సందేశాత్మకంగా సాగే కళా, సాహితీ ప్రక్రియ ఏదైనా సరే అది 'షుగర్ కోటెడ్ పిల్' లా ఉంటే ఇవ్వదల్చుకున్న సందేశం చేరాల్సిన వాళ్లకి సూటిగా చేరుతుంది. మందు గుళిక, పంచదార పూత వేటికవే విడివిడిగా ఉంటే...??? కొంత విరామం తర్వాత కళా తపస్వి కే. విశ్వనాధ్ తెర వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతల నిర్వహణతో పాటు, తెరపై ఓ ప్రత్యేక పాత్రలో నటించిన 'శుభప్రదం' సినిమా చూడడం పూర్తి చేసి థియేటర్ నుంచి బయటకి వస్తుండగా నాకు కలిగిన సందేహం "ఔషధం మోతాదులో తేడా ఎక్కడ వచ్చింది?" అని.
ఎనభై ఏళ్ళ వయసులో వయసులో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, మొక్కవోని దీక్షతో పని చేసి ఒక ఆహ్లాదకరమైన సినిమాని అందించిన విశ్వనాధుడికి ముందుగా అభినందనలు. ఆయన గత చిత్రం 'స్వరాభిషేకం' మిగిల్చిన తీవ్ర నిరాశ నుంచి నేనింకా బయట పడక పోవడం వల్ల ఈ 'శుభప్రదం' మీద పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే మొదటి సగంలో కథ నడిచిన తీరు, ఎంతగానో ఆకట్టుకున్న సంగీతం (పాటల్ని మొదటి సారి విన్నది థియేటర్ లోనే) రెండో సగం మీద ఆశలు పెంచేశాయి.
చంద్రమోహన్, సులక్షణ నాయికా నాయకులుగా విశ్వనాధ్ రూపొందించిన 'శుభోదయం' సినిమా కథతో రేఖామాత్రంగా పోలికలున్న ఈ సినిమాలో కథలు రెండు. ఓ కథలో నాయకుడు చక్రి (అల్లరి నరేష్), ఓ అనాధ. అందరినీ మాటలతో బురిడీ కొట్టించి పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఈ చక్రి ఓ సారి కేరళ వెళ్ళడం, అక్కడ స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి ఇందుమతి (మంజరి ఫడ్నిస్) ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మొదటి కథ. అక్కడక్కడా కామెడీ కాస్త విసిగించినా, ఈ కథతో, ఆకట్టుకునే పాటలతో మొదటి సగం సరదా సరదాగా గడిచిపోయింది.
మామూలు ట్విస్ట్ తో విశ్రాంతి ఇచ్చిన విశ్వనాధ్ రెండో సగానికి ఎంచుకున్న కథ, కథని నడిపిన తీరు ఆశ్చర్యానికి గురి చేశాయి. "మొదటి సగం తీసింది ఈయనేనా?" అన్న సందేహం కూడా కలిగింది అప్పుడప్పుడూ. కథ మొదటి సగం కేరళ లోనూ, రెండో సగం గోదారి ఒడ్డునా సాగింది. లొకేషన్లతో పాటు, హీరోయిన్ మంజరి ఫడ్నిస్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. నాకైతే 'సాగర సంగమం' జయప్రద చాలా సార్లు గుర్తొచ్చింది, చక్రిగా నటించిన అల్లరి నరేష్ కి ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి.
మొదటిసగంలో అక్కడక్కడా మాత్రమే కనిపించిన నాటకీయత రెండో సగానికి వచ్చేసరికి అంతా తనే అయ్యింది. ప్రత్యేక పాత్రలో నటించిన విశ్వనాధ్ తెర మీద కనిపించేవరకూ సినిమా లో చర్చించదలచిన ముఖ్యమైన విషయం ఏమిటన్నది తెలియక పోవడం స్క్రీన్ ప్లే లోపమనే చెప్పాలి. ప్రధమార్ధం కన్నా ద్వితీయార్ధం నిడివి కొంచం ఎక్కువగా ఉండడం వల్ల కూడా సినిమాని సాగదీశారన్న భావన కలిగించింది. స్క్రీన్ ప్లే మీద మరికొంచం దృష్టి పెట్టి, నాటకీయతని తగ్గించి ఉంటే వందశాతం విశ్వనాధ్ మార్కు సినిమా అయి ఉండేది ఈ 'శుభప్రదం.'
aవిశ్వనాధ్ తెర వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతల నిర్వహణతో పాటు,తెరపై ఓ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ 'శుభప్రదం' స్క్రీన్ ప్లే మీద మరికొంచం దృష్టి పెట్టి,నాటకీయతని తగ్గించి ఉంటే వందశాతం విశ్వనాధ్ మార్కు సినిమా అయి ఉండేది.
రిప్లయితొలగించండి"ఔషధం మోతాదులో తేడా ఎక్కడ వచ్చింది?"
తల్లి కి పిల్లలెంతమంది ఉన్నా అందరికీ ప్రేమ సమంగానే
పంచుతుంది.అది సహజం,ఎవరూ కాదనలేని సత్యం కూడా.మరి అదే తల్లి వృద్ధాప్యం వచ్చేసరికి కొంత ధారణ శక్తి,మరికొంత మతిమరుపు రావడం సహజం కదా. అప్పుడు పిల్లల్ని గుర్తు పట్టలేకపోడం,ఒకళ్ళనుకుని ఇంకొకళ్ళని పలకరించండం ఇవన్నీ సహజ పరిణామాలు. దాన్ని మనం ఆయా పిల్లలమీద ప్రేమలేదనుకుంటామా లేక వయసు ప్రభావమనుకుంటామా?
ఇంత వయసులో ఆ మహానుభావుడు ఇంకా అన్ని బాధ్యతల్ని నెత్తిన వేసుకోడమే పెద్ద విశేషం.పైన చెప్పిన తల్లి విషయం లో లాగ అంతకంటే ఎక్కువ ఆశించడం... వ్యాఖ్య అసందర్భంగా అనిపిస్తోందా?
పాటల గురించి చెప్పనే లేదు? బాగుంది ఐతే ఒకసారన్నా చూడవలసిన సినిమా అన్నమాట.
రిప్లయితొలగించండిమంజరి పడ్నిస్ వి పేపర్లో స్టిల్స్ చుస్తే బాగుంది అనిపించింది. సినిమా గురించి చాలా బాగుందండి మీ విశ్లేషణ .
రిప్లయితొలగించండినేను సినిమా ట్రైలర్స్, కొన్ని పాటలు చూసాక విశ్వనాధ్ గారి మీద అభిమానంతో ఈ సినిమా చూడకూడదని నిర్ణయించుకున్నాను. విశ్వనాధ్ గారు ఇక సినిమాలు తియ్యకపోతేనే మంచిదేమో అనిపిస్తుంది నాకు. పాటలు కూడా స్వరాభిషేకం అంత బావోలేదు. "ఓరిమి చాలమ్మా" పాట, చిత్రీకరణ అయితే టీవీ సీరియల్ పాట లా ఉన్నాయి.
రిప్లయితొలగించండి"శుభప్రద"మైన టపాతో పునరాగమనం చేసినందుకు అభినందనలు.
రిప్లయితొలగించండిఇకనుంచి తరచుగా వ్రాస్తారని ఆశిస్తున్నాను.
ఈ సినిమా ఇంకా బెంగుళూరు రాలేదు. వచ్చాకా చూడాలి.
విశ్వనాథ్ సినిమా ఎలా ఉన్నా నాకు ఇష్టమే.
"స్వరాభిషేకం" కూడా అక్కడక్కడ బోరు కొట్టినా కొన్ని సన్నివేశాలకోసమైనా చూడవచ్చు.
ఫ్లాపయిన "జననీ జన్మభూమి" కూడా నాకు నచ్చింది.
ఒక్క "చిన్నబ్బాయి" మాత్రమే కొంచెం ఎక్కువ బోరుకొట్టింది.
ఇప్పటి తరానికి ఆయన సినిమాలు నచ్చకపోవచ్చు.
చాలా చక్కగా ఉంది మీ విశ్లేషణ...ఒకసారి చూడొచ్చన్నమాట...
రిప్లయితొలగించండిఇంతకూ మీరు బ్లాగుకి ఇలా రివ్యూలు రాయాల్సివచ్చినప్పుడే కనిపిస్తారా? మీరు బ్లాగుల్లో తరచూ రాయకపోవటం మీద నాకెందుకో ఒక అనుమానం ..అదేంటంటే మీరు ఏదో సినిమా ఆఫర్లో బిజీగా ఉన్నట్టు...అది పూర్తయ్యాక ఇదిగోండి ఫలానా సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవటం వల్ల బ్లాగు రెగ్యులర్ గా రాయలేకపోయాను..అని అంటారేమోనని...:-)
చెప్పాల్సినవన్నీ చెప్పేసారు.
రిప్లయితొలగించండికాకపోతే, సినిమా పట్ల, విశ్వనాథుని పట్లా మీరు కొంత సానుభూతితో రాసారని అనిపించింది సార్. అయితే మీరు పెద్దగా ఆశల్లేకుండా వెళ్ళారు. నేను కొంత ఆశ పెట్టుకున్నాను. :) బహుశా, తేడా అక్కడున్నట్టుంది.
నిజమండి ఈ సినిమా నన్ను చాలా నిరాశపరిచింది..అందులోనూ చాలారోజుల తరువాత ధియేటర్కి వెళ్లి అది కూడా రిలీజయిన రెండో రోజే మా అమ్మాయి వద్దంటున్నా చూసి నిరాశపడ్డ సినిమా. మీకు మొదటి సగం బాగుందా! నాకయితే రెండో సగమే నయం అనిపించింది. నరేష్‍ని విశ్వనాథ్ గారు ఓ విభిన్న కోణంలో చూపిస్తారేమో అనుకున్నా కాని నరేష్ వచ్చినప్పుడల్లా విశ్వనాథ్ గారు తెరమరుగయిపోయారు..నరేష్‍కి మరీ నాటకీయమయిన డయిలాగులు...విశ్వనాథ్ సినిమానేనా ఇది అనిపించింది. అసలు నరేష్ పాత్రే అనవసరం ఈ సినిమాలో. పాటలు మాత్రం బాగున్నాయి..ఫోటోగ్రఫీ బాగుంది. హీరోయిన్ బాగుంది..బాగా చేసింది..అదొక్కటే తృప్తి మిగిలింది ఈ సినిమా చూసాక!
రిప్లయితొలగించండిసినిమా కూడా అసంపూర్తిగా ముగిసినట్లనిపించింది. అసలు ఇందు.. సింధు అచ్చు గుద్దినట్లు ఒకలాగా ఉండటానికి ఏ ప్లాష్ బాకో ఉంటుందనుకున్నా:)
నెమలి కన్ను లాగే మీ కథలు కబుర్లు కూడా చాలా బావున్నాయి. నేను మీ బ్లాగ్ ౩ రోజుల కింద చదవడం మొదలెట్టాను,జ్ఞాపకాలు చదివాను.
రిప్లయితొలగించండిమాది కూడా గోదావరి తీర ప్రాంతమే.......కానీ తెలంగాణాలో........అన్ని తప్పకుండా చదువుతాను
సినిమా రిలీజ్ రోజే పరుగెత్తుకు వెళ్లానండీ .....నాకైతే నిరాశే కలిగింది :(
రిప్లయితొలగించండి"నాటకీయతని తగ్గించి ఉంటే" బావుండేది :(
ఇవాళే శుభప్రదం చూశాను. శుభోదయం గుర్తుకొచ్చింది. హీరోయిన్ బాగుంది. జయప్రద గుర్తుకురాలేదు కాని ఇప్పుడొచ్చే హీరోయిన్లతో పోలిస్తేమాత్రం బాగుంది. ముఖ్యంగా ’వరుడు’ సినిమా చూసిన తరువాత, ఈ హీరోయిన్ చాలా బాగుంది. బహుశ: విశ్వనాథ్ గారి ప్రభావమేమో. శంకరాభరణం లాంటి సినిమాలు చిన్నప్పుడు చూశామనుకోవాలి. ఇప్పుడింకా అలాంటివే ఆశించకూడదేమో:) సంగీతం చాలా బాగుంది. విశ్వనాథ్ గారి సినిమాల్లోని నది ఒడ్డున చూపించే ఒకే ఒక ఇల్లు కూడా నన్నెప్పుడూ ఆకట్టుకుంటుంది. నా కలాంటి ఇంట్లో ఉండాలన్నది చిరకాల వాంచ్ఛ:)
రిప్లయితొలగించండి@శ్రీనివాస్ పప్పు: "ఎనభై ఏళ్ళ వయసులో వయసులో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, మొక్కవోని దీక్షతో పని చేసి ఒక ఆహ్లాదకరమైన సినిమాని అందించిన విశ్వనాధుడికి ముందుగా అభినందనలు." ...మీరిది స్కిప్ చేసినట్టు ఉన్నారండీ... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భావన: కొన్ని పాటలు చాలా బాగున్నాయండి.. నాకైతే 'మౌనమే చెబుతోంది..' బాగా నచ్చింది. ధన్యవాదాలు.
@రాధిక (నాని): ధన్యవాదాలండి..
@వాసు: మొదటి సగంలో పాటలు బాగున్నాయండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బోనగిరి: 'చిన్నబ్బాయి' ని నేను పూర్తిగా చూడలేక పోయానండి.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: మీరు మరీ ఫ్యాక్షన్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లెవెల్లో ఊహించుకుంటున్నారండీ, అంత దృశ్యం లేదిక్కడ :-) ..ధన్యవాదాలు.
@చదువరి: సరిగ్గా పట్టుకున్నారు, ఏమాత్రం ఆశలు లేకుండా వెళ్ళడం వల్ల నాకు 'పర్లేదు' అనిపించిందండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సిరిసిరి మువ్వ: నేనూ ఇందూ-సింధూ కావాలా పిల్లలై ఉంటారనీ అలా అలా ఊహిస్తూనే ఉన్నానండీ సినిమా అయ్యేవరకూ :-) :-) ..ధన్యవాదాలు.
@ప్రియ: ధన్యవాదాలండీ..
@పరిమళం: నిజమేనండీ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: మీ చిరకాల వాంఛ త్వరలోనే తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
ముందుగా మీ సహనానికి ఎన్నో వీరతాళ్ళు,
రిప్లయితొలగించండి(నాక్కూడా),,(అ)శుభప్రదం,సినిమా చండాలం గా ఉంది
౧,హాస్యం కోసం పిచ్చి పిచ్చి,బట్టతలల ప్రయోగాలు
౨,కేదార్,బద్రీనాథ్,ల లో కనిపించే డోలీ,లను ఆంద్ర్హా
పట్టుకు రావటమూ, ఆపాత్రలో మన బక్క నరేశ్,వక్కర్ని
కూడా మోయలేక పోవటం,
౩,పేద్ధ కోటీశ్వరుడికి atm కార్డు సెల్లు,,ఇలాంటివి లేకపోవటం,
హబ్బో ఇలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
విశ్వనాథ్,రాఘవేంద్రరావు,దాసరి,మణిరత్నం,ఇలాంటి
పెద్దాళ్లు,విశ్రాంతి తీసుకొని యువతరాన్ని ప్రొత్సహిస్తే బాగుంటుంది కదా ?
ఎంతోమంది యువకులు అవకాశాలు రాక అల్లాడుతుంటే
వీళ్ళు (ముసలాళ్ళు)సమయం డబ్బు వేస్ట్ చేస్తున్నారు.
మౌనమే, నీ నవ్వే పాటలు నాకు చాలా నచ్చాయి. మిగతావి కూడా బాగున్నాయి. నా బ్లాగులో ఒక పోస్టు కూడా రాసానండీ ఈ పాటల గురించి.
రిప్లయితొలగించండిసినిమా ఓ మాదిరిగా ఉందన్నమాట అయితే!
@వేద పండితః: నిజమేనండీ.. లాజిక్ ని పక్కన పెట్టాలని యెంత ప్రయత్నించినా నావల్ల కాలేదు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మధురవాణి: అంతేనండీ.. ధన్యవాదాలు.
ee blog chaduvuthunte naku vishvanath gari shankarabaranam chudalani pisthundi
రిప్లయితొలగించండిshankarabharanam chudalani vundi naku
రిప్లయితొలగించండి