గురువారం, డిసెంబర్ 31, 2009

వీడ్కోలు-స్వాగతం

నిన్నకాక మొన్ననే గోడలకి కేలండర్లు తగిలించినట్టు, అందుకున్న డైరీలు ఒక చోట సర్దినట్టూ ఉంది.. అప్పుడే వాటిని మార్చేసే రోజు వచ్చేసింది. గోడ మీదికి చేరేందుకు కొత్త కేలండర్ తహతహలాడుతోంది.. డైరీలు రావడం మొదలయ్యింది. చూస్తుండగానే ఒక సంవత్సరం పూర్తయిపోయి, కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం, నెలన్నా గడవక ముందే వాటిని మర్చిపోవడం చాలా సార్లు జరిగాక, చాలా ఏళ్ళ క్రితమే ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను. అనుకున్న పనిని పెండింగ్ పెట్టకుండా వీలైనంత వెంటనే చేసేసే అలవాటు వల్ల రిజల్యూషన్స్ లేమి నన్ను పెద్దగా బాధ పెట్టడం లేదు.

ఎటూ రిజల్యూషన్స్ ప్రసక్తి వచ్చింది కాబట్టి, నేను చాలా సార్లు జనవరి ఒకటి రోజున అనుకుని కొన్నాళ్ళు అమలు చేసి ఆ తర్వాత వదిలేసినా పని డైరీ రాయడం. చిన్నప్పుడేమో పెద్దవాళ్ళ కంట పడుతుందేమో అనే భయం చేత, కొంచం పెద్దయ్యాక ఉన్నది ఉన్నట్టు రాసుకోలేనేమో అనే సందేహం చేత (మరీ డైరీలో కూడా ఆత్మవంచన చేసుకోలేము కదా) డైరీ రాయడం కొనసాగించలేదు.

కొన్నాళ్ళు రాసి చించేసిన డైరీలో కొన్ని విషయాలు అప్పుడప్పుడూ గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.. వాటిలో కొన్ని బ్లాగ్మిత్రులతో పంచుకున్నాను 'జ్ఞాపకాలు' గా.. వెళ్ళిపోతున్న సంవత్సరం ప్రారంభంలో నేను యాదృచ్చికంగా చేసిన పని బ్లాగు ప్రారంభించడం. డైరీ రాయలేదన్న కొరత చాలా వరకూ తీరింది, ఈ బ్లాగు పుణ్యమా అని.

వ్యక్తి గత జీవితం ఎప్పటిలాగే సాగింది.. కొన్ని విజయాలు, మరి కొన్ని ఓటములు.. ఒత్తిళ్ళు, చికాకులు, మధ్య మధ్యలో మెరిసి మాయమయ్యే చిన్న చిన్న సంతోషాలు.. ఎప్పుడూ సంతోషాన్నే కోరుకోడం మన స్వార్ధం.. తను ఇవ్వదల్చుకున్న వాటిని మాత్రమే ఇవ్వడం కాలం చేసే మాయాజాలం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??

'తలచుకుంటే కానిదేముంది?' 'ఏదీ మన చేతుల్లో లేదు..' అనే ద్వంద్వ భావాల మధ్య కాలం కరిగిపోయింది.. బహుశా జీవితపు నడక ఇలాగే ఉంటుందేమో.. వెళ్ళిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, కొత్తగా వస్తున్న సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. మనం చెప్పక పోయినంతమాత్రాన కొత్త సంవత్సరం రాక మానదు. కానీ వస్తున్న అతిధిని ఆహ్వానించాలి.

జరగాల్సింది జగరక మానదన్న వేదాంతాన్ని కాసేపు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఇంటా, బయటా ఉన్న సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కారమైపోతాయని ఆశిద్దాం.. నూతన సంవత్సరాన్ని మనస్పూర్తిగా ఆహ్వానిద్దాం.. బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

29 కామెంట్‌లు:

  1. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  2. "ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను."

    హ హ నాకు కూడా ఈవిషయం మీద ఇటీవలే ఙ్ఞానోదయం అయింది ఒక రెండేళ్ళుగా నేనూ విజయవంతంగా అమలు చేస్తున్నాను :-)

    మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. >>>చాలా ఏళ్ళ క్రితమే ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను..

    Same pinch..

    మీకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలండీ..

    రిప్లయితొలగించండి
  4. >>న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం, నెలన్నా గడవక ముందే వాటిని మర్చిపోవడం చాలా సార్లు జరిగాక, చాలా ఏళ్ళ క్రితమే ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను.
    LOL :-)
    మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండీ!..

    రిప్లయితొలగించండి
  5. నాదీ ఇంచుమించు ఇదేనండి కథ కాకపోతే నాకు రిజల్యూషన్స్ వదలవు లేదూ నేను వదలను.మీకు కూడా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  6. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. మురళిగారు, మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. I wish you again to fulfill all your resolutions.

    రిప్లయితొలగించండి
  8. 'తలచుకుంటే కానిదేముంది?' 'ఏదీ మన చేతుల్లో లేదు..' అనే ద్వంద్వ భావాల మధ్య కాలం కరిగిపోయింది.. బహుశా జీవితపు నడక ఇలాగే ఉంటుందేమో.. వెళ్ళిపోతున్న సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, కొత్తగా వస్తున్న సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. మనం చెప్పక పోయినంతమాత్రాన కొత్త సంవత్సరం రాక మానదు. కానీ వస్తున్న అతిధిని ఆహ్వానించాలి.
    So true!!! Wish you also a very happy new year Murali garu

    రిప్లయితొలగించండి
  9. మీ చివరి పేరా ...నా ఆకాంక్ష కూడా అదేనండీ ...మీకూ , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  10. >>ఇంక రిజల్యూషన్స్ చేసుకోకూడదనే రిజల్యూషన్ చేసుకుని దానిని మాత్రం విజయవంతంగా అమలు చేస్తున్నాను
    ఇలాంటి వాటిల్లో నేను ముందుంటా.. :)

    >>అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??
    నిజం కదూ..!!!

    మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరంలో మీకు మరిన్ని విజయాలు లభించాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  11. ఎప్పుడూ సంతోషాన్నే కోరుకోడం మన స్వార్ధం.. తను ఇవ్వదల్చుకున్న వాటిని మాత్రమే ఇవ్వడం కాలం చేసే మాయాజాలం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??

    ఎప్పుడూ సంతోషాన్నే కోరుకోడం మన స్వార్ధం.. తను ఇవ్వదల్చుకున్న వాటిని మాత్రమే ఇవ్వడం కాలం చేసే మాయాజాలం. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ప్రపంచం తలకిందులైపోదూ??

    బాగా చెప్పారు మురళి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  12. "కొన్ని విజయాలు, మరి కొన్ని ఓటములు.. ఒత్తిళ్ళు, చికాకులు, మధ్య మధ్యలో మెరిసి మాయమయ్యే చిన్న చిన్న సంతోషాలు"...బాగా చెప్పారు..

    మీకు కూడా కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ..నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

    రిప్లయితొలగించండి
  13. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు,
    మీ blog eenadu లో చూసినప్పటి నుండి నేను silent గా mee ప్రతి ఆర్టికల్ చదువుతున్నాను. ఎప్పటికప్పుడు మీకు comments రాద్దాము అనుకుంటాను . కాని కొంచెం మొహమాటం.మీ ఆర్టికల్స్ చాల బాగుంటాయి. నాకు బాగా నచ్చిన ఆర్టికల్ " ఉష పరిణయం రివ్యూ మరియు సుమన్ బాబు ". మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    Satya

    రిప్లయితొలగించండి
  15. మీకు , మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  16. నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  17. "చిన్నప్పుడేమో పెద్దవాళ్ళ కంట పడుతుందేమో అనే భయం చేత, కొంచం పెద్దయ్యాక ఉన్నది ఉన్నట్టు రాసుకోలేనేమో అనే సందేహం "

    నాదీ ఇదే అనుభవమండి. కానీ ఈ ఏడాది డైరీ రాసేద్దామని ఒక రిజల్యూషన్ తీసుకున్నాను. ఏమవుతుందో చూడాలి. :)

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  18. నూతన సంవత్సర శుభాకాంక్షలు..
    have a great year

    రిప్లయితొలగించండి
  19. మురళి గారూ !
    డైరీల విషయంలో మీరు చెప్పినది నాకు స్వానుభవం. కొత్తసంవత్సరం వస్తుంటే డైరీ రాయాలనుకోవడం, తర్వాత పక్కన పెట్టడం నాకు కూడా అనుభవమే !

    May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

    SRRao
    sirakadambam

    రిప్లయితొలగించండి
  20. Happy newyear murali garu.niajame mankau teliaykundane konni gnapakaalanna blog rupamlo dachukuntunam.thanks for these blogs.wishing a very happy and prosperous newyear

    రిప్లయితొలగించండి
  21. నావి ఎన్ని డైరీలో ...:) నా డైరీ లు ఎక్కువగా ఆనందం వచ్చిన కోపం వచ్చిన మాత్రమె తెరవబడతాయి ,కొంతకాలం గతించాక అవి చూసుకుని
    నవ్వుకుని సిగ్గుపడిన సందర్భాలెన్నో ...మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ...

    రిప్లయితొలగించండి
  22. నూతన సంవత్సరశుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  23. @తృష్ణ: ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: తెలుసుకున్నారన్న మాట!! ..ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: సో, మీరూ తోడున్నారు నాకు :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @రవిచంద్ర: ధన్యవాదాలండీ..
    @మరువం ఉష: అయితే రిజల్యూషన్స్ చేసేశారన్న మాట!! ..ధన్యవాదాలు.
    @సునీత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. @జయ: రిజల్యూషన్స్ ఏవీ లేవండీ :) ..ధన్యవాదాలు.
    @లక్ష్మి: అంతే కదండీ మరి.. ధన్యవాదాలు.
    @పరిమళం: సర్వేజనా సుఖినోభవంతు.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  26. @మేధ: ధన్యవాదాలండీ..
    @కల్పనా రెంటాల: ధన్యవాదాలండీ..
    @సిరిసిరిమువ్వ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  27. @monkey2man చదివానండీ, బాగుంది.. ధన్యవాదాలు.
    @సత్య: మొహమాటం ఎందుకండీ.. మీకు ఏం అనిపించినా నిరభ్యంతరంగా చెప్పండి.. ధన్యవాదాలు.
    @మాలాకుమార్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  28. @మెహెర్: ధన్యవాదాలండీ..
    @శిశిర: తప్పక రాయండి.. ధన్యవాదాలు.
    @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  29. @SRRao: మెజారిటీ అనుభవం ఇదే అవుతుందండీ :) ధన్యవాదాలు.
    @స్వాతి మాధవ్: ధన్యవాదాలండీ..
    @చిన్ని: ఈ నూతన సంవత్సరంలో మొదటి కారణానికే తెరవబడాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
    @శ్రీనిక: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి