ఆదివారం, జనవరి 24, 2010

తొలి వసంతం

నిన్నగాక మొన్ననే మొదలుపెట్టినట్టు ఉంది.. ప్రతి రోజూ కొన్ని కొత్త సందేహాలు, సమాధానాలు.. కొత్త మిత్రులు.. కొందరు చేరువయ్యారు.. మరి కొందరు చేరువై దూరమయ్యారు.. ఇంకొందరు దూరమై చేరువయ్యారు.. అంతా రెప్ప పాటులో జరిగిపోయినట్టుగా ఉంది.. కేలండర్ చూస్తే అప్పుడే గిర్రున ఏడాది తిరిగిపోయింది.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున 'నెమలికన్ను'తెరిచింది.



నిజంగా నేనేనా? అన్నది ఎప్పుడూ నన్ను వేధించే ప్రశ్న. తల్చుకున్నది ఏదైనా ఆలస్యం లేకుండా చేసేసే నా అలవాటు నాకు మంచీ చేసింది, చెడూ చేసింది. అలా తలచుకోగానే ఏమీ ఆలోచించకుండా మొదలు పెట్టేసిన పనుల్లో బ్లాగింగ్ ఒకటి. ఎన్నెన్నో బ్లాగులు.. రకరకాల టపాలు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.. ఏ బ్లాగు తెరిచినా ఏదో ఒక కొత్త విషయం.. అప్పుడే తుఫాను వెలిసిన బ్లాగ్వాతావరణం.

ఏడాది క్రితం 'నెమలికన్ను' తొలి అడుగు వేసేనాటికి బ్లాగావరణం పరిస్థితి ఇది. "వీటి మధ్య మరో బ్లాగు అవసరమా?" అనుకోలేదు నేను. "మనమూ రాద్దాం" అనుకున్నాను. అలా అనుకునే మొదలు పెట్టాను. ఏడాది కాలం మరీ ఎక్కువేమీ కాకపోవచ్చు.. కానీ ఒకసారి వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని చూసుకోడానికీ, వెళ్ళాల్సిన మార్గం నిర్ణయించుకోడానికీ పనికొచ్చే ఒక మైలు రాయి.

మంచైనా, చెడైనా ప్రతి అనుభవమూ ఒక పాఠమే.. నేర్చుకో గలగాలే కానీ మనకి తారసపడే ప్రతి వ్యకీ ఒక పాఠం నేర్పుతారు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. నా అభిరుచులకి తగ్గ సమాచారం సేకరించుకున్నాను. ఓ పుస్తకం చదివినప్పుడో, ఓ సినిమా చూసినప్పుడో, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఏదైనా కొత్త విషయాన్ని గమనించినప్పుడో, మనసుకి సంతోషం వేసినప్పుడో, బాధ కలిగినప్పుడో..నాకు ఏదైనా ఎవరితోనైనా పంచుకోవాల్సింది ఉంది అనిపించినప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను.

ఈ బ్లాగుకి ఉన్న రీచ్ తక్కువే కావొచ్చు. కానీ నా ఆలోచన ఏమిటంటే బ్లాగ్ అనేదే లేకపోతే కనీసం ఈ కొందరితో అయినా నా భావాలు ఎలా పంచుకోగలను? వాళ్ళ అభిప్రాయాలు ఎలా తెలుసుకో గలను? అందువల్ల నా బ్లాగు నాకు అపురూపమే. బ్లాగ్మిత్రులు కొందరు చెబుతున్నట్టుగా బ్లాగులకి అడిక్ట్ కావడం, చూడకుండా ఉండలేక పోవడం అనే సమస్య నాకింకా కలగలేదు. కాబట్టి బ్లాగింగ్ ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నానని చెప్పగలను.

ఏపనినైనా క్రమం తప్పకుండా చేయడానికి ఏదో ఒక రూపంలో ఒక ఉత్ప్రేరకం అవసరం అవుతుంది. వ్యాపారం అయితే లాభాలు, ఉద్యోగం అయితే జీత భత్యాలు, పదోన్నతి.. ఇలాంటివన్న మాట.. మరి బ్లాగింగ్ కి?? పాఠకుల నుంచి వచ్చే స్పందన. సలహాలు, సూచనలు. ఈ విషయంలోనూ నేను అదృష్టవంతుడినే.. 'నెమలికన్ను' పాఠకులు తమ సమయాన్ని వెచ్చించి ఇస్తున్న సలహాలు, సూచనలు నాలో రాయాలనే ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

నా టపా చదివి ఓ పుస్తకం చదివామనో, ఓ సినిమా చూశామనో మిత్రులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. బ్లాగు మొదలయిన ఆరు నెలలకి తెలుగు దిన పత్రిక 'ఈనాడు,' గత నెలలో బ్లాగరి 'సిరిసిరిమువ్వ' గారు 'నెమలికన్ను' ని సమీక్షించారు. 'కృతజ్ఞతలు' అన్నది చాలా చిన్న మాటే అవుతుంది. వారి సూచనలు దృష్టిలో ఉంచుకుంటాను. నాకు సంబంధించి, మెరుగు పరుచుకోవడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ.

బ్లాగ్మిత్రులతో మాట్లాడడానికి కామెంట్ బాక్స్ తో పాటు మరేదైనా వేదిక ఉంటే బాగుండునన్న ఆలోచన ఫలితమే nemalikannumurali@gmail.com. తమ సలహాలు, సూచనలను వివరంగా అందించాలనుకున్న బ్లాగ్మిత్రులు మెయిల్ పంపవచ్చు. మీ అభిప్రాయాలు నాకు అమూల్యమైనవి. ఏడాది బ్లాగింగు అనుభవంలో సినిమా సమీక్షల వంటివి రాయడాన్ని కొంత మెరుగు పరుచుకోడంతో పాటు, అనుకోకుండా ఒక కథనీ రాయగలిగాను. నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

34 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. అధ్బుతం మురళి గారు ఒక సవత్సరానికి మీరు సాధించిన ప్రగతి అధ్బుతం. మీరు ఇలానే ప్రతి సవత్సరం మా కోసం ఎన్నో సాహితి ప్రక్రియలు చేపట్టి మాకు వాటిని పంచుతారని ఆశిస్తున్నాను. బ్లాగ్దినోత్సవపు శుభాకాంక్షలు. నా బ్లాగ్ కు మీరు ఇచ్చిన సపోర్ట్, మొదటి నుంచి చేసిన సూచనలు నేను ఎప్పటీకి మర్చిపోను. ధన్యవాదాలు కూడా.

    రిప్లయితొలగించండి
  3. మిత్రమా అందుకో నా శుభాభినందనలు మీ బ్లాగు తొలి పుట్టినరోజు సందర్భంగా.మీ బ్లాగు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ,మీరిలాగే దిగ్విజయంగా రాసేస్తూ వెళ్తుంటే మేమిలాగే చదివేస్తూ ఆస్వాదిస్తూ ఉంటాము.

    రిప్లయితొలగించండి
  4. మీరిలాగే మంచి మంచి టపాలు అందచేస్తూ మరిన్ని వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  5. మీరిలాగే మాకు తెలీని ఎన్నెన్నో విషయాలు తెలపాలని కోరుకుంటూ ,
    మీ తొలి వసంతానికి అభినందనలు , శుభాకాంక్షలు .

    రిప్లయితొలగించండి
  6. అభినందనలు మురళి గారు ! మీ ప్రతి టపా కి నేను కామెంటలేదు కాని ఒక్కటి కూడా వదలకుండా అన్నీ చదివాను, నాకు నచ్చే మొదటి మూడు బ్లాగుల్లో మీది ఒకటి . మీరు మరన్ని విజయాలు సాధించాలి అని కోరుకుంటున్నాను !

    రిప్లయితొలగించండి
  7. కంగ్రాట్స్ అండీ...ఇలాగే మీ బ్లాగింగ్ నిరంతరం సాగిపోవాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  8. హార్దిక శుభాకాంక్షలు...ఇలాగే మరిన్ని టపాలతో మాకు చేరువవుతారని ఆశిస్థూ...
    --హను

    రిప్లయితొలగించండి
  9. కంగ్రాట్స్! మర్యాద, మన్నన, సమ్యమనం,స్నేహం ఉన్న బ్లాగర్లలో మీది మొదటిపేరు.మీరు ఇదే ఉత్సాహంతో ఇలాగే ఎన్నో వసంతాలపాటు రాయాలని కోరుకుంటూ అభినందనలను చెపుతున్నాను.

    రిప్లయితొలగించండి
  10. అభినందనలు మిత్రమా ....పూలు మీ వసంతాన్ని డామినేట్ చేస్తున్నాయి ,చాలా బాగున్నాయి..

    రిప్లయితొలగించండి
  11. మురళీ గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. అదేనండి మీ "నెమలికన్ను" కి. మీ పుట్టినరోజు కి మీరే బొకే ఇచ్చుకుంటే ఎలాగండి. మేము కదా ఇవ్వాల్సింది. మీకు స్నేహానికి గుర్తుగా, చక్కటి లేత గులాబి రంగు గులాబీ ని పంపాలనుకున్నాను. కాని, ఈ వ్యాఖ్యలో వీలవలేదు. బ్లాగ్ ని పూర్తిగా సద్వినియోగ పరుస్తున్న మీకు నా శుభాభినందనలు. ఇంకా, ఇంకా, ఎన్నో, ఎన్నో...రాస్తూనే, కలకాలం విలసిల్లాలి, అని దీవిస్తున్నానండి.

    రిప్లయితొలగించండి
  12. తొలి వసంతానికి శుభాభినందనలు...
    శ్రీలలిత....

    రిప్లయితొలగించండి
  13. మీ బ్లాగ్ మరిన్ని వసంతాలు జరుపుకోవాలని ఆశిస్తూ... మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  14. 'నెమలికన్ను' ఎంతందంగా ఉంటుందో మీ బ్లాగుని కూడా నిజంగా అంత అందంగా తీర్చిదిద్దారు మీరు ఈ సంవత్సర కాలంలో. ఇలాగే మీరెన్నో మంచి మంచి టపాలు రాస్తూ, వేవేల వసంతాలు పూర్తి చేసుకోవాలని, అందరికీ ఆనందాన్ని పంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. తొలి వసంతవేళ హృదయపూర్వక శుభాభినందనలు మురళీ గారూ :)

    రిప్లయితొలగించండి
  15. గోదావరి అనగానే వంశీ గుర్తొచ్చినట్టూ , మురళీ అనగానే గోదావరి గుర్తొచ్చేలా మంచి, మర్యాద కు మారుపేరుగా మీ బ్లాగుప్రయాణం సాగాలని కోరుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  16. హ్యాపీ బర్త్ డే టూ యు...హ్యాపీ బర్త్ డే టూ యు...హ్యాపీ బర్త్ డే టూ యు డియర్ నెమలి కన్ను...హ్యాపీ బర్త్ డే టూ యు..!!
    శతాధిక వసంతాలు జరుపుకోవాలనీ..ఇంకా ఎన్నెన్నో మంచి ముత్యాలు(లాంటి టపాలు) నెమలి కంటి నించి జాలువారాలని కోరుకుంటూ..అభినందన చందనాలు మురళీ గారూ.

    రిప్లయితొలగించండి
  17. hi muraligaru,
    first of all congrats 1 year complete ainanduku. naku nacchina blogs lo midi oka blog. mi blog ni kachitamga follow avathanu.miru ilage inka marinni manhci posts tho blog continue cheyalni korukuntunnannu

    రిప్లయితొలగించండి
  18. నెమలికన్ను కు హ్యాపీ బర్త్ డే !!

    మురళి గారికి శుభాకాంక్షలు. మీరు మొదలెట్టి ఏడాదే అయిందని తెలియదు నాకు ఇప్పటి దాకా. ఏడాది లో ఇంత ప్రేక్షకాదరణ నిజంగా అద్భుతం, అభినందనీయం.

    మీరింకా బోలెడు టపాలు రాస్తూ, త్వరలోనే మంచి కథా - నవలా రచయిత కావాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  19. మీ బ్లాగు తొలి వసంతపు శుభాకాంక్షలు. ఆలస్యంగా చెప్తున్నానా? ఆరోగ్యం బాగాలేక గత పదిరోజులబట్టి బ్లాగులు చూడటంలేదు.

    మీరిలానే మంచి మంచి టపాలతో మమ్ముల్ని అలరించాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  20. మురళిగారు ! ప్చ్ ...నేనెప్పుడూ లేటే ...అన్యధా భావించక అందుకోండి మీ తొలివసంతానికి నా శుభాభినందనలు :)

    రిప్లయితొలగించండి
  21. ముందుగా మీకు అభినందన మందారమాల.
    నేను వీలయినంతవరకు మిస్ కాని బ్లాగుల్లో మీది ఒకటి.
    అలాగే నాకు తెలిసిన విషయం మీద ఉన్న టపాలలో తప్పనిసరిగా కామెంట్ వ్రాసాను.

    మీ ఓపిక, సంస్కారం అభినందనీయం.

    రిప్లయితొలగించండి
  22. @తృష్ణ: ధన్యవాదాలండీ..
    @భావన: బ్లాగు లోకి వచ్చిన తొలి రోజుల్లో నాకున్న సందేహాలే కొత్తగా వచ్చేవారందరికీ కలుగుతాయన్న స్పృహతో చేసిన చిన్న చిన్న సూచనలండీ అవి.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  23. @పరుచూరి వంశీ కృష్ణ: ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: ఓపిగ్గా చదివి మీ అభిప్రాయాలు చెబుతున్నందుకు ధన్యవాదాలండీ..
    @శ్రావ్య వట్టికూటి: చాలా సంతోషమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలండీ..
    @సుజ్జి: ధన్యవాదాలండీ..
    @శిశిర: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  25. @హను: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
    @సునీత: చాలా పెద్ద ప్రశంశ.. ధన్యవాదాలండీ..
    @చిన్ని: గూగులమ్మ ఇచ్చిందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. @జయ: బోకే మీకు ఇచ్చానండీ :-) ..ధన్యవాదాలు.
    @శ్రీలలిత: ధన్యవాదాలు.
    @పద్మార్పిత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. @మధురవాణి: ధన్యవాదాలండీ..
    @స్వాతి: ధన్యవాదాలండీ..
    @లలిత: అదృష్టవంతుడినండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @ప్రణీత స్వాతి: థాంక్ యూ.. థాంక్ యూ.. థాంక్ యూ వెరీ మచ్..
    @స్వాతిమధవ్: ధన్యవాదాలండీ..
    @వాసు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  29. @సిరిసిరిమువ్వ: ఇప్పుడెలా ఉన్నారండీ? కుశలమేనా?? ..ధన్యవాదాలు.
    @పరిమళం: ఆలస్యం ఏమీ లేదండీ.. ధన్యవాదాలు.
    @బోనగిరి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  30. మురళి గారు మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు, మీకు అభినందనలు :-) గత వారం రోజులుగా బ్లాగావరణానికి దూరమవడంతో ఆలశ్యమైంది :-)

    రిప్లయితొలగించండి
  31. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి