Thursday, January 28, 2010
నా రెండో కథ...
నా మొదటి కథ 'బెల్లం టీ' కి మీ నుంచి వచ్చిన స్పందన నన్ను మరో కథ రాసేలా ప్రోత్సహించింది.. ఫలితమే 'ఉత్పరివర్తనం.' "బాల్య జ్ఞాపకాలతో ఏమాత్రం సంబంధం లేని ఇతివృత్తం తీసుకుని కథ రాయమని" నాకు పరిక్ష పెట్టిన బ్లాగ్మిత్రులు, 'మానసవీణ' బ్లాగరి నిషిగంధ గారికి, కథను ప్రచురించిన 'పొద్దు' వారికీ కృతజ్ఞతలు. నేను పరిక్ష రాసేశాను.. నిర్మొహమాటంగా ఫలితం చెప్పాల్సింది మీరే..


32 వ్యాఖ్యలు:
ఉత్పరివర్తనం అన్న ఒక పదాన్ని మనుష్యులకు అన్వయించి బాగా రాసారు. కథ.
అభినందనలు. - శ్రీకర్
Chala Practical ga vundi..chala bavundi..
అతి సహజమైన మానవ నైజాన్ని చాలా బాగా ఆవిష్కరించారు.
అభినందనలు మురళి గారు !కధ చదువుతున్నంత సేపూ "ఉత్పరివర్తన" చెందుతూనే ఉన్నాను కధను నాలుగు భాగాలు చేస్తే ప్రతిభాగం లోనూ వేరే కోణం.... అంటే నేననుకున్నట్టు కాకుండా కధ నడిచింది మీరు చెప్పదలుచుకొన్నది , టైటిల్ అర్ధం ...అంతా చివరికి గాని తెలియలేదు . బావుందండీ ...మురళిగారు , మీ మూడోకధకోసం ఎదురుచూస్తామిక !
* అన్నట్టు నా కవిత ??? :) :)
హుమన్ నేచర్ చక్కగా విశ్లేషించారు. మీ రెండవ కధ బాగుంది. అభినందనలు.
కథ చాలా బాగుందండీ....
Passed with distinction :-)
నాదీ నిషిగంధ గారి మాటే...మీరు డిస్టింక్షన్ లో పాసయ్యారు. ఇహ మీరు పై చదువులకి (మరిన్ని రచనలకి) శ్రీకారం చుట్టడమే ఆలస్యం :)
చాలా బాగుందండి. పాత్రల చిత్రణ బాగుంది.
మీ మొదటి కధ కూడా ఈ రోజే చదివాను. అద్భుతంగా ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. కధలో పూర్తిగా లీనమైపోయాను. కధలో images అన్నీ ఇప్పటికీ మనసులో అలానే ఉండిపోయాయి.చాలా భారమైన ముగింపు - కంటతడిపెట్టించింది.
baagundi.
మొదటి కథ కన్నా రెండోది చాలా బాగుంది. విభిన్న కథాంశం, సరళమైన కథనం. నిజానికి మీరు దీన్ని వెబ్ పత్రికల్లో కాకుండా ఏ ఈనాడుకో, ఆంధ్రజ్యోతికో పంపి ఉండాల్సింది. ఎక్కువ మంది చదివే అవకాశం ఉండేది. ఆదివారం అనుబంధాల రొడ్డకొట్టుడు కథలు మారాలంటే ఇలాంటి కథలు అచ్చేయటం అత్యవసరం.
ముఖ్యంగా, క్లైమాక్స్ చాలా చాలా బాగుంది. 'ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు' అని మొదట్లోనే చెప్పించి చివర్లో మధు పాత్రతో అలా ప్రవర్తింపజేయటం కూడా బాగుంది. 'సబ్బు' ప్రశ్నకి 'కాదు' అని చెప్పకుండానే చెప్పటం ఇంకా బాగుంది.
ఇన్ని సార్లు 'బాగుంది' అని నేను మరే కథకీ రాయలేదేమో! Keep it up. Expecting more such stories from you.
కధ చదువుతున్న కాసేపు నేను ఎక్కడ వున్నానో మర్చి పోయి అలా మధు ఎదురు గా అదృశ్య రూపం లో నుంచుని చూస్తున్నట్లు వుంది. అధ్బుతం మురళి గారు. నాకు తెగ నచ్చేసింది, వో పెద్ద పెద్ద గా విశ్లేషించకుండా వుత్పరివర్తనం పూర్తి గా అర్ధం అయ్యింది. మీరు కధ లు చాలా బాగా రాయగలరు. నా వోటు పడి పోయింది మీకు.
ఇక్కడ వ్యాఖలు చూశాకా మళ్ళీ చదివాను కథని.
నాకు మాత్రం మొదటి కథే బాగా నచ్చింది రెండవ దాని కంటే. కాకపోతే రెండవది రాయడం చాలా కష్టమని అనిపించింది.
నేను సరిగ్గా ఫాలో అవ్వలేదో ఏమో మరి - ఉత్పరివర్తనం ఎవరిలో అన్నది నాకింకా స్పష్టంగా తెలియట్లేదు. ఒక వేళ మధు లో ఐతే అతని లో సడన్ గా వచ్చిన మార్పు ఏంటి ? కలెక్టర్ అవ్వడమా ? ఒక వేళ మిగతా వారిలో ఐతే “జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుతాయా" అన్న దాంట్లో అర్థం ఏంటి ? అది ముగింపు గా ఎలా కుదురుతుంది.
ఏమో నాకు కథే సరిగ్గా అర్థం కాలేదా అని అనుమానం వస్తోంది ఇప్పుడు.
ఎందుకో బెల్లం టీ అంత రుచిగా అనిపించలేదు నాకయితే,లేకపోతే మీ బాల్యజ్ఞాపకాలకి అలావాటుపడిపోయిందో నా బుర్ర(ఇలా రాయడానికే ఇంత టైం తీసుకోవాల్సొచ్చింది).ఇంత మంది వ్యాఖ్యలు చూసాక మళ్ళీ మరొక్క సారి చదవాలేమో(ప్రత్యేకించి అబ్రకదబ్ర గారి కామెంటుకోసమయినా)లేక నాలో ఏమయినా ఉత్పరివర్తన వచ్చిందేమో చూడాలి.
@Vasu:
>> "ఒక వేళ మధు లో ఐతే అతని లో సడన్ గా వచ్చిన మార్పు ఏంటి ? కలెక్టర్ అవ్వడమా"
కాదండీ. కలెక్టర్ అవబోతున్నాడన్న సంగతి తెలీగానే అతనిలో అమాంతం పెరిగిపోయిన ధీమా, తలెత్తిన పొగరు. అప్పటిదాకా దిగాలుగా భుజాలు కుదేసుకుని ఉన్నవాడల్లా ఒక్క వార్త వినగానే నిటారుగా ఐపోవటం. మొత్తమ్మీద అతని స్వభావంలో వచ్చిన కొట్టొచ్చే తేడా. అదీ అతని విషయంలో 'ఉత్పరివర్తనం'
>> " "జాతులు అంతరించిపోతున్నప్పుడు మాత్రమే ఉత్పరివర్తనాలు జరుగుతాయా" అన్న దాంట్లో అర్థం ఏంటి ? అది ముగింపు గా ఎలా కుదురుతుంది"
అది అతను చెప్పిన సైన్సు పాఠానికి సంబంధించిన ప్రశ్న. సమాధానం అతని ప్రవర్తనలో ఉంది - 'కాదు' అని. తన హోదా పెరగనుందని తెలిసిన క్షణాన అతనిలో వచ్చిన ఆకస్మిక మార్పది. చక్కని ముగింపే. కాదా?
నాకిది నచ్చటానిక్కారణం మేరీ సువార్తతో మధుకి ప్రేమ కథ నడిపించకపోవటం, సైన్సు సంగతులు (కొంచెం ఎక్కువయినట్లనిపించింది; అయినా ఫర్వాలేదు) తెలివిగా చొప్పించటం, మానవ నైజాన్ని సైంటిఫిక్ థియొరీల్లో ఇరికించలేమని తేల్చటం. వీటన్నిటికీ మించి చంద్రిక ప్రశ్నకి మధు ప్రవర్తన ద్వారా సమాధానం ఇప్పించటం (అది కూడా - రచయితో, మరే పాత్రో వ్యాఖ్యానం రూపంలో చెప్పకపోవటం). వీటన్నిటితో పాటు కథనంలో తెలుగుదనం మిళాయించటం, జమీందారీ గతాల గొప్పలు చెప్పుకునే తండ్రి పాత్ర చిత్రణ.
బావుందండీ. చాలా చక్కగా వ్రాశారు.
@ అబ్రకదబ్ర - థాంక్సులు. వివరంగా చెప్పారు. ఇప్పుడు ఇంకా బావుంది కథ.
"అది అతను చెప్పిన సైన్సు పాఠానికి సంబంధించిన ప్రశ్న. సమాధానం అతని ప్రవర్తనలో ఉంది - 'కాదు' అని"
ఇది నేను పట్టుకోలేక పోయాను.
"సైన్సు సంగతులు (కొంచెం ఎక్కువయినట్లనిపించింది)" -
ఇది నిజం. నాలాగ తెలుగులో సైన్స్ చదవుకోని వాళ్ళకి కొంచం ఇబ్బంది.
@శ్రీకర్ బాబు: ఒక చిన్న ప్రయత్నం అండీ.. మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@వెన్నెల కోన: ధన్యవాదాలండీ..
@శిశిర: ధన్యవాదాలండీ..
@పరిమళం: కవిత..?! ప్రయత్నపూర్వంకంగా వచ్చేది కాదని మీకూ తెలుసు.. అందరూ రాయగలిగేది కాదనీ మీకు తెలుసు.. అయినా ఇలా అడుగుతుంటే ఏం చెప్పను చెప్పండి? :-) ...ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
@రవిచంద్ర: ధన్యవాదాలండీ..
@నిషిగంధ: అయ్యబాబోయ్.. డిష్టింక్షనే.. పాస్ చేసినందుకే బోల్డంత సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు.
@మధురవాణి: రాయడం నాకూ ఇష్టమేనండీ.. అన్నీ కుదరాలి కదా.. ధన్యవాదాలు.
@భవాని: ధన్యవాదాలండీ.. 'బెల్లం టీ' గత నెలలో ప్రచురితమయ్యింది..
@సునీత: ధన్యవాదాలండీ..
@అబ్రకదబ్ర: "ఇన్ని సార్లు 'బాగుంది' అని నేను మరే కథకీ రాయలేదేమో!" I feel I am honoured.. కథని మీరు అర్ధం చేసుకున్న విధానం.. మీరు నాలో పరకాయ ప్రవేశం చేశారా అనిపించింది. 'ఈనాడు' 'ఆంధ్రజ్యోతి' లకి పంపడం అంటే రెండు సందేహాలండీ..ప్రచురించడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. వాళ్లకి ఇలాంటి కథలు నచ్చుతాయో లేదో అంతకన్నా తెలీదు.. అసలు పాఠకుల స్పందన ఎలా ఉంటుందో అని నాకూ సందేహమే, ప్రచురితమయ్యే వరకూ.. ఇక సైన్సు సంగతులు అంటే.. కొద్దిగా మాత్రమే చెబితే కొందరికి మాత్రమే అర్ధమవుతుంది.. అందరికీ అర్ధం కావాలంటే ఆ మాత్రం వివరించక తప్పదని అనిపించిందండీ.. మీ సూచనని దృష్టిలో ఉంచుకుంటాను.. ధన్యవాదాలు.
@భావన: వోటు వేసినందుకు ధన్యవాదాలండీ..
@వాసు: డార్విన్ పరిణామ సిద్ధాంతం తర్వాత, ఉత్పరివర్తన సిద్ధాంతం వస్తుందండీ.. అందుకే మొదట్లో 'అతని ఆలోచనలు డార్విన్ సిద్ధాంతాన్ని దాటి ఎటో వెళ్ళిపోయాయి..' అని రాశాను. ఇంగ్లీష్ మీడియం ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని "అతని బుర్రలో మ్యుటేషన్స్ థియరీ, హ్యారిసన్ పరిశోధన...." అన్నది. సైన్సు సంగతుల విషయంలో మీ సూచన దృష్టిలో ఉంచుకుంటాను.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: బహుశా మీరు 'బెల్లం టీ' లాంటి మరో కథని ఊహించడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చండీ.. ధన్యవాదాలు.
@ఊకదంపుడు: ధన్యవాదాలండీ..
కధ చాలా బావుంది.నాకు కూడా ముగింపు చాలా బాగా నచ్చింది.అయితే మీకు సవాలు విసిరితే మరీ బాగా రాసేస్తారన్న మాట.గుర్తుంచుకుంటాము :)
మార్చిన టేంప్లేట్ చాలా బాగుందండి. కథ ఇంకా బాగుంది. కంగ్రాట్స్...
Wow!! Awesome!! మురళి గారు, మొన్నొక రోజు మొదటి పేరా చదివి అబ్బా సైన్సు కథ మనకవసరమా అని పక్కన పెట్టేశాను (పూర్తిగా మర్చిపోయిన తెలుగు సైన్సుపాఠాలు ఒక కారణం కావచ్చు:-). ఈరోజు మొత్తం చదివాను. కాస్త ముందుకు వెళ్ళాక ఇక ప్రయాస పడనవసరం లేకపోయింది. క్లైమాక్స్ లో చంద్రిక ప్రశ్న, దానికి మీరు చెప్పిన జవాబు అద్భుతం.
ఇది పొద్దులో మీ కథకు రాసిన కామెంట్. మీకు సవాల్ విసిరి మంచి కథను మాకందించేలా చేసిన నిషిగంధ గారికి ధన్యవాదాలు. అది సరే కానీ మురళి గారు నాకో విషయం చెప్పండి. మీ అసలు పేరు ఏమిటి ? మీరో ప్రముఖ రచయిత అయి ఉంటారు ఇలా అఙ్ఞాతంగా బ్లాగు రాస్తున్నారు అన్న వాదన నిజమే అనిపిస్తుంది ఈ కథ చదివాక. బాబ్బాబు ఈ సస్పెన్స్ తట్టుకోలేను చెప్పేద్దురూ!!
అన్నట్లు మీ కొత్త టెంప్లేట్ బాగుంది కానీ ఎందుకో నెమలి కాస్త కళ తగ్గినట్లు అనిపిస్తుంది. బహుశా కాంట్రాస్ట్ వలనో రిజల్యూషన్ వలనో అయి ఉండచ్చు.
@రాధిక: మీ ఇంటర్ ప్రిటేషన్ బాగుందండీ :-) ..ధన్యవాదాలు.
@జయ: ధన్యవాదాలండీ..
@వేణూ శ్రీకాంత్: నాకు ఎలాంటి ఫ్లాష్ బ్యాకులూ లేవండీ.. కళ తగ్గింది నెమలికా లేక టపాలకా :-) ..ధన్యవాదాలు.
హన్నన్నా ఎంత మాట !! టపాలకు కాదండీ బాబు, నెమలి ఫోటో గురించి నేను చెప్పింది :-) వదిలేయండి లే బహుశా అది నా కంప్యూటర్ రిజల్యూషన్ వలన కూడా అయి ఉండచ్చు.
@వేణూ శ్రీకాంత్: సరదాగా అన్నానండీ.. ఇంతకన్నా మంచి టెంప్లేట్ దొరకగానే మార్చేస్తాను.. అప్పటివరకూ కూసింత ఓపిక పట్టండి..
కధ చాలా బావుంది
మురళి గారు అభినందనలు
@హరే కృష్ణ: ధన్యవాదాలండీ..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి