హీరోగా తొలి సినిమా 'అందాల రాముడు' తోనే తనని తాను ప్రూవ్ చేసుకున్న హాస్య నటుడు సునీల్ కథానాయకుడిగా రూపొందిన రెండో సినిమా 'మర్యాద రామన్న.' భారీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడు. షూటింగ్ జరుగుతున్నంతసేపూ సినిమా రాజమౌళి పంధాలో ఉంటుందా లేక సునీల్ సినిమాలా ఉంటుందా? అన్న కుతూహలం వెంటాడింది నన్ను. చూశాక 'సునీల్ సినిమానే' అనిపించింది.
బుద్ధిమంతుడైన రాము (సునీల్) కథ ఇది. అతనో అనాధ. హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేస్తూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. ఉద్యోగం పోవడం, ఎక్కడో రాయలసీమలో పూర్వీకుల ఆస్తి కలసిరావడం ఒకేసారి జరుగుతాయి. ఆ ఆస్తి అమ్మేసి ఒక ఆటో కొనుక్కుని కొత్త జీవితం మొదలు పెట్టాలన్నది రాము ఆలోచన. మిత్రులు వారిస్తున్నా వినకుండా సీమ కి బయలుదేరతాడు. రైల్లో అపర్ణ (సలోని) పరిచయం అవుతుంది.
సరదా రైలు ప్రయాణం తర్వాత గమ్యం చేరుకున్న రాము ఊహించని విధంగా చిక్కుల్లో పడతాడు. తను అడుగుపెట్టింది సాక్షాత్తూ తనని చంపడం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తన శత్రువు రామినీడు (నూతన నటుడు నాగినీడు) ఇంట్లోనే అని తెలిశాక అతని అవస్థ వర్ణనాతీతం. పైగా తనకి రైల్లో పరిచయమైన అపర్ణ మరెవరో కాదు, రామినీడు ముద్దుల కూతురు. రాము తన ప్రాణాలనీ, అపర్ణనీ ఎలా దక్కించుకున్నాడన్నది మిగిలిన కథ.
కమెడియన్ హీరోగా సినిమా అనగానే అతని రూపురేఖలతోనో, ద్వందార్ధపు దైలాగులతోనో హాస్యం పుట్టించే ప్రయత్నాలు జరగడం సహజం. అలా కాకుండా కేవలం కథ నుంచీ, సన్నివేశాల నుంచీ క్లీన్ కామెడీ సృష్టించిన రాజమౌళి అభినందనీయుడు. కొంచం పెద్దదే అయినా మొదటి సగంలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆకట్టుకుంది. ట్రైన్ లో వచ్చే 'అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది..' పాట సరదాగా సాగింది, చిత్రీకరణ కూడా.
సినిమా మొదటి సగం తో పోల్చినప్పుడు రెండో సగం తేలిపోయినట్టుగా అనిపించింది. రెండో సగంలో బలమైన సన్నివేశాలు లోపించడం ఒక కారణం కాగా, హీరో కేవలం ప్రతి చర్యలకి మాత్రమే పరిమితం కావడం మరో కారణం. 'తెలుగమ్మాయి..' పాట చూస్తున్నంత సేపూ 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..' సినిమాలో 'అల్లంత దూరాన ఒక తారక..' పాట గుర్తొస్తూనే ఉంది. అలాగే ముగింపు సన్నివేశం చూడగానే 'అందాల రాముడు' ముగింపు గుర్తొచ్చేసింది.
నటన పరంగా మొదట చెప్పుకోవాల్సింది రాము గా సునీల్ గురించి, వెనువెంటనే చెప్పుకోవాల్సింది రామినీడు గా నటించిన నాగినీడు గురించి. బరువు తగ్గి నాజూగ్గా కనిపించిన సునీల్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించడం కావాలని చేసిందో లేక యాద్రుచ్చికమో అర్ధం కాలేదు. నటనతో పాటు డేన్సులూ బాగా చేశాడు. ముఖ్యంగా 'రాయే సలోని' పాటకి సునీల్ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. నాగినీడు మాట్లాడే రాయలసీమ యాసలో అక్కడక్కడా కృష్ణా జిల్లా యాస వినిపించడం కొరుకుడు పడలేదు. మరికొంచం శ్రద్ధ తీసుకోవాల్సింది.
హీరోయిన్ సలోని పర్లేదు. బ్రహ్మాజీకి మరోసారి 'త్యాగపూరితమైన' పాత్ర దొరికింది. ఈ తరం శరత్ బాబు అనాలేమో ఇతన్ని. రావు రమేష్ ని ఒక సీన్ కే పరిమితం చేశారు. కథ, మాటలు రాసిన ఎస్.ఎస్. కంచి ('అమృతం' ఫేం) ఒక హాస్య పాత్రని కూడా పోషించి మెప్పించాడు. కీరవాణి సంగీతం లో పాటలు బాగున్నాయి. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన ఈ సినిమాని కుటుంబ సభ్యులతో కలిసి నిర్భయంగా చూడొచ్చు.
>>>సునీల్ కొన్ని కొన్ని సన్నివేశాల్లో చిరంజీవిని అనుకరించడం కావాలని చేసిందో లేక యాద్రుచ్చికమో అర్ధం కాలేదు...
రిప్లయితొలగించండినాక్కూడా ఒక వాల్ పోస్టర్లో ఎక్స్‌ప్రెషన్ అలానే అనిపించిందండి..నాఒక్కడికే ఇలా అనిపించిందేమో అని అనుకున్నాను..చుట్టూ ఎవరూ ఇంత వరకూ ఇలా అనలేదు..
యాస గురించి మీరు చెప్పింది నిజమే. ఒక్కోపాత్ర ఒక్కో యాస మాట్లాడటం కూడా మింగుడు పడలేదు.
రిప్లయితొలగించండిపాటలంటారా? రెగ్యులర్ పాటలేమోగానీ background లో "కోట్లిస్తది కోళ్ళను కోసిస్తే మేళ్ళస్తది మేకను కోసిస్తస్తే..." అంటూ సాగుతుందే అది నాకు పిచ్చ పిచ్చ గా నచింది.
అవునుకదా... ఆ విలన్ action చాలా koool.
మొన్న ఈ సినిమా చూద్దామని వెళ్ళి అక్కడ డాన్‌శీను కి దొరికిపోయాం :(
రిప్లయితొలగించండినాకూ ట్రైన్ పాట బాగా నచ్చింది.మీ విశ్లేషణ బాగుంది.
రిప్లయితొలగించండిసునీల్ చిన్నప్పుడు చిరంజీవి డాన్స్ లు చూసి ప్రేరణ పొందినవాడే...అందాల రాముడు లో కూడా కొంచెం ఎత్తు పెరిగిన చిరంజీవి లా ఉంటాడు...డాన్స్ చేసే సమయం లో...
రిప్లయితొలగించండినాక్కూడా సినిమా బాగా నచ్చింది...పిచ్చి కామెడీ కాకుండా సందర్బోచితంగా చక్కగా సాగింది..ఇంటర్వల్ టైములో ఒక 10-15 సెకన్లపాటు ధియేటర్లో ఎవరూ కదలలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు ఎలా కట్టి పడేసిందో.
రిప్లయితొలగించండిఅవునండీ,ఈ సినిమా హాయిగా ఉంది కానీ ఎక్కడో లోపం వల్ల కాస్త తేలిపోయినట్లనిపించింది చివరకి వచ్చేసరికి.నా కయితే సినిమా Abrupt ఎండింగ్ వల్ల అలా అయ్యిందేమో అనిపించింది.
రిప్లయితొలగించండిఈ సినిమా Our Hospitality కి రీమేక్ అని విన్నాను. బాగుందని మీరన్నాక తప్పకుండా చూడాలి. సునీల్ డాన్స్ బాగా చేస్తాడు. ఫైటింగ్ చాలా ఉందా? అందాల రాముడు సినిమా నాకు బాగానే అనిపించింది.
రిప్లయితొలగించండిచాలామందికి తెలీని విషయం ఏమిటంటే సునీల్ డాన్స్ బేబీడాన్స్ ప్రారంభించిన మొదటి ధారావాహికలో పాల్గొన్నాడు. జాక్సన్ డేంజరస్ పాటకి డాన్స్ వేసిన వీడియో ఒకటి యూట్యూబ్లో ఉండేది.
రిప్లయితొలగించండిఅతనికి చిన్నప్పటినుంచి చిరంజీవి అంటే పిచ్చఅభిమానం. సినిమా చూడాలి.
బాగుందొ సోదరా సమీక్ష. ఏంటో సినిమాలన్నీ మిస్సౌతున్నాం......
రిప్లయితొలగించండినాకైతే ఈ చిత్రం చాలా బాగా నచ్చింది. పాటలు ఇంకా బాగా నచ్చాయి. ముఖ్యం గా, ఎన్నాళ్లకు పెద పండగ వచ్చే.. మరియు, పరుగులు తియ్.. ఈ రెండో పాట అయితే, బాలు గారు ఎంత బాగా పాడారో..
రిప్లయితొలగించండిసినిమా పెద్దగా బోర్ కొట్టలేదు కానీ సునీల్ ని మరీ క్లోజ్ అప్ లో చూడడం కొంచం కష్టం అనిపించింది. మేము లేట్ గ వెళ్ళడం వల్ల మొదటి వరస లో కూర్చుని సినిమా చూడవలిసి వచ్చింది.
రిప్లయితొలగించండినాకు BGM తెగ నచ్చింది .
"ఎన్నాళ్ళకు పెద పండగ వచ్చే" అదరగొట్టేసారు కీరవాణి.
నాకైతే ఈ సినిమా అంతా రాజమౌళి కీరవాణే కనిపించారు మురళి :-) సునిల్ చిరంజీవి కి పెద్ద అభిమాని సో అనుకరణ విషయంలో ఏం అనలేం, తన సొంత స్టైల్ డెవలప్ చేసుకోవడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలేమో అతనికి.
రిప్లయితొలగించండిమీరంతా ఇంత చక్కగా రివ్యూలు రాస్తే చదవటం తప్ప ఇంకా సినిమా చూసే అవకాశం రాలేదు :( త్వరలోనే చూడాలండీ :)
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: మిత్రులు చెబుతున్నారు కదండీ.. చిరంజీవి మీద సునీల్ కి ఉన్న అభిమానం కారణంగా అలా జరిగి ఉండొచ్చని.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఇండియన్ మినర్వా: నిజమేనండీ.. ఆ నేపధ్య గీతం చాలా బాగుంది.. ధన్యవాదాలు.
@మేధ: పోనీ ఆ సినిమా ఎలా ఉందొ టపా రాసి ఉండాల్సిందండీ.. ధన్యవాదాలు.
@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@dnc: "కొంచం ఎత్తు పెరిగిన చిరంజీవిలా.." మంచి పరిశీలన అండీ.. ధన్యవాదాలు.
@ప్రశాంత్: అవునండీ.. నేను చూసిన థియేటర్ లో కూడా అంతే.. ధన్యవాదాలు.
@రిషి: రెండో సగం మీద మరి కొంచం శ్రద్ధ తీసుకుని ఉంటే మరింత బాగుండేదండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: ఫైటింగ్ తక్కువేనండీ.. హాయిగా చూసేయొచ్చు.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: డాన్స్ బేబి డాన్స్.. కొత్త విషయం అండీ.. ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: ఓవర్సీస్ రిలీజ్ కూడా ఉన్నట్టుందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మనసు పలికే: నిజమేనండీ.. పాటలు బాగున్నాయ్.. ధన్యవాదాలు.
@వాసు: అయితే బిగినింగ్ మిస్సయ్యారన్న మాట.. హీరో ఇంట్రో బాగుందండీ.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: టైం ఇద్దామంటారా.. సరే అయితే :-) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పరిమళం: చూడండి.. ఎంజాయ్ చేస్తారు మీరు కూడా.. ధన్యవాదాలు.
నాకు నచ్చిదండి ఈ సినిమా. సింపుల్ ఎంటర్టైన్మెంట్. పెద్ద గా ఆశించకుండా వెళ్ళేము కదా బాగున్నట్లు అనిపించింది, ఏదో ఎక్స్పెక్ట్ చేసి మగధీర కు వెళితే నిరాశ పడ్డాము.
రిప్లయితొలగించండి@భావన: రాజమౌళి అంటే కేవలం భారీ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరు పోగొట్టే సినిమా అండీ.. ధన్యవాదాలు...
రిప్లయితొలగించండి