శుక్రవారం, జులై 16, 2010

విరామం తర్వాత...

అస్సలు అనుకోలేదు, నేను ఎంతగానో ఆస్వాదిస్తున్న బ్లాగింగుకి ఇన్నాళ్ళు విరామం ఇవ్వాల్సి వస్తుందని. అతి కొద్ది రోజులు మాత్రమే అనుకున్నది అలా అలా పెరిగి పెద్దై ఇన్నాళ్ళకి చేరింది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలలో ఆకస్మికంగా వచ్చిన మార్పులు నన్ను బ్లాగులకి దూరంగా ఉండాల్సి వచ్చేలా చేశాయి. రాయడానికే కాదు, బ్లాగులు చదవడానికీ తీరిక లేని పరిస్థితి. ఇన్నాళ్ళ తర్వాత ఒక్కసారి బ్లాగులు ఓపెన్ చేయగానే "కొండలా కోర్సు ఉంది.. " పాట గుర్తొచ్చేసింది, అప్రయత్నంగా.

నా క్షేమాన్ని తెలుపమంటూ మిత్రులు రాసిన వ్యాఖ్యలు, ఉత్తరాలు చూడగానే యెంత సంతోషం కలిగిందో చెప్పలేను. అదే సమయంలో విరామాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పలేక పోయినందుకు నామీద నాకే కోపం వచ్చింది. నిజానికి ఇంత గ్యాప్ వస్తుందని నేనూ ఊహించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నా టపాలకి వ్యాఖ్యలు రాసిన మిత్రులకి జవాబులు ఇవ్వాలి, ఇన్నాళ్ళూ పెండింగ్ పెట్టిన టపాలన్నీ చదవాలి.. అమ్మో.. చాలా పని ఉందిప్పుడు. ఇంతకీ నేను చెప్పాలని అనుకున్నది ఏమిటంటే ... నేను వచ్చేశాను.

19 వ్యాఖ్యలు:

సవ్వడి చెప్పారు...

Welcome Murali garu!

Sravya Vattikuti చెప్పారు...

Welcome back !

కొత్త పాళీ చెప్పారు...

నో ప్రాబ్లం. మీరు క్షేమంగా ఉన్నారంటే అంతే చాలు. క్షమించేశాం.
పోతే, మిగతా వాళ్ళ టపాలు ఎక్కడికీ పోవు, అలాగే ఉంటై, తరవాత చదువుకోవచ్చు. ముందు మీర్రాసెయ్యండి.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

చాలా రోజుల తర్వాత కలిసాం.ఎలా ఉన్నారు అంతక్షేమమే కదా?

భావన చెప్పారు...

హమ్మయ్య. రోజుకోసారైనా మీ గురించి తలచుకున్నా నేనైతే ఏమయ్యారో అని. మీ పోస్ట్ లేని బ్లాగ్ లోకం బోసి పొయ్యింది. Welcome Back. బ్లాగ్ జీవన స్రవంతి లోకి ఆహ్వానం. :-). పునరాగమన శుభాకాంక్షలు.

స్ఫురిత చెప్పారు...

Welcome back sir...

'Padmarpita' చెప్పారు...

నిజం చెప్పాలంటే అలిగాను చెప్పకుండా ఏమైపోయారో అని!!!
వచ్చేసారుగా తీరికగా అయినా పోట్లాడుకుందాంలెండి..వెల్ కం:)

Rishi చెప్పారు...

ఛా ఏంటండీ ఇలా డిసప్పాయింటు చేసారు?...ఏదో టపా రాసారు అనుకున్నాను అత్యాశకు పోయి.టపా రాయండి ముందు,వ్యాఖ్యలకి సమాధానాలు,టపాలు చదవటం తరువాత.

kavitha చెప్పారు...

I feel honoured , i wish I am the first one to comment and to get this WOW feeling to see you back here,,,,do post soon ...

Though I read every thing of what you write, I seldom comment...

WELCOME BACK!!!!

మాలా కుమార్ చెప్పారు...

ఏమైంద అని , ఎవరిని అడగాలా అని ఎప్పుడూ అనుకుంటూ వున్నాను . వచ్చేసారుకదా . పునరాగమనానికి స్వాగతం , సంతోషం .

రాధిక(నాని ) చెప్పారు...

స్వాగతం

అజ్ఞాత చెప్పారు...

హలో ..,మురళీ గారు వచ్చేసారా!
అంతా కుశలేమేకదా .

Ramakrishna Reddy Kotla చెప్పారు...

పునఃస్వాగతం :)

sunita చెప్పారు...

Welcome back!

హరే కృష్ణ చెప్పారు...

welcome back murali garu

పరిమళం చెప్పారు...

హమ్మయ్య !వచ్చేశారుగా ...ఇక టపాల వెల్లువేనన్నమాట :)

జయ చెప్పారు...

Hearty Welcome to you Murali gaaru.

శిశిర చెప్పారు...

Welcome back Murali garu.

మురళి చెప్పారు...

స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి