మన చేతిమీదే కొమ్మ రెండుగా చీలిపోతుంది. సైకలాజికల్ గా 'చాలా గట్టి దెబ్బ' అనిపించేది. చేతిలో బెత్తంతో, ఎర్రటి పెద్ద కళ్ళతో నాన్నని చూడగానే సగం ఎక్కం మర్చిపోయే వాడిని. పద్నాలుగు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు, పదహారు పదమూళ్ళు దగ్గర కొన్నాళ్ళు ఆగాను. గజనీ దండయాత్రలు కొనసాగించి, మొత్తానికి ఓ మద్యాహ్నం వెక్కిళ్ళ మధ్య పదమూడో ఎక్కం అప్పచేప్పేశాను.
కానీ తర్వాత ఎప్పుడు లెక్కల్లో పదమూడో ఎక్కం అవసరం వచ్చినా పేజి లో పక్కన గుణకారం చేసుకోవాల్సి వచ్చేది, ఎక్కం గుర్తు రాక. అదేమిటో తెలీదు కాని పద్నాలుగు, పదిహేను ఎక్కాలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. అక్కడితో నా ఎక్కాల చదువు ముగిసింది. మిగిలిన నాలుగు ఎక్కాలు చదివాను కాని, అప్పజెప్ప మని నాన్న అడగలేదు, నాకు నేనుగా అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. తెలిసి తెలిసి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?
ఇరవై ఇరవైలు ఒప్పజెప్పితేగాని నన్ను ఆడుకోటానికి పంపించేవారు కాదు మా తాతయ్య. "చౌకాలు" అని అడిగేవారు. అంటే ఎన్నెన్నెల 342, ఎన్నెన్నెల 371 ఇలా అడుగుతారన్నమాట. వెంటనే చెప్పకపోతే మళ్ళీ చదవమనేవారు. నాకు మా తాతయ్య మీద తెగ కోపం వచ్చేది. ఇప్పుడింకా పెరిగింది. ఎందుకంటే ఆ తరువాత మనవరాళ్ళెవరికీ ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు. నాకొక్కదానికే :(.
రిప్లయితొలగించండిబాగుందండి మీ 13 ఎక్కాం అనుభవం నాకు తప్పలేదు లెండి ఈ ఎక్కాల ఎక్కిళ్ళు
రిప్లయితొలగించండిమురళి గారు,
రిప్లయితొలగించండిబుడుగు గాడి కి పదమూడో ఎక్కం మీద కధ ( రాచ్చసుడు..పదమూడో ఎక్కం ఖద ) ఉన్నట్టు మీకు కూడా ఒక కధ ఉందన్నమాట. మొత్తానికి ముప్పతిప్పలు పడి పదమూడో ఎక్కం నేర్చేసుకున్నారు!! :))
ప్చ్..ప్చ్...! జాలివేస్తుందండి...మీ దెబ్బల పదమూడో ఎక్కం కధ చదువుతుంటే!
రిప్లయితొలగించండిఅయినా ఏ మాటకామాటే అప్పుడు అలా చదవబట్టే కదండి ఇంత తెలివి మీకు!
> తెలిసి తెసిలి అంత రిస్కు నేనెందుకు తీసుకుంటాను?
రిప్లయితొలగించండి:-)
:) షేం టు షేం ఇక్కడ
రిప్లయితొలగించండినాకు డుమువులుతో ఇలాంటి అనుభవమే ఉంది. అవి ఎందుకో అర్థం కాలేదు, ఎందుకో అర్ధం కాకపోతే మనకు అవి వచ్చి చావవు.
రిప్లయితొలగించండికూడికలతో ఎక్కాలు చేసుకోవటం వచ్చాక నాకు అవి బాగా వంటపట్టాయి :)
hi murali garu gud morning!
రిప్లయితొలగించండిna peru anusha nenu eenadu lo vachina me
vaysam tho naku metho parichayam ayindi.sorry naku telugu lo type cheyatam radu. mrng levagane paper chadavatam taruvatha oka sare kotha posts kosam me blog ni vethakatam roju jaruguthundi.ee roju me vaysam chusi maths tables ante naku unna chinanati bad memories gurthuku vachay kani ippudu navvu vachindi.annatu meru manchi humorous writer
thanks
హ హ నేనైతే 12*12 లు రెండొ క్లాస్ లోనే నేర్చేసుకున్నా.. ఆ తరువాత పక్కన గుణించుకోవడమే తప్ప కొత్త ఎక్కం నేర్చుకోడానికి ట్రై చేయలేదు..ఆ పద్యాలు ఉన్న ఎక్కాల బుక్కు ఎక్కడ చూసిన చిన్నప్పటి రోజులు గుర్తువస్తాయి
రిప్లయితొలగించండిఎక్కాల బాధలు ఇంత ఇంత కాదయ ..అన్న చందాన ఉందండి.
రిప్లయితొలగించండిమీరు చాల అద్రుష్టవంతులు మురళి గారు ...నేను రెండవ తరగతిలోనే ఈ ఎక్కలా మెట్లు ఎక్కలేక ఎక్కలేక ఎక్కాను...ఆ తర్వాత నాకు అంతా హాయే !!!
ఎక్కాలంటే మీకు మీ నాన్నగారు గుర్తుకొస్తే నాకు మా నాయనమ్మ గుర్తుకొస్తుంది. ప్రతి రోజూ సాయంత్రం బయట అరుగు మీద కూర్చోబెట్టి నా చేత మా అన్నయ్య చేత 20 ఎక్కాలు, తెలుగు నెలలు, సంవత్సరాలు, తిధులు అన్నీ వరసపెట్టి చెప్పించుకునేది. ఇంటికి ఎవరన్నా పిల్లలు వస్తే ఒరేయ్ మీకు ఎన్ని ఎక్కాలొచ్చో చెప్పండిరా అనేది. ఎక్కాలు తెప్పులేకుండా చెప్పినవాళ్లే ఆమె దృష్టిలో మంచి తెలివైన వాళ్లు. చివరికి మా పిల్లల్ని కూడా వదల్లేదు!
రిప్లయితొలగించండినేనూ మా అమ్మాయికి రోజుకొక ఎక్కం చొప్పున మొత్తం 20 ఎక్కాలు నేర్పాను. మా అబ్బాయి మాత్రం 12వ ఎక్కంతో సరిపెట్టేసాడు:)
@ భవానీ గారు, "చౌకాలు"..భలే ఉందండి ఈ మాట. అసలు అలా చెపితేనే ఎక్కాలు బాగా వచ్చినట్టు అంట.
మురళి గారు
రిప్లయితొలగించండిమన కలం స్నేహితులం అంతా ఇదే బాపతు ..నాకు చిన్నపుడే 20 ఎక్కాలు 1*10 nundi 20*10 దాకా నేర్పించేసారు..కొట్టిన దెబ్బలు ని ఇప్పుడు గుర్తు చేసారు మీరు
ఈ చౌకాలు అడిగేవారు ముందు కష్టం గానే వున్నా తర్వాత బాగానే నేర్చేసుకున్నా
మురళి.. చెప్పే విధానం బావుంది..బాగా ప్రెజెంట్ చేసారు ..ఈరోజు మొదటిసారి హాయిగా నవ్వాను
రిప్లయితొలగించండిఈ సందర్భం గా ఉష గారు తన కామెంట్ రాయాలని డిమాండ్ చేస్తున్నా..
(యి-మెయిల్ ద్వారా చక్రి ఇలా అన్నారు)
రిప్లయితొలగించండిపదమూడో ఎక్కం అనుభవం చదూతుంటే నా బాధ గుర్తుకు వచ్చింది. మీరు పదమూడో ఎక్కం వరకు వచ్చారు... నేను తొమ్మిదో ఎక్కం దగ్గరే తిప్పలు పడ్డాను. అదేంటో పదో ఎక్కం సులువుగా వచ్చింది.. మా ఇంట్లో అందరూ లెక్కల్లో టాప్... నేను మాత్రం వీక్... నాకు ఎక్కాలు నేర్పి లెక్కల్లో తీర్చిదిద్దాలని మా నాన్న చేయని ప్రయత్నం లేదు.. అవి వస్తేనా... పదో తరగతి తరవాత వీడు బాగు పడడు అని డిసైడ్ అయ్యారు. మురళి... ఈ అనుభవాలు ... వజ్రం సినిమాని గుర్తు చేస్తున్నాయి కదా. మనలాంటివాళ్ళు చాలా మంది వున్నారు.
చక్రి
నాది పెద్దబాలశిక్ష చదువుకాదు కాన్వెంటు చదువు. అది క్రిస్టియన్ స్కూలు కాబట్టి మాకు పన్నెండో ఎక్కం దాకే ఉండేవి - కాబట్టి నేను 13 బారిన పడలేదోచ్! :-)
రిప్లయితొలగించండిమళ్ళీ జ్ఞాపకాల తుట్టని కదిలించారుగా! :-)
రిప్లయితొలగించండి13, 17, 19.. ఈ సంఖ్యలు గుర్తొస్తేనే నిద్ర పట్టని రాత్రులున్నాయి.. నెమ్మదిగా పై తరగతులకి వెళ్తున్నకొద్దీ మాకు వేసవి సెలవులొస్తున్నాయంటేనే భయం వేసేది.. పొద్దున్నే ఇడ్లీ తిని, స్నానం చేశాక మా తాతయ్య దగ్గర ఇంగ్లీష్ గ్రామర్ పాఠం చెప్పించుకోవడం, తర్వాత రెండు పేజీలు కాపీ రైటింగ్ (కలిపిరాత అనేవాళ్ళం), ఆ తర్వాత పద్యాలు, ఎక్కాలు.. ఇవన్నీ అయితేగానీ ఆటలకి పంపొద్దని మా అమ్మకి గట్టి ఆజ్ఞ జారీ చేసిగానీ మా నాన్న ఆఫీసుకి వెళ్ళేవాళ్ళు కాదు.. సాయంత్రం ఇంటికొచ్చి పడక్కుర్చీలో కూర్చుని, వేపబరిక (మా వేపచెట్టుదే అతి నాణ్యమైన ఒక కొమ్మని స్వయంగా చేసుకున్నారు) ఆ కుర్చీ హాండిల్ మీద రెడీగా పెట్టుకుని ఆ రోజు చదివిందీ, రాసిందీ పరీక్ష చేశేవారు.. ఎక్కాల దగ్గరకొస్తే ఆయనకి బేసి సంఖ్యలంటే అంత ప్రీతి ఎందుకో అర్ధ్యమయ్యేది కాదు.. ఎప్పుడూ 3x17.. 13x17.. 17x19.. 7x19.. ఇలాంటి కాంబినేషన్లే అడిగి మాకు దెబ్బలు పుష్కలంగా అందజేసేవారు :-)
అనూషా - తెలుగులో టైపు చెయ్యటం చాలా తేలిక. ఇది చదవండి ఒకసారి
రిప్లయితొలగించండితెలుగులో రాయటం ఎలా - http://paatapaatalu.blogspot.com/2009/03/blog-post.html
maadi okaragam ga nishiganda gari anubhavame..
రిప్లయితొలగించండిraboye taragatula pustakalu mosuku vellasi vachedi vuriki.. roju oka patam chadivi dani mida vyasam rayaka tappadu .. poddune palu palaharalu ayyaka oka puta anglam, telugu, hindi raata.. (rata mutyala levo chacchave).. malli oko dani mida vyasam, lekkhallo abhyasam chesi unchali.. avi anni prati adivaram tedila variga kanapadataka pote aa roju endalo nirchlodame.. maa intlo bettalaki pani ledu ... (okka maa annaki tappa)..
@భవాని: 'చౌకాలు' మొదటి సారి వింటున్నానండి.. మీమీద ప్రత్యేకమైన అభిమానం ఉండబట్టి అంత శ్రద్ధగా చదివించారు మీ తాతగారు. అంతే కదండీ? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రమణి: హమ్మయ్య.. నేనొక్కడినే కాదన్న మాట... ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: బుడుగుకీ నాకూ మరికొన్ని పోలికలు కూడా ఉన్నాయండోయ్.. చెబుతా..చెబుతా.. నేర్చుకుని ఏం లాభమండి.. వెంటనే మర్చిపోయాను కదా... ధన్యవాదాలు.
@పద్మార్పిత: నాకా? తెలివా? భలే జోకులేస్తారండి మీరు.. ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@panipuri123: :-) ధన్యవాదాలు
@భాస్కర్ రామరాజు: మొత్తానికి షేం అన్నమాట :-) ...ధన్యవాదాలు.
@oremuna: డుమువులు నేను చాలా సరదాగా నేర్చేసుకున్నానండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@anusha: భాస్కర్ రామరాజు గారి సలహా పాటించి తెలుగు రాయడం నేర్చేసుకోండి.. ఇప్పుడు జిమెయిల్ లోనూ, ఇంకా ఈ లింక్ ద్వారా కూడా తెలుగు లో రాయొచ్చు. https://www.google.co.in/transliterate/indic/telugu
@నేస్తం: మీరు మేధావులండీ బాబూ.. అందుకే త్వరగా నేర్చేసుకున్నారు.. ధన్యవాదాలు.
@Krishna: రెండో తరగతిలోనేనా? ఐతే నేను పర్వాలేదన్న మాట! ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సిరిసిరి మువ్వ: హమ్మయ్య.. నాకెంతమంది తోడున్నారో... ధన్యవాదాలు.
@హరే కృష్ణ: మీ డిమాండ్ కి స్పందన ఎలా ఉంటుందా అని నేనూ చూస్తున్నా :-) ...ధన్యవాదాలు.
@చక్రి: మిమ్మల్నందరినీ చూశాక నాకు బోల్డంత ఆత్మవిశ్వాసం వచ్చేసింది :-) ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భైరవభట్ల కామేశ్వర రావు: అదృష్టవంతులు! చూశారా ఎంతమంది బాధితులం ఉన్నామో ఇక్కడ.. ...ధన్యవాదాలు.
@నిషిగంధ: మాకు ఒక్కో సెలవుల్లో ఒక్కో చదువే ఉండేదండి.. ఓ సారి చూచివ్రాత (మేమిలాగే అనేవాళ్ళం) మరోసారి హిందీ ఇలా అన్నమాట. మీకింకా ఒక్క కొమ్మే.. నాకైతే చెట్లకి చెట్లే కావాల్సి వచ్చేది :-) ..ధన్యవాదాలు.
@sriatluri: సెలవుల కన్నా స్కూలుంటేనే బాగుండునని కోరుకునే వాళ్ళేమో మీరు? అదేం చదువండీ బాబూ, ఒకదాని తర్వాత మరొక సబ్జెక్ట్.. ఈ లెక్కన నేను కొంచం పర్వాలేదన్న మాట... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినాకు కూడా పన్నెండో ఎక్కం వరకే కంఠతా వచ్చు.మిగతావి ఎంత చదివినా రాక కొన్నాళ్ళు దెబ్బలతో లాగించాను బండి.తరువాత గుణకారాలతో నెట్టుకొచ్చేసా.ఆ తరువాత కాలేజీ లో నన్ను అంత బాధించినది కెమిస్ట్రీ.
రిప్లయితొలగించండినాకు ఎక్కాలు 20 దాకా నేర్పారుగానీ, గుణకారం పది దాకే నేర్పారు. ఆ విధంగా మీకంటే నే నదృష్టవంతుణ్ణి. 13, 17, 19 ఎక్కాలు అన్నిటికంటే గడ్డుగా ఉండేవి.
రిప్లయితొలగించండి@రాధిక: మా స్కూల్లో అమ్మాయిలని కొట్టేవాళ్ళు కాదు, ఇంట్లోనూ దెబ్బలు అబ్బాయిలకే :-( మీ స్కూల్లో ధర్మం నాలుగు పాదాల మీద నడిచినట్టు ఉంది :-) ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చదువరి: మామూలు కష్టాలు కాదండి..ఎన్నిసార్లు చదివినా మర్చిపోడమే... ధన్యవాదాలు.
ee Tapaa miss aiyyaanu.ammoe! ekkaalae? naaku ippaTikee anumaanamae.
రిప్లయితొలగించండిBapu ramana gari BUDUGU lo mana hero budugu ki Villian ee 13va ekkame......... ee ekkam appachepithe kanii raju gani heroine ni icchi pelli cheyyanani cheputaru..
రిప్లయితొలగించండి:) Post bagundi naa chinnatanam , debbalu gurthuvaccahyi
@సునీత: హమ్మయ్య! మనమందరం ఒకటే పార్టీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@హరిప్రియ: మీరు కూడా దెబ్బలు తిన్నారా.... ఎక్కాల మహిమ!... ధన్యవాదాలు.
ఒక్కసారిగా గతంలోకి పంపించారు నన్ను. నాది దాదాపు ఇదే పరిస్థితి.13, 17,19అసలు వీటిని నిషేధించాలి.13 కి ఐతే NDA మద్దతు ఇస్తుంది. మరి మిగతా వాటి సంగతి? కాకపోతే మా ఇంటివెనక ఉండే జామ, నేరేడు, సీతాఫలం ఇత్యాది చెట్లన్నీ వాటి కాయల్ని కోసినందుకు కొమ్మల్ని బెత్తాలుగా ఇచ్చి ప్రతీకారం తీర్చుకొనేవీ. నాకు ఎవరికీ లేనంత ప్రత్యేక సదుపాయం ఒకటి ఉంది. అది ఏంటంటే..... ఇంట్లోనే 6 మంది టీచర్లు ఉన్నారు మరి. ఇక చూస్కోండి నాకు ఒకరి తరువాత ఒకరు. ఐతే అందరిలోకి స్పెషల్ అట్ర్యాక్షన్ మయ తాతగారు ఆయన చేత దెబ్బ తినని వారు చుట్టూ 3 మండలాల్లో చాలా తక్కువ మంది.
రిప్లయితొలగించండి13X 17X19 how much? answer without calculator. hahaha
రిప్లయితొలగించండి@Subrahmanya Chaithanya Mamidipudi: మీరిలా కష్టమైన ప్రశ్నలేస్తే ఎలాగండి? ఏదో పదమూడు రెళ్ళు ఎంత అని అడిగితె కాసేపు లెక్కపెట్టి చెప్పగలను :-) ఆరుగురు మాస్టార్లా? మీకు ఇల్లు కన్నా బడే బెటరనిపించేదేమో.. అక్కడైతే ఇద్దరో ముగ్గురో ఉంటారు.. అంతే కదండీ? ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిnaaku kuda chinnappude 13va ekkam tho ennokashtalu paddanu. Essay adbhuthanga vundi.
రిప్లయితొలగించండి