గురువారం, మే 23, 2019

చంద్రబాబు పొరపాట్లు

కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన అంశం ఒక్కటే - వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్  జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారనీ, ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు సొంతానికి వెనకేసుకున్నారనీ. ఇతరత్రా కారణాలతో పాటు, ఈ 'అవినీతి' ప్రచారమూ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాడానికి కలిసొచ్చిందన్నది నిర్వివాదం. చంద్రబాబు, ఇతర నాయకుల ప్రచారావేశం చూసిన ప్రజల్లో కొందరైనా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం అని భావించారు. తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది, కానీ, జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు.

ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలొచ్చాయి. జగన్ లక్ష కోట్ల అవినీతి పరుడు అంటూ చంద్రబాబు మళ్ళీ పాత పల్లవి అందుకున్నారు. మరి ఐదేళ్ల పాటు ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదు అంటే జవాబు దొరకదు. జగన్ అవినీతిని చంద్రబాబు కేవలం ఎన్నికల అంశంగా మాత్రమే చూస్తున్నారన్న ఆలోచన జనంలోకి వెళ్ళింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షం బీజీపీతో నాలుగేళ్లకు పైగా సత్సంబంధాలు నెరిపిన కాలంలో కూడా అవినీతి ఆరోపణల కేసుల్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నాలు జరిగాయన్నది తెలీదు. ఫలితం 'అవినీతి జగన్' ఆరోపణల్ని జనం ఈసారి సీరియస్ గా తీసుకోలేదు. ఆరోపణల్లో నిజం ఉండి, తన పార్టీ నేతల చేత ప్రత్యర్థి మీద కేసులు వేయించడంతో ఊరుకోకుండా, వాటి పురోగతి విషయంలో కూడా చంద్రబాబు శ్రద్ధ చూపి ఉంటే ఇవాళ ఎన్నికల ఫలితం మరోలా ఉండేది బహుశా.

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన వ్యవసాయ విధానాలతో రైతులకి దూరమైన చంద్రబాబు, గత ఎన్నికలకి ముందు సంపూర్ణ రైతు రుణ మాఫీ హామీ ప్రకటించారు. సహజంగానే రైతుల్ని ఇది ఆకర్షించింది. కానీ, హామీ అమలు విషయానికి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. అర్హుల్ని నిర్ణయించడం మొదలు, పంపిణీ వరకూ రుణ మాఫీని నానారకాలుగా నీరుకార్చడంతో విసిగిపోయిన రైతులకి, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేసేసిందంటూ చేసిన భారీ ప్రచారం పుండు మీద కారంలా మారింది. స్వయం శక్తి సంఘాల మహిళల రుణమాఫీదీ ఇదే తీరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావడం మీద కన్నా, నియోజకవర్గాల పునర్విభజన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, మెజారిటీ ప్రజల సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదాని చిన్నబుచ్చుతూ మాట్లాడ్డం చంద్రబాబు స్థాయి నేత చేయాల్సిన పనులు కావు.

స్థాయికి తగని వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కోవడం చంద్రబాబుకి గతంలోనూ అనుభవమే (లక్ష్మీ సెహగల్ ఎవరో తనకి తెలీదనడం లాంటివి) కానీ గడిచిన ఐదేళ్ళలో అలాంటి సందర్భాల సంఖ్య మరింత పెరిగింది. వయసు, అనుభవంతో పాటు హుందాతనాన్ని పెంచుకోవాల్సిన ఉండగా, అలా కాకుండా జనం నొచ్చుకునేలా మాట్లాడడం, క్షమాపణ ప్రస్తావనే లేకపోవడం కొన్ని వర్గాలని నొప్పించింది. ఇక, ప్రతిపక్షానికి సంబంధించిన విషయాల్లో అయితే హుందాతనం ప్రసక్తే లేదు. ఓటుకి నోటు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు లాంటి విషయాలని ఓటర్లు గమనించారని, గుర్తు పెట్టుకున్నారని ఈ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రధాని మీద కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగని విధంగా విమర్శలు చేయడం కొందరు వోటర్లని తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది. కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తయితే చాలామంది తెలుగుదేశం వారినే విస్మయపరిచింది.

'జలయజ్ఞం' లో అవినీతి జరిగిందంటూ పదేపదే విమర్శలు చేసిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు వ్యయం విషయంలో పారదర్శకతని చూపలేకపోయారు. జనానికి జవాబుదారీగా ఉండడం మాట అంటుంచి, నిధులు విడుదల చేసిన కేంద్రానికే లెక్కలు చెప్పలేదన్న ఆరోపణలున్నాయి. ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధుల్ని ఇతర ఖర్చులకి వాడడాన్ని కాగ్ ఎత్తిచూపినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. గత ఐదేళ్లుగా జరిగిన వృధావ్యయానికి లెక్కేలేదు. ప్రత్యేక విమానాల్లాంటి ప్రత్యేక ఖర్చులు అదనం. ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికలవరకూ ఎప్పుడూ పొత్తు లేకుండా పోటీ చేయని చంద్రబాబు, మొదటిసారిగా అన్ని స్థానాలనుంచీ తన పార్టీ వారినే నిలిపే ప్రయోగం చేశారు. ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏవైనప్పటికీ, ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఖాళీ ఖజానా మొదలు, ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తి చేయడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వానికి సొంత మెజారిటీ ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి, పార్టీ ఎంపీల ద్వారా ఒత్తిడి చేసి నిధులు సాధించుకునే వీలుండకపోవచ్చు. ప్రతిపక్షంలో సభ్యుల సంఖ్య మరీ తక్కువే అయినా, తొంభై శాతం ప్రసార సాధనాలు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్ ని వైఎస్సార్ తో పోల్చి చూడడం అనే సవాలు ఒకటుంది. వారసత్వ రాజకీయాల్లో ఇది తప్పదు. రాష్ట్రంలో వాడవాడలా అవినీతి జెడలు విప్పుకుని నాట్యం చేస్తోందంటూ రేపటినుంచే కథనాలు మొదలైనా ఆశ్చర్యం లేదు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటినుంచీ, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేస్తే 'అభివృద్ధి' ఆగిపోతుందనీ, అవినీతి పెరిగిపోతుందనీ కొందరు పౌరులు ఆవేదన చెందుతూ వచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఆగిపోయేంత అభివృద్ధి, పెరగడానికి అవకాశం ఉన్న స్థాయిలో అవినీతి రాష్ట్రంలో లేవనే భావించినట్టున్నారు. తొమ్మిదేళ్లపాటు అలుపెరగకుండా చేసిన కృషి, ఎదురుదెబ్బలు తట్టుకుని నిలబడ్డ ఓరిమి, మొండితనాలతో పాటు చంద్రబాబు చేసిన పొరపాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకోడానికి దోహదం చేశాయనడంలో సందేహం లేదు. పొరపాట్లకు ఫలితంగా తన రాజకీయ అనుభవం అంత వయసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే సభలో తాను ప్రతిపక్ష పోషించాలి. చంద్రబాబు అనుభవాల నుంచి జగన్ ఏమన్నా నేర్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.

29 కామెంట్‌లు:

  1. చాలా జాగ్రత్తగా రాశావు కానీ . బాబును ముంచింది కులపిచ్చి , దాన్ని పెంచి పోషించిన పచ్చ మూకలు, సీబీఎన్ చంద్రజ్యోతి, పచ్చ అనుకుల మీడియా, విచ్చలవిడి అవినీతి. జగన్ తొమ్మిదేళ్లు ధైర్యంగా ఒంటరి పోరాటం చేసి అద్భుత విజయం సాధించాడు. ఆంధ్ర ప్రజలు బాబు ను పచ్చకుల పిచ్చిని అసహ్యించుకున్నారు. సిగ్గులేకుండా ఈవిఎం ల మీద పడి ఏడ్చాడు. ప్రధానిని అనారాని మాటలన్నాడు. బాబు పాలనలో జరిగిన అరాచకం అంతా ఇంతా కాదు.

    రిప్లయితొలగించండి
  2. Maraka manchide Ane ad Laga TDP otami kuda chandrababu gariki manchidenemo. Otherwise Khali khajanaki CM ayyi AP ni develope cheyadam current situation lo chala kastame kada that too without central govt support. Leader movie lo Laga black money ni bayataku teeyadam lanti programs Petti Jagan khajana nimputharemo chudali.

    Anthekaka marpu teddam anna janasenani matalu kuda prajalaku ruchinchaledemo.. okka avakasam ichi unte bavundedi

    రిప్లయితొలగించండి
  3. అబ్దుల్ కలాం ని రాష్ట్రపతిని చేసింది నేనే అని చెప్పిన వ్యక్తి లక్ష్మీ సెహగల్ ఎవరో తెలియదని అన్నారా ? నమ్మశఖ్యంగా లేదు.
    చంద్రబాబుగారు ఎందుకు ఓడిపోయారో వ్రాసారు. జగన్ గారికి అంత భారీ మెజారిటీ ఎందుకొచ్చిందో అర్ధం కాలేదు. లాలూ మరియు జయలలిత గారిలా సంవత్సరం లోపే జైలుకి వెళితే పరిస్థితి ఏమిటీ ? భారీ మెజారిటీ చూసి న్యాయస్థానం నోరుమూసుకుంటుందా ?
    2 జీ కేసులో కాంగ్రెస్ పార్టీ కి అవినీతి లేదని తేలినా ఎందుకు ఓడిపోయారు ?
    వై ఎస్ వారసత్వం నచ్చి నారా వారసత్వం నచ్చకపోవడం కూడా అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  4. జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అవినీతి ఆరోపణలు ఋజువు కాలేదు.
    మనదేశంలో న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తుందో మీకు తెలియదా? ఆయన్ను అరెష్టు చేసి జైలులో పెట్టారంటే ప్రాథమికంగా ఆధారాలున్నాయని కోర్టులు విశ్వసించటం వల్లనే కదా?

    ఇదేళ్ళపాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే జవాబు దొరకదు.
    కేసులు నడిపించటం సిబీఐ చేయాలి - అది కేంద్రం చేతిలోని వ్యవస్థ కాని రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని వ్యవస్థ కాదని మీకు తెలియదా? బాబుకు ప్రత్యామ్నాయం చేతిలో ఉంచుకోవాలని కేంద్రం ఆ కేసుల్ని నాన్చుతూ పోయిందనీ మీకు తెలియదా?

    కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తైతే చాలామంది తెలుగుదేశం వారినే విస్మయపరచింది.
    ఈమాట నిజం.బాబు లాజిక్ సరైనదా తప్పా అన్నది వేరే విషయం. ప్రజలు మేధావుల్లాగా ఆలోచించరు. వారికి ఆంధ్రాను ముంచిన కాంగ్రెసును క్షమించే ఔదార్యం లేదు. వారు ఏదో హోదా అనేది బిచ్చం వేస్తాం అని బీరలు పలికినా సరే.

    రిప్లయితొలగించండి
  5. >>>చంద్రబాబు, ఇతర నాయకుల ప్రచారావేశం చూసిన ప్రజల్లో కొందరైనా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం అని భావించారు. తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది, కానీ, జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు.>>>

    మీరు వ్రాసింది ఎలా ఉందంటే అవినీతిని పారద్రోలేది ముఖ్యమంత్రి/ ప్రధానమంత్రి అని భావిస్తున్నట్లు ఉంది. లక్షల కుంభకోణాలు జరిగాయని ఆరోపింపబడ్డ కాంగ్రెస్ వాదులను గత 5 సం లలో జైలుకి పంపలేదెందుకని ? జగన్ ని 18 నెలలు జైలులో ఉంచినది ఎందుకని ?

    రిప్లయితొలగించండి
  6. నీహారిక గారూ, భయపడక్కర్లేదు జగన్. తన చెప్పుచేతల్లో ఉన్నన్నాళ్ళూ జగన్ మీద కేస్ల్ని సిబీఐ నాన్చుతో పోయేలాగు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే కేసీఆర్ కూడా జగన్ తన మాట వింటున్నన్నాళ్ళూ హైదరాబాదులో అతడిపైన ఉన్న కేసుల్ని నానబెడుతూనే ఉంటాడు. ఇద్దరకూ ఊడిగం చేస్తూ ఒక బానసరాజులాగా జగన్ ఆంధ్రాను దున్ని సొమ్ముచేసుకుంటూ ఉంటాడు - పెద్దలిద్దరకూ కప్పాలు కడుతూనే. మతిలేని ఆంధ్రావాళ్ళకు నోర్మూసుకొని అనుభవించటం తప్ప గతిలేదు. అదటుంచి మీరు ఒక వారసత్వం నచ్చి మరొకటి ఎందుకు నచ్చదూ అన్నారు - విశ్లేషకులు మేధావులు కదా, మనం వాళ్ళు గీకింది నమ్మాలని వారి ఉద్ద్దేశం. అంధేరాప్రదేశ్ గురించి ఎందుకు ఆలోచిస్తారింకా? మరొక ఐదేళ్ళ తరువాత అవసరం ఐతే(నే) అటు చూడండి!

    రిప్లయితొలగించండి
  7. >ఆంధ్రాను ముంచిన కాంగ్రెసును క్షమించే ఔదార్యం లేదు>>>

    బోడి ఔదార్యం ఎవడికి కావాలి ? వీళ్ళ సంగతి తెలిసే కేసీఆర్ తెలంగాణా నుండి తరిమికొట్టాడు.

    రిప్లయితొలగించండి
  8. నీహారిక గారూ, అంధ్రావాళ్ళను "కేసీఆర్ తెలంగాణా నుండి తరిమికొట్టాడు" అంటున్నారు కాని తెలంగాణాలో లక్షలాదిగా ఆంధ్రావాళ్ళున్నారే మరి! మీరు "బోడి ఔదార్యం ఎవడికి కావాలి" అన్న ఆ ఔదార్యం బాబుగారికి కావలసివచ్చి అది అందక ఓడిపోయాడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణాలో ఆంధ్రులు లక్షల్లో ఉన్నారు. ఎలక్షన్ కి 5 లక్షలమంది ఓటేయడానికి వెళ్ళారన్నారు. వీళ్ళంతా జగన్ కోసమే వెళ్ళారని తెలిసింది. ఒక అవినీతిపరుడిపై ఇంతటి ఔదార్యం చూపించినవాళ్ళు కాంగ్రెస్ పై ఎందుకు చూపించడం లేదు ?
      రాష్ట్రాన్ని విభజించకపోతే తెలంగాణావారు ఔదార్యం చూపరు,విభజిస్తే ఆంధ్రా వారు ఔదార్యం చూపించరు. వీళ్ళ ఔదార్యాలేవీ ఆ పార్టీకి అవసరం లేదు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రులకు అవసరమే కానీ ఔదార్యం లేదు. జగన్ ని గెలిపించడంలో ఆ అవసరం ఏమిటీ అన్నది నాకు అర్ధం కావడం లేదు.

      తొలగించండి
  9. థాంక్యూ మాజీ సీఎం సార్. బైబై నిప్పు బాబు. బైబై విగ్గుబాబు. బైబై పప్పు బాబు. బైబై భ్రమరావతి గ్రాఫిక్స్. బైబై లీకింగుల తాత్కాలిక భవనాలు. బైబై సింగపూరు కహానీలు. బైబై కవరు కప్పిన కియా కారు. బైబై తైతెక్కల డ్రామారావు భయోపిక్కులు. బైబై ఇసుక మాఫియా. బైబై బాక్సయిట్ భూతం. బైబై బిల్ గేట్స్ హగ్గుల సొల్లు పురాణం. బైబై పాలిచ్చే ఎద్దులు. బైబై లగడపాటి జరాపాగల్ సర్వేశ్వరం. బైబై కార్వీ బ్రోకర్ కుటుంబాలు. బైబై బాంకు దొంగ సుజనా. బైబై గరుడ పురాణం శవాజీ. బైబై డేటా దొంగ అశోకం. బైబై ఫోర్జరీ పెకాశం. బైబై కులగజ్జి ఎల్లో మీడియా.

    రిప్లయితొలగించండి
  10. నీహారిక గారు "తెలంగాణాలో ఉన్న ఆంధ్రులకు అవసరమే కానీ ఔదార్యం లేదు. జగన్ ని గెలిపించడంలో ఆ అవసరం ఏమిటీ అన్నది నాకు అర్ధం కావడం లేదు." అన్నారు. బహుశః కాంగ్రెస్ మీద ఉన్న అసయ్యం కారణంగా వారితో బాబు కలవటాన్ని జీర్ణించుకోలేక ప్రత్యామ్నాయంగా జగన్ గారికి వేయక తప్ప దనుకున్నారేమో ఆంధ్రులు. ఇది ఎంతవరకూ సరైన కారణమో చెప్పలేము. అందుకే ఒకరు "వీళ్ళు ప్రజలు వేసిన వోట్లతోనే గెలిచారంటారా " అని ఒకరు నన్ను అడిగారు ఈ రోజున.

    రిప్లయితొలగించండి
  11. so you think there is no corruption in TDP rule. Just ask any common man, how corrupted the goverment has become. Sand mining became golden duck. I am sure CBN can run the party in next 100 years with the money he earned in sand mining.

    రిప్లయితొలగించండి
  12. జగన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలేదో ఘోర తప్పిదం చేసినట్లుగా కొందరు హాహాకారాలు చేస్తున్నారు కానీ తాము అంతకు మునుపు చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం ఎదురు చూసి చావుదెబ్బ కొట్టారు అన్న కోణం వాళ్లకు తడుతున్నట్లుగా లేదు. చంద్రబాబును కోరి నెత్తిన పెట్టుకున్నవారే ఇప్పుడు కాళ్ళ క్రింద వేసి తొక్కారంటే - how could you see it otherwise - other than that he just earned it for himself!
    hundreds, thousands or lakhs, for that matter, of people can go wrong in their judgement - but crores of people can't go wrong in their judgement. we have to respect their verdict and wait for the outcome, with patience, since only the time can judge what is right and what is wrong. the people just followed the cycle with a wish that this time, this man, may do something better, where, they thought the other man failed. let's have some patience. may be this man could prove better, who knows?

    రిప్లయితొలగించండి
  13. >>>we have to respect their verdict and wait for the outcome, with patience, since only the time can judge what is right and what is wrong. >>>>

    కాంగ్రెస్ పార్టీని కూడా అలాగే ఎన్నుకున్నారు కదా ? సుధీర్ఘకాలం పరిపాలించినపుడు ఈ నీతి సూత్రాలు గుర్తుకురాలేదా ?

    రిప్లయితొలగించండి
  14. ఇసుక మాఫియా అని అంటున్నారు కానీ ఉచిత ఇసుక ఇవ్వడం కూడా ఒక తప్పిదమే అయింది. ఉచితంగా వచ్చింది కదా అని ఇళ్ళల్లో నిలువ చేసుకున్నారు. వాళ్ళే మళ్ళీ జగన్ కి ఓటేసారు. పసుపు కుంకుమ ఇచ్చినందుకు అప్పచెల్లెళ్ళు చేసిన అన్యాయం మాటల్లో చెపితే అర్ధం కాదు. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చేటపుడు రాష్ట్రం విడిపోతుంది అని ఊహించలేదు. కొత్తగా రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలి అన్నపుడు కొత్త పెళ్ళానికి సోకులు తక్కువయ్యాయా ?

    రిప్లయితొలగించండి
  15. ఇసుక మాఫియా గురించి తాసీల్దారు వనజాక్షి గారిని అడిగితే తెలుస్తుంది.

    పచ్చకామెర్ల పార్టీ 2014 ఎన్నికలలో తెలంగాణా & ఆంధ్ర కోసం రెండు వేర్వేరు మానిఫెస్టోలు ఇచ్చింది. రైతు & డ్వాక్రా రుణ మాఫీ హామీ రెంటిలోనూ ఉంది.

    రిప్లయితొలగించండి
  16. తెలంగాణా ఏర్పాటవకముందు నేను కెసిఆర్ వ్యతిరేకిని - ఆయన విభజనకి పాల్పడుతున్నాడని. అది ఎలా ఏర్పడినా ఆ తర్వాత ప్రతీదానికీ ఆయన ఆంధ్రావాళ్ల మూలానే అంటూ గొడవపెడతాడనీ అనుకున్నాను. కానీ ఇప్పుడు కెసిఆర్ పద్ధతి వేరు. ఆయన జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకుకూడా. నోటికొచ్చినట్టూ వాగడంలేదు. బాబు మొదట్లో వైఎస్సార్ వల్ల ఓడిపోవడానిక్కారణం రైతులని పట్టించుకోకపోవడమే అనేది అందరికీ తెల్సినదే. ఆయన ప్రపంచం హైద్రాబాద్, సైబరా బాద్ అంటూ తిరిగాడు. లాప్ టాపులూ విండోస్ వద్దని ఎవరూ అనడంలేదు కానీ రైతు ఆంద్థ్రకి వెన్నెముకలాంటివాడు. వాళ్ళే బాబుని దింపారు కిందకి. ఇప్పుడు మరోసారి జరిగినది చూస్తే బాబు, ఆయన పార్టీ ఏమీ నేర్చుకోలేదు.

    వీళ్లతో పోలిస్తే కెసీఆర్ ఒళ్ళు దగ్గిరపెట్టుకుని పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేను కెసిఆర్ ఫేన్ ని. లోకేష్ ని కెటిఆర్ తో పోల్చి చుస్తే అంధ్రా ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. ఎన్నికల నోటీస్ వచ్చినప్పట్నుండీ బాబు మోడీని అనరాని మాటలన్నాడు. ఇంత దరిద్రం బాష ఈయన కూడా మాట్లాడగలడా అనిపించింది. మోడీ తనకి చాతనైంది చేస్తున్నాడు. ఆంధ్రాని పూర్తిగా ముంచాడని ఎక్కడా దాఖలాలు లేవు. అయినా సెంటర్ నుంచి వచ్చే డబ్బులు కొసం అయినా నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియనంత జూనియర్ కాదు కదా బాబు? తెదెపా మట్టిలో కల్సిపోయినట్టే. ఇది స్వంత చేతుల్తో తవ్వుకున్న లోతైన గొయ్యి; ఈ వయసులో బయటకి వచ్చి మరోసారి నెగ్గడం దాదాపు అసంభవం. ఎన్ టీ ఆర్ ఆత్మకి శాంతి; ఆయన పోయేటప్పుడు 'జామాతా దశమగ్రహం' అన్నట్టు గుర్తు.

    రిప్లయితొలగించండి
  17. >>>ఎన్నికల నోటీస్ వచ్చినప్పట్నుండీ బాబు మోడీని అనరాని మాటలన్నాడు. ఇంత దరిద్రం బాష ఈయన కూడా మాట్లాడగలడా అనిపించింది.>>>

    మీకు హిందీ వచ్చుంటే మోడీ మాట్లాడే బాష అర్ధం అయి ఉండేది. మోడీ నక్కజిత్తులగురించి తెలుసుకుని అప్రమత్తమయిన మొదటి రాజకీయనాయకుడు అద్వానీ అయితే రెండవ వ్యక్తి చంద్రబాబు గారు.

    రిప్లయితొలగించండి
  18. >>> సెంటర్ నుంచి వచ్చే డబ్బులు కొసం అయినా నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియనంత జూనియర్ కాదు కదా బాబు?>>>
    ఆంధ్రోడివేనా ? కేంద్రం ఏమైనా బిచ్చం వేస్తుందా ? ఉమ్మడి ఆదాయాన్ని తేరగా తింటూ కూడా కేసీఆర్ కి తిక్కలేసి మోడీని ఎన్ని తిట్లు తిట్టాడో గుర్తులేదా ?

    రిప్లయితొలగించండి
  19. >>ఎన్ టీ ఆర్ ఆత్మకి శాంతి; ఆయన పోయేటప్పుడు 'జామాతా దశమగ్రహం' అన్నట్టు గుర్తు.>>

    లక్ష్మీ పార్వతిగారిని స్పీకర్ చేస్తారంటగదా ? ఎన్ టీ ఆర్ ఆత్మ మీ ఆత్మ శాంతిస్తాయా ?

    రిప్లయితొలగించండి
  20. నీహారిక
    మోడీ నక్కజిత్తులు వేసారో లేదో నాకు తెలియదు కానీ ఆయన సెంటర్ నుంచి డబ్బులిప్పించే సత్తా ఉన్నవాడు. అంటే మీ ఆఫీసులో బాస్ లాంటివాడు. అటువంటివాడు నక్కజిత్తులు వేసినా మీకు మరో ఉజ్జోగం వచ్చేవరకూ నోరుమూసుకోక తప్పదు కదా? కానీ బాబు ఏం చేసాడు? మేనేజర్ వాగుతుంటే నోరుమూసుకోవడం ఒకటీ, ఇష్టంలేకపోతే వేరే ఉజ్జోగం చూసుకోవడం ఒకటీ చేయాలి. అదే ఉజ్జోగంలో ఉండి నానామాటలు అంటే ఇప్పుడేమైందో చూసారుగా? తన బేస్ తానే నరుక్కునాడు బాబు. అయినా నాకు తెలియక అడుగుతున్నా(నిజంగానే తెలియక ఎందుకంటే నేను అంధ్రా వదిలి చాలాకాలం అయింది), బాబు ఆంధ్రా వేరుపడ్డాక చేసిన ఒక మంచిపని చెప్పండి - కనీసం ఓట్లు దండుకోవడానికి? పోలవరం అలాగే ఉంది, రైతులు అలాగే ఉన్నారు. గోదావరి నీళ్ళు అలాగే సముద్రంలో సల్సిపోతున్నై, కరెంట్ కష్టాలు ఇప్పటికీ తప్పట్లేదు. అమరావతి నిర్మాణం ఎప్పుడౌతుందే బాబుగారికే తెలియదు. కియా కార్లనీ కొత్త భవనాలనీ రకరకాల కబుర్లు. అసలు ఆంధ్రా వేరుపడినప్పట్నుండీ చూస్తే ఏమిటి బాబు చేసిన ముఖ్యమైన ప్రజాసేవ? ఎంతకాలం ప్రజలని గొర్రెల్లా మోసం చేస్తాడు? ఆయన అనుకున్న బుర్రలేని గొర్రెలు ప్రతీసారి ఊరుకోవని నిరూపించాయి కదా?

    రిప్లయితొలగించండి
  21. మోడీ నక్కజిత్తులు అంటూ ... కదా అంటూ వ్రాసిన అజ్ఞాత గారూ, తప్పులు పట్టటం చాలా సులువు కదూ? ఇప్పుడు మీరు నెత్తికెక్కించుకున్నట్లు కనిపిస్తున్న ఆ (కేడీ)జగన్ గారి రాజ్యంలో ఏమి ఒరుగుతుందో జనానికి అది కూడా చెప్పవలసింది కాస్త టైమ్ ఫ్రేమ్ వివరాలతో సహా. అది చెప్పలేరు. ఎందుకంటే ఏమీ జనానికి ఒరగదు కనుక!

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. లక్ష్మీ పార్వతి ఎన్నికలలో పోటీ కూడా చేయలేదు. ఎమ్యెల్యే కాకుండానే స్పీకర్ పదవి ఎలా ఇస్తారో నీహారిక గారే చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  24. >>బాబు ఆంధ్రా వేరుపడ్డాక చేసిన ఒక మంచిపని చెప్పండి - కనీసం ఓట్లు దండుకోవడానికి? >>

    రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించారు. ఈ ఒక్కపనికే నేను ఫిదా అయిపోయాను. ఆంధ్రా వాళ్ళు లాభం లేకుండా పిల్లికి కూడా బిచ్చం వేయరు. అటువంటిది 33 వేలంటే మాటలా ?

    ఒక్క ఎకరం నేలకోసం బీ జే పీ మరియు హిందూ సమాజం సుప్రీం కోర్టులో కొట్టుకుంటున్నారు.

    ఆడు మగాడ్రా బుజ్జీ !

    రిప్లయితొలగించండి
  25. అజ్ఞాతలు కాస్త ధైర్యంగా మీ అస్సలు పేరుతో నో లేక బ్లాగ్ పేరు తో కామెంటు చేయండి చూసి సంతోషిస్తాము

    రిప్లయితొలగించండి
  26. నిజమే, చంద్రబాబు చాలా పొరపాట్లు చేసారు. కాని ఆయనని ఓడించి ఆంద్రప్రదేశ్ ప్రజలు ఇంకా పెద్ద పొరపాటు చేసారు. తెలుగుదేశం నాయకులు అవినీతి చేసారని ఓడించారు. వైకాపా నాయకులు అవినీతి చేయరని గ్యారంటీ ఉందా? అసలే ఆకలి మీద ఉన్నారు.

    2004లో ఆంధ్ర ప్రజలు ఇంతకంటే పెద్ద తప్పు చేసారు. చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం పోటీ చేసినా, రాష్ట్రం విడిపోతుందని తెలిసీ కాంగ్రెసుని గెలిపించారు. ఆ తప్పుకి ఆంధ్ర జాతి భవిష్యత్తే నాశనం అయ్యింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2009 లో వై ఎస్ ఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రాను అనుకుని ఎన్నికలముందు సచివాలయం లో కొన్ని బ్లాకుల్లో దస్త్రాలు దగ్దం చేసేసారు. అనుకోకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చి పావురాలగుట్టలో మాయం అయిపోయారు.

      ఈసారి చంద్రబాబుగారికి అటువంటి అనుమానం ఏదీ రాలేదు, దస్త్రాలూ తగలబెట్టలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే ప్రతిదానిమీదా పసుపు పులమటమే !
      రేషన్ లో సరుకు దగ్గరనుండీ అన్న క్యాంటీన్ వరకూ అంతా పసుపు మయం చేసారు.
      ప్రభుత్వ పధకాలకు పార్టీ రంగు వాడడం జనాలకు నచ్చలేదు.
      పసుపు వల్ల కేసీఆర్ కూతురు కూడా ఓడిపోతుందని కేసీఆర్ కూడా ఊహించలేదు.

      తొలగించండి